Sri Matsya mahapuramu-2    Chapters   

షణ్ణవత్యుత్తర శతతమోధ్యాయః

అత్రిగోత్ర ప్రవర వివరణమ్‌.

మత్య్సః: అత్రివంశ సముత్పన్నా న్గోత్రకారా న్నిబోధ మే |

కర్థమాయనశాఖేయా స్తథా శారాయణాశ్చ యే. 1

ఉద్దాలకి శ్శౌణకర్ణి రథశౌక్రవశ్చ యే | గౌరగ్రీవా గౌరజిన స్తథా చైత్రాయణాశ్చ యే. 2

అర్ధపణ్యా వామరథ్యా గోపానాస్తికిబిన్దవః | కణజిహ్వో హరప్రీతి ర్నైద్రాణి శ్శాకలాయనిః. 3

తైలపశ్చ సవైలేయ అత్రి ర్గోణిపతి స్తథా| జలదో భగపాదళ్చ సౌపుష్పిశ్చ మహాతపాః. 4

ఛన్దోగేయ స్తథైతేషాం త్ర్యార్షేయాః ప్రవారా మతాః | శ్యావాశ్వశ్చ తథాత్రిశ్చ అర్చనానశ ఏవచ. 5

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | దాక్షి ర్బలిః పర్ణవిశ్చ ఊర్ణనాభి శ్శిలార్దనిః. 6

బీజవాపి శిరీషశ్చ మౌఞ్జకేశో గవిష్ఠిరః | భలన్దన స్తథైతేషాం త్ర్యేర్షేయాః ప్రవరా మతాః. 7

అత్రి ర్గవిష్ఠిరశ్చవ తథా పూర్వాతిథి స్స్మృతః | పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 8

అత్రేయుపత్త్రికాపుత్త్రా నత ఊర్ధ్వం నిబోధ మే | కాలేయాశ్చ సవాలేయా వాసరథ్యా స్తథైవచ. 9

ధాత్రేయాశ్చైవ మైత్రేయా స్త్ర్యార్షేయాః పరికీర్తితాః | అత్రిశ్చ వామరథ్యశ్చ పైత్రిశ్చైవ మమా నృషిః. 10

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః |

ఏతేత్రివంశప్రభవా స్తవోక్తా మహానుభావా నృప! గోత్రకారాః 11

యేషాం తు నామ్నా పరికీర్తితేన పాపం సమగ్రం పురుషో జహాతి. 11 ||

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ గోత్రప్రవరానుకీర్తనే అత్రిగోత్రప్రవర వివరణం నామ షణ్ణవత్యుత్తర శతతమోధ్యాయః.

నూట తొంబది ఆరవ అధ్యాయము.

అత్రి గోత్ర ప్రవరానుకీర్తనము.

మత్స్యరూప జనార్ధనుడు వైవస్వత మనువుతో ఇంకను ఈ విధయముగా చెప్పెను: అత్రి వంశోత్పన్నులయిన గోత్రకారులను తెలిపెదను వినము. (వీరు మూడు వర్గములుగా నున్నారు.) మొదటి వర్గమువారు; కర్దమాయనులు శారాయణులు ఉద్దాలకులు శౌణులు కర్ణీరథులు శౌక్రతువులు గౌరగ్రీవులు గౌరజినులు చైత్రాయణులు అర్ధపణ్యులు వామరథ్యులు గోపనులు అస్తకులు బిందువులు కణజిహ్వుడు హరప్రతి నైద్రాని శాకలాయని తైలపుడు వైలేయుడు అత్రి గోనీపతి జలదుడు భగపాదుడు మమాతస్కుడు సౌపుష్పి ఛందోగేయుడు-ఈ ఋషుల (గోత్రముల వారలకు) శ్వావాశ్వుడు అత్రి అర్చనానశుడు అనువారు ప్రవర ఋషులు; ఈ ఋషుల (గోత్రముల వార)లు పరస్పరము వివాహ సంబంధములు చేసినకొనరాదు.

రెండవ వర్గమువారు; దాక్షి బలి పర్ణవి ఊర్ణనాభి శిలార్దని బీజవాపిన్‌ - శిరషుడు మౌంజకేశుడు గవిష్ఠిరుడు భలందనుడు - ఈ ఋషుల (గోత్రముల వారల)కు అత్రి గవిష్ఠిరుడు అనువారు ప్రవర ఋషులు; వీరు పరస్పరము వివాహ సంబంధముల చేసినకొనరాదు.

మూడవ వర్దమువారు : ఆత్రేయ పుత్త్రికాపుత్త్రుల వర్గము వారిని తెలిపెదవినుము; కాలేయులు వాలేయులు వాసరథ్యులు - ధాత్రేయులు మైత్రేయులు - ఈ ఋషుల గోత్రముల వారలకు అత్రి వామరథ్యుడు-పైత్రి అనువారు ప్రవర ఋషులు; వీరుపరస్పరము వివాహ సంబంధములు జరుపుకొనరాదు.

ఈ అత్రి వంశోత్పన్నులగు గోత్రప్రతిష్ఠాపక ఋషుల నామస్మరణ మాత్రమున నరుడు పాపవిముక్తడగును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున అత్రి గోత్ర ప్రవారను కీర్తనమను నూట తొంది యారవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters