Sri Matsya mahapuramu-2    Chapters   

చతుర్వింశత్యు త్తరశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- దండోపాయవిచారః.

శ్రీమత్స్యః న శక్యా యే వశీకర్తు ముపాయత్రితయేన తు |

దణ్ణన తా న్వశీకుర్యా ద్దణ్డో వా వశకృ న్నృణామ్‌. 1

సమ్య క్రృణయనం తస్య తథా కార్యం మహీక్షితా | ధర్మశాస్త్రానుసారేణ ససహాయేన ధీమతా. 2

తస్య సమ్యక్ర్పణయనం యథా కార్యం మహీక్షితా |

వానప్రస్థాంశ్చ ధర్మజ్ఞా న్నిర్మమా న్నిష్పరిగ్రహా& .3

స్వదేశే పరదేశేవా ధర్మశాస్త్రవిశారదా & |

సమీక్ష్య ప్రణయే ద్దణ్డం సర్వం దణ్డ ప్రతిష్టితమ్‌. 4

ఆశ్రమీ యది వా వర్ణీ పూజ్యో వా7థ గురు ర్మహా& |

నా7దణ్డ్యో నామ రాజ్ఞో7స్తి స్వధర్మే యో న తిష్ఠతి. 5

అదణ్డ్యా న్దణ్డయ న్రాజా దణ్డ్యాంశ్యైవాప్యదణ్డయ& | ఇహ రాజ్యపరిభ్రష్టో నరకం ప్రతిపద్యతే. 6

తస్మా ద్రాజ్ఞా వినీతేన ధర్మశాస్త్రానుసారతః | దణ్డప్రణయనం కార్యం లోకానుగ్రహకామ్యయా. 7

యత్ర శ్యామో లోహితాక్షో దణ్డ శ్చరతినిర్భయః | ప్రజా స్తత్ర న మూహ్యన్తి నేతా చే త్సాధుపశ్యతి. 8

బాలవృద్ధాతుర యతి ద్విజస్త్రీ విధవా యతః | మాత్స్యన్యాయేన వర్తేర న్యది దణ్డం న పాతయేత్‌. 9

దేవదైత్యోరగగణా స్సర్వే భూతపతిత్రిణః | ఉత్క్రామయేయ ర్మర్యాదాం యది దణ్డం న పాతయేత్‌. 10

రెండు వందల ఇరువది నాలుగవ అధ్యాయము.

దండోపాయ విచారము.

శ్రీమత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఈ చెప్పిన మూడుపాయములతోను వశీకరించుకొన శక్యులు కాని వారిని దండోపాయముతో వశీకరించుకొనవలయును. ఏలయన దండము నరులను వశీకరించుకొని తీరును మహీపతి తగిన సహాయుల తోడ్పాటుతోను తాను తన బుద్దితో విచారణ చేసియు ధర్మ శాస్త్రానుసారముగ దండమును చక్కగా ఆచరణలో నుండవలెను. దానిని రాజు ఎట్లు లెస్సగా ఆచరణలో పెట్టవలయునని వాన ప్రస్థులు ధర్మజ్ఞులు నిర్మములు నిష్పరిగ్రహులు (ఎవరినుండియు ఏమియు తీసికొననివారు) స్వదేశమందుగాని పరదేశమందుగాని ఉండు ధర్మశాస్త్ర విశారదులు- ఇట్టివారిని పిలిపించి వారిచే విషయమును సమీక్షింప (బాగుగా పరిశీలింప) జేసి వారి యభిప్రాయము ననుసరించి దండమును ఆచరణమందుంచవలెను. ఏలయన రాజ్య సమ్యక్పరిపాలనమంతయు దండమునందే నిలిచియున్నది; బ్రహ్మచర్యాద్యాశ్రమములందున్నవాడుగాని సంన్యాసిగాని పూజ్యుడు అగు మహా వ్యక్తిగాని గురువుగాని స్వధర్మమునందు నిలువనివాడయినచో రాజునకు దండ్యుడు కాని వాడెవడును ఉండడు; రాజు దండ్యులను దండింపకున్నను అదండ్యులను దండించినను అతడు ఇహమందు రాజ్య పరిభ్రష్టుడును పరమందు నరకప్రాప్తుడును నగును. కావున రాజు లోకానుగ్రహ కాంక్షతో తాను వినీతుడై (సమ్యగ్వర్తనము గలవాడై) ధర్మ శాస్త్రానుసారముగ దండోపాయమునాచరణమందుంచవలెను. ప్రజానేత (రాజు ) సరిగా చూచువాడయినచో -ఎచట నల్లని దేహాచ్ఛాయము ఎర్రని కన్నులు గలవాడునని శాస్త్రములందు చెప్పబడిన దండాధిష్టానదేవత నిర్భయమై సంచరించునో- అచ్చటి ప్రజలు మోహము(ధర్మాధర్మ విషయములందు పొరబాటు) పొందరు. ఏలయన రాజు దండ్యుల విషమున దండమును ప్రవర్తిల్లజేయనిచో బాలురు వృద్ధులు యతులు ద్విజులు స్త్రీలు విధవలు- ఇట్టివారు మాత్స్యన్యాయముతో (బలవంతులచే బలహీనులు హింసించబడుటయు - తినబడుటయును అను విధానముతో) నుందురు. దేవదైత్యోరగ గణములను సర్వభూత ములును పక్షులును మర్యాదాతిక్రమణమును తేయుదురు. (హద్దుమీరి వర్తింతురు).

ఏష బ్రహ్మాభిశాపేషు సర్వ ప్రహరణషు చ | సర్వవిక్రమకోపేషు వ్యవసాయే చ తిష్టితి. 11

పూజ్యన్తే దణ్డినో దైవై ర్న పూజ్యన్తే త్వదణ్డినః ష న బ్రహ్మాణం విధాతారం న పూషార్యమణా వపి. 12

యజ న్తే మానవాః కేచి త్ప్రశాన్తా న్త్సర్వక్మసు | రుద్ర మగ్నించ శక్రంచ సూర్యాచన్ద్రమసౌ తథా. 13

విష్ణుం దేవగణా శ్చాన్యా న్దణ్డిన్నః పూజయన్తి హి | దణ్డ శ్శాన్తి ప్రజా స్సర్వా దణ్డ ఏవ హి రక్షతి. 14

దణ్డ స్సుప్తేషు జాగర్తి దణ్డం ధర్మం విదు ర్భుధాః | రాజదణ్డభయాదేవ పాపాః పాపం న కుర్వతే. 15

యమదణ్డభయా దేకే పరస్పర భయా దపి | ఏవం సాంసిద్ధికే లోకే సర్వం దణ్డ ప్రతిష్ఠతమ్‌. 16

అన్ధేతమసి మజ్జేయు ర్యది దణ్డం న పాతయేత్‌ | యస్మాద్దణ్డో దమయతి దుర్మదా న్దండ యత్యపి. 17

దమనా ద్దణ్డనా చ్చైవ తస్మా ద్దణ్డం విదుర్బధాః |

దణ్డస్య భీతై స్త్రి దశై స్సమేతై ర్బాగో ధృత శ్శూలధరస్య యజ్ఞే. 18

చక్రుః కుమారం ధ్వజిలీపతిం చ వరం శిశూనాం చ భయా ద్బలస్థమ్‌.

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే దణ్డోపాయ కథనం నామ

చతుర్‌ వింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ఈ దండ దేవత బ్రాహ్మణులిచ్చు శాపములందును సర్వాయుధములందును సర్వవిక్రమములందును సర్వ కోపములందును దృఢ ప్రయత్నమునందును ప్రతిష్ఠితమయియున్నది. దండించువారినే దేవతలును పూజింతురు. దండించని వారినెవ్వరును పూజించరు. మానవులలో కొందరు ప్రశాంతులగు బ్రహ్మ- విధాత- పూషన్‌- అర్యమన్‌- మొదలగు దేవతలను సర్వకర్మలందును పూజించకున్నారు. దండించువారగు రుద్రాగ్నీంద్ర సూర్యచంద్ర విష్ణులను ఇట్టి ఇతర దేవతలను పూజించుచున్నారు. ప్రజలనందరను దండమే శాసించుచున్నది. రక్షించుచున్నది. అందరును నిద్రించు చున్నను అది తాను మాత్రము మేలుకనియుండును. కావుననే దండమే ధర్మ (స్వరూప)మని పండితులందురు. రాజదండ భయమువలన కొందరును యమదండ భయము వలన మరికొందరును పరస్పర భయమువలన ఇంకను కొందరును పాపమునాచరించకున్నారు. ఇట్లు లోక వ్యవహార సిద్ధియంతయు దండమునందే నిలిచియున్నది; రాజాదులు అపరాధులయందు దండమును ప్రవర్తిల్లజేయకున్నచో జనులు అంధతమస్సునందు మునిగిపోవుదురు. దుర్మదులను అణచి అదుపులో నుంచును. దండించును. అను ఈ రెండు హేతువులచే దండమునకు ఆ వ్యవహారము ప్రసిద్ధమయినది. శూల ధరుడగు శివుడు దండించునను భయమువలననే దేవతలందరును కూడి ఏకాభిప్రాయముతో అతనికి యజ్ఞమునందు భాగమునిచ్చిరి. శిశువులలో శ్రేష్టుడు (చాల పసివాడు) అయినను బలశాలియగు కుమారుని దేవతల దండ భయమువలననే సేనాపతిగా చేసిరి.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజ ధర్మమున దండోపాయ కథనమను

రెండు వందల ఇరువది నాలుగవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters