Sri Matsya mahapuramu-2    Chapters   

సప్తాశీత్యుత్తరశతతమోధ్యాయః.

ఈశ్వరకృత బాణాసుర త్రిపురదాహః.

మార్కణ్డయః : యన్మాం వృచ్ఛసి కౌన్తేయ తన్మే నిగదత శ్శృణు | ఏతస్మిన్నన్తరే రుద్రో నర్మదాతట మాశ్రితః.1

నామ్నా మహేశ్వరం స్థానం త్రిషు లోకేషు విశ్రుతమ్‌ |

తస్మింస్థానే మహాదేవ శ్చిన్తయం సై#్త్రపురం వధమ్‌ 2

గాణ్డీవం మన్దరం కృత్వా గుణం కృత్వాచ వాసుకిమ్‌ | స్థానం కృత్వాతు వైశాఖం కృత్వా శరోత్తమమ్‌.

శ##ల్యే చాగ్నీం ప్రతిష్ఠాప్య ముఖే వాయు పమర్పయ9 |

హయాంశచ చతురో వేద న్త్సర్వదేవమయం రథమ్‌. 4

అభిషవోశ్వినో దేవా వక్షో వజ్రధర స్స్వయమ్‌ | స తస్యాజ్ఞాం సమాధా(దా)య తోరణ ధనర స్థ్సితః.

యమస్తు దక్షిణ హస్తే వామే కాలస్తు దారుణః | చక్రే త్వమరకోట్యస్తు గన్ధర్వా లోకవిశ్రుతాః. 6

ప్రజాపతీ రథప్రష్ఠే బ్రహ్మాచైవతు సారథిః | ఏవం కృత్వాతు దేవేశ స్సర్వదేవమయం రథమ్‌. 7

సో7తిష్ఠత్థ్సాణుభూతస్తు సహస్రవరివత్సరా& | యదా త్రీణి సమేతాని అన్తరిక్షే స్థితానివై 8

త్రివర్వణా త్రిశ##ల్యేన తథా తాని వ్యభేదయత్‌ | శరశ ప్రస్థాపి తస్తత్ర రుద్రేణ త్రిపురం ప్రతి 9

భ్రష్టతేజాః స్త్రియో జాతా బలం తాసాం వ్యశీర్యత|

ఉత్పాతాశ్చ పురే తస్మి న్ప్రాదుర్భూతా స్సహస్రశః 10

త్రిపురస్య వినాశాయ కాలరూపాభవం స్తదా | అట్టహాసం ప్రముఞ్చన్తి హయాః కాష్టమాయా స్తదా. 11

నిమేషోన్మేషణంచైవ కుర్వన్తే చిత్రరూపిణః | స్వప్నే పశ్యన్తి చాత్మానం రక్తమ్బరవి భూషితమ్‌. 12

నూట ఎనుబది ఏడవ యధ్యాయము.

ఈశ్వరుడు బాణాసురుని త్రిపురముల దహించుట.

మార్కండేయుడు ధర్మరాజుతో ఇట్లు చెప్పెను: ధర్మారాజా! నీవు నన్నుడగినది తెలిపెదను వినుము; ఈ నడుమ కాలములో నర్మదతీరమునందు త్రిలోక ప్రసిద్దమగు మాహేశ్వరమను స్థానమునందుండి త్రిపురవధ విషయ మాలోచించెను. మందల పర్వతమును (గాండీవ) ధనువుగా వాసుకిని అల్లెత్రాటినిగా కుమారస్వామిని శరము నిలుపు స్థానమునుగా విష్ణుని శరమునుగా చేసికొనెనె; బాణపు మొనయందు అగ్నిని పై ప్రదేశమున వాయువును నిలిపెను; దేవతలందరు కూడి రథము కాగా నాలుగు వేదములు గుర్రము లయ్యెను; అశ్వినులు పగ్గములు ఇంద్రుడు ఇరుసు అయ్యెను. కుబేరు డీశ్వరాజ్ఞచే ప్రధాన ద్వారమందు నిలిచెను; కుడిచేతి వైపున యముడును ఎడమచేతి వైపున భయంకరుడగు కాలదేవుడను ఉండిరి. చక్రమునందు కోట్లకొలదిగా లోకప్రసిద్ధులగు దేవతలును గంధర్వులు నుండిరి. రథపు ముందు భాగమున ప్రజాపతి యుండెను; బ్రహ్మ సారథి యయ్యెను; ఇట్లా దేవేశుడు సర్వదేవమయమగు రథమును నిర్మించుకొని స్థాణుభూతుడై నిశ్చలుడై వేయి పరివత్సరలముల కాలము అట్లే వేచియుండెను. ఎపుడా మూడు పురములను ఒకటిగా కూడా అందరిక్షముంనందుండెనో అపుడు రుద్రుడు త్రిపురముల మీదకు తన శరమును ప్రయోగించెను. అది మూడు కణుపులకు మూడు మొనలును కలది; దానితో రుద్రుడు త్రిపురములను భేదించదలచెను; అప్పటికే త్రిపుర స్త్రీలు తేజో హీనలయిరి; వారి బలము శిధిలమయ్యెను; ఆ త్రిపురమందును ఏవలకొలది ఉత్పాతములు-ప్రాదుర్భవించి కనబడెను; అవి యన్నియు త్రిపుర వినాశకరములగు కాలపురుఫరూప మయినవి; అవి ఏవి అనిన కొయ్యతో చేసి గుర్రములు ఆట్టహానములు చేసెను; చిత్తరువులలో బోమ్మలును కన్నులు మూయుచు తెరచుచు ఉండెను; కలలో ఎవరికి వారు తాము రక్తవస్త్రము ధరంచి యున్నట్లు కనబడిరి.

స్వప్నేసి సర్వే పశ్యన్తి విపరీతాని యానిచ | ఏతాన్పశ్యన్త ఉత్పాతాం స్తత్ర స్థానేతు యే జనాః 13

తేషాం బలంచ బుద్ధిశ్చ హరకోపేన నాశితే | తత స్సాంవర్తకో వాయు ర్యుగాన్తప్రతియో మహా 14

సమీరితోనల స్తేన ఉత్తమాజ్గేషు ధావతి | జ్వలన్తి పాదపా స్తత్ర పతన్తి శిఖరాణిచ 15

సర్వతో వ్యాకులీభూతం హాహాకార మచేతనమ్‌ | భగ్నోద్యానాని సర్వణి క్షిప్రం తత్ప్రత్యభజ్యత. 16

తేనైవ పీడితం సర్వం జ్వలితం త్రిశిఖై శ్వరైః | ద్రుమాశ్చారామఖణ్డాని గృహాని వివిధానిచ. 17

దశదిక్షు ప్రవృత్తోయం సమృద్దో హవ్యవాహనః | మనశ్శిలాపుఞ్జనిభో దిశాదశవిభాగతః. 18

శిఖాశ##తై రనేకైస్తు ప్రజజ్వాల హుతాశనః | సర్వం కింశుకవర్ణాభం జ్వలితం దృశ్యతేపురమ్‌. 19

గృహాద్గృహాన్తరం నైవ గన్తుం ధూమేన శక్యతే క్ష హరకోపాగ్నినా దగ్ధం క్రన్దమానం సుదుఃఖితమ్‌ . 20

ప్రదీప్తం సర్వతోదిక్షు దహ్యతే త్రిపురం పురమ్‌ | ప్రాసాదశిఖరాగ్రాణి వ్యశీర్యన్త సహస్రశః. 21

నానామణివిచిత్రాని విమానాన్య ప్యనేకశః | గృహాణిచైవ రమ్యాణి దహ్యన్తే దీప్తవహ్నినా. 22

ధావన్తి ద్రుమఖణ్డషు వలభీషు తథా జానాః | దేవాగారేషు సర్వేషు ప్రజ్వలన్తః ప్రధావితాః. 23

క్రన్దన్తి చానలం దృష్ట్వా నర్దన్తి వివిధై స్స్వరైః | గిరికూటనిభా స్తత్ర దృశ్యన్తేజ్గారరాశయః. 24

అచటివారి కందరకును లోకవిరుద్దములగు ఏయే విషయములు స్వప్నమునందు కనబడెనో అవియే ఉత్పాతములుగా జాగ్రదవస్థలో జనులకు కనబడసాగెను. వారి బుద్ధియు బలమును హరుని కోపమున నాశ మందెను. కల్పాంత మందు వలె ప్రళయామారుతము చెలరేగి వీచసాగెను; ఆ వాయువుచే ప్రేరణ నందిన అగ్నియు అచటి వారి తలల పైగా పరగెత్తసాగెను; వృక్షములు మండుచుండెను; భవనములు మొదలగునవి శిఖరములు పడసాగెను; అంతటను కలవరపాటు హాహాకారము చైతన్యము లేకపోవుట వ్యాపించెను; ఉద్యానములన్నియు భగ్నము లయ్యెను; ఇంతలో ఆ నగరమే ముక్కలు కాసాగెను; ఆ రుద్రుని మూడు మొనల శరములతో సర్వ నగరము పీడితమయ్యెను; ఇంతలో ఆ నగరమే ముక్కలు కాసాగెను; ఆ రుద్రుని మూడు మొనల శరీరములో సర్వ నగరము పీడితమయ్యను; వృక్షముల ఉద్యాన భాగములు వివిధ గృహులు అన్నియు దగ్ధము లయ్యెను; ఈ సమృద్ధిగల యగ్ని మనశ్శిలల రావివలె వెలగుచు పది దిక్కలందును పది విధములుగ భాగములయి ప్రవర్తిల్లి వ్యాపించెను; పురమంతయు మోదగపూవన్నెతో మండుచు కనబడెను; పొగ మూలమున ఒక ఇంటినుండి మరియొక ఇంటికి పోవుటకును శక్యము కాకాపోయోను; అది హరకోపాగ్నితో దగ్ధమగుచు ఏడ్చుచు దుఃఖించుచు నుండెను; అట్లా త్రిపురపురము పెదద్దగా మండుచుంగ ఆ మంట లన్ని దసలకును వ్యాపించెను; వేలకొలది ప్రాసాద శిఖారాగ్రములు శిథిలము లయ్యెను; నానా మణులతో విచిత్రములయి కనబడు అనేక విమానములు (మహాభవనములును-ఆకాశయానములును) రమ్యములగు గృహములను అనేకములు ఆ ప్రజ్వలించు అగ్నిలో కాలిపోయెను; అచటి జనులందరును తామును కాలిపోవుచు రక్షణకై చెట్ట గుబురులలోనికిని భవనములమీది గూడులవంటి గృహభాగముల(వలబుల)లోనికిని పరుగెత్తసాగిరి; వారా యగ్నిని చూచి వివిధ స్వరములతో ఏడువసాగిరి; కేకేల వేయ సాగిరి; అచట కొలది సేపటిలో కొండల శిఖరములంత బొగ్గునిప్పు కణికెల కుప్పలు కనబడసాగెను.

స్తువన్తి దేవదేవేశం పరిత్రాయస్త సామ్ప్రతమ్‌ | అన్యోన్యంచ పరిష్వజ్య హుతాశశరదీపితాః 25

దహ్యన్తే దానవస్తత్ర శతశోథ సహన్రశః | హంసకారణ్డవాకీర్ణా నళిన్య స్సహపజ్కజాః 26

దృశ్యన్తేనలదగ్ధని పురోద్యాననాఇ దీర్ఘికాః | అవ్లూనపజ్కజచ్ఛన్నా విస్తీర్ణా యోజనాయతాః. 27

గిరికూటనిభాస్తత్ర ప్రాసదా రత్నభూషితాః | పతన్త్యనలనిర్దగ్ధా నిస్తోయా జలజా ఇవ. 28

పరస్త్రీబాలవృద్ధేషు గోషు పక్షిషు వాజిషు | నిర్దయో దహతే వహ్నిర్హరకోపప్రనోదితః. 29

సమస్రశః ప్రసుప్తాశ్చ సుప్తాశ్చ బహవో జనాః | పుత్త్ర మాలిజ్గ్య తే గాఢం దహ్యన్తే త్రిపురాగ్నినా. 30

అథ తస్మి న్పురే దీప్తే స్త్రియాశ్చాప్సరసోపమాః | అగ్నిజ్వాలాహత స్తత్ర పతన్తి ధరణీతలే .31

కాచిచ్ఛ్యామా విశాలాఓఈ ముక్తవళివిభూషితా | ధూమేనాకులితా సాతు పతితా ధరనీతలే. 32

కాచిత్కనకవర్ణాభా ఒన్ద్రనీలవిభూషితా | భర్తారం పతితం దృష్ట్యా పతితా తస్య చోపరి. 33

కాచిదాదిత్యసజ్కాశా ప్రసుప్తాచ గృహేస్థితా క్ష అగ్నిజ్వాలాహతా సా తు పతితా తస్య గతచేతనా. 34

ఉత్థితో దానవ స్తత్ర గదాహస్తో మహాబలః | వైశ్వానరహత స్సోపి పతితో ధరనీతలే . 35

మేఘవర్ణాపరా నారీ హారకేయూరాభూషితా | వ్‌ఏతవస్త్రపరీధాన బాలం స్తన్యం న్యధావయత్‌ .36

దహ్యన్తం బాలకం దృష్ట్వా రుదతే మేఘశబ్దవత్‌ | ఏవం సదహతే దీప్తో హరక్రోధేన ప్రేరితః. 37

మమ్ము ఇపుడు రక్షించుమాయని దేవదేవేశుని వారు ప్రార్థించసాగిరి, వారు ఒకరి నింకొకరు కౌగిలించుకొని అగ్నిమయ బాణజ్వాలలో జ్వలించచేయబడుచు వందల వేలకొలదిగా దానవులు అచట దహించబడుచుండిరి. హంసలతో కారండవ పక్షులో వ్యాప్తములయి పద్మములతో కూడిన సరస్సులును పరోద్యానములును వాని పద్మములతో వ్యాపింపబడిన యోజనములు కొలది పొడవు వెడల్పులు కలిగి విశాలములైన నడబావులును అగ్నిచే నిఃశేషముగా కాల్చబడి జలములేని మేఘములవలె బూడిదయై కనబడుచు క్రింద పడుచుండెను. హరుని కోపముచే ప్రేరింపబడిన యగ్ని నిర్గయుడై యువతులందయును బాలురయందును వృద్ధులయందును క్రమ్మి వారిని దహించుచుండెను. గాఢనిద్రయందును స్వప్నములందును మునిగియున్న వేలకొలది జనులు తమ తమ పుత్త్రులను గాఢముగా కౌగలించుకొని త్రిపురాగ్నిలో కాలిపోవుచుండిరి. అట్లు దీపించుచున్న ఆ త్రిపురములలో అప్సరసలవంటి స్త్రీలు అగ్ని జ్వాలల తాకిడికి చచ్చియు కాలియు ధరణీతలమున పడుచుండిరి. విశాల నయనములు కలదియు ముక్తాహార విభూషితయు నగు ఒకనోక చామనచాయగల సుందరి(శ్యామ) పొగతో కలత నంది ధరణీతలమున పడెను. బంగారుచాయ కలదియు ఇంద్రనీలమణి విభూషితయు నగు ఒక స్త్రీ అగ్ని జ్వాలాహతయై తెలివితప్పి పడిపోయెను; గదాహస్తుడై లేచి నిలువబడిన మహాబలుడగు దానవు ఒకడు అంతోనే అగ్నిహతుడయి ధరనీ తలమున పడెను; హారములతో కేయూరములతో (బాజూబందులతో) భూసితయగు మేఘ సమచ్ఛాయగల యొక యువతి తెల్లని వస్త్రము ధరించియుండి తన బాలునకు పాలు త్రివించుచుండి అంతో బాలుడు కాలుచుడుట చూచి మేఘధ్వనితో ఏడువసాగెను? హరక్రోధ ప్రేరితుడగు అగ్ని త్రిపురమును ఇట్లు దహించ సాగెను.

కాచిచ్చన్ద్ర సౌమ్యా వజ్రవైడూర్యభూసితా | సుత మాలిజ్గ్య వేపన్తీ దగ్ధపతత భూతలే. 38

కాచిత్కన్దేన్దువర్ణాభా యా శయానా గృహేస్థితా | గృహే ప్రజ్వలితే సా తు ప్రతిబుద్ధా శిఖా7ర్దితా. 40

వశ్యన్తం జ్వలితం సర్వం హా సుతో మే దివం గతః | సుతం సన్దగ్ధ మాలిజ్గ్య పతితా ధరణీతలే. 41

కాచిత్సువర్ణవర్ణాభా నీలరత్నై ర్విభూషితా | ధూమేనాకులితా సాతు పతితా ధరణీతలే. 42

అన్యా గృహీతహస్తాతు సఖ్యా దహ్యతి బాలికామ్‌ | అనేకదివ్యరత్నాఢ్యాం దృష్ట్వా దహనమోహితా. 43

శిరసి ప్రాఞ్జలిం కృత్వా విజ్ఞాపయతి పావకమ్‌ | యది త్వ మిచ్ఛసేవైరం పురుషే ష్వపకారిషు. 44

స్త్రియః కిమపరాధ్యంతే గృహపఞ్జరకోకిలాః | పాప నిర్దయ నిర్లజ్జ కస్తే కోపః స్త్రియోపరి. 45

న దాక్షిణ్యం న తే లజ్జనా సత్యం శౌర్యవర్జిత! అనేన హ్యపసర్గేణ తూపాలమ్భం శిఖిన్యదాత్‌. 46

కిం త్వయా న శ్రుతం లోకే అవధ్యా శ్శత్రుయోషితః |

కిం తు తుభ్యం గుణా హ్యేతేద దహనోత్సాదనం ప్రతి. 47

నకారుణ్యం దయావాపి దాక్షిణ్యం న స్త్రియః ప్రతి |

దయాం కుర్వన్తి వ్లుెఛ్ఛాపి దహన్తీం వీక్ష్య యోషితమ్‌. 48

వ్లుెచ్ఛనామపపి కష్టోసి దుర్నివారో హ్యచేతనః | ఏతే చైవ గుణాస్తుభ్యం దహనోత్సాదనం ప్రతి. 49

ఆసామపి దురాచారస్త్రీణాంకి తే నిపాతసే | ధుష్ట నిర్ఘృణ నిర్లజ్జ హుతాశి న్మన్దభాగ్యక. 50

నిరాశత్వం దురాచారాబలాం దహసి నిర్దయ | ఏవం విలప్యమానాస్తా జల్పమానా బహూన్యపి. 51

వజ్రవైడూర్యభూసితయు చంద్ర సమానకాంతియు సౌమ్య స్వభావయు నగు యువతి పుత్త్రుని కౌగిలించుకొని కాలిపోవుచు వణకుచు నేలపై బడెను; సూర్యనివలెను అద్దమువలెను తళతళ మొరయు వన్నెకలదయి లక్ష్మియే యనదగి శోభిల్లు ఒక యువతి వహ్నిదహ్యమాన యగుచు ధరనీ తలమున పడిపోయెను; మొల్లపూవులవలెను చంద్రుని వలెను దేహకాంతిగల యొకతే తన గృహమున నిద్రించుచుండగా ఆ గృమము కాలుచుంగ అగ్నిజ్వాలల తాపమునకు మేల్కాంచిం అంతయు మండుచుండుట చూచి అయ్యో! నా సుతుడు మరణించెనేయని ఏడ్చుచు కుమారుని కౌగిలించుకొని ధరణి తలమున పడెను; బంగారుచాయ గలదియు నీరత్నభూషితయు అగు ఒక స్త్రీ పొగతో కలవరపడి క్రింద పడి పోయెను; అనేక దివ్యరత్నాలంకృతయగు తన బాలిక దమింపబడుచుండుట చూచి దహనుని తాపముచే మోహితురాలయి (దిక్కు తోచక) యుండి తాను తన చెలితోడయి పట్టుకొనియుండగా శిరస్సనందు అంజలిఘటించి అగ్నికి ఇట్లు మనవి చేయసాగెను; ''నీవు అపకారులగు పురుషులందు పగబూనిన పూనెదవు కాక! గృహమను పంజరమందు కోకిలలవంటి వారగు స్త్రీలు నీ కేమి యపరాధ మొనర్చినారు? పాపా! నిర్దయా! నిర్లజ్జా! స్త్రీలపై నీకు కోప మేల? నీకు దాక్షిణ్యము లేదు; లజ్జ లేదు; సత్యము లేదు; వౌర్యము లేదు; అనుచు ఈ ఉపద్రవముతో బాధ నందిన ఆ స్త్రీ అగ్ని ని నిందింప సాడెను; శత్రుపక్షమువారినే యైనను స్త్రీలను చంపరాదను మాట నీవు వినలేదా? కాని అగ్నీ! నీ గుణములన్నియు నాశము విషయమందే ప్రవర్తిల్లుచున్నవి. నీకు స్త్రీలపై దయలేదు; దాక్షిణ్యము లేదు; కారుణ్యము లేదు; కాలిపోవుచున్న అడు వారిని చూచినపుడు వ్లుెచ్ఛులకైనను దయ కలుగునే | నీవు ఆ వ్లుెచ్ఛులకంటెను నీచతరుడవు; నిన్నెవరు కాని మానుపజాలరుఛ ఏలయన నీవు బుద్ధిరహితుడవు! ఈ స్త్రీలను ఇట్లు పడగొట్టుటలో నీకు కలుగ లాభ మేమి? దుష్టా! దయారహితా! సిగ్గు లేనివాడా! వేల్చినదాని నెల్ల తిరువాడ! మందభాగ్యుడా! పుణ్యాశలు లేనివాడా! దురాచారా! నిర్దయా! అబలలను దహించుచున్నావే! అనుచు ఆ స్త్రీలు ఇట్లు బహు విధములుగా విలపించుచు నిందావాక్యమలు వదరుచు ఉండిరి.

అన్యాః క్రోశన్తి సజ్క్రుద్ధా బాలశోకేన మోహితాః |

దహసే నిర్దయో వహ్నే సజ్క్రుద్ధ పూర్వశత్రువత్‌ 52

పుష్కరిణ్యాం జలం దగ్ధం కూపూష్వపి తథైవచ |

అస్మాన్తన్దహ్య వ్లుెచ్ఛత్వం కాం గతి ప్రాపయిష్యసి. 53

ఏవం ప్రలపతాం తాసాం వహ్ని ర్వచన మబ్రవీత్‌ |

అగ్నిః : స్వవశే నైవ యుష్మాకం వినాశంతు కరోమ్యహమ్‌ 54

అహ మాదేశకర్తావై నాహం కర్తాస్మ్య నుగ్రహమ్‌ | రుద్రక్రోధసమావిష్టో విచరామి యథేచ్ఛయా. 55

తతో బాణో మహాతేజా స్త్రిపురం వీక్ష్య దీపితమ్‌ | ఆసనస్థోబ్రవీదేవ మహం దేవై ర్వినాశితః 56

అల్పసత్త్వై ర్దురాచారై రీశ్వరస్య నివేదితమ్‌ | అపరీక్ష్య త్వహం దగ్ధ శ్శజ్కరేణ మహాత్మనా. 57

నాన్యశ్శక్తస్తు మాం హన్తుం వర్జయిత్వా మహేశ్వరమ్‌ | ఉత్థితశ్శిరసా కృత్వా లిజ్గం త్రిభువనేశ్వరమ్‌. 58

నిర్గత్యతు పురద్వారా త్పరిత్యజ్య సుహృత్సుతా9 | రత్నాని సువిచిత్రాణి స్త్రియో నానావిధా స్తథా. 59

గృహీత్వా శిరసా లిజ్గం గచ్ఛ న్గగనమణ్డలమ్‌ | స్తువంశ్చ దేవదేవేశం త్రిలోకాధిపతిం శివమ్‌. 60

త్వత్కోపానలనిర్ధగ్ధో యది వధ్మోస్మి శజ్కర | త్వత్ర్పసాదా న్మమాదేవ మా మే లిజ్గం వినశ్యతు. 61

అర్చితం హి మాయా దేవ భక్త్యా పరమయా సదా |

త్వత్కోపా ద్యది వధ్యోహం తదిదం మా వినశ్యతు. 62

శ్లాఘ్య మేత న్మహాదేవ త్వత్కోపా ద్దహనం మమ | ప్రతిజన్మ మహాదేవ త్వత్పాదనిరహతో హ్యహమ్‌. 63

తోటకచ్ఛన్దసా దేవం స్తౌమి త్వాం పరమేశ్వర |

మరికొందరు స్త్రీలు తమ బాలురు మరణించిన శోకముతో ఏమియు తోచక ఏడ్చుచుండిరి. వహ్నీ : నీవు మా పూర్వశత్రువువతె నిర్దయుడవయి మహాక్రోధముతో దహించుచున్నావే! వ్లుెచ్ఛుడా ! నీవు పుష్కరిణులయందును బావులందును గల నీటిని కూడ కాల్చితివి; మమ్ములను కూడా దహించి ఏ గతి పొంందితువో తెలియదు; అని ఇట్లు వారు ప్రలాపములు చేయుచుంగ విని అగ్ని ఇట్లు పలికెను: నేను నా ఇచ్ఛతో మీకు నాశము కలిగించుట లేదు. నేను (శివుని) ఆదేశ మాచరింతునే కాని స్వయముగ అనుగ్రహము చూపగలవాడగాను; రుద్రుని క్రోధము నన్నావేశించగా అతని ఇచ్ఛ ననుసరించి నడుచుకొనుచున్నాను; అనెను అంతట తన ఆననమందున్న మహాతేజస్కుడగు బాణుడు త్రిపురము జ్వలించు చుండుట చూచి ఇట్లనెకొనెను; దేవతలు నన్ను నాశమందించిరి. అల్పసత్త్వులు (మనస్సున నిబ్బరము అంతగా లేని వారు) దురాచారులు నయి ఈశ్వరునకు నా మీద నివేదించినారు; శంకరుడు తాను మమాత్ముడయ్యు (గొప్ప మనస్సుకల వాడు అయియు) సరాగా విచారించకయే నన్ను దహించుచున్నాడు; మహేశ్వరుడు తప్ప నన్ను చంపగలవారు ఎవరును లేరు; అనుచు అతడు లేచి నిలిచి త్రిభువనేశ్వరుడగు లింగరూపని శిరమున ధరించి పురద్వారము వెలువడెను; పుత్త్ర మిత్రులను మహా విచిత్ర రత్నములను నానా విధ స్త్రీ జనమును విడిచెను. లింగమును మాత్రము శిరమున నుంచుకొని గగన మండలములోనికి పోవుచు దేవదేవేశుడును త్రిలోకాధిపతియు గను శివుని ఇట్లు స్తుతించసాగెను. శంకారా! నీ కోపాగ్నిచే నేను నిర్దగ్ధుడగు అయితిని-అగుచున్నాను; నేను నీకు వధ్యుడనుగా తోచితినేమో! అగుగాక! మహాదేవా! నీ ప్రసాద ప్రభావమున నా ఈ లింగము మాత్రము నశించకుండుగాక! దేవా! నే నింతవరకును పరమభక్తితో నీ ఈ లింగమును అర్చించియుంటిని గదా! కావున నేను నీకు వధ్యుడనుగా తోచినను ఇది మాత్రము నశించకుండవలయును; మహాదేవా! నీ కోపముచే నేను దహింపబడుటయు మోచ్చదగినదే! ప్రతిజన్మమందును నేను నీ పాదములం దాసక్తి కలవాడను కావలయునను నా కోరికను మన్నించి అనుగ్రహించుము; పరమేశ్వరుడవగు నిన్ను దేవా ! తోటకఛందస్సుతో ఇదే స్తుతింతును; అని ఇట్లు బాణుడు తోటక వృత్తములతో శివుని స్తుతించెను.

బాణాసురకృతశివస్తుతిః.

ఓం : శివ శజ్కర శర్వ హారాయ నమో | భవ భీమ మహేశ్వర దేవ నమః. 64

కుసుమాయుధదేహవినాశకర త్రిపురాన్తక అన్ధక శూలదర |

ప్రమాదప్రియకాన్తవిభ(ర)క్త నమ | స్ససురాసుసిద్ధగణౖ ర్నమిత. 65

హయవానరసింహగ జేన్ద్రముఖై -| రతిహ్రస్వకదీర్ఘముఖైశ్చ గణౖః |

ఉపలబ్ధు మశక్యతరై -|రమరైర్వ్యథితోస్మి శరీరశ##తైర్బహుభిః 66

ప్రణోతోస్మి భవం భవ ! భక్తి మతిశ్చలచన్ద్రకలాకులదేవ! నమః |

న హి పుత్త్రకళత్రహయాదిధనం ! సతతం మమ దేవ తవ స్మరణమ్‌. 67

వ్యథితోస్మి తు బాహుశ##తై ర్బహుభి-|ర్గమితాచ మహానరకస్య గతిమ్‌ |

న నివర్తతి జన్మ న పాపమతి శ్శుచికర్మ నిబద్ధమపి త్యజతి. 68

అనుకమ్పతి విభ్రమతి త్రసతి | మమ చైవ కుకర్మ నివారయతి |

యః పఠే త్తోటకం వృత్తం ప్రయత శ్శుచిమానసః. 69

బాణసై#్యవ యథా రుద్ర స్తసై#్యవం వరదో భ##వేత్‌ | ఇదం స్తవం మహాదివ్యం శ్రుత్వా దేవో మహేశ్వరః.

ప్రసన్నస్తు తదా తస్య స్వయం దేవో మహేశ్వరః |

ఈశ్వరః ! న భేతవ్యం త్వయా వత్స సౌవర్ణే తిష్ఠదానవ. 71

పుత్త్రపౌత్త్రనుహృద్బన్దుభార్యబన్ధుజనై స్సహ | అద్యప్రభృతి బాణ త్వ మవధ్య స్త్రిదశైరపి. 72

భూయ స్తస్య వరో దత్తో దేవదేవేన పాణ్డవ | అక్షయశ్చావ్యయో లోకే విచరస్వాకుతోభయః. 73

బాణాసుర కృత శివస్తుతి

''ప్రణవ స్వరూపా! శుభరూపుడవు శుభకరుడవు పాపుల హింసించువాడవు పాపముల హరించువావు మన్మథ శరీర నాశకుడవు త్రిపుర నాశకుడవు అంధకుని చంపిన వాడవు శూలధరుడవు ప్రియురాలగు పార్వతియందలి ప్రీతితో దేహమును విభిజించుకొని సగమామెకిచ్చి ఆమెకు ప్రీతిపాత్రుడయినవాడవు సుందరుడవు సురాసుర సిద్ధగణములచేతను హయకపి సింహగజ ముఖులను మిగుల పొట్టివోపాడవయినచో అగు ముఖములు గలవారునగు ప్రమథులచేతను నమస్కాములందుకొనువాడువునగు నీకు నమస్కారము; వీరు ఇట్టి స్వభావము గలవారని గ్రహింపనలవికాని దేవతల వలనను అనేక జన్మములందు కలిగిన వందలకొలది శరీరముల వలనను చాల వ్యథలనందితిని. భవుడవగు నీయందు భక్తిగల మతిగల వాడనగుచు నిన్ను నమస్కరించుచున్నాను; చలించుచుండు చంద్రకళతో వ్యాప్తుడవగు దేవా! నమస్కారము; దేవా ! నీకు పుత్త్రకళత్ర హయాది ధనమువలదు; సతతము నీ స్మరణము కావలయును; ఈ అనేక శతబాహువులతో కూడా నాకు వ్యథయే కలుగుచున్నది; వీని మూలమున నేను నరకగతిని పొందింపబడుదునే కాని పుణ్యగతి నందను; వీనిచే జన్మ నివృత్తి కలుగదు, పాపమతియగువాడు నిబద్దమగు (శాస్త్ర విహితమగు) పవిత్ర కర్మమును విడిచి పెట్టును; కాని నామనస్సు వెనువెంటనే మాటిమాటికి కంపించుచున్నది, భ్రాంతి నందుచున్నది; భయమందుచున్నది; అందుచే నన్ను దుష్కర్మమునుండి నివారించుచున్నది.

ప్రయతుడయి (స్నానముచేసి మడుగు వస్త్రముల ధరించి) శుచి మనస్కుడయి ఈ తోటక వృత్త రూపమగుస్తవమును పఠించువానిని శివుడగు బాణు ననుగ్రహించినట్లే యనగ్రహించి అతనికి వరదుడగును. ఈ మహా దివ్యస్తవమును విని మహేశ్వర మహాదేవుడు బాణునియందు ప్రసన్నుడై అతనితో ఇట్లెనెను: వత్సా! దానవా ! భయమందకుము; నీవు నీ పుత్త్ర పౌత్త్ర మిత్రబందు భార్యా తద్భంధుజనులతో కూడా సువర్ణ నగరమందుందువు; ఇక మీదటను నీవు దేవతలకును అవధ్యుడవగుదువు; అని ధర్మరాజా! శివుడు అతనికి ఇంకను మరొక వరమును ఎవరి వలనను దేవని వలనను భయము లేక అక్షయము అవ్యయమును (నశించినది మార్పులేనిది) అగు లోకమందు విహరించునట్లును వరమును కూడా ఇచ్చెను.

తతో నివారయామాస రుద్ర స్సప్తశిఖం తదా | తృతీయం రక్షితం తస్య పురం తేన మహాత్మనా. 74

ధ్రమత్తు గగనే దివ్యం రుద్రతేజః ప్రభావతః | ఏవం తత్త్రిపురం దగ్ధం శజ్కరేణ మహాత్మనా. 75

జ్వాలామాలాప్రదీప్తంతు పతితీం ధరణీతలే | ఏకం నిపతితం తత్ర శ్రీశైలే త్రిపురాన్తకే. 76

ద్వితీయవ పతితం తత్ర పర్వతేమరకణ్టకే | దగ్ధేతు త్రిపురే రాజ న్రుద్రకోటిః ప్రతిష్ఠితా. 77

జ్వల త్తదవత త్తత్ర తేన జ్వాలేశ్వరస్స్మృతః | ఊర్ధ్వేన ప్రస్థితా స్తస్య తత్తజ్జ్వాతా దివం గతాం. 78

హహాకార స్తదా జాతో దేవాసురకృతో మహా9 | శర మస్తమ్భయ ద్రుద్రో మాహేశ్వరపురోత్తమే. 79

ఏవం వృత్తం తదా తస్మి న్పర్వతేమరకణ్టకే | చతుర్దశాఖ్యం భువనం స భుక్త్వా పాణ్డునన్దన. 80

వర్షకోటిసహస్రేతు త్రింశత్కోట్య స్తథాపరాః | తతో మహీతలం ప్రాప్య రాజా భవతి ధార్మికః. 81

పృధీవీ మేకచ్ఛత్రేణ భుజ్త్కే నాస్త్యత్ర నంశయః | ఏవం పుణ్యోమమారాజ పర్వతో7మరకణ్టకః. 82

చన్ద్రసూర్యోవరాగేషు యో యాత్యమరకణ్టకే | అశ్వమేధా ద్దశగుణం ప్రవదన్తి మనీషిణః 83

స్వర్గలోక మవాప్నోతి దృష్ట్యా తత్ర మహేశ్వరమ్‌ | బ్రహ్మహత్యా గమిష్యన్తి రాహుగ్రస్తేదివాకరే. 84

తదేవం నిఖిలం పుణ్యం పర్వతేమరకణ్టకే | మనసాపి స్మరేద్యస్తు గిరిం త్వమరకణ్టకమ్‌. 85

చాన్ద్రాయణశతం సాగ్రం లభ##తే నాత్ర సంశయః | త్రయాణామపి విఖ్యాతో లోకానామమరకణ్టకః. 86

అంతట మహాత్ముడగు రుద్రుడు అగ్నిని నివారించి బాణుని మూడవ పురమును రక్షించెను. (స్వర్ణ రజత లోహ పురములలో బంగరు పురము కొంతకాలక మిగిలెను.) అది దివ్యమయి రుద్ర తేజఃప్రభావమున గగనమున తిరుగుచుండెను; మహాత్ముడగు శంకరుడిట్లు త్రిపుర దహనమొనర్చెను; అవి జ్వలామాలలతో ప్రదీప్తములగు ధరణీ తలమున పడెను; వానిలో ఒకటి శ్రీశైల సమీపమున త్రిపురాంతకమున పడెను-రెండవది అమరకంటక పర్వతమున నర్మదా తీరమున పడెను; త్రిపుర దాహానంతర మమరకంటక పర్వతమున కోటి రుద్రులు (లింగములు) ప్రతిష్ఠింపబడిరి; (త్రిపురములలో ఒకటి) అచట అది జ్వలిచుచు పడినందున ఆ ప్రదేవము జ్వాలేశ్వరమనబడెను; ఆ మండెడు త్రిపుర ఖండపు జ్వాలలు పైకి బయలుదేరి ద్యులోకమునకు పోయెను; అపుడు దేవతలును అసురులును మహా హాహా కారము చేసిరి. మహేశ్వరానుగ్రహ పాత్రమయిన బాణుని సువర్ణపురమందలి అగ్ని మరి ప్రజ్వలించకుండ రుద్రడది స్తంభింపజేసెను; రాజా! పూర్వము అమరకంటకమున జరిగిన వృత్తాంతము ఇది; ఈ అమరకంటక పర్వతమందు మృతి నందు వాడు వేయియు ముప్పదికోట్ల సంవత్సరములపాటు చతుర్దశ భువన సుఖములనుభవించును; తరువాత భూతలమున ధార్మికుడగు రాజుగును; పృథివిని ఏకచ్ఛత్రముగా పాలించును; ఇందు సంశయము లేదు; మహారాజా! అమరకంటక పర్వతము ఇంత పుణ్యకరమయినది; చంద్ర సూర్య గ్రహణకాలములందట యాత్ర చేసినచో అశ్వమేధ ఫలమునకు పదిరెట్ల ఫలము కలగునని పెద్దలందురు; రవి గ్రహణమున అట శివుని దర్శించినచో స్వర్గ ప్రాప్తి బ్రహ్మహత్యా పాప నివృత్తి యగును; ఇట్లందంతయు పుణ్యమే; దానిని, మనస్మారించినను సమగ్రముగా నూరు చాంద్రాయణ వ్రతములాచరించినంత ఫలము లభించును; ఇది త్రిలోక ప్రపిద్ధ ప్రదేశము.

ఏస పుణ్యో గిరిశ్రేష్ఠ స్సిద్ధగన్ధర్వసేవితః | నానాద్రుమలతాకీర్ణో నానాపుష్పోపశోభితః. 87

మృగవ్యాఘ్ర సహసై#్రస్తు సేవ్యమానో మహాగిరిః | తత్ర సన్నిహితో రాజన్దేవ్యా సహ మహేశ్వరః. 88

బ్రహ్మా విష్ణు స్తథా చన్ద్రో విద్యాధరగణౖ స్సహ | ఋషిభిం కిన్నరై ర్యక్షై ర్నిత్యమేవ నిషేవితః. 89

వాసుకిస్పహిత స్తత్ర క్రీడతే పన్నగోత్తమైః | ప్రదక్షిణంతు యః కుర్యా త్పర్వతేమరకణ్టకే. 90

పౌణ్డరీకస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః | తతో జ్వాలేశ్వరం నామ తీర్థం సిద్ధనిషేవితమ్‌.

తత్ర స్నాత్వా దివం యాన్తి యే మృతా స్తే7పునర్బవాః |

జ్వాలేశ్వరే మహారాజ న్యస్తు ప్రాణా న్పరిత్యజేత్‌. 92

చన్ద్రసూర్యోపరాగేషు శృణు తస్యాపి యత్పలమ్‌ | సర్వకర్మవినిర్తుక్తో జ్ఞానవిజ్ఞానసంయుతః. 93

'అమరా' నామ దేవాస్తే పర్వతేమరకణ్టకే | రుద్రలోక మవాప్నోతి యావదాభూతవ్ల్పుపమ్‌. 94

అమరేశస్య దేవస్య పర్వతస్య ఉభే తటే | కోటిశో ఋషిముఖ్యాస్తే తప స్తప్యన్తి సువ్రతాః 95

సమన్తా ద్యోజనం రాజనేత్రం చామరకణ్టకమ్‌ | ఆకామో వా సకామో వా నర్మదాయాశ్శుభే జలే. 96

స్నాత్వా ముచ్యేత పాపేభ్యో రుద్రోలోకం స గచ్ఛతి. 96||

ఇతి శ్రీమత్య్స మహాపురాణ నర్మదామాహాత్మ్యే ఈశ్వరకృతబాణాసుర త్రిపురాదాహో నామ సప్తాశీత్యుత్తరశతతమోధ్యాయః.

పుణ్యకరమగు ఈ అమకంటకము సిద్ధ గంధర్వ సేవితమగు పర్వత శ్రేష్టము; నానావృక్షలతా వ్యాప్తము; నానా పుష్పశోభితము; వేలకొలది మృగములును వ్యాఘ్రములును దాని నాశ్రియంచియుండును; రాజా; దానియందు దేవితో కూడి మహేశ్వరుడును బ్రహ్మయు విష్ణువును చంద్రుడును విద్యాధరులును ఋషులును యక్ష కిన్నరులును వాసుకియు అతని యనుచరులగు పన్నగ శ్రేష్ఠులను సన్నిహితులయి దానిని ఆశ్రియించియుందురు; అమరకంటక పర్వతమునకు గిరి ప్రదక్షిణము చేసిన మానవునకు పౌండరీక యజ్ఞ ఫలము లభించును; ఈ అమరకంటకమునకు తరువాతిదియగు జ్వాలేశ్వరమను తీర్థము సిద్ధులును సేవించునది; దనియందు స్నానమాడినవారు పునరావృత్తి లేక శాశ్వత స్వర్గ సుఖ మందుదురు; చంద్రసూర్యగ్రహణ సమయములందిందు స్నానమాడినవారు సర్వకర్మ వినిర్ముక్తులయి జ్ఞాన విజ్ఞాన సంయుతులగుదురు; ప్రళయకాలము వరకు రుద్రలోక వాసులగుదురు; అమరులనగా దేవతలు కావునను వారిచటనుందురు కావునను దీని కమరకటకమని వ్యవహారము (కటతకమనగా వసతి స్థానమనియు అర్ధుము అమరులకు నావాస స్థానము కావున అమరకటకము అనబడినది; అదియే క్రమముగా వ్యవహారములలో కంటకము అని మారియుండును?) దేవతాత్మకమును అమరేశుని స్థానమును అగు ఈ అమరకంటక పర్వతపు రెండు ప్రక్కలందును సువ్రతులగు ఋషి ముఖ్యులు తపమాచరించుచుందురు; అమరకంటకమునకు చుట్టునుగల యోజన దూరములో నర్మదానదీ శుభజలమునందు స్నానమాడినవారు పాపముక్తులై రుద్రలోకమందుదురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున ఈశ్వరుడు బాణాసురుని త్రిపురములను దహించుటయను నూట డెబ్బది ఏవవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters