Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకాశీత్యుత్తరశతతోమోధ్యాయః.

స్కందసనకాదిసంవాదః- అవిముక్త(వారాణసీ)మహాత్మ్యమ్‌.

సూతః కైలాసపృష్ఠమాసీనం స్కన్దం బ్రహ్మవిదాం వరమ్‌ |

ప్రవచ్ఛు రృషయ స్సర్వే సనకాద్యా స్తపోధనాః 1

తథా బ్రహ్మర్షయస్సర్వే యే భక్తాస్తు మహేశ్వరే |

ఋషయః : బ్రూహి త్వం స్కన్ద భూలోకే యత్ర నిత్యం భవ స్థ్సితః. 2

మహాత్మా సర్వభూతాత్మా దేవదేవ స్సనాతనః | ఘోరరూపం సమాస్థాయ దుష్కరం దేవదానవైః. 3

అభూతసవ్ల్పువం యావ త్థ్సాణుభూత స్థ్సితః ప్రభుః |

గుహ్యానాం పరమం గుహ్య మవిముక్త మితి స్మృతమ్‌. 4

అవిముక్తే సదా సిద్ధిర్యత్రనిత్యం భవస్థ్సితః | అస్యక్షేత్రస్య మహాత్మ్యం మదుక్తం త్వీశ్వరేణ తు. 5

స్థానం పరం పవిత్రంచ తీర్థమాయతనం తథా | శ్మశానసంస్థితం వేశ్మ దివ్యమన్తర్హితంచ యత్‌. 6

భూలోకే నైవ సంయుక్త మన్తరిక్షే శివాలయమ్‌ | అయుక్తాస్తు న పశ్యన్తి యుక్తాః పశ్యన్తి చేతసా. 7

బ్రహ్మచర్యవ్రతై శ్శాన్తా స్సిద్ధా వేదా న్తకోవిదాః | ఆదేహపతనాద్యావ తేత్రం యో న విముఞ్చతి. 8

బ్రహ్మచర్యవ్రతై స్సమ్యక్సమ్యగిష్టం మఖైర్భవేత్‌ |

అపాపాత్మా గతిస్సర్వా యాతూక్తా చ క్రియావతామ్‌ . 9

తై శ్శ్రేయసీం గతిం పుణ్యాం తథా యోగగతిం లభేత్‌ | న హి యోగగతిర్దవ్యా జన్మాన్తరశ##తైరపి.10

ప్రాప్యతే క్షేత్రమాహాత్మ్యా త్ప్రసాదా చ్ఛజ్కరస్య తు | యస్తత్ర వసతే నిత్యం సంయతాత్మా సమాహితః.

త్రికాలమపిభుఞ్చనో వాయుభక్షసమో భ##వేత్‌ | నిమేషమాత్రమపియో హ్యవిము క్తే తు భక్తిమా9. 12

బ్రహ్మచర్యసమాయుక్త స్స పరం తప్యతే తపః | తత్ర మాసం వసేద్వీరో జితాత్మా విజితేన్ద్రియః. 13

సమ్యక్తేన వ్రతం చీర్ణం దివ్యం పాశుపతం మహత్‌ |

జన్మమృత్యుభయం తీర్త్వా స యాతి పరమాం గతిమ్‌. 14

నైః శ్రేయసీం గతిం పుణ్యం తథా యోగగతిం వ్రజేత్‌ |

నూట ఎనుబది ఒకటవ అధ్యాయము.

స్కంద సనకాది సంవాదము-అవిముక్త మహాత్మ్యము.

సూతుడు ఋషుకిట్లు చెప్పెను: తపోధనులగు సనకాది సర్వఋషులును మహేశ్వర భక్తులగు సర్వ మహర్షలును కైలాస పర్వతపు నెత్తమున కూర్చున్నవాడును బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడునగు స్కందుని ఇట్లడిగిరి. స్కందా! మహాత్ముడు సర్వభూతములకు ఆత్మభూతుడు దేవదేవుడు సనాతనుడు ప్రభుడునగు భవుడు (శివుడు) దేవదానవలకును దుష్కరమగు ఘోర రూపమును ధరించి స్థాణు భూతుడై భూత ప్రళయమువరకును భూలోకమందెచ్చట నిరంతరము ఉండునో అట్టి గుహ్యము (రహస్యము)లలో పరమ గుహ్యమగు క్షేత్రము అవిముక్తమని పెద్దలందురు. ఇచట నిత్యమును భవుడుండుటచే ఇది సదా సిద్ధిప్రదము; ఈశ్వరుడు చెప్పినట్లు ఈ క్షేత్ర మహాత్మ్యము ఇది; ఇది పరమ పవిత్ర స్థానము; ఇది తీర్థమును క్షేత్రమును; ఇచట శ్మశానమందే శివుని గృహము (శివాలయము) దివ్యమైనది. అంతర్హితమయి భూలోకముతో అంటక అంతరిక్షమునందున్నది; దీనిని యోగ సంస్కృతమగు చిత్తము కలవారు బ్రహ్మచర్య వ్రతములతో శాంతులయిన వేదాంతకోవిదులగు సిద్ధులు చూడగలరు; ఇతరులు చూడజాలరు; దేహపాతము అగు వరకును ఈ క్షేత్రమును విడువక నివసించుట లెస్సగా బ్రహ్మచర్య వ్రతముల ననుష్ఠించుటతోను చక్కగ యజ్ఞము లాచరించుటతోను సమానము; పాప రహితులయి ఉత్తమ కర్మానుష్టానము చేసిన వారును పుణ్యమయిన యోగ సాధన చేసినవారును పొంద ఉత్తమగతి ఆ మరణాంతము ఈ క్షేత్రమున నివసించుటచే లభించును. ఏలయన దివ్యయోగ సాధనచే ఉత్తమ గతియును జన్మశతములచే కూడా లభించకపోవచ్చును. అది ఈ క్షేత్ర మాహాత్మ్యమున శంకర ప్రసాదమున సులభమగును. ఇచట మనోనిగ్రహము కలిగి శివునియందు చిత్తము నిలిపి నిరతము వసించువాడు మూడు వేళల భుజించినను వాయు భక్షణమున జీవించునట్లే. అవిముక్త క్షేత్రమున దినమునకొక నిమేష మాత్రమయినను భక్తియుక్తడై బ్రహ్మచర్యము కలిగి తపమాచరించుచు ఇంద్రియములను మనస్సును జయించి మానమాత్రము నియమ పరుడై వసించువాడు మహాదివ్య పాశుపత వ్రతము ననుష్ఠించునట్లే; అట్టివాడు జన్మ మృత్యుభయము నతిక్రమించి పరమ గతినందును. పుణ్య లభ్యమగు నిఃశ్రేయ (పారలౌకిక) గతిని యోగసిద్ధి లభ్యమగు పరమగతిని అందును.

న హి యోగగతి ర్దివ్యా జన్మాతన్తరశ##తై రపి. 15

ప్రాప్యతే క్షే త్రమాహాత్మ్యా త్ప్రభావా చ్ఛజ్కస్యతు | బ్రహ్మహా యోహి గచ్ఛేత అవిముక్తం కదాచన .

తస్య క్షేత్రస్య మహాత్మ్యా ద్బ్రహ్మహత్యా నివర్తతే| ఆదేహవతనా ద్యావ తేత్రం యో న విముఞ్చతి. 17

న కేవలం బ్రహ్మహత్యా ప్రాక్కృతా చనివర్తతే | ప్రాప్యవిశ్వేశ్వరం దేవం న స భూయోనుజాయతే. 18

అనన్యమానసో భూత్వా యోవిముక్తం న ముఞ్చతి |

తస్య దేవ స్సదా తుష్ట స్సర్వా న్కామాన్పయచ్ఛతి. 19

ద్వారం యాత్సాజ్ఖ్యయోగానాం స తత్ర వసతి ప్రభుః | సగుణో హి భవో దేవో భక్తానా మనుకమ్పయా.

అవిముక్తం పరం క్షేత్ర మవిము క్తే పరా గతిః | అవిముక్తే పరా సిద్ధి రవిము క్తే పరం పదమ్‌ . 21

అవిముక్తం నిషేవేత దేవర్షిగణ సేవితమ్‌ | యఇచ్ఛే న్మానవో ధీమా న్పునర్జన్మ న చాత్మనః. 22

మేరో శ్శక్యా గుణా న్వక్తుం ద్వీపానాం తు తథై వచ | సముద్రాణాం చ సర్వేషాం నావిముక్తస్య శక్యతే.

అన్తకాలే మనుష్యాణాం ఛిద్యమానుషు మర్మసు | వాయూనాం శీర్యమాణానాం స్మృతి ర్నైవోపజాయతే. 24

అవిము క్తే హ్యన్తకాలే భక్తానా మీశ్వర స్స్వయమ్‌ | కర్మభిః ప్రేర్యమాణానాం కర్షజాపం ప్రయచ్ఛతి. 25

అవిమ క్తే త్యజే ద్దేహం గతిమిష్టాం స గచ్ఛతి | ఈశ్వర ప్రేరితో యాతి దుష్ప్రాప్య మకృతాత్మభిః. 26

అశాశ్వత మిదం జ్ఞాత్వా మానుష్యం బహుకిల్బిషమ్‌ | అవిముక్తం నిషేవేత సంసారభయమోచనమ్‌. 27

భోగమోక్షప్రదంపుణ్యం బహువిఘ్నవినాశనమ్‌ |

విఘ్నై రాలోక్యమానోపి యోవిముక్తం న ముఞ్చతి. 28

స ముఞ్చతి జరాం మృత్యుం జన్మ చైత దశాశ్వతమ్‌ |

అవిమక్తే ప్రసాదాత్తు శివసాయుజ్య మాప్నుయాత్‌. 29

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ స్కన్దసనకాదిమహర్షి సంవాదే అవిముక్త

మహాత్మ్యే ఏకాశీత్యుత్తరశతతమో7ధ్యాయః.

దివ్యయోగగతి నూరు జన్మాంతరములకును లభించకపోవచ్చును; కాని అవిముక్తమున మాత్రము ఈ క్షేత్ర మహాత్మ్యమున శంకర ప్రసాదమున అది లభించును; బ్రహ్మ హత్య చేసినవాడును ఒకమారైన ఈ క్షేత్రమునకేగినచో తన్మాహాత్మ్యమున అది నివ ర్తిల్లును; దేహపాతమగువరకు అతడిచట వసించుటచే ఆ బ్రహ్మహత్యా దోషమేకాక పూర్వకృత దోపములును నశించును; వాడు విశ్వేశ్వరుని సన్నిధినందును; మరల జన్మించడు; అనన్య మనస్కుడై ఇట విడువక వసించువాని విషయమున దేవుడు సంతుష్టుడయి సర్వకామముల నొసగును; సాంఖ్యయోగ తత్త్వములకు ద్వార భూతుడగు ప్రభువు అగు భవుడు మహాదేవుడ నగుణరూపుడై భక్తులయందలి దయతో ఆట వసించుచున్నాడు; అవి ముక్తము పరమక్షేత్రము; అచట ఉండుటచే పరమసిద్ది పరమపదము పరమగతి దొరకును;? పునర్జన్మము కలుగరాదనుకొను ధీమంతుడగు వాడు దేవర్షిగణ సేవితమగు అవిముక్తమును సేవించువలయును; మేరు పర్వతమునకు ద్వీపములకు సముద్రములకు గల గుణములనైన చెప్పగలము కాని ఈ అవిముక్త క్షేత్ర గుణముల చెప్పజాలము; అంతకాలమున మానవుల (ప్రాణులు) మర్మస్థానములు భిన్న మగుచుండగా ప్రాణ వాయువులు శిధిలమగుచుండగా స్మృతియే లేకుండపోవును; అప్పుడును ఈశ్వరుడు ఆయా కార్మలచే ప్రేరితులై బాధలనందు తన భక్తులకు తాను స్వయముగా కర్ణములందు మంత్రోపదేశమునిచ్చును. అవిముక్తమున దేహత్యాగమొనర్చువాడు ఉత్తమ సంస్కారమందిన ఆత్మలు లేనివారికి పొందరాని ఇష్టపరమ గతిని ఈశ్వర ప్రేరణచే పొందును. ఈ మానుష్యలోకము అశాశ్వతమును బహుపాపయుక్తమును; ఇది ఎరిగి సంసారభయ మోచనమగు అవిముక్తమును సేవించవలయును; ఇది భోగ మోక్షప్రదము-పుణ్యము-బహు విఘ్న వినాశనము విఘ్న సహితుడయినను అవిముక్తమును విడువక అట వసించువాడు అశాశ్వతమగు ఈ జన్మమును జరామృత్యువులను వీడి శివప్రసాదమున శివ సాయుజ్యమందును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున స్కంద ననకాది మహర్షి సంవాదరూమగు అవిముక్తక్షేత్ర మమాత్మ్యమను నూట ఎనుబది ఒకటవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters