Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకోనవింశత్యుత్తరద్విశ తతమో7ధ్యాయః.

రాజకర్తవ్యస్వపుత్ర శిక్షాక్రమః.

శ్రీమత్స్యః . రాజ న్పుత్త్రస్య రక్షాచ కర్తవ్యా పృథివీక్షితా |

ఆచార్యశ్చాస్య కర్తవ్యో నిత్యయుక్తశ్చ రక్షిభిః. 1

ధర్మకామార్థశాస్త్రాణి ధనుర్వేదాంశ్చ శిక్షయేత్‌ | రథే చ కుఞ్జరే చై నం వ్యాయామం కారయే త్సదా. 2

శిల్పాని శిక్షయేచ్చైం నాప్తో మిథ్యా ప్రియం వదేత్‌ | శరీరరక్షావ్యాజేన రక్షిణో7స్య నియోజయేత్‌. 3

న చాస్య సఙ్గో దాతవ్యః క్రుద్ధలుబ్ధావమానితైః | తథా చ వినయే దేనం యథా ¸°వనగోచరే. 4

ఇన్ద్రియైర్నావకృష్యేత సతాం మార్గా త్సుదుర్గమాత్‌ | గుణాధాన మశక్యంతు యస్య కర్తుం స్వభావతః. 5

బన్ధనం తస్య కర్తవ్యం గుప్తదేశే సుఖాన్వితమ్‌ | అవినీతకుమారం హి కుల మాశు విశీర్యతే. 6

అధికారేషు సర్వేషు వినీతం వినియోజయేత్‌ | ఆదౌ స్వల్పే తతః పశ్చా త్క్రమేణాథ మహత్స్వపి. 7

రెండు వందల పందొమ్మిదవ అధ్యాయము.

రాజ కర్తవ్య స్వపుత్త్ర శిక్షాదిక్రమ కథము.

మత్స్యనారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను: రాజా: రాజు తన కుమారుని రక్షించుకొనవలయునను; ఇతనికి ఆచార్యుని రక్షకులనుకూడ ఏర్పాటు చేయవలెను. వారెపుడును ఇతనిని రక్షించుచుండవలెను: ఆచార్యునిచే ధర్మ కామార్థ శాస్త్ర ధనుర్వేద రథగజ విద్యలయందు శిక్షితుని చేయించవలెను; నిరంతరముగ వ్యాయామము చేయించవలెను; శిల్ప విద్యలు నేర్పవలెను. ఆప్తులను ఇతనితో మిథ్యా ప్రియములు పలుకరాదు. శరీర క్షణముఅను మిషతో ఇతనిపై రక్షకుల నుంచవలెను. ఇతనిని రాజుపై క్రుద్ధులతో లుబ్ధులతో రాజాపమానితులతో కలియనీయరాదు. ¸°వనమందు ఇంద్రియములచే అవకర్షింపబడకుండగను పెద్దలు నడచు సుదుర్గమ మార్గము నుండి తొలగకుండునట్లును మంచి నడవడికలో ఇతని నుంచవలెను. స్వాభావిక రీతులతో మంచి గుణములు కలిగించుట అశక్యమగునట్లున్నడైనచో సురక్షిత రహస్య ప్రదేశముననే అన్ని సుఖములతో బంధించి (అచటి నుండి బయటకు పోనీయక )ఉంచవలెను . ఏలయమ రాజకుమారుడవినీతుడైనచో రాజవంశ##మే శిథిలమగును: వినీతుఅగు రాజకుమారుని మొదట చిన్న వానియందును తరువాత క్రమముగా గొప్పవానియందును ఆయా అధికారములయందు నియోగించుచుండవలెను.

రాజ్ఞో వర్జనీయ కర్మాణి .

మృగయాపాన మక్షాంశ్చ వర్జయే త్పృథివీపతిః| ఏతా న్యే సేవమాన్‌స్తు(స్తే) వినిష్టాః పృథివీక్షితః. 8

బహవో నరశార్దూల సఙ్ఖ్యా యేషాం న విద్యతే | దివాస్వాపం వృథాటనం విశేషేణ వివర్జయేత్‌. 9

వాక్పారుష్యం న కర్తవ్యం దణ్డపారుష్య మేవచ| పరోక్షవిన్దా చ తథా వర్జనీయా

మహీక్షితా. 10

అర్థస్య దూషణం రాజా ద్విప్రకారం వివర్జయేత్‌ | అర్థానాం దూషణం చైకం తథా 7ర్థేషుచ దూషణమ్‌. 11

ప్రాకారాణాం సముచ్ఛేదో దుర్గాదీనామసత్క్రియా | ఆర్థానాం దూషణం ప్రోక్తం విప్రకీర్ణత్వ మేవచ. 12

అదేశకాలే యద్దాన మపాత్రే దన మేవచ | అర్థేషు దూషణం ప్రోక్త మసత్కర్మ ప్రవర్తమ్‌. 13

కామః క్రోధో మదో మానో లోభో హర్ష స్తథైవచ | ఏతే వర్జ్యాః ప్రయత్నేన సాదరం పృథివీక్షితా. 14

ఏతేషాం విజయం కృత్వా కార్యో భృత్యజయ స్తతః |

కృత్వా భృత్యజయం రాజా పౌరజానపదా న్జయేత్‌. 15

రాజు విడువవలసిన పనులు.

రాజు వేటను పానమును అక్షములను (దూత్యక్రీడ) విడువవలయును; వీనిని సేవించిన రాజులు లెక్క లేనంతమంది నాశమునందిరి; రాజు వ్యర్థముగ తిరుగుటను విశేషించి పగటి నిద్రను విడువవలెను: వాక్పారుష్యము దండ పారుష్యము చేయరాదు; పరోక్షనింద తేయరాదు; రెండు విధములగు అర్థదూషణములు కలవు; (అర్థము అనగా ధనమును ఆస్తియును )వీనిలో మొదటిది -ఆస్తియగు ప్రాకారములు విగుగగొట్టుటడ- పాడుచేయుట దుర్గములు మొదలగునవి సరిగ కట్టించకపోవుట చెడినవి బాగు చేయింతకపోవుట -ఒకచోట ఒక విధముగా నుండవలసినవి మరియొక చోటను మరియొక విధముగను నిర్మింపజేయుట మొదలగునవి; రెండవ విధమగునది- దేశకాల పాత్రములెరిగి దానముచేయక పోవుట- అనుచితములగు విషయములకై ధనము వెచ్చించుట మొదలగునవి; మొదటి -అర్థములను దూషించుట రెండవది అర్థములందు దూషించుట అనబడును; కామక్రోధలోభ మదమాన హర్షములను ప్రయత్న పూర్వకముగను విడుచుట యందాదరముతోను -విడువవలయును; ఈ దోషములను జయించిన తరువాత రాజు భృత్యులను (రాజోద్యోగులను) జయించ (లోబరచుకొన) వలెను; అనంతరము పౌర జానపదులను లోబరచుకొనవలెను.

రాజ్ఞో భృత్యాదీనాం స్వాధీనకరణాది క్రమః.

కృత్వాతు విజయం తేషా ఞ్ఛాత్రూ న్బాహ్యం స్తతో జయేత్‌ |

బాహ్యాస్తు వివిధా జ్ఞేయా స్తుల్యాభ్యన్తరకృత్రమాః.16

గురువస్తే యథాపూరవం తేషు యత్నవరో భ##వేత్‌ | పితృపైతామహం మిత్ర మమిత్రం చ తథా రిపోః. 17

కృత్రిమంచ మహారాజ మిత్రం త్రివిధ ముచ్యతే | తథాపిచ గురుః పూర్వం భ##వే త్తత్రాపి చాదృతః. 18

స్వామ్యమాత్యో జనపదో దుర్గం దణ్ణ స్తథైవచ | కోశో మిత్రం చ ధర్మజ్ఞ సప్తాఙ్గం రాజ్యముచ్యతే. 19

సప్తాఙ్గస్యాపి రాజ్యస్య మూలం స్వామీ ప్రకీర్తితః|

తన్మూలత్వా త్తథా7జ్ఞానం స తు రక్ష్యః ప్రయత్నతః. 20

షడఙ్గరక్షా కర్తవ్యా తథా తేన ప్రయత్నతః | అఙ్గేభ్యో యస్తత్వథైకో7పి ద్రోహం

కుర్యాత్ఖలో7ల్పధీః. 21

వధ స్తస్య ప్రక ర్తవ్య శ్శీఘ్రమేల మహీక్షితా | న రాజ్ఞా మృదునా భావ్యం మృదుర్హి పరిభూయతే. 22

న భావ్యం దారుణనాతితీక్షణా దుద్విజతే జనః | కాలే మృదుర్యో భవతి కాలే భవతి దారుణః. 23

రాజా లోకద్వయాపేక్షీ తస్య లోకద్వయం భ##వేత్‌| భృత్యైస్సహ మహీపాలః పరిహాసం వివర్జయేత్‌. 24

భృత్యాః పరిభవంతీహా నృపం హర్షవశంగతమ్‌|

భృత్య- పౌరజానపద- బాహ్య శత్రుజయము.

రాజు ఈ చెప్పినవారిని వశీకరించుకొని పిమ్మట బాహ్యశత్రువులను జయించవలెను; వారు సమశత్రువులు ఆభ్యంతర శత్రువులు కృత్రిమ శత్రువులు అని పలు( త్రి) విధములు; ఇట్లే మిత్రులను మూడు విధములు; 1. గురువులు సరేసరి; వారి విషయమును తన విషయముకంటె ముందరిదిగా తలచి యత్నపరుడై వారి నాదరించవలెను; 2. తండ్రి తాతల తరములనుండి మిత్రులు; 3. తన శత్రువుల శత్రువులు (వీరు కృత్రమ మిత్రులు); వీరందరలో గురుని ఆదర పూర్వకముగా మొదట పూజించవలెను; రాజ్యాంగములు ఏడు: 1. స్వామి 2. అమాత్యులు3. జనపదము4. దుర్గము 5. దండము 6. కోశము 7. మిత్రులు. వీనిలో స్వామి (రాజు) రాజ్యమునకు మూలము; మిగిలిన అంగములకును ఇతడే మూలము కావున అతనిని యత్నపూర్వకముగా రక్షించవలయును; అతడును యత్నముతో మిగిలిన షడంగములను రక్షించుచుండవలయును; ఇంతేకాదు; ఏ ఖలుడు కాని అల్పబుద్ధి కాని ద్రోహము చేసినచో వానిని రాజు శీఘ్రమే వధించవలెను; రాజెప్పుడును మృదువై యుండరాదు; ఉన్నచో పరాభవము నందును; అతి దారుణుడుగా ఉండరాదు: దారుణుని చూచి ఎల్లరును భయపడుదురు; సమయమెరిగి మెత్తదనమునో దారుణత్వమునో చూపు రాజునకు ఇహపరనులు సిద్ధించును; రాజు తన భృత్యులతో పరిహాసములాడరాదు. హర్ష వశగతుడగు రాజును భృత్యులు పరిభవిం( అలక్ష్యముగాచూ) తురు.

వ్యసనానిచ సర్వాణి భూపతిః పరివర్జయేత్‌. 25

లోకసఙ్గ్రహణార్థాయ కృతకవ్యసనీ భ##వేత్‌ | శౌణ్డీరస్య నృపేన్ద్రస్య నిత్య ముద్రిక్తచేతసః. 26

జనా విరాగ మాయాన్తి సదా దుస్సేవ్యభావతః | స్మితపూర్వాభిభాషీ స్యా త్సర్వసై#్యవ మహీపతిః. 27

వధ్యేష్వపి మహాభాగ! భ్రుకుటిం న సామాచరేత్‌ | భావ్యం ధర్మభృత్వాం శ్రేష్ఠ స్థూలలక్ష్యేణ భూభుజా. 28

స్థూలలక్ష్యస్య వశగా సర్వా భవతి మేదినీ | అదీర్ఘసూత్రశ్చ భ##వే త్సర్వకర్మసు పార్థివః. 29

దీర్ఘసూత్రస్య నృపతేః కర్మహాని ర్ధ్రువం భ##వేత్‌ | రాగే దర్పేచ మానేచ ద్రోహే పాపేచ కర్మణి. 30

అప్రియే చైవ కర్తవ్యే దీర్ఘసూత్రః ప్రశస్యతే | రాజ్ఞా సంవృతమన్త్రేరణ సదా భావ్యం నృపోత్తమ. 31

తస్యా7సంవృతమన్త్రస్య జ్ఞేయా స్సర్వాపదో ధ్రువమ్‌ | కృత్యాన్యేవతు కార్యాణి జ్ఞాయన్తే యస్య భూపతేః. 32

నారబ్ధాని మహాభాగ తస్య స్యా ద్వసుధా వశే | మన్త్రమూలం సదా రాజ్యం తస్మా న్మన్త్ర స్సురక్షితః. 33

కర్తవ్యః పృథివీపాలై ర్మన్త్రభేదభయా త్సదా| మన్త్రవిత్సాధితో మన్త్ర స్సమ్పత్తీనాం సుఖావహాః. 34

మన్త్రచ్ఛలేన బహవో వినష్టాః పృథివీక్షితః |

రాజు ప్రవర్తించవలసిన విధము.

రాజు వ్యసనములను విడువవలయును; కాని లోక సంగ్రహమునకై (తాను ఆయా వినోదములయందు నేర్పరియని చూపుటకు) కృత్రిమముగా (నటనకై) వ్యసములందాసక్తి చూపవలెను: రాజ శ్రేష్టుడు గర్విగానున్నను ఉద్రిక్త చిత్తుడుగానున్నను ఇతనిని సేవించరాదనుచు జనులాతనియందు విరక్తులగుదురు; రాజు ప్రతివారితోను చిరునవ్వు తోనే మాటలాడవలయును; వధ్యుల విషయమున కూడ రాజు కనుబొమలు ముడివేయరాదు. ధర్మభృతులలో శ్రేష్ఠుడవగు మనూ! రాజెల్లప్పుడును స్థూలలక్ష్యుడు (దాతృత్వము కలవాడు- ఉదారుడు) కావలయును; అట్టివానికి భూమి (రాజ్యము) అంతయు వశీభూతమగును; రాజు ఏవనియందును దీర్ఘ సూత్రుడు (అది ఏదో జరిగినప్పుడు చూచుకొందమనువాడు ) కారాదు; అట్టివాని పనులన్నియు తప్పక చెడిపోవును; అగుగాక! కొన్ని పనులయందు రాజు దీర్ఘసూత్రుడు (తొందరపాటు లేని వాడు) కావలయును; అవి ఏవనగా - రాగము (అధికప్రీతి చూపుట) దర్పము- మానము- ద్రోహము- పాపకార్యము- అప్రీతి (ద్వేషము చూపుట) అనునవి; రాజెల్లప్పుడును సంవృతమంత్రుడు (తన మంత్రాలోచనమును రహస్యముగనుండువాడు) కావలయును ; అట్లుండనిచో వానికి సర్వాపదలును కలుగును; రాజు చేయు పనులు అవి ముగిసిన తరువాతనే కాని ఆరంభించునపపుడితరులకు తెలియరాదు; అట్లు వర్తించు రాజునకు పృథివి అంతయు అధీనమయియుండును; ఇట్లు రాజ్యమెల్లప్పుడు మంత్రమూలకమైయుండును; కావున అది బయల్పడునేమోయను భయముతో పృథివీపాలురు మంత్రరక్షణము చేసికొనుచుండవలయును; మంత్రవేత్తయగువాడు సాధించిన మంత్రణము సర్వ సంపత్సుఖములను కలిగించును; మంత్రమునందలి దోషములచే ఎందరో రాజులు వినాశమందిరి;

ఆకారై రిఙ్గితై ర్గత్యా చేష్టయా భాషితేనచ. 35

నేత్రవక్త్రవికారైశ్చ గృహ్యతే7న్తర్గతం మనః | నయస్య కుశ##లై స్తన్య వశేసర్వా వసున్ధరా. 36

భవతీహ మహీపాలే సదా పార్థివనన్దన | నైకస్తు మన్త్రయే న్మన్త్రం రాజా న బహుభి స్సహ. 37

నారోహే ద్విషమాం నావ మపరీక్షితనావికీమ్‌ | యే చా7స్య భూమిజయినో భ##వేయుః పరిపన్థినః. 38

తా నానయే ద్వశే సర్వా న్త్సామాదిభి రుపక్రమైః | యథా న స్యా త్కృశీభావః ప్రజానామనపేక్షయా. 39

తథా రాజ్ఞా ప్రక ర్తవ్యం స్వరాజ్యం పరిరక్షతా | మోహాద్రాజా స్వరాష్ట్రం యః కర్ష(ర్శ)య త్యనవేక్షయా. 40

సో 7చిరా ద్భ్రశ్యతే రాజ్యా జ్జీవితాచ్చ సబాన్ధవః | భృతో వత్సో జాతబలః కర్మయోగ్యో యథా భ##వేత్‌. 41

తథా రాష్ట్రం మహాభాగ భృతం కర్మ సమావహేత్‌ | యో రాష్ట్రం మనుగృహ్ణాతి

రాజ్యం స పరిరక్షతి. 42

సఞ్జాత ముపజీవేత్తు విన్దతే స మహత్పలమ్‌ | రాష్ట్రాద్ధిరణ్యం ధాన్యంచ మహీం రాజా సురక్షితామ్‌. 43

మహతాతు ప్రయత్నేన స్వరాష్ట్రస్యచ రక్షితా| నిత్యం స్వేభ్యః పరేభ్యశ్చ యథా మాతా యథా పితా. 44

గోపితాని సదా కుర్యా త్సంయాతానీన్ద్రియాణి చ | అజస్ర ముపయోక్తవ్యం ఫలం తేభ్య స్తథైవచ. 45

సర్వం కర్మేద మాయత్తం విధానే దైవమానుషే | తయో ర్దైవ మచిన్త్యంహి పౌరుషే విద్యతే క్రియా. 46

ఏవం మహీం పాలయతో7స్య భర్తు ర్లోకానురాగః పరమో భ##వేచ్ఛ|

లోకానురాగప్రభవా హి లక్ష్మీ ర్లక్ష్మీవత శ్చైవ పరాచ లక్ష్మీః. 47

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే రాజకర్తవ్యస్వపుత్ర శిక్షాక్రమాది కథనం నామ

ఏకోనవిసంశోత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజు అనుసరించవలసిన రీతులు.

ఆకారములు(ముఖనేత్రాది లక్షణములు) ఇంగితములు( వాని కదలికలు- సైగలు) నడక చేష్టలు మాటలు ముఖనేత్ర వికారములు మొదలగు వానిని బట్టి ఇతరుల మనస్సు తెలిసికొన వలెను; ఇట్లు గ్రహించగల నీతి కుశలురకు సర్వవసుంధరయు వశగతమగును; రాజు తానొక్కడే మంత్రమము చేసికొనరాదు; చాలమందితోను మంత్రణము చేయరాదు; నావికులను పరీక్షించనిదే విషయమమగు నావ నారోహించరాదు; తన భూమిని జయించు శత్రువులను సామాద్యు పాయములతో వశీకరించుకొనవలెను; తన రాజ్యమును రక్షించుకొనగోరు రాజు తన అలక్ష్యముతో ప్రజలు కృశులు (కర్శితులు- క్లేశపడువారు) కాకుండనట్లు చూచుకొనుచు పాలించవలయును; ఏరాజు సరిగ చూచుకొనక స్వరాష్ట్ర ములను (రాష్ట్ర ప్రజలను) కృశులనుగా చేయునో అట్టిరాజు త్వరలోనే రాజ్యము నుండియు జీవితము నుండియు భ్రష్టుడగును; కోడెదూడను పోషించినచో అది బలమంది పనులకు యోగ్యమగును; అట్లే రాష్ట్రమును (రాష్ట్ర ప్రజలను) పోషించినచో వారు చక్కగా పనిచేయుచుందురు; రాష్ట్రమును ఎవడు అనుగ్రహముతో చూచునో అతడే రాజ్యమును పరీరక్షించుకొన గలుగును; ఏ రాజు సంజాతమును (రాజ్యమందు ఉత్పన్నమగు ధనాదికములగు వనరులను) ఉపజీవించునో (అనుసరింతు ప్రజాపాలనాదికము చూచునో) అట్టివాడు రాష్ట్రమునుండి హిరణ్యమును ధాన్యమును సురక్షితమగు రాజ్యమును మహా ఫలముగా పొందును; ఇట్లు మహాప్రయత్నముతో తానే ప్రజల తల్లిదండ్రులుగానై స్వరాష్ట్రమును తన దేశపు వారి నుండియు పరులనుండి%ు రక్షించుచు తానును తన ఇంద్రియములను అదుపునందు ఉంచుకొనుచు తాను ప్రజలనుండి పొందిన ఫలమును వారివే అగు యోగక్షేమములకే వినియోగించవలయును.

ఇదియంతయును దైవము (అదృష్టము- భగవన్నిర్ణయు) నందును మానుషము (పురుష ప్రయత్నము) నందును ఆయత్తమై (అధీదనమయి) యున్నది; ఈ రెండింటియందును దైవము అచింత్యము (ఊహింపనలవి కానిది) మానుష (పౌరుష - పురుషకార) మునందు క్రియ నిలిచియున్నది; (క్రియారూపమున కనబడును); ఈవిధముగా మహీపాల నముచేయు రాజునందు ప్రజల కనురాగ మధికముగా నుండును; దానిచే లక్ష్మీకలుగును; దానిచే పరమశోభ కలుగును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున రాజ ధర్మమున రాజక ర్తవ్య స్వపుత్త్రశిక్షాదిక్రమ కథనమను

రెండు వందల పందొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters