Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకోనషష్ట్యు త్తరశతతమో7ధ్యాయః.

కుమారతాకాసురయుద్దమ్‌.

సూతః: శ్రుత్వైతత్తారక స్సర్వ ముద్ఝుష్టం దేవవన్దిభిఃl సస్మార బ్రహ్మణో వాక్యం వధం బాలాదువస్థితమ్‌. 1

స్మృత్వాధర్మం హ్యవర్మాజ్గః పదాతిశ్చ పదానుగః l మన్దిరాన్నిర్జగామాశు శోకవ్యాప్తేన చేతసా. 2

కాలనేమిముఖా దైత్యా స్సంరమ్భాద్భ్రన్తచేతసః l యోధా ధావత గృహ్ణీత యోజయధ్వం వరూథినీమ్‌. 3

కుమారం తారకో తదృష్ట్వా బభాషే భీషణాకృతిః l కిం బాల యోద్దుకామో7సి క్రీడాకన్దుకలీలయా. 4

త్వయా న దానవా దృష్టా యత్సజ్గరవిభీషకాః బాలత్వాదథ తే బుద్ధి రేవం స్వల్పార్థదర్శినీ.5

కుమారోపి తమగ్రస్థం బభాషే హర్షయన్త్సురా9lకుమారః : శృణు తారక శాస్త్రా ర్థస్తవచైవ నిరూప్యతే . 6

శాసై#్త్రరర్థా న దృశ్యన్తే సమరే నిర్భయై ర్భటైః l శిశుత్వం మావమంస్థా మే శిశుః కాలభుజజ్గముః 7

దుష్ప్రే క్ష్యో భాస్కరో బాల స్తథాహం దుర్జయ శ్శిశుః | అల్పాక్షోరోన మన్త్రఃకిం సుస్ఘరో దైత్యదృశ్యతే .

కుమారే ప్రోక్తవత్యేవం దైతగశచిక్షేవ ముద్గరమ్‌ l కుమారస్తం నిరస్యోగ్రం వజ్రేణామోఘవర్బసా. 9

తతశ్చిక్షేప దైత్యేన్ద్రో భిణ్డిమా(వా)ల మయోమయమ్‌ l కరేణ తం చ జగ్రాహ కార్తికేయో7మరాంరిహా. 10

గదాం ముమోచ తదైత్యాయ షణ్ముఖోపి ఖరస్వనామ్‌ l తయా హత్తస్తతోదైత్య శ్చకమ్పే7చలరాడివ. 11

నూట ఏబది తొమ్మిదవ అధ్యాయము.

తారకారసుర వధము.

దేవతావందులు (స్తోత్ర పాఠకులు) బిగ్గరగ పాడుచుండిన ఈ స్తుతులను వినగానే తనకు బాలుని వలన మృతి కలదను బ్రహ్మ వచనములు తారకునకు స్మృతికి వచ్చెను. వాడును (పుణగపాప నియంతయగు )ధర్మదేవుని స్మరించి(భారమంతయు అతనిదేయను భావముతో) కవచమును ధరించకయే పదాతియై పదాతులనే తనవెంట తీసికొని శోకవ్యాపి చిత్తముతో తన మందిరమునుండి శీఘ్రముగా వెలికివచ్చెను. అతని సేనానులగు కాలనేమి మొదలగు దైత్యయోధులు భావావేశమున భ్రాంతచిత్తులై అటునిటు పరుగులెత్తుచుండిరి దేవతలను పట్టుకొనుచుండిరి. తమ సేనను కూర్చుకొనుచుండిరి. ఆట్లు పలువురు పలువిధములుగా అదే పనిగా చేయుచుండిరి.

తారకాసురుడు భయంకరాకారుడైపోయి కుమారుని చూచి ఇట్లనెను: బాలుడా! ఆడుకొనునట్లే యుద్ధము కూడ చేయుదమనుకొనుచున్నావా ఏమి? యుద్ద భయంకరులగు దానవులను నీవు ఎప్పుడును చూడనట్లున్నావు; లేదా పిల్లవాడవు కావున ఎక్కువగా లోక విషయములను చూడనందున ఇట్లు మాటాడుచున్నావేమో! అనగా కుమారుడును తనముందున్న తారకాసురునితో దేవతలకు హర్షకారణముగా ఇట్లు పలికెను: తారకా! (నీవు శాస్త్ర విషయములు మాట లాడుచున్నావు కావున) నీకు శాస్త్రమునందు చెప్పిన విషయమే నిరూపింతును వినుము; సమరమనిన భయమెరుగని వీర భటులెన్నడును శాస్త్రములచే చెప్పబడిన విషయములను (నీవలె) చూచుచు (విచారించుచు) ఉండరు. నా శిశుత్వమును నీవలక్ష్యముగా చూడకుము. కాల భుజంగ ము శిశువే; భాస్కరుడు బాలుడయ్యు చూడ శక్యుడు కాడు! అట్లే నేను శిశువనయినను దుర్జయుడనని ఎరుగుము; దైత్యుడా! మంత్రము తక్కువ అక్షరములు కలదేయైనను అధిక ప్రకాశము కలదై యుండుట కనబడుచునేయున్నది కదా! అని ఇట్లు కుమారుడు పలుకుచుండగనే తారక దైత్యుడు ముద్గరమును విసరెను. దానినతడు అమెఘ తేజముగల వజ్రముతో వెనుకకు త్రిప్పివేసెను. దైత్యేంద్రుడు అయోమయమగు (ఇనుప) భిండివాలము విసరగా దేవశత్రు హంతయగు కార్తికేయుడది చేతితో పట్టివేసి ఆ షణ్మఖుడు దైత్యునిపై పరుషధ్వని కల గదను వదలెను. అ దెబ్బతిని వాడు పర్వతరాజమువలె నుండియు కంపించెను.

మేనే తం దుర్జయం దైత్య స్తదా షడ్వదనం రణ l చిన్తయామాస బుద్ద్యావై ప్రాప్తఃకాలో న సంశయః.

కమ్పితం తు తమాలోక్య కాలనేమిపురోగమాః l సర్వేదైతగేశ్వరా జఘ్నుః కుమారం రణదారుణమ్‌. 13

సతైః ప్రహారై రస్పృష్టో పృథాక్లేశైర్మహాద్యుతిః l అచాలై ర్బావితైరజ్గై రయుధ్య ద్దానవాన్రణ. 14

రణశౌణ్డాస్తు దైత్యేన్ద్రాః పునః ప్రాసై శ్శిలీముఖైః l కుమారం సామరం జఘ్నుర్బలినో దేవకణ్టకాః. 15

కుమారస్య వ్యథా నాభూ ద్దైత్యాస్త్రనిహతస్యతు l ప్రాణాన్తకరణో జాతో దేవానాం దానవాహవః. 16

దేవాన్ని పీడితా న్దృష్ట్వా కుమారః కోపమావిశత్‌ lతతోసై#్త్రర్దారయామాస దానవానా మనీకినీమ. 17

తైరసై#్త్రర్నిష్ప్ర తీకారై స్తాడితా స్సురకణ్టకాఃl కాలనేమిముఖాస్సర్వే రణాదాస స్పరాజ్ముఖాః . 18

విద్రుతేష్వథ దైత్యేషు హతేషుచ సమన్తతః l కిన్నరోద్గీతహాసస్య తదాసౌ న్యస్తచేతనః. 19

తతఃక్రుద్దో మహాదైతగ స్తారకో7సురనాయకః l జగ్రాహ చ గదాం దివ్యాం హేమజాలపరిష్కృతామ్‌.

జఘ్నే కుమారం గదయా నిఘ్నష్టకనకాజ్గదః l శ##రైర్మయూరం చిత్రైశ్చ చకార విముఖం రణ. 21

దానితో దైత్యుడీ షడ్వదనుడు రణ దుర్జయుడనియు తనకు కాలము సమీపించినట్లున్నదనియ తలచెను. కాలనేమ్యాది దైత్యేశ్వరులందరును తారకుడు కంపితుడగుట గమనించి పరణ దారుణు (భయంకరు) డగు కుమారుని కొట్టిరి. మహాతేజస్కుడగు ఆ కుమారుడును వారి క్లేశము వ్యర్థముకాగా అ దెబ్బలేమియ చలింపరానివియు దివ్యశక్తి భావితములునునగు అవయవములుకల తనకు తాకకపోగా దానవులనందరను ఎదిరించి యుద్ధము చేయసాగెను. యుద్ధ నిపుణులు బలశాలురు దేవ కంటకులునగు అదైత్యేంద్రులు దేవతలను కుమారుని కూడ ప్రానములతో బాణము లతో కొట్టిరి. దైత్యాస్త్ర నిహతుడయ్యు కుమారుడేమియు వ్యథ నందలేదు. కాని దానవులతోడి యుద్ధము దేవతలకు మాత్రము ప్రాణాంతకమయ్యెను. దేవతలు పీడితులగుట చూచి కుమారుడు కోపావిష్టుడయి దానవ సేనను అస్త్రములతో చీల్చి చెండాడసాగెను. సురకంటకులగు కాలనేమి ప్రముఖ దానవులందరును ప్రతీకారము చేయనలవికాని కుమారాస్త్రముల దెబ్బలుతిని యుద్దమునకు పెడ మొగము పెట్టిరి. దైత్యులందరును పారిపోవుటయో మరణించుటయో కాగా కిన్నరులు బిగ్గరగా పాడుపాటలతో వినబడు నవ్వునకు మహాదైత్యుడు అసుర నాయకూడా తారకుడు తెలివి తప్పినంతగా క్రుద్దుడయ్యెను. బంగారు పరికరములతో అలంకృతమయిన దివ్య గదను చేబుని ఒరిపిడి చేసి పరీక్షించబడిన మేలిమి బంగారపు భుజకీర్తులతో అలంకృతుడగు అదైత్యుడు దానిని అగదతో కొట్టెను. ఆశ్చర్యకర శరములతో నెమిలినిరణ విముఖముగా చేసెను.

దృష్ట్వా పరాజ్ముఖం దేవో ముక్తరక్తం స్వవాహనమ్‌ l జగ్రాహ శక్తిం విమలాం రణ కనకభుషణామ్‌. 22

బాపూనా హేమ కేయూరరుచిరేజణ షడాననః l తతో7 బ్రవీన్మహాసేన స్తారకం దానవాధివమ్‌. 23

తిష్ఠ తిష్ఠ సుదుర్బుద్దే జీవలోకం విలోకయl హతో7స్యద్మ మయా శక్త్యా స్మరాస్త్రం దైత్యశిక్షితమ్‌. 24

ఇత్యుక్త్వాతు తతశ్శక్తిం ముమోచ దితిజంప్రతి l సా కుమారభుజోత్సృష్టా తత్కే యూరరవానుగా. 25

బిభేద దైత్యహృదయం వజ్రశైలేన్ద్ర కర్కశమ్‌ l గతాసు స్స పపాతోర్వ్యాం ప్రళ##యే భూధరో యథా. 26

వికీర్ణముకు టోష్ణీషో విస్రస్తాలకభుషణఃl తస్మిన్వి హతే దైత్యే త్రిదశానాం మహోత్సవః. 27

నాఢూత్కశ్చిత్తదా దుఃఖీ నరకేష్వపి పాపకృత్‌ | స్తువన్తష్షణ్ముఖం దేవాః క్రీడన్తశ్చాజ్గనాయుతాః. 28

తుష్టా స్సమ్ప్రాప్తసర్వేచ్చా స్సహసిద్దై స్తపోధనైః l దేవాః : యః పఠే త్స్కన్దసమ్భద్ధాం కథా మర్త్యో మహాద్యుతిః. 30

శృణుయాచ్ఛ్రా వయే ద్వాపి స భ##వేత్కీ ర్తిమాన్నరః l బహ్వాయుస్సుభగ శ్శ్రీమా న్కా న్తిమ ఞ్చుభదర్శనంః.

భుతేబ్యో నిర్భయశ్చాపి సర్వదుఃఖవివర్జితఃl *స్కన్దం చోపాసయన్ను ర్వ్యాం స్కన్దస్య చరితం పఠేత్‌. 31

విముక్తః కిల్బషైన్సర్వై ర్మహాధనపతి ర్బవేత్‌ l బాలానాం వ్యాధిజుష్టానాం రాజద్వారోపసేవినామ్‌. 33

ఇదం తత్పరమం దివ్యం సర్వదా సర్వకామదమ్‌ l తనక్షయే చ సాయుజ్యం షణ్ముఖస్య వ్రజేన్నరః 34

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ దేవాసుర సజ్గ్రామే కుమారకృతతారకాసురవధో

నామఏకోనషష్ట్యుత్తరశతతమో7ధ్యాయః.

షణ్ముఖుడగు ఆ కుమారదేవుడు తన వాహనము రక్తము క్రక్కుచు రణమునకు పెడమొగమగుట చూచి బంగారు భుజకీర్తులతో రుచిరమగు భుజముతో కనక భూషణములుగల విమలమగు శక్తిని వూనెను; అంతట మహాసేనుడు '' మహాదుర్బుద్ధీ! నిలునిలుము; ఒకసారి ఈ జీవలోకమును చూచుకొనుము; ఇపుడు (ఒక క్షణములో) నాచేతి శక్తితో చావనున్నావు! దైత్త్యుడా! నీవు నేంచిన అస్త్రమును స్మరించుము; (అది నిన్ను కాపాడునేమో చూతము.) అనుచు వానిమీదకు ఆ శక్తిని వదలెను. కుమారుని భుజములనుండి విడువబడిన ఆ శక్తి అతని భుజకీర్తుల ధ్వని తనతోపాటు తలపాగతో జారిపడిన ముంగురులతోభుషణములతో ప్రళయకాలమున పర్వతమువలె నేలపై పడెను.

ఆ దైత్యుడు వినిహతుడు కాగా అది దేవలతకు పెద్ద పండుగ అయ్యెను. నరకమందున్న పాపకరుడు కూడ ఆ సమయమున ఎవడును దుఃఖవంతుడు కాకుండెను. దేవతలు షణ్ముఖ దేవుని స్తుతించుచు తమతమ స్త్రీలతో కూడిఆడుచు మహాధామ(తేజో) వంతులయి క్రొత్త కుతూహలము( వేడుక) లతో తమ తమ భవనముల కేగిరి. తమ తమ కోరికలన్నియు ఈడేరుటతో తుష్టులయి దేవతలందరును స్కందముఖము(కుమారోపాఖ్యానము) విషయము సిద్ధులతో తపోధనులతో కూడి ఈ విధముగా ఫలశ్రుతిరూపములగు వరములను లోకములకు ప్రసాధించిరి.

___________________________________________________________________________

*సన్ద్యాముపాస్యవై పూర్వాఠ

కుమారోపాఖ్యాన శ్రవణఫలము

స్కందునితో సంబద్దమగు ఈ కథను ఏమర్త్యుడు పఠించునో వినునో వినిపించునో అట్టి నరుడు మహాతేజో వంతుడు కీర్తిమంతుడును బహ్వాయుష్మంతుడు సుభగుడు(పత్నికి ప్రీతిపాత్రుడు) శ్రీమంతుడు కాంతిమంతుడు శుభదర్శనుడు (శుభకరమగు- ఇంపగు-అకృతి కలవాడు) ఏప్రాతలు (భూతముల) నుండియు నిర్భయుడు ఏ దుఃఖములును లేనివాడు నగును. స్కందునికి నివేదనమును చేయుచు స్కందు నుద్దేశించి బ్రాహ్మణులను అన్నాతురులను భుజింపజేయుచు ఈ స్కంద చరితమును పారాయణము చేయుచో మహాధనపతి యగును. వ్యాధిగ్రస్తులగు బాలురకును రాజద్వారమును (రాజ సేవారూపములగు పదవులను) ఆశ్రయించియుండు వారికిన ఇది పరమదివ్యమగు సాధనము; సర్వదా సర్వకామ ప్రదము; అట్టి నరుడు దేహము నశించిన తరువాత స్కందునితో సాయుజ్యము పొందును.

ఇది శ్రీమత్స్య మహా పురాణమున దేవాసుర సంగ్రామమున తారకాసుర వధమును

నూట ఏబది తొమ్మిదవ యధ్యాయము.

తారకాసుర వధ కథ ముగిసినది

Sri Matsya mahapuramu-2    Chapters