Sri Matsya mahapuramu-2    Chapters   

షష్ట్యు త్తరశతతమో7ధ్యాయః.

హిరణ్యకశిపూపాఖ్యాన ప్రారమ్భః.

ఋషయః: ఇదానీం శ్రోతుమిచ్చామో హిరణ్యకశిపోర్వదమ్‌ l నరసింహసగ మాహాత్మ్యం తథా పాపవినాశనమ్‌. 1

సూతః:పురా కృతయుగే విప్రా హిరణ్యకశిపుః ప్రభుః l దైత్యానా మాదిపురుష శ్చకార సుమహత్తపః. 2

దశవర్షసహిస్రాతి దశవర్షశతానిచ l జలవాసీ సమభవ త్స్నావమౌనధృఢవ్రతః.

హిరణ్య కశిపోర్వర ప్రదానయ దేవైస్సహ బ్రహ్మావిర్బావః.

తతశ్శ మదమాభ్యాం చ బ్రహ్మచర్యేణ చైవహ l బ్రహ్మా ప్రీతో భవత్తసగ తపసా నియమేన చ . 4

తతస్స్వయమ్భూ ర్బగవా న్త్స్వయమాగమ్య తత్ర హి l విమానేనార్క వర్ణరేన హంసయుక్తేన భాస్వతా. 5

అదిత్యైకర్వసుభి స్సాధ్యెర్మ రుద్బిర్దైవతైస్తథా l రుద్రైర్విశ్వసహాయైశ్చ ఖేచరైశచ మహాగ్రహైః6

దిగ్బిశ్చైవ విదిగ్భిశచ నదీభి స్సాగరైస్తథాlనక్షత్రైశచ ముహూర్తైశచ యక్షరాక్షసపన్నగైః. 7

దేవ బ్రహ్మర్షిభిస్పార్ధం సిద్దైస్స ప్తర్షిభిస్తథా l రాజర్షిభిః పుణగ కృద్భి క్గన్ధర్వాప్సరసాజ్గణౖః. 8

చరాచరగురుశ్శ్రీమా న్వృతస్సర్వై ర్దివౌకసైః l *బ్రహ్మా యజ్ఞవిదాం శ్రేష్ఠోదైతగం వచనమబ్రవీత్‌. 9

పితామహః : న దేవాసురగన్దర్వాస న యక్షోరగరాక్షోసాఃl వరం పరయ భద్రం తే యథేష్టం కామమాప్నుహి. 10

హిరణ్యకశిపుః : న దేవాసురగన్దర్వా న యక్షోరగరాక్షసాఃl నమానవాః పిశాచావా హన్యుర్మాం దేవసత్తమ. 11

ఋషయో నానమాం శాపైశ్శపేయుః ప్రపితామహ l యది మే భగవాన్ప్రతో వర ఏష మయా. 12

శ##స్త్రేణ వా న చపాస్త్రేణ గిరిణా పాదపేన చ l న శుష్కేణ న చార్ద్రేణ నదివా న నిశాథవా. 13

భ##వేయమహమేవార్క స్సోమో వాయ ర్హు తాశనః l సలిలం చాన్తరిక్షంచ నక్షత్రాణి దిశో దశ. 14

అహం క్రోదశ్చ కామశ్చ వరుణో వాసవో యమః l ధనదశ్చ ధనాధ్యక్షో యక్షః కిమ్పురుషాధిపః. 15

______________________________________________________________________________

*బ్రహ్మా బ్రహ్మ.

నూట అరువదియవ అధ్యాయము.

హిరణ్య కశిపూపాఖ్యానము-ఆరంభము.

నరసింహ ప్రాదుర్బావము-హిరణ్య కశివు సభా వర్ణనము.

ఋషులు సూతు నిట్లడిగిరి: ఇపుడు మేమ హిరణ్య కశిపు వధమును పాపనాశకమగు నరసింహదేవ మాహాత్మ్యమును విన కుతూహలపడుచున్నాము. అన సూతు డిట్లు చెప్పనారంభించెను; విప్రులారా! పూర్వము కృతయుగమున దైత్యుల మొదటి తరమువాడు (ఆదిపురుషుడు) ను దైత్యప్రభువు నగు హిరణగకశివుడు వదునొకండు వేల ఏండ్లపాటు జల వాసియై స్నాన దృఢమౌన వ్రతములు శమదమ బ్రహ్మచర్యములు అనుష్ఠించుచు సుమహాతప మాచరించెను. ఆతని తపమును నియమములను బ్రహ్మ మెచ్చి ప్రీతుడై ఆ స్వయంభూ భగవానుడు స్వయముగా అచ్చటికి రవితేజోయుత మయి హంసలను పూన్చినదై ప్రకాశించు విమానములపయి ఆధిత్యవసు మరుద్‌ రుద్రవిశ్వదేవ ఖెచర మహాగ్రహదిక్‌ విదిక నదీసారర నక్షత్ర ముహూర్త యక్షరాక్షస పన్నగ దేవర్షి బ్రహ్మర్షి సిద్ధనప్తర్షి (పుణ్యకృత్‌) రాజర్షి గంధర్వాస్సరోగణము లతోవచ్చెను. యజ్ఞతత్త్వ మెరిగినవారిలో శ్రేష్ఠుడు చరాచరలొకపిత(గురుడు) ఆగు శ్రీమద్‌ బ్రహ్మ సర్వదేవతా వరి వృతుడయి ఇట్లు వచ్చి ఆదైత్యునితో సువ్రతా ! (ఉత్తమ నియమ తపముల ననుష్ఠించినవాడా!)భక్తుడవగు నీ ఈ తప ముతో ప్రీతుడనయినాను. నాయనా! వరము కోరుము; ఇష్టముల నీడేర్చుకొనుము; అనగా హిరణ్యకశిపు డిట్లనెను: దేవ శ్రేష్ఠా! దేవాసుర గంధర్వ యక్షపన్నగ రాక్షస మానవ పిశాచు లెవ్వరును నన్ను చంపరాదు; ప్రపితామహా! ఋషులైనను నన్ను శపింపగలుగరాదు; భగవానులగు తమకు నాపై ప్రీతి కలిగినచో నేను మిమ్ము కోరు వర మిదియే. శస్త్రముతో అస్త్రముతో పర్వతముతో వృక్షముతో ఎండినదానితో తడిగనున్న దానితో పగటియందు రాత్రియందు నన్నెవరును చంపగలుగరాదు; నేనే రవిచంద్ర వాయువహ్ని జలాంతరిక్ష నక్షత్రదశదిశా క్రోధ వరుణంద్ర యమకుబేరధనపతి యక్ష కింపురుషాధిపతులుగా కావలయును.

బ్రహ్మా: ఏతే దివ్యా వరాస్తాత మయా దత్తాస్తవాద్బుతాఃl సర్వాన్కామాస్త్స దావత్స ప్రాప్స్యపి త్వం న సంశయః. 16

ఏవముక్త్వా స భగవా ఞ్జగామాకాశ##మేవ హి l వైరాజం బ్రహ్మసదనం బ్రహ్మర్షిగణ సేవితమ్‌ . 17

తతో దేవాశ్చ నాగాశ్చ గన్దర్వా ఋషిభిస్సహ l వరప్రదానం శ్రుత్వైవం పితామహముపస్థితాః. 18

దేవాః: వరప్రదానాద్బగవ న్వధిష్య్చతి స నో7సురఃlతత్ప్రసీదాశు భగవన్వధో7ప్యస్య విచిన్త్యతామ్‌. 19

భగవాన్త్సర్వభూతానా మాదికర్తా స్వయంప్రభుః l స్రష్టా త్వం హవ్యకవ్యానా మవ్యక్త ప్రకృతిర్బుధః. 20

సర్వలోకహితం వాక్యం శ్రుత్వా దేవః ప్రజాపతిః l అశ్వాసయామా సురాన్త్సు శీతై ర్వచనామ్బుభిః. 21

అవశ్యం త్రిదశాస్తేన ప్రాప్తవ్యం తపసః ఫలమ్‌ l తపసో7న్తే7స్యభగవాన్వధంప విష్ణుః కరిష్యతి. 22

తచ్చ్రుత్వా విబుధా వాక్యం సర్వే పజ్క జజన్మనః l స్వాని స్థానాని దివ్యాని విప్రా జగ్ముర్ముదాన్వితాః. 23

లబ్ధమాత్రవరస్సోథ సర్వాస్సో7బాధత ప్రజాః l హిరణ్యకశిపుసర్దైల్యో వరదానేన దర్పితః. 24

ఆశ్రమేఘ మహాభాగాన్మునీన్వై శంసితవ్రతా9 lసత్యధర్మపరాన్దాన్తా న్దర్షయామాస దానవః. 25

దేవాం స్త్రీభువనస్థాంశ్చ పరాజిత్య మహాసురః l త్రైలోక్యం వశమానీయ స్వర్గే వసితి దానవః. 26

యదా వరమదోత్సిక్త శ్చోదితః కాలకర్మణాl యజ్ఞీయా నకరోద్దైత్యా నయజ్ఞీయాంశచ దేవతాః. 27

హిరణ్యకశిపుబాధితామరాణాం విష్ణులోకగమనమ్‌.

తదాదిత్యాశచ సాధ్యాశ్చ విశ్వేచ వసవస్తథా l రుద్రా దేవగణా యక్షా దేవద్విజమహర్షయః. 28

శరణ్యం శరణం విష్ణుమువతస్థు ర్మహాబలమ్‌ l దేవదేవం యజ్ఞమయం వాసుదేవం సనాతనమ్‌. 29

''తాతా! (నాయనా!) ఈ అద్బుత దివ్యవరములు నేను నీ కిచ్చుచున్నాను. వత్సా!

నీవు సదా సర్వకామముల (సంకల్పముల) నీడేర్చుకొనగలవు. ఇది నిస్సంశయము.'' ఇట్లు పలికి ఆ భగవానుడు అంతరిక్షమును ప్రవేశించి ఆటనుండి విరాత్‌ రూపతత్త్వా తీతమయి విశేషముగ విరాజిల్లుచు బ్రహ్మర్షి గణ సేవితమగు వైరాజమనెడు బ్రహ్మ సదన (లోక) మును చేరెను.

ఇట్టి వర ప్రదానమును విని దేవనాగ గంధర్వ ఋషులు పితామహుని ఎదుటికి పోయిరి. అట్టి దేవతలు బ్రహ్మతో ''భగవన్‌! ఆ అసురుడు నీ వర ప్రదానముతో మమ్ములను వధించును. కావున మీ రనుగ్రహ ముంచి శీఘ్రమే వాని వధము నాలోచింప ప్రార్థించుచున్నాము. తాము సర్వభూతములకు అదికర్తయు స్వయముగ సర్వ సమర్థులును అగు సృష్టి కర్తయు హవ్యకవ్యములను వ్యవస్థ చేసినవారును అగు భగవానులు అవ్యక్తతత్త్వము ప్రకృతి (జన్మ వ్యక్తి హేతువు గా గల పండితులు మీరు.'' అనగా ప్రజాపతి దేవుడు లోకహితమగు ఈ వాక్యము విని శీతల వచన జలములతో దేవతల నోదార్చెను:దేవతలారా! వాడు తప మాచరించినందులకు తత్ఫల మాతడు పొందవలయును తప (ఃఫల)ము ముగియగానే విష్ణు భగవాను వీనిని చంపును. అనిన పంకజగర్భుని వాక్యమును విని దేవతలు (నుఋషులును) సంతోషయుక్తులయి తమ తమ దివ్యస్థానముల కేగిరి.

ఆ హిరణ్యకశిపు దైత్యుడును వరము లభించినంతనే దర్పితుడై సర్వ ప్రజలను బాదించెను. ఆ దానవుడు ఉత్తమ కర్మానుష్ఠానములతో సతగ ధర్మపరులయి దమముతో ఉండు(దాంతులు-బహిరింద్రియ ప్రవృత్తులను అదుపులో ఉంచుకొనినవారు)ఆశ్రమములందలి మునులను బాధించుచు భయపెట్టుచునుండెను. త్రిభువన (పతులయియున్న) దేవతలను ఓడించి ఆ మహాసురుడు త్రై లోక్యమును వశీకరించికోని స్వర్గమందు వసింపసాగెను. ఎపుడు వరమద గర్వితుడై వాడు కాలకర్మములచే ప్రేరితుడై దైత్యులను యజ్ఞ భాగభోక్తలను గాను దేవతలను ఆ అధికారములేని వారిని గను చేసెనో అపుడు ఆదిత్య సాధ్య విశ్వదేవ వసు రుద్ర నామక దేవగణ- యక్ష నామ దేవతాభేద ద్వీజమహర్షులు మహాబలుడు %ొదేవదేవుడుయజ్ఞమయుడు (యజ్ఞమునకు సంబంధించిన ఉపకరణములు మంత్రములు-యజ్ఞ కర్మ ప్రక్రియలు- ఋత్విక్తులు పశువు-యజమానుడు- యజ్ఞ భాగముల ననుభవించువారు యజ్ఞ ఫలముల నిచ్చువాడు-యజ్ఞఫలము- ఇట్టివన్ని యు తానేయైనవాడు) వాసుదేవుడు(సర్వము తనయందు వసింపగా- సర్వమునందు తాను వసించువాడు) సనాతనుడు(ఎల్లపుడు నుండువాడు) శరణ్యుడు నగు విష్ణుని శరణుకోరి ఆతని ఎదుటికి పోయిరి.

దేవాః: నారాయణ మహాబాగ దేవాస్త్యాం శరణం గతాఃl త్రాయస్వజహి దైత్యేన్ద్రం హిరణకశిపుం ప్రభో. 30

త్వం హిన ః పరమో ధాతా త్వం హిన ః పరమో గురుఃl త్వం హినః పరమో దేవో బ్రహ్మాదీనా సురోత్తమ. 31

విష్ణుః: భయం త్యజధ్వ మమరా అభయం వో దదామ్యహమ్‌ l తథైవ త్రిదివం దేవాః ప్రతివసణ్యథ మా చిరమ్‌. 32

ఏషోహం సగణం దైతగం వరదానేన దర్పితమ్‌ l అవధ్య మమరేన్ద్రాణాం దానవేన్ద్రం నిహన్మ్యహమ్‌ . 33

నాసింహావతారః- పిపారణ్య కశిపోస్సభావర్ణనం చ.

ఏవముక్త్వాతు భగవాన్విసృజ్య తరిదశేశ్వరా9l వధంసజ్కల్పయిత్వాశు హిరణ్య కశిపోః ప్రభుః. 34

సహాయంచ మహాబాపురోజ్కారం గృహ్య సత్వంః l అథోజ్కారసహాయస్తు భగవాన్విష్ణురవ్యయః. 35

హిరణ్య కశిపుస్థానం జగామ హరిరీశ్వరఃl తేజసా భాస్కరాకార శ్శశీకాన్త్యేవ చాపరః. 36

నరస్య కృత్వార్ధతనుం సింహస్యార్ధతనుం తథా l నారసింహేన వపుషా పాణిం సంస్పృశ్య పాణినా. 37

తతో7పశ్యత విస్తీర్ణాం దివ్యా రమ్మాం మనోరమామ్‌ l సర్వకామయితాం శుభ్రాం హిరణ్యకశిపో స్సభామ్‌. 38

విస్తీర్ణాం యోజశతం శతమధ్యర్దమాయతామ్‌ l వైహాయసీం కామగమాం పఞ్చయోజముచ్ఛ్రితామ్‌. 39

జరాశోకక్లమా పేతాం నిష్ప్రకమ్ప్యాం శివాం సుఖామ్‌l * వేశ్మాసనవతీం రమ్యం జ్వల న్తీమివ తేజసా. 409

అన్తన్సలిలసంయుక్తాం విహితాం విశ్మకర్మణా + దివ్య మాల్యాకులై ర్వృక్షైః ఫలపుష్ప ప్రదైర్వృతామ్‌. 41

దేవతలు విష్ణు నిట్లు ప్రార్థించిరి: నారారుణా! మాహాభాగా! దేవతలు నిను శరణు చొచ్చినారు; ప్రభూ సురోత్తమా! రక్షించుము; దైత్యేంద్రుడగు హిరణకశిపుని చంపుము . నీవే బ్రహ్మాదులమగు మాకు ఉత్తముడగు పోషకుడవు; రక్షకుడవు; నీవే మాకు పరమగురువు;(తల్లిదండ్రులు-హితము తెలుపు-చేయ- వాడు) నీవే మాకు పరమ దైవతము; అనగా విని విష్ణువు ''అమరులారా! భయము విడువుడు; మీకు అభయ మిచ్చుచున్నాను. అట్లే త్వరలో దేవులారా! మీరు స్వర్గమును తిరిగి పొందగలరు. ఇదిగో! నేను పరదానదర్పితుడు అసురేంద్రులకును చంపనలవి కానివాడు దైత్యుడు నగు ఆ దానవేంద్రుని సపరివారముగా చంపబోవుచున్నాను. అని పలికి ఆ భగవానుడు దేవశ్రేష్ఠుల ననుమతించి పంపివేసెను. తరువాత పిరణ్యకశివుని వధించు సంకల్పముతో సత్వరుడై ఓంకారమును సహాయునిగా తీసికొని ప్రభువు భగవానుడు అవ్యయుడు (ఏ మార్పును లేనివాడు) విష్ణువు (ప్రతి వస్తువునందును వ్యాపించియుండువాడు) ఈ శ్వరుడు భగవానుడు నగు హిరి హిరణ్యకశిపు స్థానమున కేగెను . హరి అపుడు తేజస్సున భాస్కరుడు కాంతియందు చంద్రుడు (తేజము- తీక్‌ష్ణము; కాంతి మనస్సున కింపయినది) అయి నగము శరీరమున నరుడు అర్థ తనుపున సింహమునై (ఎడమ) చేతిన (కుడి) చేతితో తాకుచు నారసింహ శరీరముతో నుండెను. అచట ఆ దేవునకు విస్తీర్ణము దివ్యముహాయి గోలుపునది మనస్సున కింపగు నది అన్ని కోరికలను తీర్చగల(సౌకర్యములు గల) ది స్వచ్ఛమయినది అగు హిరణ్య కశిపు సభ కనబడెను. అది నూరు యోజనములు పొడవై ఏబది యోజనములకు తక్కువ కాని వెడల్పయినది; ఆకాశమునందు ఎగురుచు కోరిన చోటికి పోగలది; ఐదు యోజనముల ఎత్తయినది; వార్థకము శోకము శ్రమ లేనిది; శిథిలపరచ(కంపింపజేయ) నలవి కానిది; శుభకరము సుఖకరమునై గదులు అసనములు కలిగి రమ్యమై తేజస్సుతో మండుచున్నట్లు కనబడుచు అంతర్బాగమున నీరుండనట్లు విశ్వకర్మ నిర్మించినది; దివ్య పుష్ప మాల్యములతో కూడి ఫలముల పుష్పముల నిచ్చు వృక్షములు కలది.

నీలపీతసితై శ్శామైః శ్వేతై ర్లోహితకైరపిl అవతానై స్తథా గుల్మైర్మ ఞ్జరీశతధారిభిః. 42

సితాభ్రఘనసజ్కా శాప్లవమానేవ దృశ్యతే l రశ్మివతీ భాస్వరాచ సవ్యగన్దా మనోరమా. 43

ససుఖా నచ దుఃఖా సాన శీతా నచ ఘర్మదాl న క్షుత్పిపాసే గ్లానింవా ప్రాప్య తాం ప్రాప్నువన్తి హి.

నానారూపైరుపకృతా స్సవిచిత్రై స్సుభాస్వరైః స్తమ్బైర్న విధృతాసావై శాశ్వతీ చాక్షపాసదా. 45

అతి చన్ద్రంచ సూర్యంచ శిఖినంచ స్వరుంప్రభా l దీప్యతీ నాకపృష్ఠస్థా బాసయ న్తీవ భాస్కరమ్‌. 46

సర్వేచ కామః ప్రవరా యే దివ్యా యే చ మానుషాః | రసవన్తః ప్రభుతాశచ భక్ష్య భోజ్యమనుత్తమమ్‌. 47

పుణ్యగన్దాస్స్రజశ్చాపి నితగకామఫలద్రుమాః lఉష్ణే శీతాని తోయాని శీతేచోష్ణాని సన్తివై. 48

పుష్పితాగ్రాన్‌ మహాశాఖాన్‌ ప్రవళాజ్కురధారిణః l లతావతానసఞ్చన్నాన్‌ నదీషుచ సరస్సుచ. 49

వృక్షాన్బహువిధాంస్తతం మృగేన్ద్రో దదృశే ప్రభుః | గన్దవన్తిచ పుష్పాణి రసవన్తి ఫలానిచ. 50

తాని నోష్ణాని శీతాని తత్ర తత్ర నరాంసిచ | అపశ్యత్సర్వతీర్థాని సభాయామత్ర సో విభుః. 51

______________________________________________________________________________

*వేశ్మహర్మ్యవతీం +దివ్యరత్నమయైర్యృక్షైః.

నళినైః పుణ్డరీకైశ్చ శతపత్రై స్సుగన్ధభిః l రక్తైః కువలయైర్నీలైః కుముదై స్సంవృతానిచ. 52

సుకాన్తైర్దార్తరాష్ట్రై రాజహంసైశ్చ సుప్రియైః l కారణ్డవైశ్చక్రవాకై స్సారసైః కురరైరపి. 53

విమలైస్స్పాటికాభైశ్చ పాణ్డురచ్ఛదనైర్ద్వజైః l బహూ హం సోపగీతాని సారసైరారుతానిచ. 54

నీలములు పచ్చనివి తెల్లవిని నల్లవిని ఎర్రవిని అగు తీగల పందిళ్లు గుబురులువందల కొలది మంజురులు; (తీగ వెంట ఒకదాని ప్రక్క నొక పూవుగా నుండు పూగుత్తులు మంజురులు; ఒకేచోటినుండి అన్ని వైపులకు వ్యాపించినట్లుండు పూగుత్తులు స్తబకములు లేదా గుచ్ఛములు అని భేదము) కలిగి ఆ సభ తేలిపోవుచున్న తెల్లని మేఘముల గడ్డవలె కన బడుచుండెను. అది కిరణములు కలిగి ప్రకాశించుచు క్రొత్త వాసనలతో మనోరమమయి సుఖములతో నిండి దుఃఖములు లేక ఎక్కువ చలిగాని వేడిమిగాని కలిగించక యుండెను. అచటికి పోయినవారికి దానియందున్నంతసేపున ఆకలి దప్పులు బడలికయుండవు. వారు మిగుల విచిత్రములను మిగుల ప్రకాశించునవియు నగు నానా రూపములు గల సుఖసాధనముల వలని ఉపకారముల నందుదురు. అది స్తంభములతో నిలిపి ఉంచబడినది కాదు. శాశ్వతమయినది; రాత్రియే ఎరుగనిది; చంద్రసూర్యాగ్నులను మించి స్వయం సిద్ధములగు తేజః కాంతులు గలది; న్వర్గపు ఉన్నత స్థానమందుండి అది తాను ప్రకాశించుచు సూర్యుని కూడ ప్రకాశింపజేయుచున్నదో యను నట్లుండెను. దేవ మానుష సంబంధులును శ్రేష్ఠములను రుచి గలవియు సమృద్దములు నగు అన్ని కోరికలకు తగిన సామగ్రులును ఉత్తమములగు భక్ష్యభోజ్యములను పవిత్రమగు వాసనగల పూలమాలలును నదా కోరిన పండ్ల నిచ్చు వృక్షములును వేడిమి వేళల చల్లనై చల్లని కాలములందుష్ణముగా నుండు నీరును అచ్చట గలవు . పూచిన కొనలు గల పెద్ద కొమ్మలును వాటియందు చిగురాకుల మొలకలును కలిగి తీగల పందిళ్లతో కప్పబడినవయి సరస్సులయు నదులయు సమీపములయందు పెరిగిన బహు విధ వృక్షములను వాటియందు సుబంధ పుష్పములను రసవంతములగు ఫలములను అంతగ వెచ్చనివి చల్లనివి (కాని ) సరస్సులును సర్వ తీర్థములును అ నరసింహ దేవున కచ్చట కనబడెను. అచటి ఆ సరస్సును తీర్థములును సుగంధ యుతములగు పద్మములతో శతపత్ర పుండరీకములతో ఎర్రని-నీలపు- కలువలతోకప్పబడి మనోహరములగు ధార్తరాష్ట్ర (ఒక విధమగు హంసలు) ములతోమిగుల ప్రీతి గొల్పు రాజహంసములతో కారండవము (నీటికాకు) లలో చక్రవాకములతో బెగ్గరు పక్షులతో కురము(ఒక విధమగు నీటిపక్షి) లతో స్ఫటికలవలె ప్రకాశించుచు నిర్మలములయి తెల్లని రెక్కలుకల (మరికొన్నిజల) పక్షులతో కూడి బహు హంససారసముల కూతలతో నిండియుండెను.

గన్దవన్తీ శ్శుభా స్తత్ర పుష్ప మఞ్జరిధారిణీః l దృష్టవాన్పర్వతా గ్రేషు నానాపుష్పధరా లతాః . 55

కేతకాశోకసరళా న్పున్నాగతిలకార్జునా9 lస్కన్దవన్త(త) స్సుశాఖాంశ్చ బహుతాలసముచ్ఛ్రయా9.56

అర్జునాశోకకర్ణాంశచ లకుచాం శ్చీనకద్రుమా9lచూతాన్నీ పాన్నాగవృక్షా న్కదమ్భాన్వకుళాన్దవా9.57

ప్రియజ్గుపాటలావృక్షా ఞ్చల్మలీ న్త్సహరిద్రకా9l సాలాంస్తాలాం స్తమాలాంశ్చ చమ్పకాంశ్చ మనోరమా9. 58

తథై వాన్యన్మహాశాఖా న్త్సభాయాం పుష్పితప్రభా9 l విద్రుంమాంశ్చ ద్రుమానేకాన్జ్వలితాగ్నిసమప్రభా9. 59

వరుణాన్వత్సనాభాంశ్చ పనసా న్త్స హచన్దనైః l నీపాన్త్సు మనసాంశ్చై వ నిమ్భాం శ్చాశ్వత్థతిన్దుకా9. 60

పారిజాతాంశ్చ లోధ్రాంశ్చ మల్లికా న్భద్రదారుకా9 l అమలక్యస్తథా జమ్బూ ర్లకుచాన్‌ శైలవాలుకా9. 61

మన్దారకుస్తుమ్బరకా న్కదమ్బాన్‌ కుటజాం స్తథా l రక్తాన్కు రువకాంశ్చైవ నీలాంశ్చాగురుభిస్సహ. 62

కుసుమ్భంశ్చై వ భవ్యాంశచ దాడిమా న్బీ జపూరకా9 l కాలీ యకాన్దుకూలాంశ్చ హిజ్గవసై#్తలపత్రకా9. 63

ఖర్జూరనారికేళాంశ్చ హరీతకవిభీతకా 9l మదూకాన్త్సప్తపర్ణాంపశ్చ బిల్వాన్పారావతాం స్తథా. 64

అసనాంశ్చతమాలాంశ్చ నానాగుల్మసమాస్థితా9 l లతాశ్చ వివిధాకారాః పుష్పపత్రఫలోపగాః. 65

ఏతే చాన్యేచ బహవస్తత్ర కాననజా ద్రుమాః l నానాపుష్ప ఫలోపేతా వ్యరాజన్త సమన్తతః. 66

చకోరాస్సితపత్రాశచ మత్తాః కోకిలసారికాః l పుష్పితాన్పుష్పితాగ్రస్థా స్స ఞ్చరన్తి మహాద్రుమా9. 67

రక్తపీతారుణా స్తత్ర పాదపాగ్రగతాః ఖగాః l పరస్పరమవేక్షన్త ప్రహృష్టా జీవజీవకాః. 68

ఆ దేవునకు అచట పర్వతాగ్రములందు సువాసన కల పుష్పమంజరుల ధరించి నానా పుష్పములతో నిండిన శుభ లతలును పెద్ద బోదెలును చక్కని కొమ్మలును అనేక లతలును గల ఎత్తయిన కేతకాశోక సరళనాగలితకార్జునా శోకకర్ణలకుచ చీన వృక్ష చూతనీపనాగ వృక్షకదంబ వకుళధవ ప్రియంగుపాటల శాల్మలిహరిద్రక సాలతమాలతాం చంపక వృక్షములును ఇంకను మనోహరములయి పూచి ప్రకాశించు మహాశాఖలు గల వృక్షములను మండెడి అగ్నివంటి పగడవు చెట్లును వరుణ వత్సనాభ చందన సమనస నింబాశ్వత్థతిందుక పారిజాతలోధ్ర మల్లికా భద్రదారు కామలకీ జంబూవృక్షములును లకుచ శైలవాలుక మందారకుస్తుంబరక కదంబకుటజ రక్తకురువక నీలకురువకాగురు కుసుంభదాడిమ బీజపూరక కాలేయకదుకూలహింగు తైలపత్రక ఖర్జూరనారికేళహరీతకవిభీతక మధూక సప్తవర్ణ బిల్వపారా వత వృక్షములను అసనతమాల వృక్షములును పలు విధములగు గుబురులు తమ చుట్టు నున్న మరి వేరు వేరు చెట్లును పూవులు పండ్లు ఆకులు కలిగి వాటికై ఉపయోగపడు వివిధాకార లతలును నానా పుష్పఫలయుతములగు ఇవియు ఇంకను అనేక వృక్షములును లతలును ఆ సభకు చుట్టుప్రక్కల నన్ని వైపులను కనబడెను. చకోరములను సితవత్రములు (తెల్లని రెక్కలకు గల ఒక జాతి పక్షలు) మత్తిల్లి కోకిలలు గోరువంకలును పుష్పించిన చెట్లపై పూచిన రెమ్మల కొనలందు కూర్చుండెను. చకోరములు సంతోషముతో అట్లు కూర్చుండి పరస్పరము చూచుకొనుచుండెను.

తస్యాం సభాయాం దైత్యేన్ద్రో హిరణకశిపుస్తదా lస్త్రీ సహసై#్రః పరివృతో విచిత్రాభరణమ్బరః 69

అనర్ఝ్యమణివజ్రార్చి శ్శిఖాజ్వలితకుణ్డలః l ఆసీనశ్చాసనే చిత్రే దశనల్వప్రమాణతః. 70

దివాకరనిభే దివ్యే దివ్యాస్తరణసంస్తృతే l దివ్యగన్ధవహస్తత్ర మారుతస్స సుఖోమవౌ. 71

హిరణ్య కశిపుర్దైత్య ఆస్తే జ్వలితకుణ్డలః l ఉపవిష్టం మహాదైతగం హిరణకశిపుం తదా. 72

దివ్యగానేషు గీతాని జగుర్గన్దర్వసత్తమాః l విశ్వాచీ సహజన్యాచ ప్రవ్లూెచ న్తీచ విశ్రుతా. 73

దివ్యాచ సౌరభేయీచ సమీచీ పు ఞ్జీకస్థలా l మిశ్రకేశీచ రమ్భాచ మిత్రలేఖా శుచిస్మితా. 74

చారునేత్రా ఘృతాచీచ మేనకా చోర్వశీ తథా l ఏతాస్సహ స్రశ్చాన్యా నృత్యగీతవిశారదాః. 75

ఉపతిష్ఠన్తి రాజానం హిరణ్యకశిపుం తదాl

అపుడా సభయందు దైత్యేంద్రుడగు హిరణ్యకశివుడు వేలకొకది స్త్రీలు తను పరివేష్టించి యండ విచ్రిత (పలువిధములగు) వస్త్రాభరణముల ధరించి వెల ఇంతనరాని మణుల- వజ్రముల- జ్వాలల కొనలతో ప్రకాశించు కుండలములు దాల్చి రవివలె ప్రకాశించుచు దివ్యములగు పరవులు పరచినదయి పది నల్వముల ఘన పరిమాణము (సల్పము= నాలుగు వందల మూరలు ) గల చిత్రమగు (పలు విధముల అమరికలు అలంకరణములు గల) అననమందు కూర్చుండెను. (20 మూరతలు వెడల్పుx20మూ. పొ.x10మూ. ఎత్తు= 4000 ఘన మూరలు) అచట దివ్య గంధములతో మిగుల హాయి గొలుపు గాలి వీచుచుండెను ఆట ఇట్లు జ్వలించి కుండలములతో కూర్చున్న మహాదైత్యుడగు హిరణ్యకశివుని కొలుచుచు గంధర్వ సత్తములు పదివ్య గానములందలి గీతములు పాడుచుండిరి. విశ్వాచి సహజస్య ప్రవ్లౖుెచంతీ సౌర భేయి సమీచీ పుంజికస్థల మిశ్రకేశి రంభా మిత్రలేఖ శుచిస్మిత చారునేత్ర అగు ఘృతాచి మేనక ఊర్వశి-వీరును ఇంకను వేలకొలది నృత్యగీత విశారదలగు దేవ స్త్రీలును రాజగు హిరణ్యకశివుని సేవించుచుండిరి.

తత్రాసీనం మహాబాహుం హిరణ్యకశిపుం ప్రభుమ్‌. 76

ఉపాసన్తదితేః పుత్రస్సర్వే లబ్దవరాస్తథాl తమప్రతిమకర్మాణాం శతశో7థ సహస్రశః. 77

బలిర్విరోచనస్తత్ర నరకః పృథివీసుతః l ప్రహ్లాదో విప్రచిత్తిశ్చ గవిష్ఠశ్చ మహాసురః. 78

దశగ్రీవశ్చ వాలీచ మేఘవాసా దురాసదః l ఘటాస్యో 7కమ్పనశైవ ప్రజాన శ్చేన్ద్రతాపనః. 79

దైత్యదానవసజ్ఝాశ్చ సర్వే తీవ్రపరాక్రమాః l సురహన్తా దుఃఖహన్తా సునామా సుమతిర్వరః. 80

ఘటోదరో మహాపార్శ్వః కథనః కఠినస్తథాl విశ్వరూప స్సురూపశ్చ స్వవలశ్చ మహాబలః. 81

స్రగ్విణో వాగ్మినస్సర్వే సర్వేచ చరితవ్రతా ఃlసర్వేలబ్దవరాంశ్శూరా స్సర్వే విగతమృత్యవః. 82

ఏతే చాన్యేచ బహవో హిరణ్య కశిపుం ప్రభుమ్‌ l ఉపాసన్తే మహాత్మానం సర్వే దివ్యపరిచ్ఛదాః 83

విమానైర్వి వాధాకారై ర్బ్రాజమానైరివాగ్నిభిః మహేన్ద్రవపుషస్సర్వే విచిత్రాజ్గదబాహవః. 84

భూషితాజ్గా దితేః పుత్రా స్తముపాసన్త సర్వశః l తస్యాం సభాయాం దివ్యాయా మసురాః పర్వతోపమాః.

హిరణ్యవపుషస్సర్వే దివాకరసమప్రభాః l న శ్రుతం నైవనో దృష్టం హిరణ్యకశిపోర్యథా. 86

ఐశ్వర్యం దైతగసింహస్య యథా తసగ మహాత్మనః l రజతకనకచిత్రవేదికాయాం పరిధృతరత్నవిచితవీథి కాయామ్‌. 87

సదదర్శ మృగాధిప స్సభాయాం సురచిరత్న గవాక్షశోభితాయామ్‌ l కనకవిమలహారభూషితాజ్గం దితితనయం స మృగాధి పో దదర్శ. 88

దివసకరకరప్రభం జ్వలన్తం దితిజశ##తైస్సతతం నిషేవ్యమాణమ్‌ .

ఇతి శ్రీమత్స్యమహాపురాణ హిరణ్యక శివూపాఖ్యానే నరసింహ

ప్రాదుర్బావ హిరణ్యకశిపు సభావర్ణనాది కథనం నామ

షష్ట్యుత్తరశతతమో7ధ్యాయః.

నిరూపమానములగు పనులు చేయ సమర్థుడగు ఆ దైత్యేంద్రుని హరణ్యకశిపుని ప్రాప్తవరులగు వందల కొలది వేల కొలదిగ దితిజులు సేవించుచుండిరి. బలి విరోచనుడు పృథినీ పుత్త్రుడగు నరకుడు ప్రహ్లాదుడు విప్రచిత్తి మహాసురు ప్రజానుడు ఇంద్రతాపనుడు తీవ్ర పరాక్రములగు ఇట్టి దైత్యదానవ సంఘములవారును సురహంత దుఃఖహంత సునామన్‌ వరుడు ఘటోదరుడు మహాపార్శ్మడు క్రథనుడు కఠినుడు విశ్వరూపుడు సురూపుడు మహాబలుడగు స్వవలుడు ఈ మొదలగు వారును వారిలో నుండిరి. వీరేకాక ఇంకను ఇతరు లనేకులు మహాత్ముడును ప్రభుడు నగు హిరణ్యకశివుని సేవించుచుండిరి. వీరందరును పూలమాలలు దాల్చినవారు చక్కగ మాటాడువారు మహేంద్రుని దేహమువంటి దేహములు కలవారు కొండల వంటి (దృఢ శరీరములు కల) వారు బంగారువాలె మెరయు శరీరములవారు రవివలె వెలుగువారు నయి యుండిరి. దైత్యసింహుడు మహాత్మ్యుడు నగు హిరణ్యకశివునకు వలె నుండు ఐశ్వర్యము మరెచ్చట నెవ్వరికిని ఉండుట కనబడదు; వినబడదు. చక్కగ రచించిన రత్నగవాక్షములతో శోభిల్లు సభయందు చక్కగ తాపించిన రత్నములతో అచ్చెరువు

గొలుపు ఆననముల వరుసలు కలిగి వెండితో బంగారుతో నిర్మించిన చితంవేదికయందు విమల కనకహారములతో భుషి తాంగుడయి రవికిరణ తేజోవంతుడయి జ్వలించుచు వందల కొలది దైత్యుల సేవలందుకొనుచున్న హిరణ్యకశివుడు ఇట్లు నరసింహ దేవునకు కనబడెను. (గమనికః- హిరణ్యకశివుని కొలుపు లో ప్రహ్లాద విరోచన బలి ప్రభృతి దైత్యులున్నా రని ఇచట చెప్పబడినది. దీనిని బట్టి ఈ కథ యందలి ప్రహ్లాదుడు శ్రీమద్‌ భాగవతమునందు వలె పసివాడు కాడు.)

ఇది శ్రీమత్స్య మహాపుంపాణమున హిరణ్యక శివూపాఖ్యానమున నరసింహ ప్రాదుర్బావ హిరణ్యకశిపు

సభావర్ణన నిరూపణమను నూట అరువదియవ ఆధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters