Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకసప్తత్యుత్తరశతతమో7ధ్యాయ

శ్రీవిష్ణుమహిమానువర్ణనమ్‌.

శ్రీమత్స్యః: విష్ణుత్వం శృణు మే విష్ణో ర్హరిత్వం చ కృతేయగే |

వై కుణ్ఠత్వంచ దేవేషు కృష్ణత్వం మానుషేషుచ. 1

ఈశ్వరస్యహి తసై#్యషా కర్మణాం గహనా గతి ః l సమ్ప్ర త్యతీతా స్బవ్యాంశ్చ శృణు రాజ న్యథాతథామ్‌. 2

అవ్యక్తో వ్యక్తలిజ్గస్థో య ఏష భగవా న్ప్రభుః l నారాయణో వ్యానన్తాత్మా ప్రభవో7 ప్యయ ఏవ చ . 3

ఏష నారారుణో భూత్వా హరి రాసీ త్సనాతనః l బ్రహ్మా వాయుశ్చ సోమశ్చ ధర్మ శ్శుక్రో బృహస్పతిః.

అదితేరపి పుత్త్రత్వ మేష యాతో యుగేయుగే l ఏష విష్ణురితి ఖ్యాతి ఇన్ద్రస్యావరజో విభుః 5

ప్రసాదజం చాస్య విభో రదిత్యాః పుత్త్రకారణమ్‌ l వధార్థం సురశ త్రూణాం దైత్యదానవరక్షసామ్‌. 6

ప్రధానాత్మా పురాహ్యేష బ్రహ్మాణ మసృజ త్ప్రభుః l సో7సృజ త్పూర్వపురుషః పురాకల్పే ప్రజాపతీ9.

అసృజ న్మానవాం స్తత్ర బ్రహ్మవంశ్యా ననుత్తమా 9 l

తేభ్యో7భవ న్మహాత్మభ్యో బహుధా బ్రహ్మ శాశ్వతమ. 8

ఏతదాశ్చర్యభూతస్య విష్ణోః కర్మానుకీర్తనమ్‌ l కీర్తనీయస్య లోకేషు కీర్త్యమానం నిబోధ మే. 9

వృత్తే వృత్రవధే తత్ర వర్తమానే కృతే యుగే l ఆసీ త్త్రైలోక్యవిఖ్యాత స్సజ్గ్రామ స్తారకామయః. 10

యత్ర తే దానవా ఘోరా స్సర్వే సజ్గ్రామదుర్జయాః l ఘ్నన్తి దేవగణా న్త్సర్వా న్త్సయక్షోరగరాక్షసా9.

తే వధ్యమానా విముఖాః క్షీణప్రహరణా రణ l త్రాతారం మనసా జగ్ముర్దేవం నారాయణం ప్రభుమ్‌. 12

నూట డెబ్బది యొకటవ అధ్యాయము.

శ్రీవిష్ణు మహిమాను వర్ణనము.

తారకామయ యుద్ధ ప్రస్తావము.

(శ్రీమత్స్యమహా పురాణమున పేర్కొనబడిన పండ్రెండు దేవాసుర సంగ్రామము (కొట్లాట)లలో తారకామయ సంగ్రామము ఒకటి . ఈ సంగ్రామముంనందు తారుడు (తారకుడు కాదు) మయుడు కాలనేమి అను అసురులు ముఖ్యులు ఇందు పర్యవసానమున కాలనేమి శ్రీ మహా విష్ణుని చేతిలో మరణించెను.

తార-కాలనేమి - మరు - నాములగు అసురులు ప్రధానులుగా ఉన్నది కావున ఈ సంగ్రామమునకు తార -కా (కాలనేమి)- మయము అను ప్రసిద్ధి వచ్చెను. ఇచట 'కా' అనునది; కాలనేమి శబ్దమునకు సంక్షిప్త రూపము (Shortened form).

తారకామయ నామక దేవదానవ సంగ్రామ కథారంభము

$ª«sV»R½V=Qù²R…V ª«sVƒ«sVª«soƒ«sNRPV BLiNRPƒ«sV BÈýÁV ¿Á|msöƒ«sV: కృతాది యుగములందు విష్ణువును- సర్వ వ్యాపకుడగుటచే విష్ణువు ( వ్యాప్నోతి- ఇతి) సర్వ దోషహరుడగుటచే హరి అడ్డులేని జ్ఞాన ప్రవృత్తి కలవాడగుటచే వైకుంఠుడు (వి-కుంఠా- అన్య ఆస్తిజ్ఞానే ) సుఖ భోగములను దగ్గరకు తెచ్చి ఇచ్చువాడు కావున కృష్ణుడు (కృషతి-ఇతి) అని దేవతలును మానుషులును వ్యవహరింతురు. దీనికి హేతువులగు అతని మహిమ లక్షణములను తెలిపెదను; వినుము; ఈశ్వరుడగు ఆతని కర్మప్రవృత్తుల నడక సరిగ తెలిసి కొనుట సులభ సాధ్యము కాదు; అవి (సంప్రతి) ఇపుడు జరుగుచున్నవి ఏవి కలవో అవి అన్నియు ఉన్నవి ఉన్నట్లు తెలిపెదను; ప్రభుడు భగవానుడు అగు ఈతడు స్వయముగా అవ్యక్త రూపుడయియు లోక హితమున కైవ్యక్తములగు (స్పష్ట రూపములగు ) లింగములు (అవయవాది లక్షణములు) కలవాడగు చున్నాడు. ఇతడు నారారుణుడు- జీవులకు ఆశ్రయుడు; అనంత రూపుడు; ప్రభుడు- సర్వ జగత్కారణుడు తన యందే లయ మొనర్చుకొను వాడు. ఇతడే హరి- సనాతనుడు- (శాశ్వతుడు). బ్రహ్మ- వాయువు సోముడు- ధర్ముడు- శుక్రుడు బ్రహస్పతి ఇతడే; ఇతడు యుగ యుగమున అదితికి పుత్త్రుడై ఇంద్రునకు తమ్ముడై దేవతలకు శత్రువులగు దైత్యదానవరక్షస్సులను వధించిత ప్రసాదము (అనుగ్రహము) చూపును. వామనావతారమున సర్వ జగద్వ్యాపియైనందున అతని విష్ణుత్వము సార్థకమయ్యెను. ఈతడు ప్రభుడు (సమర్థుడు) కనుక పూర్వము ప్రధాన (మూల ప్రకృతి) రూపుడై బ్రహ్మను సృజించెను. పూర్వపురుషు (మొదటి తరపువా)డై ప్రజా పతులను సృజించెను. అందే మానవులను మహోత్తమములగు బ్రహ్మణ వంశములను సృష్టించెను ఆ మహాత్ములనుండియే శాశ్వతమగు బ్రహ్మ (వేదము) ప్రవర్తిల్లెను. ఇది కీర్తనీయుడు (పొగడదగినవాడు) అగు విష్ణుని కర్మాను కీర్తనక్రమము; ఇతడాశ్చర్యభుతుడు: లోకములందు కీర్తింపబడుచున్న ఈతని కర్మ విశేషములను తెలిపెదను వినుము;

పూర్వము కృతయుగమున వృత్రవధానంతరము తారకామయమను దేవదానవ సంగ్రామము జరిగెను. అది త్రిలోక ప్రసిద్ధము. దానియందు యుద్ధమున ఎవరికి గెలువరాని ఘోర దానవులు సర్వదేవ గణములను వారికి తోడగు యక్ష పన్నగ రాక్షసులనుకూడ చంపుచుండిరి. వారంతట తమ ఆయుధములు క్షీణించగా యుద్దవిముఖులై రక్షకుడు ప్రభుడునగు నారాయణ దేవుని తమ మనస్సుల ధ్యానించిరి.

ఏతస్మిన్నన్తరే మేఘా నిర్వాణాజ్గారవర్చసః l సార్కచన్ద్రగ్రహగణం ఛాదయన్త స్తతో సభః 13

చండవిధ్యుద్గణోపేతా ఘోరనిర్హ్రాదకారితః l అన్యోన్యయోగా భిహతాః ప్రవపు స్సప్త మారతాః. 14

దీప్తతోయాశనిఘనై ర్వజ్రవేగావనిలానలైః l నవై స్సుఘోరై రుత్పాతై ర్దహ్యమాన మివామ్బరమ్‌ . 15

పేతురుల్కా సహస్రాతి నిపేతుః ఖచరాణ్యపి l దివ్యానిచ విమానాని ప్రవతన్త్యుత్పత న్తిచ. 16

చతుర్యుగాతిపర్యాయే లోకానాం యద్బయం భ##వేత్‌ l అరూపవన్తి రూపాణి తస్మి న్నుత్పాతదర్శనే. 17

జాతంచ విష్ప్రభం సర్వం సప్రాజ్ఞాయత కిఞ్చన l తిమిరౌఘపరిక్షిప్తా న రేజుశ్చ దిశో దశ. 18

వివేశ రూపిణీ కాలీ కాలమేఘవగుణ్థితా l ద్యౌ ర్నభాత్యభిభూతార్కా ఘోరేణ తమసా వృతా. 19

తాన్ఝనౌఘా న్త్సతిమిరా న్డో ర్బ్యా ముత్షిప్య స ప్రభుః l వపు స్సన్దర్శయామాస దివ్యం కృష్ణం వపు ర్హరిః.

బలహకాఞ్జననిభం బలాహకతనూరుహమ్‌ l తేజసా వపుషా చైవ కృష్ణం కృష్ణమివాచలమ్‌. 21

దీప్తపీతామ్బరధరం తప్తకాఞ్చనభుషణమ్‌ l ధుమాన్దకారవపుషం యుగాన్తాగ్ని మివోత్థితమ్‌. 22

చతుర్ద్విగుణపీనాంసం కిరీటచ్ఛన్న మూర్దజమ్‌ l బభౌ చామీకర ప్రఖ్యై రాయుదై రుపశోభితమ్‌. 23

ఈ నడుమకాలముననే చల్లారిన అంగారముల (బొగ్గుల) వంటి కాంతిగల మేఘములు అర్కచంద్రగ్రహణములతో కూడ ఆకసము కప్పుచు భయంకర విద్యుద్గణములతో కూడి భయంకర ధ్వనులు చేయచు పరస్పరపు కూడికతో దెబ్బలు తినుచుండెను. సప్త వాయువులు వీచెను. ప్రకాశించు నీటితోను పిడుగులతోను కూడిన మేఘములతోను వజ్రము (పిడుగు)ల వేగముతోను వాయ్వగ్నులతోను క్రొత్తవి మహాఘోరములునగు ఉత్త్పాతములతోను ఆకనము దహింపబడుచున్నదో అనునట్లయ్యెను. వేలకొలది ఉల్కలునుగ్రహ(ఖండ)ములను రాలుచుండెను. దివ్యులు దివ్యవిమానములను పడుచు ఎగురుచునుండెను. మహాయుగములు అన్నియు గడచిన కల్పాంతమున లోకములకు ఏ భయముకలుగునో అట్టిది కలిగించుచు అన్నియు రూపరహతములు అగుచుండెను. సర్వమును తేజోరహితమయ్యెను. పది దిక్కులును చీకటుల గుంపులతో వ్యాప్తములయి కాంతిహీనములయ్యెను. కాళి నల్లని మేఘముల ముసుగు కప్పుకొని రూపము దాల్చిలోకమున ప్రవేశించెను. ఆకాశమున రవి మరుగుపడగా ఘోరాంధకార మావరించగా అంతయు ప్రకాశరహితమయ్యెను.

ఇట్టి మబ్బుల గుంపులను చీకటులను తన భుజములతో ఎత్తివేసి ప్రభుడగు హరి తన నల్లని శరీరమును దర్శింపజేసెను. అది మేఘములవలె కాటుకవలె మెరయుచు అట్టి వెంట్రుకలు కలిగి నల్లని కొండవలె నుండెను ఐనను ప్రకాశించు పీతాంబరమును కాచిన బంగారు సోమ్ములును దాల్చి పుష్టిగల నాలుగు భుజములు కిరీటముతో కప్పిన వెంట్రుకలు కలిగి పొగతో చీకటులతో రూపొందియు ప్రజ్వలించుచు ఆది ప్రళయాగ్నివలె నుండెను. బంగారుతో ప్రకాశించు ఆయుధములతో వెలుగుచుండెను.

చన్ద్రార్కకిరణోద్ద్యోతం గిరికూట మివోచ్ఛ్రితమ్‌ l నన్దకానన్దితకరం శరాంశీవిషధారిణమ్‌. 24

శక్తిచిత్రబలోదగ్రం శజ్ఞచక్రగదాధరమ్‌ l విష్ణుశైలం క్షమామూలం శ్రీవృక్షం శార్‌జ్గశృంగిణమ్‌. 25

త్రిదశోదారఫలదం స్వర్గస్త్రీచారపల్లవమ్‌ l సర్వలోకనమస్కృత్యం సర్వసత్త్వమనోహరమ్‌ . 26

నానావిమానవిటపం తోయదామ్బుమధుస్రవమ్‌ l విద్యాహజ్కారసారాఢ్యం మహాభూతప్రరోహణమ్‌. 27

విశేషపత్రైర్నిచితం గ్రహనక్షత్రపుష్పితమ్‌ L దైత్యలోకమహాస్కన్ధం మర్త్యలోక ప్రకాశినమ్‌. 28

సాగరాకారనిర్హ్రాదం రసాతమహాశ్రుయమ్‌ lనాగేంద్రపార్శ్వ వితతం పక్షిజంతు నిషేవితమ్‌. 29

శీలార్థచారుగన్దాఢ్యం సర్వలోకమహా ద్రుమమ్‌ l అవ్యక్తాన న్తనలిలం ప్యక్తాహజ్కారఫేనిలమ్‌. 30

మహాభుతతరజ్గౌఘం గ్రహనక్షత్రబుద్బుదమ్‌ l విమానవాహనైర్వ్యాప్తం తోయదాడమ్బరాకులమ్‌. 31

జన్తుమత్స్యగణాకీర్ణం శైలశజ్ఖకులై ర్యుతమ్‌ l త్రైగుణ్యవిషయావర్తం సర్వలోకతిమిజ్గిలమ్‌.32

వీరవృక్షలతాగుల్మం భుజజ్గామృష్టశైవలమ్‌ l ద్వాదశార్కమహాద్విపం రుద్రైకాదశవత్తనమ్‌. 33

వస్వష్టపర్వతోపేతం త్రైలోక్యామ్బోమహోదధిమ్‌ l సన్ద్యాసంధ్యోర్మిసలిలం సుపర్ణానిలసేవితమ్‌ 34

దైత్యయక్షగణగ్రాహం రక్షోగణఝుషాకులమ్‌ l పితామహమాహావీర్యం స్వర్గస్త్రీరత్నశోభితమ్‌. 35

శ్రీకీర్తికా న్తిలక్ష్మీభి ర్నధీభిరుపశోభితమ్‌ l కాలయోగమహాపర్వప్రళయోత్పత్తివేగినమ్‌. 36

తత్సంయోగమహాపారం నారాయణమహార్ణవమ్‌ l

దైత్యుల చేతిలో ఓడియున్న దేవతలకు శ్రీమన్నారాయణుడు దర్శన మిచ్చెను. అతడు చంద్ర సూర్య కిరణములతో మిగుల ప్రకాశించుచుండెను. ఉన్నతమగు పర్వత శిఖరమువలె నుండెను. నందక ఖడ్గముతో అతని కరము ఆనందకరమై యుండెను. కరము లనెడు సర్పముల నతడు ధరించెను. ఇచ్చాది శక్తులతో ఆశ్చర్యకరబలముతో భయం కరుడై శంఖచక్రగదల ధరించి యుండెను. ఓర్పు అనెడు మూల (పాతు) భాగము లక్షి యనెడు వృక్షము శార్‌జ్గధను వనెను శిఖరముకల విష్ణువనెడు పర్వతము అది ! దేవతలకు ఉదారములగు మంచి ఫలములను ఇచ్చుచు స్వర్గస్త్రీలు అనెడు అందమగు పల్లవములు కలిగి సర్వలోకముల వారికి నమస్కార్యమయి సర్వప్రాణులకును మనోహరమయి నానా విమానములనెడు కొమ్ములు కలిగి మేఘ జలములనెడు తేనెను. స్రవించుచు జ్ఞనముచే కలిగిన అహంకారమును సారము కలిగి (సారము= చెట్టునకు ఉండు చేప); పంచ మహాభూతములు అను మొలకలు కలిగి ఆయా విశేషములు అనెడు ఆకులతో వ్యాప్తమయి గ్రహములు నక్షత్రములు అను పూవులతో నిండి దైత్య లోకమనెడు పెద్ద బోదె కలిగి మర్త్యలోకమునందు ప్రకాశించుచు సముద్రపు హోరువంటి ధ్వని కలిగి రసాతల(పాతాళ) మనెడు గొప్ప ఆశ్రయము (పాదు) కలిగి నాగ్రేంద్రులు అనెడు పార్శ్వములతో వ్యాప్తముయి పక్షులకును జంతువులకును ఆశ్రయమయి వాటిచే సేవింపబడుచు మంచి నడువడి అర్థము (ధనము) అనెడు దివ్య సువాసనతో కూడియున్న సర్వలోక సముదాయమనెడు మహావృక్షమది; (నారాయణుడు సర్వజగద్రూపుడని భావము); అవ్యక్త తత్త్వము అను జలమును వ్యక్తమగు అహంకార తత్త్వమనెడు నురుగును మహాభూతములు అనెడు తరంగములును గ్రహములు నక్షత్రములు అనెడు బుడగలును కలిగి విమానములను వాహనములతో వ్యాప్తమయి మేఘముల ఆడంబరముతో నిండి ఆయా ప్రాణులనెడు మత్స్యములతో వ్యాప్తమై పర్వతములనెడు శంఖముల రాసులు కలిగి త్రిగుణములతో నిర్మితములయిన విషయ భోగములనెడు సుడులు కలిగి సర్వలోకములనెడు మహాద్వీపములు ఏకాదశ రుద్రులనెడు పట్టణములు అష్ట వసువులనెడు పర్వతములుకల త్రైలోక్యమనెడు మహాసముద్రమా నారాయణుడు; యుగనంధ్యా సంధ్యాంశములనెడు లెక్కలేనన్ని అలలు గరుడుడు అనెడు వాయువులు దైత్యయక్ష గణములనెడు మొసళ్ళు రాక్షస గణమనెడు చేపలు బ్రహ్మదేవుని సృష్టి మహాశక్తియనెడు మహాబలము స్వర్గస్త్రీలను మహారత్నములు శ్రీకీర్తి కాంతి లక్ష్మీ దేవులనెడు నదులు ఆయా కాలయోగములు మహాపర్వ సమయములు సృష్టిప్రళయములు అను వేగము -వీటి కూడిక యనెడు ఒడ్డు- కలిగిన నారాయణ మహాసముద్రరూపుడు ఆ విష్ణువు.

దేవాదిదేవం వరదం భక్తానాంభక్తి (క్త)వత్సలమ్‌. 37

అమగ్రహకరందేవం ప్రశాన్తికరణంశివమ్‌ l హర్యశ్వరథసంయుక్తే సుపర్ణధ్వజశోభితే. 38

గ్రహచన్ద్రార్కరచితే మన్దరాక్షవరావృతేl అనన్తరశ్మిసంయుక్తే విస్తీర్ణే మేరుగహ్వరే . 39

తారార్కచిత్రకుసుమే గ్రహనక్షత్రబన్దురే l భ##యేష్వభయదంవ్యోమ్ని దేవా దైత్యపరాజితః. 40

దదృశుస్తే స్థితం దేవం దివ్యలోకమయే రథే l తం కృతాఞ్జలయస్సర్వే దేవా శ్శక్రపురోగమాః. 41

జయశబ్దం పురస్కృత్య శరణ్య్ర శరణం గతాః l స తేషాం తాం గిరం శ్రుత్వా విష్ణుర్దైవతదైవతమ్‌. 42

మనశ్చక్రే వినాశాయ దానవానాం మహామృథే l ఆకాశే తు స్థితో విష్ణురుత్తమం వపు రాస్థితః.43

ఉవాచ దేవతా స్సర్వా స్సర్రతిజ్ఞమిదం వచః l శాన్తిం వ్రజత భద్రం వో మా భైష్ట మరుతాం గణా. 44

జితా మే దానవాస్సర్వే త్రైలోక్యం ప్రతిగృహ్యతామ్‌ l తే తస్య సత్యధర్మస్య విష్ణోర్వాక్యేన తోషితాః. 45

దేవాః ప్రీతిం పరాం జగ్ముః ప్రాశ్యామృతమివామరాః l తతః కుసుమర్షాతి వవర్షుశ్చ వలాహకాః. 46

ప్రవవుశ్చ శివా వాతాః ప్రసన్నాశ్చ దిశో దశ l శుద్ధప్రభాణి జ్యోతీంషి సోమం చక్రుః ప్రదక్షిణమ్‌. 47

న విగ్రహం గ్రహాశ్చక్రుః ప్రసన్నాశ్చాపి సిన్థనః l విరజస్కా7భవన్మార్గాః ప్రసన్నా వీథయస్త్రయః. 48

యథార్థమూహు స్సరితో నాపి చుక్షుభిరే7ర్ణవాః l ఆసఞ్చభానీన్ద్రియాణి నరాణామన్తరాత్మసు. 49

మహర్షయో వీతశోకా వేదా నుచ్చై రధీయతl యజ్ఞేషుచ హవిర్బాగం శివమాపచ పావకః. 50

ప్రవృత్తధర్మసంవృత్తా లోకా ముదితమానసా ః l విష్ణోర్దత్త ప్రతిజ్ఞస్య శ్రుత్వారినిధనే గిరమ్‌. 51

ఇతి శ్రీమత్స్య మహాపురాణ పద్మోద్భవ ప్రాదుర్బావకథనే శ్రీ విష్ణుమహిమాను

వర్ణనాదికథనం నామ ఏకసప్తత్యుత్తర శతతమో7ధ్యాయః.

అతడు దేవాదిదేవుడు; భక్తులకు వరములనిచ్చువాడు; భక్తవత్సలుడు; అనుగ్రహము చూపువాడు; దేవుడు (ప్రకాశించువాడు) ; ప్రశాంతి కలిగించువాడు; శుభకరుడు; పచ్చని గుర్రములను పూంచిన రథములతో కూడినదియు గరుడధ్వజ శోభితమును గ్రహ చంద్రార్కులతో అమర్చబడినదియు మందర పర్వతమను మేలయిన ఇరుసు కలదియు అనంత కిరణములు కలదియ విస్తీర్ణమును మేరుపర్వతపు లోతులందు ఉన్నదియు నక్షత్రములు సూర్యుడు ననెడు చిత్రములగు వన్నె వన్నెల పూపులు కలదియు గ్రహములతో నక్షత్రములతో దట్టముగా నిండినదియు అగు పరమాకాశము నందు దివ్యలోక మయరథమునందు ఉన్నవాడు; భయము కలిగిన సందర్బములందు అభయమిచ్చువాడు ; ఇట్టినారాయణుడు దైత్య పరాజితులకు దేవతలకు దర్శనము నొసగెను.

ఇంద్రుడుమొదలగు దేవతలందరును దోసిలియొగ్గి జయశబ్ద పూర్వకముగా శరణ్యుడగు ఆనారాయణుని శరణుపొందిరి. దేవదేవుడగు శ్రీమహావిష్ణువు వారి మొరవిని మహాయుద్దమునందు దానవులను వధించ సంకల్పించెను. విష్ణు వాకాశమునందు ఉత్తమరూపము ధరించి నిలువబడి ప్రతిజ్ఞారూపమగు ఈ వాక్యమును దేవతలందరతో పలికెను: దేవ గణములారా! మీకు మేలగుతః శాంతి పొందియుండుడు. భయపడకుడు; దానవులందరును నాచే ఓడిపోవుదురు; త్రైలోక్యమును మీరు మరల పొందుదురు; అనగా విని దేవతలు సత్యధర్మరూపుడగు విష్ణునివాక్యముతో సంతోషమందరి. వారికి అమృతము త్రావినట్లయి వారు చాల తృప్తి నందిరి. అంతట మేఘములు పూలవాన కురియించెను. హాయిగొలుపు గాలులు వీచెను. దశదిశలును నిర్మలములయ్యెను. జ్యోతిస్సులు (నక్షత్రములు) శుద్దకాంతి గలవయి చంద్రుని ప్రదక్షిణించుచు సంచరించెను. గ్రహములు యుద్దములు జయపుకొనలేదు. (గ్రహ యుద్దము జ్యోతిశ్చక్రము నందపుడపుడు జరుగుచుండును . అది లోకమునకు ఉపద్రవకారణము.) నదులు నిర్మలములయ్యెను. (భూమ్యంతరిక్ష. ద్యులోకములందలి) మార్గములు ధూళి రహితములయ్యెను . వీథ త్రయమును (ఆకాశమునందలి నక్షత్ర చక్రమునందు గల ఐరావత వీథి వైశ్వాసరవీథ జరద్గవ వీథి అనునవి) నిర్మలమయ్యెను. *నదులు తమతమ ఒడ్డులకు సరిగా (పొంగక క్రుంగక) ప్రవహించెను. సముద్రములు కల్లోలమందకుండెను. మానవుల అంతఃకరణములయందు జ్ఞానేంద్రియ విషయక ప్రవృత్తులు శుభకరములయు ప్రవర్తిల్లెను. మహార్షులు శోక రహితులరు సృష్టముగా వేదాధ్యయనము చేయగలిగిరి. అగ్ని యజ్ఞములందు లోకశుభకరముగ హవిర్భాగమందుకొనెను. లోకములన్నియు ధర్మములందు ప్రవర్తిల్లుచు ముదిత మాననములయ్యెను . విష్ణువు తాను దేవశత్రువుల చంపుదునని ప్రతిజ్ఞ సేయుటతో లోకములిట్లు శాంతములయ్యెను.

ఇతి శ్రీమత్స్యమహాపురాణమున పద్మోద్భవ ప్రాదుర్భావ కథనమున తారకామయ యుద్ద

ప్రస్తావమున శ్రీ విష్ణు మహిమాను వర్ణనమను నూట డెబ్బది ఒకటవ అధ్యారుము.

_______________________________________________

*న విగ్రహం గ్రహా శ్చక్రుః ప్రసన్నాశ్చాపి సింధవః l

విరజస్కా7భవ న్మార్గాః ప్రసన్నా వీథయ స్త్రయః. 48

యథార్థ మూహుః సరితో నాపి చుక్షుభిరే7ర్ణవాఃl

ఆసన్‌ ఛుభానీంద్రియాణి నరాణా మంతరాత్మసు. 49

48లో 'త్రయో వీథయః' అనగా 123వ అధ్యాయమున తెలిపిన ఐరావత- జరద్గవ - వైశ్వానర- (వీథుల) నామములతో ప్రసిద్ధములయిన ఈమూడు 'పథమలు' అని యర్థము.

''సరితః యథార్థం ఊహుః.''

సరిత్తులు (నదులు) తమ నామమందలి అర్థమునకు తగినట్లు ప్రవహించెను.

é 'సృ-గతౌ' అను ధాతువునుండి 'సర న్తి' 'శ##నైః గచ్ఛంతి ' ' నెమ్మదిగా పోవును. ' అను అర్థమున 'సరిత్‌' శబ్దమ నిష్పన్నము. కావున విష్ణుప్రసాద సమయమున నదులు వేగమును ఎగుడు పదిడులును లేక ప్రశాంతముగా నెమ్మదిగా ప్రవహించుచుండెను. అని అర్థము.

Sri Matsya mahapuramu-2    Chapters