Sri Matsya mahapuramu-2    Chapters   

షట్సప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

కాలనేమి విజయః.

శ్రీమత్స్యః: దానవానామనీకేషు కాలనేమిర్మహాసురః l వివర్థతమహాతేజా స్తపాన్తే జలదో యథా. 1

తంత్రైలోక్యాన్తరగతం దృష్ట్వా తే దానవేశ్వరాః l ఉత్తస్థురపరిశ్రాన్తాః పీత్వేవామృత ముత్తమమ్‌. 2

తే వీతభయసన్త్రాసా మయతారపురోగమాః l తారకామరుసజ్గ్రామే సతతం జితకాశినః. 3

రేజు రాయోధనగతా ధానవా యుద్దకాజ్షిణః l మన్త్రమభ్యస్యతాం యేషాం వ్యూహం చ పరిధావతామ్‌. 4

సముద్బూతా ఘనా యే చ ప్రావృషీవ బలాహకా ః l ప్రేక్షతాం చాభవత్ప్రీతి ర్దానవం కాలనేమినమ. 5

యేతుతత్ర మరు స్యాస న్ముఖ్యా యుద్దపురస్సరాః l తేతు సర్వే భయం త్యక్త్వా హృష్టా యోద్దుమువస్థితాః. 6

మయ స్తారో వరాహశ్చ హయగ్రీవశ్చ వీర్యవా9 l విప్రచిత్తిసుత శ్శ్వేతః ఖరలమ్బూవుభావపి. 7

అరిష్టోబలిపుత్త్రశ్చ కిశోరశ్చ తథైవచ l స్వర్భానుశ్చామరప్రఖ్యో వక్త్రయోధీ మహాసురః. 8

ఏతే 7స్త్రవేదిన ః సర్వే సర్వే సుస్థితాః l దానవాః కృతినో జగ్ముః కాలనేమిం తమద్బుతమ్‌. 9

నూట డెబ్బది అరవ అధ్యాయము

కాలనేమి విజయము

శ్రీమత్స్య నారాయణుడు మనువునకు ఇంకను ఇట్లు చెప్పెనని సూతడు ఋషులకు వచించెను. దానవుల సేనల నడుమ కాలనేమి మహా సురుడు వృద్దినందిన తన మహా తేజస్సుతో నిండియు తన వర్ణముచే గ్రీష్మాంతమున( వర్షానమయా రంభమందలి) మేఘమువలె కనబడుచుండెను. త్రి లోకాంతర్బాగమున నిండియున్న అతనిని చూడగానే ఆదానవేశ్వరులందరును ఉత్తమమగు అమృతమును త్రాగినందుచేతవలె శ్రమయంతయు తీరి లేచిరి. మయుడు తారుడు మొదలగు దానవులు ఆ జరుగుచుండిన తారకామయ సంగ్రామమున అంతవరకు ఎడతెగని జయముతో ప్రకాశించుచుండెనట్లే ఇపుడు ఏమత్రమును భయ సంత్రానములు లేక యుద్దము చేయగోరుచు ప్రకాశించిరి. వర్షాకాలమందు విజృంభించిన దట్టమగు మేఘములవంటి ఆ దానవులు కొందరు మంత్రములను ఆ వృత్తిచేయుచుండిరి. మరికొందరు వ్యూహములందు అటు నిటు పరుగెత్తు చుండిరి.వారికందరకును ఈ కాలనేమిని చూచిన కొలదిహర్షామదికమగు చుండెను. మయుని సహచరు లలో ఆ యుద్దమున అగ్రగాములను ముఖ్యులును అగు దానవులందరును ఏమాత్రమును భయము లేక హర్షముతోనిండి యుద్దము చేయుటకై సిద్దులయి నిలిచిరి. మయుడు తారుడు వరాహుడు వీర్యశాలియగు హయగ్రీవుడు విప్రచిత్తి దానవుని కుమారుడగు శ్వేతుడు ఖరుడు లంబుడు బలి పుత్తుడగు అరిష్టుడు కిశోరుడు దేవతలలోనివాడు వలె ప్రకాశించువాడును నోటితో యుద్దము చేయు వాడునగు స్వర్బాను (రాహు) మహాసురుడు- ఈదానవులందరును అస్త్ర వేత్తలును మహాతపో వంతులును కార్య నిపుణులను నగువారు; వీరందరును తమకే ఆశ్చర్యము గొలుపుచున్న అకాలనేమి దగ్గరకుపోయి అతనిని పరివేష్టించి యుండిరి.

తే గదాభిశ్చ గుర్వీభి శచక్రైరథః పరశ్వథైః | కాలకల్పైశ్చ ముసలైః క్షేపణీయైశ్చ ముద్గరైః. 10

అశ్వభిశ్చాద్రిసదృశై ర్గణ్డ శైలైశ్చ దారుణౖః | పట్టసైర్భిణ్డివాలైశ్చ పరిఘై రుత్తమాయసైః. 11

ఘాతనీభి స్సుగుర్వీభి శ్శతఘ్నీభిశ్చ మూర్ఛనైః | భుజఙ్గైర్లేలిహానైశ్చ విసర్పద్భిశ్చసాయకైః. 12

దోర్భిశ్చాయతదీపై#్తశ్చ ప్రాసైః పాశైశ్చ మూర్ఛనైః | భుజఙ్గైర్లేలిహానైశ్చ విసర్పద్భిశ్చకసాయకైః. 13

చక్రైః ప్రహరణీయైశ్చ దీప్యమానైశ్చ తోమరైః. | వికోశై రసిభిస్తీక్షైణ శ్శూలైశ్చ సితనిర్మలైః. 14

దైత్యాస్సన్దీప్తమనసః ప్రగృహీతశరాసనాః | తతః పురస్కృత్య తథా కాలనేమిం మహాహవే. 15

సా దీప్తశస్త్రవ్రవరా దైత్యానాం రురుచే చమూః | ద్యౌర్నిమీలితసర్వాఙ్గా ఘనానీవామ్బుదాగమే. 16

దేవతానామపి చమూ ర్ముముదే శక్రపాలితా | ఉపేతాసితకృష్ణాభ్యాం తారాభ్యాం చన్ద్రసూర్యయోః. 17

వాయువేగవతీ సౌమ్యా తారాగణపతాకినీ | తోయదావిద్ధసవనా గ్రహనక్షత్రహాసినీ. 18

యమేన్ద్రవరుణౖర్గుప్తా ధనదేన చ ధీమతా | పా ప్రదీప్తాగ్నిసదనా నారాయణపరాయణా. 19

సా సముద్రోఘసదృశీ దివ్యా దేవమహాచమూః | రరాజాస్త్రవతీ భీమా యక్షగన్ధర్వశాలినీ. 20

తయో శ్చమ్వో స్తదానీం చబభూవ స సమాగమః | ద్యావాపృథివ్యో స్సంయోగో యథా స్యాద్యుగపర్యయే. 21

తద్యుద్ధ మభవద్ఘోరం దేవదానవసఙ్కులమ్‌ | క్షమాపరాక్రమపరం దర్పస్య వినయస్యచ. 22

నిశ్చక్రము ర్బలాభ్యాంతు భీమాస్తత్ర సురాసురాః | పూర్వాపరాభ్యాం సంరబ్ధా స్సాగరాభ్యామివామ్బుదాః.

వారు బరువయిన గదలు చక్రములు రథములు గండ్ర గొడ్డండ్రు యమదండములవంటి ముసలములు వడి నెలలు ముద్గురములు కొండలవంటి రాళ్లు భయంకరములగు గండ శైలములు (పెద్దపెద్ద బండలు) పట్టసములుభిండి వాలములు ఉత్తమమగు ఉక్కుతోచేసిన పరిఘలు బరువగు ఘాతనీ ఆయుధములు శతఘ్నులు కాండ్లు-వదలుటకు సిద్ధముగా నుంచిన యంత్రములు భయంకరముగా దెబ్బకొట్టు బాణములు పొడవయి యొప్పు భుజములు ప్రానములు పాశములు మూర్ఛనములు (మూర్భవచ్చునట్లు చేయుటకు పనికివచ్చు యుద్ధసాధన విశేషములు) నాలుకలు క్రోయుచున్న సర్పములు ప్రాకుచున్న పాములవలె కనబడు మెలికలశరములు ప్రహరించుటకు పనికివచ్చు చక్రములు ప్రకాశించుతోమరములు ఒరనుండి తీసియుంచిన తీక్షణ ఖడ్గములు తెల్లని నిర్మల శూలములుకలిగి దైత్యులు చురుకయిన మనస్సులతో ధనువులు పట్టి నిలిచిరి. ఇట్లా మహా యుద్ధమున దైత్యసేన ప్రకాశించు ఆయుధ శ్రేష్ఠములుదాల్చి కాలనేమిని ముందుంచుకొని నీలమేఘములు క్రమ్మగా పూర్ణముగా మూతపడిన ఆకాశమువలె (కారునలుపుతో) ప్రకాశించెను.

చంద్ర సూర్యుల తెల్లని నల్లని కనుపాపలతోకూడి వాయు వేగముకలిగి సౌమ్యమయి తారాగణములు పతాకలు కాగా మేఘములను వస్త్రములుదాల్చి గ్రహములతో నక్షత్రములతో నవ్వుచు దేవసేన ప్రకాశించు చుండెను. శక్రుడు పాలించుచుండ యమేంద్ర వరుణకుబేరులు కాపాడుచుండ అగ్ని తన సదనములందు (వేదికలందు) ప్రకాశించుచుండ నారాయణుడు పరమశరణమైయుండ ఆ సేన సముద్ర జలరాశివలె దివ్యరూపముతో ఒప్పుచుండెను. వారికిని అస్త్రములు కలవు. యక్ష గంధర్వులు (తమ చేష్టలతో) పరులకు భయము గొలుపు చుండిరి. అంతలో ఆ రెండు సేనలును ప్రళయ కాలమందు భూమ్యంతరిక్షములు తారసిల్లినట్లు పరస్పర మెదుర్కొనెను. దేవ దానవులకు జరిగిన ఆ యుద్ధము సంకులమును ఘోరమునునయి క్షమాపరాక్రమములకును దర్పవినయములకును జరుగు రణమువలె నుండెను. అందు దేవతలును దానవులును ఇరు సేనలనుండియు తూర్పు పడమటి సముద్రములనుండి వెలికివచ్చి కలియు మేఘములవలె వెలికివచ్చి తారసిల్లిరి. వారుకోపావిష్టులును భయంకరులునునై యుండిరి.

తాభ్యాం బలాభ్యాం సన్దృష్టాశ్చేరుస్తే దేవదానవాః | వనాభ్యాం పర్వతీయాభ్యాం పుష్పితాభ్యాం యథా గజాః. 24

సమాజఘ్ను స్తతో భేరీ శ్శఙ్ఖా న్దధ్ము రనేకశః | స శబ్దో ద్యాం భువంఖంచ దిశశ్చ సమపూరయత్‌. 25

జ్యాఘాతతలనిర్ఘోషా ధనుషాం కూజితానిచ | దున్దుభీనాంచ నినదో దైత్య మన్తర్దధు స్స్వనమ్‌. 26

తే7న్యోన్య మభిసమ్పేతుః పాతయన్తః పరస్పరమ్‌ | బభఞు ర్బాహుభి ర్బాహూ న్ద్వన్ద్వ మన్యేయుయుత్సవః. 27

దేవాస్తు చాశనిం ఘోరం పరిఘాం శ్చోత్తమాయసా& | నిస్త్రిం శాన్త్ససృజు స్సఙ్ఖ్యే గదా గుర్వీశ్చ దానవాః. 28

గదానిపాతై ర్భగ్నాఙ్గా బాణౖశ్చ శకలీకృతాః | పరిపేతుర్భృశం కేచి త్పునః కేచి న్నిజఘ్నిరే. 29

తతో రథై స్సతురగై ర్విమానై శ్చాశుగామిభిః | సమీయుస్తే తు సంరబ్ధా రోషాదన్యోన్య మాహవే. 30

సంవర్తమానాస్సమరే సన్దష్టౌపుటాననాః | రథా రథైర్నియుధ్యన్తే పదాతాశ్చ పదాతిభిః. 31

తేషాం రథానాం తుముల స్స శబ్ద శ్శబ్దవాహినామ్‌ | నభోనభస్యౌ హి యథా నభ##సై#్య ర్జలదస్వనైః. 32

బభఞిరే రథా న్కేచి త్కేచి త్సమ్పాటితా రథైః | సమ్బాధ మన్యే సమ్ర్పాప్య న శేకు శ్చలితుం రథా&. 33

అన్యోన్యమన్యే సమరే దోర్భ్యాముతిక్షప్య దంశితాః | సంహ్రాదమానాభరణా జఘ్ను స్తత్రాసిచర్మిణః. 34

అసై#్త్రరన్యైర్వినిర్భిన్నా రక్తం వేముర్హతా యుధి | తరజ్జలానాం సదృశా జలదానాం సమాగమే. 35

తైరస్త్రశ##సై#్త్రర్గ్రథితం క్షిప్తోత్‌క్షిప్తగదావిలమ్‌ | దేవదానవసఙ్ర్కుద్ధం సఙ్కులం యుద్ధమాబభౌ. 36

తద్దానవమహామేఘం దేవాయుధ విరాజితమ్‌ | అన్యోన్యశస్త్రవర్షేణ యుద్ధదుర్దిన మాబభౌ. 37

దేవతలును దానవులును అటువంటి రెండు సేనలతో కూడి పర్వతములందలి పూచిన వనద్వయముతో కూడిన గజములవలె అందముగా కనబడుచు సంచరించుచుండిరి. అంతలో భేరులను మ్రోగించిరి. అనేకములగు శంఖములను పూరించిరి. ఆ ధ్వనితో భూమ్యాకాశములును దిక్కులును నిండిపోయెను. అల్లెత్రాటిని కంపింపజేయుటచే కలిగిన ధ్వనులును ధనువుల కూతలును దుందుభుల ధ్వనులును దైత్యుల (అరపుల) ధ్వనులను తమయందు ఇముడ్చుకొనెను. వారు పరస్పరము ఎదుర్కొనిరి; పడవేసికొనుచుండిరి. భుజములతో భుజములను విరుగగొట్టుకొనుచుండిరి. మరికొందరు ద్వంద్వయుద్ధము చేయగోరి సిద్ధమగుచుండిరి. దేవతలు దానవులపై ఘోరములగు వజ్రములను (పిడుగులను) మేలగు ఉక్కుతో చేసిన పరిఘలను ఖడ్గములను బరువగు గదలను యుద్ధమునందు ప్రయోగించుచుండిరి. దానవులు గదా పాతములతో అవయవములు విరిగి బాణములతో ముక్కలయి మిక్కిలిగా పడిపోవుచుండిరి. మరికొందరు చంపబడుచుండిరి. ఇంకను కొందరు ఎదురు నిలిచి దేవతలనే కొట్టుచుండిరి. వారు శీఘ్ర గమనముగల రథములతోను అశ్వములతోను విమానములతోను సంచరించుచు రోషావిష్టులై ఆవేశముతో పరస్పరము తలపడి పోరుచుండిరి. పెదవులను కొరుకుచు వికృతముఖములతో వారు రణమున భయంకరులుగా నుండిరి. రథికులు రథికులతో పదాతులు పదాతులతో పోరుచుండిరి. ధ్వని జనకములగు ఆ దేవదానవ రథముల తుముల శబ్దము శ్రావణ భాద్రపద మాసములందు కలుగు వర్షాకాల మేఘముల ధ్వనివలె నుండెను. కొందరు రథములను విరుగగొట్టిరి. కొందరను రథములు విరుగగొట్టెను. కొందరు ఇరుకు ప్రదేశములందు చిక్కుకొని రథములను కదలించలేకుండిరి. కవచ ధారులగు వీరులు కొందరు ఒకరినింకొకరు పైకెత్తి వేయుచుండిరి. మరికొందరు తమ ఆభరణములు ధ్వని చేయుచుండ కత్తులు పలకలు (డాళ్ళు) ధరించిన వీరులను కూడ కొట్టుచుండిరి. కొందరు అస్త్రముల దెబ్బలుతిని రక్తము క్రక్కుచు చచ్చుచు వర్షాకాలమున నీరు వర్షించు మేఘములవలె కనబడుచుండిరి. ఆ దేవ దానవులకు తుములయుద్ధము అస్త్రశస్త్రముల అల్లికతో ఎత్తి విసరబడుచున్న గదలతో క్రుద్దులయిన దేవదానవులతో భయంకరమయి యొప్పెను. అట్టి ఈ యుద్ధమున దానవులు మహామేఘములును దేవతలు ప్రయోగించు ఆయుధములు ఇంధ్రధనువులుగా పరస్పర ప్రయుక్త శస్త్ర ప్రయోగములు వర్షముగా దుర్దినమయి (మేఘములాకసమావరించిన దినమయి) ప్రకాశించెను.

ఏతస్మిన్తరే క్రుద్ధః కాలనేమి స్స దానవః | వ్యవర్ధత సముద్రౌఘైః పూర్యమాణ ఇవామ్బుదః. 38

తస్య విద్యుచ్చలాపీడైః ప్రదీప్తాశనివర్షిణః | గాత్రై ర్నాగగిరిప్రఖ్యా వినిపేతుర్బలాహకాః. 39

క్రోధా న్నిశ్వసతస్తస్య భ్రూభేద స్వేదవర్షిణః | * సాగ్నిధూమయుతా స్తస్య ముఖాన్ని ష్పేతు రర్చిషః.

తిర్యగూర్ధ్వంచ గగనే వవృధు స్తస్య బాహవః | పర్వతాదివ నిష్క్రాన్తాః పఞ్చాస్యా ఇవ పన్నగాః. 41

శస్త్రజాలై ర్బహువిధై ర్ధనుర్భిః పరిఘైరపి | దివ్యమాకాశ మావవ్రే పర్వతై రుచ్ఛ్రితైరివ. 42

సో7నిలోద్ధూతవసన స్తస్థౌ సఙ్గ్రామలాలసః | సన్థ్యాతపగ్రస్తశిల స్సాక్షాన్మేరురివాచలః 43

ఊరువేగప్రమథితై శ్వైలశృఙ్గాగ్రపాదపైః | అపాతయ ద్దేవగణా న్వజ్రేణవ మహాగిరీ&.44

బహుభిశ్శస్త్రనిస్త్రింశై శ్ఛిన్నభిన్నశిరోరుహాః | న శేకుశ్చలితుం దేవాః కాలనేమి హతా యుధి. 45

ముష్టిభిర్నిహతాః కేచి త్కేచిత్తు విదళీకృతాః | యక్షగన్ధర్వ పతయః పేతు స్సహ మహోరగైః. 46

_______________________________________________

* సాగ్నిస్ఫులిఙ్గప్రతతా.

తేన విత్రాసితా దేవాస్సమరే కాలనేమినా | న శేకుర్యత్నవన్తో7పి యత్నం కర్తుం విచేతసః. 47

తేన శక్రస్సహస్రాక్ష స్సన్దిత శ్శరబన్ధనైః | ఐరావతగత స్సఙ్ఖ్యేచలితుం న శశాకహ. 48

ఇంతలో కాలనేమి మహాసురుడు సముద్రజలములు త్రావిన మబ్బువలె వృద్ధిపొందెను. మెరపులవలె చంచలమయి మెరయు ఆభరణములు కల అవయవము(తో)నుండి ప్రజ్వలించు పిడుగులను వర్షించుచు ఏనుగులవంటివియు పర్వతమంతటివియు మేఘములు వెలువడసాగెను. క్రోధమువలన శ్వాస వదలుచున్న వాని ముఖమునుండి కనుబొమల ముడులను చెమటను వర్షించుచు పొగలతో నిండి అగ్నితో కూడిన జ్వాలలు బయటకు రాసాగెను. వాని బాహువులు ఆకసమునందు అడ్డముగను నిలుపుగను పెరుగుచు పర్వతములందుండి వెలువడు ఐదుతలలసర్పములవలె కనబడుచుండెను. బహు విధములగు శస్త్రజాలములును ధనువులును పరిఘలును ఆకసమునందంతటను నిండి ఉన్నత పర్వతములవలె కనబడుచుండెను. వాడు అందు గాలికి చెదరి ఎగురుచున్న వస్త్రముతో యుద్ధ కాంక్షియై సంధ్యాకాలపు ఎండతో వ్యాప్తమయిన శిలలుగల సాక్షాత్‌ మేరు పర్వతమో యనునట్లు ఒప్పుచుండెను. వాడు తన తొడల ఒత్తిడిచే నలుగగొట్టు చుండెను. ఇట్లు కాలనేమిచే తగులు దెబ్బలతో సురలు అనేక శస్త్రములతో ఖడ్గములతో తమ తలలు పగులగా కేశములు తెగిపోగా బాధపడుచు కదలనైన లేకుండిరి. కొందరు వాని పిడికిళులతో గ్రుద్దబడియు మరికొందరు చీల్చబడియు పడిపోయిరి. దేవతలు తామెంత పరాక్రమవంతులయియును కాలనేమి వలన కలిగిన భయముతో తెలివి తప్పినందున ఆ సమరమునందు ఏ యత్నమును చేయలేకుండిరి. సహస్రాక్షుడగు శక్రుడును వానిచే శరబంధనములతో బంధితుడై ఐరావత గజముపై కదలలేకుండెను.

నిర్జలామ్బెదసదృశో నిర్జలార్ణవసప్రభః l నిర్వ్యాపారః కృత స్తేన­పాశో వరుణో మృథే. 49

రణేవై శ్రవణస్తేనపరిఘైః కామరూపిణా l ­త్తదో7పి కృతస్సజ్ఖ్యే· త్యాజితో ధనక్రియామ్‌. 50

యమ స్సర్వహరస్తేన మృత్యుః ప్రహరణౖరణే l యామ్యామవస్థాం సన్త్యజ్య భీతస్స్వాం దిశ మా­శత్‌.

సలోకపాలానుత్సార్య కృత్వా తేషాం చ కర్మ తత్‌ l దిక్షు సర్వాసు దేహం స్వం చతుర్దా ­దధే తదా.

స నక్షత్రపథం గత్వా దివ్యం స్వర్బాసుదర్శనమ్‌ l జహార లక్ష్మిం సోమస్య తంచాస్య ­షయం మహత్‌. 53

చాలయామాస దీప్తాంశుం స్వర్గద్వారాత్స భాస్కరమ్‌ l సాయనం చాస్య ­షయం జహార దినకర్మచ. 54

సో7గ్నిం దేవముఖం దృష్ట్వా Oచకారాత్మవశానుగమ్‌ l వాయుంచ తరసా జిత్వా ­దధే 7స్యవశానుమ్‌.

స సముద్రా న్త్స మానీయం సర్వాశ్చసరితో బలాత్‌ l చకారాత్మముఖే­dర్యా ద్లేహభూతాశ్చ సిన్దవః. 56

అపస్స్వవశగాః కృత్వాది­జా యాశ్చ భూ­ుజాః l స్థాపయామాసజగతీం సుగుప్తాం ధరణీధరైః. 57

సస్వయంభూరివాభాతి మహాభూతపతి ర్యథాl సర్వలోకమయోదైతగ స్సర్వభూతభయావహః . 58

స లోకపాలైకవపుశ్చన్ద్రసుసార్య గ్రహాత్మవాన్‌ l పావకానిలసంయోగో రరాజ యుధి దావః . 59

పారమేష్ఠ్యే స్థితః స్థటనే లోకానాం ప్రభవోపమే l తే తుష్టవు ర్దైత్యగణా దేవా ఇవ పితామహా. 60

ఇతి శ్రీమత్స్యమహాపురాణే దేవదానవసజ్గ్రామే కాలనే­ు­జయో నామ షట్స ప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

______________________________________________________________________________

·నిర్జతః కాలనే­ునా Oచకారాత్మముఖాశ్రయమ్‌

వరుణుడును వానిచేత తినిన దెబ్బలతో జలరహిత మేఘమువలెను జలమెండిన సముద్రమువలెను ఏ­ుయు చేయ జాలకుండెను. కామ రూపుడు అగు అకాలనే­ు ­శ్రవః ప్రజాపతి కుమారుడు అగు కుబేరుని పరిఘలతో చావమోది ధనదుడు(­త్తమును ఇచ్చువాడు) అనుయోగ్యతకు ధూరము చేసెను. నర్వుల ప్రాణములను హరించు మృత్యురూపుడగు యముడును వానిదెబ్బలు తిని యముడుగా తనకుగల యోగ్యతను కోల్పోయి తన (దక్షిణ) దిశకు పారిపోయెను. వాడట్లు లోకపాలురను తరి­ు వారివారి అదికార కృత్యములను హరించి తన దేహమును నాలుగు దిక్కులందును నాలుగుగా నిర్మించెను. వాడు రాహువు తనకు చూపిన దివ్య నక్షత్ర చూపిన మార్గమునకు పోయి సోముని లక్ష్మిని (కాంతిని -ఐశ్వర్యమును అదికారమును (అతని పాలన పమహాదేశమును హరించెను. వాడు స్వర్గద్వారమునుండి భాస్కరుని తరి­ువేసి అతనికి గల అయనములను పగళ్ళను ఏర్పరచు అధికారమును తన అదీనముగా చేసికొనెను. దేవతలకు ముఖము (నోరు) అగు అగ్నిని వాయుదేవుని తన శక్తితో జయించి తన ఇచ్చ చొప్పున నడుచునట్లు చేసెను. వాడు తన ­dర్య బలములతో సర్వములగు నదులను సముద్రమును తన దగ్గరకు రప్పించుకొని తన ముఖమునందు (తన ఎదుట- తన అధీనములో) ఉండునట్లు చేసికొనెను. సముద్రములన్నియు వాని దేహమయ్యెను. భూమ్యంతరిక్ష ద్యులోకములందెక్కడెక్కడ నున్న జలమును తన వశమున నడుచుకొనునట్లు చేసి వాడు భు­ునంతను తన యాజ్ఞలో నడుచు పర్వతములతో భద్రపరచి కదలకుండునట్లు చేసెను. వాడు తాను స్వయంభూ బ్రహ్మయు మహాభుతపతియునైనట్లు, ప్రకాశించుచు సర్వలోకమయుడై సర్వభూత భయంకరుడై ప్రకాశించుచుండెను. ఇట్లు లోకపాలైక శరీరుడు చంద్ర సూర్యాది గ్రహరూపుడు వాయ్వగ్ని శరీరుడునై ఆయుద్ధమునం దాదానవుడు ప్రకాశించు వరమేష్టి బ్రహ్మస్థానమునందు నిలిచి లోకముల ఉత్పత్తికే తాను మూలకారణుడై ప్రకాశించుచుండగా దేవతలు బ్రహ్మను స్తుతించునట్లు దైత్యులు వానిని స్తుతించిరి.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవదానవ సంగ్రామమున కాలనే­ు ­జయమును

నూట డెబ్బది యారవ యధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters