Sri Matsya mahapuramu-2    Chapters   

సప్తషష్ట్యుత్తరశతతమో7ధ్యాయః.

నారాయణనాభిపద్మావిర్బావః.

శ్రీ మత్స్యః: ఆపోవై సవిభు ర్బూత్వా చారయామాస వై తపః l

ఛాదయిత్వ77త్మనో దేహం యాదసాం కులసమ్భవమ్‌. 1

తతో మహాత్మా7తిబలో మతిం లోకస్య సర్జనే l మహతాం చైవ భూతానాం విశ్వో విశ్వ మచిన్తయత్‌. 2

తస్య చిన్తయమానస్య నివాతే సంస్థితే7ర్ణవేl నిరాకాశే తోయమయే సూక్ష్మే జగతి గహ్వరే. 3

ఈ షత్సజోభయామాస సో7 ర్ణవం సలిలాశ్రయః l అనన్తరోర్మిభి స్సూక్ష్మ మథచ్ఛిద్ర మభూత్పురా. 4

శబ్దం ప్రతి తదోద్బూతో మారుత శ్ఛిద్రసమ్భవః l స లభ్ద్వాన్తరమక్షోభ్యో7ప్యవర్ధత సమీరణః. 5

వివర్దతా బలవతా వేగాద్విక్షోభితో7ర్ణవః l తస్యార్ణవస్య క్షుబ్దస్య తస్మిన్నమ్భసి మన్థితే. 6

కృష్ణవర్త్మా సమభవ త్స్రభు ర్వైశ్వానరో మహా9 l తత స్సంశోషయామాస పావక స్సలిలం బహు. 7

క్షయా జ్జలనిధేశ్ఛద్ర మభవద్విస్తృతం నభః l ఆత్మతేజోద్బవాః పుణ్యా ఆపో7మృతర సోపమాః. 8

ఆకాశం ఛిద్రసమ్భూతం వాయు రాకాశసమ్భవః l ఆభ్యాం సజ్ఝర్షణోద్బూతం పావకం వాయుసమ్భవమ్‌. 9

దృష్ట్వా ప్రీతో మహాదేవో మహాభూతవిభావనః l దృష్ట్వా భూతాని భగవా న్లోకసృష్ట్యర్థ ముత్తమమ్‌. 10

బ్రహ్మణో జన్మ సతతం బహురూపో7భ్యభ్యచిన్తయత్‌ l చతుర్యుగాభి స్సజ్ఖ్యా తే సహ స్రయుగపర్యయే. 11

బహుజన్మవిశుద్ధాత్మా బ్రహ్మణోహర్నిరుచ్యతే l య త్పృథివ్యాం ద్విజేన్ద్రాణాం తపసా భావితాత్మనామ్‌. 12

జ్ఞానం దృష్టంతు విశ్వార్థే యోగినాం యాతి ముఖ్యతామ్‌ l

తం యోగవన్తం విజ్ఞాయ సమ్పూర్ణైశ్వర్యము త్తమమ్‌. 13

పదేబ్రహ్మణి విశ్వేశో న్యయోజయత యోగవిత్‌ l తత స్తస్మి న్మహత్తోయే మహీశో హరి రచ్యుతః. 14

జలే క్రీడంశ్చ విధివ ల్లోకేశ స్సచ లోకకృత్‌ l పద్మం నాభ్యుద్భవం చైవ ముత్పాదయితవాం స్తథా. 15

సపస్రవర్ణం విరజం భాస్కరాభం హిరణ్యయమ్‌ l

హుతాశనజ్వలితశిఖోజ్జ్వల ప్రభం సముత్థితం శరదమలార్క తేజసమ్‌. 16

విరాజతే కమలముదారవర్చనం మహాత్మన స్తనురుహచారుదర్శనమ్‌. 16u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ నారాయణనాభిపద్మోద్బవో నామ సప్తషష్ట్యుత్తరశతతమో7ధ్యాయః.

నూట అరువది ఏడవ అధ్యాయము.

నారాయణ నాభి పద్మావిర్భావము.

విభుడు(సర్వవ్యాపి- సర్వశక్తి సంపన్నుడు) అగు నారాయణుడు (యాదస్‌ - జలజంతువులు) జలజంతువుల జాతికి జన్మస్థానము అగు జలరూపమున తానుండి తన వాస్తవరూపమును మరుగుపరచి ' రసోవైనః' అను శ్రుతి వచనామ సారము రసాత్మక (ద్రవాత్మక) జలరూపుడై ఉండి 'యస్య జ్ఞానమయం తపః' అను వచనానుసారము జ్ఞానాత్మకమగు తపమాచరించెను. (జలములు కర్మను తెలుపును. ఈ విధముగ జ్ఞానకర్మములే సృష్టికి హేతువులను ఉపనిషద్వచనము ఇచట నిరూపింపబడినది.) ఇట్లు కొంతకాలము తపమాచరించిన తరువాత మహాత్ముడు అతిబలుడు (తానన్నింటియందు ప్రవేశించియుండును- తనయందు అన్నియు ప్రవేశించియుండును కావున ) విశ్మడునగు నారాయణడు లోకనృష్టి విషయమునను పంచమహాభూత సృష్టి విషయమునను ప్రతియొక యంశమును సంకల్పించెను. (ఇది పరమేశుని ఇచ్చా శక్తి ప్రవృత్తి) (అతని జ్ఞానమయ తపస్సుచే సృష్టి సంబంధి ప్రక్రియ అంతయు అతనికి తెలిసి జ్ఞానశక్తి రూపమున ఉన్నాది కావున) తరువాత అతడు అట్లాలోచించుచుండగనే గాలియేలేక సముద్రము- నిశ్చలమయి యుండగా తరువాత సృజింపబడనున్న జగమంతయు జలమయ(రూప) మయి సూక్ష్మరూపమున (అవ్యక్త-వ్యక్తముకాని రూపమున) ఉండగా ఆకాశము కూడ లేని గహ్వరమున (లోతగు ఉనికియందు-ఈ ఉనికియే భగవంతుని సద్‌ రూపము) సలిలమును (జలుమును) ఆశ్రయించియున్న పరమాత్ముడు ఆ అర్ణవమును కొంచెముగ సంక్షోభింపజేసెను. ఇదియే ప్రథమ స్పందరూపమగు క్రియాశక్తి ప్రవృత్తి; ఈ స్పందమువలన ఏమాత్రమును ఎడము లేకున్న నీటి అలల(లో) నుండి సూక్ష్మమగు రంధ్రము ఏర్పడెను. ఇది అన్నిటికంటె పూర్వము (మొట్టమొదట) ఏర్పడిన ఆకాశమను సూక్ష్మభూతము; శబ్ద గుణమున కాశ్రయమగు ఆ ఆకాశచ్ఛిద్రమునందుండి అంతట శబ్దముతోపాటు వాయువను (సూక్ష్య) భూతముత్పన్న మయ్యెను. అది అవకాశమునంది వృద్దినొందగా అది ఎంత అక్షోభ్యమయినను దానియందును భగవదిచ్ఛచే స్పందము కలిగి దానిచే సముద్రము కూడ క్షోభిల్ల ఆ ఘర్షణముచే అగ్న ఉత్పన్నమయ్యెను. అతడే నల్లని పొగతో తన త్రోవను సూచించుటచే కృష్ణవర్త్మా (నల్లని త్రోవ కలవాడు) సర్వ నరుల జఠరములందుండి ఆహారమును జీర్ణమొనరించుటనే వైశ్వానరుడు (విశ్వ-సర్వ-నర) అనబడనున్న సూక్ష్మ మహాభుతమయ్యెను. అగ్ని అంతట అధిక జలమును సంశోషింపజేసెను. ఆ నీరు శోషిల్లి ఏర్పడిన రంధ్రమున విశాలమగు ఆకాశము ఏర్పడెను. కాని అచట అగ్ని స్వతేజము నుండి అమృతముతో సాటియగు రుచి (రసము) కల జలములేర్పడెను. ఇట్లు ప్రథమ స్పందము వలన జలములందు కలిగిన ఛిద్రమునుండి ఆకాశమును దానినుండి వాయువును దానినుండి అగ్నియు దానినుండి జలములను ఏర్పడెను. సూక్ష్మ మహాభుత నిర్మాతయగు మహాదేవు డీ భూతములను చూచి ప్రీతడయ్యెను. ఈ సూక్ష్మభుతములతో లోక సృష్టి చేయుటకై భగవానుడును బహురూపుబడునగు నారాయణుడు బ్రహ్మ జనించవలయునని (తానే బ్రహ్మరూపము ధరించవలరు%ునని) సంకల్పించెను. (సృష్టికర్తయగు బ్రహ్మ సామాన్యుడుకాడు; అతని మహా వ్యక్తిత్వము ఎట్టిది అనిన) లొగడ చెప్పిన పండ్రెండువేల దివ్య వర్షముల పరిమాణముకల మహాయుగములు వేయి అయినచో బ్రహ్మకు ఒక పగలు అగును. (ఇంత దీర్ఝకాల పరిమాణముతో ఏర్పడు నూరు సంపవత్సరములు జీవించగల బ్రహ్మ అతఃపూర్వము బాహు జన్మములందు తనుదాను విశుద్ధముగా ఒనర్చుకొనిన జీవాత్మ చైతన్యరూపుడు; ఎట్లనిన- భూలోకమునందు తమ తపముచే భావితమయిన (చక్కగ నంస్కరింపబడి) ఆత్మకల ద్విజులలో శ్రేష్ఠులగు యోగులరుదుగా ఎవరుందురో- వారిలో కూడ విశ్వ కల్మాణమునకై ఉపయోగించు జ్ఞానమును దర్శించుట ఆ ఆత్మకు ముఖ్య (శ్రేష్ఠ)త్వమును ఇచ్చును; ఇట్టి జ్ఞానమును దర్శించినవాడయి సంపూర్ణమగు ఈశ్వరత్మును (ఉత్తమ క్రియా సామర్థ్మమును ) కూడ సంపాదించిన యోగిన గుర్తించి విశ్వేశుడగు నారాయణుడు అట్టివానిని లోకసృష్టి చేయు బ్రహ్మ పదము (స్థానము) నందు నియోగించును. (ఇట్టి బ్రహ్మను సృష్టించుటకు అనువుగా ) యోగతత్త్వ వేత్తయు అచ్యుతుడు(తన్నాశ్రయించిన వారిని నాశమునందనీయక రక్షించువాడు) హరి (సృరించిన వారి దోషముల హరించువాడు) లోకేశుడు లోకకర్తయగు నారాయణుడు ఆ మహాతోయమందు యథావిధిగా (యథా పూర్వముగా -ప్రతిసృష్టికి ఆరంభమునందు జరుగునట్లే) జలక్రీడ చేయుచు తన నాభినుండి (నాభి-అనగా నభ##మే - ఆకాశ##మే; ఆకాశమునకును మూలభుతము విష్ణుని ఆశ్రయముగానున్న జలమే అని చెప్పబడినది; అది నారాయణ స్వరూపమే కావున-తననుండియే ) పద్మమును ఉత్పన్నమొనర్చెను. దానికి వేయి దళములుండెను; రజస్సు(రజోగుణము-ధూళి) లేదు; అది రవివలె ప్రకాశించుచుండెను; స్వర్ణమయము; అంతేకాదు; ప్రజ్వలించు అగ్ని శిఖలవలె మిగుల వెలుగొందు కాంతులుగలది; శరత్కాలమందు నిర్మలుడగుఅర్కుని తేజమువంటి తేజము కలది; ఇట్లా కమలము మహాత్ముడగు నారాయణని తనువు (శరీరము- అది నారాయణుని నిర్మల చైతన్యమే . ) నుండి ఉత్పన్నమయి మనోహర రూపము కలిగి ఉదార (చాల గొప్ప) వర్చస్సు కలిగి జనించి ప్రకాశించుచుండెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున నారాయణనాభి పద్మావిర్భావమను

నూట అరువది ఏడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters