Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకోవింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- సామోపాయవిచారః.

మనుఃఉపాయాన్మే సమాచక్ష్వ సామపూర్వా న్మహాద్యుతే |

రక్షణం చ తథా తేషాం ప్రయోగం చ సురోత్తమ. 1

మత్స్యః సామ భేద స్తథా దానం దణ్దశ్చ మనుజోత్తమ |

ఉపేక్షాచ తథా మాయా ఇన్ద్రజాలంచ పార్థివ. 2

ప్రయోగాః కథితా స్సప్త తన్మే నిగదత శ్శృణు | ద్వివిధం కథితం సామ తథ్యం చాతథ్య మేవచ. 3

తత్రా7ప్యతథ్యం సాధూనా మాక్రోశాయైవ జాయతే | తత్ర సాధుః ప్రయత్నేన సమాసాధ్యో నరోత్తమ. 4

మహాకులీనా ఋజవో ధర్మనిత్యా జితేన్ద్రియాః | సామసాధ్యా నచా7తథ్యం తేషు సామ ప్రయోజయేత్‌. 5

తథ్యంచ సామ కర్తవ్యం కులశీలాది వర్ణనమ్‌ | తథా తదుపచారాణాం కృతానాం చైవ వర్ణనమ్‌. 6

అనయైవ తథా యుక్త్యా కృతజ్ఞాఖ్యాపనం స్వకమ్‌ | ఏవం సామ్నాచ కర్తవ్యా వశగా ధర్మతత్పరాః.7

సామ్నా యద్యపి రక్షాంసి గృహ్ణన్తీతి పరా శ్రుతిః| తథాప్యేత దసాధూనాం ప్రయుక్తం నోపకారకమ్‌. 8

అతిశఙ్కిత మిత్యేవం పురుషం సామవాదినమ్‌ | అసాధవో విజానన్తి తస్మా త్తత్తేషు వర్జయేత్‌. 9

యే శుద్ధవంశ్యా ఋజవః ప్రతీతా ధర్మే స్థితా స్సత్యపరా వినీతాః|

తేషా మసాధ్యాః పురుషాః ప్రదిష్టా అనువ్రతా యే సతతం చ రాజ &. 10

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే సామోపాయ కథనం నామ

ఏకవిశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ఇరువది యొకటవ అధ్యాయము.

సామోపాయ విచారము.

మహాద్యుతీ! సామము మొదలగు ఉపాయముల లక్షణములను వాని ప్రయోగ ప్రకారమును తెలుప వేడుచున్నాను; అనిన మనువుతో మత్స్యుడిట్లనెను; మనుజోత్తముడగు మను పార్థివా; సామము భేదము దానము దండము ఉపేక్షమాయ ఇంద్రజాలము అనునవి ఏడు ఉపాయములు ప్రయోగింప దగినవి కలవు! అవి క్రమముగ నేను తెలిపెద; వినుము; సామము తథ్యము అతథ్యమునని రెండు విధములు; దీనిలో అతథ్య సామము సాధువులపై ప్రయోగించినచో వారాక్రోశిం(కోపిం-నిందిం)తురు; కావున నరోత్తమా! సాధుజనులను సామముతోనే యత్నముతో సాధించవలెను; మహాకులీనులు ఋజుస్వబావులు ధర్మనిత్యులు (ధర్మనిరతులు) జితేంద్రియులు సామ(ముతో) సాధ్యులు; వారియందు అతథ్య (కపట) సామమును ప్రయోగించరాదు; తథ్యసామమునే ప్రయోగించవలెను; అది ఏమనగా వారి కుల శీలాదులను వర్ణించుట వారి విషయమున తనగు గల కృతజ్ఞతా భవమును తెలుపుట - ఈ విధముగ యుక్తితో ప్రయోగించు సామము తథ్యసామము; దీనితో ధర్మ తత్పరులగు ఉత్తములను లోబరుచుకొన వలయును; 'సామముతో రక్షస్సులను గూడ లోబరచుకొందుర'ను శ్రుతియున్న మాట నిజమే; ఐనను దీనిని అసాధుజనులందు ప్రయోగించినచో ఉపకరించదు; తనయందు సామవచనములు పలుకు వానిని అసాధుజనులు అతి శంకితునిగా (తను జూచి చాల భయపడుచున్న వానిగా) భావన చేయుదురు; కావున వారి విషయమున అది విడువ వలయును. శుద్ధ వంశ్యులు ఋజుస్వభావులు ధర్మస్థితులు సత్యపరులు వినీతులు అగు ప్రసిద్ధ సాధుజనులు సామసాధ్యులు; వారిని సతతము అనువ్రతముతో (అనుకూల ప్రవర్తనముతో వశీకరించు కొనవలెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మమున సామోపాయ కథనమను

రెండు వందల ఇరువది యొకటవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters