Sri Matsya mahapuramu-2    Chapters   

అష్టపఞ్చాశదుత్తరశతతమో7ధ్యాయః.

తారక కృత దేవసేనావలో కనకథనమ్‌.

సూతః: వామం విదార్య నిష్క్రాన్తస్సుతో దేవ్యాః పున శ్శిశుః l

స్కన్నాచ్చవదనే వహ్నే శ్శుక్రాత్సువదనో7రిహా. 1

కృత్తికామేళ నాదేవ శాఖభి స్సవిశేషతః l శాఖాభిదా స్సమాఖ్యాతా ష్షట్సు వక్త్రేషు విస్తృతాః. 2

యతన్తతో విశాఖో7సౌ ఖ్యాతో లోకేషు షణ్ముఖ ః l స్కన్దో విశాఖష్షడ్వక్త్రః కార్తికేయశ్చ విశ్రుతః. 3

చైత్రస్య బహుళే పక్షే పఞ్చదశ్యాం మహాబలౌ l సమ్భూతావర్క సదృశౌ విశాలే శరకాననే. 4

చైత్రసై#్యవ సితే పక్షే పఞ్చమ్యాం పాకశాసనః l బాలకాభ్యాం చకారైకం మత్వా చామరభూతయే. 5

తస్యామేవ తతష్షష్ఠ్యామభిషిక్తో గుహః ప్రభుః l సర్వైరమరసజ్ఝాతై ర్బ్రహ్మేన్ద్రోపేన్ద్ర భాస్కరైః. 6

గన్దమాల్యై శ్శుభైర్ధూపై స్తథా క్రీడనకైరపి l చత్రైశ్చామరజాలైశ్చ భుషణౖశ్చ విలేపనైః. 7

అభిషిక్తో విధానేన యథావత్షణ్యుఖః ప్రభుః l సుతామసై#్మ దదౌ శక్రో దేవసేనేతి విశ్రుతామ్‌. 8

వత్న్యర్థం దేవదేవస్య దదౌ విష్ణుస్తదాయుధా9 l యక్షాణాం దశలక్షాణి దదావసై#్మ ధానాధిపః. 9

దదౌ హుతాశనస్తేజో దదౌ వాయుశ్చ వాహనమ్‌ l దదౌ క్రీడనకం త్వష్టా కుక్కుటం కామరూపిణమ్‌. 10

ఏవం సురాస్తు తే సర్వే పరివారమనన్త పరివారమన్తకమ్‌ l దుదుర్ముదితచేతస్కాః స్కన్దాయాదిత్యవర్చసే. 11

జానుభ్యామవనౌ స్థిత్వా సురసజ్ఝా స్తమస్తువ9 l స్తోత్రేణానేన వరదం షణ్ముఖం ముఖరాస్సురాః. 12

నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము.

తారకుడు కుమారుడు సేనానిగానున్న దేవసేనను చూచుట.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ఇటు తరువాత మరల దేవి వామ కుక్షిని (ఉదరపు ఎడమ భాగము) చీల్చుకొని ఇంకొక శిశువు వెలికివచ్చెను. ఇతడును శివుని ఇంద్రియమునుండి అగ్ని నోటిలోనికి న్కన్న మయిన (జారిపడిన) శుక్రమునుండి జనించిన వాడే ; ఇతడును చక్కని మొగములు కలవాడు; అతడు విశేషించి (దేవతల) శత్రువుల చంపువాడు; (షట్‌) కృత్తికలును ఆశిశుని ఆరు శిరస్సులను ఒకటిగా కలిపిరి. ఆరు మొగములుగా విస్తరిల్లిన ఈ కుమారుని రూప భేదములకే శాఖలు అని పేరు. (లోక సాధారణముగ కాక) విశేషించి కూర్చబడిన (ముఖ) భేదములు కలవాడు కావున లోకములందు ఈ షణ్ముఖుడు విశాఖుడని ప్రసిద్ధుడయ్యెను. ఇట్లీ శిశువుల 1. స్కంద (శివునినుండి అగ్ని నోటియందు జారిపడిన వీర్యమునుండి జనించినవాడు; 2. విశాఖుడు (ముఖ శాఖలు విశేషముగా కూర్చబడినవాడు); 3. షడ్వక్త్రుడు (ఆరు మొగములు కలవాడు); 4. కార్తికేయుడు(కృత్తికలకు సంతానము) అని ప్రసిద్ధులైరి; మహాబలులగు ఈ శిశువులిద్దరును చైత్రమానపు బహుళ పక్షమున పంచదశి (పదునైదవ తిథి- అమవాస్య) యందు జనించిరి; విశాల శరవణ (రెల్లువన) మున జనించిన వీరిద్దరును సూర్యనమానులు; వీరు జనించిన ఆరవ దినమున చైత్ర శుక్ల పంచమినాడు (ఉత్తర భారతమున మాసములు కృష్ణపక్షము తరువాత శుక్లపక్షముగా లెక్కింతురు.) ఇంద్రుడు ఆ బాలకులతో (కలయికతో) ఒకే శిశువును నిర్మించెను. దేవతల క్షేమమునకై ఆ ఇంద్రుడు ఇదే చైత్రశుక్ల షష్ఠిదినమున ఈ ప్రభుని (సమర్థుని ) గుహునిగా (దేవసేనా రక్షకునిగా- గూహించు - రక్షించు-వానిగా) అభిషేకించెను. బ్రహ్మ-ఇంద్రుడు- విష్ణువు - రవి- మొదలగు దేవతలెల్లరును కూడి శుభములగు గంధములు మాల్యములు ధూపములు కుమారుడింకను శిశువే కాకవున క్రీడనకములు (ఆట వస్తువులు ) ఛత్త్రములు చామరములు భూషణములు విలేపనములు (పూసి కొను గంధాదికము) మొదలగు వానితో శాస్త్ర విధానమున యథావిధిగా అభిషేకమును జరిపించిరి. ఇంద్రుడీ దేవదేవునకు పత్నిగా తన పుత్త్రియగు 'దేవసేన' ను ఇచ్చెను. (ఇతడు ఇట్లు దేవసేనాపతి యయ్యెను.) అదే సమయమున అతనికి విష్ణువు ఆయుధములను కుబేరుడు దశలక్ష యక్షులను అగ్ని తన తేజస్సును వాయువు వాహన (మయూర )మును త్వష్ట (దేవతల వడ్లంగి ) అతనికి ఆట వస్తువుగా కామ రూపమగు కుక్కుటమును (కోడిని) ఇట్లే ఇంకను దేవతలెల్లరును అనంతమగు పరివారమును (వస్తు వాహన జనములను) సూర్యతేజస్కుడగు ఈ స్కందునకు ముదిత చిత్తులయి ఇచ్చిరి.!

సురలు మోకాళ్ళు నేలకు తాకునట్లు నేలపై నిలిచి గొంతుక విడిచి వరదుడగు ఆ షణ్ముఖుని ఈ చెప్పబోవు స్తోత్రముతో స్తుతించిరి.

అమరకృతమారస్తుతిః.

దేవాః: నమః కుమారాయ మహాప్రభాయ స్కన్దాయ చాస్కన్ధితదానవాయ l

నవార్క బిమ్బద్యుతయే నమోస్తు నమో7స్తుతే షణ్ముఖ కాలరూపిణ. 13

పినదత్ధనానాభరణాయ భ##ర్త్రే నమో రణ దారుణదారణాయ l

నమోస్తు తే7ర్కప్రతిమప్రభాయ నమోస్తు గుహ్యాయ గుహ్యాయ తుభ్యమ్‌. 14

నమోస్తుతే లోకభయావహాయ నమోస్తు తే బాలకృపాపరాయ l

నమో విశాలాయతలోచనాయ నమో విశాఖాయ మహావ్రతాయ. 15

నమో నమస్తేస్తు మనోరమాయ నమో నమస్తేస్తు గుణోత్కటాయ l

నమో మయూరోజ్జ్వలవాహనాయ నమోస్తు కేయూరధరాయ తుభ్యమ్‌. 16

నమో ధృతోదగ్రవతాకినే7స్తు నమః ప్రభావప్రణతాయ తే7స్తు l

నమోస్తు ఘణ్టాధరవీర్యుశాలినే క్రియాపరాణాం భవ భవ్యమూర్తయే . 17

క్రియాపరా యజ్ఞవతిం చ స్తుత్వా విరేమురేవం హ్యమరాధిపాద్యాః l

ఏవం తదా షడ్వదనంతు సేన్ద్రై ర్ముదా సుతుష్టశ్చ గుహ స్తతస్తా9. 18

నిరీక్ష్య నేత్రై రమరై స్సురేశా ఞ్చత్రూ9 హనిష్యామి గతజ్వరా స్థ్స.

కుమారః: కం వః కామం ప్రయచ్చామి భవతాం బ్రూత నిర్వృతాః. 19

యదప్యసాధ్యం హృద్యం వో హృదయే చిన్తితం పరమ్‌ l

ఇత్యుకాస్తు సురాస్తేన ప్రోచుః ప్రణతమౌళయః. 20

సర్వ ఏవ మహాత్మానం గుహం తద్గతమానసాః l

అమరులు చేసిన కమార స్తుతి.

గొప్ప కాంతిగలవాడును దానవులను నశింపజేయువాడును నూతన రవి బింబతేజుడును కాలరూపుడునునగు కుమారునకు స్కందునకు షణ్ముఖునకు నమస్కారము. నానా భరణములను ధరించినవాడును లోకముల కధిపతియు లోక పోషకుడును రణమునందు దారుణులగు వారినికూడ చీల్చువాడును రవి సమానతేజుడును యోగులగు తప్ప ఎరుక పడని రహస్య స్వరూపుడును దేవసేనా రక్షకుడును అగు నీకు నమస్కారము. లోకముల భయము పోగొట్టువాడునుకృపా వరుడును విశాలములయి దీర్ఝములగు నేత్రములు కలవాడును మహా శ్రేష్ఠవ్రతుడు (వ్రతము=కర్మము-కృత్యము)ను అగు బాలుడగు విశాఖునకు నమస్కారము. మనస్సులకానందకారుడును సద్గుణములచే అందర మించినవాడును ప్రకాశించు మయూరము వాహనముగా గలవాడు భుజకీర్తుల ధరించినవాడును నగు నీకు వందనము. భయంకరము ఉన్నతము నగు పతాక ధరించినవాడు ప్రభావశాలురచేత కూడ ప్రణామములందుకొనునవాడు ఘంటను దరించినవాడు వీర్య శాలి క్రియా పరులగు (పురుష కారము చేయుచుండు) వారికై జన్మించిన మంగళ స్వరూపుడు అగు నీకు నమస్కారము. యజ్ఞపతియగు కుమారుని యజ్ఞ (హవిర్గ్రహణ) పరులగు ఇంద్రాదులు ఇట్లు స్తుతించి నమస్కరించిరి. అంత షణ్యఖుడగు గుహుడు నంతుష్టుడయి ఆ ఇంద్రాదులగు దేవ శ్రేష్ఠులను అమలములగు నేత్రములతో చూచి ఇట్లు పలికెను: మీరు హృదయ సంతాపములను విడువుడు. మీ శత్రవుల చంపుదును. (నామాటతో) సంతృప్తి చెంది మీరు మీకేమి కోరిక నేను తీర్చవలయునో చెప్పుడు . మీ హృదయ సంకల్పితము- అది మీకింపయినచో చాలును- అది ఎంత అసాధ్యమయినను గొప్పదయినను తీర్చెదను. అనగా దేవతలు నమస్కారముతో శిరస్సు వంచి మనస్సుతని యందే నిలిపి అందరును మహాత్ముడగు గుహునితో ఇట్లనిరి.

దేవాః: దైత్యేన్ద్రస్తారకో నామ సర్వామరకులాన్తకృత్‌. 21

బలవాన్దుర్జయో దుష్టో దురాచారో7తికోపనః l తమేవ జహి హృద్యో7ర్థ ఏషో7స్మాకం భయావహః. 22

ఏవముక్త స్తథేత్యుక్త్వా సర్వామరపదానుగః l జగామ జగతాం నాధః స్తూయమానో7మరేశ్వరైః. 23

తారకస్య పధార్థాయ జగతాం కణ్టకస్య వై l తతశ్చ ప్రేషయామాన శక్రో లబ్ధసమాశ్రయః. 24

దూతం దానవసింహస్య పురుషాక్షరవాదినమ్‌ l స తు గత్వా7బ్రవీద్దైత్యం నిర్భయో భీమదర్శనః .25

దూతః: శక్రస్త్వామాహ దేవేశో దైత్యకేతో దివస్పతిః l తారకాసుర తచ్చ్రుత్వా ఘట శక్త్యా యథేచ్చయా. 26

యజ్జగద్దళనాదాప్తం కిల్బిషం దానవ త్వయా l తస్యాహం శానకస్తే7ద్య రాజాసటిభువనత్రయే. 27

సూతః: శ్రుత్వైతద్ధూతవచనం క్రోధ సంరక్తలోచనః l ఉవాచ దూతం దుష్టాత్మా నష్ప ప్రాయవిభుతికః. 28

తారకుడను దైత్యేంద్రుడున్నాడు. వాడు సర్వదేవతా సమూహ నాటశకుడు; బలవంతుడు-దుర్జయుడు-దుష్టుడు. దురాచారుడు-అతి కోపవంతుడు; మాకు భయము కలిగించుచున్నాడు. వానిని చంపుటయే మా హృదయమందున్న కోరిక; అది తీర్చి వానివలన మా భయము పోగొట్టుము. అనగా కుమారుడు సరే ఆనెను. మరియు ఆ జగన్నాదుడు సర్వామరులును తన వెంటరాగా అమరేశ్వరులెల్ల జయ ధ్వనులతో తను స్తుతించుచుండ లోక కంటకుడగ తారకుని వధింప బయలుదేరెను. తనకు ఇంతటి సమశ్రయము దొరకుటతో ఇంద్రుడును దానవసింహుడగు తారకుని కడకు పరుషాక్షరములతో మాటాడగల దుతను పంపెను. భయంకర రూపముగల ఆ దూతము వాని కడకపోయి నిర్భయుడై ఇట్లు పలికెను: తారకా! దేవేశుడు స్వర్గవతియగు ఇంద్రుడు (నా ద్వారమున నీతో ) ఇట్లు చెప్పుచున్నాడు; అది విని ఇచ్చకును శక్తికిని తగినట్లు చేయుము. '' దానవా! నీవు లోకములను చీల్చ (బాధ కలిగించి) పాపము సంపాదించితివి. భువనత్రయ పాలకుడనగు నేను ఇపుడు నిన్ను అదుపులో ఉంచెదను.'' (ఇది ఇంద్రుని సంపదేశము). తన విభవమంతయు చాలవరకు అప్పటికే నశించియున్న దుష్టాత్ముడు అ తారకుడు దూత వచనము వినిక్రోధ సంరక్త నేత్రుడయి ఇట్లనెను:

తారకః: దృష్టం తే పౌరుషం శక్ర రణషు శతశో మయాl నిస్త్రవత్వాన్న తే లజ్జా విదగతే శక్ర దుర్మతే. 29

సూతః: ఏవముక్తే గతే దూతే చిన్తయామాన దానవఃl నాలబ్దసంశ్రయశ్శక్రో వక్తుమేవం హి చార్హతి. 30

జిత స్స శక్రో నో7కస్మాజ్జాయతే సంశ్రయాశ్రయః l నిమిత్తాని చ దుష్టాని సో7పశ్య న్నాశ##వేదినః. 31

పాంసువర్షమసృక్పాతం గగనాదవనీతలే l భుజనేత్ర ప్రకమ్పంచ వక్త్రశోషం మనోభ్రమమ్‌. 32

స్వకాన్తావక్త్ర పద్మానాం వ్లూనతాం చావలోకయత్‌ l దుష్టాంశ్చ ప్రాతినో రౌద్రాన్త్సోపశ్య ద్దుష్టవేదినః. 33

తదచిన్త్యైవ దితిజో న్యస్త(స్వస్థ) చిత్తోభవత్షణాత్‌ l యావద్గజఘటాఘణ్టారణత్కారరవోత్కటామ్‌. 34

తావత్తురజ్గసజ్ఝాత క్షుణ్ణభూ రేణు పిఞ్చరామ్‌ l సైన్యై స్సేనాబలో దగ్రధ్వజరాజివిరాజితమ్‌. 35

విమానైశ్చాద్బుతాకారై శ్చలితామరచామరైః l తాం భూషణనిబద్ధాంచ కిన్నరోద్గీతనాదినీమ్‌ . 36

నానానాకతరూత్పుల్లకుసుమాపీడధారిణీమ్‌ l వికోశాస్త్ర పరిష్కారాంవర్మనిర్మలదర్శనామ్‌. 37

వన్ద్యుద్ఝుష్టస్తుతిరవాం నానావాద్య నినాదితామ్‌ l సేనాం నాకసదాం దైతగః ప్రాసాదస్థో వ్యలోకయత్‌. 38

చిన్తయామాస స తదాకి ఞ్చదుద్భ్రన్తమానసఃl అపూర్వః కోభ##వేద్యోద్దాయో మయా న వినిర్జితః. 39

తతశ్చిన్తాకులో దైత్యశ్శుశ్రువే వికటాక్షరామ్‌ l సిద్ధవన్దిభిరుద్ఝష్టమిదం హృదయదారణమ్‌. 40

శక్రా! నేను వందలమారులు రణమున నీపౌరుషమును చూచితిని. దుర్మతివి; నీకు బిడియమును సిగ్గును రెండునులేవు. కనుక ఇట్లు మాటాడుచున్నావు; అని తారకుడు పలుకగావిని దూత వెడలిపోయెను. తరువాత అదానవు డిట్లాలోచించెను: ''ఏదియో అశ్రయము పొందియుండును.'' ఇట్లను కొనుచుండగనే వానికి (తమ) నాశమును తెలుపు దుర్నిమిత్తములును కనబడెను. ధూళివాన-రక్తపాతము ఆకసమునుండి నేలపై పడుట-(ఎడమ) భుజము నేత్రము అదరుట నోరు ఎండుట మనోభ్రమము తన భార్యల ముఖ పద్మములు (అకారణముగా) వాడిపోవుట దుష్టప్రాతులు మరింత రౌద్రరూపములగుట- దుష్ట సూచనలు ఇట్టివి వానికి కనబడెను. ఐనను వాడు వానిని లెక్కపెట్టక క్షణములో స్వస్థచిత్తుడై ఈ విషయములను ఆలోచించుట మానెను. అంతలో వాడు తన ప్రాసాదము నారోహించగా వానికి దేవసేన కనబడెను. అది గజముల మందల ఘంటల ఘణత్కారరవముతో హద్దుమీరి గుర్రముల గుంపులు నలగగొట్టిన భూమి రేణువులతో ఎరుపుకలిసిన వర్ణము కలిగి సేనా బలములతోను భయము గొల్పు ధ్వజముల శ్రేణులతోను ప్రకాశించుచు నుండెను. ఇంకను అ సేన ఆశ్చర్యము గొలుపు అకృతిగల విమానములును కదలుచున్న చామరము లును భూషణాలంకార నిబంధములను కిన్నరులుబిగ్గరగా పాడుపాటలు అనేకములగు స్వర్గీయ వృక్షములందు పూచినపూలతో కూర్చిన కొప్పులు ఒరనుండి బయటకు తీసిన ఖడ్గాద్యాయుధాలంకార శోభలు వంది జనులు బిగ్గరగా పాడుస్తోత్రముల ధ్వనులు నానా వాధ్య ధ్వనులుకలిగి ఉండెను.

ఇది చూచి తారకుడు కొంచెముగా తన మనస్సు ఉద్ర్భస్తము కాగా నాచే ఓటమి తినని క్రొత్త యోధుడు ఎవ్వడై యుండును? అని ఆలోచించుచు కలత నొందసాగెను. ఇంతలో వానికి వికట పరుషాక్షరములతో సిద్ధ (దేవతాజాతి) వందిజనులు బిగ్గరగా పాడుచుండిన హృదయ దారణమగు ఈ ''గాథ'' వినబడెను:

ఆథ గాథా

జయాతుల శక్తిదీధితిపి ఞ్జర- భుజదణ్డచణ్డరణరభస- సురవదన కుముదకాననవికాసనేన్దో-కుమారవర- జయ దితిజకులమహో దధిబడబానల- షణ్ముఖ- మధురరవమయూర రథ- సురముటుట కోటిఘట్టిత చరణసఖాజ్కురమహసన- జయ లలితచూడాక లాపవనమిమలదళ కమలకాన్త- దైత్యేశవంశదుస్సహదావా నల- జయ విశాఖ విభో-జయ బాల సప్తవాసర- దేవ సేనానాయక జయ సకలలోకతారక-స్కన్ద-జయ గౌరీ నన్దన-ఘణ్టాప్రియ-ప్రియ-విశాడ- విభో ధృతపతాక ప్రకీర్ణ ప్రచలకనకభూషణభాసుర దినకరచ్ఛాయ - జయజనితసమ్భ్రమలీలాలూనాఖిలారాతే - జయ సకలలోకతారక- దితిజాసురవరతారకాన్తక-జయ భువనావళిశోక వినాశన!

ఇతి శ్రీమత్స్యమహాపూరాణ దేవాసుర సజ్గ్రామే తారకకాతదేవ సేనా7

వలోకనకథనం నామ అష్టవ ఞ్చా శదుత్తరశతతమో7ధ్యాయః.

గాథార్థము

సాటిలేని శక్తియను అయుధపు కాంతులతో పింజరవర్ణుడా! భుజదండములతో భయంకరమగు యుద్దావేశము కలవాడా! దేవతా ముఖములనెడు కలువలకు వికాసము కలిగించు చంద్రా! కుమారులలో శ్రేష్ఠుడా! నీకు జయము; దైత్యవంశ మహ సముద్రమునకు బడబాగ్నీ! షణ్మఖా! మధుర ధ్వనిగల నెమిలిని పూనిచిన రథము కలవాడా! దేవతల కిరీటముల కొనలతోనలిగిన కాలి గోళ్ళ మొలకలతో కూడిన మహాపీఠము కలవాడా! నీకు జయము; సుందరమగు వెంట్రుకల కొప్పను కమల వనమందు ఉండిన విమల దళములుకల కమలములతో అందమగువాడా! దైత్యరాజు వంశమునకు సహింపరాని దావాగ్నీ! నీకు జయము; ప్రభూ!విశాఖా! ఏడు దినముల పసినాడా! సకలలోక తారకా!స్కందా! గౌరీనందనా! ఘంటాప్రియా! ప్రియా! విశాఖా!విభూ!దేవ సనానాయకా! పతాకకలను దాల్చినవాడా! చెదరిపోయి మిగుల కదలుచున్న బంగారు సొమ్ములతో ప్రకాశించువాడా! సూర్యతేజస్కా ! నీకు జయము; యుద్ధ సంభ్రమమున అవలీలగా (ఆటగా) నమస్త శత్రువులను ఖండించువాడా! సకల లోక తారకా! ధితి సంతానమగు అసురులలో శ్రేష్ఠుడగు తారకునకు యముడా! భువన నమూహ శోక వినాశనా! జయము.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున దేవాసుర సంగ్రామమున తారకుడు దేవసేనను చూచుయను

నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters