Sri Matsya mahapuramu-2    Chapters   

త్ర్యశీత్యుత్తరశతతమో7ధ్యాయః

అవిముక్త మాహాత్మ్యమ్‌

ఈశ్వరః : సేవితం బహుభి స్సిద్ధై రపునర్భవకాజ్‌క్షభిః |

విదిత్వా తు పరం క్షేత్ర మవిముక్తం సమాశ్రయేత్‌ 1

తద్గుహ్యం దేవదేవస్య తత్తీర్థం తత్తపోవనమ్‌ | పరం స్థానం తు తే యాన్తి సమ్భవన్తిన తేపునః. 2

జ్ఞానే విహిత నిష్ఠానాం పరమానన్ద మిచ్ఛతామ్‌ | యా గతి ర్విహితా సావిమక్తే మృతస్య తు. 3

భవస్య ప్రీతి రతులా హ్యవిముక్తే హ్యనుత్తమా అసజ్ఖ్యేయం ఫలం తత్రం హ్యక్షయా చ గత ర్భవేత్‌. 4

పరం గుహ్యం సమాఖ్యాతం శ్మశానమతి సంజ్ఞితమ్‌ | అవిముక్తం న సేవన్తే వఞ్చతాస్తే నరా భువి .5

అవిముక్త స్థితైః పుణ్యౖః పాంసుభి ర్వాయునేరితైః | అపి దుష్కృతకర్మాణో యాస్యన్తి పరమాం గతిమ్‌.

అవిముక్తగుణా వక్తుం దేవదానవమానవైః | న శక్యంతేప్రమేయత్వా త్స్యయం యత్రభవ స్థ్సితః. 7

నాహితాగ్ని ర్నయజ్వావా నశుచి స్తస్కరోపి వా | అవిముక్తే వసేద్యస్తు స వసే దీశ్వరాలయే. 8

తత్ర నాపుణ్యకృత్కశ్చి త్ప్రసాదా దీశ్వరస్యచ | జ్ఞానేనాజ్జానతో వాపి స్త్రియావా పురుషేణ వా. 9

యత్కించి దశుభం కర్మం కృతం మానుషబుద్ధినా | అవిముక్తం ప్రవిష్టస్య తత్సర్వం భస్మసాద్భవేత్‌. 10

సరిత స్సాగరా శ్శైలా స్తీర్థాన్యాయతనానిచ | భూతప్రేతపిశాచాశ్చ గణా మాతృగణా స్తథా. 11

శ్మశానకపరీవారః ప్రియస్తస్య మహాత్మనః | తేన ముఞ్చన్తి శమ్భుంచ శమ్భుస్తాన్న విముఞ్చతి. 12

రమతేచ గణౖస్సర్ద మవిముక్తే స్థితః ప్రభుః | దృష్ట్వైతా న్దీనకృపణా న్పాపదుష్కృతకర్మిణః. 13

కృపయా తస్య దేవస్య జాయతే పరమా గతిః | భక్తానుకమ్పీ భగవాం స్తిర్యగ్యోనిగతేష్వపి. 14

భవత్యేవ పరం స్థానం యత్ర యాన్తి చ యాజ్ఞికాః | భృగవో7జ్గిరస్సిద్ధా ఋషయశ్చ మహావ్రతాః. 15

అవిముక్తాగ్ని నా దగ్ధా హ్యగ్నౌ తూలమివాహితమ్‌|

నూట ఎనుబది మూడవ అధ్యయము

అవిముక్త మాహాత్మ్యము-ఈక్షేత్ర విశిష్టతకు హేతువులు.

ఈశ్వరుడిట్లనెను: పునర్జన్మ రాహిత్యము కోరు సిద్దులనేకులు సేవించినదగు అవిముక్తక్షేత్ర మహిమ నెరగి ఆ పరమక్షేత్రము నాశ్రయముగా చేసికొనవలెను. అది దేవ దేవుని గుహ్యస్థానము-గుహ్య తీర్థము తపోవనము-దానికేగిన వారు మరల జన్మించరు. పరమానందముకోరి జ్ఞానమునందు సమాహిత చిత్తులగు వారికి కలుగు ఉత్తమ గతి అవిముక్తమున మరణించినంతనే కలుగును; భవునకు దీనియందు గల ప్రీతి అనుత్తమము అసమానమును; అచట అసంఖ్యేయమగు ఫలమును అక్షయ గతియు లభించును; ఇది పరమగుహ్యమగు శ్మశానము; దీనిని సేవింపని నరులు వంచితులయినట్లే; అచటి ధూళి రేణువులు గాలికి ఎగివచ్చి తాకినంతనే పాపకర్ములుకూడా ముక్తినందుదురు; శివుని నిత్య నివాసమగు అవిముక్తపు గుణములు ఇంతింత ఇట్టివి. అని చెప్ప శక్యముకానవి; వానిని దేవ దానవ మానువలెవ్వరును వర్ణింప జాలరు; అహితాగ్ని యజ్ఞకర్త శుచికాక తస్కరుడే ఐనను అవిముకత్తమున వసించువాడు ఈశ్వరాలయమున వసించినట్లే; అచట పుణ్యవంతుడు కానివాడెవ్వడును లేడు; స్త్రీ కాని పురుషుడు కాని తెలిసియో మావన సహజ బుద్ధితోనో చేసిన ఏ పాప కర్మమయినను అవిముక్తమును ప్రవేశించినంతనే ఈశ్వర ప్రసాదము నశించును; నదులు సముద్రములు పర్వతములు క్షేత్రములు తీర్థములు భూత ప్రేత పిశాచములు ప్రమథగణ మాతృ గణముల మొదలగు శశ్మాన సహజ పరివారములు అన్నియు ఆ మహాత్మునకు శివునకు ప్రియములు; అవి శివుని విడువపు; శివుడు వానిని విడువడు; ఆ ప్రభువచట నుండి గణములతో విహరించు చుండును; పాపా దుష్కృతకారులగు దీనులను కృపణులను అతడు దయతోచూచి అచట నుందు వారికి పరమగతి నొనగును; భక్తాను కంపా పరుడగు ఆ భగవానునకు తిర్యగ్యోని గతములగు పశపక్ష్యాది ప్రాణులయందును దయయే; భృగ్వంగిరసాదులగు మహావ్రతులగు సిద్ధులును పరమ ఋషులును తమ పాపాములు అగ్నియందు వేసిపన దూదివలె దగ్ధమగుటకై ఎచటకి యాత్ర చేయుదరో అట్టి అవిముక్తము పరమోత్తమ స్థానమొట్లు కాకపోవును?

న సా గతిః కురుక్షేత్రే గఙ్గాద్వారేథ పుష్కరే. 16

యా గతి ర్విహితా పుంసా మవిముక్తనివాసివామ్‌ | తిర్యగ్యోనిగతా గత్వా యేవిముక్తే కృతాలయాః.

కాలేన నిధంన ప్రాప్తా స్తే యాన్తి పరమాం గతిమ్‌ | మేనుమన్దరమాత్రేపి రాశిః పాపస్య కర్మణః. 18

అవిముక్తం సమాసాద్య తత్సర్యం వ్రజతి క్షయమ్‌ | శ్మశానమితి విఖ్యాత మవిముక్తం శివాలయమ్‌. 19

తద్గుహ్యం దేవదేవస్య తత్తీర్ణం తత్తపోవనమ్‌ | తత్ర బ్రహ్మాదయో దేవా నారాయణ పురోగమాః. 20

యోగిన శ్శతశ స్సిద్ధా భగవన్తం సనాతనమ్‌ | ఉపాసన్తే శివే భక్తా మద్భక్తా మత్పరాయణాః 21

యా గతిర్ఞానతపసాం యా గతి ర్యజ్ఞయాజినామ్‌ | అవిముక్తే మృతానాం తు సా గతి ర్విహితా సదా. 22

సంహర్తారశ్చ కర్తార స్తస్మిన్బ్రహాదయ స్సురాః | సమ్రాడ్విరాణ్మయా లోకా జాయన్తే హ్యపునర్భవాః.

మహాజనస్తపశ్చైవ సత్యలోక స్తథైవచ | మనసః పరమో యోగో భూతభవ్యభవిష్యచ. 24

బ్రహ్మాదిస్థావరాన్తసక్య యోనిం సాఙ్ఖ్యవిమోక్షయోః | అవిముక్తం న ముఞ్చన్తి నరస్తే నైవ వఞ్చితాః.

ఉత్తమం సర్వతీర్థానం స్థానానా ముత్తమం తథా | క్షేత్రాణా ముత్తమం చైవ శ్మశానానాం థతైవచ. 26

తటాకానాంతు సర్వేషాం కూపానాం స్రోతసాం తథా |

శైలానా ముత్తమం శైలం తీర్థనా ముత్తమం తథా. 27

మ్రియద్బి ర్హరభ##క్తైశ్చ హ్యవిముక్తం తు సేవ్యతే |

బ్రహ్మణః పరమం స్థానం బ్రహ్మణాధ్యాసితంతు యత్‌ 28

బ్రహ్మణా సేవితం నిత్యం బ్రహ్మణా చైవ రక్షితమ్‌ | తసై#్యవ సప్తభువనం కాఞ్ఛనో మేరుపర్వతః. 29

మనసః పరమో యోగః ప్రీత్యర్థం బ్రహ్మణ స్సతు | బ్రహ్మాతు తత్ర భగవాం స్త్రిసన్ధ్య మీశ్వరే స్థితః. 30

పుణ్యాత్పుణ్యతమం క్షేత్రం పుణ్యకృద్భి ర్నిషేవితమ్‌ |

ఆదిత్యోపాసనం కృత్వా విప్రాశ్చామరతాం గతాః. 31

అవిముక్త నివాసులకు కలుగు ఉత్తమగతి కురుక్షేత్రమునను గంగా ద్వారమునను పుష్కరమునను కలుగదు; తిర్యక్ప్రాణులయినను అచటికి పోయి అది తమ నివాసముగా చేసికొనినచో తమ కాలము వచ్చి మృతినంది ముక్తులగుదురు; మేరు మందల పర్వత సమాన పాపరాశియయినను అవిముక్తమునకు పోగానే నశించును; ఇది మహా శ్మశానము నిత్య శివాలయము. దేవ దేవుని గుహ్యమగు తీర్థమును తపోవనమును; అచట శివుడనగు నాయందు భక్తిగల బ్రహ్మవిష్ణ్వాది దేవతలును యోగులును సిద్దులును వందలకొలదిమంది మద్భక్తులు నన్నే పరమగతిగా భావించి భగవానుడు సనాతనుడు (శాశ్వతడు) నగు నన్నుపాసింతుడరు; జ్ఞాన తపోవంతులకు యజ్ఞకర్తలకు కలుగు ఉత్తమగతులు అవిముక్త నివాసులకు కలుగును; లోకకర్తులును లోక సంహారకులునునగు బ్రహ్మాది దేవతలును సమ్రాట్‌ విరాట్స్వరూపులగు ఈశ్వరతత్త్వములును పుర్జన్మ కలుగనీయని ఉత్తమ లోకములును మహర్జనస్తపన్సత్యలోకాదులును నా నుండి ఉద్భవించునవిన్నియు ఎచట నుండు వారికి లభించునో ఏది మనస్సునకును భూతభవిష్య వర్తమానములకును బ్రహ్మది స్థావరాంత భూతములకును సాంఖ్యతత్త్వమునకును ముక్తికిని జన్మహేతువో అట్టి అవిముక్తము నాశ్రయించువారు వంచితులు కాక తమ జన్మమును సఫల మొనర్చకొన్నవరే యగుదురు; అది అన్ని తీర్థములందు స్థానముంలదు క్షేత్రములందు శ్మశానములందు తటాకములందు కూపములందు జల ప్రవాహములందు శైలములందును ఉత్తమమయినది; దీనిని శివ భక్తులు మృతనందబోవుచు సేవించిననను ముక్త లగుదురు; ఇది బ్రహ్మకు పరమస్ఠానము; బ్రహ్మకు ఆశ్రయము; బ్రహ్మచే సేవితము; బ్రహ్మచే రక్షితము; బ్రహ్మలోకములగు సప్తభువనములును ఇవియే; కాంచన మేరుపర్వతము ఇదియే; ఇది మానస పరమయోగము; ఇది బ్రహ్మకు పరమ ప్రీతికరము; ఇచట భగవానుడగు బ్రహ్మ త్రిసంధ్యములందును ఈశ్వరుని యందు ఉండును. ఇది పుణ్యమగు వానిలో పుణ్యతమమగు స్థానము; పుణ్యము చేసినవారే దీనిని సేవింతురు; ఇచట ఆదిత్యోపాన మొనర్చిన విప్రులు అమరత్వము నందిరి;

అన్యేపి యేత త్రయో వర్ణ భవభక్తా స్సమాహితాః | అవిమక్తే తమం త్యక్త్వా గచ్ఛన్తి పరమాం గతిమ్‌. 32

అన్యా యాః కామచారిణ్యంః స్త్రియో భోగపరాయణాః | కాలేన నిధనం ప్రాప్తా గచ్చన్తి పరమాం గతిమ్‌.

అష్టౌ మాసా న్విహారస్య యతీనాం సంయతాత్మనామ్‌ | ఏకత్ర చతురో మాసా నబ్దం వా నివసే త్పునః. 34

అవిముక్తే ప్రవిష్టానాం విహారస్తు నవిద్యతే | న దేహో భవితా తత్ర దృష్టం శాస్త్రే వరాననే. 35

మోక్షోహ్యసంశయ స్తత్ర పఞ్చత్వంతు గతస్యచ | స్త్రియః పితివ్రతాయాశ్చ భవభక్తా స్సమాహితాః. 39

అవిముక్తే తు సన్త్యక్త్వా(జ్య) గచ్ఛన్తి పరమాం గతిమ్‌ | యత్రయోగశ్చ మోక్షశ్చ ప్రాప్యతే దుర్లభో సరైః.

అవిముక్తం సమాసాద్య నాన్యద్గచ్ఛే త్తపోవనమ్‌ | సర్వాత్మనా భవ స్సేవ్యో బ్రాహ్మణన నసంశయః. 38

అవిముక్తే వ సేద్యస్తు మమ తుల్యో భ##వేన్నరః | యతో మయా న ముక్తంహి అవిముక్తం తతః స్మృతమ్‌.

అవిముక్తంన సేవన్తే మూఢా యే పాపసందయుతాః | విణ్మూత్రరేతసాం మధ్యే తే వసన్తి పునఃపునః. 40

కామః క్రోధశ్చ లోభశ్చ దమ్భః స్తమ్భోతిమత్సరః | నిద్రా తన్ద్రీ తథాలస్యం పైశున్య మితి తే దశ. 41

అవిముక్తే స్థితా విఘ్నా శ్శక్రేణ విహితాస్స్వయమ్‌ | వినాయకోపసర్గశ్చ సతతం మూర్ద్ని తిష్ఠతి. 42

పుణ్యమేత ద్భవేత్సర్వం భక్తానా మనుకమ్పయా | వరం గుహ్యమితి జ్ఞాత్వా తత్తచ్ఛాస్త్రానుమోదనాత్‌.

హ్యహృతం దేవదేవైస్తు మునిభి స్తత్త్వ దర్శిభిః | మేదసా విప్లుతా భూమి రవిముక్తేతు వర్జితా. 44

పుతా సమభవత్సర్యా మహాదేవేన రక్షితా | సంస్కార స్తేన క్రియతే భూమే రన్యత్ర సూరిభిః. 45

ప్రియాః ఇతరులుగు మూడు వర్ణములవారును (క్షత్రియ వైశ్య శూద్రులును) సమాహితులయి భవునియందు భక్తి గలిగి ఈ అవిముక్తమున తనువు విడిచినచో పరమగతి నందుదురు. ఇతరులగు కామ(స్వేచ్ఛా) చారాణులును భోగపరాయణలగు స్త్రీలు కూడా ఇచట నివసించుచో తమ కాలము వచ్చి మృతి నందిన తరువాత పరమగతి (ముక్తి) నందుదురు. నియత మనస్కులగు యతులు కూడా ఇతర ప్రేశములందయినో సంవత్సరమున ఎనిమిది మాసములు సంచరించుచు నాఉలు మాసము లోకచోట నుండుట విహితము; ఈ అవిముక్తమున ప్రవేశించిన తరువాత వారు సంచరించుచుండ నక్కరలేదు. (ఈ అవిముక్తమున యతులు ఏడాది పొడవును కదలక ఒకేచోట నున్నను దోషము కాదు.) అచట నుండు వారికి దేహము ఉండదు. అని శాస్త్రమునందు కనబడుచున్నది. అచట పంచత్వము (మరణము) నందిన వారికి ముక్తి కలుగుట నిస్సంశయము; భవునియందు భక్తలయి సమాహితచిత్తలగు పతివ్రతలగు స్త్రీలును అవిముక్తమున దేహత్యాగ మొనర్చి పరమగతి నందుదురు. ఇచట నరులకు దుర్లభమగు భోగముక్తలు రెండును లభించును. కావున ఇటలకు వచ్చినవారు మరి యే తపోవనమునకు పోవ పని లేదు. బ్రాహ్మణుడు సర్వభావముతో భవుని సేవింపవలయును; అట్లు అవిముక్తమున వసించు విప్రుడు నాతో సమానుడగును; నేను దాని నెన్నడును విడువను. కావుననే దాని కవిముక్తమని పేను; దానిని సేవింపని మూఢులు పాపయుతులయి మరల మరల మలమూత్ర రేతస్సుల నడుమ నుండువారే యగుదరు; కామాము క్రోధము లోభము దంభమ స్తంభము (విర్రవీగుట) అతిమత్సరము నిద్ర-భద్దకము-అలసత్వము పిశునత్ము (కొండెములు చెప్పుట) అను పదియు అవిముక్తమున ఇంద్రుడు స్వయముగ ఏర్పరిచిన విఘ్నములు; వినాయకుడు కలిగించు ఉపసర్గము (ఉపద్రవము) పదునొకొండవది ఎప్పుడును తలమీద కూర్చుండి యుండును; ఇన్ని యున్నను ఇవి భక్తుల నను గ్రహించు బుద్ధితో వారికి శుభకరములే యగునను. ఈ మరమ రహస్యము శాస్త్రముల పరిశీలించిన దేవదేవలును తత్త్వదర్శులగు మునులును వచించిరి; మధుకైటభుల మేదస్సుతో తడిసినందున భూమికి మేదినియని వ్యవహారము కలిగెను; అవిముక్తమునందలి భూమికి మాత్రము వారి మేదస్సుతోడి సంబంధము లేదు; కావున ఇతర స్థానములందలి భూమికి వలె ఇచటి భూమకి సంస్కరింపకున్నను అది స్వాభావికముగా పవిత్రము అగునని నిర్ణయించి మహాదేవు డిచటి భూపవిత్రతను రక్షంచుచున్నాడు.

యేభక్తా వరదం దేవ మక్షరం పరంమ పదరమ్‌ | ఏదవదానవగన్దర్వ యక్షరక్షో మహోరగాః. 46

అవిముక్త ముపాసన్తే తన్నిష్ఠా స్తత్పరాయణాః | తం విశన్తి మమాదేవ మాజ్యాహుతి రివానలమ్‌. 47

తంవై ప్రాప్య మహాదేవ మీశ్వరాధ్యుషితం శుభమ్‌ | అవిముక్తే కృతార్థోస్మీ త్యాత్మాన ముపలక్షయేత్‌.

ఋషిదేవాసురగణౖ ర్జపహోమపరాయణౖః | యతిభి ర్మోక్షకామైశ్చ హ్యవిముక్తం నిషేవ్యతే. 49

నావిముక్తే మృతః కశ్చిన్నరకం యాతి కిల్బిషీ | ఈశ్వరానుగృహీతాహి సర్వే యాన్తి పరాంగతిమ్‌. 50

ద్వియోజన మథార్ధం చ తతేత్రం పూర్వపశ్చిమమ్‌ | ఆర్ధయోజనవిస్తీర్ణం దక్షిణోత్తరత స్థ్సితమ్‌. 51

వారాణసీ నదీ యాచ యావచ్ఛుక్లనదీ తు వై | ఏతతేత్రస్య విస్తారః ప్రోక్తో దేవేన ధీమతా. 52

లబ్ద్వా యోగం చ మోక్షం చ కాజ్ఞ్యతే జ్ఞాన ముత్తమమ్‌ |

అవిముక్తం న ముఞ్చన్తి మన్నిష్ఠా మత్పరాయాణాః. 53

అస్మిన్వసన్తి యేమర్త్యా నతే శోచ్యాః కథఞ్చన | చోగక్షేత్రే సిద్దగన్ధర్వసేవితే. 54

సరిత స్సాగరా శ్శైలా అవిముక్తే సమాశ్రితాః | భూర్లోకే చాన్తరిక్షేచ దివి తీర్థాని యానిచ. 55

అతీత్య వర్తతే సర్వాణ్యవిముక్తం ప్రభావతః | యేత ధ్యానం సమాసాద్య యుక్తాత్మాన స్సమాహితః. 56

సన్నియామ్యేన్ద్రియగ్రామం జపన్తి శతరుద్రియమ్‌ | అవిముక్తే స్థితా నిత్యం కృతార్థా స్తే ద్విజాతయః. 57

భవభక్తిం సమాసాద్య రమన్తేతే సునిశ్చితాః | సంహృత్య భక్తితః కామా న్విషయేభ్యో బహి స్థ్సితాః. 58

శక్తితః స్సంగతో ముక్తా శ్శక్తిత స్తపసి స్థితాః | న తేషాం పునారావృత్తిః కల్పకోటి శ##తైరపి. 59

కరణా నీహచాత్మాన మపునర్భవభావితాః | తం వై ప్రాప్య మహాదేవ మీశ్వరం నిర్భయా స్థ్సితాః. 60

అవిముక్తేతు గృహ్‌న్తే భ##వేన విబునా స్వయమ్‌ |

దేవదానవ గంధర్వ యక్షరక్షో మహానాగాది భక్తు లెవరు అవిముక్తవాసియు వరదుడు అక్షరుడు పరమపరరూపుడు నగు మహాదేవుని పరమగమ్యముగ శ్రద్ధతో భావించి ఉపాసింతురో వారు ఆజ్యాహుతి అగ్రిహోత్రమునందు వలె శివునియందే ప్రవేశింతురు; ఈశ్వరున కాశ్రయమును శుభామును నగు అవిముక్తమును చేరిన వారు తాము మహాదేవునందే చేరిరని భావించవలయును; జపహోమ పరాయణులగు ఋషులును దేవాసురులును ముక్తికాములగు యతులను అవిముక్తము నాశ్రయింతురు.; ఇచట మృతి నందిన పాపియు ఎవడును నరకము నందడు; దీని నాశ్రించినవా రెల్లరును ఈశ్వరాను గ్రహమును పరమగతి నందుదురు; ఈ క్షేత్రపు తూర్ప పడమరల పొడవు రెండున్నర యోజనములు (రెండు యోజనములని లోగడ చెప్పబడినది); దక్షిణోత్తరముల వెడలుపు అర్ధ యోజనము; ఇది వారానసీ నదీ శుక్లనదుల నడుమ నున్నది; అని ఈ క్షేత్ర విస్తారము ధీమంతుడగు మహాదేవుడు చెప్పెను; ఉత్తమ జ్ఞానమును మోక్షమును కోరి యోగసాధన నాశ్రయించి మన్నిష్ఠులు (నాయందే శ్రద్ద కలవారు) మత్పరాయణులు (నన్నే పరమగమ్యముగా భావించినవారు) అయి అవిముక్తమును విడువక ఇట నివసించినవారు శోచ్యులుకారు (బినందింపబడవలసినవారే) అన్ని నదులను సముద్రములను పర్వతములును యోగక్షేమమమును తపః క్షేత్రమును సిద్ధ గంధర్వ సేవితమును నగు అవిముక్తమునందే యుండును; అవిముక్తము భూమ్యంతరిక్ష ద్యులోకములందలి సకల తీర్థములను తన ప్రభావముచే అతిశయించి యున్నది; ద్విజులు ఎవరు నిరతమును అవిముక్తమునందే యుండి ధ్యాన మవలంబించి మనస్సును భవునందు యోజించి సమాహితచిత్తులయి ఇంద్రియముల నిగ్రహించి శత రుద్రియమ (మను వేదభాగ)మును జపింతురో వారు కృతార్థులు; అట్టి భవభక్తులు నిశ్చయముగ ఆనంద మందుదురు; భక్తి కలిగి కామములను (మనువేదభాగ)మును జపింతురో వారు కృతార్థులు; అట్టి భవభక్తులు నిశ్చయముగ ఆనంద మందుదురు; భక్తి కలిగి కామములను(ప) సంహరించి మనస్సుని గ్రహించుకొని అవిముక్తవాసులగు వారు శతకోటి కల్పముల తరువాత కూడా మరల జన్మింపరు; వారు పునర్జన్మ రహితులయి మహాదేవుడగు ఈశ్వరుని చేరి నిర్భయులయి యుందురు; ఇచట నుండువారిని భవుడు తానే ద్గరకు తీసుకొనును.

ఉత్పాదితం మహాక్షేత్రం సిద్ద్యన్తే యత్రమానవాః. 61

ఉద్దేశమాత్రం కథితా హ్యవిముక్తగుణ స్తథా | సముద్రస్యేవ రత్నానా మవిముక్తస్య విస్తరమ్‌. 62

మోహనం తదభక్తానాం జన్తూనాం బుద్దివర్దనమ్‌ | మూఢా స్తేపి న పశ్యన్తి శ్మశానమితి మోహితాః. 63

హన్యమానోపి యో విద్వాన్‌ వసే ద్విఘ్నశ##తై రపి | స యాతి పరమం స్థానం యత్ర గత్వా న శోచతి.

జన్మమృత్యుజరాముక్తం పరజ్ఞానం శివాలయమ్‌ | అపునర్మరణానాం హి సా గతి ర్మోక్షకాజిణామ్‌. 65

యం ప్రాప్య కృతకృత్యస్స్యా దితి మన్యేత పణ్డితః |

న దానై ర్న తపోభిర్వా న యజ్ఞై ర్నాపి విద్యాయా. 66

ప్రాప్యతే గతిరిష్టా తు యావిముక్తేతు లభ్యతే | నానావర్ణా వివర్ణాశ్చ చణ్డాలా యే జుగుప్సితాః 67

కిల్బిషైః పూర్ణదేహాశ్చ ప్రకృష్టైః పాతకైరపి | భేషజం పరమం తేషా మవిముక్తం విదు ర్బుధాః. 68

జాత్యన్తర సహస్రేషు హ్యవిముక్తే మ్రియేత యః | భక్తో విశ్వేశ్రే దేవే న స భూయోపి జాయతే. 69

తత్ర జప్తం హుతం దత్తం తప స్తప్తం తథా కృతమ్‌ |

సర్వ మక్షయ మేతస్మి న్నవిముక్తే న సంశయః. 70

కాలేనోపరతా యాన్తి భవసాయుజ్యతాం ధ్రువమ్‌ | కృత్వా పాపసహ స్రాణి పశ్చా త్సన్తాపమేత్య వై. 71

అవిముక్తే వియుజ్యేత స యాతి పరమాం గతిమ్‌ | ఉత్తరం దక్షిణం వాపి అయనం న వికల్పయేత్‌. 72

సర్వ స్తేషాం శుభః కాలో హ్యవిముక్తే మ్రియన్తియే |

న తత్ర కాలో మీమాంస్యో శుభం వా యది వాశుభమ్‌. 72

తస్య దేవస్య మహాత్మ్యా త్థ్సాణో రద్భుతకర్మణః | సర్వేషామేవ నాధస్య సర్వేషాం విశునా స్వయమ్‌.

శ్రుత్వేద మృషయ న్సర్వే స్కన్దేన కథితం పురా | అవిముక్తాశ్రయం పుణ్యం భావయన్‌ కరుణౖ శ్శుభైః.

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ దేవీదేవసంవాదే అవిముక్త మహాత్మ్యే త్ర్యశీత్యుత్తరశతతమోధ్యాయః.

మానవులకు సిద్ధి కలుగుటకై ఈ క్షేత్రమును శివు డుత్పాదించెను. అవిముక్తక్షేత్ర గుణములను ఉద్దేశ (పేరుల చెప్పుట) మాత్రముగా ఇట్లు తెలిపితిని; అవి సముద్రపు రత్నములవలె అనంతములు; భక్తులు కానివారి బుద్ధికిని మోహమును (ఇంకను మూఢత్వమును) భక్తులగు ప్రాణులకు బుద్ధి వృద్దిని కలిగించును; మూఢూలు మోహితులయి ఇది శ్మశానమే యను భావముతో చూతురు; వందల విఘ్నములు కలుగుచున్నను. ఇట వసించు వివేకులు శోకరహితముగ ముక్తి కోరువారి కది పరమగతి; దీనిని చేరితిని కాని కృతకృత్యుడ నయితినని భావించువాడు వివేకి; అవిముక్తమున లభించు ఇష్టపతి దానములతో యజ్ఞములతో తపముతో విద్యలతో లభించకపోవచ్చును; సంకరవర్ణులు వర్ణరహితులు (ఏ వర్ణవ్యవస్థయు లేని దేశములవారు) చండాలురు జుగుప్సితులు (జనులచే అసహించుకొనబడువారు) పాపపూర్ణ శరీరులు మహాపాతకులు నగు వారికిని ఇది పరమౌషధము; అని పండితుల చెప్పుచున్నారు; వేలకొలదిగా గల ఆయా ప్రాణి జాతులందు పుట్టియున్న దేహధారియైనను అవిముక్త క్షేత్రమున మృతి నందినవాడు విశ్వేశ్వర భక్తుడే; వానికి పునర్జన్మ ముండదు; అందు ఆచరించిన జపహవన దానతపస్సు లన్నియు అక్షయ ఫలప్రదములు; ఇట్టివి చేసినవారు ఆచట నివసించుచు తమ కాలము వచ్చి మరణమంది నిశ్చయముగ శిసాయుజ్య మందుదురు; పాప సహస్రములు చేసినను పశ్చాత్తాప మంది అవిముక్తమున మరణించినను ముక్తి లభించును; అందు మరణించుటలో ఈ కాలము శుభమా అశుభమా యని మీమాంస చేయ పనిలేదు; స్థాణు(శాశ్వత) రూపుడు అద్భుత కార్యసమర్థుడు సర్వరక్షకుడు సర్వవిభుడు ఆ మహా దేవుని మహాత్మ్యముచే ఉత్తరాయనమో దక్షిణాయనమో ఏదయినను మందిదే.

పూర్వము స్కందుడు చెప్పిన ఈ అవిముక్తక్షేత్ర విషయక వృత్తాంతమును విని ఋషులు ఎల్లరును తమ తమ శుభములగు అంతః కరణములతో దానిని భావన చేసిరి.

ఇది శ్రీమత్య్స మహాపురాణమున స్కంద ఋషి సంవాదాంతర్గత దేవీదేవ సంవాద రూపమగు అవిముకత్త మహాత్మ్యము అను నూట ఎనుబది మూడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters