Sri Matsya mahapuramu-2    Chapters   

పఞ్చ షష్ట్యు త్తరశతతమో7ధ్యాయః.

ప్రళయాను వర్ణనమ్‌.

మత్స్యః: భూత్వా నారాయణో యోగీ సత్యముర్తిర్విభావసుః l గభస్తిభిః ప్రదీప్తాభి స్సంశోషయతి సాగరా9. 1

తతః పీత్వార్ణవాన్త్సర్వాన్నదీ ః కూపాంశ్చ సర్వశః l పర్వతానాంచ సలిలం సర్వమాదారు రశ్మిబిః. 2

పీత్వాస రశ్మిభిశ్చైవ మహీంగత్వా రసాతలే l రసాతుయమాదాయ పిబతే రసముత్తమమ్‌. 3

మూత్రసృక్ల్కే దమన్యచ్చ యదస్తి ప్రాణిషు ధ్రువమ్‌ l తత్సర్వమరవిన్దాక్ష ఆదత్తే పురుషోత్తమః. 4

వాయుశ్చ బలవాన్బూత్వా విధ్యున్వానో7ఖిలం జగత్‌ l ప్రాణాపానసమానాద్యాన్వయూనాకర్షతే హరిః. 5

తతో దేవగణానాంచ సర్వేషాం చైవ దేహినామ్‌ l పఞ్చేన్ద్రియగుణాస్సర్వే భూతాన్యేవ తు యానిచ . 6

గన్దోఘ్రాణం శరీరంచ పృథివీం సంశ్రితా గుణాః l జిహ్వా రసశ్చ స్నేహశ్చ సంశ్రితా స్సలిలేగుణాః . 7

రూపం చక్షుర్విపాకశచ జ్యోతిషీహాశ్రితా గుణాః l స్పర్శః ప్రాణశ్చ చేష్టాచ పవనే సంశ్రితాగుణాః . 8

శబ్దశ్శ్రోత్రం చ ఖాన్యేవ గగనే సంశ్రితా గుణాః l లోకమాయా భగవతా ముహూర్తేన వినాశితా. 9

మనోబుద్ధిశ్చ సర్వేషాం క్షేత్రజ్ఞశ్చేతి యశ్శ్రుతః l తం పరేణ్యం పరమేష్ఠింహృషీకేశ ముపాశ్రితాః. 10

తతో భగవతస్తస్య రశ్మిభిః పరివారితః l వాయునా క్రమ్యమాణ్యశ్చ ద్రుమశాఖామసుపాశ్రితః . 11

తేషాం సజ్ఝర్షణోద్బూతః పావకశ్శతధా జ్వల9l అదహచ్చ తదా సర్వం వృతస్సంవర్తకో7నలః. 12

నూట అరువది ఐదవ అధ్యాయము.

ప్రళయానువర్ణనము.

మత్స్యడు మనువునకిట్లు చెప్పెను: యోగియు సత్యమూర్తియు అగు నారాయుణుడు సూర్యుడయి మిగుల ప్రజ్వలించు కిరణములతో సముద్రముల నెండింపజేయును. సముద్ర నదీ కూప పర్వతములందలి జలమునంతను తన కిరణములతో గ్రహించి ఇట్లు భూస్థిత జలము త్రాగిన తరువాత పాతాళమునకు పోయి అచట జలమును కూడ పీల్చును. తరువాత అరవిందాక్షుడగు ఆపురుషోత్తముడు ప్రాణులయందలి మూత్ర రక్తాది ద్రవమును కూడ పీల్చును. బలవద్వాయులై అఖిల జగమును చలింపచేయుచు ప్రాణుల ప్రాణాపాన సమానాది వాయువులను కూడ లాగివేయును. తరువాత దేవగణాది సర్వ ప్రాణుల పంచేంద్రియ గుణములను పంచ భూతములను పృథివీ భూత లక్షణము) జలమునకుండు జిహ్వారస స్నేహములు అగ్ని కుండెడు చక్షూరూప విపాకములు వాయువునందలి ప్రాణ స్పర్శవిపాకములను అకాశమునకుండు శ్రోత్ర శబ్దశూన్యతలును (వీటికి మూల తత్త్వమయిన సర్వప్రాణుల మనోబుద్ధి క్షేత్రజ్ఞ (చైతన్య) తత్త్వములును వరేణ్యుడు (ప్రార్థనీయుడు- శ్రేష్ఠుడు) పరమేష్ఠి (సర్వోత్తమ స్థానమందున్న) హృషీకేశుడు(ఇంద్రాయాధిపతి) అగు భగవానుని ఆశ్రయించియుండు లోకమాయయు భగవంతునిచే ముహూర్తములో నశింపజేయబడును. తరువాత ఆ భగవానుని కిరణములతో చుట్టకొనబడినదియు వాయువుచే అక్రమింపబడినదయి వృక్షశాఖల నాశ్రయించియుండునదియు ఆ కొమ్మల దాపిడితో పుట్టినదియునగు ప్రళయాగ్ని వందలవిధములుగా మండుచు సర్వమును చుట్టుకొని దహించివేయును.

సపర్వత ద్రుమాన్గుల్మాన్లతావల్లీ స్తృణానిచ l మిమానినిచ దివ్యాని పురాతి వివిధానిచ. 13

యాని చాశ్రయణీయాని తాని సర్వాణీ సో7దహత్‌ l భస్మీకృత్వా తతస్సర్వన్లోకాన్‌ లోకగురుర్హరిః. 14

భూయో నిర్వాపయామాస యుగాన్తే తేన కర్మణాl సహస్రవృష్టశ్శతధా భూత్వా కృష్ణో మహాఘనః. 15

దివ్యతోయేన హవిషా ప్లావయామాస మేదినీమ్‌ l తతః క్షీరనికాశేన స్వాదునా పరమామ్భసా. 16

శివేన పుణ్యన మహీ నిర్వాణమగమత్పరమ్‌ l తేన రోధేన సఞ్చన్నా పయసాం వర్షతో ధరా. 17

ఏకార్ణవజలీభూతా సర్వసత్త్వ వివర్జితా l మహాసత్త్వాన్యపి బిభుం ప్రవిష్టాన్యమితౌజసమ్‌. 18

నష్టార్క పవనాకాశే రూక్షే జగతి సంవృతే l సంశోషమాత్మనః కృత్వా సముద్రాతిచ దేహినః. 19

దగ్ద్వా సవ్ల్పూవ్య చ తదా స హ్యేకస్తు సనాతః l పౌరాణం రూపమాస్థాయి స్వపిత్యమితవిక్రమః. 20

ఏకార్ణవజలవ్యాపీ యోగీ యోగముపాసతే l అనేకాని సహస్రాతి యుగాన్యేకార్ణవామ్బసి. 21

నచైనం కశ్చిదవ్యక్తం వ్యక్తం వేదితుమర్హతిl కశ్చైవ పురుషో నామ కింయోగ ః కశ్చ యోగవా9.22

అసౌ కియన్తం కాలంచ ఏకార్ణవవిధిం ప్ప్రభుః l కరిష్యతీతి భగవానితి కశచిన్న బుద్ద్యతే. 23

న దృష్టా నైవ గమితా నజ్ఞాతా నైవ పార్శ్వగః l నచ విజ్ఞాయతే కశ్చిత్తమృతే దేవసత్తమమ్‌. 24

నభఃక్షితింపవనముపః ప్రకాశం ప్రజాపతిం భువనధరం సురేశ్వరమ్‌ l

పితామహం శ్రుతినిలయం మహామునిం ప్రశామ్య భుయశ్శయనం హ్యరోచయత్‌ . 25

ఇతి శ్రీమత్స్యమహాపురాణ నారాయణనాభిపద్మోద్భవకథనే దైనందినప్రళయా

సువర్ణనం నామ పఞ్చషష్ట్యుత్తరశతతమో7ధ్యాయః.

ఆ అగ్ని పర్వతములు వృక్షములు గుబురులు పొదలు లతలు వల్లులు తృణములుదివ్య విమానములు (భవన విశేషములు) వివిధ పురములు నాటి నాశ్రయించదగినవి అన్నియు కాల్చును . కొక గురుడగు హరి సంవలోకములను భస్మీకరించి మరల అదే యుగాంతమున అదే ప్రక్రియతో ఆ అగ్నిని చల్లార్చును. నల్లని మహామేఘమై నూరుల విధముల వేలకొలది వానలు కురియించి దివ్యజలమును హవిస్సుతో భూమిని తడుపును. పాలవలెనుండి రుచికల శుభపవిత్రోత్తమ జలముతో భుమి మహాతృప్తిని పొందును. వర్షమువలన ఏర్పడిన అ నీటి వరదతో కప్పబడినదయి భూమి సర్వప్రాణి రహితమయి ఏకార్ణవ జలావృతయగును. ఎంతటి మహాసత్త్వము (ప్రాణు)లును అమిత శక్తిశాలియగు పరమాత్మునందు ప్రవేశించును. జగమంతయు అర్క వాయ్వాకాశాదులు పలేక రూక్షమయి (ఆర్ద్రతలేక) మరుగుపడగా అమిత విక్రముడు సనాతనుడునగు భగవానుడు సముద్రములను ప్రాణులను తనుదానువ కూడ మొదట ఎండింపజేసికొని తరువాత దహించి పిమ్మట నీటితోముంచెత్తి తానొకడేయుండి పురాణ (మొదటి)శుద్ధ రూపమునాశ్రయించి తాను నిద్రించును.

ఇట్లా యోగి ఏకార్ణవ జలమునుందు వ్యాపించి దానియందనేక సహస్ర యుగముల కాలము యోగమందుండును. (సర్వలయమే కయోగము.) ఈ పరమాత్ముని ఎవ్వరును వ్యక్తరూపునిగాగాని అవ్యక్త రూపునిగాగాని నిశ్యయింపజాలరు. ఈ (ఉత్తమ) పురుషుడెవ్వరు? ఇతని యోగము ఏది? ఈయోగి ఎట్టి యోగి? భగవానుడగు ఈ ప్రభువెంత కాలము ఏకార్ణవ స్థితియందుండును? అని ఎవరును ఉన్నట్లు (శాస్త్ర ప్రమాణముచే) తెలియదు. ఆకాశము భుమి వాయువు జలము అగ్ని- ఈ పచభుతములను ప్రజాపతిని భువన రక్షకుడగు సురేశ్వరుని వేదముల కాశ్రయుడు మహామునియగు బ్రహ్మను తనయందు లయింపజేసి మరల ఏకార్ణవ జలమందు తన ఇచ్చతోనే శయనించియండును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున ప్రళయాను వర్ణనమను నూట అరువది ఐదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters