Sri Matsya mahapuramu-2    Chapters   

పఞ్ఛశీత్యుత్తరశతతమోధ్యా7యః.

నర్మదామాహాత్మ్యప్రారమ్భః.

ఋషయః : మహాత్మ్య మవిముక్తస్య యథావ త్కథితం త్వయా|

ఇదానీం నర్మదాయాస్తు మహాత్మ్యం వద సత్తమ. 1

యత్రోఙ్కారస్య మహాత్మ్యం కపలాసజ్గమస్యచ | అమరేశస్య చైవాహు ర్మాహాత్మ్యం పాపనాశనమ్‌. 2

కథం ప్రళయకాలేపి న నష్టా నర్మదా పురా| మార్కణ్డయశ్చ భగవా న్న వినష్ట స్తదాహ వై. 3

త్వయోక్త మాదిసర్గే య త్తన్నో విస్తరతో వద | సూతః ఏతదేవ పురా పృష్టః పాణ్డవేన మహాత్మనా. 4

నర్మదాయస్తు మమాత్మ్యం మార్కణ్డయా మహామునిః | ఉగ్రేణ తపసా యక్తో వనస్థో వనవాసినా. 5

పృష్టః పూర్వం మహాభాగో ధర్మపుత్త్రేణ ధీమతా !

యుధిష్ఠరః : శ్రుతా మే వివిధా ధర్మా స్త్వత్ప్రసాదా ద్ద్విజోత్తమ. 6

భూయశ్చ శ్రోతు మిచ్ఛామి తన్మే కథయ సువ్రత | కథ మేషా నదీ పుణ్యా సర్వలోకేషు విశ్రుతా. 7

నర్మదా నామ విఖ్యాతా బ్రూహి మే మునిసత్తమ |

మార్కణ్డయః : నర్మదా సరితాం శ్రేష్ఠా సర్వపాపప్రణాశినీ. 8

ధారయే త్సర్వభూతాని స్థావరాణి చరాణిచ | నర్మదాయాస్తు మహాత్మ్యం పురాణ యన్మయా శ్రుతమ్‌. 9

తదేతద్వై మహారాజ సర్వంతు కథయామి తత్‌ | పుణ్య కనఖలే గజ్గా కురుక్షేత్రే సరస్వతీ. 10

గ్రామే వా యదివారణ్య పుణ్య సర్వత్ర నర్మదా |

త్రిభి స్సారస్వతం తోయం సప్తాహేనతు యామునమ్‌. 11

సద్యః పునాతి గాఙ్గేయం దర్శనాదేవ నర్మదా | కళిఙ్గదేశస్యా ర్దేచ పర్వతేమరకణ్టకే. 12

పుణ్యాచ త్రిషులోకేషు రమణీయా మనోరమా | సదేవాసురగన్ధర్వా ఋషయశ్చ తపోదనాః .13

తపస్తప్త్వా మహారాజ సిద్దించ పరమాం గతాః తత్ర స్నాత్వా నరో రాజ న్నియమస్థో జితేన్ద్రియః. 14

ఉపోష్య రజీ మేకాం కులానాం తారయే చ్ఛతమ్‌|

నూట ఎనుబదియైదవ అధ్యాయము.

నర్మదా మాహాత్మ్యకథానారంభము.

(గమనిక: ఈ నూట ఎనుబదియైదవ అధ్యాయము ఆరంభమందు 'ఓంకారస్య మాహాత్మ్యమ్‌' అనియు నూట తొంబది నాలుగవ అధ్యాయపు ఆరంభమునందు 'ఓంకారస్యాభివర్ణనమ్‌' అనియు ఈ నర్మదా తీర్థములకు సంబంధించిన పదములున్నవి. కాని ఈ నర్మదా తీర్థములలో కాని దీనికి సంబంధించిన క్షేత్రములందు కాని 'ఓంకార' మనునది ఇందు కనబడుటలేదు. కాని ఈ నర్మదా నదీ తీరమందలి తీర్థములలో ఒకటియగు కుసుమేశ్వర తీర్థ సమీపమున అంకోల (ఊడుగ) వృక్షము కదలదనియు అచట పితరులకు పిండాన మనంతఫలదమనియు చెప్పబడినది (190 అధ్యాయము); అంకోల వృక్షమునకీ ప్రాశస్త్యము అపూర్వమయినది; నర్మదా సాగర సంగమ సమీపమున కూడ అంకోలేశ్వరమను ప్రదేశము నేడును ఉన్నది.

కాని శ్రాద్ధకల్పాధ్యాయమునందు ఈ తీర్థపు ప్రశంస కలదు; ప్రకరణమునుబట్టి ఈ ఓంకార క్షేత్రము నర్మదా తీరమందలి తీర్థక్షేత్రమే; ఇందలి దేవత 'నీలగాయత్రి' అనియు. ఈ ప్రదేశమునకు ప్రస్తుతము 'ఓంకారేశ్రము' ఓంకారనాథము' అని పేరులు అనియు ఇది నర్మదా తీరమునందు నేటి మధ్యప్రదేశ్‌ నీమార్‌ జిల్లాలోని ఖాండ్వాకు 32 మైళ్ళు వాయవ్యముగా 'మాంధాతృ ద్వీపము'లో ఉన్న ఓంకారనాథము అనియు తెలియుచున్నది. ఇట్లే ఈ నర్మదా మహాత్మ్య ప్రకరణమునందలి 'కావేరీ' నది కూడా 'కౌబేరీ' నదియని భూగోళ వ్యవస్థా ప్రకరణములలోని వింద్య పర్వత సంజాత నదుల పట్టికలో ఉన్నది. ఇచ్చటి 188 అధ్యాయపు విషయ ప్రతిపాదనమును బట్టి కూడ ఇది 'కౌబేరీ' అని ఉండవలెను.)

ఋషులు సూతుని ఇట్లు వేడిరి; సత్తమా! (సజ్జనులలో ఉత్తమా!) నీవు మాకు అవిముక్త క్షేత్ర మమాత్మ్యమును ఉన్నదియున్నట్లు (మా కన్నులకు కట్టినట్లు) తెలిపితివి. ఇపుడిక నర్మదా మహాతమ్మ్యమును తెలపవేడుచున్నాము.

నర్మదా సంబంది తీర్థములందును ఓంకార కపిలా సంగమామరేశ తీర్థముల మాహాత్మ్యము పాపనాశకమందురు. పూర్వపు ప్రళయ సమయమందును నర్మద నశించలేదనియు మార్కండేయ భగవానుడు కూడ అపుడు నశింపకుండెననియు అది నర్గ వృత్తాంతమున నీవు తెలిపి ఉంటివి. అది ఎట్లు? మాకు సవిస్తరముగా తెలుపుము.

అనగా సూతుడు ఋషులకిట్లు చెప్పెను; పూర్వము మహాత్ముడు వనస్థుడు దీమంతుడునగు పాండవుడు (ధర్మరాజు) వనమునకు వచ్చిన ఉగ్ర తపోయుక్తుడు మహాభాగుడునగు మార్కండేయ మహామునిని ఈ నర్మదా మహాత్మ్య విషయమే అడిగెను. ఏమనిని ద్విజోత్తమా! నీ యనుగ్రహున వివిద ధర్మములను వింటిని. సువ్రతా! ఇంకను వినవలెననియున్నది; కావున నాకింకను అవి చెప్పుడు. నర్మదయను ఈ పుణ్యనది ఏల సర్వలోకములందును వినబడుచు విఖ్యాతయ్యెనో మనిసత్తమా! నాకు తెలుపుడు. అని ధర్మరాజుడుగ మార్కండేయుడిట్లు చెప్పసాగెను.

నర్మద నదులన్నిటిలో శ్రేష్ఠము; సర్వపాప ప్రణాశనము; స్థిరచర భూతములనన్నిటిని ఆ నది తనయందు ధరించి పోషించును. తన్మాహాత్మ్యమును నేను పురాణమందుండి వినినట్లు చెప్పెదను; అది యంతయు మహారాజా! వినుము. కనఖల క్షేత్రమునందు గంగయు కురుక్షేత్రమునందు సరస్వతియు (ఇతర ప్రదేశములందు కంటె) ఎక్కువ పుణ్యంతములు; నర్మదానదియో-గ్రామమునందేకాని-అరణ్యమునందే కాని ఎచ్చట ప్రవహించుచుండియు పుణ్యకరమే; మూడు నాళ్ళ స్నానాదికముచే సరస్వతీ నదియే ఏడు దినముల స్నాదికము చేయు యమునయు పవిత్రత కలిగించును. గంగాతీర్థము స్నానాదికముచే తత్‌క్షణము పవిత్రత నిచ్చును. నర్మద దర్శన మాత్రముననే పవిత్రత కలిగించును.

* కళింగదేశపు 'అర్ధము' (హద్దు) నందు ఉన్న అమరకంటక పర్వతమున ఈ నర్మద ముల్లోకములందలి అన్నిటి కంటెను మనస్సును ఆకర్షించునదియు ఆనందిపజేయునదియు నయి యున్నది. మహారాజా: ఇచట దేవాసుర గంధర్వులును ఋషులును మునులును తపమాచరించి పరమ సిద్దింనదిరి. స్నానమాడి నియమస్థుడు జితేంద్రియుడుఐ ఒకరాత్రి ఉపసించిన వాని నూరు తరములవారు తరింతురు.

జలేశ్వరే నర స్న్సాత్వా పిణ్డం దత్వా యథావిధి.

పితర స్తస్య తృప్యన్తి యావదాభూత సవ్ల్పువమ్‌ | పర్వతస్య సమన్తాత్తు రుద్రకోటిః ప్రతిష్ఠితా. 16

య స్స్నానం కురుతే తత్ర గన్ధమాల్యానులేపనైః | ప్రీత స్తస్య భ##వే చ్ఛర్వోరుద్రోటి ర్నసంశయః. 17

పశ్చిమే పర్వతస్యాన్తే స్వయం దేవో మహేశ్వరః |

తత్ర స్నాత్వా శుచిర్భూత్వా బ్రహ్మచారీ జితేన్ద్రియః .18

పితృకార్యం చ కుర్వీత విధిదృష్టేన కర్మణా | తిలోదకేన రేవాయాం తర్పయే త్పితృదేవతాః. 19

అసప్తమం కులం తస్య స్వర్దే మోదతి పాణ్డవ | షష్టి ర్వర్ష సమస్రాణి స్వర్గలోకే మహీయతే. 20

అప్సరోగణసఙ్కీర్ణే సిద్ధచారణ సేవితే | దివ్యగన్ధానులిప్తశ్చ దివ్యాలఙ్కారభూషితః. 21

తత స్స్వర్గా త్పరిభ్రష్టో జాయతే విమలే కులే | ధనవా స్థానశీలశ్చ ధార్మికశ్చైవ జాయతే. 22

పున స్మ్సరతి తత్తీర్థం గమనం తత్రకుర్వతే | కులాని తారయే త్సప్త రుద్రలోకం స గచ్చతి. 23

యెజనానాం శతం సాగ్రం శ్రూయతే సరిదుత్తమా | విస్తారేణతు రాజేన్ద్ర యోజనద్వయ మాయతా. 24

షష్టితీర్థసహస్రాణి షష్టికోట్య స్తథైవచ | పర్వతస్య సమన్తాత్తు దృశ్యంతే మరకణ్డకే. 25

* మత్య్స-185అ.శ్లో.12 'కళింగదేశస్యార్ధే చ పర్వతేమరకంటకే' కళింగదేశపు హద్దులలో అమర కంటకమను పర్వతమున. దీనిని బట్టి ఒకనాడు కళింగదేశము నర్మదానదీ ఉద్గమ (నిర్గమ) స్థానము వరకు వ్యాపించి యుండెను. (ఆంధ్ర దేశమునందు ఉదయగిరి వరకు కళింగ రాజ్యము వ్యాపించినట్లును 16వ శతాబ్దినాడును అతః పూర్వమును పిఠాపురము కళింగ దేశాంతర్భాగమయినట్లును) అని ఊహించివచ్చును. ఈ అధ్యాయములో అమర కంటకమునుండి నర్మదా సాగర సంగమము వరకు గల తీర్థము లనేకముల విరించబడినవి.

బ్రహ్మచారీ శుచిర్భూత్వా జితక్రోధో జితేన్ద్రియః | సర్వహింసానివృత్తస్తు సర్వభూతహితే రతః 26

ఏవంశర్వసమాచారో యస్తు ప్రాణాన్పరిత్యజేత్‌ | తస్యపుణ్యఫలం రాజ ఞ్ఛృణుష్వావహిత మమ. 27

అమర కంటకమునందలి జలేశ్వరమున స్నానమాడి యథావిధిగా పిండదానము చేసినచో వాని పితరులకు ప్రళయ కాలము వరకు నిలుచు తృప్తి కలుగును. ఈ పర్వతమున అంతటను కలసి కోటిరుద్రులు ప్రతిష్ఠితులయి యున్నారు. అచట స్నానమాడి గంధ మాల్యాను లేపనములతో శివునారధించినచో కోటిరుద్రులును ప్రీతులగుదరు. సందియములేదు. ఈ పర్వతపు పడమటి యంచున మహేశ్వరుడు స్వయముగా నున్నాడు. అచట శుచియు బ్రహ్మచారియు జితేంద్రియుడనై యథావిధిగా పితృకార్యమాచరించినచో నదియందు తిలోదకముతో పితరులకు తర్పణమిచ్చినచో వాని ఏడు తరములవారు స్వర్గమున ఆనందింతురు. తానును అరువదివలే సంవత్సరములపాటు అప్సరోగణ సిద్ధచారణ పూర్ణమయిన స్వర్గమున దివ్యగంధ మాల్యానులిప్తుడై దివ్యాలంకార భూషితుడై పూజ్యతనందును తదుపరి స్వర్గమునుండి భ్రష్టుడయ్యును విమ వంశమున ధనవంతుడు దానశీలుడు ధార్మకుడునయి జనించును. మరల అ తీర్థమును స్మరించి అచటికి పోయి సేవించి ఏడు తరముల వారిని తరింపజేయును; తానును రుద్ర లోకమునకుగును. నర్మదా నది మొత్తము నూరు యోజనముల పొడవునను రెండు యోజనముల వెడల్పునను నున్నదందురు. అమరకంటక పర్వతమందంతటను ఈ నదికి అరువది కోట్ల అరువేది వేల తీర్థములన్నివి. ఈ అమర కంటకమున నర్మదా తీర్థము నందు బ్రహ్మచారియు శుచియు జితక్రోధుడు జితేంద్రియుడనై సర్వభూత హితసక్తుడై ఏహింసయు లేక శివారాధన సమాచరణముతో జీవించి అచట ప్రాణత్యాగము చేసివానికి లభించు పుణ్యఫలమును వినుము.

శతం వర్షసహస్రాణం స్వర్దే మోదన్తి పాణ్డవ | అప్సరోగణజ్కీర్ణే దివ్యస్త్రీపరివారితే. 28

దివ్యగన్ధానులిప్తశ్చ వస్త్రాలజ్కారభూషితః | క్రీడతే దేవలోకస్థో దైవతైస్సహ మోదతే. 29

తత స్స్వర్గా త్పరిభ్రష్టో రాజా భవతి వీర్యవా | గృహంతు లభ##తే సౌమ్యం నానారత్న విబూషితమ్‌. 30

స్తమ్భైర్మణిమయై ర్దివ్యై ర్వజ్రవైడూర్యభూషితైః | ఆలేఖ్యసహితం దివ్యం దాసీదాససమన్వితమ్‌. 31

మత్తమాతజ్గశ##బ్దైశ్చ హయానాం హేషితేన చ | క్షభ్యతే తస్య తద్ద్వార మిన్ద్రస్య భవనం యథా. 32

రాజరాజేశ్వర శ్రీమాన్త్సర్వస్త్రీజనవల్లభః | తస్మిన్గృహే వసిత్వాతు క్రీడాభోగసమన్వితః 33

జీవేద్వర్షశతం సాగ్రం సర్వరోగవివర్జితః | ఏవం భోగో భ##వేత్తన్య యో మృతోమరకణ్టకే. 34

అగ్నౌ విశే జ్జలేవాపి తథా చైవ హ్యనశ##కే | అనివర్తికా గతి స్తస్య పవనస్యామ్భరే యథా. 35

పతనం కురుతే యస్తు అమరేశే నరాధిప |కన్యానం త్రిసహస్రాణి ఏకైకస్యాపి చాపరే. 36

తిష్టన్తి తస్య భవనే ప్రేషణం ప్రార్థయన్తి చ | దివ్యభోగై స్సుసమ్పన్నః క్రీడతే కాలమక్షయమ్‌. 37

పృథివ్యా మాసము ద్రాయా మీదృశో నైవ జాయతే | యాదృశోయం నర శ్రేష్ఠ పర్వతేమరకణ్టకే. 38

అతడు లక్షసంవత్సరముల కాలము అప్సరోగణముతోను దివ్య స్త్రీ జనముతోను వ్యాప్తమయిన స్వర్గమున ఆనందించును. వాడు దివ్యగంధానులిప్తుడై దివ్య వస్త్రాలంకార భూషితుడై దేవలోకమందుండి దేవతలతో కూడి విహరించుచు ఆనందించును. అనంతరము స్వర్గమునుండి భ్రష్టడయినను వీర్యవంతుడగు రాజగును. సౌమ్యమును నానారత్న విభూషితమును వజ్ర వైఢూర్య భూషితములగు మణిమయ స్తంభములతో కూడినదియు చిత్తరువులను దాన దాసీజనమును కలదియునగు గృహు కలవాడగును. వాని వాకిలి ఇంద్రభవన ద్వారమువలె మత్తగజ ఘీంకారములతోను హయహేషితములతోను కల్లోలితమయియుండును. అతడు రాజరాజులకును ఈశ్వరుడై సర్వస్త్రీ జన ప్రీతిపాత్రుడై ఆ ఇంట వసించు క్రీడా విహారభోగ సమన్వితుడయి ఏ వ్యాధులును లేక నిండుగా నూరేండ్లు జీవించును. అమర కంటక పర్వతమున మరణించిన వానికి కలుగు భోగము ఇట్టిది; నాశరహితమగు (విస్తృతమగు) అగ్నియందు కాని జలమునందుకానివాడు ప్రవేశించినను అతనికి వాయువునకు ఆకాశమునందువలె ఎదురులేని నడక ఉండును. దర్మరాజా! ఇచటి అమరేశ క్షేత్రమున మరణించిన వారిలో ప్రతియొకని ఇంటను మూడేసి వేలమంది కన్యలు నిలిచి ఏమి యాజ్ఞ అనుచు పనులు చేయ సంసిద్ధలయియుందురు. వాడు అక్షయ కాలమువరకు దివ్యభోగ సంపన్నుడయి విహరించును. ఆయా సముద్రముల అవధుల నడుమనున్న పృథివిపై ఎచ్చటను అమరకంటకపర్వతమునందున్న తీర్థ క్షేత్రప్రదేశము వంటిది లేదు.

తావ త్తీర్థంతు విజ్ఞేయం పరవతస్యతు పశ్చిమే | హ్రదో జలేశ్వరో నామ త్రిషు లోకేషు విశ్రుతః 39

తత్ర పిణ్డప్రదానేన సన్ద్యోపాసకర్మణా | పితారో దశర్షాణి తర్పితాస్తు భవన్తిచ. 40

దక్షిణ నర్మదాకూలే కపిలాఖ్యా మహానదీ | సకలార్జునసఞ్ఛన్నా నాతిదూరే వ్యవస్థితా. 41

సాపి పుణ్యామహాభాగా త్రిషు లోకేషు విశ్రుతా|

తత్ర కోటిశతం సాగ్రం తీర్థానంతు యుధిష్ఠిర. 42

పురాణశ్రూయతే రాజ న్త్సైర్వం కోటిగుణం భ##వేత్‌| తస్యా స్తీరేతు యే వృక్షాః పతితాః కాలపర్యయాత్‌.

తత్ర తీర్థే నరస్స్నాత్వా విశల్యో భవతి క్షణాత్‌ | సాతు పుణ్యా మహాభాగా త్రిషులోకేషు విశ్రుతా. 45

తత్ర దేవగణాస్సర్వే సకిన్నరమహోరగాః | యక్షరాక్షసగన్ధర్వా ఋషయశ్చ తపోధనాః 46

సర్వే సమాగతా స్తత్ర పర్వతేమరకణ్ఠకే | తైశ్చ సర్వై స్సమాగమ్య మునిభిశ్చ తపోధనైః. 47

నర్మదా మాశ్రితా పుణ్యవిశాల్యానమ నామతః | ఉత్పాదితా మహాభాగా మునిభిశ్చ తపోధనైః. 48

తత్రస్నాత్వా నరో రాజ న్బ్రహ్మచారీ జితేన్ద్రియః | ఉషోష్య రజనీ మేకాం కులానాం తారయే చ్ఛతమ్‌.

ఇంతకు లోపలనే ఈ అరమరకంటక పర్వతమునకు పశ్చిమమున త్రిలోక ప్రసిద్దమగు జలేశ్రమును హ్రదము (మడుగు) కలదు. అచట పిండ ప్రదానము చేసినను సంధ్యోపాననము చేసినను పితరులు పదిఏండ్లు తృప్తులయియుందురు. నర్మదా దక్షిణ తీరమునందు (కలియు) కపిలయను గొప్పనది కలదు. అది అంతటను మద్ది చెట్లో అవరింపబడి చాల దగ్గరలోనే యున్నది. మహాభాగయు పుణ్యయునగు ఆ మహా(గొప్ప)నదియు త్రిలోక ప్రసిద్దము. యుధీష్ఠిరా! దాని తీరమున సమగ్రముగా నూరుకోట్ల తీర్థములు కలవనియు పురాణములదు వినబడుచున్నది. ఆ నదీ తీరముల మొలచి పెరిగి కాల గతిలో పడిపోయిన (ప్రాణములు వదలిన) వృక్షముల కూడా నర్మదానదీ జలస్పర్శ పుణ్యముచే ఉత్తమగతి నుందును. అచ్చటి మరియొకనది విశల్య కరణి యనునది; దాని యందు స్నానము చేసి తత్షణము నరుడు విశల్యుడు(బాధలు లేనివాఉ) అగును. మహాభాగయగు ఆ పుణ్యనదియు త్రిలోక ప్రసిద్ధ; ఈ తీర్థములలో కూడిన అమరకంటక పర్వత ప్రాంతమునందు కిన్నర మహోరగ యక్షరాక్షస గంధర్వులును తపోధనులగు ఋషులు మునులును గములు గుములయి ఉందురు. వారంతదరలతో కూడినదియిన నర్మదను ఆనుకొని మహాభాగయు సర్వపాప ప్రణాశనియునగు ఈ వివల్య కరణీనది సృష్టింపబడినది; రాజా! నరుడు దానియందు స్నానమాడి బ్రహ్మచారియు జితేంద్రియుడనై ఒక దినముపవసించినచో వాని నూరు తరములవారు తరింతురు.

కపిలాచ విశల్యాచ శ్రూయేతే రాజసత్తమ | ఈశ్వరేన పురా ప్రోక్తే లోకానం హితకామ్యయా. 50

తత్ర స్నాత్వా నరో రాజ న్నశ్వమేధపలం లభేత్‌ | అనాశకంతు యః కుర్యా త్తస్మింస్తీర్థే నరాధిప. 51

సర్వపాపవిశుద్ధాత్మా రుద్రోలకం స గచ్ఛతి | నర్మదాయాస్తు రాజేన్ద్ర పురాణ యచ్ఛ్రుతం మయా. 52

తత్రతత్రనర స్స్నాత్వా చాశ్వమేధఫలం లభేత్‌ | యేవసన్త్యుత్తరే కూలే రుద్రలోకే వసన్తి తే. 53

సరస్తత్యాం చ గజ్గాయాం నర్మదాయాం యుధిష్టిర |

సమం స్నానంచ దానంచ యథా మే శజ్కరోబ్రవీత్‌. 54

పరిత్యజతి యః ప్రాణా న్పర్వతే మరకణ్టకే | వర్షకోటిశతం సాగ్రం రుద్రలోకే మహీయతే 55

నర్మదాయా జలం పుణ్యం ఫేనోర్మిసమలజ్కృతమ్‌ | పవిత్రం శిరసా వన్ద్య సర్వపాపైః ప్రముచ్యతే. 56

నర్మదా సర్వదా పుణ్య బ్రహ్మహత్యాపహారిణీ | అహోరాత్రోపవాసేన ముచ్యతే బ్రహ్మహత్యాయా. 57

ఏవం రమ్యాచ పుణ్యాచ నర్మదా పాణ్డునన్దన | త్రయాణామపి లోకానాం పుణ్య హేషా మహానదీ. 58

వటేశ్వరే మహాపుణ్య గజ్గాద్వారే తపోవనే | తేషు సర్వస్థానేషు యే ద్విజా స్సంశితవ్రతాః. 59

శ్రూయతే దశధా పుణ్యంనర్మదోదధిసజ్గమే. 59||

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మార్కణ్డయుయుధిష్ఠరసంవాదే నర్మదా మహిమానువర్ణనం నామ పఞ్ఛాశీత్యుత్తరశతతమోధ్యాయః.

లోకములకు హితము కలిగించు సంకల్పముతో ఈశ్వరుడు పూర్వము ఈ కపిలా విశల్యానదులు ఇంత పవిత్రములని చెప్పినట్లు విచుచున్నాము. అచట స్నానముచేసినచో అశ్వమేధ ఫలము లభించును. ఆ తీర్థమున లనాశకము (అనశనము-ఉపవాసము) చేసినవాడు సర్వపాపముక్తడై రుద్రలోకమునందును. నర్మదా సంబంధులగు అయా తీర్థములందు స్నానమాడిన అశ్వమేధ ఫలప్రాప్తియగునని పురాణమునందు నేను వింటిని. నర్మదోత్తర తీరమున నివసించువారు రుద్రలోకమునందు వసింతురు. సరస్వతీ గంగానర్మదా నదులయందును స్నానదానములు మొదలగునవి సమానముగా పుణ్యప్రదములని నాకు శంకరుడు చెప్పెను. అమరకంటక పర్వతమున ప్రాణత్యాగ మొనర్చినవాడు నూరుకోట్ల సంవత్సరములు రుద్రోలకమున వసించును. నురుగుతో అలలతో సమలంకృతమగు పవిత్ర పుణ్య నర్మదా నదీ జలమును శిరస్సుతో నమస్కిరించువాడుసర్వపాపముక్తుడగును. నరమద సదాపుణ్య; బ్రహ్మ హత్యాదోషాపహారిణి; అచట ఒక అహోరాత్రముపసించువాడు బ్రహ్మహత్యాముక్తినందును. పాండునందనా! మహాపుణ్యములగు వటేశ్వరమునం (గయయం) దును గంగా ద్వార(హరిద్వార)మునుందును తపోవనమునందును ద్విజులు సంశిత(మిగులు పవిత్రములగు) వ్రతములనాచిరించ ఎంత పుణ్యమందుదురో నర్మదా సాగర సంగమమున స్నానాదికమున అంతకు పదిరెట్ల పుణ్యము లభించును.

ఇది శ్రీమత్య్సమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున అమర కంటక పర్వతప్రాంత తీర్థ మహిమాను వర్ణనమను నూట ఎనుబది ఐదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters