Sri Matsya mahapuramu-2    Chapters   

అష్టాదశోత్తరద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- రాజ్ఞో7పరీక్షితాన్న భోజనాదినిషేధః.

మనుః : రాజరక్షారహస్యాని యాని నిధాపయేత్‌ | కారయేద్వా మహీభర్తా బ్రూహి తత్త్వాని తానిచ. 1

శిరీషోదుమ్బరశమీ బీజపూరం ఘృతప్లుతమ్‌ | క్షిద్యోగః కథితో రాజ న్మాసార్థం తు పురాతనైః. 2

కశేరుఫలమూలాని ఇక్షుమూలం తథాబిసమ్‌ | దూర్వాక్షీరఘృతై ర్మణ్డ స్సిద్దో7యం మాసికఃపరః. 3

నరం శస్త్రహతం ప్రాప్తో న తస్య మరణంభ##వేత్‌ | కల్మాషవేణునా తత్ర జయేత్తు విభావసుమ్‌. 4

గృహే త్రి రపసవ్యంతు క్రియ తే యత్ర పార్థివ | నాన్యో7గ్నిర్జ్వలతే తత్ర నాత్ర కార్యా విచారణా. 5

కార్పాసాస్థ్నా భుజఙ్గస్య తేననిర్మోచనం భ##వేత్‌ | సర్పనిర్వాసనే ధూపః ప్రశస్త స్సతతం గృహే. 6

సాముద్రసైన్ధవయవ విద్యుద్దగ్ధా చ మృత్తికా | తయానులిప్తం యద్వేశ్మ నాగ్నినా దహ్యతే నృప. 7

దివాచ దుర్గే రక్ష్యో7గ్ని ర్వాతి వాతే విశేషతః | విషాచ్చ రక్ష్యో నృపతి స్తత్ర యుక్తిం నిబోధమే. 8

క్రీడానిమిత్తం నృపతిర్ధారయే న్మృగవక్షిణః | అన్నం వై ప్రాక్పరీక్షేత వహ్నౌ చాన్యతరేషుచ. 9

వస్త్రం పుష్ప మలఙ్కారం భోజనాచ్చాదనం తథా | నాపరీక్షిత పూర్వం తు స్పృశేదపి మహామతిః. 10

రెండు వందల పదునెనిమిదవ అధ్యాయము.

రాజు అపరీక్షితాన్నమును తినరాదు అనుట-తత్‌ పరీక్షా విధానము.

దుర్గమునందు ఉంచుకొనవలసినన రాజరక్షా రహస్యములు ఏవి? రాజు ఇట్టివి ఏవి ఏర్పాటు చేయించు కొనవలయును; తెలుపుమనిన మనువుతో మత్స్యుడిట్లు చెప్పెను; రాజా! శిరీషము ఉదుంబరము-శమి బీజపూరము - వీటిని నేతితో తడిపి పదునైదు దినములుంచి సేవించిన యెడల ఆకలిని తట్టుకొను శక్తికలుగునని పురాతులు చెప్పిరి. కశేరు ఫలములును కశేరు మూలములును చెరకువేళ్లు తామరతూడు దూర్వ వీటిని పాలతో నేతితో మండముచేసి మానకాలముంచి సేవించిచో శస్త్రఘాతము తగిలినవాడు చావకుండును; త్రిప్పినచో ఆ ఇంట ఇతరములగు అగ్నులు జ్వలించవు; ఇందు సందియమే లేదు; పాముల ఎముకల పొడిని ప్రత్తితోచేర్చి దానని పొగవేసినచో అచ్చటికి పాములు రావు; ఉన్న పాములు బయటకు పోవును; సముద్ర లవణము యవలు విద్యుద్దగ్ధమయిన మృత్తిక-ఇవి కలిపి పూసిన ఇంటికి అగ్ని భయముండదు; రాక్షించవలయును; దానికి యుక్తిని (ఉపాయమును) చెప్పెద; వినుము.

క్రీడార్థమయి రాజు మృగములను పక్షులను ఉంచుకొన వలెను; రాజు భుజించుటకు వీలటియందును అగ్నియందును ఆహారమును పరీక్షించవలయును; పరీక్షించని వస్త్రపుష్పాలంకార భోజనాచ్ఛాదనములలో వేనిని కాని తాకనైనన తాకరాదు.

విషదిగ్దాన్నాది పరీక్షణోపాయాః

స్యాచ్చాసౌ వక్త్రసన్తప్త స్సోద్వేగం చ నిరీక్షతే | విషదో7థ విషం దత్తం యచ్చ తత్ర పరీక్షతే. 11

స్రస్తోత్తరీయో విమనా స్త్సమ్భకుడ్యాదిభి స్తథా | ప్రచ్ఛాదయతి చాత్మానం లజ్జతే త్వరతే తథా. 12

భువం విలిఖతి గ్రీవాం తథా చాలయతే నృప | కణ్డూయతి చ మూర్ధానం పరిలోడ్యాననం తథా. 13

క్రియాసు త్వరితో రాజ న్విపరీతా స్వపిధ్రువమ్‌ | ఏవమాదీని చిహ్నాని విషదస్య పరీక్షయేత్‌. 14

సమిద్ధే విక్షిపే ద్వహ్నౌ తదన్నం త్వరయా7న్వితః | ఇన్ద్రాయుధసవర్ణం తు రూక్షం స్ఫోటసమన్వితమ్‌.

ఏకావర్తంతు దుర్గని భృశం చటచటాయతే | దద్ధూమసేవనా జ్జన్తో శ్శిరోరోగశ్చ జాయతే. 16

సవిషే7న్నే విలీయన్తే న చ పార్థివ మక్షికాః | నిలీనాశ్చ విపద్యన్తే సంస్పృష్టే సవిషే తథా. 17

విరజ్యతి చకోరస్య దృష్టిః పార్థివసత్తమ | వికృతించ స్వరో యాతి కోకిలస్య తథా నృప. 18

గతిఃస్ఖలతి హంసస్య భృఙ్గరాజశ్చ కూజతి | క్రౌఞ్చో మద మథాభ్యేతి కృకవాకు ర్విరౌతి చ. 19

విక్రోశతి శుకో రాజ ఞ్ఛారికా వమతే తతః | చామీకరో7న్యతో యాతి మృత్యుం కారణ్డవ స్తథా. 20

మేహతే వానరో రాజ9 గ్లాయతే జీవజీవకః | హృష్టరోమా భ##వే ద్బభ్రుః పృషతశ్చైవ రోదితి. 21

హర్ష మాయాతి చ శిఖీ విషసన్దర్శనా న్నృప |

(పరీక్షా విధానము) విషము పెట్టినవాని నోరెండిపోవును; అతడు గాబరాతో చూచుచుండును; విషయుక్త పదార్థమును పరీక్షించుట ఆరంభించగానే వాని ఉత్తరీయము జారిపోవును; మనస్సు వికలమగును; స్తంభముల చాటున వాడు నక్కును; సిగ్గుపడును; తందర బిందరలాడును; నేలను గీయును; మెడ కదలించును; ముఖము తడవుకొనుచు తల గోకికొనును; వాని సహజ స్వభావమునకు విరుద్ధములుఅగు ఇంకెన్నెన్నో చేష్టలు చేయనారంభించును; ఈ మొదలగు చిహ్నములను బట్టి పరీక్షించి విషము పెట్టినవాడెవ్వడో నిర్ణయించవచ్చును; ఇట్లు విష సంసర్గము కలదేమోయని శంకించ బడిన యాహారమును త్వరితుడై మండెడు అగ్నిలో వేయవలెను; అది విషమిశ్రితమేయైనచో చిటచిట ధ్వనితో మిగుల చిట్లుచు రూక్షమగు దుర్వాసనతో అది మండుచుండ ఇంద్రాయుధ సమాన వర్ణమగు పొగ వెడలును; ఆ పొగను సేవించుట (అనుభవించుట)చే ప్రాణికి శిరోరోగము కలుగును; సవిషాన్నమున ఈగలు వాలవు; వాలినను వెంటనే చనిపోవును; విషాన్నము దృష్టికి తగిలినచో చకోరపక్షి చూపు విరక్తి చెందినదగును; కోకిల స్వరము వికారమందును; హంస నడక తొట్రుపడును; తుమ్మెద రొదచేయును; క్రౌంచ పక్షికి మదమెక్కును; కోడి గట్టిగా కూయును; చిలుక భయ దుఃఖములతో అరచును; గోరువంక వమనముచేసికొనునును; చామీకర పక్షి ఆ స్థలము విడిచిపోవును; నీటి కోడి చనిపోవును; కోతికి మలమూత్రములు వెడలును; జీవ జీవకము బడలును; ముంగినకు రోమములు నిక్క పొడుచును; జింక ఏడ్చును; నెమిలి సంతోషపడును.

అన్నంచ సవిషం రాజం శ్చిరేణచ విపచ్యతే. 22

తదా భవతి నిశ్శ్రావ్యం పక్షపర్యుషితోపమమ్‌ | వ్యాపన్నరసగన్దంచ చన్ద్రికాభి స్తథా యుతమ్‌. 23

వ్యఞ్జనానాం తు శుష్కత్వం ద్రవాణాం బుద్బుదోద్భవః |

ససైస్థవానాం ద్రవ్యాణాం జాయతే ఫేనమాలికా. 24

సస్యరాజిశ్చ తామ్రా స్యా న్నీలాచ పయస స్తథా | కోకిలాభాచ మద్యస్య తోయస్య చ నృపోత్తమ. 25

ధాన్యావ్లుస్య తథా కృష్ణా కపిలా కోద్రవస్య చ | మధుశ్యామా చ తక్రస్య నీలా పీతా తథై వచ. 26

ఘృతస్యోదకసఙ్కాశా కపోతాభా చ మస్తునః | హరితా మాక్షికస్యాపి తైలస్య చ తథా7రుణా. 27

ఫలానామప్యపచ్యానాం పాకః క్షిప్రం ప్రజాయతే | ప్రకోపశ్చైప పక్వానాం మాల్యానాం వ్లూనతా తథా.

మృదుతా కఠినానాం స్యా న్మృదూనాం చ విపర్యయః | సూక్ష్మానాం రూపదళనం తథాచైవాచిరఙ్గతా. 29

శ్యామమణ్డలతా చైవ వస్త్రాణాం చ విశేషతః | లోహానాంచ మణీనాంచ మలపజ్కోపదిగ్ధతా. 30

అనులేపనగన్ధానాం మాల్యానాం చ నృపోత్తమ | విగన్ధతా చ విజ్ఞేయా వర్ణానాం వ్లూనతా తథా. 31

పీతాభాసా చ విజ్ఞేయా తథా రాజ న్జలస్య తు | దన్తకాష్ఠత్వచ శ్శ్యామా స్తనుసత్త్వా స్తథైవచ. 32

ఏవమాదీని చిహ్నాని విజ్ఞేయాని నృపోత్తమ | తస్మా ద్రాజా సదా తిష్ఠే న్మణిమన్త్రౌషధాంగణౖః. 33

ఉక్తై స్సంరక్షితో రాజా ప్రమాద పరివర్జకః |

ప్రజాతరో ర్మూలమిహావనీశ స్తద్రక్షణా ద్వృద్ధి ముపైతి రాష్ట్రమ్‌ | 34

తస్మా త్ప్రయత్నేన నృపస్య రక్షా సర్వేణ కార్యా రవివంశచస్ద్ర. 34u

ఇది శ్రీమత్స్య మహాపురాణ రాజధర్మే విషదిగ్ధాన్నాది పరీక్షణోపాయ కథనం నామ

అష్టాదశోత్తర ద్విశతతమో7ధ్యాయః.

ననిషాహారము ఉడుకుటకు చాలసేపు పట్టును; ఉడికిన తరువాత కూడ వెంటనే అప్పటికప్పుడే చెడిపోవును; మూత తీసి చూచుటకే రోతపుట్టును; పదునైదు దినముల నాటిదివలె పాసిపోవును! రుచియు వాసనయు చెడిపోవును; నెమిలి పించెముల వంటి రంగులేర్పడును; (ఇది అన్నపు విషయము): వ్యంజనములు (కూరలు పచ్చడులు మొదలగునవి) విషమిశ్రితములయినచో ఎండిపోవును: ద్రవ పదార్థములైనచో వానిపై బుడగలు వచ్చును: ఉప్పు వేసిన వస్తువులయిచో వానిపై నురుగులేర్పడును; పంటపైరు లెర్రపడును! పాలు నీలమగును: మద్యమును నీరును కోకిల వర్ణమగును: వడ్లును ఆవ్లుములును నల్లపడును: కొర్రలు కపిల వర్ణమగును: మజ్జిగ తేనెవలె చామనచాయ అగును. నీలమయిన పసుపుపచ్చని దైననగును: నేయికూడ నీటివలెనే అగును; మీగడ కపోత వర్ణమగును: తేనె ఆకుపచ్చగ నగును: తైలము అరుణ వర్ణమగును: విష సంసర్గము. చెందిన పచ్చికాయలు త్వరగ పండును: పండినవి క్రుళ్ళిపోవును: పూవులు వాడిపోవును; గట్టివి మెత్తనగును. మెత్తనివి గట్టివగును. సూక్ష్మ వస్తువులు రూపము చెడినవై అల్పకాలిక జీవితము కలవగును: వస్త్రములపై నల్లని మచ్చలేర్పడును: లోహములును మణులును బురదవంటి మాలిన్యము కలవగును: అనులేపన గంధ ద్రవ్యములును పూవులును వాసన చెడును: వన్నె చెడిపోవును. నీరు పచ్చనిదివలె చాయనందును: దంతములు పెదవులు చర్మము నల్లపడి శక్తిహీనములగును: ఈ మొదలగు చిహ్నములనుబట్టి ఆయా పదార్థముల విష సంనర్గమును గురుతించ వలెను. కావున రాజెల్లప్పుడును మణి మంత్రౌషధౌషధులతో రక్షణనంది ఏమరుపాటు లేక యుండవలయును; రాజు ప్రజా వృక్షమునకు మూలము; దానిని కాపాడినచో రాష్ట్రము వృద్ధినందును; కావున ప్రతివాడును యత్న పూర్వకముగా రాజును రక్షించవలయును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మములందు రాజు అపరీక్షితాన్నము తినరాదనుటయు

విషసంసృష్ట పదార్థ పరీక్షా ప్రకారమును అను రెండు వందల పదునెనిమిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters