Sri Matsya mahapuramu-2    Chapters   

సప్తనవత్యుత్తర శతతమోధ్యాయః

విశ్వామిత్ర గోత్ర ప్రవర వివరణమ్‌.

మత్స్యః : అత్రే రేవాపరం వంశం తవ వక్ష్యామి పార్థివ|

అత్రేస్సోమ స్సుత శ్శ్రీమాం స్తస్య వంశోద్భవో నృప. 1

విశ్వామిత్రస్తు తపసా బ్రాహ్మణ్యం సమావాప్తవా | తస్య వంశ మహం పక్ష్యే తన్మే నిగదత శ్శృణు. 2

విశ్వామిత్రో దేవరాత స్తథా వైకృతి గాలవౌ | వతణ్డశ్చ సలఙ్కశ్చ హ్యభయ శ్చాయతాయనః. 3

శ్యామాయనా యాజ్ఞవల్క్యా జాబాలా సై#్సన్ధవాయనాః |

బాభ్రాయశ్చ కరీషాశ్చ సంశ్రుత్యా అథ సంశ్రుతాః. 4

ఉలూపా ఔపగహయాః పయోద జనపాదపాః | ఖరవాచో హలయామా స్సాధితా వాస్తుకౌశికాః. 5

త్ర్యార్షేయాః ప్రవరా స్తేషాం సర్వేషాం పరికీర్తితాః | విశ్వామిత్రో దేవరాత ఉద్దాలశ్చ మహాయశాః. 6

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | దేవశ్రవా స్సుజాతేయా స్సౌసుకాః కారుకాయనాః. 7

తథా వైదేహరతా యే కుశికాశ్చ నరాధిప | త్ర్యేర్షేయోభిమత స్తేషాం సర్వేషాం ప్రవర శ్శుభ. 8

దేవశ్రవా దేవరాతో విశ్వామిత్ర స్తథైవచ | పరస్పర మవైవవాహ్యా ఋషయః పరికీర్తితాః. 9

నూట తొంబది ఏడవ అధ్యాయము.

విశ్వామిత్ర గోత్ర ప్రవరాను కీర్తనము.

మత్య్సుడు మనువున కిట్లు చెప్పెను: అత్రి నుండియే ఏర్పడిన మరియొక వంశమును తెలిపెదను వినుము; అత్రి పుత్త్రుడగు సోముని వంశము నందలి విశ్వామిత్రుడు తపస్సుచే బ్రాహ్మణత్వము నందెను. అతనివంశమున జనించిన గోత్రకారులను వారి ప్రవర ఋషులను తెలిపెదను:

మొదటి వర్గము వారు : విశ్వామిత్రుడు దేవరాతుడు వైకృతి గాలవుడు వతంతుడుడు నలంకుడు అభయుడు చాయతాయనుడ శ్యామాయనులు యాజ్ఞవల్క్యులు ఆ బాలులు బాభ్రవ్యులు కరీషులు సంశ్రుత్యులు ఉలూపులు జౌపగహయులు పయోదులు జనలు పాదవులు ఖరవాచులు హలయములు సాధితులు వాస్తు కౌశికులు - ఈ ఋషులు (గోత్రముల వారల)కు విశ్వామిత్రుడు దేవరాతుడు ఉద్దాలుడు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పర వివాహ సంబంధములు చేసికొనరాదు.

రెండవ వర్గము వారు : దేవశ్రవులు సుజాతీయులు సౌసుకులు కారుకాయనులు వైదేహరాతులు కుశికులు - ఈ ఋషుల (గోత్రముల వారల)కు దేవశ్రవుడు విశ్వామిత్రుడు దేవరాతుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసినకొనరాదు.

ధనఞ్జయః కపర్దేయః పరికూటశ్చ పార్థివ | పాణినిశ్చైవ త్ర్యార్షేయాం స్సర్వే చైతే ప్రకీర్తితాః. 10

విశ్వామిత్ర స్తథా೭೭ద్యశ్చ మాధుచ్ఛన్దస ఏవచ | త్ర్యార్షేయః ప్రవరా హ్యేతే ఋషయః పరికీర్తితాః. 11

విశ్వామిత్రో మధుచ్ఛన్దా స్తథా చైవాఘమర్షణః | విశ్వామిత్రః పూరణశ్చ తథా ద్విప్రవరౌ స్మృతౌ. 12

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | కమలాయజినశ్చైవ ఆశ్మరథ్య స్తథైవచ. 13

వంజులిశ్చాపి త్ర్యార్షేయ స్సర్వేషాం ప్రవరో మతః | విశ్వామిత్ర శ్చాశ్మరథ్యో వఞ్జళిశ్చ మహాతపాః. 14

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | విశ్యామిత్రో లోహితాశ్చ అష్టకః పూరణస్తథా. 15

విశ్వామిత్రః పూరణశ్చ తయోర్ద్వౌ ప్రవరౌ స్మృతో | పరస్పర మవైవాహ్యాః పూరణాశ్చ పరస్పరమ్‌. 16

లోహితా అష్టకాశ్చైషాం త్ర్యార్షేయాః పరికీర్తితాః | విశ్వామిత్రో లోమితశ్చ అష్టకశ్చ మహాతపాః. 17

అష్టకా లోహితై ర్నిత్య మవైవాహ్యాః పరస్పరమ్‌ | ఉదరేణుః క్రథకశ్చ ఋషి శ్చోదావహి స్తథా. 18

శాట్యాయనిః కరీరాశీ సాలఙ్కాయనిలావకీ | మౌఞయనిశ్చ భగవాం స్త్రార్షేయాః పరికీర్తితాః. 19

ఖిలిఖిలి స్తథావిద్యో విశ్వామిత్ర స్తథైవచ | పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 20

ఏతే తవోక్తాః కుళికా నరేన్ద్ర మహానుభావ స్సతతం ద్విజేన్ద్రాః|

యేషాం తు నామ్నాం పరికీర్తనేన పాపం సమగ్రం పురుపో జహాతి. 21

ఇతి శ్రీమత్స్య మహాపురాణ గోత్రప్రవరానుకీర్తనే విశ్వామిత్రగోత్రప్రవరవివరణం నామ సప్తనవత్యుత్తర శతతమోధ్యాయః.

మూడవ వర్గము వారు: ధనంజయుడు కపర్దేయుడు పరికూడటుడు పాణిని - ఈ ఋషుల (గోత్రములవారల)కు విశ్వామిత్రుడు మధుచ్ఛందనుడు అఘమర్షణుడు అనువారు కాని విశ్వామిత్రుడు ధనంజయుడు మధుచ్ఛందనుడు అనువారు కాని ప్రవర ఋషులు; ధనంజయుడు ఈ వర్గములో ఆద్యుడు - మొదటివాడు - ఈ గోత్రముల వారు పరస్పర వివాహసంబంధములు చేసికొనరాదు.

నాలుగవ వర్గము వారు: విశ్వామిత్రుడు-పురాణుడు అను ఋషులు (గోత్రముల వారల)కు విశ్వామిత్ర పూరణులే ప్రవర ఋషులు-ఈ గోత్రముల వారు పరస్పర వివాహ సంబంధము చేసికొనరాదు.

ఐదవ వర్గము వారు: కమలాయజినుడు ఆశ్మరథ్యుడు వంజులి-ఈ ఋషులు (గోత్రముల వారల)కు విశ్వామిత్రుడు ఆశ్మరథ్యుడు వంజులి-అను మువ్వురు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు.

ఆరవ వర్గమువారు: విశ్వామిత్రుడు లోహితుడు అష్టకాడు పూరణుడు-అను ఈ ఋషులు (గోత్రముల వారల)కు విశ్వామిత్రుడు పూరణుడు అను ఇద్దరు ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు; పూరణ గోత్రములవారు తమలో తాము వివాహ సంబంధములు చేసికొనరాదు.

ఏడవ వర్గమువారు: లోహితులు-అష్టకులు-ఈఒద్దర ఋషుల (గోత్రముల వారలకు)విశ్వామిత్రుడు లోహితుడు అష్టకుడు అను మువ్వురు ఋషులు; అష్టకులు-లోహితులు-వీరు పరస్పర వివాహ సంబంధము చేసికొనరాదు.

ఎనిమిదవ వర్గమువారు: ఉదరేణుడు క్రథకుడు-ఉదావహి-శాట్యాయని-కరీరాశి-శాలంకాయనుడు-లావకి-మౌంజాయని-ఈ ఋషుల (గోత్రముల వారల)కు ఖిలిఖిలి విశ్వామిత్రుడు విద్యుడు అను మువ్వురును ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము ఇచ్చి పుచ్చుకొనరాదు.

ఈ విశ్వామిత్ర గోత్రజులగు ద్విజ ఋషుల నామములను స్మరించినను నరుడు సకల పాపముక్తడగును.

ఇది శ్రీ మత్య్సమమాపురాణము విశ్వామిత్రగోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది ఏడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters