Sri Matsya mahapuramu-2    Chapters   

సప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

బ్రహ్మకృతస్వాయమ్బువమన్వాదిసృష్టిః.

శ్రీమత్స్యః ; స్థిత్వాచ తస్మిన్‌ కమలే బ్రహ్మా బట్రహ్మవిదాం వరః l

ఊర్ద్వబాహు ర్మహాతేజా స్తపో ఘోరం సమాశ్రితః. 1

ప్రజ్వలన్నివ తేజోభీ ర్బాభి స్వ్సాభి స్తమోనుదః l బభాసే సర్వధర్మస్థ స్సహ స్రాంశు రివాంశుభిః.2

అథాన్యద్రూప మాస్థాయ *స్రష్టా నారారుణో7వ్యయః l ఆజగామ మహతేజా యోగాచార్యో మహాయశాః.

సాజ్ఞ్యాచార్యశ్చ మతిమా న్కపిలో బ్రహ్మణో వరః l ఉభావపి మహాత్మానౌ స్తువన్తౌ క్షేత్రతత్పరౌ . 4

తౌ ప్రాప్తా శూచతు స్తత్ర బ్రహ్మాణ మమితౌజసమ్‌ l పరావర విశేషజ్ఞౌ పూజితౌ చ మహర్షిభి ః. 5

బ్రహ్మాత్మా దృఢబన్దశ్చ విశాలో జగదాస్థితః l గ్రామణి స్సర్వభూతానాం బ్రహ్మా త్రై లోక్యపూజితః. 6

* శమ్భుర్నారాయణో7వ్యయః.

తయో స్తద్వచనం శ్రుత్వా విప్రో7భ్యాహృతయోగమిత్‌ l

త్రీనిమా న్కృతవా న్లోకా న్యథేయం బ్రహ్మణః శ్రుతిః. 7

పుత్త్రం స్వాయమ్బువం చైవ ముత్పాదయితవా నృషిః l

తస్యాగ్రే వాగ్యత స్తస్థౌ బ్రహ్మాణ మజ మవ్యవయమ్‌. 8

సోత్పన్నమాత్రో బ్రహ్మాణ ముక్తవా న్మానస స్సుతః l కిం కుర్మి తవ సాహాయ్యం బ్రవీతు భగవా నృషిః 9

బ్రహ్మాః య ఏష కపిలో బ్రహ్మా నారాయణపర స్తథా l వదతో భవత స్తత్త్వం తత్కురుష్వ మహామతే . 10

బ్రహ్మణస్తు తదర్థంతు తదా (గృహ్య) భూయః సముత్థితః l

శుశ్రూఘరస్మి యువయోః కిం కరోమి కృతాఞ్జలిః. 11

___________________________________________________________________________

నూట డెబ్బదియవ అధ్యాయము.

బ్రహ్మ స్వాయంభువాదులను ప్రణవాది వాజ్మయమును ప్రాణిజాతమును సృజించుట.

శ్రీమత్స్యుడు మనువునకు చెప్పెనని సూతుడు ఋషులకిట్లు చెప్పెను: వేదతత్త్వ వేత్తలలో శ్రేష్ఠుడు మహాతేజుడుఅగు బ్రహ్మ విష్ణుని నాభియందుండి ఉత్పన్నమయిన ఆ హిరణ్మయ కమలమునందు నిలువబడియుండి భుజములు పైకెత్తినవాడయి ఘోర తపమాశ్రయిచెను. అతడు తన తేజోరాశులతో గాఢముగా మండుచున్నాడేమో యనునట్లుండెను. తన కాంతులతొ చీకటులను పోగొట్టుచుండెను; సర్వ ధర్మములందును స్థిరుడయి నిలిచి ఆతడు తన తేజః కిరణములతో వేయి కిరణములుగల రవివలె ప్రకాశించు*చుండెను.

ఇట్లు బ్రహ్మ తపమాచరించుచుండగా అతనియందుఅనుగ్రహము కలిగి నారాయణుడు తాను అవ్యయుడు (ఏ వికారములును లేనివాడు) అయియును తాను ఇపుడు సృష్టిప్రవర్తకుడు కావలయును కావున తాను క్షీరార్ణవమున శయనించియున్న పురుషోత్తమ రూపము కాక మరి వేరు రూపములను ధరించి అతని ఎదుటకు వచ్చెను. ఆ రూపములలొ నొకటి మహా యశశ్శాలియు మహా తేదశ్శాలియ అగు యోగాచార్యుని రూపము; రెండవది బ్రహ్మణ శ్రేష్ఠుడును మహా మతిమంతుడును సాంఖ్యాచార్యుడునునగు కపిలుని రూపము. వీరిరువురును పరమునకు అపరమునకు (పరమాత్ముని పరా ప్రకృత్య పరా ప్రకృతుల స్వరూపమును ఆ రెండిటి- విశేష-) భేదమును భాగుగ ఎరిగినవారు; మహా77త్ములు(తమ ఆత్మను లోకకళ్యాణమునకే ఉపయోగించుచు ఉత్కృష్టమొనర్చుకొనువారు) క్షేత్ర తత్త్వజ్ఞులు (అపర ప్రకృతితో ఏర్పడు పాంచభౌతిక సృష్టి రహస్యమును సంపూర్ణముగ ఎరిగినవారు;)తన తపో మహత్త్వముచే అమిత తేజఃసామర్థ్యములు కలిగియున్న బ్రహ్మకడకు వచ్చిరి. మహర్షి పూజితులగు ఆ ఇరువురును బ్రహ్మతో ఇట్లు పలికిరి: ''బ్రహ్మ తాను అత్మరూపుడు; ధృఢమగు అమరిక గలవాడు; విశాల రూపుడు; జగత్తును ఆశ్రయించియున్నవాడు; సర్వభూతములకును నాయకుడు; త్రైలోక్య పూజితుడు. ''

వారు ఇరువురును పలికిన ఈ మాటను బ్రహ్మ వినెను. ఆ వచనములందు ప్రతిపాదింపబడిన యోగమును (సృష్ట ప్రక్రియను) తాను గ్రహించెను. అ యోగాచార్య సాంఖ్యాచార్యులు పలికిన శ్రుతి వచనమున తెలుప

______________________________________________________________________________

*గడచిన అధ్యాయమున చెప్పినదానిని బట్టి బ్రహ్మ విష్ణు నాజ్ఞానుసారము విశ్వసృష్టికి సంకల్పించెనేకాని అతని సంకల్పము మధుకైటభుల రాకతో విహతమయ్యెను. దాని విషయమున అతడెట్టి ప్రయత్నమును చేయుటకే అవకాశము దొరుకలేదు. మధుకైటభవధానంతరము అతనికా విషయమున యత్నించు నవకాశము కలిగెను. కాని సృష్టి సాధారణ కార్యము కాదు. అతడందులకై తనకు తెలిసిన వైదిక తత్త్వ జ్ఞానమును ఆశ్రయించి తపమాచరించసాగెను. ఉత్కృష్ట తేజస్సులను తన తపః సాఫల్యమున కనుకూలింపజేసికొనుటకై దేవతానుగ్రహాసంపాదనార్థ మతడూర్ద్వ బాహుడయ్యెను. వేదములందు లేని ధర్మమే లేదు. అతడు నారాయణానుగ్రహమున అప్పటికే తనకు లభించిన సకల వేదములందలి సకల ధర్మములను తన జ్ఞానమయ తపోరూపమున విలక్షణ ప్రక్రియలతో అనుష్ఠించెను. అని ఈ వచనముల భావము.

బడిన విధమున ఈ మూడు లోకములను సృజించెను. అవి పృథివీ- అంతరిక్షం - ద్యౌః- అనునవి. ఈ లోకత్రయముతో పాటు ఋషి (మాంస నేత్రములకు అందని దేశ కాలాతీత విషయములను ఎరుగగల) చతుర్ముఖుడు 'భూః' 'స్వాయంభువుడు' అను మానస పుత్త్రుని కూడ ఉత్పాదించెను. (బ్రహ్మ తాను స్వయంభూ కావున అతని పుత్త్రుడు స్వాయంభవుడు.) ఈ మానస పుత్త్రుడు తాను పుట్టినంతనే తన పితయగు బ్రహ్మ ఎదుట మౌనియై నిలిచెను. మరియ అతడు ''భగవానుడగు ఋషీ! నీకు నేను ఏమి సాహయ్యము చేయవలయునో తెలుపుము.'' అని బృహ ధ్రూపుడును (బ్రహ్మ ) వేదమూర్తియును (బ్రహ్మ) అజుడును (పుట్టుక లేనివాడు) అవ్యయుడునునగు విధాతతో పలికెను. ''నాయనా! స్వాయంభవా! ఈ పర బ్రహ్మ రూపుడగు కపిలుడును పరమ యోగాచార్యుడగు నారాయణుడును నీకేమి చెప్పెదరో దాని నాచరించుము. '' అని బ్రహ్మ స్వాయంభవునితో ననెను. అంతట బ్రహ్మ వచనము విని మరల అతడు వారిరువురితో ''నేను మీమాట విని దానినాచరించదలయున్నాను. ఏమి చేయుమందురు?'' అని కృతాంజలియై పలికెను.

శ్రీభగవా9:యత్సత్య మక్షరం బ్రహ్మ న్నష్టాదశవిధం హి తత్‌ l

యత్సత్యం యదృతం తత్తు పరం పద మనుస్మర . 12

ఏతద్వచో నిశామ్యైవ య¸° స దిశ ముత్తరామ్‌ l గత్వాచ తత్ర బ్రహ్మత్వ మగమ ద్జానతేజసా. 13

తతో బ్రహ్మా భువం నామ ద్వితీయ మసృతజ్ప్రభుః l సజ్కల్పయిత్వా మనసా తమేవచ మహామనాః . 14

తతస్సోవ్యబ్రవీద్వాక్యం కిం కరోమి పితామహl పితామహ సమాజ్ఞాతో బ్రహ్మాణం సముపస్థితిః. 15

బ్రహ్మాభ్యాసంతు కృతవా న్బువశ్చ పృథివీం గతః l ప్రాప్తశ్చ పరమం స్థానం సతయోః పార్శ్వ మాగతః.

తస్మిన్నపి గతే పుత్త్రే తృతీయ మసృజత్ప్రభుః l సాజ్ఞ్య ప్రవృత్తికుశలం భూర్బువం వామతో విభుమ్‌. 17

గోపతిత్వం సమాసాద్య తయోరేవాగ మద్గతిమ్‌ l ఏవం పుత్త్రా స్త్రయో హ్యేతే ఉక్తా శ్శమ్భె ర్మహ్మాత్మనః.

తాన్గృహీత్వా సుతాం స్తస్య ప్రయ¸° స్వార్జితాం గతిమ్‌ l నారాయణశ్చ భగవా న్కపిలశ్చ యతీశ్వరః .

యం కాలం తౌ గతౌ ముక్తౌ బ్ర్కహ్మా తకం కాలమేవ చ l

తతో ఘోరతమం భూయ స్సంశ్రతః పరమం వ్రతమ్‌. 20

న రేమే7థ తతో బ్రహ్మా ప్రభురేక స్తప శ్చర 9l శరీరార్ధం తతో భార్యాం సముత్పాదితవా ఞ్చుభామ్‌. 21

తపసా తేజసా చైవ వర్చసా నిరుమేన చ l సదృశీ మాత్మనో దేవీం సమర్థాం లోకసర్జనే. 22

తయా సమాహిత స్తత్ర రేమే బ్రహ్మా తప శ్చర 9 l

సృజన్ప్రజానాం పతయ స్సాగరాం శ్చాసృజ త్ప్రభుః. 23

శ్రీ భగవానుడగు నారాయణుడిట్లనెమ: నాయనా! బ్రహ్మన్‌ : (వేద స్వరూపుడవగు స్వాయంభవా!) సత్యము ('సత్‌' అను శబ్దమునకు అర్దమయి ఆ శబ్దమునందు నిలిచియుడు బ్రహ్మ తత్త్వము ) అక్షరము (నశించనిది - ప్రతవమునకు అర్థమయి పరా - అపరా - అను రెండు ప్రకృతుల రూపముతో ఉండునది) అష్టాదశ విధము (మనోబుద్ధ్య హంకారములు పంచ తన్మాత్రలు- పంచసూల భూతములు- పంచేంద్రియములు అను అపరా ప్రకృతిగల పదునెనిమిది భేదములుగా విస్తరిల్లినది) సత్యము (వాక్‌ - కాయ - కర్మములతో అనుష్ఠాన రూపమున అనుష్ఠించి నిష్పన్నము చేయబడునది- అనుభవములోనికి తెచ్చుకొనబడునది) ఋతము (బుద్ది వ్యాపారముతో ఈ తత్త్వము ఇట్టిదని నిశ్చితరూపమున తెలిసికొనబడునది ఇట్లు మనో - వాక్‌ - కాయ- వ్యాపారములతో తెలిసికొనుట- నోటితో చెప్పుట - శారీరకానుష్ఠానముతో స్వాధీనమొనర్చుకొనుట-అనుత్రికరణ సాధ్య తత్త్వము పరమాత్మ తత్త్వమును అని సారము) అగు పరమపదము (సర్వోన్నత స్థానమందున్నది ప్రణవ శబ్దమునకు వాచ్యమగునదియగు వైష్ణవ తత్త్వము ) ఏది కలదో-దానిని స్మరించుము (అను స్మరణము- నిరంతరమైన స్మరణము-అనగా ఉపాసనము) అని నారాయణుడనెను.

ఈ మాటను విని ఆ స్వాయంభవుడు ఉత్తరదిశకు పోయెను. అతడచ్చటకు పోయి జ్ఞాన తేజముతో బ్రహ్మత్వమందెను.

తరువాత మహా మనస్కుడగు చతుర్ముఖ బ్రహ్మ 'భువుడు' అను రెండవ మానస పుత్త్రుని జనింపజేసెను. అతడును తండ్రియగు పితామహుని (బ్రహ్మదేవుని) తో నేనేమి చేయవలయునవి పలికి అతని సమాజ్ఞతో బ్రహ్మదేవునుపాసించి అతని ఉపదేశానుసారముగా యోగచార్య సాంఖ్యాచార్యుల కడకు పోయెను. వారి యాదేశముచే పృథివీ స్థానమునుందుండి బ్రహ్మాభ్యాసమును (పరబ్రహ్మోపాసనమును ) అనుష్ఠించి ఉన్నతినంది తానును పరమమగు వైష్ణవ స్థానమును అందెను.

ఇట్లా రెండవ పుత్త్రుడును పోగా విభుడు (సర్వవ్యాపి ) ప్రభు (సమర్థు)డగు చతుర్ముఖుడు భుర్బువుడను మూడవ మానసపుత్త్రుని జనింపజేసేను. అతడు సాంఖ్యతత్త్వము నెరిగి ఆ విజ్ఞానమును వృద్దిపరచి ప్రవర్తింప జేయుటలో నేర్పరి; అతడును 'గోపతి' 'ద్యులోకాధిపతి' యయి వారు పొందిన పద్ధతిని పొందెను.

ఇట్లు మహాత్ముడు చతుర్ముఖుడు అగు బ్రహ్మకు జనించిన మొదటి సంతానమగు ముగ్గురు పుత్త్రల విషయమును తెలుపుటయైనది.

ఇట్లు నారాయణ భగవానుడును యతీశ్వరుడగు కపిలుడును చతుర్ముఖుని పుత్త్రత్రయమును తమ మార్గము నకు త్రిప్పుకొని ముక్తినందించి తామును తమ ఉపాసనామార్గమున సాధించిన ఉత్తమగతిని పొందిరి.

[గమనికః మొదటి అక్షరతత్త్వము ప్రణవము; దానికి అర్థమగు తత్త్వము పరమాత్ముడగు నారాయణుడు; ప్రణవాక్షరోపాసనచే పరమగతినందించు మార్గములు సాంఖ్య- యోగములు; ఆరెండింటికిని ఆది పరమాచార్యులుగా ఇచట నారాయణు (యోగాచార్యు)డును కపపిలుడును చెప్పబడినారు. ప్రణవమునకు విస్తరణము భూః-భువః-సువః అను మూడు మహా వ్యాహృతులు; వాని అర్థములుగా నున్నవి పృథివి - అంతరిక్షము- ద్యులోకము; వీని సావయవ రూపములే ఈ చెప్పిన బ్రహ్మ పుత్త్రత్రయమును; అనగా వీని యర్థమును సాంఖ్యయోగ మార్గానుసార ముపాసించిన ఉపానకులు వీని మూల మగు ప్రణవార్థోపాసనముచే ముక్తినంద వచ్చును. అని భావము ఇక మీదట ఈ మహా వ్యాహృతిత్రయ విస్తరణమగు గాయత్ర్యుత్పత్తియు గాయతరినుండి వేదాది సృష్టియు వీని యర్థమగు జగత్సృష్టియు ప్రతిపాదింపబడును.]

ఇట్లు యోగాచార్యుడగు నారాయణుడును సాంఖ్యాచార్యుడగు కపిలకుడును (ఈ ఇరువురును నారాయణ మూర్తులే ముక్తులయి వెడలిన తరువాత చతుర్ముఖుడు (పద్మోద్బవ బ్రహ్మ ) మరల ఘోరతమమగు పరమతపో వ్రతమవలంభించి అనుష్టించెను. ప్రభుడగు అతడు అంతటి తపమాచరించుచుండియు ఒంటరి తనమున అతనికానందము కలుగలేదు. (ఇది ద్వైతభావనా పూర్వకమగు జగత్సృష్టికి ఆరంభ దశను తెలుపుచున్నది. ) అందుచే అతడు తన శారీరకమగు పరితృప్తికైశుభ రూపురాలగు స్త్రీని తనకు భార్యగా నుండదగిన యామెను సృజించుకొనెను. ఆమె తపమున తేజమున పర్చస్సున నియమ పాలనమున తనకు సమానయనియు తానదివరకు సంకల్పించిన లోకసృష్టియందు సమర్థురాలనియ బ్రహ్మఎరిగెను. ఈ మారతడు ఆమెతోకూడి అచ్చట ఆ పద్మమునందే తపమాచరింపసాగెను. ఇపుడతనికి వెనుకటివలె ఒంటరి తనపుభావన లేక తృప్తి కలిగెను. *అమె తోడ్పాటుతోనే అతడు ప్రభుడై మున్ముందు ప్రజాపతులను సాగరాదికమును నృజింపగలిగెను.

______________________________________________________________________________

*(ఈ స్త్రీయే గాయత్రీ (సరస్వతీ) మూలతత్త్వము; బ్రహ్మ తాను కనిన స్త్రీని తన భార్యగా చేసికొనుట అనగా అర్థము ఏమో లోగడనే ఈ పూరాణా రంభాధ్యాయములందు చెప్పబడినది. భారతీయ వాజ్మయము ప్రతీ కోపాననా రూపమును ప్రతిపాదించునది. ఇచట విషయములు తాత్త్వక విచారణకు తీసికొని ఉపాసింపక యథాతథముగా గ్రహించుటతో ఆస్తికులు ఈ వాజ్మయపు పరమ ప్రయోజనము పొందక పోవుచున్నారు. నాస్తికులు ఈ వాజ్మయమునందు దోషారోపముచేసి ఆ మార్గమున తమ ప్రచారము సాగించుచు హేతు వాదమును పేర ముందునకు సాగుచున్నారు. వారును వారి మార్గముననురించు వారును సాధించునదేమో ఆ పరమ సత్య స్వరూపునకే తెలియును.)

బ్రహ్మకృతవేదాదిసృష్టిః.

తతో జగాద త్రిపదాం గాయత్రీం దేవపూజతామ్‌ l అపరాంశ్చైవ చతురో వేదా న్గాయ తరిసమ్భవా9. 24

అత్మన స్సదృశా న్పుత్త్రా నసృజద్వై పితామహః l విశ్వే ప్రజానాం పతయో యేభ్యో లోకా వినిస్సృతాః.

విశ్వేశం ప్రథమం తావ న్మహాతాపస మాత్మజమ్‌ l

సర్వమన్త్రహితం పుత్యం నామ్నా ధర్మం స సృష్టవా9. 26

దక్షం మరీచి మత్రించ పులస్త్యం పులహం క్రతుమ్‌ l వసిష్ఠంప గౌతమం చైవ భృగు మజ్గిరసం మునిమ్‌.

అథైవాద్బుత మిత్యేతే జ్ఞేయాః పైతామహర్షయః l త్రయోదశగుణం ధర్మ మారభన్త మహర్షయః. 28

అదితిర్దితిర్దనుః కాలా అనాయు స్సింహికా ముని ః l తామ్రా క్రోధాచ సురసా వినతా కద్రురేవచ. 29

దక్షస్యాపత్యమేతావై కన్యా ద్వాదశపార్థివ l మరీచే ః కశ్యపః పుత్త్ర స్తపసా నిర్మతః కిల. 30

తసై#్మ కన్యా ద్వాదశాన్యా దక్షస్తా ః ప్రదదౌ తదా l నక్షత్రాణి చ సోమాయ తదా వై దత్తవా నృషిః. 31

రోహిణ్యాదీని సర్వాణి పుణ్యాని రవినన్దనl లక్ష్మీ ర్మరుత్వతీ సంధ్యా (సాధ్యా) విశ్వేశాచ మాతా శుభా. 32

దేవీ సరస్వతీచైవ బ్రహ్మణా నిర్మితా ః పురా l ఏతా ః పఞ్చవరిష్ఠాశ్చపార్థివ. 33

దత్తా భద్రాయ ధర్మాయ బ్రహ్మణా దృష్టకర్మతా l యా రూపార్థవతీ పత్నీ బ్రహ్మణః కామరూపిణీ. 34

సురభిస్సా హితా భూత్వా బ్రహ్మాణం సముపస్థితా l తతస్తా మగమద్బ్రహ్మా మైథునం లోకపూజితః. 35

లోకసర్జనహేతుజ్జో గవామర్థాయ సత్తమః l జజ్ఞిరేచ సుతాస్తస్యాం విపులా ధూమసన్నిభాః. 36

రక్తసన్ద్యా భ్రసజ్కాశాః ప్రాదహం స్తిగ్మతేజసః l తే రుదన్తోత ద్రనన్తశ్చ గతవన్తః పితామహమ్‌. 37

రోదనాద్ద్రవణాచ్చైవ రుద్రా ఇతి తత స్స్మృతాః l నిరృతిశ్చైవ శమ్బుర్వై తృతీయ శ్చాపరాజితః. 38

మృగవ్యాధః కపర్దీచ దహనో7థఖరశ్చవై l అహిర్బుధ్న్యశ్య భగవా న్కపాలీ చాపి పిజ్గళః. 39

సేవానీశ్చ మహతేజా రుద్రా స్త్వే కాదశ స్స్మృతాః. l

ఈ గాయత్రీ మూలతత్త్వమునుండి బ్రహ్మ తాను సృష్టించి సాగించిన విధము . అనంతరము పద్మోద్భవుడు దేవ పూజితయగు త్రివదా (మూడు అష్టాక్షర పాదములుగల ) గాయత్రిని ఉచ్చరించెను. (ఈ ఛందోరూపమునందు సర్వవేదములయు మూలతత్త్వ మిమిడియున్నది.) అందుండి సంభూతములగు నాలుగు వేదములను గూడ అనంతర మతడు వలికెను. అంతట అతడు తనవంటివారేయగు సర్వప్రజాపతులను పుత్త్రులనుగా సృజించెను వారినుండియే లోకములన్నియు నిష్పన్నములు అయ్యెను.

* అందునను మొదట అతడు విశ్వమునకు అదిపతియగు ధర్ముడను కుమారుని సృజించెను. ఈతడు మహా తపస్వి; సర్వమంత్రములకును హితకరుడు; పుణ్యకరుడు; పవిత్రుడు.

______________________________________________________________________________

*మత్స్య మహాపురాణమున 170వ అధ్యాయమున-

విశ్వేశం ప్రథమం తావ న్మహాతాపస మాత్మజమ్‌ l

సర్వమంత్రహితం పుణ్యం నామ్నా ధర్మం స సృష్టవాన్‌. 26

దక్షం మరీచి మత్రిం చ పులస్త్యం పులహం క్రతుమ్‌ l

వసిష్ఠం గౌతమం చైవ భృగు మంగిరసం మునిమ్‌. 27

అథై వాద్బుత; విత్యేతే జ్ఞేయాః పైతామహర్షయః.

ఇచ్చట మొదటివాడు ధర్ముడు; తరువాత చెప్పబడినవారు ఇతరత్రకూడ బ్రహ్మమానస పుత్త్రులుగా చెప్పబడినవారే; కడపట చెప్పబడిన 'అద్బుత' శబ్దవాచ్యుడు పండ్రెండవ కుమారుడనుట సమంజసము; అథ- అనుటను బట్టి ఇది పై వానితోపాటు సంజ్ఞవాచకమే కాని విశేషణమయి యుండదు. కాని కన్నడానువాదమున దీనిని విశేషణముగా భావించి అనువదించుట జరిగినది.

ఈ అద్బుత శబ్దమును సంజ్ఞా వాచకముగా గ్రహించినచో మొదటివాడగు ధర్ముడు యజ్ఞరూపుడు కాగా అద్బుతుడు 'అపూర్వము' అను యాగజన్య సంస్కార మనుకొనవచ్చును.

అనంతరము దక్షుడు మరీచి అత్రి పులస్త్యుడు పులహుడు క్రతువు వసిష్ఠుడు క్రతవు గౌతముడు భృగుడు అంగిరుడు అను పదిమంది ప్రజాపతులను సృజించెను. అందరకంటె కడపట' అద్బుతుడు' అను కుమారుని కూడ సృజించెను. వీరు అందరును బ్రహ్మమానస పుత్త్రులగు ఆదిఋషులు; వీరినే పైతామహ (పితామహునినుండి మానసులుగా జనించిన) ఋషులందురు. వీరిలో ధర్ముడు పదుమూడు గుణములు (లక్షణములు) కలవాడు; (లక్షణములు) కలవాడు; అతనిని మహర్షులును ఉపాసింపసాగిరి.

దక్షుడు తన కుమారైలలో అదితి- దితి -దనువు-కాల-అనాయువు- సింహిక -ముని - తామ్ర- క్రోధ-సరస-వినత- కద్రూ-అను పండ్రెండుమందిని మరీచి ప్రజాపతి పుత్త్రుడగు కశ్యపునకు ఇచ్చి పెండ్లి చేసెను. ఈ కశ్యపుడు తపో మూర్తి; ఈ దక్షుడు తన కుమార్తెలలో మరికొందరుగు రోహిణి మొదలగు ఇరువది ఏడు నక్షత్రములను సోమునకు ఇచ్చెను. వీరందరును పవిత్రమూర్తులు.

సృష్టిప్రక్రియను బాగుగ ఆలోచించిన బ్రహ్మచే పూర్వము సృష్టింపబడిన లక్ష్మి- మరుత్వతీ -సంధ్య (సాధ్య) విశ్వేశా - సరస్వతీ అను ఐదుమందిని ఆ బ్రహ్మ శుభరూపుడగు ధర్మునకు ఇచ్చెను. ఈ ఐదుగురును పరిష్ఠలును - దేవతా శ్రేష్ఠలును;*శబ్ద స్వరూపమును అర్థమును కల ధర్ముని పత్ని (సరస్వతి) సురభియను రూపము ధరించి లోకహితము గోరి బ్రహ్మను సేవించరాగా లోకపూజితుడును లోకసృష్టి హేతువు అగు ప్రక్రియను ఎరిగినవాడు నగు బ్రహ్మ గోజాతి సృష్టి సంకల్పముతో ఆమెతో కూడెను. అమెయందు విశాలరూపులు పొగవంటివారు సంధ్యాకాలమందలి మేఘములవలె ప్రకాశించువారు తీక్‌ష్ణతేజము గలవారు లోకములనే కాల్చివేయునట్లున్న వారు కలిగిరి. వారు (రుదంతః-) ఏడ్చుచు (ద్రవంతః-) పరుగెత్తుచు బ్రహ్మకడకు పోయిరి. ఈ హేతువుచే వారు (ఈ రెండు పదములందలి ప్రథమాక్షరముల కూర్చచే ) 'రుద్ర' అను పదములో వ్యవహరింపబడిరి. వీరు నిరృతి- శంభుడు - అపరాజితుడు- మృగవ్యాధుడు- కవర్ది-ఖరుడు అహిర్బుధ్న్యుడు- కపాలి- పింగళుడు- సేనాని అని పదునొకండు మంది.

తస్యామేవ సురభ్యాంచ గావో యజ్ఞేశ్వరాశ్చవై. 40

ప్రకృష్టాశ్చ తథా మాయా స్సురభ్యాం వశవో7క్షరాః l

అజాశ్చైవ తు హంసాశ్చ తథైవామృత ముత్తమమ్‌. 41

ఓషధ్యః ప్రవరాయాశ్చ సురభ్యా స్తా స్సముత్థితాః l

ధర్మా ల్లక్ష్మీ స్తథా కామం సాధ్యా సాధ్యా న్వ్యజాయత. 42

భవంచ ప్రభవం చైవ హీశంచాసురహంప తథా l అరుణ్యం చారుణించైవ విశ్వావసు బలధ్రువౌ. 43

హవిష్యంచ వితానంచ విధానశమితావపిl వత్సరం చైవ భూతించ సర్వాసు రనిషూదనమ్‌. 44

సువర్వాణో బృహత్కాన్తి స్సాధ్యా లోకవమస్కృతా l తమేవానుగతా దేవీ జనయామాస వై సురా9.

వరంవై ప్రథమం దేవం ద్వితీయం ధ్రువ మవ్యయమ్‌ l

విశ్వావసుం తృతీయంచ చతుర్థం సోమ మీశ్వరమ్‌ . 46

______________________________________________________________________________

*మత్స్య- 170 అ; శ్లో. 34

''యారూపార్థవతీ పత్నీ బ్రహ్మణః కామరూపిణీ. ''

రూపం - శబ్ద స్వరూపం - అర్థశ్చ అస్యా ః - స్తః ఇతి రూపార్థవతీ - సరస్వతీ - ఇత్యర్థః.

రూపము - శబ్ద స్వరూపమును - అర్థమును కలది- శబ్దము; అటువంటి బ్రహ్మదేవుని పత్ని అనగా వాగ్రూపయగు సరస్వతీ.

ఈ అధ్యాయములొ అన్ని ప్రతులయందును ధర్ముని పత్నిరుందు కలిగిన సంతానము విషయమున ఎన్నో పాఠ భేదములున్నవి.

తతోనురూపమాయంచ యమ న్తస్మా దనన్తరమ్‌ l సప్తమంచ తథా వాయ మష్టమం నిరృతిం వసుమ్‌. 47

ధర్మస్యాపత్య మేతద్వై సురభ్యాం సమజాయతl విశ్వే దేవాశ్చ విశ్వాయాం ధర్మాజ్జాతా ఇతి శ్రుతిః. 48

దక్షశ్చైవ మహాబాహు పుష్కరస్వన ఏవచ l చాక్షుషశ్చ మనుశ్చైవ తథా మధుమహోరగౌ. 49

విశ్వాంతశ్చ వసు ర్బాలో విష్కమ్భశ్చ మహాయశాః l రురు శ్చైవాతిసత్త్వౌజా భాస్కర ప్రతిమద్యుతిః. 50

విశ్వాన్దేవా న్దేవమాతా విశ్వేశా7జనయత్సుతా9 l మరుత్వతీతు మరుతో దేవా నజనయత్సుతా9. 51

అగ్నిం చక్షూ రవింజ్యోతి స్సావిత్రం మిత్రమేవచ l అమరం శరపృష్టించ సుకర్షంచ మహాభుజమ్‌. 52

విరాజంచైవ వాచంచ విశ్వం వసుమతిం తథా l అశ్వమన్తంచిత్రరశ్మిం తథా నిషధనం నృప. 53

హూయన్తం బాడబంచైవ చారిత్రం మదపన్నగమ్‌ l బ్రహన్తంచ బృహద్రూపం తథావై పూతనానుగమ్‌.

మరుత్వతీ పురా జజ్ఞే ఏతన్వై మరుతాం గణా 9l

ఆ సురభియందే బ్రహ్మవలన యజ్ఞముపై ఆదిపత్యముగల గోవులు ఉత్తమములగు మాయులు (?) శాశ్వత యోగ్యతగల పశువులు మేకలు హంసలు ఉత్తమమగు అమృతము ఉత్తమములగు ఓషధులు జనించెను.

లక్ష్మి ధర్మనివలన కాముని కనెను; సాధ్య అను నామె ధర్ముని వలననే సాధ్యులను దేవజాతలనస కనెను. సాధ్యులు నామములు - భవుడు ప్రభవుడు ఈశుడు అసురహుడు అరుణుడు ఆరుణి విశ్వావసువు బాలధ్రువుడు హవిష్యుడు వితానుడు విధానుడు శమితుడు వత్సరుడు సర్వాసుర నాశకుడగు భూతి సుపర్వన్‌ అనువారు మహాకాంతి శాలినియగు సాధ్యకు కుమారులైరి. మనస్‌ - మంతా - ప్రాణుడు నరుడు- అపానుడు- వీర్యవాన్‌ - వినిర్భయుడు- నయుడు- దంశుడు- నారాయణుడు- వృషుడు - ప్రముంచుడు- అని అగ్ని పురాణమునందు కలదు.

(సరస్వతీరూప విశేషమేయగు ) సురభి ధర్మునే అనుగమించి ఆతని వలన వసువులనెడు దేవతాగణములను కనెను వారు: వరుడు అవ్యయుడగు ధ్రువుడు ఈశ్వరుడగు సోముడు ఆయుడు యముడు వాయువు నిరృతి అనువారు ఎనిమిది మంది.

ఈ వసువులు సురభి (సరస్వతి) యందు ధర్ముని వలన కలిగిన సంతతి.

విశ్వేశా (విశ్వా) అను ధర్ముని పత్నియందు ధర్మని వలన విశ్వేదేవులను దేవగణములు కలిగిరి. వారు మొత్తము పదిమంది; వారు: మహాబాపూడగు దక్షుడు పుష్కరస్వనుడు చాక్షుషుడు మనువు (చాక్షుష మనువు) మధువు మహోరగుడు విశ్వాంతుడు వసువు బాలుడు (బాలుడగ వసువు) మహాయశశ్శాలియగు విష్కంభుడు అత్యధికమగు సత్త్వమును ఓజస్సును కలవాడు భాస్కరుడువలె కాంతిమంతుడునగు రురుడు అనువారు; దేవమాతలలో నొకతెయగు విశ్వేశయను నామె ధర్ముని వలన వీరిని జనింపజేసెను.

మరుత్వతి యను నామెకు ధర్ముని వలన మరుతులను గణదేవతలు కలిగిరి. వారు ; అగ్ని- చక్షుడు- రవి -జ్యోతి- సావిత్రుడు- మిత్రుడు- అమరుడు- శరవృష్టి- మహాభుజుడగు సుకర్షుడు- విరాట్‌ - వాచ్‌- విశ్వుడు- వసుమతి- అశ్వవంతుడు- చిత్ర రశ్మి- నిషధనుడు- హూయంతుడు- బాడబుడు- చారిత్రడు- మదపన్నగుడు- బ్రహద్రూపుడగు బృహత్‌ -పూతనానుగుడు అను వారు.

అదితిః కశ్యపా జ్జజ్ఞే ఆదిత్యా న్ద్వాదశైవ హి. 55

ఇన్ద్రో విష్ణు ర్బగ స్త్వష్టా వరుణో హ్యర్యమా రవి ః l పూషా మిత్రశ్చ ధనదో ధాతా పర్జన్య ఏవ చ . 456

ఏతేవై ద్వాదశాదితగా వరిష్ఠా స్త్రిదినౌకసామ్‌ l ఆదిత్యస్యాశ్వినౌ నాసత్యౌ జజ్ఞాతే ద్వౌ సుతౌ వరౌ. 57

తపశ్శ్రేష్ఠౌ గుణిశ్రేష్ఠౌ త్రిదివస్యాపి సమ్మతౌ l దనుస్తు దానవా న్జజ్ఞే దితి ర్దైత్యా స్వ్యజాయత. 58

కాలాతు వై కాలకేయా నసురా న్రాక్షసాంస్తువై l అనాయుషాయా స్తనయా వ్యాధయ స్సుమహాబలాః. 59

సింహికా గ్రహమాతా వై గన్దర్వ జననీ మునిః l

తామ్రా త్వప్సరసాం మాతా పుణ్యానాం భారతోద్బవా. 60

క్రోధాయా స్సర్వభూతాని పిశాచాశ్చైవ పార్థివ l జజ్ఞే యక్షగణాం శ్చైవ రాక్షసాంశ్చ విశామ్పతే. 61

చతుష్పదాని సత్త్వాని తథా గావస్తు సౌరసాః l సుపర్ణా న్పక్షితశైవ వినతాయాం వ్యజాయత. 62

మహీధరా న్త్సర్వనాగా న్దేవీ కద్రూర్వ్యజాయతః l ఏవం వృద్ధిం సమగమన్‌ విశ్వే లోకాః పరస్పరమ్‌. 63

తదా వై పౌష్కరో రాజ న్ప్రాదుర్భావో మహాత్మనః l

ప్రాదుర్బావః పౌష్కరస్తే మహా9 ద్వైపాయనేరితః 64

పురాణః పురుషశ్చైవ మయా విష్ణు ర్హరిః ప్రభుః l కథితస్తే 7నుపూర్వేణ సంస్తుతః పరమర్షిభిః. 65

యశ్చైతదగ్య్రం శృణుయా త్పురాణం సదా నర( పర్వసు చోత్తమాంశ్చ l

అవాప్య లోకా న్త్సహి వీతరాగః పరత్రవై స్వర్గఫలాని భుజ్త్కే. 66

చక్షుషా మనసా వాచా కర్మణాచ చతుర్విధమl ప్రసాదయతి యః కృష్ణం తసై#్మ కృష్ణః ప్రసీదతి. 67

రాజాచ లభ##తే రాజ్య మధన శ్చోత్తమం ధనమ్‌ l క్షీణాయ ర్లభ##తే చాయు స్సుతకామ స్సుతాం స్తథా. 68

యజ్ఞాన్‌ వేదాం స్తథాకామం స్తపాంసి వివిధానిచ l ప్రాప్నోతి వివిధం పుణ్యం విష్ణు భక్తో ధనాని చ . 69

యద్యత్కామయతే కిఞ్చి త్తత్త ల్లోకేశ్వరా ద్భవేత్‌ l ఏష పౌష్కరకో నామ ప్రాధుర్బానో మహాత్మనః.

కీర్తితస్తే మహాభాగ వ్యాస శ్రుతినిదర్శనాత్‌ l సర్వం విహాయ య ఇమం పఠే త్పౌష్కృరకం హరేః. 71

ప్రాదుర్బావం మను శ్రేష్ఠ న కదా7ప్యశుభం భ##వేత్‌. 71 ||

ఇతి శ్రీమత్స్యమహాపురాణ పద్యోద్బవ ప్రాదుర్బావకథనే బ్రహ్మాదివకృతవేదాది

సృష్టిర్నామ స ప్తత్యుత్తర శతతమో7ధ్యాయః.

ఇక కశ్యపుని భార్యలలో అదితియందు ఇంద్రుడు విష్ణువుభగుడు త్వష్ట వరుణుడు అర్యమన్‌ రవి పూషన్‌ మిత్రుడు ధనదుడు ధాత వర్జన్యుడు అను ద్వాదశాదిత్యులు కలిగిరి. వీరిలో (ద్వాదశాదిత్యాదిష్ఠాతయగు) ఆదిత్యునకు ఆశ్వినులు నాసత్యులు అని ప్రసిద్ధగల ఇద్దరు శ్రేష్ఠులగు సుతులు కలిగిరి. వారు తపములచె సద్గుణములచే గొప్పవారును స్వర్గమునకు పూజ్యులును; దనువునందు దానవులు దితియందు దైత్యులు కాలయందు కాలకేయులను అసురులు రాక్షసులు అనాయుషయందు మహాబలురగు వ్యాధులు సింహికయందు (ప్రాణులను పట్టి బాధించు) గ్రహములు ముని అనునామె యందు గంధర్ములు తామ్రయందప్సరసలు క్రోధయందు భూత పిశాచములు యక్షరాక్షసులు సురనయందు చతుష్పాత్ర్పాణులు గోజాతులు వినతయందు గరుడాది పక్షులు కద్రువయందు పర్వతములు నాగులు కలిగిరి. ఇట్లు సర్వలోకములు కలిగి పరస్పర మేళనముచే వృద్ధినందెను.

మనురాజా! అపుడు(ఆది కాలమున) మహాత్ముడగు బ్రహ్మకు కలిగిన పౌష్కర (పుష్కరము=జలము: పద్మము; దానినుండి కలిగిన) ప్రాదుర్బావ స్వరూపము ఇటువంటిది; మత్స్యుడు మనువునకు చెప్పినదిగా ద్వైపాయనునిచే చెప్పబడిన దానిని నేను (సూతుడు) మీకు (ఋషులకు) చెప్పితిని. పరమర్షులు స్తుతులనందుకొను ప్రభుని-పురాణ పురుషుని- గూర్చి ఆనుపూర్వితొ (క్రమముగా) మీకు తెలుపబడినది; అగ్ర్యము (మొదటిది) ఉత్తమమునగు పురాణమును వైరాగ్య దృష్టితో ఎల్లప్పుడును విశేషించి పర్వదినములందున విను నరుడు ఇహమున ఉత్తమములగు లోకముసుఖములను పొంది వరలోకమున స్వర్గసుఖమును పొందును . చక్షువుతో (దర్శించి) మనస్సుతో (ఆలోచించి) వాక్కుతో (స్తుతించి) కాయముతో (అర్చించి ) నాలుగు విధములుగ కృష్ణుని ఆరాధించి అనుగ్రహింపజేసికొను వానియందు కృష్ణుడనుగ్రహము చూపును. రాజు రాజ్యవృద్దిని ధనహీనుడు ధనమును అల్పాయుష్కుడధికాయువును సుతకాముడు సుతులను పొందును. విష్ణుభక్తుడు యజ్ఞములను వేదములను కామములను వివిధ తపస్సులను వీటిని యథావిధిగా అనుష్టించుటచే కలుగు వివిధ పుణ్యమును పొందును. పలుమాటలేల? ఏది ఏది కొంచెమో గొప్పయో కోరునో అది ఎల్ల ఆ లోకేశ్వరునివలన లభించును. మహాభాగా! మనూ! వ్యాసప్రోక్త శ్రుతి (పురాణ సంహితా ) నిదర్శించిన (నిరూపించిన) దాని ననసరించి నీకు మహాత్ముడగు చతుర్ముఖుని పౌష్కర పాధుర్భామును కీర్తించితిని. ఎవడైన ఇతర (వాజ్మయ) మంతయు విడిచియు హరివలన కలిగిన ఈ పౌష్కర ప్రాదుర్బావ మాత్రమును అధ్యయనము చేసినను వాని కశుభుములు సంభవింపకుండును; శుభములు కలుగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున పద్మోద్భవ ప్రాదుర్భవ కథనమున బ్రహ్మకృత

వేదాది సృష్టియను నూట డెబ్బదియవ అధ్యాయము.

పాద్మ కల్ప వృత్తాంతమున బ్రహ్మకృత సృష్టి ప్రతిపాదనము ముగిసినది.

Sri Matsya mahapuramu-2    Chapters