Sri Scanda Mahapuranamu-I    Chapters    

పంచవింశోzధ్యాయ:

లోమశ ఉవాచ:

తత్రోపవివిశు: సర్వే సత్కృతాశ్చ హిమాద్రిణా| తే దేవా: సపరివారా: సహర్షాశ్చ సవాహనా:||1

తత్రైవ చ మహామాత్రం నిర్మితం విశ్వకర్మణా| దీప్త్యా పరయా యుక్తం నివాసార్థం స్వయంభువ:||2

తథైవ విష్ణోస్యపరం భవనం స్వయమేవ హి| భాసజ్వరం సువిచిత్రం చ కృతం త్వష్ట్రా మనోరమమ్‌||వండీగృహం మనోజ్ఞం చ తథైన కృతవాన్‌ స్వయమ్‌||3

తథైవ శ్వేతం పరమం మనోజ్ఞం మహాప్రభం దేవవరై: సువూజితమ్‌| కైలాసలక్ష్మీప్రభయా మహత్యా సుశోభితం తద్బవనం చకార ||4

తత్రైవ శంభు : పరియా విభూత్యా స స్థాపితస్తేన హిమాద్రిణా వై||5

ఏతస్మిన్నంతరే మేనా సమాయాతా సఖీగణౖ: నీరాజనార్థం శంభుం చ ఋషిభి: పురివారితా||6

తదా వాదిత్రనిర్ఘోషైర్నాదితం భువనత్రయమ్‌ | నీరాజనం కృతం తస్య మేనయా చ తపస్విన:7

అవలొక్య పరా సాధ్వీ మేనాzజానాద్వరం తదా | గిరిజోక్తమనుసృత్య మేనా విస్మయమాగతా||8

ఇరువది ఐదవ అధ్యాయము

హిమవంతుని చేత సత్కరింపబడిన దేవతలు తమ పరివారముతో , వాహనములతో ఆనందముగా అక్కడ కూర్చొనిరి (1) బ్రహ్మ నివసించుటకు విశ్వకర్మ విశాలమైన భవంతిని కాంతివంతముగా నిర్మించెను.(2) త్వష్ట విష్ణువు గురించి కాంతివంతము విచిత్రమూనగు భవనము నొకదానిని నిర్మించెను అందమైన వండీగృహము కూడా స్వయముగా నిర్మించెను(3) అట్లే తెల్లనిదై అత్యంతమనోహరముగా నుండి దేవతా శ్రేష్టులచే పూజింపబడునది, కైలాసలక్ష్మీ కాంతిచే ప్రకాశించునది యగు భవంతిని నిర్మించెను(4) హిమవంతుడు శంకరుని ఆ భవంతిలోనే గొప్ప ఐశ్వర్యముతో నుంచెను, (5) ఇంతలో మేన సఖీగణముతో, మహర్షులతో కూడుకున్నదై శివుని నీరాజనముకొరకు వచ్చెను (6) అపుడు వాద్యములు మ్రోగగా ఆ ధ్వనిచేత ముల్లోకములూ నినదించెను. మేన తపస్వియగు శంకరునికి నీరాజనమిచ్చినది.(7) శంకరుని చూచి పరమసాధ్వియగు మేన వరుడెవరో అపుడు తెలుసుకొనెను. పార్వతి చెప్పినట్లుగా నున్న వరుని తెలుసుకొని మేన విస్మయమునొందెను.(8)

యద్వై పురోక్తం చ తయా పార్వత్యా మమ సన్నిధౌ తతోzధికం ప్రపశ్యామి సౌందర్యం పరమేష్టిన:|| మహేశస్య మయా దృష్టమనిర్వాచ్యం చ సంప్రతి||9

ఏవం విస్మయమాపన్నా విప్రపత్నీభిరావృతా |అహతాంబరయుగ్మేన శోభితా వరవర్ణినీ ||10

కంచుకీ పరమా దివ్యా నానారత్నైశ్చ శోభితా | అంగీకృతా తదా దేవ్యా రరాజ పరయా శ్రియా||11

బిభ్రతీ చ తదా హారం దివ్యరత్నవిభూషితమ్‌| వలయాని మహార్హాణి శుద్దచామీకరాణి చ|| 12

తత్రోపవిష్టా సుభగా ధ్యాయంతీ పరమేశ్వరమ్‌ | సఖీభి: సేవ్యమానా సా విప్రపత్నీభిరేవ చ ||13

ఏతస్మిన్నంతరే తత్ర గర్గోవాక్యమభాషత| పాణిగ్రహార్థం శంభుం చ ఆనయధ్వం స్వమందిరమ్‌|| త్వరితేనైన వేలాయామస్యామేవ విచక్షణా:||14

తచ్చృత్వా వచనం తస్య గర్గస్య చ మహాత్మన:| అభ్యుత్థానపరా: సర్వే పర్వతా :సకళత్రకా:||15

నావద్ద పార్వతి మునుపు చెప్పిన దానికంటే మిక్కిలి సౌందర్యము పరమేశివునిలో చూచుచున్నాను. ఇపుడు నేను పరమేశుని అనిర్వాచ్యునిగా చూచాను (9) అని ఈ విధంగా విస్మయమును పొందిన మేన విప్రపత్నులతో కూడినదై దివ్య వస్త్రముల రెంటిచే శోభించెను (10) అనేక రత్నములతో శోభిల్లుచున్న దివ్య మైన కంచుకిని దేవి ధరించగా అది మిగుల శోభించెను (11) అపుడు దేవి దివ్య రత్నములతో అలరారుచున్న హారమును, శుద్ద బంగారముతో చేయబడిన గొప్ప వలయములను ఆభరణములను ధరించెను.(12)అట్టి దేవి సుఖులతో, విప్రపత్నులతో సేవించబడిన దేవి పరమేశ్వరుని ధ్యానం చేస్తూ అక్కడే కూర్చుండెను.(13) ఇంతలోగర్గుడు అక్కడికి వచ్చి ఇట్లనెను పాణిగ్రహణము కొరకు శివుని మందిరమునకు కొని రావలయును త్వరగా ఈ సమయమున తీసుకొని రండు (14)అనగా విని పర్వతములన్నీ తమ తమ భార్యలతో సహా శివుని కొని వచ్చుటకు లేచి నిలిచిరి.(15)

మహావిభూత్యా సంయుక్తా సర్వే మంగళపాణయ: | సాలంకృతా స్తదా తేషాం పత్న్యోzలంకారమండితా:|| 16

ఉపాయనాన్యనేకాని జగ్రుహు: స్నిగ్దలోచనా :| తదా వాదిత్రఘెషేణ బ్రహ్మఘెషేణ భూయసా|| 17

ఆజగ్ము: సకళత్రాస్తే యత్ర దేవో మహేశ్వర:| ప్రమథైరావృతస్తత్ర చండ్యా చైవాభిసేవిత:||18

తథా మహర్షిభిస్తత్ర తథా దేవగణౖ: సహ| ఏభి పరివృత: శ్రీమాంఛంకరో లోకశంకర:||19

శ్రుత్వా వాదిత్రనిర్ఘోషం సర్వే శంకరసేవకా: ఉత్థితా ఐకపద్వేన దేవై: ఋషిభిరావృతా:||20

తథోద్యతో యోగినాం చక్రయుక్తా గణా గణానాం పతిరేకవర్చసామ్‌|

శివం పురస్కృత్య తథానుభావాస్తథైవ సర్వే గణనాయాకాశ్చ||21

తద్యోగినీచక్రమతిప్రచండం టంకారభేరీరవనిస్వనేన | చండీం పురస్కృత్య భయానకాం తదా మహావిభూత్యా తదా మహావిభూత్యా సమలంకృతాం తదా||22

కంఠే కర్కోటకం నాగం హారభూతం చకార సా| పదకం వృశ్చికానాం చ దందుశూకాంశ్చ బిభ్రతీ||23

కర్ణావతంసాన్‌ సా దధ్రే పాణిపాదమయాంస్తథా| రణ హతానాం వీరాణాం శిరాంస్యురసి చాపరాన్‌ ||24

వారందరూ మంగళద్రవ్యములను చేత ధరించి గొప్ప ఐశ్వర్యముతో నుండిరి వారు వారి భార్యలు అలంకరించుకొని యుండిరి.(16) ఆ విశాల ప్రేమనేత్రలు అనేక బహుమతులను తెచ్చిరి. అపుడు వాద్యములఘెష , బ్రహ్మఘోష వినబడగా దానితో వారు (17) భార్యలతో కలిసి ప్రమథులతో, చండితో సేవించబడుచున్న మహేశ్వరుని వద్దకు వచ్చిరి.(18)అపుడు లోకములకు శుభము గూర్చు శంకరుడు మహర్షులతో దేవగణములతో కూడి యుండెను (19) వాద్యముల ఘోషను విని శంకరుని సేవకులు దేవతలు , ఋషులుకూడివుండగా ఒక్కమారుగా లేచిరి.(20) అట్లే యోగిగణము, దాని నాయకుడు , అట్లే కాంతివంతమునకు గణనాయకులందరూ శివుని చూచి లేచినిలిచిరి.(21) అతి ప్రచండమైన యోగినీ చక్రము టంకారాభేరీ నినాదముతో వెంటనే గొప్ప ఐశ్వర్యము గలది భయంకరమైనది యగు చండిని ముందుంచుకొని వచ్చినది.(22) ఆ చండి కంఠమున కర్కోటకమను సర్పమును హారముగా ధరించినది అట్లే తేళ్ళను, కీటకములను, ధరించెను.(23) కాళ్ళకు, చేతులకు, చెవులకు ఆభరణాలను ధరించెను. రణమున మరణించిన వీరుల తలలను ఎదపై ధరించెను(24)

ద్వీపిచర్మపరీధానా యోగినీచక్రసంయుతా | క్షేత్రపాలావృతా తద్వద్బైరవై: పరివారితా||25

తథా ప్రేతైశ్చ భూతైశ్చ కపటై : పరివారితా | వీరభద్రాదయశ్చెవ గణా: పరమదారుణా:||

యే దక్షయజ్ఞనాశార్థే శివేనాజ్ఞాపితాస్తదా||26

తథా కాళీ భైరవీ చ మాయా చైవ భయావహా | త్రిపురా చ జయాచైవ తథా క్షేమకరీ శుభా||27

అన్యాశ్చైవ తథా సర్వా: పురస్కృత సదాశివమ్‌ | గంతుకామాశ్చోగ్రతరా భూతై: ప్రేతై: సమావృతా:||28

ఏతా: సర్వా విలోక్యాథ శివభక్తో జనార్థన: | మహర్షీంశ్చ పురస్కృత తథైవ చ హ్యరుంధతీమ్‌ ||29

విష్ణురువాచ:

చండీం కురు సమీపస్థాం లోకపాలనతాం ప్రభో||30

ఏనుగుచర్మమును ధరించినదై యోగినీ చక్రముతో కూడియున్న చండి చుట్టూ క్షేత్రపాలురు, బైరవులు యుండిరి (25) అదే విధంగా ,భూత, ప్రేత, కపటులు, వీరభద్రాది గణములు మొదలగునవి దక్షయజ్ఞమును నాశనము చేయుటకు శివునిచేత మునుపు ఆజ్ఞాపింపబడినవారు చండి చుట్లూ వుండిరి.(26) అదే విధంగా , కాళి, భైరవి, భయముగొల్పు మాయ, త్రిపుర, జయ, క్షేమకరియగు శుభ (27) ఇతర దేవతలందరూ సదాశివుని గూర్చి వెళ్ళగోరి భూతప్రేతములతో కూడి అక్కడికి వచ్చిరి, (28) వీరందరినీ శివభక్తుడగు జనార్ధనుడుచూచెను దేవతలను మహర్షులను, అనసూయను, అరుంధతిని ఉద్దేశించి(29) విష్ణు విట్లనెను ప్రభా! లోకపాలురచే పూజింపబడిన చండిని సమీపముననుంచుకొనుము.(30)

తదుక్తం విష్ణునా వాక్యం నిశమ్య జగదీశ్వర:| ఉవాచ ప్రవాసన్నేవ చండీం ప్రతి సదాశివ:||31

అత్రైవ స్థీయతాం చండి యావదుద్వహనం భ##వేత్‌ | మమ భావాన్విజానాసి కార్యాకార్యే సుశోభ##నే||32

ఏకమాకర్ణ్య వచనం శంభోరమితతేజస: ఉవాచ కుపితా చండీ విష్ణుముద్దిశ్య సాదరమ్‌ | 33

తథాన్యే ప్రమథా: సర్వే విష్ణుమూచు: ప్రకోపితా : యత్ర శివో భాతి తత్ర తత్ర వయం ప్రభో||34

త్వయా నివారితా : కప్మాద్వయమభ్యుదయే పరే | తేషాం తద్వచనం శ్రుత్వా కేశవో వాక్యమబ్రవీత్‌|35

చంఢీముద్దిశ్య ప్రమథానన్యాంశ్చైవ తథావిధాన్‌ | యూయం చైవ మయా ప్రోక్తా మాకోపం కర్తుమర్హధ||36

ఏకముక్తాస్తదా తేన చండీముఖ్యా గణాసదా| ఏకాంతమాశ్రితా: సర్వే విష్ణువాక్యాజ్ఞ్యలద్దృద:||37

తావత్సర్వే సమాయాతా: పర్వతేంద్రస్య మంత్రిణ: సకళత్రా: సంభ్రమేణ మహేశం ప్రతి సత్వరమ్‌ ||38

విష్ణువు అట్లనగా విని జగదీశ్వరుడు శంకరుడు నవ్వుచు చండితో ఇట్లనెను (31) చండీ! వివాహమైనంతవరకు వీవిక్కడే వుండుము, నాభావములను, కార్యాకార్యములను నీవెరుగుదువు(32) అమితతేజస్సుగల శివుని మాటను విని చండి మరియు ఇతర ప్రమథులు మిగులు కోపించి విష్ణువునుద్దేశించి ఇట్లనిరి.(33) ఎక్కడెక్కడ శివుడు వెలయునో అక్కడక్కడ మేముండెదము (34) పరమాభ్యుదయమున నీవు మమ్ములనెందుకు వారించుచున్నావు? అని వారనగా కేశవుడు వారితో నిట్లనెను(35)మిమ్ములనందరినీ ఉద్దేశించినేనన్నాను కోపగించవలదు (36) అనగా చంఢీ మొదలగు గణములన్నీ విష్ణువు మాటలతో మండుచున్న గుండెలు కలిగి ఏకాంతము నాశ్రయించిరి.(37) అంతలో పర్వతేంద్రుడైన హిమవంతుని మత్రులందరూ తమ తమ భార్యలతో మహేశ్వరుని గూర్చి త్వరగా వచ్చిరి.(38)

పంచవాద్యప్రఘోషేణ బ్రహ్మఘోషేణ భూయసా | యోపిద్బి: సంవృతాస్తత్ర గీతశ##భ్దేన భూయసా||39

ఏవం ప్రాప్తా యత్ర శంభు: సకలై : పరివారిత: ఆగత్య కలశై: సాకం స్నాపితో హి సదాశివ:|| స్త్రీభిర్మంగళగీతేన సర్వాభరణభూషిత:||40

ఋషయో దేవగంధర్వాస్తథాన్యే పర్వతోత్తమా:| శంభ్వగ్రగాస్తథా జగ్ము :స్త్రియశ్చైన సుపూజితా:||41

బభౌ ఛత్రేణ మహతా ధ్రియమాణన మూర్దని || చామరైర్వీజ్యమానోzసౌ ముకుటేన విరాజిత: బ్రహ్మవిష్ణుస్తథా చంద్రో లోకపాలాస్తథైవ చ|| 42

అగ్రగా హ్యపి శోభంత:శ్రియా పరమయా యుతా:| తథా శంఖాశ్చ భేర్యశ్చ పటహానకగోముఖా :||43

తథైవ గాయకా: సర్వే జగ్ము: పరమమంగళమ్‌ పున: పునరవాద్యంత వాదిత్రాణి మహోత్సవే||44

అరుంధతీ మహాభాగా అనసూయా తథైవ చ | సావిత్రీ చ తథా లక్ష్మీర్మాతృభి పరివారితా:||45

ఏభి: సమేతో జగదేకబంధుర్బభౌ తదానీం పరమేణ వర్చసా| సచంద్రసూర్యానిలవాయునా వృత: సలోకపాలప్రవరైర్మహర్షిభి:|| 46

ఐదువాద్యములు ఘోష బ్రహ్మఘోష , గీతశబ్దము, వీనిచే మరియు స్త్రీలతో కలిసి (39) శంకరుడు అందరితో కూడివున్న చోటికి ఆ మంత్రులు వచ్చిరి సదాశివునికి కలశములతో స్నానము చేయించి స్త్రీలు మంగళగీతముతో సర్వాభరణభూషితుని చేసిరి(40) ఋషులు దేవగంధర్వులు, అట్లే ఇతర పర్వతశ్రేష్టులు, స్త్రీలు శివునికి ఎదుట నడిచిరి.(41) తలపై నిలిపిన గొప్ప చత్రముతో వీచుచున్న చామరములతో , ముకుటముతో పరమశివుడు అధికముగా వెలుగుచుండెను బ్రహ్మ, విష్ణువు, చంద్రుడు, లోకపాలురు, (42) ఎదుట నడచుచూ గొప్ప కాంతితో ప్రకాశించుచుండిరి. అట్లే , శంఖములు, భేరీ వాద్యములు, పటహములు (తప్పెటలు) ఆనక గోముఖమొదలగు వాద్యములు మ్రోగు చుండెను. (43) అట్లే గాయకులందరూ పరమ మంగళమును గానము చేయుచుండిరి. ఆ మహోత్సవమున వాద్యములు మరల మరల మ్రోగింపబడినవి.(44) అరుంధతి అనసూయ లక్ష్మీ ఇతర మాతలచేత కూడియుండిరి (45) వీరందరితో కూడియుండి చంద్ర, సూర్య, వాయు, అగ్ని, లోకపాలురు, మహర్షులు వీరందరు చుట్టూ నిలిచి యుండ జగదేకబంధువగు శివుడపుడు గొప్ప కాంతితో విలసిల్లెను.(46)

స వీజ్యమాన: పవనేన సాక్షాచ్ఛత్రం చ తసై#్మ శశినా హ్యధిష్టితమ్‌| సూర్య పురస్తదవత్ర్పకాశక: శ్రియాన్వితో విష్ణురభూచ్చ సన్నిధౌ||47

పుష్త్పేర్వవర్పుర్హ్యవకీర్యమాణా దేవాస్తదానీం మునిభి: సమేతా:| య¸° గృహం కాంచనకుట్టిమం మహాన్మహావిభూత్యా పరిశోభితం తదా ||

వివేశ శంభు పరయా సపర్యయా సంపూజ్యమానో నరదేవదానవై:| 48

ఏవం సమాగత: శంభు: ప్రవిష్టో యజ్ఞమండపమ్‌ | సంస్తూయమానో విబుధై: స్తుతిభి: పరమేశ్వర:|| 49

గజాదుత్తారయామాస మహేశం పర్వతోత్తమ: ఉపవిశ్య తత: పీఠే కృత్వా నీరాజనం మహత్‌||50

మేనయా సఖిఖి: సాకం తథైవ చ పురోధసా మధుపర్కాదికం సర్వం యత్కృతం చైవ తత్ర వై||51

బ్రహ్మణా నోదిత: సద్య: పురోధా : కృతావాన్ప్రభు: మంగళం శుభకల్యాణం ప్రస్తావసదృశం బహు ||52

అంతర్వేద్యాం సంప్రవేశ్య యత్ర సా పార్వతీ స్థితా| వేదికోపరి తన్వంగీ సర్వాభరణభూషితా||53

తత్రానీతో హర: సాక్షాద్విష్ణునా బ్రహ్మణా సహ| లగ్నం నిరీక్షమాణాస్తే వాచస్పతిపురోగమా||54

వాయువు అతనికి వీచుచుండెను సాక్షాత్తు చంద్రుడే అతనికి ఛత్రమైన నిలిచెను సూర్యుడు ఎదుట ప్రకాశమునిచ్చువాడాయెను అతని సన్నిధిన విష్ణువు లక్ష్మితో కూడి యుండెను (47) మునులతో గూడి దేవతలు పుష్ప వర్షమును కురిపించిరి. దేవదానవమానవుల చేత పూజింపడబుచున్న పరమశివుడు గొప్ప ఐశ్వర్యముచే వెలుగొందుచున్న బంగారు కుట్టిమగల గృహమును ప్రవేశించెను. (48) దేవతలు స్తుతించుచుండగా శివుడు యజ్ఞమండపమును ప్రవేశఙంచును. (49) హిమవంతుడు పరమశివుడు ఏనుగు పై నుండి చేయినొసగి దింపెను పీఠమునకూర్చొబెట్టి నీరాజనమిచ్చెను (50) సఖులతో గూడి మేన బ్రహ్మ ఇచ్చిన మధుపర్కము మొదలగువానిని శివునికిచ్చెను (51) బ్రహ్మ ప్రేరేపించుచుండగా పురోహితుడు ఆయా కృత్యముల జేసెను.ప్రస్తావము వంటి కల్యాణకరమగు మంగళమును అతడాచరించెను (52) అన్ని అలంకారముల ధరించి సుందరముగా నున్న పార్వతి నిలుచున్న వేదికగల అంతర్వేదిని శివుడు ప్రవేశ##పెట్టబడెను. (53) బ్రహ్మ, విష్ణువులతో గూడి శివుడు అక్కడికి గొని రాబడెను. బృహస్పతి మొదలగు వారు లగ్నమును గూర్చి వేచిచూచుచూ యుండిరి. (54)

గర్గో మునిశ్చోపవిష్టస్తత్రైవ ఘటికాలయే యావత్పూర్ణా ఘటీ జాతా తావత్ర్పణవభాషణమ్‌ ||55

ఓం పుణ్యతి ప్రణిగదన్గర్గో వధ్వంజలి దధే| పార్వత్యక్షతపూర్ణం చ శివోపరి వవర్ష వై|| 56

తయా సంపూజితో రుద్రో దధ్యక్షతకుశాదిభి: ముదా పరమయా యుక్తా పార్వతీ రుచిరానవా|| 57

విలోకయంతీ శంభుం తం యదర్దే పరమం తప: కృతం పురా మహాదేవ్యా పరేషాం పరమం మహత్‌ ||58

తపసో తేన సంప్రాప్తో జగజ్జీవనజీవన: నారదేన తత: ప్రోక్తో మహాదేవో వృషధ్వజ:|| 59

తథా గంగాదిభిశ్చాన్యైర్మునిభి: సనకాదిభిః ప్రతిపూజాం కురు క్షిప్రం పార్వత్యాశ్చ త్రిలోచన|| తదా శివేన సా తన్వీ పూజితార్ఘ్యాక్షతాదిభి:||60

ఏవం పరస్పరం తౌ చ పార్వతీపరమేశ్వరౌ | అర్చ్యమానౌ తదానీం చ శుశుభాతే జగన్మ¸°||61

త్రైలోక్యలక్ష్మా సంవీతౌ నిరీక్షంతౌ పరస్పరమ్‌ తదా నీరాజితౌ లక్ష్మ్యా సావిత్ర్యా చ విశేషత: || అరుంధత్యా తదా తౌ చ దంపతీ పరమేశ్వరౌ ||62

ఆ ఘటికాలయమునందు గర్గుడను ముని కూర్చొనెను ఘటము నిండువరకు ప్రణవోచ్చారణము జరుగుచుండెను.(55) ఓ పుణ్య యని పలుకుచు గర్గుడు వధువగు పార్వతి అంజలిని గ్రహించెను. అక్షతలను చేతినిండుగా గ్రహించి, పార్వతి శివుని పై కురిపింపజేసేను. (56) పెరుగు , అక్షతలు, దర్భ మొదలగు వానిచే పార్వతి శివుని పూజించెను సుందరవదనయగు పార్వతి గొప్ప ఆనందమునొందెను (57) ఎవరి కొరకు మహాదేవియగు పార్వతి ఘోరతపస్సు నాచరించెనో అట్టి శివుని ఆమె చూచుచుండెను (58) ఆ తపస్సు చేత పార్వతి జగత్తుయొక్క ప్రాణహేతువగు శివుని పొందెను. అంతట నారదుడు గంగ మొదలగువారు సనకాదిఋషులు పార్వతిని కూడా పూజించెను శివునితో ననిరి అపుడు శివుడు అర్ఘ్యము అక్షతలతో పార్వతిని పూజించమని శివునితో ననిరి అపుడు శివుడు అర్ఘ్యము అక్షతలతో పార్వతిని కూడా పూజించెను (60) ఇట్లు పరమేశ్వరులిద్దరూ ఒకరినొకరు పూజించుచూ శోభిల్లిరి(61) ముల్లోకములనుండు శోభ##చే విలసిల్లుచూ ఒండొరుల జూచుచున్న వారిద్దరికీ, లక్ష్మీదేవి, సావిత్రీదేవి మరియు విశేషముగా నీరాజనము పట్టిరి.

అనసూయ తదా శంభుం పార్వతీం చ యశస్వినీమ్‌ దృష్ట్యా నీరాజయామాస ప్రీత్యులితలోచనా||63

తథైవ సర్వా ద్విజయోషితశ్చ నీరాజయామాసురహో పున: పున:

సతీం చ శంభుం చ విలోకయంత్యస్తథైవ సర్వా ముదితా హ సంత్య:||64

లోమశ ఉవాచ:

ఏతస్మిన్నంతరే తత్ర గర్గాచార్యప్రణోదిత :| హిమవాన్మేనయా సార్ధం కన్యాం దాతుంప్రచక్రమే ||65

హైమం కలశమాదాయ మేనా చార్దాంచమాశ్రితా | హిమాద్రేశ్చ మహాభాగా సర్వాభరణాభూషితా||66

తదా హిమాద్రినా ప్రోక్తో విశ్వనాధో వరప్రద: బ్రహ్మణా సహ సంగత్య విష్ణునా చ తథైవ చ ||67

సార్ధం పురోధసా చైవ గర్గేణ సుమహత్మనా | కన్యాదానం కరోమ్యద్య దేవదేవస్య శూలిన :||68

ప్రయోగో భణ్యతాం బ్రహ్మన్నస్మిన్సమయ ఆగతే | తథేతి మత్వా తే సర్వే కాలజ్ఞా ద్విజసత్తమా:||69

కథ్యతాం తాత గోత్రం స్వం కులం చైవ విశేషత: కథయస్వ మహాభాగ ఇత్యాకర్ణ్య వచస్తథా| సుముఖో విముఖ: సద్యో హ్యశోచ్చ: శోచ్యతాం గత:|| 70

ప్రీతితో విప్పారిన కన్నులుగల అనసూయ పార్వతీ పరమేశ్వరులను జూచి వారికి నీరా.జనము పట్టేను (63)అదే విధంగా బ్రాహ్మణ స్త్రీలు మరల మరల ఆ దంపతులను జూచుచూ ఆనందముతో నవ్వుచూ , వారికి నీరాజనమిడిరి.(64) లోమశుడు చెప్పసాగెను ఇంతలో గర్గాచార్యుడు చెప్పగా హిమవంతుడు మేనతోకలిసి కన్యాదానమును చేయుటకు అక్కడికి వచ్చెను.(65) అన్ని ఆభరణములతో నలరారు, మేన బంగారుకలశమును గ్రహించి హిమవంతుని అర్థాంగియై నిలిచెను. (66) అపుడు హిమవంతుడు వరముల నిచ్చు విశ్వనాథునికి, బ్రహ్మ, విష్ణు, పురోహితుడగు గర్గునితోకూడి కన్యాదానమును చేయుచుంటిని. (68) ఓ బ్రహ్మ! ఈ సమయమున జేయు ప్రయోగమును తెలియజేయుము. అనగా కాలమును తెలిసిన ద్విజోత్తములు అట్లేయనిరి (69) నాయనా! నీ కులగోత్రములను చెప్పుము అనగా వెంటనే సుముఖుడగు శివుడు విముఖుడాయెను. శోకింపబడలేని వాడు శోకమునొందెను.(70)

ఏవం విధ: సురవరైర్‌ ఋషిభిస్తదానీం గంధర్వయక్షమునిసిద్దగణౖస్తథైవ|

దృష్టో నిరుత్తరముఖో భగవాన్మహేశో హాస్యం చకార సుభృశం త్వద నారదశ్చ ||71

వీణాం ప్రకటయామాస బ్రహ్మపుత్రోZథ నారద: | తదానీం వారితో ధీమాన్వీణాం మా వాదయ ప్రభో|| 72

ఇత్యుక్త: పర్వతేనైన నారదో వాక్యమబ్రవీత్‌ | త్వయా పృష్టొ భవస్సాక్షాత్‌ స్వగోత్రకథనం ప్రతి||73

అస్య గోత్రం కులం చైవ నాద ఏవ పరం గిరే | నాదే ప్రతిష్టిత: శంభుర్నాదో హ్యస్మిన్ర్పతిష్ఠిత:||74

తస్మాన్నాదమయ: శంభుర్నాదాచ్చ ప్రతిలభ్యతే | తస్మాద్వీణా మయా చాద్యవాదితా హి పరంతప||75

అస్య గోత్రం కులం నామ న జానన్తి హి పర్వత | బ్రహ్మదయో హి విబుదా అన్యేషాం చైవ కా కథా||76

త్వం మూఢత్వమాపన్నో న జానాసి హి కించన | వాచ్యావాచ్యం మహేశస్య విషయా హి బహిర్ముఖా:77

యే యే ఆగమికాశ్చాద్రే నష్టాస్తే నాత్ర సంశయ:| అరూపోZయం విరూపాక్షో హ్యకులీనోZయముచ్యతే||78

అగోత్రోయం గిరిశ్రేష్ట ఆమాతా తే న సంశయ:| న కర్తవ్యో విమర్నోZత్ర భవతా విబుధేన హి||79

అపుడు దేవవరులు,ఋషులు, గంధర్వయక్షముని సిద్దగణములు మహేశుని నిరుత్తరముఖునిగా జూచినది, అపుడు నారదుడు మిక్కిలి హాస్యముచేయునారంభించెను.(71) బ్రహ్మపుత్రుడు నారదుడు వీణము బయటకు దీయగా , పర్వతుడు అతనిని వీణను మ్రోగించవద్దని వారించెను. అపుడు నారదుడిట్లనెను. సాక్షాత్తు భవుని గోత్రముజెప్పుమని అడిగితివి కదా! (73) ఓ పర్వతా! పరమశివుని కులమూ ,గోత్రము, నాదమే, శివుడు నాదమున ప్రతిష్టింపబడియుండగా, నాదము శివుని యందు ప్రతిష్టింపబడియున్నది(74) కనుక నాదమయుడగు శివుడు నాదము ద్వారా పొందబడును కనుక మహానుభావా! నేనీ వీణను మ్రోగించితిని. (75) బ్రహ్మది దేవతలే పరమశివుని కులగోత్రములను తెలియజూలరు. మిగిలిన వారి గూర్చి చెప్పునదేమి?(76) నీవుమూడుడవై బ్రహ్మాది దేవతలే పరమశివుని కులగోత్రములను తెలియజాలదు మిగిలిన వారి గూర్చి చెప్పునదేమి?(76) నీవు మూఢడవై శివుని వాచ్యావాచ్యమును ఏ మాత్రమూ తెలియకుంటివి విషయములు బహిర్ముఖములు(77) ఆగమ సంబంధమైనవన్నీ ఇచ్చట నశించినవగును, నీఅల్లుడగు శివునికి రూపము లేదు కులము గోత్రము లేదు విజ్ఞుడవగు నీవు ఈ విషయమున విమర్శను చేయరాదు.(79)

న జానంతి సర్వే కిం బహుక్త్యా మమ ప్రభో | యాస్యాజ్ఞానాన్మహాభాగ మోహితా ఋషయో హ్యమీ||80

బ్రహ్మాపి తం న జానాతి మస్తకం పరమేష్ఠిన: విష్ణుర్గతో హి పాతాళం న దృష్టో హి తథైవ చ||81

తేన లింగేన మహతా హ్వగాధేన జగత్త్రయమ్‌ | వ్యాప్తమస్తీతి తద్విద్ది కిమనేన ప్రయోజనమ్‌||82

అనయారాధితం నూనం తవ పుత్ర్యా హిమాలయ |తత్త్వతో హి న జానాసి కథం చైవ మహాగిరే||83

ఆభ్యాముత్పాద్యతే విశ్వమాభ్యాం చైవ ప్రతిష్ఠితమ్‌ | ఏతచ్చృత్వా వచస్తస్య నారదస్య మహాత్మన:84

హిమాద్రిప్రముఖాస్సర్వే తథా చేంద్రపురోగమా: సాధు సాధ్వితి తే సర్వే ఊచుర్విస్మయమానసా:||85

ఈశ్వరస్య తు గాంభీర్యం జ్ఞాత్వా సర్వే విచక్షణా:| విస్మయేన సమాశ్లిష్టా ఊచు: సర్వే పరస్పరమ్‌ ||86

ఋషయ ఊచు:

యస్యాజ్ఞయా జగదిదం చ విశాలమేవ జాతం పరాత్పరమిదం నిజబోధరూపమ్‌| సర్వం స్వతంత్రపరమేశ్వరభావగమ్యం | సోZసౌ త్రిలోకనిజరూపయుతో మహాత్మా|| 87

ఇతి శ్రీస్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

కేదారఖండే శివశాస్త్రే శివపార్వతీ వివాహవర్ణనం నామ పంచవింశోZధ్యాయ:

ప్రభూ! మిగుల పలికి లాభ##మేమి? అందరూ శివుని తెలుసుకొనజాలరు ఈ ఋషులందరూ అతని ఆజ్ఞానముచేతనే మోహితులై అతనిని తెలియలేకున్నారు (80) ఆ పరమశివుని శిరస్సును బ్రహ్మకూడానెఱుగడు. అలాగే పాతాళమునకు వెళ్లిన విష్ణువు కూడా శివుని చూడలేదు(81) అగాధమైన ఆ గొప్ప లింగము చేతనే ముల్లోకములూ వ్యాపించినవని తెలియుము. దీనంతటిచే ఫలమేమి ?(82) హిమపర్వతా! నీ పుత్రిక నిజముగా శివునారాధించినది అదెట్లో వాస్తవముగా నీకు తెలియదు (83) వీరిద్దరినుండే విశ్వముత్పన్నమై వీరి చేతనే నిలిచియున్నది అని మహాత్ముడగు నారదుడనగా హిమవంతుడు మొదలగువారు, ఇంద్రుడు మొదలగు దేవతలు అందరూ విస్మయమునొంది బాగు యని పలికిరి.(85) విజ్ఞులగు వారందరూ ఈశ్వరుని గాంభీర్యమును తెలిసినవారైవిస్మయముతో పరస్పరముమాట్లాడిరి(86) ఋషులిట్లనిరి ఎవరిచే ఈజగత్తు విశాలమైనదిగా సృజింపబడెనో ఏ తత్త్వము పరాత్పరము , ఆత్మజ్ఞానరూపమైనదో, ఏది సర్వమై స్వతంత్ర పరమేశ్వర భావముచే తెలియునో అట్టి, ముల్లోకములే తన రూపమైన మహాత్ముడు ఈ శివుడే (87)

ఇది శ్రీ స్కాంపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కేదారఖండమందు శివశాస్త్రమున శివపార్వతీవర్ణనమను ఇరువది ఐదవ అధ్యాయము

షడ్వింశోZధ్యాయ:

లోమశ ఉవాచ:

అథ తే పర్వతశ్రేష్టా మేర్వాద్యా జాతసంభ్రమా: ఊచుస్తే చైకపద్యేన హిమవంతం మహాగిరిమ్‌ || 1

పర్వతా ఊచు:

కన్యాదానం క్రియతాం చాద్య శైల శ్రీమాంఛంభుర్బాగ్యతస్తేZద్య లబ్ద:|

హృన్మధ్యే వై నాత్ర కార్యో విమర్శస్తస్మాదేషా దీయతామీశ్వరాయ|| 2

తచ్చృత్వా వచనం తేషాం సుహృదాం వై హిమాలయ: | సమ్యక్సంకల్పమకరోద్ర్బహ్మణా నోదితస్తదా| ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర||3

భార్యార్థం ప్రతిగృహ్ణీష్వ మంత్రేణానేన దత్తవాన్‌ | అసై#్మరుద్రాయ మహతే దేవదేవాయ శంభ##వే| కన్యా దత్తా మహేశాయ గిరీంద్రేణ మహాత్మనా||4

వేద్యాం చ బహిరానీతౌ దంపతీ కమలేక్షణౌ | ఉపవేశితా బహిర్వేద్యాం పార్వతీ పరమేశ్వరా||5

ఆచార్యేణాథ తత్రైవ కశ్యపేన మహాత్మనా | ఆహ్వానం హవనార్ధాయ కృతమగ్నేస్తదా ద్విజా:||6

బ్రహ్మా బ్రహ్మాసనగతో బభూవ శివసన్నిధౌ | ప్రవర్తమానేహవన ఋషయశ్చ విచక్షణా:||7

ఊచు: పరస్పరం తత్ర నానాదర్శనవేదిన: వేదవాదరతా : కేచిదవదన్‌ సంమతేన వై||8