Sri Matsya mahapuramu-2    Chapters   

చతుస్సప్తత్యుత్తశరతతమో7ధ్యాయః.

దేవాసుర యుద్ధమ్‌.

శ్రీమత్స్యః: తాభ్యాం బలభ్యాం సంజజ్ఞేతములో విగ్రహ స్తదాl సురాణా మసురాణాంచ పరస్పరజయైషిణామ్‌. 1

దానవా దైవతైస్సార్థం నానాప్రహరణోతద్యతాః సమీయు ర్యుధ్యమానా వైపర్వతా ఇవ పర్వతైః. 2

తత్సురాసురసమ్బద్ధం యుద్ద మత్యద్బుతం బభౌ l ధర్మాధర్మసమాయుక్తం దర్పేణ వినయేనచ. 3

తతోరథైః ప్రజవిత్గర్వారణౖశచ ప్రణోదితైః l ఉత్పతద్భిశచ గగన మసిహసై#్తస్సమన్తతః. 4

క్షిప్యమాణౖశ్చ ముసలైః ప్రాసై ర్భల్లెశ్చ సాయకైః l చాపైర్విష్పార్యమాణౖశ్చ పాత్యమానైశ్చ ముద్గరైః. 5

తద్యుద్దమభవద్ఝోరం దేవదానవసజ్కులమ్‌ l జగత స్త్రాసజననం యుగసంవర్తకోపమమ్‌. 6

స్వహస్తముక్తైః పరిఘై ర్విప్రయుక్తైశ్చ పర్వతైః l దానవాస్సమరే జఘ్నుర్దేవా నిన్ద్ర పురోగమా9.7

తే వధ్యమానా బలిభి ర్దానవై ర్జయకాజ్షిభిః l విషణ్ణవదనా దేవా జగ్మురార్తిం పరాం మృథే. 8

తే7స్త్రశూల ప్రమథితాః పరిఘై ర్బిన్నమస్తకా భిన్నోరస్కా దితి%ిసుతై ర్వేమూంక్తం వ్రణౖ ర్యుహుః 9

వేష్టితా శ్శరజాలైశచ నిర్మత్నాశచ శ##రైః కృతాః l ప్రవిష్టా దానవీం మాయాం నాశక్నుస్తే విచేష్టితుమ్‌. 10

అస్తగతమివాభాతి నిద్రాణసదృశాకాతి l బలం సుంరాణా మసురై ర్నిష్ప్రయత్నాయుధం కృతమ్‌. 11

దైత్యచాపచ్యుతా న్ఝోరా ఞ్చిత్త్వా వజ్రేణ తాఞ్చరా 9l శక్రో దైత్యబలం ఘోరం విశేశబహులోచనః. 12

సదైత్యప్రముఖాన్హత్వా తద్దషానవబలం మహత్‌ l తామసేనా స్త్రజాలేన తమోభూత మథాకరోత్‌.13

తే7న్యోన్యం నావబాధ్యన్త దైత్యానాం వాహనాని చ l ఘోరేణ తమసా77విష్టా ః పురుహూతస్య తేజసా.

మాయాపాశై ర్విముక్తాస్తు యత్నవన్త స్సురోత్తమాః l వపూంషి దైత్యసజ్ఝానాం తమోభూతా న్యపాతయన్‌.

దేవాసుర యుద్దము-ఔర్వోత్బత్తి.

పరస్పర జయకాంక్షులగు దేవతలకును దానవులకును అ సేనలతో తుములమగు యుద్దము (ఎవరు ఎవరితో పోరుచున్నారనునదే తెలియని దొమ్మి యుద్దము) జరిగెను. దానవులు నానాయుధ సన్నద్దులయి యుద్దము చేయుచు పర్వతములు పర్వతములతో వలె దేవతలతొ తలపడిరి. సురాసురుల పరస్పర సంయోగముతోడి అ యుద్దము ధర్మా ధర్మములకును దర్ప వినయములకును జరిగిన యుద్దమువలె కనబడెను. అ ప్రసంగములొ విశేషముగా ప్రేరించబడి ఎగిరి దుముకుచున్న రథమలతోమిగు చోదింపబడిన గజములతో అన్ని వైపులనుండియు ఆకసమునకు ఎగిరి దుముకుచున్న ఖడ్గ హస్తులగు పదాతులతొ విసరివేయబడుచున్న ముసలములతొ మీదికివచ్చి పడుచున్న బాణములతో సారించబడిధ్వని చేయుచున్న ధనువులతో పడవేయబడుచున్న ముద్గరములతో దేవదానవులకు పరస్పరము జరుగుచుండిన అ సంకుల యుద్ధము యుగాంత (ప్రళయ) మువలె లోక భయంకరమయ్యెను. దానవులు తమ చేతులతో పరిఘలను పర్వతములను విసరివేయుచు ఇంద్రాది దేవతలను చావగొట్టుచుండిరి. జయమందుచు ప్రకాశించు6 బలశాలురగు దానపులచే దెబ్బలు తినుచు ఆర్తులయి దేవతలా యుద్దమున ఏడుపు మొగములుపెట్టిరి. రాక్షసులు తమ్ము అస్త్రములతో శూలములతో మిగుల మథించుచుండ పరిఘలతో తలలు పగులగొట్టుచుండ వక్షఃస్థలములు చీల్చుచుండ ఆ గాయముల నుండి మిక్కిలిగా రక్తము స్రవించుచుండెను. అసురులుబాణపువలలతో చుట్టగా ఆ దానవుల మాయలో చిక్కుకొని దేవతలు ప్రతీకార యత్నముచేయలేకపోగా కదలనైనకదలలేకుండిరి. ఇట్లు దేవతాబలమును దానవులు ఆయుధములతో యత్నమైన చేయనీయకపోటచే అస్తమించినదో యనునట్లును నిద్రించినదో యనునట్లును అయ్యెను. బహునేత్రుడగు ఇంద్రుడు దైత్య ధనువులనుండి వదలబడిన వాడి యమ్ములను వజ్రముతో ఖండించి దైత్య సేనయందు ప్రవేశించెను.అతడంతట దైత్యులలో ప్రముఖులను చంపి ఆ మహాదానవ సేను తామనమగు అస్త్రజాలముతో అంధకారమయ మొనర్చెను. పురుహూతుని తేజముతో సృష్టింపబడిన ఘోరమగు తమస్సు (మోహము )తో అవిష్టులై దానవులు తమ వారిని పరస్పరముకాని తమ వాహనములను గాని గుర్తింపజాలకుండిరి. అంతలో దేవతలుయత్నముచేసి దానవ మాయాపాశములను వదలించకొని తమస్సుతో వ్యాపిమయిన దానవ దేహములను పడగొట్టసాగిరి.

అపధ్వస్తా విసంజ్ఞాశ్చ తమసా 7ఞ్జనవర్చసా l పేతుస్తే దానవగణా శ్చిన్నపక్షా ఇవాద్రయః. 16

తద్ఝనీభూతదైత్యేన్ద్ర మన్దకార మివార్ణవే l దానవం దేవకధనం తమోభుత మివాభవత్‌. 17

తధా7సృజన్మహామాయాం మయస్తాం తామసీం దహనl యుగాన్తోద్ద్యోతజననీం సృష్టా మౌర్వేణ వహ్నినా. 18

సాదదాహ తత స్సర్వా న్మాయామయవికల్పితాl దైత్యా శ్చాదిత్యవపుష స్సద్య ఉత్తస్థు రాహవే. 19

మాయామౌర్వీం సమాసాద్య దహ్యమానా దివౌకస ః l భేజిరే చన్ద్రవిషయం శీతాంశుం సలిల ప్ప్రదమ్‌. 20

తే దహ్యమానా హ్యౌర్వేణ వహ్నినా నష్టచేతస ః l శశంసుర్వజ్రిణం దేవా స్సన్తప్తా శ్శరణౖషిణః 21

సన్తప్తే మాయయా సైన్యే హన్యమానే చ దానవైః l చోదితో దేవరాజేన వరుణోవాక్య మబ్రపవీత్‌. 22

ఇన్ద్రాయ వరుణోపదిష్ట బడబడానలోత్పత్తి స్తన్మాయావృత్తాన్తశ్చ.

ఉర్వో బ్రహ్మర్షిజ శ్శక! తపస్తే పే సుదారుణమ్‌ l ఊర్వ స్త్వపూర్వతేజస్వీ సదృశో బ్రహ్మణో గుణౖః 23

తం తపన్తమివాదిత్యం తపసా జగదవ్యయమ్‌ l ఉపతస్థు ర్యునిగణా దివగదేవర్షిభి స్సహ. 24

హిరణ్యకశిపుశ్చైవ దానవో దావేశ్వరః l ఋషిం విజ్ఞాపచరూమాస పురారిసమతేజసమ్‌. 25

ఊచు ర్బ్రహ్మర్షయ స్తతంతు వచనం ధర్మసంహితమ్‌l ఋషివంశేషు భగవం శ్చిన్నమూల మిదం పదమ్‌.

ఏకస్త్వమనపత్యశ్చ గోత్రాయన్యో న వర్తతే l కౌమారం వ్రతమాస్థాయ క్లేశ##మేవానువర్తసే. 27

బహుని విప్రగోత్రాణి మునీనాం భావితాత్మనామ్‌ l ఏకదేహాని తిష్ఠన్తి వివిక్తాని వినా ప్రజాః. 28

ఏవ ముచ్ఛిన్నమూలైశ్చా పుత్రైర్నో నాస్తికారణమ్‌ l భవాంస్తు తపసా శ్రేష్ఠః ప్రజాపతిసమద్యుతిః. 29

తతో వర్తస్వ వంశాయ వర్దయాత్యాన మాత్మనా l త్వయా ధర్మో7ర్జితస్తేన ద్వితీయాం కురువైతనుమ్‌. 30

కాటుకవలె మెరయుచున్న తమముతో చీకాకుపడియు తెలివి కోలుపోయియు అ దానవులు రెక్కలు తెగిన కొండలవలె పడిపోయిరి. ఇంద్రుడు సృష్టించిన అ తమస్సు ( అపంధకారము- ఏమియు తెలియునీయని మోహము-ఈ రెండును ఇచట తమము అని చెప్పబడినవి) మహా సముద్రమున (రాత్రులందు) వ్యాపించిన అంధకారమువలెనే దానవులందరు ఒకే గడ్డ (ముద్ద)గా కనడునట్లు చేసెను. ఆట్లు దేవతలచే జరుపబడిన దానవ నాశము అంధకారముయమేమో యనునట్లుండెను. అంతట మయుడు ఇంద్రుని అ తామసమాయను దహించు మహామాయను (సముద్రాంతఃస్థమగు) ఔర్వగ్ని (బడబాగ్ని)తో నిర్మించి సృష్టించెను . అది ప్రళయగ్ని తేజసులవంటి తేజస్సులను జనింపజేసెను. మయుడట్లు విశేషముగ సృష్టించిన మయ మాయ దేవతలనందరను కాల్చసాగెను. దైత్యులు వెంటనే రవి తేజస్కులయి లేచి రణరంగమున నిలిచిరి. ఔర్వగ్ని ప్రయుక్తమయిన మయమాయ తమ్ము చేరి దహించుచుండ దేవతలు చల్లని కిరణములు కలదియు జలమునిచ్చునదించు నగు చంద్రుడున్న ప్రదేశము చేరిరి. వారట్లు ఔర్వగ్నిచే దహింపబడుచు సంతాపమునకు తాళ##చేక తెలువులు తప్పి ఇంద్రునకు తమ అవస్థను తెలిపి అతనిని శరణు వేడిరి. తమ సేన అట్లుమయ మాయతో దగ్ధమగుచు సంతప్తమగుచుండ చూచి ప్రశ్నించిన దేవరాజుతో వరుణుడిట్లు పలికెను.:

ఔర్వవృత్తాంతము

ఇంద్రా! ఊర్వుడు బ్రహ్మర్షివంశజుడు; అపూర్వతేజశ్శాలి; గుణములలో బ్రహ్మతో సమానుడు; అతడు మహాదారుణ (తీవ్రనియమపూర్ణమయి భంయంకరమగు) తపమాచరించసాగెను. తన తపముచే అదిత్యుడువలె జగత్తును తపింప జేయుచున్న అవ్యయుడగు (ఏవికారములునేని ) అతని సన్నిదికి మునులును దేవతలును దివ్య దేవర్షులును వచ్చిరి. దానవ జాతీయుడు దానవేశ్వరుడుననుగు హిరణ్యకశివుడును వచ్చెను. అతడును ఈశ్వర సమతేజస్కుడగు ఆ ఋషితో (శాంతించుమని ) విజ్ఞప్తిచేసెను. బ్రహ్మర్షులు ధర్మసహితమగువచనము నిట్లు పలికిరి. భగవన్‌ ః ఉర్వా! ఋషివంశములయందు ఈ (మీతరపు) స్థానము మూలచ్చెదమునందబోవుచున్నది; (ఏలయన) మీ వంశమునందిక నెవ్వరునుగోత్రవృద్ధిచేయువారు లేరు; ఉన్న నీవొక్కడవును సంతతిలేనివాడవు; నీవో! కౌమార (బ్రహ్మచర్య ) వ్రతమవలంభించి క్లేశమును (తపఃకారితమగు శ్రమను ) అనువర్తించుచున్నావు. భావితమగు(ఉత్తమ సంస్కారములచే సంస్కరింపబడిన ) అత్మలుగల మునులకు సంబంధించిన విప్రగోత్రములు అనేకములు (లవారు) తమకు సంతానము లేక ఏకదేహులయి (తమనుండి మరి యొక దేహము పుట్టక) యున్నారు. ఇట్లు ఎక్కడకనెక్కడనో మాకు కానరాక పుత్త్రులు లేక ఉచ్చిన్న మూలులయి (వేరు పతెగిన చెట్లవంటి వారయి ) యున్న వారితో మాకు పనిలేదు. (కావున వారికి మీరేల చెప్పరని నీవుమమ్మనవలదు; ) (నీవు వారివంటి వాడవుకాదు:) తపస్సుచే శ్రేష్ఠుడవు; (ప్రజాపతి సమతేజుడవు; నీవంటివాని వంపశము లోకమున ప్రవర్తిల్లజేయ ప్రవృత్తినందుము; నిన్ను నీచేతనే వృద్దినందింపుము; (నీఅత్మను 'అత్మావైపుత్త్రనామాసి' యనుశ్రుతి ననుసరించి పుత్త్రరూపమును విస్తరింప జేయుము:) నీవెంతయో ధర్మమార్జించి యున్నావు; దానితో నీ రెండవ దేహమును సృజించుము. ఆనిరి.

స ఏవ ముక్తో మునిభి ర్ముని ర్మర్మసు తాడితఃl జగర్హే తానృషిగణా న్వచనంప చేద మబ్రవీత్‌. 31

యథాయం విహితోధర్మో మునీనాం శాశ్వతః పురా l ఆర్షం వై సేవతః కర్మ వన్యమూలఫలాశినః. 32

బ్రహ్మ¸°నౌ ప్రసూతస్య బ్రాహ్మణస్యానువర్తినః l బ్రహ్మచర్యం సుచరితం బ్రహ్మాణమపి చాలయేత్‌ 33

జనానాం వృత్తయస్తిస్రో యే గృహాశ్రమవాసినఃl అస్మాకంతు వనే వృత్తి ర్వనాశ్రమనివాసినామ్‌. 34

అమ్బుభక్షా వాయుభక్షాదన్తోలూఖలినస్తథా l అశ్మకుట్టా దశ తథా పఞ్చతప్తసహాశ్చయే. 35

ఏతే తపసి తిష్ఠన్తో వ్రతైరపి సుదుష్కరైః l బ్రహ్మచర్యం పురస్కృత్య ప్రార్థయన్తః పంపాం గతిమ్‌.36

బ్రహ్మచర్యా ద్బ్రాహ్మణస్య బ్రాహ్మణత్వం విధీయతే l ఏవమాహుః పరే లోకే బ్రహ్మచర్యవిదో జనాః . 37

బ్రహ్మచర్యే స్థితం ధైర్యం బ్రహ్మచర్యే స్థితం తపః l యేస్థితా బ్రహ్మచర్యేషు బ్రాహ్మణా దివి సంస్థితాః.

మునులు ఇట్లు పలుకగా ఊర్వుడు తనమర్మ స్థానములందు దెబ్బకొట్టినట్లయి (బాధనంది) అ ఋషులను (చీ! మీవంటి తెలిసిన వారును ఇట్లు పలుకుటయా! అని) నిందించుచు వారితో ఇట్లు పలికెను. ఋషులారా!నేను చెప్పు నదేమియనిన- నేను అచరించు ఈ ధర్మము పుర్వమందేమునులకు శాశ్వతమయినదిగా (దేశ కాలానుసారము మారవలసిన పనిలేనిదిగా) ప్రజాపతిచే నిర్మించబడినది. ఋషి సంప్రదాయ సిద్ధమగు కర్మమును అవలంబంచి. అనుష్ఠంచుచు వన్యము లగు పండ్లనుదుంపలను వేళ్లను తినుచు బ్రహ్మవంశ పరంపరయందు పవిత్రజన్మమంది అర్ష ధర్మముననువర్తించు బ్రాహ్మణుడు చక్కగా అమష్ఠించి అర్జించిన బ్రహ్మచర్య వ్రతలబ్దశక్తి బ్రహ్మనుకూడ కదలించి వేయును. గృహ స్థాశ్రమవాసు

______________________________________________________________________________

*దేహమునందు కఠినావయవములును మృదువులగు అవయవములును కలపు; కఠినావయవాంశములను మృదువగు అవయవాంశముతో కలుపు భాగమును మర్మస్థాన మందురు. అరచేతి చర్మమును గోళ్లనుకలుపు సంధి స్థానము ఇట్టిదిగా ఉదాహరింప వచ్చును. కఠినావయవమునగాని మృద్వవయవమునగాని తగులు నొప్పికంటె ఈమర్మస్థానములందు తగిలిన నొప్పి ఎక్కువ బాదాకరము.లకు జీవన ప్రవృత్తికి ఉపకరించు వృత్తులు మూడు: 1. యాజనము-యజ్ఞములు జరిపించి దక్షిణగాలభించిన దానితో జీవించుట; 2. అధ్యాపనము-వేదాది విద్యలను బోధించుచు విద్యార్థుల తండ్రులుగాని ధనవంతులను ప్రభువులునుగాని తమంతల తామిచ్చిన దానితో జీవించుట-ఇంత ఇచ్చినచో చదువుచెప్పెదననుట మాత్రము దోషము; 3. ప్రతి గ్రహము -సాత్త్విక దానములను గ్రహించుట; కాని వనాశ్రమమందు నివసించు మావంటి వారికి విహితమగు మేలగు వృత్తి *ఇంకొకటిగలదు; దానిననుసరించువారు వాయుభక్షణమో జలభక్షణమో చేయువారు- దంతములనే (కొయ్య) రోలుగా చేసికొని (పచ్చిధ్యాన్యా దికమునేనమలితిని) జీవించువారు- రాతిపై ధాన్యమో దుంపలో అరగదీసి యోనలుగ గొట్టియో అ చూర్ణము తిని జీవించు వారు అహారము ఏదియు తిననివారు ఐదగ్నుల వేడిమిని సహించుచునుండు వారును నై యుందురు. (నాలుగు వైపులను అగ్నులును తలపై సూర్యుడును తపించుచుండ ఈ ఐదింటి నడుమ నిలుచుట పంచాగ్ని మధ్యస్థితి) ; ఇట్టి వానప్రస్థులు ఇవియేకాక ఇంకను మరికొన్ని మిగుల దుష్కరములగు వ్రతములనుకూడ అవలంభించి అనుష్ఠించుచు తపమాచరించుచుందురు. వీరు బ్రహ్మ చర్యమును పురస్కరించుకొని (ప్రధాన తపః సాధనముగా గ్రహంచి)పరమ గతిని పొందగోరుచుందురు; బ్రహ్మచర్యముచేతనే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడనిపించుకొనునని బ్రహ్మచర్య తత్త్వవేత్తలగు పెద్దలులోకమందు చెప్పుచున్నారు. బ్రహ్మచర్యమునందే ధైర్యము (ధీరత్వము-విచారణా శీలత్వము) నిలిచియున్నది ; బ్రహ్మచర్యమునందే తపము నిలిచి యున్నది ; ఇహ లోకమందెవ్వరు బ్రహ్మచర్యమున స్థిరులైయుందురో వారే పరమున స్వర్గమందుందురు.

నాస్తి యోగం వినా సిద్దిర్నవా సిద్ధిం వినా యశఃl నాస్తి లోకే యశోమూలం బ్రహ్మచర్యా త్పరం తపః 39

______________________________________________________________________________

వృత్తి శబ్దార్థము.

*వృత్తి అనగా జీవన నిర్వహణమును-జీవన నిర్వహణో పాయములును. ఈ మాట అయా పురాణములలో సద్‌ బ్రాహ్మణులును ఉపాసకులును పాటించదగిన జీవన నిర్వహణోపాయములను తెలుపు తావులందు చాల విశిష్టమగు అర్థమున వాడబడినది. ఇవి నాలుగు విధములు: 1. అయాచిత వృత్తి ; 2. ఉంఛవృత్తి; 3. శుక్ల వృత్తి 4. భిక్షావృత్తి.

ఈ నాలుగు విధములగు వృత్తులును హింసా రహితములను మిగుల పవిత్రములును.

ఇందు మొదటిది మాత్రమే వానప్రస్థులకు గ్రాహ్యమని ఓర్యుని వచనము.

1.అయాచిత వృత్తి : తానుకోరకయే ఇతరులు ఎవరయిన తమంతతామయి తెచ్చి ఇచ్చినది కాని - వృక్షములు మొదలయిన వానినుండి స్వయముగా రాలిన - పండ్లును- ఎవరికిని నియతమగు అర్థము (ఆస్తి) గా కాక పెరిగి లభించు శాకకంద మూల నీవారాదికముకాని ఉపయోగించి జీవించుట.

2. సిలోంఛ వృత్తులు:1. వడ్లుదంచు రోళ్లు మొదలగువాని దగ్గరనో ధాన్యపు సంచులు ఎత్తి చోటనే కళ్లములందో పొలములందో రాలిపడిన ధాన్యపుగింజలను ఏరితెచ్చుకొనుటయును 2. పొలములలొ కృషాణులు(కిసాన్‌) పంట పైరులుకొసి ధాన్యపుస్తంబములనుతీసికొని పోయిన తరువాత మిగిలిపోయిన ధాన్యపు కంకులను ఏరి తెచ్చుకొనుటయును. ఇందు మొదటి దానిని ఉంఛము అనియు రెండవ దానిని సిలమనియు అందురు. (కణాదానము ఉంచము. కణిశా దానము సిలము. కణము= గింజలు-మెదుకులు; కణిశము -ధాన్యవు ఎన్నులు! ఆదానము=తీసికొనుట)

3 శుక్ల వృత్తి: బ్రాహ్మణుడు తనసాటి బ్రాహ్మణులనుండి యాచించి తెచ్చికొనిన పక్వాపక్వాహారములును తత్సాధనములును. ఇట్లే క్షత్త్రయాదులును తమసాటి వర్ణములవారి నుండి కాని అంతకంటె మేలి వర్ణముల వారినుండికాని యాచించుకొని తెచ్చికొనిన పక్వా పక్వాహారములును తత్సాధనములును.

4. భిక్ష: శాస్త్రముచే నిషిద్దులుకాని ఆయా జనులనుండి శాస్త్ర నిషిద్దములుకాని అయా అహారములనో అహారసాధనములనో వాటిని కొనుటకుపయోగించు ధనాదికమునో యాచించి తెచ్చకొనుట.

యోనిగృహ్యేన్ద్రియగ్రామం భుత గ్రామం చ పఞ్చకమ్‌ l బహ్మచర్యం సమాధత్తే కిమతః పరమం తపః. 40

అయోగే కేశధరణ మసజ్కల్పవ్రతక్రియాl అబ్రహ్మచర్యే చర్యా త్రయం స్యాధ్దమ్బసంజ్ఞికమ్‌. 41

క్వదారాః క్వచ సంయోగః క్వచ భావవిపర్యయః l నన్వియం బ్రహ్మణా సృష్టా మనసా మానసీప్రజా. 42

యద్యస్తి తపసో వీర్యం పయుష్మాకం విదితాత్మనామ్‌l సృజధ్వం మానసాన్పుత్త్రా న్పాజాపత్యేన కర్మణా. 43

మనసా నిర్మితా యోనిరాధాతవ్యా తపస్విభిః l న దారుయోగో వీర్యంవా వ్రతముక్తం తపస్వినామ్‌. 44

యదిదం లుప్తధర్మార్థం యుష్మాభిరిహ నిర్బయైః l వ్యాహృతం సద్బిరత్యర్థమసద్బిరివ మే మతమ్‌. 45

వపుర్దీప్తాన్తరాత్మాన మేతత్కృత్వా మనోమయమ్‌ lదారయోగం వినా స్రక్ష్యే పుత్త్రమాత్మతనూరుహమ్‌. 46

ఏవ మాత్మాన మాత్మా మే ద్వతీయం జనయిష్యతి l వన్యేనానేన విధినా దిధక్షన్తమివ ప్రజాః. 47

ఊర్వస్తు తపసా77విష్టో నివేశ్యోరుం హుతాశ##నే l మమన్దైకేన దర్బేణ సుతసగ ప్రభవారణిమ్‌. 48

తస్యోరుం సహసా భిత్త్వా జ్వాలామలీ హ్యనిన్దనః l జగతో దహనాకాజ్షీ పుత్త్రో7గ్ని స్సమపద్యత. 49

ఊర్వస్యోరుం వినిర్బిద్య ఔర్వో నామాన్తకో7నలః l దిధక్షన్నివ లోకాంస్త్రీ న్జజ్ఞే పరమకోపనః. 50

యోగములేనిదే సిద్దిలేదు; సిద్దిలేనిదే యశము కలుగదు; బ్రహ్మచర్యమును మించిన తపస్సు యశస్సునకు మూలమగునది లోకమందు మరియేదియు లేదు. (ఇచట యశమనగా కీర్తి అని అర్థముకాదు; నిఃశ్రేయసమనబడు ముక్తి ) ఎవడు ఇంద్రియములను వదింటిని గ్రహించుకొని పంచభూతములను స్వాధీనమొనర్చుకొని బ్రహ్మచర్యమవలంభించునో అట్టివాని ఇట్టి తపమును మించిన తపము మరి ఏదియులేదు. యోగాభ్యాసము లేకయే (యోగివలె) జుట్టు పెంచుకొనుట ఏసంకల్పము లేకయే ఏవేవో వ్రత నియమములాచరించుట బ్రహ్మచర్యమును (చిత్తశుద్దితో) పాటించకయే బ్రహ్మచారిచర్యలు మాత్రమాచరించుట -ఈమూడును దాంభికుని లక్షణములు; ఎక్కడి భార్య! ఎక్కడి భార్యా సంయోగము! ఎక్కడి భావ విపర్యయము! (మనోవికారము!) ఇదియంతయు చాల క్షుద్రమయినది; బ్రహ్మ సృష్టించిన మానస ప్రజాసృష్టియనగా ఇదియే సుమా!అత్మ తత్త్వ మెరిగిన వారమునుకొనుచున్న మీకు తపపశ్శక్తి యున్నచో ప్రాజాపత్య కర్మాను ష్ఠానముతో (దార సంబంధము లేకయే సంతానమునుత్పాదించు విధానముతో) మానస (మనస్సంకల్పాటను సారము కలుగు) పుత్త్రులను ఉత్పాదించుడు; యథార్దముగ తపస్వులాచరించవలసినది కాదు. మిగుల సజ్జనులగు మీరు నిర్బయులై పలికిన - ధర్మతత్త్వము ఏమియు లేని- ఈపలుకుకు నాకు అసజ్జనులు పలికినవి గానే తోచుచున్నవి. (తపస్సుతో) దీపించు అంతరాతట కలిగిన నా దేహమును మనోమయమునుగా పరివర్తనమందించి భార్యా సంబంధము లేకయే నా శరీరజుడగు కుమారునుత్పాదింతును; ఇట్లు నా అత్మ వానప్రస్థులగు తపస్వులకు విహితమగు ఈ ప్రాణాపతగ విధానముతోనే ప్రజలను దహింప గోరువాడేమో యనునట్లు (దహింపగలవాడై ) ఉన్న నారెండవ ఆత్మను స్పజించును; అని పలికెను.

అంతట ఊర్వుడు తపోబలమును పతన యందావేశింపజేసికొని తన ఊరువును (తొడను) అగ్నిపై నిలిపి దానిని పూర్వౌరణిగాను ఒక దర్భను పఉత్తరారణిగాను చేసి ఆదర్భతో ఊరుమును మథించెను. అదియే తననుండి పుత్త్రుడు జనించు ఆరణి కావలెనని యాతని సంకల్పము; శీఘ్రముగా అకస్మికముగా అతని అ ఉరుపును భేదించుకొని జ్వాలలు మాలలుగా కలవాడు ఇంధనములతో పనిలేక వెలుగువాడు జగముల దహింపగోరువాడు అగు అగ్ని ఊర్వపుత్త్రుడుగా జనించెను. ఇట్లు ఊర్వుని ఊరువులనుండి జనించుటచే అతడు ఔర్వుడను పేరునందెను. (' ఊర్వ' పుత్త్రుడు కావున ఔర్వుడు;' ఊరు' నుండి జనించినందునను ' ఔర్వుడు') ఇతడు అంతకుడు (భూతములను అంతమందించువాడు) అనలుడు- (అన-ల-ప్రాణ తత్త్వమును తనయందు లయమరదించువాడు- ప్రాణతత్త్వ రూపమగు వాయువు ఉష్ణమునలయ మందుటయే -ఉష్ణశక్తిగా మారుటయే దహనమనబడునని ఆదునిక వైజ్ఞనికులమను కొనువారుచెప్పుచున్నారు గదా! ఈ మాటను అనాడు ఋషులు చెప్పియేయున్నారని గమనింతురుగాక!) ఈ అగ్ని త్రిలోకములను దహింపగోరుచున్నాడో యనునట్లుండెను; ఇతడు పరమకొపనుడు (అతీ తీవ్రకోప స్వభావుడు) కూడనైయుండెను.

ఉత్పన్నమాత్రశ్చోవాచ పితరం దీనయా గిరా l క్షుధా మే బాధతే తాత జగద్బక్షే త్యజస్వ మామ్‌. 51

త్రితి వారోహిభి ర్జ్వాలైర్జ్ర మ్భమాణోదిశో దశ l నిర్దహన్త్సర్వభూతాని వవృధే స్మాన్తకో7నలః. 52

ఏతస్మిన్నన్తరే బ్రహ్మా మునిమూర్వం సమాగమత్‌ l ఉవాచ వార్యతాం పుత్త్రో జగతశ్చ దయాం కురు.

అస్యాపత్యస్య తీవిప్ర కరిష్యే స్థానముత్తమమ్‌ l తథగ మేతద్వచః పుత్త్ర ! శృణుత్వం వదతాం వఠ 54

ఊర్వః : ధన్యో7 స్మనుగృహీతొసటి యన్మేద్య భగవాఞ్చిశోః l మతిమేతాం దదాతీహ పరమాను గ్రహాయవై. 55

ప్రభాతకాలే సమ్ప్రాప్తే కాజ్షితవ్యే సమాగమే l భగవం స్తర్పితః పుత్త్రః కైర్హివ్యైః ప్రాప్యతే సుఖమ్‌. 56

కుత్రచాసగ నివాస స్స్యా ద్భోజనం తు కిమాత్మకమ్‌ l విధాస్య తీహ భగవాన్వీర్యతుల్యం మహౌజసః. 57

బ్రహ్మా: బడభామఖే7స్య వసతి స్సముద్రేతు భవిష్యతి l మమ యోనిర్జలం విప్ర తస్య పీతవత స్సుఖమ్‌.

యత్రాహ మాస నియతం పిబన్‌ వారిమరుం హవిః l తద్ధవిస్తవ పుత్త్రస్య విసృజామ్యాలయంచ తత్‌. 59

తతో యుగాన్తే భూతానా మహమేషచ పుత్త్రక l సహితౌ విచరష్యావో విష్పుత్త్రాణా మృణాపహః. 60

ఏషో7గ్ని రన్తకాలేషు సలిలాశీ మయా కృతః l దహన స్సర్వభూతానాం సదేవాసురరక్షసామ్‌. 61

ఏవమస్త్వితి తం సోగ్ని స్సంహృతజ్వాలమణ్డలః l ప్రవివేశార్ణవముఖం ప్రక్షిప్య పింతరి ప్రభామ్‌. 62

ఆ ఔర్వుడు పుట్టిన వెంటనే దీన వచనమున తన తండ్రితో ''నాయనా! నన్నాకలి బాధించుచున్నది; లోకమును భక్షింతును; నన్ను వదలుము.'' అనెను; స్వర్గము వరకకారోహించు జ్వాలలతో ఆ అంతకాగ్ని పది దిక్కులకును వ్యాపించుచు వృద్ధినందుచు సర్వభూతములను నిర్దహించుచు పెరుగసాగెను. ఇంతలోబ్రహ్మ ఊర్వునికడకు వచ్చి ''పుత్త్రా! కుమారుని వారింపుము; జగత్తుపై దయచూపుము; విప్రా! ఈనీ కుమారునకు నేనుత్తమ స్థానమేర్పరతును; ఇది నిజము; పురుషోత్తమా! నామాట వినుము.'' అనెను. అది విని ఊర్వుడు ''నేను ధన్యుడనైనాను; ఆనుగ్రహింపబడినాను; ఏలయన భగవానులగు తామ పసివాడనగు నాయందలి పరమానుగ్రహముతో ఈ ఉపదేశము నిచ్చుచున్నారు: ప్రభాత కాలము కాగానే మా ఇరుపురకు సమాగమము (ఒకచోట కలియట) కాంక్షించదగినదేకదా! (తండ్రి కొడుకును వాత్సల్యముతో దగ్గరకు తీసికొనుటయు పసివాడుతండ్రి నాహారమడుగుటకై అతని కడకు వచ్చుటయు లేకసహజమే కధా! అదియు గాక ఈ కుమారుడు అరణులతో మథించగా పుట్టిన అగ్నిరూపుడు; ఉర్వుడు తాను ఋషియగుటచే అన్ని అగ్నులతోపాటు ఈఅగ్నిని కూడ దగ్గరకు తీసికొనుటయు సహజమే.) కనుక అపుడు -భగవన్‌ : ఈపుత్త్రుని నేను ఏ హవిస్సులతో తృప్తి పరచినచో అతనికి సుఖము కలుగును? మహౌజసుడగు ఇతనికి వీర్యమునకు తగిన ఎటువంటి భోజనము తాము ఏర్పాటు చేయుదురు?'' అనెను. బ్రహ్మ ఇట్లనెను: విప్రా! ఇతనికి సముద్రమునందలి ఆడు గుర్రపు నోటియందు (ఆ అకృతిగల ప్రదేశ విశేషమందు) నివానమేర్పరతును. నాకు జన్మహేతువగు జలమితని కాహారమయి తృప్తి ప్రదమగును. నేను ఎచట నివసించుచు అచట జలమయముగు హవిస్సును త్రావుచు ఉంటినో ఆ జలమునే ఇతనికి నివాసముగాను హవీరూపాహారముగను వదలుచున్నాను. (దానియందు ఇతనికి భాగము పంచుచున్నాను.) అందుచే భూత ప్రళయ కాలమందు నాయనా! మేము ఇరువురమును కలిసి సంచరింతుము. ఇతడు పుత్త్రులు లేనివారికి పుత్త్రుడయి పుత్త్ర ఋణమును తీర్చుకొనును. ఈతడు నా ఏర్పటుచే అంతకాలమందు నీటి నంతటిని త్రావునట్లును దేవాసుర రాక్షసారి ప్రాణులను దహించునట్లును నేనేర్పాటు చేయుచున్నాను.'' అని పలికెను. అ అగ్నియు సరే అని తన జ్వాలా సమూహమును మరుగుపరచుకొని తన కాంతి తేజస్సులను తన తండ్రియగు ఉర్వుని యందు ఉంచి సుముద్రపు నోటియందు ప్రవేశించెను.

ప్రతియాత స్తతో బ్రహ్మా తే చ సర్వే మహర్షయః l ఊర్వస్యాగ్నే ః ప్రభాం జ్ఞాత్వా స్వాంగతదిం సముపాశ్రితాః 63

హిరణ్యకశిపు ర్దృష్ట్వా తదా తన్మహ దద్బుతమ్‌ l ఊర్వం ప్రణతసర్వాజ్గో వాక్యమేత దువాచహ. 64

భగవన్న ద్బుతమిదం సంవృత్తం లోకసాక్షికమ్‌ l తపసా %ొతే ముని శ్రేష్ఠ పరితుష్టః పితామహః. 65

అహంతు తవపుత్త్రస్య తవచైవ మహావ్రతl భృత్య ఇతగభిమన్తవ్య స్సాధ్యో యదిహ కర్మణా. 66

తన్మాం పశ్య సమాపన్నం తవైవారాధనే రతమ్‌ l యది సీదే మునిశ్రేష్ఠ తవైవ స్యాత్పరాజయః. 67

ఊర్వః: ధన్మోస్మ్యనుగృహీతోస్మి యస్య తే 7హంగురుస్థ్సితః l నాస్తి తే తపసానేన భయమద్యేహ సువ్రత. 68

తామేవ మాయాం గృహ్ణీష్వ మమ పుత్త్రేణ నిర్మితామ్‌ l నిరిన్ధనా మగ్నిమయీం ద్రుష్ప్రాప్యాం పావకైరపి. 69

ఏష తే స్వస్య పంశస్చ వశగో7రివిని గహే l సంరక్షత్యాత్మపక్షంచ విపక్షంచ ప్రధర్షతి. 70

ఏవమస్త్వితి పతాం గృహ్య ప్రణమ్య మునిపుఙ్గవమ్‌ l గామ త్రిదివం హృష్టః కృతార్థో దానవేశ్వరః. 71

ఏషా ధుర్విషహా మాయా దేవైరపి దురాసదా l ఔర్వేణ నిర్మాతా పూర్వం పాపవకేనోర్వసూనునా. 72

తస్మింస్తు వ్యథితే దైత్యే నిర్వీర్యైషా నసంశయః l శాపోహ్యస్యాః పురాదత్తో సాష్టా తేనైవ తేజసా. 73

యద్యేషా ప్రతిహస్తవ్యా కర్తవ్యో భగవా న్త్సుఖీ l దీయతాం మే సఖా శక్ర! తోయయోన్ని ర్నిశాకరః. 74

తేనావాం సహ సజ్గమ్య యాదోభిశ్చ సమానవృతః l మాయా మేతాం హనిష్యామి త్వత్ప్రసాదా న్న సంశయః.75

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవదావసజ్గ్రామే ఇన్ద్రాయ వరుణోపదిష్టే ఔర్వసుత-

పావకతన్మాయామహిమానువర్ణనం నామ చతుస్సప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

తరువాత బ్రహ్మ తిరిగి వెడలిపోయెను. ఇతరులగు మహర్షులును ఊర్వుని కుమారుడగు అగ్నికిగల ప్రభను తేజో విశేషమును) ప్రత్యక్షముగా చూచి తెలిసికొని తమతమ వచ్చిన చోటికి వెడలిపోయిరి. (ఆ ఋషులతో పాటు అచటకి వచ్చి ఉండిన) హిరణ్యకశిపుడు అ మహాద్బుతమును చూచి సర్వాంగములతో ఊర్వుని నమస్కారించి ఇట్లు పలికెను: భగవన్‌! లోకమంతయు చూచుచుండగా ఇట్టి ఈ అద్బుతము జరిగినది; మునిశ్రేష్ఠ! నీ తపస్సుచే పితామహుడును పరితుష్టి చెందివాడు; *మహావత్రా!(ఉత్తమ కర్మానుష్ఠాన పరారుణా!) ఇచట నీవు చేసి చూపిన ఏపని కలదో దాని చేత నేను నీకును నీకుమారునకును భృత్యుడను అని భావింప వేడుచున్నాను. కావున నన్ను నిన్నే శరణు చొచ్చిన వానినిగాను నీయారాధనమునందే అనక్తునిగాను చూడుము. ముని శ్రేష్ఠా! ఇక మీదట నాకేదైన క్లేశము కలిగినచో నీ రాజు యమే యగును (అని ఎంచుము.) అనెను. అది విని ఊర్వుడిట్లనెను: నేను నీయంతటివానికి గురువుగానై తిననిన నేను ధన్యుడనైతిని; భగవంతునిచే అనుగ్రహింపబడితిని. సువ్రతా !( మంచి కర్మళ నాచరించువాడా!) ఈ నా తపస్సు ఉన్నంతవరకు ఇక మీదట నీ కే భయమునులేదు. నాపుత్త్రునిచే నిర్మింపబడినదియు ఇంధనములతో పనిలేని అగ్ని రూపముననున్నదియు (నిరింధనములగు పావకాగ్నులకును పొందరానిదియు (చూ. 51 అధ్యా.) అగు ఆ ఔర్వమాయనే నీకిచ్చునున్నాను. గ్రహించుము; ఇది శత్రుపక్షమును ఎదిరించును: ప్వపక్షమును రక్షించును. అనగా సరేయని దానిని గ్రహించి అ ముని పుంగవుని నమస్కరించి హర్షయుక్తుడై దానవేశ్వరుడు స్వర్గమునుద్దేశించి వెడలిపోయెను. (దానవులు ఉండునది భూమిమీదనే; కాని ఇపుడు హిరణ్యకశివుడు త్రిలోకాధిపతియై యున్నాడు.)

ఈ మాయ ఎంత శ్రమతోనైనను సహింపనైన నలవికానిది; దేవతలకు కూడ దగ్గరకు చేరనైనరానిది; ఎదిరించుటకును జయించుటకును శక్యమేకాదు. ఊర్వుని ఊరువులనుండి జన్మించిన పావకాగ్ని (అనింధనాగ్ని) చే నిర్మించబడినదిది; (దీనినెవడు ప్రయోగించెనో) ఆ దైత్యుని వ్యథ పరచినచో ఈ మాయ నిర్వీర్యమగును; అందు సంశయము లేదు. ఇది ఆ ముని తేజస్సుతో నిర్మించబడినను ఆతనిచేతనే ఈ శాపము కూడ ఈయబడెను. ఈ మాయను ప్రతీకారముచే ఆణచవలయుననినచో-భగవానుడవగు నిన్ను సుఖవంతునిగా చేయవలయునన్న చో శక్రా! నాసఖుడును జలముల కూడియును నాయందలి జలజంతువులు నా పరివారముగా తోడుచేసికొనియు నీయనుగ్రహమువలన ఈ మాయను నశింపజేయుదును; సందేహింపకుము; అని వరుణుడు ఇంద్రునితో ననెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవదానవ సంగ్రామమున వరుణుడింద్రునకు ఔర్వాగ్నిమాయాతచ్చమనోపాయములను తెలుపుటయను నూటడెబ్బదినాలుగవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters