Sri Matsya mahapuramu-2    Chapters   

పంచనవత్యుత్తరశతతమోధ్యాయః

అంగిరోగోత్రప్రవరవివరణమ్‌.

మత్స్యః : మరీచితనయా రాజ న్త్సురూపా నామ విశ్రుతా |

భార్యా చాఙ్గిరసో దేవా స్తస్యాః పుత్త్రా దశ స్స్మృతాః. 1

ఆత్మాయ ర్దమనో దక్ష స్సదఃప్రాణ స్తథైవచ | హవిష్మాంశ్చ గవిష్ఠశ్చ ఋత స్సత్యశ్చ తే దశ. 2

ఏతే చాఙ్గిరసో నామ దేవా వై సోమపాయినః | సరూపా జనయామాస ఋషీ న్త్సర్వేశ్వరా నిమా&. 3

బృహస్పతిం గౌతమంచ సంవర్త మృషిముత్తమమ్‌ | ఉచథ్యం వామదేవంచ ఆజస్య మృషిజం తథా. 4

ఇత్యేతే ఋషయ స్సర్వే గోత్రకారాః ప్రకీర్తితాః | తేషాం గోత్రే సముత్పన్నా న్గో త్రకారాన్నిబోధమే. 5

ఉచథ్యో గౌతమశ్చైవ తౌలేయోభిజిత స్తథా | సార్ధనేమి స్సలౌగాక్షిః క్షీరః కౌష్ఠికి రేవచ. 6

రాహుకర్ణి స్సౌపురిశ్చ కైరాతి స్సామలోమకిః | పౌషజితి ర్భార్గవతో హ్యృషి శ్చైరీడవ స్తథా. 7

కారోటక స్సజీవీచ ఉపబిన్దుసురైషిణౌ | వాహినీపతి వైశాలీ క్రోష్టా చైవారుణి స్తథా. 8

సోమోత్రాయనికాసోరుకౌసల్యాః పార్థివా స్తథా | రౌహిణ్యాయని రేవాగ్నీ మూలపః పాణ్డు రేవచ. 9

క్షపావిశ్వరకరోరిశ్చ పారిః కారారిరేవచ | అఙ్గిరాస్సువచోచథ్యో ఉశిజశ్చ మహానృషిః |

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 11

ఆత్రేయాయని సౌవేష్ట్యా వగ్నివేశ్య శ్శిలాస్థలిః | ఆలిశాయనిశ్చైకేపీ వారాహి ర్బాష్కలి స్తథా. 12

సౌటిశ్చ తృణకర్ణిశ్చ స్రావహి శ్చాశ్వలాయనిః | వారాహి ర్బర్హిసాదీచ శిఖాగ్రీవిస్తథైవచ.. 13

కారకిశ్చ మహాకాపి స్తథా చోడుపతిః ప్రభుః | కౌచకి ర్ధూమితశ్చైవ పుష్పాన్వేషి స్తథైవచ. 14

సోమతన్వి ర్బ్రహ్మతన్మి స్సాలడి ర్బాలడి స్తథా | దేవరాతి ర్దేవస్థానిర్హారికర్ణి స్సరిద్వవిః. 15

ప్రావేపి స్సాద్యసుగ్రీవి స్తథా గోమేదగన్ధికః | మత్స్యాచ్చాదో మూలహరిః ఫలాహార స్తథైవచ. 16

గాఙ్గోదధిః కౌరుపతిః కరుక్షేత్రి స్తథైవచ | నాయకి ర్జైత్యద్రౌణిశ్చ జైహ్మలాయని రేవచ. 17

ఆపస్తమ్బి ర్మౌఞ్జవృష్టి ర్మార్షపిఙ్గశిరేవచ | పైలశ్చైవ మహాతేజా శ్శాలఙ్కాయని రేవచ. 18

ద్వ్యాఖేయో మారుత శ్చైషాం త్య్రార్షేయః ప్రవరో నృప |

ఆఙ్గిరాః ప్రథమ స్తేషాం ద్వితీయశ్చ బృహస్పతిః. 19

తృతీయశ్చ భరద్వాజః ప్రవరాః పరికీర్తితాః | పరస్పర మవైవాహ్యా ఇత్యేతే పరికీర్తితాం. 20

నూట తొంబదియైదవ అధ్యాయము.

అంగిరోగోత్ర ప్రవరాను కీర్తనము.

(ఈ శ్రీమత్స్యమహాపురాణమున అంగిరో గోత్ర ప్రవర్తక ఋషులు పదునేడు గణములుగనున్నారు.)

మత్స్య జనార్దనుడు వైవస్వతునకు ఇట్లు వచించెను : రాజా! మరీచి ప్రజాపతి పుత్త్రి సురూప అను నామె అంగిరోమునికి పత్ని యయ్యెను. ఈ దంపతులకు పదిమంది దేవతలు కుమారులయిరి. వారు: ఆత్మ - ఆయువు - దమనుడు దక్షుడు సదుడు ప్రాణుడు హవిష్మాన్‌ గవిష్ఠుడు ఋతుడు సత్యుడు. అంగిరసులను ప్రసిద్ధ నామముగల ఈ దేవతలు యజ్ఞములందు సోమపానము చేయువారు; ఈ సురూపయందే (ఈశ్వరులను వారు ఋషులలో ఉత్తమ శ్రేణికి చెందిన వారని లోగడ చెప్పబడినది.) అందరును ఈశ్వరులను శ్రేణికి చెందిన ఈ ఋషులు కలిగిరి. 1. బృహస్పతి 2. గౌతముడు 3. సంవర్తుడు 4. ఉచథ్యుడు 5. వామదేవుడు 6. ఆజస్యుడు 7. ఋషిజుడు. ఈ ఋషులందరును గోత్ర ప్రతిష్ఠాపకులు; వీరి గోత్రములందుత్పన్నులైన గోత్రకారుల వర్గములు ఇవి:

మొదటి వర్గము: ఉచథ్యుడు గౌతముడు తౌలేయుడు అభిజితుడు సార్ధనేమి లౌగాక్షి క్షీరుడు కౌష్టికి రాహుకర్ణి సౌపురి కైరాతి సామలోమకి పౌషజితి భార్గవతుడు (ఋషి) ఐరీడవుడు కారోటకుడు సజీవి ఉపబిందువు సురైషిన్‌ వాహినీ పతి వైశాలి క్రోష్టా ఆరుణి సోముడు అత్రాయని కాసోరువు కౌజేరువు కౌశల్యుడు పార్థివుడు రౌహిణ్యాయని అగ్ని మూలపుడు పాండుడు క్షపా విశ్వకరుడు అరి పారి కారారి అను ఋషుల (గోత్రము వారల)కు అంగిరసుడు ఉచథ్యుడు గౌతముడు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారలకు పరస్పర వివాహ సంబంధములు పనికిరావు.

రెండవ వర్గము: ఆత్రేయాయని సౌవేష్ట్యుడు అగ్నివేశ్యుడు శిలాస్థలి బాలిశాయని ఏవేషి వారాహి బాష్కలి సౌటి తృణకర్ణి ప్రావహి ఆశ్వలాయని వారాహి బర్హిసాది శిఖాగ్రీవి కారకి మహాకా(క)పి ఉడుపతి కౌచకి ధూమితుడు పుష్పాన్వేషి సోమతన్వి బ్రహ్మతన్వి సాలడి బాలడి దేవరాతి దేవస్థాని హారికర్ణి నరిద్భవి ప్రావేపి సాద్యసుగ్రీవి గోమేదగంధికుడు మత్స్యాచ్చదుడు మూలహ(లాహా)రి ఫలాహారి గాంగోదధి కౌరువతి కౌరుక్షేత్రి నాయకి జైత్ర ద్రౌణి జైహ్మలాయని ఆపస్తంబి మౌంజవృష్టి మార్షుడు పింగళి పైలుడు శాలంకాయని ద్వ్యాఖ్యేయుడు మారుతుడు- అను ఈ ఋషుల (గోత్రముల వారల) కు అంగిరసుడు బృహస్పతి భరద్వాజుడు ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధములు తగవు.

కాణ్వాయనాః కోపచయా స్తథా వాత్స్యతరాయణాః |

భ్రాష్ట్రకృద్రాష్ట్రపిణ్డీచ లైన్ద్రాణి స్సాయకాయనిః. 21

క్రోష్టాక్షీ బహువీతీచ తాలకృ న్మధురావహః | లావకృ ద్గాలవి ద్గాథీ మార్కటిః పౌలికాయనిః. 22

స్కన్దనశ్చ తథా చక్రీ గార్గ్య శ్శ్యామాయని స్తథా | బలాకి స్సహరిశ్చైవ పఞ్చార్షేయాః ప్రకీర్తితాః. 23

అఙ్గిరాశ్చ మహాతేజా దేవాచార్యో బృహస్పతిః | భరద్వాజ స్తథా గర్గ శ్శైన్యశ్చ భగవా నృషిః. 24

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | కపీతర స్స్వస్తితరో దాక్షి శ్శక్తిః పతఞ్జలిం. 25

భూయసి ర్జలసన్ధిశ్చ బిన్దు ర్మాదిః కుసీదకిః | ఊర్వస్తు రాజకేశీచ వౌషటి శ్శంసపి స్తథా. 26

శాలిశ్చ కలశీ కణ్ఠఋషిః కారీరయ స్తథా | కాట్యోధాన్యాయనిశ్చైవ భావాస్యాయని రేవచ. 27

భారద్వాజశ్చ సౌబుద్ధి ర్లఘ్వీ దేవమతి స్తథా | త్య్రార్షేయో మునయ శ్చైషాం ప్రవరో భూమిపోత్తమ. 28

అఙ్గిరా దమబాహ్యశ్చ తథా చైవా ప్యురుక్షయః | పరస్పరాయణ్యవర్ణీ లైక్షిర్గార్గ్యహరి స్తథా. 29

గాలవిశ్చైవ త్య్రార్షేయ స్వర్వేషాం ప్రవరో మతః | అఙ్గిరా స్సఙ్కృతిశ్చైవ గౌరవీతి స్తథైవచ. 30

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | కాత్యాయనో హరితకః కౌత్సః పింగస్తథైవచ. 31

హండిదాసో వాత్స్యాయని ర్మాద్రి ర్మౌలిః కుబేరణిః | భీమవేగః శార్వదర్భి స్సర్వే త్రిప్రవరా మతాః. 32

అంగిరా బృహదశ్వశ్చ జీవనాశ్వస్తథైవచ పరస్పరమవైవాహ్య ఋషయః పరికీర్తితాః. 33

బృహద్దక్థో వామదేవ స్తథా త్రిప్రవరా మతాః | అజ్గిరా బృహదుక్థశ్చ వామదవ స్తథైవచ. 34

పరస్పర మవైవాహ్యా ఇత్యేతే పరికీర్తితాః | కుత్సగోత్రోద్భ వాశ్చైవ తథా త్రిప్రవరా మాతా. 35

అంగిరాశ్చ సదస్సుశ్చ పురుకుత్స స్తథైవచ | పరస్సర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 36

సంకృతిశ్చ త్రిమార్ట్సిశ్చ మనుః సంబంధిరేవవా | తండిశ్చ నాకిశ్చైవ తైలకో దక్ష ఏవచ. 37

కుత్సాః కుత్సై రవైవాహ్యా ఏవ మాహుః పురాతనాః | రథీతరాణాం ప్రవరాస్‌ త్ర్యార్షేయాః పరికీర్తితాః. 38

అఙ్గిరాశ్చ విరూపశ్చ తథైవచ రథీతరః | రథీతరా హ్యవైవాహ్యా నిత్యమేవ రథీతరైః. 39

విష్ణువృద్ధిశ్శివమతి ర్జతృణః కర్తృణ స్తథా | పుత్రవశ్చ మహాతేజా స్తథా వైరపరాయణః. 40

త్ర్యార్షేయోభి మత స్తేషాం సర్వేషాం ప్రవర శ్శుభః |

సాత్యముగ్రి ర్మహాతేజా హిరణ్యస్తంబముద్గలౌ. 41

త్ర్యార్షేయోహి మతస్తేషాం సర్వేషాం ప్రవరో నృప | అఙ్గిరా మత్య్సదగ్ధశ్చ ముద్గలశ్చ మహాతపాః. 42

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః.

మూడవ వర్గమువారు: కాణ్వాయనులు కోపచయులు వాత్య్సతరాయణులు భ్రాష్ఠ్రకృత్‌ రాష్ట్రపిండి లైద్రాణి సాయకాయని క్రోష్టాక్షీ బహువీతిన్‌ తాలకృత్‌ మధురావహుడు లావకృత్‌ గాలవిత్‌ గాథి-మార్కటి పౌలికాయని స్కందనుడు చక్రిన్‌ గార్గ్యుడు శ్యామియని లాకి హరి-ఈ ఋషుల (గోత్రముల వారల)కు అంగిరసుడు బృహస్పతి భద్వాజుడు గర్గుడు శైన్యుడు అను ఐదుగురు ప్రవర ఋషులు. ఈ ఋషుల గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు.

నాలుగవ వర్గమువారు: కపివరుడు స్వస్తితరుడు దాక్షి శక్తి వతంజలి భూయసి జలసంధి బిందుడు మాది కూసీదకి ఊర్వుడు రాజకేశిన్‌ వౌషటి శంసపి శాలి కలశీకంఠడు కారీరయుడు కాట్యుడు ధాన్యాయని భావాస్యాయని భారద్వాజుడు సౌబుద్ధి లఘ్విన్‌ దేవమతి - ఈ ఋషుల (గోత్రములవారల) కు అంగిరసుడు దమబాహ్యుడు ఉరుక్షయుడు అనుమువ్వురు ప్రవరఋషులు; ఈ ఋషుల గోత్రముల వారలకు పరస్పర వివాహసంబంధములు పనికిరావు.

ఐదవ వర్గము వారు: సంకృతి - త్రిమార్షి మనువు (సంబంధి) తండ్రి - నాతకితైలకుడు దక్షుడు పరస్పరాయణి అవర్ణితాక్షి గార్గ్యహరి గాలవి అను ఋషుల (గ్రోత్రముల వారల)కు అంగిరసుడు సంకృతి గౌరవీతి అను మువ్వురును ప్రవరఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు.

ఆరవ వర్గమువారు: కాత్యాయనుడు హరితకుడు కౌత్సుడు పింగుడు హండిదాసుడు వాత్య్సాయని మాద్రి మౌళి కుబేచరణి భీమవేగుడు శార్వదర్భి - ఈ ఋషల (గోత్రముల వారల)కు అంగిరసుడు బృహదశ్వుడు జీవనాశ్వుడు ప్రవరఋషులు; వీరికి పరస్పర వివాహములు పనికిరావు.

ఏడవ వర్గమువారు: బృహదుక్థుడు - వామదేవుడు - అను ఈ ఋషులు (గోత్రముల వారల)కు అంగిరసుడు బృహదక్థుడు వామదేవుడు అను మువ్వురు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారలకు పరస్పర వివాహ సంబంధములు తగవు.

ఎనిమిదవ వర్గమువారు: కుత్సగోత్రమువారికి అంగిరసుడు సదస్యుడు పురుకుత్సుడు అనువారు ప్రవరఋషులు; ఈ కుత్సుగోత్రమువారు తమలో తాము ఇచ్చిపుచ్చుకొనరాదు.

తొమ్మిదవ వర్గమువారు: రథీతరగోత్రము వారికి అంగిరసుడు విరూపుడు రథీతరుడు అనువారు ప్రవర ఋషులు; రథీతరగోత్రమువారు తమలో తాము వివాహ సంబంధములు చేసికొనరాదు.

హంసజిహ్వో దేవజిహ్వో హ్యగ్నిజిహ్వోవిరాడపః | ఆపాగ్నేయ స్త్వశ్వయుశ్చ పరణ్యస్తావిమౌద్గలాః 43

త్ర్యార్షేయాభిమతా స్తేషాం సర్వేషాం ప్రవరా శ్శుభాః | అఙ్గిరాశ్చైవ తాణ్డిశ్చ మాద్గల్యశ్చ మహాతపాః.

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | ఆపాణ్డుశ్చ గురుశ్చైవ తృతీయ శ్శాకటాయనః. 45

తతః ప్రగాథమానారీ మార్కణ్డ శ్శరణ శ్శివః | కటుమర్కటపశ్చైవ తథా నాడాయనో హ్యృషిః. 46

శ్యామాయన స్తథైవైషాం త్ర్యార్షేయాః ప్రవరా మతాః | అఙ్గిరాశ్చాజమీఢశ్చ కట్యశ్చైవ మహాతాపాః. 47

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | తిత్తిరిః కపిభూశ్చైవ గార్గ్యశ్చైవ మహానృషిః. 48

త్ర్యార్షేయో హి మత స్తేషాం సర్వేషాం ప్రవర శ్శుభః | అఙ్గిరా స్తిత్తిరిశ్చైవ కవిభూశ్చ మహా నృషిః 49

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | అథ ఋక్షభదర్వాజౌ ఋషివా న్మానవ స్తథా. 50

ఋషి ర్మైత్రవరశ్చైవ పఞ్చార్షేయాః ప్రకీర్తితాః | అఙ్గిరా స్సభరద్వాజా స్తథైవచ బృహస్పతిః. 51

ఋషి ర్మిత్రవరశ్చైవ ఋషివా న్మానవ స్తథా | పరస్ప మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 52

భారద్వాజో హుతశ్చౌజ్గ శ్శైశిరేయ స్తథైవచ | ఇత్యేతే కథితా స్సర్వే ద్వ్యాముష్యాయణగోత్రజాః. 53

పఞ్ఞార్షేయా స్తథా హ్యేసాం ప్రవరాః పరికీర్తాః | అఙ్గిరాశ్చ భరద్వాజ స్తథైవచ బృహస్పతి. 54

మాద్గల్య శ్శైశిరిశ్చైవ ప్రవరాః పరికీర్తితాః | పరస్పర వైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 55

ఏతే తవోక్తాఙ్గిరసస్తు వంశే మమానుభావా ఋషిగోత్రకారాః |

యేషాం తు నామ్నా పరికీర్తితేన పాపం సమగ్రం పురుషో జహాతి. 56

ఇతి శ్రీమత్స్య మహాపురాణ గోత్రప్రవరానుకీర్తనే అఙ్గిరోగోత్రప్రవర వివరణం నామ పఞ్చనవత్యుత్తర శతతమోధ్యాయః.

పదియవ వర్గమువారు: విష్ణువృద్ధి శివమతి జతృణుడు కర్తృణుడు పుత్త్రవుడు (మహాతేజసుడు) వైరపరాయణుడు - ఈ ఋషుల (గోత్రముల వారల)కు అంగిరసుడు విరూపుడు వృషపర్వుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారికి పరస్పర వివాహ సంబంధములు తగవు.

పదునొకండవ వర్గము వారు: సాత్యముగ్రి - హిరణ్యస్తంబుడు-ముద్గలుడు-ఈ ఋషుల (గోత్రముల వారల)కు అంగిరసుడు మత్స్యదగ్ధుడు ముద్గలుడు అనువారు ప్రవరఋషులు; ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు.

పండ్రెండవ వర్గము వారు: హంసజిహ్వుడు దేవజిహ్వుడు అగ్ని జిహ్వుడు విరాట్‌ - ఆ(ఆ)పుడు అపాగ్నేయుడు అశ్వయుడు పరణ్యుడు తావి మౌద్గలుడు - ఈ ఋషులు (గోత్రముల వారల)కు అంగిరసుడ తాండి మౌద్గల్యుడు అను వారు ప్రవరఋషులు; ఈ గోత్రములవారికి, పరస్పరము వివాహ సంబంధములు పనికిరావు.

పదునాలుగవ వర్గము వారు : ఆపాండవు గురువు శాకటాయనుడ ప్రగాథుడు మానారి మార్కండుడు శరణుడు శివుడు కటువు మర్కటపుడు నాడాయనుడు శ్యామాయనుడు అను ఈ ఋషుల (గోత్రముల వారల)కు అంగిరసుడు అజమీడుడు కాట్యుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు.

పదునైదవ వర్గము వారు: తిత్తిరి - కపిభూ - గార్గ్యుడు అను ఋషుల (గోత్రముల వారల)కు అంగిరసుడు తిత్తిరి కవిభూ అను వారు ప్రవర ఋషులు: ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధములు పనికిరావు.

పదునారవ వర్గము వారు : ఋక్షుడు భరద్వాజుడు మానవుడు మైత్రవరుడు - అను ఈ ఋషులు (గోత్రముల వారల)కు అంగిరసుడ భరద్వాజుడు బృహస్పతి మిత్రవరుడు మానవుడు అను ఐదుగురు ప్రవర ఋషులు; ఈ గోత్రముల వారికి పరస్పర వివాహ సంబంధముల పనికిరావు.

పదునేడవ వర్గమువారు: భారద్వాజుడు హుతుడ శౌంగుడు శైశిరేయుడు అనువారు ద్య్వాముష్యాయణగోత్రములయందు జన్మించిన ఋషులు; ఈ ఋషులు (గోత్రముల వారల)కు అంగిరసుడ భరద్వాజుడు బృహస్పతి మౌద్గల్యుడు శైశిరి అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారికి పరస్పర వివాహ సంబంధముల పనికిరావు.

ద్య్వాముష్యాయణులు తన కన్న తండ్రికిని పెంపుడు తండ్రికిని తారకులై రెండు వంశముల వారికి చెందిన గోత్రముల వారుగా గణింపడువారు.

ఈ అంగిరో వంశ గోత్ర కారుల నామములను కీర్తించినను నరుడు సర్వపాపముక్తుడగును.

ఇది శ్రీ మత్య్స మహాపురాణమున గోత్ర ప్రవరాను కీర్తనమున అంగిరోగోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది యదైవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters