Sri Matsya mahapuramu-2    Chapters   

పంచదశోత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజ్ఞో7 ను జీవినా మనువర్తన క్రమః

మత్స్యః. యథానువర్తితవ్యం స్యాన్మనో రాజ్ఞో7ను జీవిభిః| సర్వదాతు సదాచారై ర్నిభోధ గదతో మమ. 1

జ్ఞాత్వా సర్వాత్మనా కర్యా స్వశక్త్యా రవినన్దన | రాజా యత్తు వదే ద్వాక్యం శ్రోతవ్యం త్త్ప్రయత్నతః. 2

ఆక్షిప్య వచనం తస్య న వక్తవ్యం తథా వచః| అనుకూలం ప్రియం తస్య వక్తవ్యం జనసంసది. 3

రహో గతస్య వక్తవ్య మప్రియం యద్ధితం భ##వేత్‌| పరార్థ మస్య వక్తవ్యం సమే చేతసి పార్థివ. 4

స్వార్థ స్సుహృద్భి ర్వక్తవ్యో నన స్వయం తు కథంచన| కార్యాతిపాత స్సర్వేషు రక్షితవ్యః ప్రయత్నతః. 5

న చ హింస్య ధనం కిఞ్జిన్నియుక్తేన చ కర్మణి | నోపేక్ష్య స్తస్య మాశ్చ తథా రాజ్ఞః ప్రియో భ##వేత్‌. 6

రాజ్ఞచ్చ న తథా కార్యం వేషభాషితచేష్టితమ్‌| రాజలీలా కర్తవ్యా తద్విద్విష్టం చ

వర్జయేత్‌. 7

రాజ్ఞ స్సమో7 ధికో వాన కార్యో వేషో విజానతా| ద్యూతాదిషు తథైవాన్య త్కౌశలం తు ప్రదర్శయేత్‌. 8

ప్రదర్శ్య కౌశలం చాస్య రాజానం చ విశేషయేత్‌| ఆన్తఃపురరజనాధ్యక్షైర్వైరిదూతైర్నిరాకృతైః. 9

సంసర్గ న వ్రజే ద్రాజ న్వినా పార్థివశాసనాత్‌| నిస్స్నేహతాం చావమానం ప్రత్నేన తు గోపయేత్‌. 10

యచ్చ గుహ్యం భ##వే ద్రాజ్ఞో న త ల్లోకే ప్రకాశ##యేత్‌| నృపేణ శ్రావితం యత్స్యా ద్గుహ్యా ద్గుహ్యాం నృపోత్తమ. 11

న త త్సంస్రావయే ల్లోకే తథా రాజ్ఞో 7ప్రియో భ##వేత్‌| ఆజ్ఞాప్యమానే తాన్యస్మి న్త్సముత్తాయ త్వరాన్విత. 12

అహం కిం కరవాణీతి వాచ్యో రాజా విజానతా| కార్యావస్థాం చ విజ్ఞాయ కార్యమేవ యతా భ##వేత్‌. 13

రెండు వందల పదునైదవ అధ్యాయము.

రాజాను జీవుల అనువర్తన ప్రకార వివరణము.

మత్స్యుడు మనువుతో ఇట్లు చెప్పెను: రాజాను జీవులు సర్వదా సదాచారులయి రాజునెట్లనువర్తించవలయునో చెప్పెదను; వినుము; విషయమునెరిగి రాజాను జీవులు రవిపుత్త్రా! మనూ! నిండు మనస్సుతో అన్ని విధములు రాజు ననువర్తించవలెను; ఎట్లన- రాజును చెప్పు వాక్యమును యత్నముతో వినవలెను; అతని మాటను నడుమనే నిలిపి తనమాట చెప్పకూడదు; జనసభలో నున్న రాజుతో అతనికి అనుకూలమును ప్రియమునగు మాట పలుకవలెను ;ఏకాంతమందు మాత్రము రాజునకు అప్రియమైనను హితమగు వచనము పలుకవలె(చ్చు)ను; ఇతరులకు మేలుకావలసిన పని ఏదయిన నున్నను రాజ మనస్సు సమముగా నున్నపుడు చెప్పవలెను; తన సొంతమునకు రాజు వలన కావలసిన దేదైన నున్నచో అది అతికి ఇతరులచే చెప్పించవలెనే కాని తాను చెప్పరాదు; ఏపనిని గాని సమయము మించకుండ నెరవేర్చుటకు యత్నించవలెను ;రాజాధికృతుడెప్పుడును రాజ ధనమును దుర్వినియుక్తము చేయరాదు ;రాజు తనపై చూపు ఆదరమును అలక్ష్యము చేయక దానితే తానతనికి ప్రియుడు కావలెను. రాజువలె తన వేషభాషా చేష్టితములాచరించరాదు ;(ఎగ తాళిగా) రాజుననుకరించరాదు ;అతనికిష్టము కానివి విడువలెను ;రాజవేషమునకు సమము అధికమునగు వేషమును ధరించరాదు; ద్యూతము మొదలగువానియందు తనకు గల నేర్పునతనికి ప్రదర్శించవలెను;అట్లు ప్రదర్శించినను వాటి యందు రాజే తనకంటే గొప్పవాడని చూపవలెను; అంతఃపుర జనాద్యక్షులతో శత్రు రాజదూతలతో తన రాజుచే వెడల గొట్టబడినవారితో రాజాజ్ఞ లేనిదే సంబంధము పెట్టుకొనరాదు ;తనకు ఎవరియందు గాని స్నేహ రాహిత్యము కాని అవమాన దృష్టికానియున్నను దానిని బయల్పరచక దాచి ఉండవలెను; రాజరహస్యములను లోకమున బయలుపరచరాదు. రాజు తనతో చెప్పిన పరమ గుహ్యములను బయలుపరచరాదు; దానిచే అతడు రాజుననకు అప్రియుడగును ;రాజు ఇతరులకు నేదయినన ఆజ్ఞాపించుచున్ను తాను లేచి నేనేమి చేయుదును? అనవలెను; కార్యస్థితి నెరిగి దానిని నెరవేర్పచూడవలెను.

సతతం క్రియమాణ 7స్మి న్లాఘవంతు వ్రజే ద్ద్రువమ్‌| రాజ్ఞః ప్రియాణి వాచ్యాని నచాత్యర్ధం పునః పునః. 14

మహాసుశీలశ్చ భ##వే న్న చాపి భ్రుకుటీముఖః| నాతివక్తా న నిర్విక్తాన చ మాత్సరిక స్తథా. 15

ఆత్మసమ్భావితశ్చైవ న భ##వేచ్చ కతంచన| దుష్కృతాని నరేన్ద్రస్య న చ సఙ్కీర్తయే త్క్వచిత్‌. 16

వస్త్ర మన్త్ర మలఙ్కారం రాజ్ఞా దత్తం తు ధారయేత్‌| ఔదార్యేణ న తద్ధేయ మన్యసై#్మ భూతి మిచ్ఛితా. 17

న చైవాత్యసనం కార్యం న స్వప్నం చాపి కారయేత్‌| నానిర్దిష్టే తథా ద్వారే ప్రవిశేత్తు కదాచన. 18

నచ వశ్యేత్తు రాజాన మయోగ్యాసు చ భుమిషు| రాజ్ఞస్తు దక్షిణ పార్శ్వే వామే చోపవిశే త్తథా. 19

పురుస్తాత్తు తథా పశ్చా దాసం తు విగర్హితమ్‌| జృమ్భాం నిష్ఠీవనం కాసం కోపం పర్యస్తికాశ్రయమ్‌. 20

భ్రుకుటిం వాన్త ముద్గారం తత్సమీపే వివర్జయేత్‌| స్వయం తథా నకుర్వీత స్వగుణా

ఖ్యాపనం బుధః. 21

గుణాఖ్యాపనే యుక్తం పరమేవ ప్రయోజయేత్‌| హృదయం నిర్మలం కృత్వా పరాం భక్తిం సమాశ్రితైః. 22

అను జీవిగణౖ ర్భావ్యం నిత్యం రాజ్ఞా మతన్ద్రి తైః| శాఠ్యం లౌల్యం చ పైశున్యం నాస్తిక్యం క్షుద్రతా తథా. 23

చాపల్యం చ పరిత్యాజ్యం నిత్యం రాజ్ఞో 7ను జీవిభిః| శ్రుతి విద్యాసుశీలైశ్చ సంయోజ్యాత్మానమాత్మనా. 24

రాజసేవా తతః కార్యా భూతయే భూతి మిచ్ఛతా| నమస్కార్యా స్సదా చాస్య పుత్త్రవల్లభమన్త్రిణః. 25

సచివై శ్చాస్య విశ్వాసో న త కార్యః కథంచన| అపృష్టస్చాస్య న బ్రూయా త్కామం బ్రూయా త్తథా యది. 26

హితం పథ్యం వచ స్తథ్యం స్సహ సునిశ్చితమ్‌| చిత్తం చైవాస్య విజ్ఞేయం నిత్యమేవానుజీవిభిః. 27

ఏవ మారాధనం కుర్యా చ్చిత్తజ్ఞో మానవ స్సుఖమ్‌|

కాని ఈ విధముగ కూడ ఎల్లప్పుడును చేయుచున్నచో తాను ప్రభువునకు తేలికవాడగును ;రాజునకు ప్రీతి కరములగు వచనములు పలకవలసినదే కాని అవి మిక్కిలి గాగాని మాటిమాటికి (ఎప్పుడును అదేపనిగా) కాని ఆడరాదు; మహా సుశీలుడుగా నుండవలెను ;కను బొమలు ముడిపడనీయరాదు ;ఎక్కువ మాటాడరాదు; బొత్తుగా మాటాడకుండ రాదు; మస్తరముండరాదు; తను తానెట్టి స్థితియందును పొగడుకొనరాదు ;రాజునందు దుష్కృత్యములను ఎప్పుడు గాని ఎక్కడగాని పేర్కొనరాదు ;రాజిచ్చిన వస్త్రములను అస్త్రములను అలంకారములను తానే ధరించవలెను కాని క్షేమము గోరువాడెవడును వానిని ఔదార్యముతో ఇతరులకీయరాదు ;తెగ తినరాదు ;అతినిద్ర పోగూడదు; ప్రవేశించవచ్చునని నిర్దేశించని(నిషిద్ధమయిన) వాకిటియందు ఎన్నడును

ప్రవేశించరాదు ;రాజు దర్శించరా%ి చోటులందుండగా దర్శించరాదు; రాజునకు

కుడి ఎడమలందే కాని ముందు వెనుకలందు కూర్చుండరాదు ;రాజ సమీపమున ఆవులుంచుట ఉమియుట దగ్గుట(ఇతరువపైనను) కోపించుట వారాసనమున కూర్చుండరాదు కనుబొమలు ముడివేయుట క్రక్కుట కేక రించుట చేయరాదు ;తన గుణములను తానే చెప్పుకొనుట తగదు; ఒకవేళ రాజునకు అవి తెలుపవలసియున్నచో ఇతరులచే తెలిపించవలయును; రాజానుజీవులు నిర్మల హృదయులు రాజునందు పరమభక్తులు సోమరితనము లేనివారు నయి కొంటె తనము ఆయా విషయములందాసక్తి చాడీలు చెప్పుట నాస్తికత్వము క్షుద్రత్వము తాపల్యము విడువవలెను ;వేద విద్య యందు సుశీలమునందు మనస్సు దృఢముగా నిలుపవలయును; ఇట్లుండి రాజసేవ చేయుటచే శ్రేయస్సు కలుగును ;రాజునకు పుత్త్రులు మంత్రులు ప్రియులునగు వారిని నమస్కరించుచుండవలెను ;రాజ సచివులయందు నమ్మికతో నుండ రాదు ;రాజడుగనిదే మాటలాడరాదు ;ఒకవేళ మాటలాడిను రాజహితులగు వారితో మాట కలిపి రాజునకు హితమును క్షేమకరమును సత్యమునునగు మాటనే చెప్పవలయును ;సదా రాజ చిత్తము నెరిగి వర్తించవలెను ;ఇట్లుండి రాజునారాధించి (మెప్పించ) వలెను.

విరక్త-రక్త లక్షణమ్‌.

రాగాపరాగౌ చైవాన్య విజ్ఞే¸° భూతి మిచ్ఛతా. 28

త్యజే ద్విరక్తం నృపతీ రక్తం వృత్తింతు కారయేత్‌|

విరక్తః కారయే న్నాశం విపక్షాభ్యుదయం తతా| 29

ఆశావర్ధనకం కృత్వా ఫలనాశం కరోతిచ|ష అకోపో7పి సకోపాభః ప్రసన్నోపి చ నిష్పలః. 30

వాక్యం చ సమదం వక్తి వృత్తిచ్ఛేదం కరోతి చ| ప్రవేశవాక్యముదితో న సమ్భావయతే యథా. 31

ఆరాధాసు కర్వాసు సుప్తవచ్చ విచేష్టతే | కథాసుదోషం క్షిపతి వాక్యభఙ్గం కరోతి చ. 32

లక్ష్యతే విముథశ్చైవ గుణసఙ్కీర్తనే7పి చ | దృష్టిం క్షిపత్యథాన్యత్ర క్రియమాణ చ కర్మణి. 33

విరక్త లక్షణం హ్యేత చ్ఛృణు రక్తస్య లక్షణమ్‌| దృష్ట్వా ప్రసన్నో భవతి వాక్యం గృహ్ణాతి చాదరాత్‌. 34

కుశలాది పరిప్రశ్నం హృష్టో వదతి శోభమ్‌| వివక్తదర్శనే చాస్య రహేస్యేనం న శఙ్కతే. 35

జాయతే హృష్టవదన శ్శ్రుత్వా తస్యతు త(స) త్కథామ్‌| అప్రియాణ్యపి వాక్యాని తదుక్తా

న్యభినన్దతే. 36

ఉపాయనం చ గృహ్ణాతి స్తోక మప్యాదరం తథా| కథాన్తరేషు స్మరతి ప్రహృష్టవదన స్తథా. 37

ఏవం రక్తస్య కర్తవ్యా సేవా రికులోద్వహ| మిత్రం న చాపత్సు తథా చ భృత్యం త్యజన్తియే నిర్గుణ మప్రమేయమ్‌. 38

ప్రభుం విశేషేణ చ యే వ్రజన్తి సురేన్ద్రదామామరబృన్దజుష్టమ్‌. 38U

ఇతి శ్రీమత్స్య మహాపురాణ రాజధర్మే రాజ్ఞో7ను జీవినా మనువర్తనక్రమాది

కథం నామ పంచదశోత్తరద్విశతతమో7ధ్యాయః.

విరక్త - రక్త- లక్షణము.

రాజు కూడ తన క్షేమము కోరుకొనినచో తన భృత్యులతో తన యందు రక్తుడెవడో విరక్తుడోవడో గురుతుంచి విరక్తుని విడువవలెను ;రక్తునిచేతనే సేవావర్తనము చేయించవలెను ;విరక్తుడగు భృత్యుడు తన ప్రభువునకు నాశమును శత్రిపక్షముకు అభ్యుదయమును కలిగించును ;ఆశను పెంచును ;ఫలనాశము కలిగించును.

విరక్తుడగు భృత్యుని గురుతించుట ఎట్లన-

విరక్తుడగు భృత్యుడు మదముతో నిండిన మాటలు పలుకును; తుదకు తన జీవనమునకే ముప్పు తెచ్చుకొనును; వాక్యములు ఆరంభించునప్పుడు సంతోషముతోనే ఉండి ఆరంభించును ;కాని అదే విధముగా తుదవరకు మాటలాడడు ;రాజునారాధించ( మెప్పించ) వలసిన సర్వవిషయములందును నిదురపోవుచున్నట్లు వర్తించును; మాటలందు తప్పులు వెదకి ఎత్తి చూపుచుండును; మాటకు నడుమనే త్రుంచివేయును ;తన ప్రభుని గుణములను కీర్తించునప్పుడు కూడ విముఖుడుగా కనబడుచుండును ;తాను పనులు చేయుచుండియు తన చూపును మరియొకచోట నుంచును ;విరక్తుని లక్షణములు ఇట్లుండును ;ఇక- రక్తుడగు భృత్యుని లక్షణములు ;తన ప్రభుని చూచింతనే ప్రసన్నుడగు ను ;చెప్పిన వాక్యమును అదరముతో స్వీకరించును ;కుశలప్రశ్నాదికము చేయునపుడు హర్షములో విన ఇంపుగా మాటలాడును; ఏకాంతమునందు రహస్య వివక్తస్థలములందు తన ప్రభువు తలకు కనబడినను జంకు గొనడు ;తన ప్రభుని గూర్చిన మాటలితరుల నోట విననపుడతని మొగమున హర్షము కనబడును ;తనప్రభువు తన్నేవైన అప్రియ వచనము లాడినను అవి మెచ్చునే కాని కోపింపడు ;తన ప్రబువిచ్చిన ఆదరముగాని పారితోషికముగాని అల్పమైనను గొప్పదియను గౌరవముతో గ్రహించును; మాటల సేవకునిగా గురుతించి వానిచేత సేవ చేయించుకొనవలెను ;ఆపదలయందున్న భృత్యునికాని మిత్రుని కాని ఎవరు విడువక ఆదుకొందురో అట్టి ప్రభువును - తన ప్రభువునకు రాజును త్రిగుణాతీతుడు అప్రమేయుడు అగు భగవంతునిగా ఎవరు భావించి వాననినాశ్రయింతురో అట్టి భృత్యులును ప్రజలును అమర బృందాశ్రితమగు దేవేంద్రస్థానమగు స్వర్గమును చేరి సుఖింతురు.

ఇది శ్రీ మస్త్యమహాపురాణమున రాజధర్మమునందు

రాజానుజీవి వర్తనమను రెండు వందల పదునైదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters