Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకపఞ్చాశదుత్తరశతతమో7ధ్యాయః.

శ్రీవిష్ణుమథనాసురాదియుద్ధమ్‌.

సూతః : తస్మిన్వినిహతే దైత్యే గ్రసనేబలనాయకే | నిర్మర్యాదమయుధ్యన్త హరిణాసహదానవాః. 1

పట్టసైర్ముసలైఃప్రాసైర్గదాభిఃకుణికైరపి | తీక్ష్నాననైస్తునారాచై శ్చక్రైశ్శక్తిభిరేవచ. 2

తానస్త్రాన్విప్రముక్తాంశ్చ చిత్రయోధీజనార్ధనః | ఏకైకంశతధా చక్రే బాణౖరగ్నిశిఖోపమైః. 3

తతః క్షీణాయుధ ప్రాయా దానవా భ్రాన్తచేతసః | అస్త్రాణ్యాధాతుమభవ న్నసమర్థాయదారణ. 4

తదామృతైర్గజైరశ్వైర్జనార్దనమయోధయ& | సమన్తాత్కోటిశోదైత్యా స్సర్వతఃప్రత్యయోధయ&. 5

బహు కృత్వా రణంవిష్ణుః కిఞ్చిచ్ఛాన్తభుజోభవత్‌ | ఉవాచచగరుత్మన్తం తస్మింస్తుతుములేరణ. 6

గరుత్మస్కచ్చిదశ్రాన్త స్త్వమస్మిన్నైవసామ్ప్రతమ్‌ | యద్యశ్రాన్తోసి తద్యాహి మథనస్యరథంప్రతి. 7

శ్రాన్తోసిచ ముహూర్తంత్వం రణాదపసృతోభవ | ఇత్యుక్తో గరుడస్తేన విష్ణునా ప్రభవిష్ణునా. 8

ఆససాద రణదైత్యం మథనం ఘెరదర్శనమ్‌ | దైత్యస్త్వభిముఖందృష్ట్వాశజ్ఖక్రగదాధరమ్‌. 9

జఘాన భిణ్డివాలేన శితధారేణ పక్షసి | తంప్రహారమచిన్త్యైవ విష్ణుస్తస్మిన్మహాహవే. 10

జఘాన పఞ్చభిర్బాణౖ ర్మార్జితైర్లోహవాహిభిః | పునర్దశభిరాకర్ణకృష్టైర్గాడం స్తనాస్తరే. 11

విద్ధో మర్మసు దైత్యేన్ద్రో హరిం బాణౖరకమ్పయత్‌ | సముహూర్తం సమాశ్వస్య జగ్రాహ పరిఘంతదా. 12

జఘ్నే జనార్దనంచాపి పరిఘేణాగ్నివర్చసా | విష్ణుస్తేనప్రహారేణ కిఞ్చిదాఘూర్ణితోభవత్‌. 13

నూట ఏబది ఒకటవ అధ్యాయము.

విష్ణువు గరుడునితో కూడ పారిపోవుట.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను. సేనాపతియగు గ్రనసుడు నిహతుడు కాగానే దానవులు శ్రీహరితో కూడ మితిమీరిన యుద్ధముచేసిరి. పట్టనములను మునలములను స్రానములను గదలను కుణికములను వాడి మొనలుగల నారాచములను శక్తులను చక్రములను వారు వదలినను చిత్రయోధుడగు జనార్ధనుడు వాటినొక్కొక్క దానిని అగ్నిజ్వాలలవంటి బాణములతో నూరేసిగా ఖండించెను. అంతట దైత్యులు చాలవరకు తమ ఆయుధములు అయిపోవుటచే చిత్తములు భ్రాంతినొంది రణమున అస్త్రముల ప్రయోగించుటకు అసమర్థులు కాగానే వారు చచ్చిన ఏనుగులను గుర్రములను గొని గోవిందునితో యుద్ధమాడసాగిరి. ఇట్లు అన్నివైపులనుండి కోట్లకిలదిగ దైత్యులు అన్ని విధముల ఎదిరించి యుద్ధమొనర్పగా వారితో పోరిపోరి విష్ణుడు కొంచెము శ్రమచెందిన భుజములు కలవాడై ఆతుముల రణరంగమున గరుడునితో ''గరుత్మన్‌ ! నీవు ఇంతవరకీ యుద్ధమున శ్రమచెందనేలేదనుకొందును. ఇది నిజమైనచో మథనుని రథముకడకు (నన్ను తీసికొని) పొమ్ము. నీవును అలసితివా - ముహూర్తకాలము యుద్ధమునుండి తొలగి దూరముగ (నన్నును తీసికొని) పొమ్ము.'' అనెను. మహాసమర్థుడగు విష్ణుడిట్లు పలుకగా గరుడుడు ఘోరాకారుడగు మథనుని దగ్గరకు (విష్ణునితో) పోయెను.

ఆ దైత్యుడు తన ఎదుట శంఖచక్ర గదాధరుడుండుట చూచి వాడి వాదరగల భిండివాలముతో అతని వక్షమున కొట్టెను. విష్ణువామహాయుద్ధమున ఆప్రహారము లెక్కచేయకయే శుద్ధిచేయబడి లోహపు మొనలుకల ఐదు బాణములను మరల ఐదు బాణములను ఆకర్ణముగ ధనువు లాగి విడిచి వాని స్తనాస్తరమున ప్రయోగించెను. మర్మములందు దెబ్బలు తిని ఆ దైత్యేంద్రుడు హరిని బాణములతో కంపింపజేసెను. వాడొక ముహూర్తకాలము విశ్రాంతినొంది అగ్ని తేజస్కమగు పరిఘను గొని జనార్దనుని కొట్టెను. విష్ణువాదెబ్బతో కొంచెము దిమ్మరపోయెను.

తతఃకొపవివృత్తాక్షో గదాం జగ్రాహమాధవః | మథనస్య తయామేషం నిష్పిపేషాథశాశ్వతః. 14

మేషాత్పపాత దైత్యేన్ద్రః క్షయకాలేచలో యథా | తస్మిన్నిపతితే భూమౌ దానవే వీర్యశాలిని. 15

అవసాదంయయు ర్దైత్యాః కర్మణ్యకాకినోయథా | తతస్తేష్వవసన్నేషు దానవేష్వభిమానిషు. 16

ప్రకోపాద్రక్తనయనో మహిషో దానవేశ్వరః | ప్రత్యుద్య¸°రణంరౌద్ర స్స్వబాహుబలమాశ్రితః. 17

తీక్ష్నధారేణశూలేన మహిషోహరిమర్దయత్‌ | శక్త్యాచగరుడంవీరో హృదయేన్యహనద్దృఢమ్‌. 18

తతో వ్యావృత్య వదనం మహాచలగుహానిభమ్‌ | గ్రస్తుమైచ్ఛద్రణ దైత్య స్సగరుత్మతమచ్యుతమ్‌. 19

దృష్ట్వాచ్యుతోపి విజ్ఞాయ దానవస్యచికీర్షితమ్‌ | వదనంపూరయామాస దివ్యైరసై#్తర్మహాబలః. 20

మహిషస్యాథ ససృజే బాణాఘెర్గరుడధ్వజః | పిధాయ వదనం దివ్యైర్దివ్యాసై#్త్రః పరిమన్త్రితైః. 21

సతైర్బాణౖరభిహతో మహిషోచలసన్నిభః | పరివర్తితకామోసౌ వపాతచమమారచ. 22

మహిషం పతితం దృష్ట్వా భూమౌ ప్రోవాచకేశవః | మహిషాసురమత్తస్త్వం వధం నాసై#్త్రరిహార్హసి. 23

యోషిద్వధ్యః పురోక్తోసి సాక్షాత్కమలయెనినా | ఉత్తిష్ఠ జీవితం రక్ష గచ్ఛాస్మాత్సజ్గరాద్ద్రుతమ్‌. 24

అంతట శాశ్వతుడగు మాధవుడు కోపముతో గ్రుడ్లు గిరగిర త్రిప్పుచు గదనుగొని దానితో వాని మేషమును పిండిచేసెను. దాన ఆ దైత్యేంద్రుడు ప్రళయకాలమున పర్వతమువలె ఆమేషమునుండి పడెను. వీర్యశాలియగు ఆ దానవుడు భూమిపై పడగా దైత్యులు ఆ యుద్ధ కర్మమునందు తామొంటరివారై పోయినట్టు అవసాదము (శక్తిహీనత) నొందిరి. అభిమానవంతులగు దానవులట్లగుటచూచి దానవేశ్వరుడగు మహిషుడు స్వబాహుబల మాశ్రయముగా ప్రకోప వశమున రక్తనేత్రుడయి రౌద్రుడయి ఎదిరించి పోరెను; వాడి వాదరగల శూలముతో హరిని నొప్పించెను; వీరుడాతడు శక్తి (ఆయుధము)తో గరుడుని బలముగా కొట్టెను. అంతట దైత్యుడు మహాపర్వత గుహవలె నోరు తెరచి గరుడునితో కూడ అచ్యుతుని మ్రింగగోరెను. అది చూచి హరి వాని తలపునెరిగి మహాబలుడతడు దివ్యాస్త్రములతో వాని నోరు తమువలె వెల్లకిల పెడెను; మరణించనుకూడ మరణించెను. మహిషుడు క్రింద పడియుంగా చూచి కేశవుడు వాని నుద్దేశించి ఇట్లు స్పష్టముగా పలికెను. *మహిషాసురా ! నీవిచట నాయస్త్రములతో మృతినొందదగవు; సాక్షాత్తుగ బ్రహ్మ (పద్మ సంభవుడు) నీవు స్త్రీచేతిలో మరణింతువని పలికెను. కావున జీవితమును కాపాడుకొనుచు రణరంగమునుండి శీఘ్రముగా పొమ్ము.

తస్మిన్పరాఙ్ముఖే దైత్యే మహిషే శుమ్భదానవః | సన్దపౌష్ఠపుటః కోపాద్భ్రుకుటీవికృతాననః. 25

నిష్పిష్యపాణినా పాణినం ధనురాదాయభైరవమ్‌ | సజ్యంచకార స ధనుశ్శరాంస్తు భుజగోపమా&. 26

సచిత్రయోధీ దృఢముష్టిపాత స్తతశ్చ విష్ణుంగరుడంచ దైత్యః |

బాణౖర్జ్వలద్వహ్నిశిఖానికాశైః క్షిపై#్రః ప్రసజ్ఖ్యైః పరితో గృహీతః. 27

విష్ణుస్తు దైత్యేన్ద్రశరార్దితోహి శక్తిం సమాదత్త కృతాన్తతుల్యామ్‌ |

తయాశుశక్త్యా స పి పేష మేషంశుంభంచ శత్రుం ధరణీధరాభమ్‌. 28

తస్మాదథాప్లుత్యహతాచ్చ మేషా ద్భూమౌ పాదాతిర్దనుజాధిపస్సః |

తత స్స భూస్తస్యహరిశ్శరౌఘాన్ముమోచ కాలానల తుల్యభావః. 29

_______________________________________________

* మరణించిన తరువాత కొలదిసేపటివరకు మృతజీవుడు లింగ శరీరముతో అటనే ఉండును కావున ఇట కేశవుడు మహిషునుద్దేశించి పలికెను అనుట సమంజసమే.

శ##రైస్త్రిభిస్తస్యభుజంబిభేదషడ్భిశ్చ శీర్షందశభిశ్చ కేతుమ్‌ |

విష్ణుర్వికృష్టైశ్శ్రవణా వసానం దైత్యస్య వివ్యాధవివృత్తనేత్రః. 30

సతేన విద్ధోవ్యథితో బభూవ దైత్యేశ్వరో విప్లుతశోణితౌఘః |

తతోస్య కిఞ్చిచ్చలితస్య ధైర్యాదువాచ సజ్ఖ్యే స తు శార్గపాణిః. 31

కుమారివధ్యోసి రణం మిముఞ్చ శుమ్భాసురస్వల్పతరైరహోభిః |

వధం న మత్తో7ర్హసి గచ్ఛమూఢ వృథైవ కిం యుద్ధసముత్సుకోసి. 32

శుమ్భో వధం విష్ణుముఖాన్ని శమ్యనిమి స్స సజ్ఖ్యేసమియేష విష్ణుమ్‌ | గదామథోద్యమ్య నిమిః ప్రచణ్డాం జఘాన గాఢం గరుడం స ఖస్థః. 33

జమ్భోపి విష్ణుం పరిఘేన మూర్ధ్ని ప్రమృష్టరత్నౌ ఘవిచిత్రభాసా |

తౌ దానావాభ్యాం విషమైః ప్రహారై ర్నిపేతతు స్తౌ ఘనపావకాభై. 34

తత్కర్మ దృష్ట్వా దితిజాస్తు సర్వే జగర్జు రుచ్చైః కృతసింహనాదాః |

ధనూంషి చాస్ఫోట్య జవాభిఘాతై ర్న్యదారయన్భూమిమపి ప్రచణ్ణాః. 35

వాసాంసిచైవాదుధువుః పరేతు దధ్ముశ్చశజ్ఖానకగోముఖౌఘా& | అథ సంజ్ఞామవాప్యాశు గరుడోపి సకేశవః.

పరాఙ్ముఖో రణాత్తస్మా త్పలాయత సహాజవః. 36

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవాసురఙ్గ్రామే గరుడసహితవిష్ణుపలాయనం

నామ ఏకపఞ్చా శదుత్తర శతతమో7ధ్యాయః.

ఆ దైత్యుడు మహిషుడు పరాఙ్ముఖుడై పోగానే శుంభ##దైత్యుడు కోపముతో పెదవులను కొరుకుచు కనుబొమల ముడితో వికృతముఖుడై కరముతో కరము పిసికికొని భయంకర ధనువు పూనెను. సర్పములవంటి బాణములు గొని వింటనారి ఎక్కించి వాటిని సంధించి చిత్రముగ యుద్ధముచేయు యోధుడును దృఢముష్టితో బాణప్రయోగము చేయగలవాడు నగు ఆ శుంభుడు వాటితో గరుడుని విష్ణుని నొప్పించెను. జ్వలించు అగ్నిజ్వాలలతో సమములును శీఘ్రములును సంఖ్యాతీతములును నగు బాణములతో వాడు హరి గరుడులన్టుల చుట్టివేయగా ఆ దైత్యేంద్రుని శరములనొప్పి నందిన విష్ణుడు యమసమానమగు శక్తి పూని దానితో పర్వత సమానమగు వాని వాహన మేషమును అట్టివాడేయగు ఆ దైత్యుని కూడ పిండిచేసెను. మేషము చచ్చెను. ఆదనుజాధిపతి చచ్చిన మేషమునుండి దుమికి నేలపయి నిలువబడెను. హరి వానిపై ప్రళయాగ్నివంటి బానములను ప్రయోగించెను. ఆ హరి గ్రుడ్లు త్రిప్పుచు ఆకర్ణాంతము ధనువు నారి లాగి మూడు బాణములతో వాని భుజమును చీల్చి ఆరింటిని వాని తలపై నాటి పదింటితో ధ్వజమును కొట్టెను. ఆ దెబ్బలతో శుంభ దైత్యుడు రక్త ప్రవాహముతో నిండి వ్యథనిందెను; ధైర్యమునుండి కొంత చలించెనుకూడ; అది చూచి హరి ''శుంభాసురా! కొలది దినములలో కుమారి చేతిలో చంపబడెదవు; ఇప్పటికి యుద్ధము మానుము; మూఢా! వ్యర్థముగా యుద్ధమునకై తహతహ పడెదవేల? నా చేతిలో నీవు చావదగవు.'' అనెను. విష్ణుని నోటినుండి శుంభుని చావుమాట విని నిమి విష్ణునినెదుర్కొనెను; వాడాకసమున నిలిచి ప్రచండగద ఎత్తి గరుడుని కొట్టెను. జంభుడనువాడు సాన పట్టిన రత్నముల విచిత్రకాంతులతో వెలుగు పరిఘతో విష్ణుని తలపయి కొట్టెను. అట్లు అప్పుడు గరుడుడును హరియు ఆ దానవుల చేతిలో విషమ ప్రహారములు తిని దట్టములగు అగ్నులవలె పడిపోయిరి. ఈ కార్యము చూచి దైత్యులందరును బిగ్గరగా గర్జించిరి. సింహనాదములు చేసిరి. ప్రచండులై ధనుపుల నారులను వేగముగా సారించి ఆస్ఫోటించి భూమిని బ్రద్దలు చేసిరి. వస్త్రములను విసరిరి; శంఖములు ఆనకములు గొముఖములు మొదలగు వాద్యములను మ్రోగించిరి. కొంతసేపటికి తెలివివచ్చి హరి గరుడునితో కూడి యుద్ధమునకు పెడమోమయి మహాజవమున పారిపోయెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవాసుర సంగ్రామమున గరుడునితో కూడిన

హరి పారిపోవుటయను ఏబది యొకటవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters