Sri Matsya mahapuramu-2    Chapters   

అష్టచత్వారింశదుత్తర శతతమో7ధ్యాయః.

దేవదానవయుద్ధప్రారమ్భః.

సూతః : సురాసురాణాం సంమర్దే తస్మి న్పరమదారుణ| తుములో7తిమహానాసీ త్సేనయో రుభయోరపి. 1

గర్జలాం దేవదైత్యానాం శఙ్ఖభేరీరవేణచ | తూర్యాణాంచైవ నిర్ఘోషై ర్మాతఙ్గానాంచ బృంహితైః. 2

హేషితై ర్హ యబృన్దానాం రథనేమిస్వనేనతు | జ్యాఘోషేణచ శురాణాం తుములోతిమహా నభూత్‌. 3

సమాసాద్యోభయో స్సేనే పరస్పరజయైషిణామ్‌ | రోషేణాతిపరీతానాం త్యక్తజీవితచేతసామ్‌. 4

సమాసాద్యచతేన్యోన్యం ప్రక్రమేణ విలోమతః | రథేనాసక్తపాదాతో రథేనచ తురఙ్గమః. 5

హస్తీ పదాతి సంసక్తో రథినాపి క్వచిద్రథీ | మాతఙ్గేనాపరో హస్తీ తురగై ర్బహుభిర్గజాః. 6

గజైశ్చ బహుభి ర్హస్తీ పదాతై ర్భహుభిర్గజాః | పదాతిరేకో బహుభిర్గజై ర్మత్తైశ్చ యుజ్యతే. 7

తతః ప్రాసాశనిగదాభిణ్డివాలాసిపట్టసైః | శ క్తిభి ర్ముసలై శ్శైలై ర్ముద్గరైః కణికైర్గదైః. 8

నూట నలుబది ఎనిమిదవ అధ్యాయము.

దేవదానవ యుద్ధారంభము.

సూతుడు శౌనకాదులకిట్లు చెప్పసాగెను: సురాసురుల ఆ పరమదారుణ సమ్మర్దమునందు ఇరుసేనలయందును గొప్ప త్రొక్కిసలాటయయ్యెను. దేవదైత్యుల గర్జనలతో శంఖ భేరీ తూర్య ధ్వనులతో ఏనుగుల ఘీంకారములతో గుర్రపు గుంపుల సకిలింతలతో రథపు చక్రపు పట్టాల చప్పుడులతో శూరుల విండ్లనారుల మ్రోతలతో మహాతుములమయ్యెను. పరస్పర జయ వాంఛతో అతిరోష పూర్ణులయి జీవితత్యాగమునకు సిద్దపడిన ఉభయుల సేనయు ఒకరి సేనను మరియొకటి సమీపించి ప్రక్రమముగాను విలోమముగాను ఎదిరించుకొనసాగిరి. రథము పదాతిమీదకు వచ్చును. రథము మీదకు గుర్రము దుముకును. ఏనుగు పదాతితో పెనగులాడును. రథికునితో రథికుడు తలపడును. ఏనుగులతో ఏనుగులు ఏనుగులు గుర్రములతో అనేక గజములతో ఒక ఏనుగు అనేక పదాతులతో అనేక గజములు ఒక పదాతి అనేక గజములతో తలపడుచుండెను.

చక్రైః పరశ్వథైశ్చైవ తోమరై రజ్కుశై శ్శితైః | కార్షినాళీకనారాచైర్వత్సదన్తార్ద చన్ద్రకైః. 9

భ##ల్లైశ్చైవసపత్రైశ్చ శుకతుణ్డౖశ్చ నిర్మలైః | వృష్టిరత్యద్భుతాకారా గగనే సమదృశ్యత. 10

సమ్ప్రచ్చాద్య దిశ స్సర్వా స్తమోమయ మివాకరోత్‌ |

న ప్రజ్ఞాతం తతోన్యోన్యం తస్మింస్తమసి సజ్కులే. 11

ఆలక్ష్యన్తే సృజ న్తస్తే హేతిసఙ్ఘాత ముద్ధతమ్‌ | పత న్తి సేనమో ర్మధ్యే నిరీక్షన్తే పరస్పరమ్‌. 12

తతో ధ్వజై ర్భుజైశ్‌చ్ఛత్రై శ్శిరోభిశ్చ సకుణ్డలైః | గజైస్తురఙ్గైః పాదాతైః పతద్భిః పతితైరపి 13

ఆకాశసరసో భ్రష్టైః పఙ్కజైరివ భూస్త్సృతా | భగ్నదన్తా భగ్నకుమ్భా శ్ఛిన్నదీర్ఘమహాకరాః. 14

గజాశ్శైలనిభాః పేతు ర్ధరణ్యాం రుధిరస్రవాః | భ##గ్నేషారథచక్రాఖ్యా రథాశ్చ శకలీకృతాః. 15

పేతేశ్శకలతాం యాతా స్తురఙ్గాశ్చ సహస్రశః | తతోసృగ్హ్రదదుస్తారా పృథివీసమజాయత. 16

నద్యశ్చ రుధిరావర్తా హర్షదాః పిశితాశినామ్‌ | బై తాళాక్రీడమభవ త్తత్సజ్కులరణాజిరమ్‌. 17

ఇతి శ్రీమత్స్య మహాపురాణ దేవాసురసఙ్గ్రామే దేవదానవయో ర్యుద్ద కథనం నామ అష్టచత్వారింశదుత్తర శతతమో7ధ్యాయః.

ఇంకను ప్రానవజ్ర గదాభిండివాల ఖడ్గ పట్టిశశ క్తియుసల శూలముద్గర కుణిక గదలతోను చక్రపరశు తోమరాంకుశములతోను కార్షినాళీకాయుధములతోను నారాచబాణములతోను వత్సదంతార్ధచంద్రభల్ల శుకతుండాయుధములతోను ఆకాశమునందు అత్యాశ్చర్యకరమగు ఆయుధ వర్షము ఏర్పడి కనబడెను. దానిచే దిక్కులన్నియు కప్పబడి అంధకార మయమయ్యెను. దానిలో ఒకరికింకొకరు గుర్తు తెలియకయు ఆయుధ సముదాయము ప్రయోగించుచుండినను ఎవరు ఏది ఎవరిపై ప్రయోగించిరో తెలియకుండెను. సైనికులు సేనలనడుమ పడుచుండిరి. పరస్పరము చూచు చుండిరి.

ధ్వజములు భుజములు ఛత్త్రములు కుండములతో కూడిన శిరస్సులు గజములు తురంగములు పదాతులు తెగిపడియు పడుచునుండగా ఆకాశము సరస్సునుండి జారిపడిన పద్మములతోవలె వీనితో రణభూమి వ్యాప్తమయ్యెను. దంతములు విరిగి కుంభములు పగిలి తొండములు తెగి నెత్తురుకారుచు ఏనుగులు కొండలవలె పడిపోయెను. కాండ్లు విరిగి చక్రములు ఊడి ఇరుసులు విరిగి రథములును ముక్కలుగా తెగిపోయి వేలకొలదిగా అశ్వములును పడిపోయెను. అంతలోనే నెత్తుటి మడుగులతో ఆ భూమి దాటరానిదయ్యెను. నెత్తుటి సుడులతో నదులు మాంసాహారులకు హర్షప్రదమయ్యెను. ఆ రణాంగణము బేతాళులకు క్రీడాస్థానమయ్యెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున తారకాసురోపాఖ్యానమున

దేవాసుర యుద్ధకథనమను నూట నలుబది ఎనిమిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters