Sri Matsya mahapuramu-2    Chapters   

పఞ్చ పఞ్చాశదుత్తరశతతమో7ధ్యాయః

ఆడినామాసురవధాదికథనమ్‌.

సూతః : దేవీం చాపశ్యదాయాన్తీం సఖీం మాతుర్విభూషితామ్‌ |

కుసుమామోదినీం నామ తస్యశైలస్య దేవతామ్‌. 1

సాపి దృష్ట్వా గిరిసుతాం స్నేహవిక్లబమానసా | క్వ పుత్త్రి గచ్ఛసీత్యుచ్చైరాలిజ్గ్యోవాచ దేవతామ్‌. 2

సాచాసై#్య సర్వమాచఖ్యౌ శఙ్కరాత్కోపకారణమ్‌ | పునాశ్చోవాచ గిరిజా దేవతాం మాతృసమ్మితామ్‌. 3

ఉమా : నిత్యం శైలాధిరాజస్య దేవతా త్వమనిన్ధితా | సర్వతస్సన్నిధానం తే మమచాతీవ వత్సలా. 4

అతస్తు తే ప్రవక్ష్యామి యద్విధేయం త్వయా ధియా | అన్యస్త్రీసప్ప్రవేశశ్చ త్వయా రక్ష్యంః ప్రయత్నతః 5

రహస్యత్ర ప్రయత్నేన చేతసా సతతం గిరౌ | పినాకినః ప్రవిష్టాయాం వక్తవ్యం మే త్వయాన7ఘే. 6

తతో7హం సంవిధాస్యామి యత్కృత్యం దతనన్తరమ్‌ |

ఇత్యుక్తా తాం తథేత్యుక్త్వా జగామ స్వం గిరిం శుబా. 7

ఉమాపి పితురుద్యానం జగామాద్రిసుతా ద్రుతమ్‌ | అన్తరిక్షం సమావిశ్య మేఘమాలావిలప్రభమ్‌. 8

తరౌ విభూషణాన్న్యస్య వృక్షవల్కలధారణీ | గ్రీష్మే పఞ్చాగ్నిసన్తప్తా వర్షాసు చ జలోక్షితా. 9

వన్యాహారా నిరాహారా శుష్కస్థణ్డిలశాయినీ | ఏవం సాధయతీ దేహు తపసా సంవ్యవస్థితా. 10

నూట ఏబదియైదవ అధ్యాయము.

ఆ దానవుడు అంతఃపురము ప్రవేశించి ఈశ్వరునిచే మడియుట.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెనుః తపము చేయపోవుచున్న పార్వతీదేవికి అలంకృతయై తన వయిపునకు వచ్చుచున్న కుసుమామోదిని యను ఆ పర్వతమునందలి యొక దేవత కనబడెను. ఆమె పార్వతి తల్లియగు మేనా దేవికి సఖి; ఆమె గిరిపుత్త్రిని చూడగనే స్నేహ పరవశమానసయై గట్టిగ నామెను కౌగిలించుకొని బిడ్డా! ఎక్కడకు పోవుచున్నావనెను. అ గిరిజయు ఆమెకు శంకరుని వలన తనకు కోప కారణముగా కలిగిన అవమాన విషయము చెప్పి ఇంకను ఇట్లనెను: నీవు దేవతవు మాత్రమే కాక నాకు తల్లి వంటిదానవు; ప్రశంసింపదగిన గుణవతివి; అనింధితవు; ఈ శైలాధి రాజమందు ఉండు దేవతవు; ఈ పర్వతమే నీ సన్నిది; నాపై నీకు వాత్సల్యమధికము; ఇందుచేతనే నీవు బుధ్దితో యోజించి చేయవలసిన పనియొకటి చెప్పుచున్నాను. అన్యస్త్రీలు ఇట ప్రవేశించకుండ నీవు ప్రయత్నపూర్వకముగ రక్షించవలయును, ఇది రహస్య ప్రదేశము; ఇతరులు ఇట చొచ్చినను నీకు తెలియకపోవచ్చును; కనుక నీవు ఈ గిరియందు సదా అవధానముతో నుండవలెను. ఈ శివాంతఃపురమున ఏ స్త్రీయైన ప్రవేశించినచో పూజ్యురాలా! నీవు నాకు చెప్పవలెను. తరువాత నేను తగిన విధమున చేయుదును; అనగా ఆ కుసుమామోదిని యను శుభరూప నరేయని తన నివాసమగు పర్వత భాగమునకు పోయెను; అద్రి సుతయగు ఉమయు త్వరగ తండ్రి యుద్యానమున కేగెను. మేఘమాలతో మలినమగు (నల్లని) కాంతిగల అంతరిక్ష భాగమును చేరి అమె తన విభూషణములుచెట్ల నారలు ధరించెను. గ్రీష్మర్తువున పంచాగ్ని నంతప్తయగుచు వర్షర్తువున నీటితో తడియుచు వన్యాహారములనే తినుచు నిరాహారగానే గడుపుచు శుష్కమగు (ఏ పడకలును లేని) నేలపై పండుకొనుచు ఇట్లు దేహమును సాధన చేయుచు తపస్సుతో ఆమె నియవంతురాలయ్యెను.

పార్వతీరూపధారిణః ఆడినామకాసురస్స ఈశ్వరాన్తఃపురప్రవేశః

జ్ఞాత్వా గతాం గిరిసుతాం దైత్యస్తత్రాన్తరే బలీl అన్ధకస్యసుతో దృప్తః పితుర్వధమనుస్మర9.11

దేవా న్త్సర్వాన్విజిత్యాజౌ బకబ్రాతా రణోత్కటః l ఆడిర్నామాన్తర ప్రేక్షీ సతతం చన్ద్రమౌళినః. 12

ఆజగామామరరిపుః పురం త్రిపురఘాతినః l స తత్రాగత్య దదృశే వీరకం ద్వార్య వస్థితమ్‌ . 13

విచిన్త్య సోపి స్వవరం దత్తం కమలయోనినా l హతే తదాన్ధకే దైత్యే గిరిశేనామరద్విషి. 14

ఆడిశ్చకార పరమం తపః పంమదారుణమ్‌ l తమాగత్యా బ్రవీద్బ్రహ్మా తపసా పరితోషితః 15

కిమాడే దానవశ్రేష్ఠ తపసా ప్రాప్తుమిచ్ఛసిl బ్రహ్మాణమాహ దైత్యస్తు నిర్మృత్యుత్వ మహం వృణ. 16

బ్రహ్మాః న కశ్చిచ్చ వినా మృత్యుం నరో దానవ విద్యతే l

యతస్తతో7పి దైత్యేన్ద్ర మృత్యుః ప్రాప్యశ్శరీరిణా. 17

ఇత్యుక్తో దైత్యసింహస్తు ప్రోవాచామ్బుజసమ్భమ్‌l రూపస్య పరివర్తో మే యదా స్యాత్పద్మసమ్భవ. 18

తదా మృత్యుర్మమ భ##వేదన్యథా త్వమరో హ్యహమ్‌ l ఇత్యుక్తస్తు తదోవాచ తుష్టః కమలసమ్బవః. 19

యదా ద్వితీయో రూపస్య నివృత్తిస్తే భవిపష్యతి l తదా తే భవితా మృత్యురన్యధా న భవిష్యతి . 20

ఇత్యుక్తో7మరతాం మేనే దైత్యస్స సుమహాబలః l తస్మిన్కాలే తు సంస్కృత్య తద్వధోపాయమాత్మనః.

పరిహర్తుం దృష్టిపథం వీరకస్యాభవత్తదా l భుజజ్గరూపి రన్ధ్రేణ ప్రవివేశ దృశః పథమ్‌. 22

పరిహృత్య గణశస్య దానవో దేవదుర్జయః l అలక్షితో గణశేన ప్రవిశ్యాథాపరాం తనుమ్‌ 23

భుజజ్గరూపం సన్త్యజ్య బభూవాథ మహాసురః l ఉమారూపీ చ్ఛలయితుం గిరిశం మూఢచేతనః 24

కృత్వోమాయాస్తతో రూపమప్రతర్క్యం మనోహరమ్‌ l సర్వావయవసమ్పూర్ణం సర్వాభిజ్ఞాన సంవృతమ్‌. 25

కృత్వా భగాన్తరే దన్తాన్దైత్యో వజ్రోపమాన్దృఢా9 l తీక్‌ణ్షాగ్రాన్భుద్ధిమెహేన గిరిశం హన్తుముద్యతః. 26

ఈ నడుమ కాలములో ఆడి అను దైత్యుడు పార్వతి ఇట్లలిగిపోయిన విషయము తెలిసికొనెను. వాడు చాల బలశాలి; అంధకాసురుని కొడుకు; బకునికి అన్న ;చాలగర్వి; యుద్ధమున దేవతలనందర జయించినవాడు; యుద్దమున ఎదురు లేనివాడు; తన తండ్రియగు అంధకుని శివుడు చంపుటచే ఆపగ బూనినవాడు; చంద్రమౌశిపై కసి తీర్చుకొన వేచియండెను. వాడిపుడిది ఎరిగి శివుని యంతః పురమునకు రాగా వానికి ద్వారమరదు వీరకుడు కనకబడెను. అపుడు వానికి మునుపు బ్రహ్మ తనకిచ్చిన వరము గురుతునకు వచ్చెను. ఆ వర కథ ఇది ; పూర్వము శివుని చేతిలో అంధకుడు చచ్చిన తరువాత ఈ ఆడి పరమదారుణమగు ఉత్తమ తపమాచరించెను. బ్రహ్మ మెచ్చి దానవశ్రేష్ఠా! ఆడీ! ఈ తపఃఫలముగా నీకేమి కావలయుననెను. మృత్యువు నాకుండరాదని వాడన బ్రహ్మ దానవా! మృత్యుపు లేని ప్రాణి ఏదియు లేదు. ఏదో సమయమున ఏదోయొక దానినుండి ప్రాణి మరణించి తీరును. అనగా ఆ దైత్యసింహుడు పద్మభవునితో పద్మ నంభవా !నాకు రూప పరివర్తనము కలిగినపుడు నాకు మరణము కలుగవచ్చును. లేనిచో నేనమరుడనే కావలయును. అనెను. అది విని తుష్టుడై కమలభవుడు నీకు రూప పరివృత్తిచే రెండవ రూపము కలిగినచో మృత్యువు కలుగును. లేనిచో కలుగదు. అనెను. దీనితో తనకు అమరత్మము లభించెనని సుమహాబలుడు అగు ఆ దైత్యుడు తలచెను. ఇపుడు వానికి ఇతరులు తను చంపుటకు ఇది యుపాయమైనదియని తోచియు వీరకుని దృష్టి మార్గమునుండి తప్పించుకొనదలచి సర్పరూపుడై ఒకానొక రంధ్రమునుండి వాడంతఃపురములోన ప్రవేశించెను- ఇట్లు ఆ గణశుని దృష్టి మార్గమునుండి తప్పుకొని దేవతలకు జయింనలవియేకాని ఆ ఆడి దానవుడు వీరకునకు కనబడకుండ లోన ప్రవిష్ణుడై ఆట భుజంగ రూపము విడిచెను. ఆ మూఢచిత్తుడు శివుని మోసగింపదలచి ఉమారూపియయ్యెను. వాడు ఊహింపనలవి కాని యంత సరిగా మనోహరమగు ఉమారూపము దాల్చెను. అది ఆమెకు గల అన్ని గుర్తులు పైకి కనబడుచున్నది; సర్వావయవ సంపూర్ణము; (అన్ని ఆంశములందు పార్వతిని పోలియుండెను.) వాడు తన బుద్ధి మోహముచే గిరిశుని చంపుట కుద్యతుడై తన రహస్యాంగమున వజ్రమువంటి వాడ మొనలుగల దృఢదంతముల నమర్చుకొనెను.

కృత్వోమారూపసంస్థానంగతో దైత్యోహరాన్తికమ్‌ l యోషారమ్యాకృతిశ్చిత్రభూషణామ్బరభూషితః. 27

తాం దృష్ట్వా గిరిశస్తుష్టస్తదాలిజ్గ్య మహాసురమ్‌ l మన్యమానో గిరిసుతాం సర్వైరవయవాన్తరైః. 28

అపృచ్ఛత్సాదు తే భావో గిరిపుత్త్రి న కృత్రిమః l యా త్వం మదాశయం జ్ఞాత్వా ప్రాప్తేహ వరవర్ణినీ. 29

త్వయా విరహతశ్శూన్యం మన్యమానో జగత్త్రయమ్‌ l ప్రాప్తా ప్రసన్నవదనే యుక్తమేవంవిధం త్వయి.

ఇత్యుక్తో దానవేన్ద్రస్తు తం బభాషే స్మయఞ్చనైఃl న చాబుద్ధ్యదభిజ్ఞానం ప్రాయస్త్రిపురఘాతినః. 31

దైత్యః: యాతాస్మ్యహం తపః కర్తుం వాల్లభ్యాయ తవాతులమ్‌ l

రతిశ్చ తత్ర మే నాభూత్తతః ప్రాప్తా త్వదన్తికమ్‌. 32

ఇత్యుక్తశ్శజ్కరశ్శజ్కాం కాంచిత్ప్రాప్యావధారయత్‌ l హృదయేన సమాధాయ దేవః ప్రహసితాననః 33

కుపితా మయితన్వజ్గీ ప్రకృత్యాచ దృఢవ్రతాl అవాప్తకామా సమ్ప్రాప్తా కిమెతత్సంశయో మమ. 34

ఇది చిన్త్య హర స్తస్యా హ్యభిజ్ఞానం విధారయ9 l నాపశ్యద్వామపార్శ్వేతు తదజ్గే పద్మలక్షణమ్‌. 35

లోమావర్తతంతు రచితం తతో దేవః పినాకధృక్‌ l అబుద్ధ్యద్దానవీం మాయామాకారం గూహయంన్తతః. 36

మేఢ్రే వజ్రాస్త్రమాదాయ దానవం తమసూదయత్‌ | అబుద్త్యద్వీరకో నైవ దానవేన్ద్రం నిఘాదితమ్‌. 37

హరేణ సూదితం దృష్ట్వా స్త్రీరూపం దానవేశ్వరమ్‌ l ఆపరిచ్ఛిన్నతత్త్వార్థా శైలపుత్య్రై న్యవేదయత్‌. 38

దూతేన మారుతేనాశుగామినా నగదేవతా l శ్రుత్వా వాయుముఖాద్దేవీ క్రోధరక్తావిలేక్షణా. 39

అశపద్వీరకం పుత్త్రం హృదయేన విదూయతా. 39u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవాసురసజ్గ్రామే ఈశ్వరకృతాన్దకాసురనన్దనాడి

నామకాసురవధాదికథనం నామ పఞ్చవఞ్చశదుత్తర శతతమో7ధ్యాయః.

తరువాత ఆదైత్యుడు ఉమారూప సంస్థానము (అమరిక)తో హరుని సమీపమునకేగెను. వాడిపుడు చిత్ర (అశ్చర్యకర) వస్త్ర భూషణములు భూషించుకొని రమ్యమగు స్త్రీరూపముతోనున్నాడు. ఆమెను చూచి గిరిశుడు తుష్టుడై వెంటనే ఆ మహాసురునాలింగనము చేసికొనెను. సర్వావయవ లక్షణములబట్టియు ఆమె గిరిసుతయే యని అతడు తలచెను- గిరిపత్త్రీ! ఇపుడు నీ భావము కృత్త్రిమముకాక (నిర్మలమై) యున్నదికదా! వరవర్ణనీ! ఉత్తమసుందరీ! నీవు నాయాశయము గ్రహించుటయే అందులకు ప్రమాణము; నీవు లేక నాకు జగత్త్రయమును శూన్యమై తోచెను. ఇట్టితరి నీవు నాకడకు వచ్చితివి; నీకు ఇది (నాపైఇంత ప్రీతి) తగినదే సుమా! శివుడిట్లు పలుక దానవుడు మెల్లగ నవ్వుచు మాటాడ సాగెను; ఏలయన శివునకు మాత్రమే తెలిసిన పార్వతీ చిహ్నములు కొన్ని వానికి తెలియవు; వాడిట్లనెను: నీప్రీతిలభించుటకై సాటి లేని తపమాచరించి సాగితినే కాని అచ్చట నాకు మనస్సునకు హాయి కలుగలేదు. అందుచే నీకడకు వచ్చితిని. ఈ మాటవిని శంకరునకు ఒకానొక శంక కలిగి అది నిర్ణయించుకొనదలచి ఆదేవుడు చిన్నగా నవ్వుచున్న మోముతోను దృఢనిశ్చయముతోను ఇట్లనుకొనెను. సుందరియగు పార్వతి నాపైకుపితయై వెళ్లెను. స్వభావముచే ఆమె దృఢవ్రత; కావున ఆమె తాను కోరిక తీర్చుకొనియే వచ్చెనా? అని నాకు నంశయము కలుగుచున్నది. అనుకొనుచు ఆమెకు ఉండు గుర్తులన్నియు పరీక్షించి నిర్ణయించుకొన దలచెను. పరికించి చూడగా ఆమె ఎడమవైపున ఉండవలసిన పద్మాకారపుసుడి ఈస్త్రీకి లేదు. దానితో ఇది దానవ మాయయని శివుడు గురుతించెను. అయినను తన హృదయ గత భావమాకారమున కప్పిపుచ్చుకొని తన రహస్యావయవమున వజ్రాస్త్రమిముడ్చుకొని అ దానవుని సంహరించెను. ఈ యంశము లేవియు వీరకు నకు తేలియవు. హరుడు స్త్రీరూపుడు అగుదాననేళ్వరుని చంపుట చూచియు పర్వతధేవత తనకు వాన్తప విషయము (అది దానవుని మోసమనియు వాడు లోనికి పోవుటలో వీరకుని దోషములేదనియ) ఎరుగకుయే శీఘ్రగామి కావున వాయుదేవుని దుతగాచేసి ఈ విషయమును శైలపుత్రికి తెలిపెను. అదివిని పార్వతిక్రోధరక్తాక్షయై మనస్సున నొప్పి పడుచు తన పుత్రుడగు వీరకుని ఇట్లు శపించెను.

ఇది శ్రీ మత్స్యమహాప పురాణమున దేవాసుర సంగ్రామమున

అడిదైత్య వధమను నుటఏబదియైదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters