Sri Matsya mahapuramu-2    Chapters   

చతుఃపఞ్చాశదుత్తరశతతమో ధ్యాయః

పార్వతీశరీరకాళిమవిషయకః పరమేశ్వరకృతపరిహాసః.

ఈశ్వరః : శరీర మమ తన్వఙ్గి సితే భాస్యతితే ద్యుతిః | భుజజ్గీవాసితా శుద్దా సంశ్లిష్టా చన్దనే తరౌ. 1

చన్ద్రాత పేన సమ్పృక్తా రుచిరామ్బరయా తథా| రజనీవాసితే పక్షే దృష్టిదోషం దదాసి మే. 2

ఇత్యక్తా గిరిజా తేన ముక్తకణ్ఠా పినాకినమ్‌ | ఉవాచ కొపరక్తాక్షీ భ్రుకుటీవికృతాననా. 3

దేవీ: స్వకృతేన జనస్సర్వో జాడ్యేన పరిభూయతే | అవశ్యమర్థాత్ప్రాప్నోతి ఖణ్డనం శశిమణ్డన. 4

తపోభిర్థీర్ఘచరితైర్యచ్చ ప్రార్దితవత్యహమ్‌ |తస్యా మే నియతన్త్వేష హ్యవమాన్‌ః పదేపదే. 5

నైవాస్మి కుటిలా శర్వ విషమా నైన దూర్జటే | సవిషన్త్వం గతః ఖ్యాతిం వ్యక్తం దోషాకరాశ్రయః.6

నాహం పూష్ణోపి దశనా నేత్రే చాస్మి భగస్య హి | ఆదిత్యశ్చ విజానాతి భగవాన్ద్వాదశాత్మకః. 7

మూర్ద్ని శూలం జనయసి సై#్వర్దోషైర్మామదిక్షిప&| యస్త్వం మామాహ కృష్ణేతి మహకాలేతి విశ్రతుః.8

యాస్యామ్యహం పరిత్యక్తుమాత్మానం తపసా గిరిమ్‌| నాస్తి మే జీవితే కృత్యం ధూర్తే పరిభూతయా.9

సూతః : నిశమ్య తస్యా వచనం కోపాత్తీక్షాక్షరం భవః | ఉవాచావిష్టసమ్భ్రాన్తిః ప్రణయే నేన్దు శేఖరః. 10

నూట ఏబది నాలుగవ అధ్యాయము

పార్వతి ఒడలి నలుపు విషయమున శివుడు ఆమెను పరిహసించుట.

'' సుందరీ| తెల్లగా ప్రకాశించు నాదేహమున నీ మేనిచాయ చందనవృక్షమును చుట్టుకొనిన నల్లని శుద్దమగు ఆడు త్రాచువలె నున్నది. మనోహరాకాశమున వెన్నెలతో కూడి కృష్ణపక్ష రాత్రివలె నాకు దృష్టి దోషము కలిగించుచున్నావు''. అనిన శివునితో పార్వతి కోపరక్త నేత్రయై కనుబొమ్మలు వికృతముగా ముడివేసి బిగ్గరగా ఇట్లనెను. ప్రతివాడును తన బుద్ధిమాంద్యముచే తానే అవమానపొందును. చంద్రభూషణా! యాచించిన వాడు ఖండనము (అవమానము) పొందక తప్పదు. ఏదో కోరి చిరకాలము నేనాచరించిన తపస్సునకు ఫలమీయవ మానము అడుగడున తగులుచున్నది. శర్వా! నేను కుటిలను కాను! ధూర్జటీ నేను విషమనుకాను; నీవు విషము (తలపై గంగా జలము- కంఠమున విషము) కలవాడువు; దోషాకరునకు (రాత్రిని ఏర్పరచు చంద్రునకు-దోషములకు గని యగు వానికి) ఆశ్రయుడవు; అని కీర్తిగాంచిన వాడవు; నేను పూషుడను ఆదిత్యుని దంతములును భగుడను ఆదిత్యుని కన్నులును కాను! ద్వాదశాత్ముడగు ఆదిత్యు(సూర్యు)నకును ఇది తెలియును. నీ తప్పుడు నీకు ఉండగా నన్ను నిందించు నీచే నాకు తలనొప్పిగా నున్నది; నన్ను కృష్ణ(నల్లనది) ఆనిన నీకు మహాకాలుడు (చాల నల్లనివాడు) అని ప్రసిద్ధి లేదా; తపస్సుచే దేహము త్యజింప నేను గిరికేగుచున్నాను. ధూర్తునిచే అవమానమందిన నాకు జీవితముతో పనిలేదు.

ఇట్లు కోపముతో తీక్షక్షరముగా పలికిన పార్వతి మాటలు విని తడబాటుతో మిశ్రమయిన అనురాగమున చంద్రశేఖరుడగు భవుడిట్లనెనుః

ఈశ్వరః : అనాత్మజ్ఞాసి గిరిజే నాహం నిన్దాపరస్తవ. 11

చాటూక్తిబుద్ద్యా కృతవాంస్తవాహం సర్మసంశ్రయమ్‌| వికల్పః స్వస్థచిత్తేపి గిరిజే నైవ విక్రియా. 12

యద్యేవం కుపితా భీరు త్వం తవాహం న వై పునః | నర్మవాదీ భవిష్యామి జహి కోపం శుచిస్మితే. 13

శిరసా ప్రణతేనైష రచితస్తే మయాఞ్జలిః | స్నేహేనాప్యవమానేన నిన్దితే నైతి విక్రియామ్‌.14

అనతాం న సతాం తస్మాన్నర్మస్పృష్టో జనః కిల | అనేకైశ్చాటుభిర్దేవీ దేవేన ప్రతిభోధితా. 15

కోపం తీవ్రం న తత్యాజ నతీ మర్మణి ఘట్టితా | అవష్టబ్ధమథాస్పోట్య వాసశ్శఙ్కరపాణినా. 16

వివర్యస్తాలకా వేగాద్యాతుమైచ్ఛత్తు శైలజా | తస్యా వ్రజన్త్యాః కోపేన పునరాహ పురాన్తకః. 17

జాతా సర్వైరవయవైస్సుతాసి సదృశీ పితుః | హిమాచలస్య శృజ్గైసై#్తర్మేషుజాలాకు లై ర్మనః. 18

తథా దురవగాహ్యేభ్యో గహనేభ్యస్తథాశయ్‌ | కాఠిన్యాఙ్కత్వమభ్యస్తంవనేభ్యో బహుధా గతమ్‌. 19

కుటిలత్వం హి వర్త్మభ్యో దుస్సేవ్యత్వం హిమాదిభిః సఙ్క్రాన్తంసర్వథైవైతత్తన్వజ్గి హిమభూధరాత్‌. 20

ఇత్యుక్తా సా పునః ప్రాహ గిరీశం శైలజా రుషా | కోపసంరక్తనయనా ప్రస్పురద్ధశనచ్ఛదా. 21

గిరిజా! నీవు పర్వతరాజ పుత్త్రివికదా| నా విషయము నీకు తెలియదు. నీవు నిన్ను నిందింతువా? నిన్ను ప్రశంసించు తలపుతోనే విలాసమునకైన ఆమాట అంటిని. స్వస్థ చిత్తము కలవానికి కూడ ఒకప్పు చిత్త వికారము కలుగవచ్చును కాని నా చిత్తమున కట్టి వికారము ( మార్పు) ఎన్నడును కలుగదు. కాని పిరకిదానా! ఒక వేళ నీకిందులకై కోపమే వచ్చినచో మరెన్నడో వినోదములు పలుకను; శుచిస్మితా!(నిర్మలమగు చిరునవ్వు కలదానవు కమ్ము) కోపము మానుము; దోసిలి వట్టి శిరసు వంచి నమస్కరించుచున్నాను. ఎంత స్నేహము కలవారైనను తను అవమానించినను నిందించినను వినోద వచనములు తగిలినను మనస్సు మార్పు పొందుట దుర్జనుల లక్షణము కాని నజ్జన లక్షణముకాదు. కాని శివుడనిన పై మాట దేవికి మర్మమున తాకుటచే ఆ తరువాత శివుడెంత బుజ్జగించినను నచ్చజెప్పినను ఆమె కోపము విడువలేదు. శంకరుడు చేతితో గట్టిగ పట్టిన వస్త్రపు కొంగు కూడ చట్టున కొట్టినట్లు వడలించు ఇట్లనెను. ''నీవు అన్ని అంశములందును నీ త్రడిని పోలిన కూతురవు; మేఘ సమూహములతో కల్లోలితముగా వ్యాప్తమయిన నీ తండ్రి శిఖరములతో నీ మనస్సును చొరశక్యముకాని అడవుల నుండి నీ హృదయమును ఏర్పడినవి; కఠినత్వము వనములందలి వృక్షముల నుండి నేర్చితివి; నీతండ్రియందలి త్రోవలనుండి వంకరలు నేర్చితివి; మంచు మొదటగువానినుండి ఎవరికిని సేవింపనలవి కాకపోవుట నీకబ్బినది. సుందరీ! ఇదియంతయు నీకు హిమవంతును నుండి సంక్రమించినది సుమా! అని శివుడు పలుక గిరిజ మరింత కోపముతో కన్నులెర్రవడగా పెదవులు వణుకుచుండ ఇట్లనెనుః

ఉమా: మా సర్వాన్దోషదానేన నిన్దాన్యాన్గణినో జనా& |

తే చాపి దుష్టసమ్పర్కాత్సఙ్క్రా న్తాస్సర్వ ఏవ హి. 22

వ్యాలేభ్యోధికజిహ్మత్వం భస్మనా స్నేహబన్ధనమ్‌ |

హృత్కాలుష్యం శశాజ్కాత్తే దుర్వచన్త్వం విషాదపి. 23

అత్రాస్తి కిం బహూ క్తేన అలం వాచా శ్రమేణ తే | శ్మశానవాసాన్నిర్భీస్త్వం నగ్నత్వాన్న తన త్రపా. 24

నిర్ఘృణస్త్వం కపాలిత్వాద్దయా తే విగతా చిరమ్‌|

సూతః: ఇత్యక్త్వా మన్దిరాత్తస్మాన్నిర్జగామ హిమాద్రిజా. 25

పార్వత్యాః గౌరీత్వప్రాప్వ్యర్థం తపోవనగమనమ్‌.

తస్యాం ప్రజన్త్యాం దేవేశగణౖః కిలకిలే కృతే | క్వ మాతర్గచ్ఛసీత్యుక్త్వా రుదన్తో ధావితాః పునః. 26

విష్టభ్య చరణౌ దేవ్యా వీరకో బాష్పగద్గదమ్‌ | ప్రోవాచ మాతః కింన్వేతత్క్వయాసి కుపితేన్తరా. 27

అహం త్వామనుయాస్యామి వ్రజన్తీం స్నేహవర్జితామ్‌ | నో చేత్పతిష్యే శిఖరాద్గిరేరస్య త్వయెజ్ఘితః. 28

ఉన్నామ్య వదనం దేవీ దక్షిణన తు పాణినా | ఉవాచ వీరకం మాతా మాశోకం పుత్త్ర భావయ. 29

శైలాగ్రాత్పతితుం నైవ న చ గస్తుం మయా సహ |

యుక్తం తే పుత్త్ర వక్ష్యామి యేన కార్యేణ తచ్ఛృణు. 30

కృష్ణేత్యుక్తా హరేణాహం స్తమ్భితం మే మనస్తదా|

సాహం తవః కరిష్యామి యేన గౌరీత్వమాప్నుయామ్‌. 31

ఏష స్త్రీలమ్పటో దేవో యాతాయాం మయ్యనన్తరమ్‌ | ద్వారరక్షా త్వయా కార్యా నిత్యం రన్ద్రానవేక్షిణా.

యథా న కాచిత్ప్రవిశేద్యోషిదన్నా హరన్తికం | దృష్ట్వాపరాం స్త్రీయం చాథం వదేథా మమ పుత్త్రక. 33

శీఘ్రమేవ కరిష్యామి యథా యుక్తమనన్తరమ్‌ | ఏవమస్త్వితి దేవీం స వీరకః ప్రాహ సామ్ప్రతమ్‌. 34

మాతురాజ్ఞామృతాహ్లాదప్లావితాజ్గో గతజ్వరః | జగామ కక్ష్యాం సన్ద్రష్టుం ప్రణివత్య తు మాతరమ్‌. 35

ఇతి శ్రీమత్య్యమహాపురాణ దేవాసురసజ్గ్రామే దేవ్యాస్తపోవనగమనం

నామ చతుః పఞ్చాశదుత్తరశతతమో ధ్యాయః.

''తప్పులారోపించి నద్గుణవంతులగు ఇతరులనెందులకు ఆడిపోసికొనెదవు? నీవనిన దోషణములును మాకు దుష్టసంనర్గము వలననే సంక్రమించినవి. (నీకుగల) సర్పములనుండి వంకరతనమును నీ భస్మముతో స్నేహమును గట్టిపరచుటయు ( బూడివద జిడ్డును స్నేహమును-తొలగించును.) నీ చంద్రుని వలన హృదయ మాలిన్యమును నీ కుత్తుక యందలి విషము వలన చెడు మాటలును మాకు వచ్చినవి; ఎక్కువ చెప్పవలసినదేమున్నది; నోటికి శ్రమ కలిగించు కొనవలదు; వల్లకాటియందు నివసించు నీకు భయమేమి? దినమొలతో నుండు నీకు సిగ్గేమి? తల పుర్రెలు పట్టుకొని తిరుగు నీకు దయ ఏమి? అదెప్పుడో పోయినది అని పలుకుచు హిమాద్రి పుత్త్రి ఆ మందిరమునుండి వెడలిపోసాగెను. పార్వతి యట్టు పోవుచుండ ప్రమథులు కిలకిల (దుఃఖ) ధ్వని చేసిరి. అమ్మా! ఎక్కడికి పోవుచున్నానవి ఏడ్చిరి. వెంట పరుగెత్తిరి. వీరకుడు దేవి పాదములు పట్టుకొని కన్నీటితో డగ్గుత్తికతో ఇట్లనెను; తల్లీ! ఇదియేమి? కోపించిన మనస్సుతో ఎక్కడికి పోవుచున్నావు? నీవు స్నేహము వరదలిపోవుచన్నను నేను నీవెంట వత్తును. లేక నీవు నన్ని%ు వదిలినచో ఈగిరి శిఖరమునుండి క్రింద పడెదను. అనగా దేవి తన కుడిచేతితో వీరకుని మొగమెత్తి (ప్రీతిచూపుచు) అతనితో ఇట్లనెను; నాయానా! శోకమును భావన చేయకుము. నీవు నావెంట వచ్చుటకాని పర్వతాగ్రమునుండి పడుట కాని తగదు. ఏ పనితో పోవుచున్నానో చెప్పద వినుము; హరుడు నన్ను నల్లని దానవనెను. దానితో నామనస్సు గట్టిపడినది; కనుక నేను తపమాచరించి గౌరత్వము (తెల్లదనము) పొందుదును. ఈ దేవుడు స్త్రీలంపటుడనిపించు చున్నది. కనుక నేను వెడలిన తరువాత నీవు ఎట్టివారికి ఏ ఆకాశమునీయక ద్వారరక్ష సేయుచుండవలయును. శివునికడకు అన్యస్త్రీ ఎవరును ప్రవేశింపరాదు. అట్లెవరైన ప్రవేశించినచో నాకు చెప్పుము తరువాత శీఘ్రమే నేను తగినట్లు చేయుదును. వీరకుడు వెంటనే సరే అనెను. తల్లి ఆజ్ఞ అమృతమయి కలిగించిన ఆహ్లాదముతో అతని సంతాపము తగ్గెను. శరీరమును మనస్సును చల్లనయ్యెను. అతడు వెంటనే అమ్మకు నమస్కరించి కక్ష్యాం తరమును కని పెట్టి చూచుటకై బయలుదేరెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున దేవాసుర సంగ్రామమున

దీవీ తపోవన గమనమును నూట ఏబది నాలుగవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters