Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకోనద్విశతతమోధ్యాయః

వసిష్ఠగోత్రప్రవరవివరణమ్‌.

మత్స్యః : వసిష్ఠవంశజా న్విప్రా న్నిబోధ గదతో మమ| ఏకార్షేయశ్చ ప్రవరో వాసిష్ఠానాం ప్రకీర్తితః. 1

వసిష్ఠా ఏవవాసిష్ఠా అవివాహ్యా వసిష్ఠజైః | వ్యాఘ్రపాదా ఔపగవా వైక్లబా శ్శాడ్వలాయానాః. 2

కపిష్ఠలా ఔపలోమా అలబ్ధాశ్చ శఠాః కఠాః గౌపాయనా బోధపావ్చ దాకవ్యాశ్చైవ బాహ్యకాః. 3

బాలిశయాః పాలిశయా స్తతోవాగ్గ్రన్దయశ్చ యే | ఆపస్థూణా శ్శీతవృత్తా స్తథా బ్రాహ్మ్యపురేయకాః. 4

చౌలి ర్వౌలి ర్బ్రహ్మబలః పౌలిశ్రవన ఏవచ | పాలవో యజ్ఞదత్తశ్చ ఏకార్షేయా మహర్షయః. 6

వసిష్ట ఏషాం ప్రవర స్త్వవైవాహ్యాః పరస్పరమ్‌ |

నూట తొంబది తొమ్మిదవ అధ్యాయము.

వసిష్ట గోత్ర ప్రవరానుకీర్తనము.

మత్స్య జనార్దనుడు వైవస్వత మనువుతో ఇట్లు చెప్పెను: వసిష్ఠ వంశజులుగు ఋషుల గోత్రములవారికి ప్రవర ఋషి ఒక్కడే; పసిష్ఠులకే వాసిష్ఠులనియు వ్యవహారము; ఈ వసిష్ఠ వంశజులగు ఋషులు గోత్రములవారు అదే వర్గమునకు చెందిన గోత్రములవారితో వివాహ సంబంధములు చేసికొనరాదు.

వీరిలో మొదటి వర్గమువారు: వ్యాఘ్రపాదులు ఔపగవులు వైక్లబులు శాద్వలాయనులు కపిష్ఠలులు ఔవలోములు అలబ్దులు శఠులు కఠలు గౌపాయనులు బోధవులు దాకవ్యులు వాహ్యకలు బాలిశయులు పాలిశయులు వాగ్గ్రంధులు ఆవస్థూణులు శీతవృత్తులు బ్రాహ్మ్యపురేయకులు లోమయానులు స్వస్తిశరులు శాండలి గౌడిని పాడోహలి సుమనస్‌ ఉపావృద్ది బౌలి దౌలి బ్రహ్మబలుడు పౌలిశ్రవసుడు పౌలవుడు యజ్ఞదత్తుడు- ఈ ఋషుల (గోత్రముల వారల)కు వసిష్ఠుడు ఒక్కడే ప్రవర ఋషి; ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు.

శైలాలయో మహాకర్ణః కౌరవ్యః క్రోధిన స్తథా. 7

కపిఞ్జలా వాలఖిల్యా భాగవిత్తాయనాశ్చ యే | కీలాయనః కాలశిఖః కోరకృష్ణా స్సురాయణః. 8

శాకాహార్యా శ్శాకధియః కాణ్వా ఉపలపాశ్చ యే | శాకాయనా ఉహాకాశ్చ అథ మాషశరావయః. 9

దాకాయనా బాలవయో వాకయో గోరథా స్తథా | లమ్బాయనా శ్శ్యామవయో యేచ కోడోదరాయణాః. 10

ప్రలమ్బా శ్శజ్కరాశ్చాపి ఔపమన్యవ ఏవచ | సాజ్ఖ్యాయనాశ్చ ఋషయ స్తథావై వేదశేరకాః. 11

పాలఙ్ఘాయన ఉద్గహా ఋషయశ్చ బలేక్షవః | మాతేయా బ్రహ్మబలినః పర్ణాగిరి స్తథైవచ. 12

త్ర్యార్షేయోభిమతశ్చైషాం సర్వేషాం ప్రవర శ్శుభః | భరద్వసు ర్వసిష్ఠశ్చ ఇన్ద్రప్రమద ఏవచ. 13

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | ఔవస్థలాఃస్వస్థలయో పాలోహా లోహలాశ్చ యే. 14

మాధ్యన్దినా మాక్షతయః పైప్పలాది ర్విచక్షుషః | త్రైథృజ్గాయనశైవల్క్యాః కుణ్డినశ్చ నరోత్తమాః. 15

త్ర్యార్షేయాభిమతశ్చైషాం సర్వేషాం ప్రవరా శ్శుభాః | వసిష్ఠ మిత్రవరుణౌ కుణ్డినశ్చ మహాతపాః. 16

దానకాయా మహాచర్యా నాగేయాః పరమా స్తథా | అలంబవాయనా శ్చాపి యే చ క్రోడోదరాయణాః. 17

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | శివకర్ణో వయశ్చైవ పాదపశ్చ తథూవచ. 18

త్ర్యార్షేయాః ప్రవరా స్తేసాం సర్వేషాం ప్రవరా స్తథా| జాతూకర్ణో వసిష్ఠశ్చ తథైవాత్రిశ్చ పార్థివ. 19

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః |

వసిష్ఠవంశోభిహితో మయా తే ఋషివ్రధానా స్సతతం ద్విజేన్ద్రాః. 20

యేషాం తు నామ్నా పరికీర్తితేన పాపం సమగ్రం పురుషో జహాతి. 20 ||

ఇతి మత్స్యమహాపురాణ గోత్రప్రవరానుకీర్తనే వసిష్ఠగోత్రప్రవరవివరణం నామ ఏకోనద్విశతతమోధ్యాయః.

రెండవ వర్గమువారు: శైలాలయుడు మహాకర్ణుడు కౌరవ్యుడు క్రోధినుడు కపింజలులు వాలఖిల్యులు భాగవిత్తయానలు కీలాయనుడు కాలశిఖుడు కోరకృష్ణులు సురాయణుడు శాకాహార్యులు శాకధీయులు (శాకధులు) కాణ్వులు ఉపలపులు శాకాయనులు ఉహాకులు మాషశరావులు దాకాయనులు బాలవులు వాకులు గోరథులు లండాయనులు శ్యామపులు క్రోడోదరాయణులు ప్రలంబులు శంకరులు ఔపమాన్యులు సాంఖ్యాయనులు ఋషయులు వేదశేరకులు పాలంఘాయనులు ఉద్గాహులు బలేక్షులు మాతేయులు బ్రహ్మబలులు వర్ణాగారి-అను ఈ ఋషులు (గోత్రముల వారల)కు భరద్వసుడు వసిష్ఠుడు ఇంద్రప్రమదుడు అనువారు ప్రవర ఋషులు; ఈ ఋషుల గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు.

మూడవ వర్గమువారు: ఔపస్థలులు స్వస్థలులు పాలుడు హాలుడు హలులు మాధ్యందినుడు మాక్షతులు పైప్పలాది విచక్షుషులు త్రైశృంగాయనులు వైవల్క్యులు కుండలులు (కుండినులు) అను నరోత్తములు-ఈ ఋషుల (గోత్రముల వారల)కు వసిష్ఠుడు మిత్రావరుణుడు కుండినుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము తమలో తామును దానకాయులు మహాచ(వీ)ర్యులు నాగేయు పరములు అలంబులు వాయనులు అను వర్గముల గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొన తగదు.

నాలుగవ వర్గమువారు: శివకర్ణుడు వయుడు పాదుపుడు అను ఋషులు (గోత్రముల వారల)కు జాతూకర్ణుడు వసిష్ఠుడు అత్రి అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు.

ఈ చెప్పిన వసిష్ఠ వంశజులగు ఋషుల నామ సంకీర్తనమున నరడు సకల పాప విముక్తుడగును.

ఇతి శ్రీ మత్స్యమహాపురానము వసిష్ట గోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది తొమ్మిదవ యధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters