Sri Matsya mahapuramu-2    Chapters   

షడుత్తరద్విశతతమోధ్యాయః.

వృషోత్సర్గవృషలక్షణమ్‌.

మనుః భగవఞ్ఛ్రోతు మిచ్ఛామి వృషభస్య తు లక్షణమ్‌ |

వృషోత్సర్గవిధిం చైవ తథా పుణ్య ఫలం మహాత్‌. 1

మత్స్యః: ధేను మాదౌ పరీక్షేత సుశీలాం చ గుణాన్వితామ్‌ |

అవ్యఙ్గా మపరిక్లిష్టాం జీవవత్సా మరోగిణీమ్‌. 2

స్నిగ్ధవర్ణాం స్నిగ్ధఖురాం స్నిగ్ధశృఙ్గీం తథైవచ | మనోహరాకృతం సౌమ్యాం సుప్రమాణా మనుద్ధతామ్‌. 3

ఆవర్తై ర్దక్షిణావర్తై ర్యుక్తాం దక్షిణతశ్చయా| వామావర్తై ర్వామతశ్చ విస్తీర్ణజఘనాం తథా.4

మృదుసంహతతామ్రోష్ఠీం రక్తగ్రీవాం సుశోభితామ్‌| ఆశ్యామదీర్ఘాస్ఫుటితా రక్తజిహ్వా తథా చ యా. 5

విస్తారా మలనేత్రా చ శ##ఫై రవిరళై ర్దృఢైః| వైడూర్యమధువర్ణైశ్చ జలబుద్బుదసన్నిభైః. 6

రక్తస్నిగ్ధైశ్చ నయనై స్తథా రక్త కనీనికైః| సప్తటతుర్దశదన్తా తథా చాశ్యామ తాలుకామ్‌.

షడున్నతా సుపార్శ్వోరుః పృధుపంచ సమాయతా| అష్టాయతశిరో గ్రీవా యా రాజ న్త్సా సులక్షణా. 8

మనుః షడున్నతాః కే భగవ న్కేచ పఞ్చ సమాయతాః |

ఆయతాశ్చ తతైవాష్టౌ ధేనూనాం కే శుభావహాః. 9

మత్స్యః ఉరః పృష్ఠం శిరః కుక్షి శ్శ్రోణిచ వసుధాధిప |

షడున్నతాని ధేనూనాం పూజయన్తి విచక్షణాః. 10

కర్ణౌ నేత్రే లలాటంచ పఞ్చ భాస్కరనన్దన | సమాయతాని శస్యనతే పుచ్ఛం సాస్నాచ సక్థినీ. 11

చత్వారశ్చ స్తనా రాజ& జ్ఞేయా హ్యష్టౌ మనీషిభిః | శిరోగ్రీవాయతాశ్చైతే భూమిపాల స్మృతా దశ. 12

రెండు వందల ఆరవ అధ్యాయము.

వృషోత్సర్గ వృషలక్షణము.

భగవన్‌! వృషోత్సర్గమున వదలవలసిన వృషభపు లక్షణమును వృషోత్సర్జన విధానమును దాని మహాఫలమును వినగోరుదుననిన మనువుతో మత్స్యుడిట్లు చెప్పెను: మొదట ఆ వృషభమునకు తల్లియగు ధేనువును పరీక్షించవలయును; ఆ ధేనువు సుశీలయు గుణవతియు అంగవైకల్యము లేనిదియు నలిగి(చిక్కి) పోనిదియు పుట్టినన దూటలన్నియు బ్రదికి యున్నదియు రోగములు లేనిదియు నున్నని వన్నెయు గిట్టలును కొమ్ములును కలదియు మనోహరాకృతి కలిగి సౌమ్యయై సరియగు ప్రమాణముతో నుండి పొగరులేనిదిగా నండవలయును; దాని కుడివైపు సుడులు కుడివైపునకును ఎడమవైపునకు సుడులు ఎడమవైపునకును తిరిగియుండవలెను; విశాలమగు మలుగు (జఘనము) మెత్తనై దట్టమగు ఎర్రని పెదవులు ఎర్రని మెడ కలిగి చక్కగ ఒప్పుచుండవలయును; ఆ ధేనువు కొంచెము చామనచాయ కలిగి దేహమున ముడుతలు లేక విప్పారిన ఎర్రిని నాలుకయు విశాలములు నిర్మలములు ఎర్రనివి వైఢూర్యపు వన్నెయో తేనవన్నెయూ కలవి నీటి బుడగలవలె ఎత్తుగా కనబడునవి ఎర్రని కనుపాపలు కలవి నున్ననివి అగుకన్ను లును ఒత్తయిన గట్టి గిట్టలును ఏడు కాని పదు నాలుగు కాని దంతములును చామనఛాయ గల లోదౌడలును కలిగి యుండవలయును ; ఆరు ఉన్నతములయి చక్కని పార్శ్వములు తొడలు కలిగి విశాలమయి ఐదు నమములు ఆయతములునయి ఎనిమిది ఆయతములయిన తలయు మెడయు ఉన్న ధేనువులు మంచి లక్షణములు కలవి; అనగా మనువు- భగవన్‌ షడున్నతములు పంచనమాయతములు అష్టాయతమతులు అననేవేవి? అవి యుండుట ధేనువులకు శుభకర మంటిరికదా! తెలుపుడన మత్స్యుడిట్లు పలికెను: ఉరము వీపు శిరము పొట్ట పిరుదులు రెండు- మొత్తమీయారును ఉన్నతములయి యున్న ధేనువులు మంచివని పండితులు ప్రశంసింతురు; రెండు చెవులు రెండు కన్నులు లలాటము- ఈ ఐదును సమములై పొడవై యుండవలెను. తోక గంగడోలు రెండు తొడలు నాల్గుస్తనములు ఈ ఎనిమిదియి వీనితో పాటు శిరము కంఠము కలిసి మొత్తము పదియు పొడవయి యుండవలెను.

తస్యా స్సుతం పరీక్షేత వృషభం లక్షణాన్వితమ్‌ | ఉన్నతస్కన్ధకకుదం ఋజులాఙ్గూలకమ్బళమ్‌. 13

మహాకటీతటస్కన్ధం వైడూర్యమణిలోచనమ్‌ | ప్రవాళశృఙ్గకర్ణాగ్రం సుదీర్ఘపృథువాలధిమ్‌. 14

నవాష్టాదశసఙ్ఖ్యైర్వా తీక్షణాగ్రైర్దశ##నై శ్శుభైః| మల్లికాక్షశ్చ మోక్తవ్యో గృహేపి ధనధాన్యకృత్‌. 15

వర్ణత స్తామ్రకపిలో బ్రాహ్మణస్య ప్రశస్యతే| శ్వేతో రక్తశ్చ కృష్ణశ్చ గౌరః పాటల ఏవచ. 16

శృఙ్గిణ స్తామ్రపృష్ఠశ్చ శబలః పఞ్చావాలకైః| పృథుకర్ణో మహాస్కన్ధ శ్ల్శక్షణరోమా చ యో భ##వేత్‌. 17

రక్తాక్షః కపిలో యశ్చ రక్తశృఙ్గతలో భ##వేత్‌| శ్వేతోదరః కృష్ణపార్శ్వో బ్రాహ్మణస్య ప్రశస్యతే. 18

సిగ్ధా వర్ణేన ర క్తేన క్షత్త్రియస్య తు శస్యతే | కాఞ్చనాభేన వైశ్యస్య. కృష్ణేనాప్యనన్త్యజన్మనః. 19

యస్య ప్రాగయతే శృఙ్గే భ్రూముకాభిముఖే సదా| సర్వేషామేవ వర్ణానాం సర్వ స్సర్వార్థసాధకః. 20

మార్జారపాదః కపిలో ధన్యః కపిలపిఙ్గళః| శ్వేతో మార్దారపాదన్తు ధన్యో మణినిబేక్షణః. 21

కరటః పిఙ్గళ##శ్చైవ శ్వేతపాద స్తథైవచ| సర్వపాదసితో యశ్చ ద్విపాద శ్శ్వేత ఏవచ. 22

కపిఞ్జలనిభో ధన్య స్తథా తి త్తిరిసన్నిభః| ఆకర్ణమూలం శ్వేతంతు ముఖం యస్య ప్రకాశ##తే. 23

నన్దీముఖ స్స విజ్ఞేయా రక్తవర్ణో విశేషతః| శ్వేతం తు జఠరం యస్య భ##వే త్పృష్ఠం తు గోపతే. 24

వృషభ స్స సముద్రాఖ్య స్సతతం కులవర్ధనః | మల్లికాచిత్రపుష్పశ్చ ధన్యో భవతి పుజ్గవః. 25

కమలైర్విమలైశ్చాపి చిత్త్రో భవతి భాగ్యతః| అతసీపుష్పవర్ణశ్చ తథా ధన్యతర స్స్మృతః. 26

ఏతే ధన్యా స్తథాధన్యా న్కీర్తయిష్యామి తే నృప| కృష్ణతాలోష్ఠదశనా రూక్షశృఙ్గశఫాశ్చ యే. 27

అవ్యక్త వర్ణా హ్రస్వాశ్చ వ్యాఘ్రాసింహానిభాశ్చ యే | వ్యాఘ్రగృహధ్రసవర్ణాశ్చ తథా మూషకసన్నిభాః. 28

కృష్ణాః కాణా స్తతా ఖఞ్జాః కేకరాక్షా స్తథైవచ| విషమశ్వేతపాదాశ్చ ఉద్భ్రన్తనయననా స్తథా| 29

నైతే వృషాః ప్రయోక్తవ్యా న చ ధార్యా స్తథా గృహే | మోక్తవ్యానాం చ ధార్యాణాం భూయో వక్ష్యామి లక్షణమ్‌. 30

తరువాత ఆ ధేనువునకు కుమారుడగు వృషభమును పరీక్షించవలెను; అది లక్షణవంతము కావలెను; దాని మూపును మూపురమును ఎత్తుగా తోకయు గంగడోలును వంకరలేక ఉండవలెను; అదిపెద్దకటి స్థలము మూపులు వైడూర్యమణి వంటికన్నులు పవడము వంటి కొమ్ములు కొనలు చెవుల కొనలు - చాల పొడవై విశాలమగు తోకకుచ్చు తొమ్మిదికాని పదునెనిమిది కాని వాడి మొనలుగల చక్కని దంతములు కలిగియుండవలెను; మల్లె మొగ్గలవంటి కన్నులుకల దానిని వదలిననచో వదలినవాని ఇంట ధనధాన్య వృద్ధియగును; ఎర్రని కపిల వర్ణపుది తెల్లనిది రాగివన్నెది నల్లనిది గౌరవన్నెది పాటల వర్ణపుది (తెలుపు ఎరుపు సమముగా కలిసినవన్నెది) లావు కొమ్ములు ఎర్రని వీపు ఐదు వన్నెలు కలిసిన తోక కుచ్చు వెంట్రుకలు విశాలములగు చెవులు విశాలమగు మూపులు దట్టములై నున్ననైన రోమములు ఎర్రని కన్నులు కల కపిల వృషభము- ఎర్రని కొమ్ముల పైవన్నె- తెల్లని పొట్టనల్ల డొక్కలు కల వృషభమును బ్రాహ్మణుల విడువవలయును; చిక్కని ఎరుపు వన్నెకలది క్షత్త్రియులు విడువదగిది ; బంగరువన్నె ఎద్దును వైశ్యులు నల్లని దానిని శూద్రులు విడువవలయును; ముందువైపునకు వంగి పొడవై కనుబొమల వైపునకు చూచుచున్న కొమ్ములు కలది సదా సర్వవర్ణముల వారును విడువ దగినది. (వృషభముల లక్షణములబట్టి నామ విశేషములు కలవు; ఎట్లన-) పిల్లి పాదముల వంటి పాదములు కపిలవర్ణము- కపిల పింగళ వర్ణము - కలదియు తెల్లనిదై మార్జాల పాదసహితము మణులవంటి కన్నులు కలదియు పింగళ వర్ణము తెల్లని పాదము- సర్వత్ర తెల్లని పాదములు- తెల్లని రెండు పాదములు కలదియు- ఇట్టి కోడెదూడలను ధన్యజాతి అందురు; చెవి మొదళ్లయందు తెలుపు కలిగి ప్రకాశించు మొగము రక్తవర్ణ ముఖము- శరీరమంతయు రక్తవర్ణము - కల కోడెను నందీ ముఖమందురు; శరీర మంతయు ఎక్కువ భాగము ఎర్రనై పొట్టయు వీపును తెల్లగా నున్న కోడెదూడను సముద్రము అందరు; ఇదియు వంశవృద్ధికలిగించును; మల్లెపూవువలె నుండియు పలువన్నెలు కలదియు పద్మమువలె నుండియు పలువన్నెలు కలదియు భాగ్యవృద్ధి కలిగించును; అవిసిపూవన్నె కలదియు మరియు ధన్యతరము; ఈ చెప్పిన వన్నియు ధన్య వర్గమునకు చెదినవి; (మేలయినవి) ; ఇక అధన్యములు: నల్లని దౌడలు పెదవులు దంతములు బిరుసు కొమ్ములు గిట్టలు అస్పష్ట వర్ణము కలవియు పొట్టివి పులివలె సింహమువలె కనబడునవి పులివన్నె గ్రద్ధవన్నె కలవి ఎలుకవన్నె కలవి చాల నల్లనివి మెల్లకంటివి కొంకికాళ్ళవి ఓరచూపులవి ఎగుడుదిగుడైన తెల్లని పాదములు కలవి గ్రుడ్లు త్రిప్పునవి మిడిగ్రుడ్లవి- ఇట్టి వృషభములను విడువరాదు; ఇంటనుంచు కొనరాదు; వృషోత్సర్గమున విడువ దగిననవియు -ఇంటనుంచు కొనదగి నవియు నగు వృషభముల లక్షణమును మరల జెప్పెదను; వినుము.

స్వస్తికాకారశృఙ్గాశ్చ తతా మేఫ°ఘనిస్వనాః| మహాప్రమాణాశ్చ తథా మత్తమాతఙ్గగామినః. 31

మహోరస్కా మహోచ్ఛ్రాయా మహాబలపరాక్రమా | శిరః కర్ణౌ లాలటంచ వాలధి శ్చరణా స్తథా. 32

నేత్రే పార్శ్వే చ కృష్ణాని శస్యన్తే చన్ద్రసప్రభమ్‌ | శ్వేతాన్యేతాని దృశ్యన్తే కృష్ణస్యతు విశేషతః. 33

భూమౌ లమ్బతి లాఙ్గాలం ప్రలమ్బస్థూలవాలధిః| పురస్తా దుద్యతో నీలో వృషభ స్స ప్రశస్యతే. 34

శ క్తిధ్వజపతాకాఢ్యా యేషాం రాజీ విరాజతే | అనడ్వాహస్తు తే ధన్యా శ్చిత్రసిద్ధిజయావహాః. 35

ప్రదక్షిణం త్రివర్తన్తే స్వయం చ వినివర్తితాః| సమున్నతశిరోగ్రీవా ధన్యాస్తే ధనవర్ధనాః. 36

రక్తశృఙ్గాగ్రనయన శ్శ్వేతవర్ణో భ##వే ద్యది| శ##ఫైః ప్రవాళసదృశై ర్నాస్తి ధన్యతర స్తతః.37

ఏతే ధార్యాః ప్రయత్నేన మోక్తవ్యా యది వా వృషాః| ధారితాశ్చ తథా ముక్తా ధనధాన్య వివర్ధనాః. 38

చరణాని ముఖం పుచ్ఛం యస్య శ్వాతాని గోపతేః| లాక్షరససవర్ణశ్చ తం నీల మితి నిర్దిశేత్‌. 39

వృష ఏష స మో క్తవ్యో న స ధార్యో గృహేభ##వేత్‌| తదర్థమేషా చరతి లోకే గాథా పురాతనీ. 40

ఏష్టవ్యా బహవః పుత్త్రా యద్యేకోపి గయాం ప్రజేత్‌ |

గౌరీ ముద్వాహయే త్కన్యాం నీలం వా వృషముత్సృజేత్‌. 41

ఏవం వృషం లక్షణసమ్ప్రయుక్తం గృహోద్భవం క్రీతమథాపి రాజ& |

ముక్త్వాన న శోచే న్మరణం మహాత్మా మోక్షం గత శ్చాస్య తవాభిధాస్యే . 42

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ వృషోత్సర్గ వృషభ లక్షణాదికథనం

నామ షడుత్తర ద్విశతతమోధ్యాయః.

స్వస్తికాకారపు కొమ్ములు ఉరుమువంటి కంఠధ్వని పెద్దకొలత మదపుటేనుగునడకవలె నడక వెడలుపు రొమ్ము పెద్ద ఎత్తు మహాబల పరాక్రమములు కలవియు శరీరమంతయు తెల్లనై తల- చెవులు- లలాటము తోకకుచ్చు- పాదములు- కన్నులు - డొక్కలు నల్లగా నుండిననవియు తోక వెంట్రుకలు నేలకు తాకుచు వ్రేలాడుచుండ తోక మాత్రము లావై ముందునకు సాగినట్లుండునవి ప్రశస్తములు: రోమశ్రేణియందు శక్త్యాయుధమును-ధ్వజమును (పెద్దజెండా) పతాకను (చిన్నజెండాను) పోలిన గుర్తులుకలవియు మరలించినపుడు కుడివైపుగా మరలునవియు చాల ఎత్తుగు తలయు మెడయు కలవియునగు కోడెలు వృద్ధిని పలువిధములగు సిద్ధులను జయమును కలిగించును; శరీరమంతయు తెల్లనై కొమ్ముల కొనలు కన్నులు మాత్రము ఎర్రనై పగడమువంటి గిట్టలు కల వృషభముకంటే మేలగునది మరి ఏదియును ఉండదు; ఇట్టివానిని వదలినను ఇంట ఉంచుకొనినను మంచిదే; ఇవి ధనధాన్య వృద్ధికరములు; పాదములు ముఖము తోక తెల్లనై శరీరమంతయు ఎర్రనైన దానిని నీల వృషభమందురు; దీనిని వృషభముగా విడువదగునే కాని ఇంట ఉంచుకొనదగదు; దీని విషయముననే పురాతనమగు గాథ (గీతము) ఇట్లు కలదు; చాలమంది పుత్త్రులు కావలెనని గృహస్థులు కోరుకొనవలెను; వారిలో ఒకడైన గయకు పోవునేమో! గౌరియగు (రజస్వల కాకముందు) కన్యకు వివాహము చేయినేమో! నీల వృషోత్సర్గము చేయునేమో!

రాజా! ఇట్లు నల్లక్షణము గల వృషభమును తన ఇంట పుట్టిన దానినే కాని కొనిన దానిని కాని ఉత్సర్గము (వదలుట) చేసినవాడు తన మరణవిషయమున శోకింపవలసిన పనియుండదు; అట్టి మహాత్ముడు తుదకు ముక్తికూడ పొందును; ఇందువలననే నేనిదిఇంతగా చెప్పుచున్నాను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మను మత్స్య సంవాద రూపమగు వృషోత్సర్గ వృషభ లక్షణమను రెండు వందల ఆరవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters