Sri Matsya mahapuramu-2    Chapters   

గోత్ర ప్రవరాదికము.

నూట తొంబది నాలుగవ అధ్యాయము.

ఋషి గోత్ర ప్రవర విషయ పరిచయము.

(బ్రహ్మ మానస పుత్త్రులగు సప్త మహర్షులను బట్టి ఏర్పడిన సప్త ప్రధాన గోత్ర వర్గములును - ఎనిమిదవవాడుగా అగస్త్యుడు కూడ గ్రహింపబడగా మొత్తమెనిమిది ప్రధాన ఋషి గోత్రముల వర్గములగునని సంప్రదాయము చెప్పుచున్నది. బౌధాయనముని ఈ విషయమున ఇట్లు చెప్పెను:

''విశ్వామిత్రో జమదగ్ని ర్భరద్వాజోథగౌతమః |

అత్రిర్వసిష్ఠః కశ్యప ఇత్యేతే సప్తఋషయః.

సప్తానామృషీణా మగస్త్యాష్టమానాం యదపత్యం తత్‌ గోత్రం ఇత్యాచక్షతే.''

ఈ చెప్పిన ప్రధాన ఋషుల అపత్యము (అపత్యమనగా స్త్రీ సంతానము కూడ కావచ్చును. కాని ఇచట పురుష సంతతి మాత్రమే గ్రహించవలెను.) (అనగా కుమారులును వారికి తరువాతి తరములవారును.) గోత్రము అని వ్యవహరింపబడును.

గోత్రములను పేర్కొనునపుడు ప్రవర ఋషులను కూడ పేర్కొనుట సంప్రదాయము; ప్రవర శబ్దమునకు అర్థము విషయమున మాధవాచార్యులు ''ప్రవరము అనునది అయా గోత్రములను ప్రవర్తిల్లచేసిన ముని వ్యక్తిని అదే పేరు గల మరియొక మునినుండి వేరుపరచు ముని సమూహము'' అని చెప్పిరట. కాని అది దోషగ్రస్త లక్షణము అని 'స్మృతి కౌస్తుభ'' మను ధర్మశాస్త్ర గ్రంథమును రచించిన అనంతదేవుడు ఖండించెను. అనంతదేవుడు ప్రవరను గూర్చి ఇట్లు చెప్పెను: ''ప్రవరణము - ప్రవరము - రెండు పదములును సమానార్థకములు. ఈ పదములకు ప్రార్థనము అని అర్థము; ఆయా శ్రౌతస్మార్త కర్మానుష్ఠానములందు యజమానుడు స్వయముగా గాని యజమానుని పక్షమున ఋత్విక్కులు కాని అగ్నిని ఉద్దేశించి ప్రార్థన మొనర్పవలెను. దాని యందు యజమానుని వంశ పూర్వులలో జనించియుండిన మంత్ర కర్త (ద్రష్ట) లగు ఋషులను పేర్కొనవలెను. ఆ ఋషులే ప్రవర ఋషులు.'' అని అనంతదేవుడును అతని తమ్ముడు 'సంస్కార కౌస్తుభ'రచయితయగు జీవదేవుడును చెప్పిన వచనముల సారాంశము.

గోత్ర ప్రవరాదికము.

క్షత్త్రియ వైశ్యుల గోత్రములు.

ఈ చెప్పిన విషయము బ్రాహ్మణులకు సంబంధించిన గోత్రముల విషయమున అన్వయించును. వీరితో పాటు ద్విజులే అయి ఉండిన క్షత్త్రియ వైశ్యులలో క్షత్త్రియులను 'మానవ్య' గోత్రము వారినిగాను వైశ్యులను 'భలందన' గోత్రము వారినిగాను చెప్పవలెననియు - వీరికి పూర్వము పురోహితులుగా (విద్యా గురువులుగా) ఉన్నవారి గోత్రములే వీరి గోత్రములు అనియు రెండు పక్షములు ఉన్నవి. వీనిలో రెండవ పక్షము చాల సముచితము. అభిజన కృత గోత్రము బ్రాహ్మణులది కాగా విద్యా కృత గోత్రము క్షత్త్రియ వైశ్యులది; అనగా వీరికిద్ధరకును ఆర్ష గోత్రము ఈ విధముగా అన్వయించును.

ఈ మత్స్యపురాణమున భృగువు-అంగిరుడు అత్రి-విశ్వామిత్రుడు-కశ్యపుడు-వసిష్ఠుడు-అగస్త్యుడు - అనువారి గోత్ర ప్రవరముల వివరణము మాత్రమున్నది.)

చతుర్ణవత్యుత్తర శతతమోధ్యాయః

గోత్రప్రవరాది నిర్ణయ ప్రారమ్భః

భృగుగోత్ర ప్రవర వర్ణనమ్‌

సూతః ఇత్యాకర్ణ్య రాజేన్ద్ర ఓఙ్కారస్యాభివర్ణనమ్‌ |

తతం పప్రచ్ఛ దేవేశం మత్స్యరూపం జలార్ణవే. 1

మనుః : ఋషీణాం నామగోత్రాణి వంశావతరణం తథా |

ప్రవరాణాం తథా సామ్య మసామ్యం విస్తరా ద్వద. 2

మహాదేవేన ఋషయ శ్శప్తా స్స్వాయమ్భువేన్తరే | తేషాం వైవస్వతే ప్రాప్తే సమ్భవం మమ కీర్తయ. 3

దాక్షాయణీనాం చ తథా ప్రజాః కీర్తయ మేవిభో | ఋషీణాంచ తతో వంశా న్భృగుశంశవివర్దనా9. 4

మత్స్యః : మన్తన్తరేస్మి న్త్సమ్ప్రాప్తే సప్తవైవస్వతే పురా | అశ్వమేధేతు వితతే బ్రహ్మణః పరమేష్ఠినః.

మహాదేవస్య శాపేన త్యక్త్వా దేహా న్త్స్వయం తతః |

ఋషయశ్చ సముద్భూతా శ్చ్యుతే శుక్రే యదృచ్ఛయా. 6

దేవానాం మాతరో దృష్ట్వా దేవపత్న్య స్తథైవచ | స్కన్నం శుక్రం మహారాజ బ్రహ్మణః పరమేష్ఠినః. 7

తజ్జుహావ తతో బ్రహ్మా తతోజాతా హుతాశనాత్‌ | తతో జాతో మహాతేజా భృగుశ్చ తపసాం నిధిః. 8

ఆఙ్గారేష్వఙ్గిరా జాత స్సోర్చిభ్యోత్రి స్తథైవచ | మరీచిభ్యో మరీచిశ్చ తతోజాతో మహాతపాః. 9

కేశైస్తు కపిశో జాతః పులస్త్యశ్చ మహాతపాః | కేశైః ప్రలమ్బైః పులహ స్తతో జాతో మహాయతాః. 10

వసుమధ్యాత్సముత్పన్నో వసిష్ఠశ్చ తపోధనః | భృగుః పులోమ్నశ్చ సుతాం దివ్యాం భార్యా మవిన్దత. 11

యస్యామస్య నుతా జాతా దేవా ద్వాదశ యాజ్ఞికాః | భువనో భౌవనశ్చైవ సుజన్య స్సుజన స్తథా. 12

శుచిః క్రతుశ్చ మూర్ధాచ యాజ్యశ్చ వసుధశ్చహ | ప్రభవశ్చావ్యయశ్చైవ దక్షోథ ద్వాదశ స్తథా. 13

ఇత్యేతే భృగవో నామ దేవా ద్వాదశకీర్తితాః | పౌలోమ్న్యాం జనయద్విప్రా న్దేవానాంచ కనీయసః. 14

చ్యవనంచ మహాభాగ మాప్నువానం తథైవచ | ఆప్నువానాత్మజ శ్చౌర్వో జమదగ్ని స్తథా೭೭త్మజః. 15

గోత్ర ప్రవర నిర్ణయము-భృగు గోత్ర ప్రవరవర్ణనము.

సూతుడు ఋషులతో ఇట్లు చెప్పెను: రాజేంద్రుడగు వైవన్వత మనువు ఓంకారాభి వర్ణపమును విని అనంతరము జలార్ణవమునందు మత్స్యరూపముననున్న దేవేశుడగు నారయణుని ఇట్లు వేడెను: ప్రభూ: ఋషుల నామములను నామములనుబట్టి ఏర్పడిన గోత్రములను ఏయే వంశములవారు ఏ గోత్రమున జనించిరో ఎరుగు విధమును గోత్ర నామములతో సంబద్దములయియున్న ప్రవరముల సమానత్వా7 సమాత్వములను (ఇవి వివాహాది కార్యముల విషయమున సగోత్రత్వమును నిర్ణయించుటకును గోత్ర భేదముల గుర్తించుటకును ఉపకరించును కావున) నాకు సవిస్తరముగా తెలుపవేడెదను. స్వాయంభువ మన్వంతరమున మహాదేవుడు (శివుడు) ఋషులను శపించెనుకదా. వైవస్వత మన్వంతరము వచ్చిన తరువాత మరల వారు పుట్టిన విధమును దక్ష పుత్త్రికల సంతతులను వారినుండి వర్ధిల్లిన ఋషి వంశములను భృగు వంశ ప్రవర్తకులను నాకు తెలుపవేడెదను.

ఇట్లడిగిన వైవస్వత మనువునకు మత్స్యరూప జనార్దనుడు ఇట్లు చెప్పనారంభించెను. పూర్వము స్వాయంభువ మన్వంతరమున పరమేష్ఠి (పరమాకాశమునంద-ఉత్తమ స్థానమునందు ఉండువాడు) అగు బ్రహ్మ అనుష్ఠించు యజ్ఞము వితతమయి (యజ్ఞ పరికర ప్రసారణము చేయబడి) ఉండగా మహాదేవుడిచ్చిన శాపముచే ఋషులు స్వయముగా దేహ త్యాగము చేసిరి. తరువాత వారు వైవస్వత మన్వంతరము వచ్చిన తరువాత యాదృచ్ఛికముగా న్కన్నమయిన (పట్టు తప్పి జారిపడిన) బ్రహ్మదేవుని శుక్రమునుండి సముద్భవించిరి. అది ఎట్లన-దేవమాతలను దేవపత్నులను చూచిన తరి బ్రహ్మదేవుని శుక్రము స్ఖలితమయ్యెను. (ఇది లోకమలో జరుగునట్టిదికాదు. బ్రహ్మ యనగానేమి - దేవమాతలు - దేవ పత్నులు అని వారెవ్వరు - అను విషయములను ప్రతీక రూపముగా శాస్త్రీయార్థమును గ్రహించినపుడే ఈ విషయము తెలియును.) దానిని బ్రహ్మ హోమము చేసెను. అంతట అగ్ని నుండి (ఈ వైవస్వత మన్వంతరపు) ఋషులు జనించిరి. వారిలో మొదట భృగు మహర్షి జనించెను. అతడు మహాతేజస్కుడును. తపోనిధియును; (ముందు చెప్పబోవు ఋషుల ఉత్పత్తిని బట్టి చూడగా భృగుడు సమగ్రమగు హోమాగ్ని నుండియే జనించెనని చెప్పవలయును.) నిప్పు కణికలనుండి అంగిరుడును అర్చిస్సుల (జ్వాలల) నుండి అత్రియు మరీచుల (తేజః కిరణముల) నుండి మహా తపస్కుడగు మరీచియు కేశములనుండి కపిశ (కశ్యపః) పులస్త్యులును ప్రలంబములగు (పొడవుగ వ్రేలాడుచున్న) కేశముల (కొనల) నుండి పులహుడును వసు (అగ్ని తేజో) మధ్యమునుండి వసిష్ఠుడును జనించిరి. వీరు అందనేపే తపోధనులు.

వీరిలో భృగువు పులోముడను రాక్షసుని కూతురైన (ప్పటికిని దివ్యత్వము నందిన) పౌలోమిని పెండ్లాడెను. ఆమెయందు ఇతనికి యాజ్ఞికులు (యజ్ఞ ప్రవర్తకులు) అగు పండ్రెండు మంది కుమారులు కలిగిరి. వారు 1. భువనుడు 2. భౌవనుడు 3. వసుజన్యుడు 4. సుజనుడు 5. శుచి 6. క్రతువు 7. మూర్ధన్‌ 8. యాజ్యుడు 9. వసుధుడు 10. ప్రభవుడు 11. అవ్యయుడు 12. దక్షుడు. ఈ పండ్రెండు మందియు దేవులు (దేవతలలోని వారు) గానే గణింపబడుచు భృగువులని ప్రసిద్ధులైరి. భృగువు పౌలోమియందు ఉత్పన్నుల నొనర్చిన చిన్న కుమారులు మరికొందరు గలరు. వారు. 1. చ్యవనుడు 2. ఆప్నువానుడు (అను బ్రాహ్మణులు); ఆప్నువానుని కుమారుడు ఔర్వుడు; అతని కుమారుడు జమదగ్ని.

ఔర్వో గోత్రకర స్తేషాం భార్గవానాం మహాత్మనామ్‌ | తత్ర గోత్రవరా న్వక్ష్యే భృగోర్వై దీపన్తతేజసః. 16

భృగుశ్చ చ్యవనశ్చైవ ఆప్నువాన స్తథైవచ | ఔర్వశ్చ జమదగ్నిశ్చ వాత్స్యో దణ్డి ర్నడాయనః.17

వైగాయనో వీతహవ్యః పైలశ్చైవాత్ర శౌనకః | శౌనకాయనజీవవన్తి రావేదం *పార్షక స్తథా. 18

వైహానరి ర్విరూపాక్షో రౌహిత్యాయని రేవచ | వైశ్వానరి స్తథా నీలో లుబ్ధ స్సావర్ణికశ్చ సః. 19

విష్ణుః పౌరోపి బాలాకి రైలికానన్త భాగినః | భృతభార్గేయ మార్కణ్డ జవినో వీతిన స్తథా. 20

*కార్పణిస్తథా.

మణ్డమాణ్డవ్యమాణ్డూక* ఫేనపా స్సురతి స్తథా | స్థలపిణ్డ శ్శిఖావర్ణ శ్శార్కరాక్షి స్తథైవచ. 21

జాలధి స్సౌధికః క్షుభ్యః కుత్సన్యో మౌద్గలాయనః | *మర్కాయనో దేవపతిః పాణ్డురోచిస్సగాలవః. 22

సాఙ్కృత్య శ్చాతకి స్సార్వి ర్యజ్ఞపిణ్డాయన స్తథా | గార్గ్యాయనో గాయనశ్చ ఋషి ర్గార్హాయన స్తథా. 23

గోష్ఠాయనో వాత్స్యాయనో వైశమ్పాయన ఏవ చ | వైకర్ణిని శ్శాఙ్కరవో యాజ్ఞేయి ర్భ్రాష్ట్రకాయనిః. 24

లలాటి ర్నాకులిశ్చైవ లౌక్షిణ్య పరిమణ్డలౌ | ఆలుకి స్సౌచకిః కౌత్స స్తథాన్యః పైఙ్గలాయనిః. 25

సత్యాయని ర్మాలాయనిః కౌటిలిః కౌచహస్తికః | సౌహసోక్తి స్సకౌవాక్షిః కౌసి శ్చాన్ద్రమసి స్తథా. 26

నైకజిహ్వో జిహ్మకశ్చ వ్యధాధ్యో లోహవైరిణః | శారద్వతికనేతిష్యౌ లోలాక్షి శ్చలకుణ్డలః. 27

వాగాయని శ్చానుమతిః పౌర్ణిమాగతికోసకృత్‌ | సామాన్యేన యథా తేషాం వఞ్చైతే ప్రవరా మతాః. 28

భృగుశ్చ చ్యవనశ్చైవ ఆప్నువాన స్తథైవచ | ఔర్వశ్చ జమదగ్నిశ్చ వఞ్చైతే ప్రవరా మతాః. 29

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | బాహ్యా బాహ్యౌ తథా చోభే జ్ఞేయాస్త్రిప్రవరా స్త్రిషు. 30

భృగుశ్చ జమదగ్నిశ్చ తథైవౌర్వశ్చ పార్థివ |

మహాత్ములగు ఈ భృగు వంశము వారిలో ఔర్వుడు గోత్ర ప్రతిష్ఠాపకుడు; దీప్త తేజస్సుడగు భృగునికి చెందిన గోత్ర ప్రవర్తక ఋషులను పేర్కొందును; భృగువు చ్యవనుడు ఆప్నువానుడు ఔర్వుడు జమదగ్ని వాత్స్యుడు దండిన్‌ నడాయనుడు వైగాయనుడు వీతి(త) హవ్యుడు పైలుడు శౌనకుడు శౌనకాయనుడు జీవంతి ఆవేదుడు కార్షణి (పార్షకుడు) వైహీ(హా)నరి విరూపాక్షుడు రౌహిత్యాయని వైశ్వానరి నీలుడు లుబ్ధుడు సావర్ణికుడు విష్ణువు పౌనుడు బాలాకి ఐలికుడు అనంతభాగినుడు మృగుడు (భృత) మార్గే (భార్గే)యుడు మార్కండుడు జవినుడు (వీ) నీతినుడు మండుడు మాండవ్యుడు మాండూకుడు ఫేనపుడు స్తనితుడు (సురతి) స్థల పిండుడు శిఖావర్ణుడు శార్కరాక్షి జాలధి సౌధికుడు క్షుభ్యుడు కుత్సన్యుడు మౌద్గలాయనుడు మర్కా (కర్మా) యనుడు దేవపతి పాండురోతి గాలవుడు సాంకృత్యుడు చాతకి సార్పి యజ్ఞపిండాయనుడు గార్గ్యాయనుడు గాయనుడు గార్హాయనుడు గోష్ఠాయనుడు వాత్స్యాయనుడు వైశంపాయనుడు వైకర్ణిని శాంకరవుడు యాజ్ఞేయి భ్రాష్టకాయని లలాటి నాకుని లౌక్షిణ్యుడు పరికుండలుడు ఆలుకి సౌచకి కౌత్సుడు పైంగ లాయనుడు సత్యాయని మాఆయని కౌటిలి కౌచహస్తకుడు సౌహసోక్తి కావాక్షి కౌసి చాంద్రమసి నైకజిహ్వుడు జిహ్మకుడు వ్యధాధ్యుడు లోహవైరిణుడు శారద్వితికుడు నేతిష్యుడు లోలాక్షి - చలకుండలుడు వాగాయని అనుమతి పౌర్ణిమాగతికుడు అసకృత్‌ - అనువారు వీరు; ఈ ఋషుల (గోత్రములవారి) కందరకును సమాన రూపమున - భృగువు - చ్యవనుడు - అప్ను వానుడు ఔర్వుడు జమదగ్ని - అను ఐదుగురును ప్రవర ఋషులు; అనగా పై చెప్పిన గోత్రములవారు పంచార్షేయ ప్రవరాన్వితులు; సమాన ప్రవరాన్వితులగు ఈఋషు (లగోత్రముల వార)లు పరస్పరము ఇచ్చి పుచ్చుకొనుచు వివాహ సంబంధములు జరుపుకొనరాదు.

ఈ భృగుగోత్ర వర్గముల వారిలో కొందరు బాహ్యులు (అజామదగ్న్యులు) అబాహ్యులు (జామదగ్న్యులు) ఉభయులునని మూడు విధములుగా నున్నారని కొందర మతము; ఈ మూడు విధముల వారికిని సమానముగా భృగువు జమదగ్ని ఔర్వుడు అను మువ్వురే ప్రవర ఋషులని కొందర యభిప్రాయము.

ఈ మత్స్య పురాణానుసారము భృగు వంశోత్పన్నుల గోత్రమలు ఆరు వర్గములుగా విభక్తములగును. ఈ చెప్పిన వారందరును మొదటి వర్గమువారు.

ఈతః పరం ప్రవక్ష్యామి శృణు త్వన్యా న్భృగూద్వహాన్‌.

జమదగ్ని ర్భృగుశ్చైవ పౌలస్త్యో వైజభృ త్తథా | ఋషిశ్చోభయజాతశ్చ కాయని శ్శాకటాయనః. 32

*ఫేనసాః స్తనిత స్తథా. *కర్మాయనో.

ఔర్వేయా మారుతాశ్చైవ సర్వేషాం ప్రవరాశ్శుభాః | భృగుశ్చ చ్యవనశ్చైవ ఆప్నువాన స్తథైవచ. 33

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః భృగుదాసో మార్గరథో గ్రామ్యాయని వటాయనీ. 34

ఆపస్తమ్బ స్తథా భల్లి ర్నైకశిః కపిరేవచ | అర్షిషేణో *బిన్దుభిశ్చ కార్దమాయని రేవచ. 35

ఆశ్వాయని స్తథా రూపిః పఞ్చార్షేయాః ప్రకీర్తితాః | భృగుశ్చ చ్యవనశ్చైవ ఆప్నువాన స్తథైవచ. 36

ఆర్షిషేణ స్తథా రూపిః ప్రవరాః పఞ్చికీర్తితాః | పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 37

యస్కోవా వీతహవ్యోవా మయితస్తు తథా దమః | జైవన్త్యాయని మౌఞ్జశ్చ పిలిశ్చైవ + బలి స్తథా. 38

భాగిళో ఆగవిత్తిశ్చ కౌశాపి స్త్వథ కాశ్యపిః | ఆలపిశ్శ్రమదాగేపి స్సౌర స్తిథి స్తథైవచ. 39

గ్రామదశ్చ తథైతేషామార్షేయః ప్రవరో మతః | * 40

భృగుశ్చ వీతహవ్యశ్చ తథా జైవసవైతసః | పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 41

శాలాయని శ్శాకటాక్షో మైత్రేయః ఖాణ్డవ స్తథా | ద్రౌణాయనో రౌక్మాయనః పిశలీ చాపికాయనిః. 42

హంసజిహ్వ స్తథైతేషా మార్షేయాః ప్రవరా మతాః | భృగుశ్చైవాథ వధ్ర్యశ్వో దివోదాన స్తథైవచ. 43

ఆర్షిషేణ స్తథా రూపః ప్రవరాః పఞ్చ కీర్తితాః | పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః. 44

ఏకాయనో యాజ్ఞపతి ర్మత్స్యగన్ధ స్తథైవచ | ప్రత్యూహశ్చ తథా సౌరి శ్చౌక్షి ర్వూ కార్దమాయనిః. 45

తథా గృత్సమదో రాజ న్త్సనకశ్చ మహా నృషిః | ప్రవరాస్తు తథోక్తానా మార్షేయాః పరికీర్తితాః. 46

భృగుర్గృత్సమదశ్చైవ ఆర్షావేతౌప్రకీర్తితౌ.

ఏతే తవోక్తా భృగువంశజాతా మహాను భావా నృప గోత్రకారాః |

ఏషాం తు నామ్నాం పరికీర్తనేన పాపం సమగ్రం విజహాతి జన్తుః. 47

ఇతి శ్రీమత్స్యమహాపురాణ గోత్రప్రవరానుకీర్తనే భృగుగోత్ర ప్రవరవివరణం

నామ చతుర్నవత్యుత్తర శతతమోధ్యాయః.

(ఇక రెండవ వర్గమువారు:) ఇక మీదట మరికొందరు భృగువంశ శ్రేష్ఠులను తెలిపెదను: జమదగ్ని భృగువు పౌలస్త్యుడు బై జభృత్‌ ఋషి ఉభయజాతుడు కాయని శాకటాయనుడు - వీరు 8 మంది ఔర్వుని సంతతివారును - మరుత్‌ సంతతివారును; వీరికందరకును - భృగువు చ్యవనుడు ఆవ్నువానుడు - ఈ మువ్వురును ప్రవర ఋషులు; ఈ ఋషు(ల గోత్రములవార)లు పరస్పరము ఇచ్చిపుచ్చుకొను వివాహ సంబంధములు చేసికొనరాదు.

మూడవ వర్గమువారు: భృగువాసుడు మార్గపథుడు గ్రామ్యాయని వటాయని ఆపస్తంబుడు భల్లి నైకశి కపి ఆర్షిషేణుడు బిందుభి కార్దమాయని ఆశ్వాయని రూపి అను పదుముగ్గురును పంచార్షేయులు. భృగువు చ్యవనుడు ఆప్నువానుడు ఆర్షిషేణుడు రూపి - ఈ ఐదుగురును ఈ ఋషు(ల గోత్రముల వార)ల ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధము కూడదు.

నాలుగవ వర్గమువారు: (16 మంది) యస్కుడు (వీతహవ్యుడు) మయితుడు దముడు జైవంత్యాయని మౌంజుడు పిలి బలి భాగిళుడు భాగవిత్తరి కౌశాపి కాశ్యపి బాలపి శ్రమదాగోపి సౌరుడు తిథి గ్రామదుడు అను ఈ ఋషుల (గోత్ర ముల వారల)కు భృగువు వీతహవ్యుడు వేతసుడు అనువారు ప్రవర ఋషులు. ఈ గోత్రములవారు పరస్పర వివాహ సంబంధము చేసికొనరాదు.

*గార్దభిశ్చ. +చలిస్తథా. *గార్గేయస్త్వథజాబాలి.

ఐదవ వర్గమువారు; శాలాయని. శాకటాక్షుడు - మైత్రేయుడు ఖాండవుడు ద్రౌణాయనుడు రౌక్మాయనుడు ఆ పిశలి ఆపికాయని హంసజిహ్వుడు - అను ఈ ఋషు(లగోత్రముల వార)లకు భృగువు వధ్య్రశ్వుడు దివోదాసుడు ఆర్షిషేణుడు రూపి అను ఐదుగురును ప్రవర ఋషులు; వీరు పరస్పర వివాహ సంబంధములు చేసికొనరాదు.

ఆరవ వర్గమువారు: ఏకాయనుడు యాజ్ఞపతి మత్స్యగంధుడు ప్రత్యూహుడు సౌరి ఔక్షి కార్దమాయని గృత్సమదుడు సనకుడు - అను ఋషు(ల గోత్రముల వార)లకు భృగువు గృత్సమదుడు ప్రవర ఋషులు; వీరు పరస్పర వివాహములు జరుపుకొనరాదు.

ఈ చెప్పిన గోత్రకారులగు భృగు వంశ జాతుల నామములను కీర్తించినంత మాత్రమున నరుడు సకల పాప విముక్తుడగురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భృగు గోత్ర ప్రవరాను కీర్తనమను

నూట తొంబది నాలుగవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters