Sri Scanda Mahapuranamu-I    Chapters    

శ్రీ గణశాయ నమ:

స్కంద పురాణము

మాహేశ్వరఖండము

ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌|

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్‌||

ప్రథమో7ధ్యాయ:

వ్యాస ఉవాచ:

యస్యాజ్ఞయూ జగత్‌స్రష్ఠా వివరించి:పాలకో హరి:| సంహర్తా కాలరుద్రాఖ్యో నమస్తసై#్మ పినాకినే||

తీర్థానాముత్తమం తీర్థం క్షేత్రాణాం క్షేత్రముత్తమమ్‌ | తత్రైవ నైమిషారణ్య శౌనకాద్యాస్తపోధనా: దీర్ఘసత్రం ప్రకుర్వంత:సత్త్రిణ:కర్మచేతస:|| 2

తేషాం సందర్శనౌత్సుక్యాదాగతో హి మహాతపా: వ్యాసశిష్యో మహాప్రాజ్ఞో లోమశో నామ నామత:'|| 3

తత్రాగతం తే దదృశుర్మునయో దీర్ఘసత్రిణ: ఉత్తస్థుర్యుగపత్‌ సర్వే సార్ఘ్యహస్తా: సముత్సుకా:| 4

దత్త్వార్ఘ్యపాద్యం సత్కృత్యమునయో వీతకల్మషా:| తం పప్రచ్ఛుర్మహాభాగా: శివధర్మం సవిస్తరమ్‌|| 5

మొదటి అధ్యాయము

వ్యాసుడు పలికెను:ఎవరి ఆజ్ఞచే బ్రహ్మ జగత్తును సృజించునో,విష్ణువు పాలించునో,కాలరుద్రుడనువాడు సంహరించునో అట్టి పినాకి (పరమశివుని) కి నమస్కారము.(1)తీర్థములన్నింటిలోఉత్తమమైన తీర్థము,క్షేత్రములలో ఉత్తమక్షేత్రము అగు నైమిషారణ్యము నందు కర్మయందాసక్తిగల వారు. యజ్ఞము చేయువారు తపోధనులూ అగు శౌనకాది మహమునులు దీర్ఘకాలము చేయబడు యజ్ఞమును చేయుచూవుండిరి. (2) వారిని సందర్శించదలిచి వ్యాసశిష్యుడు, గొప్ప తపస్సంపన్నుడు మేధావీ అగు లోమశుడు అక్కడికేతెంచెను.(3) అక్కడికేతెంచిన లోమశుని,దీర్ఘసత్రలైన మునులుచూచి పూజా ద్రవ్యమును గ్రహించి ఉత్సుకతతో ఒక్కమారుగా లేచి నిలుచుండిరి. (4) నిర్మలులైన ఆమునులు లోమశుని అర్ఘ్య పాద్యాదులచే సత్కరించి శివధర్మమును సవిస్తరముగా చెప్పుమని అడిగిరి (5)

ఋషయ ఊచు:

కథయస్వ మహాప్రాజ్ఞ దేవదేవస్య శూలిన: | మహిమానం మహాభాగ ధ్యానార్చనసమన్వితమ్‌ ||6

సంమ్మార్జనే కిం ఫలం స్యాత్తథా రంగవలీషు చ | ప్రదానే దర్పణస్యాథ తధా వైచామరస్య చ ||7

ప్రదానే చ వితానస్య తథా ధారాగృహస్య చ | దీపదానే కిం ఫలం స్యాత్పూజాయాం కింఫలం భేవేత్‌|| 8

కాని కాని చ పుణ్యాని కథ్యతాం శివపూజనే | ఇతిహాసపురాణాని వేదాధ్యయనమేవ చ|| 9

శివస్యాగ్రే ప్రకుర్వంతి కారయన్త్యథవా నరా:| కిం ఫలం చ నృణాం తేషాం కథ్యతాం విస్తరేణ హి|| 10

శివాఖ్యానపరో లోకే త్వత్తో నాన్యో స్తి వై మునే| 11

ఇతి శ్రుత్వా వచస్తేషాం మునీనాం భావితాత్మనామ్‌ఉవాచ వ్యాసశిష్యో సౌ శివమాహాత్మ్యముత్తమమ్‌ || 12

ఋషులు పలికిది ఓ మహాప్రాజ్జ| శూలముధిరించు ఆ దేవదేవుని మహిమను ధ్యాన అర్చనసహితముగా తెలుపుము.(6)

సమ్మార్జనము వలన ముగ్గులుపోయుట దర్పణము చూపుటవలన,చామరము వీచుట వలన ఏ ఫలముకలుగును?(7)

మేల్కట్టు (చందున) నొసగుట చేగ, ధారాగృహము) చేత దీపమునొసగుటచేత పూజనొసగుటచేత, పూజనొనరించుట చేత ఏ ఫలము కలుగును? (8)

శివపూజయందలి పుణ్యములేవో తెలియుజేయును ఇతిహాస పురాణముల మరియు వేదముల అధ్యయనమును (9) శివుని ఎదుట జరుపు వారికి లేదా జరిపించు జనులకు ఏ ఫలము అభించునో విస్తరముగా తెలియజేయును. (10)

ఓ మునీ! ఈ లోకములో శివుని కథలు చెప్పగలవాడు (శివాఖ్యాన పరుడు) నీవు తప్ప వేరెవ్వరూ లేరు.(11) పుణ్యాత్ములైన ఆ మునుల మాటలను విని వ్యాసశిష్యుడగు లోమశుడు ఉత్తమమైన శివమాహాత్మ్యమును తెలిపెను.(12)

లోమశ ఉవాచ:

అష్టాదశపురాణషు గీయతే వై పర: శివ: తస్మాచ్చివస్య మాహాత్మ్యం వక్తుం కో పిన న పార్వతే||13

శివేతి ద్వక్షరం నామ వ్యాహరిష్యంతి యే జేనా:| తేషాం స్వర్గశ్చ మోక్షశ్చ భవిష్యతి న చాన్యథా|| 14

ఉదారో హి మహాదేవో దేవానాం పతిరీశ్వర: యేన సర్వం ప్రదత్తం హి తస్మాత్సర్వ ఇతి సృత:|| 15

తే ధన్యాస్తే మహాత్మానో యే భజంతి సదాశివం ||16

వినా సదాశివం యో హి సంపారం తర్తుమిచ్చతి| స మూఢో హి మహాపాప: శివద్వేషీ న సంశయ:17

భక్షితం హి గరం యేన దక్షయజ్ఞో వినాశిత: కాలస్య దహనం యేన కృతం రాజ్ఞ: ప్రమోచనమ్‌|| 18

లోమశుడు పలికెను: అష్టాదశ పురాణములో పరమశివుడు కీర్తించబడుచున్నాడు కావున శివుని మాహాత్మాన్ని తెలుపుట ఎవరి వల్లనూ సాధ్యం కాదు(13) ఏజనులు శివ అను రెండక్షరాల పేరు ను పలికెదరో వారు స్వర్గమును మరియు మోక్షమును,పొందెదరు. వేరే విధముగా కాదు. (14) దేవతలపతియగు ఈశ్వరుడు మహాదేవుడు ఉదారుడు, అంతా ఇచ్చి వేసినందున సర్వ అని పిలువబడుచున్నాడు. (15) ఎల్లప్పుడూ శివుని భజించువారు ధన్యులు మహాత్ములు (16) సదాశివుని వదలి సంసారమును దాటగోరువాడు నిశ్చయముగా మూడుడు మహాపాపి, శివద్వేషి 17. సదాశివుడే గరళమును భక్షించెను. దక్షయజ్ఞమును నాశనముచేసెను కాలుని దహనము చేసెను.రాజును ముక్తుడిని చేసెను. (18)

ఋషయ ఊచు:

యథాగరం భక్షితం చ యథా యజ్ఞో వినాశిత:| దక్షస్య చ తథా బ్రూహి వరం కౌతూహలం హిన:||19

ఋషులుపలికిరి సదాశివుడు విషమునెట్లు భక్షించెనో దక్షుని యజ్ఞము ఎట్లు నాశనం చేయబడెనోతెలుపుము .మాకు మిక్కిలి కుతూహలము గలదు. (19)

సూత ఉవాచ:

దాక్షాయణీ పురా దత్తా శంకరాయ మహాత్మనే : వచనాద్ర్బహ్మణోవిప్రా దక్షేణ పరమేష్ఠినా||

ఏకదా హిస దక్షో వై నైమిషారణ్యమాగత:| యదృచ్ఛావశమాపన్న ఋషిబి:పరిపూజిత:||21

స్తుతిభి ప్రణపాతైశ్చ తథా సర్వై: సురాసురైః తత్ర స్థితో మహాదేవో నాభ్యుత్థానాభివాదనే||

చకారాస్య తత: క్రుద్దో దక్షో వచనమబ్రవీత్‌| 22

సర్వత్ర సర్వే హి సురాసురా భృశం నమంతి మాం విప్రవరాస్సముత్సుకా:||

కథం హ్యసౌ దుర్జనవన్మహాత్మా భూతాదిభి ప్రేతపిశాచయుక్త:||

శ్శశానవాసీ నిరపత్రపో హ్యయం కథం ప్రణామం న కరోతి మేధునా || 23

పాఖండినో దుర్జనా పాపశీలా విప్రం దృష్ట్యా చోద్దతా ఉన్మదాశ్చ|

వధ్యాస్త్యాజ్యా సద్భిరేవం విధా హి తస్మాదేనం శాపితుం చోద్యతో స్మి|| 24

సూతుడు పలికెను: ఓ విప్రులారా| పూర్వము పరమేష్ఠియగు బ్రహ్మ యొక్క మాటవల్ల దక్షుడు మహాత్ముడైన శంకరునకు తనపుత్రికను (దాక్షాయణిని) ఇచ్చెను. (20) ఒకనాడు ఆ దక్షుడు యదృచ్ఛావశమున నైమిషారణ్యమునకు వచ్చెను. ఋషులచే పూజింపబబెను. (21) అలాగే సురాసురులందరిచే స్తుతులచే నమస్కారములచే పూజింపబడెను అక్కడే వున్న మహాదేవుడు వున్న మహాదేవుడు దక్షునకు లేచి నిలుచుండుట, అభివాదము చేయుట చేయలేదు. అందుకు కోపించిన దక్షుడు ఇట్లు పలికెను (22) అన్నిచోట్ల ( అన్ని ప్రదేశములలో) సురాసురులు. బ్రాహ్మణోత్తము లందరూ ఉత్సుకతతో నన్నుగా (బాగుగా) నమస్కరిస్తారు. ఈ మహాత్ముడట్లు దుర్జనునివలె భూతములు, ప్రేతములు, పిశాచములతో కలిసియుండి ,శ్మశానములో నివసించువాడై సిగ్గులేక నాకు ఇప్పుడు నమస్కారము చేయుటలేదు? (23)పాఖండులు దుర్జనులు పాపస్వభావులు విప్రుని చూచి గర్వితులు మదమునొందిన వారు వీరు వధింపయోగ్యులు సజ్ఞనులు ఇలాంటివారిని వదిలివేయవలెను. కనుక ఇతనిని శపించుట ఉద్యుక్తుడనై యున్నాను.(24)

ఇత్యేవముక్త్వా స మహాతపస్తదా రుషాన్వితో రుద్రమాదం బభాషే||

శృణ్వంత్వమీ విప్రతమా ఇదానీం వచో హిమే కర్తుమిహార్హథైతత్‌: రుద్రో వ్యాయం యజ్ఞబాహ్యో మతో మే వర్ఱాతీతో వర్ణపరో యతశ్చ 26

నందీ నిశమ్య తద్వాక్యం శైలాదో హి రుషాన్విత:| అబ్రవీత్త్వరితో దక్షం శాపదం తం మహాప్రభమ్‌|| 27

ఈ విధముగా పలికి ఆ గొప్ప తపస్సంపన్నుడగు దక్షుడు రోషముతో రుద్రుని ఉద్దేశించి ఇట్లు పలికెను (25) ఓ విప్రశ్రేష్ఠులారా| నా మాటనువినుడు మీరు ఇట్లు చేయదగినవారు ఈ రుద్రుడు వర్ణముల కతీతుడు వర్ణములకు పరము అయినందున యజ్ఞములకు అనుమతించరాదని ని నిశ్చయము (26) శిలాదపుత్రుడైన నంది ఆమాటను విని రోషపూరితుడాయోను.వెంటనే శివునికి శాపమొసంగిన ఆ గొప్పకాంతి సంపన్నుడగు దక్షుడిని ఇట్లు పలికెను (27)

నంద్యువాచ:

యజ్ఞోబాహ్యో హి మే స్వామీ మహేశోయం కృత: కథమ్‌ యస్య స్మరణమాత్రేణ యజ్ఞాశ్చ సఫలా హ్యమీ|| 28

యజ్ఞో దానం తపశ్చైవ తీర్థాని వివిధాని చ యస్య నామ్నా పవిత్రాణి సోయం శప్తో ధునా కథమ్‌ ||29

వృథా తే బ్రహ్మచాపల్యాచ్చయం దక్ష దుర్మతే| యేనేదం పాలితం విశ్యం సర్వేన చ మహాత్మనా || శప్తోయం స కథం పాప రుద్రోయం బ్రాహ్మణాధమ| 30

నందిపలికెను: ఎవరిస్మరణ సూత్రముచే ఈ యజ్ఞములు ఫలవంతములో అట్టి నాస్వామి మహేశుడు యజ బాహుడెట్లు చేయబడెను ? (28) ఎవరి నామమ చేతనే యజ్ఞము దానము తపస్సు మరియు వివిధ తీర్థములు పవిత్రములో అట్టి శివుడెట్లు శపింపబడెను (29) చెడుబుద్దిగల దక్షా| నీ బ్రహ్మచాపల్యము వలన ఈ శివుడు అనవసరముగా శపింపబడెను. ఈ విశ్వమంతా ఎవరిచే పాలింపబడుచున్నదో అట్టి సర్వుడగు మహాత్ముడు రుద్రుడు ఓ బ్రాహ్మణాధమా! ఎట్టు శపింబడెను?(30)

ఏవం నిర్భర్సితస్తేన నందినా హి ప్రజాపతి నందినం చ శశాపాథ దక్షో రోషసమన్విత:||31

యూయం సర్వే రుద్రవరా: వేదబాహ్యోశ్చ వైభృశం| శప్తా హి వేదమార్దైశ్చ తథా త్యక్తా మహర్షిభి:|| 32

పాషండవాదసంయుక్తా శిష్టాచారబహిష్కృతా : కపాలిన : పానరతాస్తథా కాలముఖా హ్యమీ|| 33

ఇతి శప్తాస్తదా తేన దక్షేణ శివకింకరా :| తదా ప్రకుపితో నందీ దక్షం శప్తుం ప్రచక్రమే || 34

ఈవిధముగా నందిచే నిందింపబడిన ప్రజాపతి దక్షుడు రోషముతో నందిని కూడా శపించెను .

మీరంతా రుద్రుని వరించినవారు పూర్తిగా వేదబాహ్యులుకూడా వేదమార్గములచే శపింపబడిన నారు. అలాగే మహర్షుల చేత విడిచి వేయబడినారు. (32) మీరు పాషండవాదులు, శిష్టాచారముల నుండి బహిష్కృతులు కపాలముల ధరించువారు పానమునందాసక్తి కలవారు అలాగే కాలముఖులు (33) ఆ విధంగా అపుడు శివకింకరులు దక్షుని చే శపింపబడినారు. అపుడు బాగా కోపించిన నంది దక్షుడిని శపించుటకు పూనుకొనెను. (34)

శప్తా వయం త్వయా విప్ర సాధవ: శివకింకరా:|వృథైవ బ్రహ్మచాపల్యాదహం శాపం దదామి తే|| 35

వేదవాదరతా యూయం నాన్యదస్తీతివాదిన: కామాత్మానా : స్వర్గపరా: లోభమోహసమన్వితా:|| 36

వైదికం చ పురస్కృత్య బ్రాహ్మణా : శూద్రయాజకా: దరిద్రిణో భవిష్యంతి ప్రతిగ్రహరతాస్సదా|| 37

దక్ష కేచిద్భవిష్యంతి బాహ్ర్మణా బ్రహ్మరాక్షసా:|

లోమశ ఉవాచ:

విప్రాస్తే శపితాస్తేన నందినా కోపినా భృశమ్‌ || 38

అథాకర్ల్యశ్వరో వాక్యం నందిన ప్రహసన్నిన | ఉవాచ వాక్యం బోధయుక్తుం సదాశివ:|| 39

ఓ విప్రుడా! సాధువులు, శివకింకరులునగు మేము అనవసరముగా (నీ) బ్రహ్మచాపల్యముచే శపింపబడినాము .నీకు శాపమిచ్చెను. (35) మీరు వేదవాదములందు ఆసక్తి చూపు వారు ఇంకేదియూ లేదని వాదించువారు కామస్వరూపులు స్వర్గమే పరమమనెడి వారు లోభమోహములతో కూడుకున్నవారు. (36) బ్రాహ్మణులు వైదికమును ముందుంచుకొని శూద్రులను పూజించువారు దరిద్రులు ఎల్లప్పుడూ గ్రహించుటయందు ఆసక్తిగల వారుగా కాగలరు. (37) దక్షా! కొంత మంది బ్రాహ్మణులు బ్రహ్మ రాక్షసులు కాగలరు. అనగా లోమశుడు పలికెను. ఇట్లు విప్రులు బాగా కోపించిన నందిచే శపింపబడినారు అపుడు నందివాక్యమును విన్న సదాశివుడు నవ్వుచూ మధురమైనది.జ్ఞానముతో కూడినది అగు వాక్యమును పలికెను. (39)

మహాదేవ ఉవాచ:

కోపం నార్హసి వై కర్తుం బ్రాహ్మణాన్‌ప్రతి వై సదా | బ్రాహ్మణో గురవో హ్యేతే వేదవాదరతాస్పదా ||40

వేదో మంత్రమయస్సాక్షాత్తథా సూక్తమయో ధృవం| సూక్తే ప్రతిష్ఠితో హ్యాత్మా సర్వేషామపి దేహినాం|| 41

తస్మాన్నాత్మవిదో నింద్యా: ఆత్మైవాహం న చేతర కోయం కస్త్వం క్వ చాహం వై కస్మాచ్చప్తా హి వై ద్విజా: 42

ప్రపంచరచనాం హిత్వా బుద్దో భవ మహామతే | తత్త్వజ్ఞానేన నిర్వర్త స్వస్థ: క్రోధాదివర్ణిత:||43

మహాదేవుడు పలికెను : బ్రాహ్మణుల పట్ల కోపించుట నీకెప్పటికీ తగదు వేదవాదములందు ఆసక్తి గల ఈ బ్రాహ్మణులు ఎప్పటికీ గురువులే. (40) వేదము సాక్షాత్తుగా మంత్రమయము. అలాగే పూర్తిగా సూక్తములుకలది. జీవులందరి మంచివాక్కునందు ఆత్మనెలకొనివున్నది, (41) కనుక ఆత్మజ్ఞానముకల ఈ బ్రాహ్మణులు నిందింపబడరాదు. ఆత్మయన నేనే వేరుకాదు ఇతనుఎవరు? నీ వెవరు? నేనెక్కడ? ఎందుకని ఈ బ్రాహ్మణులు శిపంపబడినారు? (42) ఓ గొప్పబుద్ది కలవాడా! ప్రపంచ రచనను వదలి జ్ఞానిని కమ్మ. తత్త్వజ్ఞానము చే వెనుదిరిగి నీ యందు వుండుము (స్వస్థ) క్రోదము మొదలైన వానిని విడిచివేయుము. (43) ఏవం ప్రబోధితస్తేన శంభునా పరమేష్టినా |వివేకపరమో భూత్వా శైలాదో హి మహతపా:||

శివేన సహ సంగమ్య పరమానందసంప్లుత:| 44

దక్షో పి హి రుషావిష్ట ఋషిభి పరివారిత:| య¸° స్థానం స్వకం తత్ర ప్రవివేశ రుషాన్విత:||

శ్రద్ధాం విహాయ పరమాం శివపూజకానాం నిందాపరస్సు హి బభూవ నరాధమశ్చ|

సర్వైర్మహర్షిభిరుపేత్య స తత్ర శర్వం దేవం నినింద నబభూవ కదాపి శాస్త:||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏ కాశీతిసాహస్ర్యాం సంహితాయాం ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే పురాణప్రస్తావదక్షవ్రత్తాన్తవర్ణనం నామ ప్రథమోధ్యాయ:

ఈ విధంగా పరమేష్టియగు శివునిచే ప్రబోధితుడైన తపస్వియగు నంది వివేకమును పొంది శివునితో కలిసి పరమానందమున తేలియాడెను (44) ఒక దక్షుడు రోషముతో ఋషుల వెంటనిడుకొని తన స్థానాన్ని చేరి రోషముతో అందు ప్రవేశించెను. (45)పరమశ్రద్దను విడిచి ఆదక్షుడు శివపూజకుల నిందించు నరాధముడాయెను, అందరు మహర్షులతో కలిసి అక్కడ శివుని నిందించెను. ఎప్పటికీ శాస్తుడు కాకపోయోను. (46)

స్కాందపురాణమందలి మాహేశ్వర ఖండములోని కేదారఖండములో

పురాణ ప్రస్తావ దక్షవృత్తానమును మొదటి అధ్యాయము సమాప్తము.

దక్షయజ్ఞం ప్రతి సతీదేవ్యాగమనం 1-2 అ

ద్వితీయో2ధ్యాయ:

లోమశ ఉవాచ:

ఏకదా తు తదా లేన యజ్ఞ: ప్రారంభితో మహాన్‌ | తత్రాహూతాస్తదా సర్వే దీక్షితేన తపస్వినా || 1

ఋషయో వివిధాస్తత్ర వశిష్ఠాద్యాస్సమాగతా :| అగస్త్య: కశ్యపోత్రిశ్చ వామదేవస్తథా భృగు:||2

దధీచో భగవాన్‌ వ్యాసో భరద్వాజోథ గౌతమ: ఏతే చాన్యే చ బహవ సమాజగ్ముర్మహర్షయ:|| 3

తథా సర్వే సురగణా లోకాపాలాస్తథాపరే విద్యాధరాశ్చ గంధర్వా: కిన్నరాప్సరసాం గణా:||4

(సత్య) సప్తలోకాత్సమానీతో బ్రహ్మ లోకపితామహ: వైకుంఠాచ్చ తథా విష్ణు: సమానీతో మఖం ప్రతి|| 5

రెండవ అధ్యాయము

లోమశుడు పలికెను: ఒకప్పుడు దక్షుడు ఒక గొప్ప యజ్ఞమును ప్రారంభించెను. దీక్ష యందుండిన ఆ తపస్విచే అందరూ ఆయజ్ఞానికి అహ్వానింపబడిరి. (1) వశిష్ఠుడు అగస్యుడు , కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచీ, భగవాన్‌వ్యాసుడు భరద్వాజుడు, గౌతముడు మరియు ఇతర ఋషులు యజ్ఞమునకు వచ్చిరి (2,3) అలాగే సురగుణాలు , లోకపాలకులు విద్యాధరులు,గంధర్వులు , కిన్నరులు ,అప్సరసలు వచ్చిరి. (4) సత్యలోకమునుండి బ్రహ్మ వైకుంఠము నుండి విష్ణువు యజ్ఞమునకు పిలువబడిరి.(5)

దేవేంద్రో హి సమానీత ఇంద్రాణ్యా సహ సుప్రభ: తథా చంద్రో హి రోహిణ్యా వరుణ ప్రియయా సహ|| 6

కుబేర : పుష్పకారూఢో మృగారూడోథ మారుత: బస్తారూఢ పావకశ్చ ప్రేతారూఢో థ నిర్‌బుతి: ||7

ఏతే సర్వే సమాయాతా యజ్ఞవాటే ద్విన్మన : తేసర్వే సత్కృతాస్తేన దక్షేణ చ దురాత్మనా|| 8

భవవాని మహార్హాణి సుప్రభాణి మహాంతి చ త్వష్ట్రా కృతాని దివ్యాని కౌశ##ల్యేన మహాత్మనా || 9

తేషు సర్వేషు ధిష్ణ్యేషు యథాజోషం సమాస్థితా:|| 10

చక్కని కాంతిగల దేవేంద్రుడు ఇంద్రాణితో చంద్రుడు రోహిణితో వరుణుడు ప్రియతో యజ్ఞమునకు వచ్చిరి, కుబేరుడు పుష్పకము పై మారుతుడు మృగముపై అగ్ని అజము పై నిర్‌ఋతి ప్రేతము పై దక్షుని యజ్ఞవాటికకు ఏతెంచిరి. దురాత్ముడైన దక్షుడు వారందరినీ సత్కరించెను కాంతివంతములు ,దివ్యములు అయిన గొప్పభవనములను త్వష్టచే నిర్మితములైన వానిని వారి వారి ఆనందానుసారము వారు చేరిరి.

వర్తమానే మహాయజ్ఞే తీర్థే కనఖలే తథా| ఋత్విజశ్చ కృతాస్తేన భృగ్వాద్యాశ్చ తపోధనా:|| 11

దీక్షాయుక్తస్తదా దక్ష: కృతకౌతుకమంగళ భార్యయా సహితో విపై#్ర: కృతస్వస్త్యాయత నో భృశమ్‌|| 12

రేజే మహత్త్వేన తదా సుహృద్భి పరిత సదా | ఏతస్మిన్నంతరే తత్ర దధీచిర్వాక్యమబ్రవీత్‌|| 13

కనఖలమను తీర్థము వద్ద మహాయజ్ఞము నిర్వహించబడుచుండగా , దక్షుని చేత భృగువు మొదలైన తపోధనులు ఋత్విక్కులుగా గ్రహింపబడిరి (11) అపుడు దీక్షాయుక్తుడై దక్షుడు దీక్షాసంబద్దమైన మంగళాదులను ఆచరించి భార్యతో కలిసి విప్రుల స్వస్తి వాక్కులను గ్రహించెను. (12) అపుడు మిత్రులతో కూడుకున్న దక్షుడు గొప్పగా ప్రకాశించెను. అంతలో దధీచీ ఇట్లు పలికెను (13)

దధీచిరువాచ:

ఏతే సురేశా ఋషయో మహత్తరా: | సలోకపాలాశ్చ సమాగతాస్తవ|

తథా పి యజ్ఞస్తు న శోభ##తే భృశం పినాకినా తేన మహాత్మనా వినా ||14

యేనైన సర్వాణ్యసి మంగళాని జాతాని శంసంతి మహావిపశ్చిత:|

ఏషో న దృష్టోత్ర పుమాన్పురాణో వృషధ్వజో నీలకంఠ: కపర్దీ|| 15

అమంగళాన్యేన చ మంగళాని భవంతి యేనాధికృతాని దక్ష|

త్రియంబకేనాథ సుమంగళాని భవంతి సద్యో హ్యపమంగళాని ||16

తస్మాత్త్యయైన కర్తవ్యమాహ్వానం పరమేష్ఠినా | త్వరితం చైవ శ##క్రేణ విష్ణునా ప్రభవిష్ణునా ||17

సర్వైరేవ హి గన్తవ్యం యత్ర దేవో మహేశ్వర:|| 18

దాక్షాయణ్యా సమేతం తమానయధ్వం త్వరాన్వితా: తేన సర్వం పవిత్రం స్యాచ్ఛంభునా యోగినా భృశమ్‌||19

యస్య స్మృత్యా చ నామోక్త్యా సమగ్రం సుకృతం భ##వేత్‌| తస్మాత్సర్వప్రయత్నేన సమానేయా వృషధ్వజ:20

దధీచి పలికెను:ఈ సురేంద్రుడు ,గొప్ప ఋషులు, లోకపాలకులు నీ వద్దకు ఏతెంచిరి. అయిననూ , పినాకపాణియగు ఆ మహాత్ముడు లేక ఈ యజ్ఞము అంతగా శోభించుట లేదు. (14) ఎవరివల్ల అన్నీ శుభములుగా అవుతాయని గొప్పవిద్వాంసులు అంటారో అట్టి వృషధ్వజుడు నీలకంఠుడు కపర్దియైన పురాణపురుషుడు ఇచ్చట కనిపించుటలేదు (15) దక్షా! శివుని వలన అమంగళాలు మంగళాలుగా, మంగళాలు అమంగళాలుగా అవుతాయి. (16)కనుక నీవు శివుని ఆహ్వానించవలెను ఇంద్రుడు బ్రహ్మ, విష్ణువు, అందరూ త్వరగా మహేశ్వరుడున్న చోటికి వెళ్ళవలెను. (17,18) దాక్షాయణితో కలిసివున్న అతనిని త్వరగా కొనిరండు: యోగియగు శివునిచే సర్వమూ పవిత్రమగును. (19) ఎవరి స్మరణముచేత, నామ పఠనము చేత సమగ్రపుణ్యము లభించునో అట్టి వృషధ్వజుడైన శివుని ఎలాగైనా తీసుకొనిరావలెను (20)

తస్య తద్వచనం శ్రుత్వా ప్రవాసన్నివ దుష్టధీః| మూలం విష్ణుర్హి దేవానాం యత్ర ధర్మస్సనాతన:||

యస్మిన్‌ వేదాశ్చ యజ్ఞాశ్చ కర్మాణి వివిధాని చ| ప్రతిష్ఠితాని సర్వాణి సోసౌ విష్ణురిహాగత:||22

సత్యలోకాత్సమాయూతో బ్రహ్మా లోకపితామహ:| వేదైశ్చోపనిషద్భిశ్చ ఆగమైర్వివిధైస్సహ||23

తథా సురగణౖస్సాకమాగతస్సురరాట్‌ స్వయమ్‌| తథా యూయం సమాయాతా ఋషయో వీతకల్మషా:||24

యే యే యజ్ఞచిత్తా శాంతాస్తే తే సర్వే సమాగతా:| వేదవేదార్థతత్త్వజ్ఞా: సర్వే యే యే దృఢావ్రతా:|| 25

దధీచి మాటలను విని దుష్ట బుద్ధియగు దక్షుడు పరిహసించు చున్నట్లుగా (ఇట్లనెను) సనాతన ధర్మమునకు నెలవైన విష్ణువే దేవతలకు మూలము (21) ఎవరియందు ఈ వేదాలు యజ్ఞాలు వివిధ కర్మలు అన్నీ ప్రతిష్ఠితమై వున్నాయో అట్టి విష్ణువు ఇక్కడకేతెంచెను. (22) వేదములు, ఉపనిషత్తులు, వివిద ఆగమములతో సహా పితామహుడైన బ్రహ్మ సత్యలోకమునుండి వచ్చెను. (23) స్వయముగా ఇంద్రుడు సురగణములతో వచ్చినాడు. ఇక నిర్మలులైన మీ ఋషులంతా విచ్చేసితిరి (24) ఎవరెవరైతే యజ్ఞమునందు మననుంచెదరో, వేదవేదార్థతత్త్వమును తెలిసిన వారో దృఢవత్రులో శాంతచిత్తులో వారంతా విచ్చేసిరి. (ఎవరెవరైతే యజ్ఞమునందు మనసుంచెదరో శాంతచిత్తులో వారంతా విచ్చేసిరి మీరంతా వేదవేదార్థతత్త్వమును తెలిసిన వారు,దృడవ్రతులు) 25

అత్రైవ చ కిమస్మాకం రుద్రేణాసి ప్రయోజనమ్‌ | కన్యా దత్తా మయా విప్రా బ్రహ్మణా నోదితేన హి||

అకులీనో హ్యసో విప్రా నష్టో నష్టప్రియస్సదా| భూతప్రేతపిశాచానాం పతిరేకో దురత్యయ:|| 27

ఆత్మసంభావితో మూఢ: స్తబ్థో మౌనీ సమత్సర:| కర్మణ్యస్మిన్నయోగ్యో సౌనానీతో హి మయాధునా|| 28

తస్మాత్త్వయా న వక్తవ్యం పునరేవం వచో ద్విజ | సర్వైర్బవద్భి: కర్తవ్యో యజ్ఞో మే సఫలో మహాన్‌||29

ఏతచ్ఛృత్వా వచస్తస్య దధీచిర్వాక్యమబ్రవీత్‌|| 30

ఒక ఇక్కడ మనకు శివుని వల్ల ప్రయోజనమేమి? బ్రహ్మ ప్రేరేపించుటవల్లనే నేను శివునకు కన్యనొసగితిని. ( 26) ఓ విప్రులారా! ఈ శివుడు మంచి వంశమున పుట్టిన వాడుకాదు. వంశమున పుట్టిన వాడుకాదు. చెడుపు కలిగినవాడు ప్రియురాలు నశించినవాడు (ప్రియమైన వానిని నశింపజేయువాడు ) భూత , ప్రేత పిశాచములప్రభువు. జయింపవీలులేనివాడు (27) తనను తాను గొప్పగా భావించువాడు, మూర్థుడు .స్థాణువు , మౌనముగా నుండువాడు మత్సరముగలవాడు అందుకే నేను ఈ యజ్ఞకర్మయందు అయోగ్యుడైన శివుని పిలువలేదు (28) కనుక ఓ బ్రాహ్మణుడా నీవు ఇలాంటి మాటలు మళ్ళీ పలుకరాదు నా ఈ గొప్ప యజ్ఞమును మీరంతా సఫలము చేయుడు (29) దక్షుని ఈ మాటలను విని దధీచి పలికెను (30)

దధీచిరువాచ:

సర్వేషామృషివర్యాణాం సురాణాం భావితాత్మనామ్‌ | అనయోయం మహాన్‌ జాతో వినా తేన మహాత్మనా|| 31

వినాశో పి మహాన్‌ సద్యో హ్యత్రత్యానాం భవిష్యతి| ఏవముక్త్వా దధీచో సావేక ఏవ వినిర్గత:|| 32

యజ్ఞావాటాచ్చ దక్షస్య త్వరిత: స్వాశ్రమం య¸°| మునౌ వినిర్గతే దక్ష: ప్రవాసన్నిదమబ్రవీత్‌|| 33

ఆ మహాత్ముడగు శివుడు లేనందుచే అందరు ఋషిశ్రేష్ఠులకు, గొప్ప దేవతలకుపెద్ద ఆశుభము కలిగినది. (31) ఇక్కడున్న వారందరికీ వెంటనే మహా వినాశముకలుగగలదు. అని పలికి దధీచి ఒక్కడే దక్షుని యజ్ఞవాటిక నుండి బయల్వెడలి (32) త్వరగా తన ఆశ్రమమునకు వెడలెను. (32,33) దధీచి ముని వెడలిపోగా దక్షుడు పరిహసించునట్లు ఇట్లుపలికెను (33)

గత: శివప్రియో వీరో దధీచిర్నామ నామత:| ఆవిష్టచిత్తా మందాశ్చ మిధ్యావాదరతా:ఖలా:|| 34

వేదబాహ్యా దురాచారాస్త్యాజ్యాస్తే హ్యత్ర కర్మణి | వేదవాదరతా యూయం సర్వే విష్ణువురోగమా:||35

యజ్ఞం యే సఫలం విప్రా : కుర్వంతు హ్యచిరాదివ తదా తే దేవయజనం చక్రు సర్వే మహర్షయ:|| 36

శివ ప్రియుడు, వీరుడు దధీచి వెళ్ళిపోయినాడు ఆవేశపరులు, మూర్ఖులు, మిద్యావాదమునందు ఆసక్తిగలవారు దుర్జనులు (34)వేదవిధానమును వదలినవారు చెడు ఆచారమును గలవారు ఈ యజ్ఞమునందు విడవదగినవారు ఓ విప్రులారా| వేదవాదమునందాసక్తి గలవారు, విష్ణువును ముందుంచుకొను (కర్మలనాచరించువారు) వారయిన(35) మీరంతా త్వరగా నా యజ్ఞమును సఫలము చేయుడు (అని దక్షుడు పలుకగా) మహర్షులంతా దేవయజ్ఞాన్ని ఆచరించారు (36)

ఏతస్మిన్నంతరే తత్ర పర్వతే గంధమాదనే దారాగృహే విమానే స్వసఖిఖి: పరివారితా|| 37

దాక్షాయణీ మహాదేవి చకార వివిధాస్తదా క్రీడావిమానమధ్యస్థా కందుకాద్యా: సహసశ్ర:|| 38

క్రీడాసక్తా తదా దేవీ దదర్శాథ మహాసతీ | యజ్ఞం ప్రయాంతర సోమం చ రోహిణ్యా సహితం ప్రభుమ్‌ 39

క్వ గమిష్యతి చంద్రో యం విజయే పృచ్ఛ సత్వరమ్‌ | తయోక్తా విజయా దేవీ తం పప్రచ్ఛ యథోచితమ్‌|| 40

కథితం తేన తత్సర్వం దక్షసై#్వవ మఖాదికమ్‌ తచ్ఛృత్వా త్వరితా దేవీ విజయా తాజసంభ్రమా|| కథయామాస తత్సర్వం యదుక్తం శశినా భృశమ్‌|| 41

ఇదే సమయంలో అక్కడ గంధమాదన పర్వతం పై స్నానగృహంలో తన సుఖలుతో కూడిన దక్షసుత క్రీడావిమాన మద్యనుండి కందుకము మొదలైన వివిధ క్రీడలు వేలకొద్దీ ఆడినది (37,38) క్రీడయందు మనసుంచిన ఆ దేవి రోహిణితో కలిసి (దక్ష) యజ్ఞమునకు వెళ్ళుచున్న చంద్రుని గాంచినది (39) విజయా! ఈ చంద్రుడు ఎక్కడకు వెళ్ళుచున్నాడో త్వరగా అడుగుము?అని (సతి)అనగా విజయ యథోచితముగా చంద్రుని ప్రశ్నించినది. (40) చంద్రుడు దక్షుని యజ్ఞము మొదలైన వాని గూర్చి చెప్పెను. (41) అదివిని విజయ మిక్కిలి సంభ్రమమునొంది, చంద్రునిచే చెప్పబడినదంతా (సతికి) చెప్పెను. (41)

విమృశ్య కారణం దేవి కిమాహ్వానం కరోతి న | దక్ష: పితా మే మాతా చ విస్మృతా మాం కుతో ధునా|| 42

పృచ్చామి శంకరం చాద్య కారణం కృతనిశ్చయా స్థాపయిత్వా సఖీస్తత్ర ఆగతా శంకరం ప్రతి ||43.

దదర్శ తం సభామధ్యే త్రిలోచనమవస్థితమ్‌ | గణౖ పరివృతం సర్వైశ్చండముండాదిభిస్తదా || 44

బాణో భృంగిస్తథా నందీ శైలాదో హి మహాతపా: మహాకాలో మహచండో మహాముండో మహాశిరా:||45

ధూమ్రాక్షో ధూమకేతుశ్ఛ ధూమ్రపాదస్తథైవ చ| ఏతే చాన్యే చ బహవో గణా రుద్రానువర్తిన:|| 46

(మమ్ములను) ఎందుకు ఆహ్వానించలేదు? అని కారణమును దేవి విమర్శించుకొనినది దక్షుడు నాతండ్రి నా తల్లి కూడా ఎందుకు నన్ను మరచినది? (42) నిశ్చయముగా నేడు శంకరుని (దీని) కారణమునడిగెదను. అని సతి తన సఖులను అక్కడే వుంచి శంకరుని వద్దకు వచ్చెను. (43) సభామధ్యలో చండ ముండమొదలైన గుణములచే పరివృతుడైన త్రిలోచమని గాంచెను. (44) బాణుడు భృంగి, శైలాదుడు మహాతపస్సంపన్నుడైన నంది మహాకాలుడు , మహాచండుడు, మహాయుండుడు, మహా శిరుడు (45) ధూమాక్షుడు, ధూమకేతువు, ధూమ్రపాదుడు ఇంకా ఇతరులు పెక్కుమంది రుద్రుని అనుసరించు గణములు(46)

కేచిద్భయానకా రౌద్రా :కబంధాశ్చ తథాపరే| విలోచనాశ్చ కేచిచ్చ వక్షోహీనాస్తథాపరే|| 47

ఏవం భూతాశ్చ శతశ: సర్వే తే కృత్తివాససః | జటాకలాపసంభూషాః సర్వే రుద్రాక్షభూషణాః || 48

జితేంద్రియా వీతరాగాః సర్వే విషయవైరిణ: ఏభి: సర్వై:పరివృత: శంకరో :||

దృష్ఠస్తయా ఉపావిష్ట అసనే పరమాద్భుతే|| 49

ఆక్షిప్తచిత్తా సహసా జగామ శివసంనిధిమ్‌ | శివేన స్థాపితా స్వాంకే ప్రీతియుక్తేన వల్లభా|| 50

ప్రేవ్ణూెదితా వచోభిస్సా బహుమానపుర:సరమ్‌ | కిమాగమనకార్యం మే వద శీఘ్రం సుమధ్యమే ||51

ఏవముక్తా తదా తేన ఉవాచాసితలోచనా ||52

కొందరు భయంకరమైన రూపమును కలిగినారు. ఇంకా కొందరు కేవలము మొండెమును కలిగినారు . కొందరు కళ్ళులేనివారు. కొందరు వక్షస్థలమేలేని వారు (47) ఆ విధంగా వందకొలది శివుని అనుచరులు జటలను ధరించిన వారు, రుద్రాక్షలను ధరించిన వారు (48) ఇంద్రియములను జయించినవారు ,వైరాగ్యసంపన్నులు , విషయములను దూరముగా నుండువారు వీరందరిచే.పరివృతుడైన లోకములకు శుభము చేకూర్చుశివుని గొప్ప సింహాసనముపై కూర్చుని వుండగా సతీదేవి చూచినది, (49)మనస్సులాగగా ఒక్క మారుగా శివుని చేరినది శివుడు సతీదేవిని ప్రేమగా తన ఒడిలో కూర్చోబెట్టుకొనెను .(50) ఎంతో ఆదరముతో ప్రేమతో శివుడు నీరాకకు కారణమేమి ? సుమధ్యమా! త్వరగా తెలియజేయుమనిన సతీదేవి ఇట్లుపలికినది (51,52)

సత్యువాచ:

పితుర్మమ మహాయజ్ఞే కస్మాత్తవ న రోచతే గమనం దేవ దేవేశ తత్సర్వం కథయ ప్రభో|| 53

సుహృదామేష వై ధర్మ: సుహృద్భిస్సహ సంగతమ్‌| కుర్వన్తి యన్మహాదేవ సుహృదాం ప్రీతివర్ధినమ్‌|| 54

తస్మాత్సర్వప్రయత్నేన అనాహులో పి గచ్ఛ భో: యజ్ఞవాటం పితుర్మే ద్య వచనాన్మే సదాశివ|| 55

సతీదేవి పలికెను .ఓ దేవదేవేశ! నా తండ్రి చేయు యజ్ఞము నకు వెళ్ళుట నీకెందుకు ఇష్టముకాకున్నది? చెప్పుము (53)

మిత్రులు ప్రీతిని పెంపొందించునట్లు వారితో కలిసి వుండుట మిత్రుల ధర్మము .(54) కనుక ప్రభూ ఆహ్వానింపబడకపోయిననూ నీవు నామాటపై నాతండ్రి యజ్ఞవాటికకు ఏదో విధంగా వెళ్ళుము (55)

తస్యాస్తద్వచనం శ్రుత్వా బభాషే సూనృతం వచ: త్వయా భ##ద్రే నగంతవ్యం దక్షస్య యజనం ప్రతి|| 56

తస్య యే మానినస్సర్వే ససురాసురకిన్నరా :!తే సర్వే యజనం ప్రాప్తా పితుస్తవ న సంశయ:|| 57

అనాహూతాశ్చ యే సుభ్రు గచ్చన్తి పరమనిర్ధమ్‌| అపమానం ప్రాప్రువన్తి మరణాదధికం తత:|| 58

పరేషాం మందిరం ప్రాప్త ఇంద్రోపి లఘతాం వ్రజేత్‌| తస్మాత్త్వయా న గంతవ్యం దక్షస్య యజనం శుభే || 59

సతీదీవి పలికిన పలుకులనాలకించి (శివుడు) సత్యమైన వాక్కును పలికెను. ఓ కల్యాణీ !దక్షుని యజ్ఞమునకు నీవు వెళ్ళరాదు. (56) దక్షునికి ఎవరు గౌరవనీయులో (పూజ్యులో) అట్టి సుర అసుర, కిన్నరులంతా నిస్సందేహంగా నీ తండ్రి యజ్ఞమునకు ఏతెంచినారు (57) కానీ ఓ సుభ్ర ! ఆహ్వానింపబడకనే ఇతరుల గృహమునకు వెళ్ళువారు మరణము కంటెనూ అధికమైన అవమానమును పొందెదరు. (58) ఇతరుల గృహమునకు వెళ్ళు ఇంద్రుడైననూ అల్పత్వమును పొందును కనుక ఓ కల్యాణీ! దక్షుని యజ్ఞమునకునీవు వెళ్ళకూడదు(59)

ఏకముక్తా సతీ తేన మహేశేన మహాత్మనా | ఉవాచ రోషసంయుక్తం వాక్యం వాక్యవిదాం వరా|| 60

యజ్ఞోహి సత్యం లోకే త్వం సత్వం దేవవరేశ్వర | అనాహూతో సి తేనాద్య పిత్రా మే దుష్టచారిణా|| తత్సర్వం జ్ఞాతుమిచ్ఛామి తస్య భావం దురాత్మన:|| 61

తస్మాచ్చాద్యైవ గచ్చామి యజ్ఞవాటం పితుర్మమ| అనుజ్ఞాం దేహి మే నాథ దేవదేవ జగత్పతే||62

మహాత్ముడైన శివుడిట్లు పలుకగా వాక్యజ్ఞానులలో శ్రేష్ఠురాలగు సతీదేవి రోషముతో కూడిన వాక్యమును పలికెను. (60) ఓ దేవతాప్రభూ! సత్యముగా ఈ లోకములో నీవే యజ్ఞమై వున్నావు అట్టి నీవు దుష్టముగా చరించు నా తండ్రిచే ఆహ్వానించబడలేదు (61) దురాత్ముడైన అతని భావమునంతా తెలిసికొనగోరుచున్నాను. (61) కావున నా తండ్రి యజ్ఞవాటికకు నేడే వెళ్ళెదను. ఓ నాథా! జగత్పతీ ! నాకనుమతినిమ్ము(62)

ఇత్యుక్తో భగవాన్రుద్రస్తయా దేవ్యా శివ: స్వయమ్‌ విజ్ఞాతాఖిలదృగ్‌ద్రష్టా భగవాన్‌ భూతభావనః || 63

స తామువాచ దేవేశో మహేశ: సర్వసిద్దిద:! గచ్ఛ దేవి! త్వరాయుక్తా వచనాన్మమ సువృతే|| 64

ఏతం నందినమారుహ్య నానావిధగణాన్వితా | గణా: షష్ఠిసహప్రాణి జగ్మూ రౌద్రా శివాజ్ఞయా || 65

తైర్గణౖ : సంవృతా దేవీ జగామ పితృమందిరమ్‌ | నిరీక్ష్య తద్బలం సర్వం మహాబలో తివిస్మిత ||66

భూషణాని మహార్హాణి తేభ్యో దేవ్వై పరంతప! | ప్రేషయామాస చావ్యగ్రో మహాదేవో నుపృష్ఠత:|| 67

దేవ్యా గతం వై స్వపితుర్గృహం తదా విమృశ్య సర్వం భగవాన్‌ మహేశ:| దాక్షాయణీ పిత్రవమానితా సతీ న యాస్యతీతి స్వపురం పునర్జగౌ ||68

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతిసాహస్ర్యాం సంహితాయాం ప్రథమే మాహేశ్వర ఖండేకేదారఖండే

దక్షయజ్ఞం ప్రతి సతీదేవ్యాగమన వర్ణనం నామ ద్వితీయోధ్యాయ:

అని సతీదేవి పలుకగా భగవంతుడగు రుద్రుడు అన్ని జ్ఞానములను తెలిసినవాడు , ప్రాణులను సృజించి, పోషించువాడు, (63) సతీదేవిని ఉద్దేశించి సర్వ సిద్దులనొసగు మహేశుడిట్లుపలికెను. ఓదేవీ! వెళ్ళాలను త్వరగల నీవు వెళ్ళుము కాని నా మాటచే నానావిధములైన ఈ గణముల వెంటనిడుకోని ఈ నంది నధిరోహించి (వెళ్ళుము) (64) రుద్రునికి చెందిన అరవయి వేల గణముల శివుని ఆజ్ఞచే కదలినవి. (65) ఆ గణములచే కూడిన సతీదేవి తండ్రి గృహమునకు వెడలెను. ఆ బలగమునంతా చూసి మహాబలుడు మిగుల విస్మయమునొందెను (66) వారి వెంటనే ఆకులతలేని మహాదేవుడు అమూల్యమైన భూషణములను దేవికై పంపించెను. (67) సతీదేవి తన తండ్రి గృహమునకు వెళ్ళగా , భగవంతుడైన మహేశుడు అంతా విచారించి తండ్రిచే అవమానింపబడిన సతీదేవి వెళ్ళదని తన పురమునకు మరల వెళ్ళెను. (68)

శ్రీ స్కాంద పురాణములోని మహేశ్వర ఖండమునందలి

కేదారఖండమునందు దక్షయజ్ఞమునకు సతీదేవి వచ్చుట అను రెండవ అధ్యాయము సమాప్తము.

తృతీయోధ్యాయ:

లోమశ ఉవాచ:

దాక్షాయణీ గతా తత్ర యత్ర యజ్ఞో మహానభూత్‌ | తత్పితుస్సదనం గత్వా

నానాశ్చర్యసమన్వితమ్‌ || 1

ద్వారి స్థితా తదా దేవా అవతీర్య నిజాసనాత్‌ | నందినో మహాభాగా దేవలోకం నిరీక్ష్య చ ||2

మాతరం పితరం దృష్ట్యా సుహృత్సంబంధినాన్‌| అభివాద్వైవ పితరం మాతరం చ ముదాన్వితా || 3

బభాషే వచనం దేవి ప్రస్తావసదృశం తదా | అనాహూతస్త్వయా కస్మాత్‌ శంభుః పరమశోభన:|| 4

యేన పూతమిదం సర్వం సమగ్రం సచరాచరం | యజ్ఞో యజ్ఞవిదాం శ్రేష్ఠో యజ్ఞాంగో యజ్ఞదక్షిణ:||5

ద్రవ్యం మంత్రాదికం సర్వం హవ్యం కవ్యం చ యన్మయమ్‌| వినా తేన కృతం సర్వమపవిత్రం భవిష్యతి|| 6

మూడవ అధ్యాయము

లోమశుడు పలెకెను : దాక్షాయణి అనేక విడ్డూరాలు గల తన తండ్రి గృహమున కేగి అచట గొప్ప యజ్ఞము జరుగుచోటుకు చేరురొనెను. (1)ద్వారము వద్ద నిలుచున్న పుడు తమతమ అసనమునుండి దేవతలు దిగిరి అనందముతో యుండిన వారిని దేవలోకమును (సతీదేవి) చూచెను (2)సతీదేవి తండ్రిని తల్లిని, మిత్రులను. బాంధవులను చూచి ఆనందముగా తల్లకి , తండ్రికి అభివాదము చేసి ప్రస్తావమన్నట్లగా ఇట్లు పలికెను.(3) పరమకల్యాణుడైన శివుడు నీచేత ఎందువలన ఈ యజ్ఞమునకు ఆహ్వానింపబడలేదు ? (4) ఎవరిచేత ఈ చరాచర మంతా పవిత్రముగా చేయబడుచున్నదో , యజ్ఞము తెలిసినవారిలో శ్రేష్ఠుడు, యజ్ఞాంగము, యజ్ఞము యొక్క దక్షిణము(5) అగు శివునిచే నిండినది ఈ ద్రవ్యము, మంత్రదికము హవ్యం, పితృదేవతలకర్పింపబడు ఆహారము(కవ్యం) అట్టి శివుడు లేనిదే చేయబడినదంతా అపవిత్రముకాగలదు (6)

శంభునా హి వినా తాత కథం యజ్ఞ: ప్రవర్తతే| ఏతే కథం సమాయాతా బ్రహ్మణా సహితా :పిత: || 7

హే భృగో త్వం నజానాసి హే కశ్యస మహామతే | అత్రే వశిష్ట ఏకస్త్యం శక్ర కిం కృతమద్యతే || 8

హే విష్ణో త్వం మహాదేవం జానాసి పరమేశ్వరమ్‌ | బ్రహ్మన్‌ కింత్వంన జానాసి మహాదేవస్య విక్రమమ్‌ ||9

పురా పంచముఖో భూత్వా గర్వితో సి సదాశివమ్‌| కృతశ్చర్ముఖస్తేన విస్మృతో సి తదద్భుతమ్‌|| 10

భిక్షాటనం కృతం యేన పురా దారువనే విభు: శప్తో యం భిక్షుకో రుద్రో భవద్భి: సఖిభిస్తదా|| 11

శ##ప్తేనాపి చ రుద్రేణ భవద్భిర్విస్మృతం కథమ్‌|

తండ్రీ శంభుడు లేనిదే ఈ యజ్ఞమెట్లు కొనసాగును? బ్రహ్మతో సహా వీరంతా ఇక్కడికెలా వచ్చారు?(7) ఓ భృగూ! ఓయీ కశ్యప! ఓ వశిష్ఠ! మీకు తెలియదా? ఇంద్రా! నీకేమైనదీ నాడు? (8) ఓ విష్ణూ! నీకు పరమేశ్వరుడు తెలియును. బ్రహ్మ! నీకు మహాదేవుని విక్రమము తెలియదా? (9) పూర్వము పంచముఖుడుగా వుండి సదాశివుని పట్ల గర్వము చూపినపుడే కదా చతుర్ముఖుడవయితిని ఆ అద్భుతమును మరిచితివా? (10) దారువనములో మునుపు భిక్షాటనమాచరించిన భిక్షుకుడగు రుద్రుడు సఖులైన మీ చేత శపింపబడివాడు (11)అట్టి శపింపబడిన రుద్రునీ మీరెట్లు మరచితిరి?

యస్యావయవమాత్రేణ పూరితం సచరాచరమ్‌ || 12

లింగ భూతం జగత్సర్వం జాతం తత్‌క్షణమేవ హి | లయనాల్లింగమిత్యాహుః సర్వే దేవా సవాసవాః || 13

సర్వే దేవాశ్చ సంభూతాః యతో దేవస్య శూలినః | సో సౌ వేదాంతగో దేవస్త్వయా జ్ఞాతుం న పార్యతే || 14

ఎవరి అంశమాత్రము చేత ఈ చరాచరము (12) లింగభూతమైన జగత్తంతా జనించిన క్షణముననే పూరింపబడినదో, దానిని లయించుటవలన లింగ మని అందురు.(13)ఏ దేవుని నుండి ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఉద్భవించారో, అట్టి వేదాంత వేద్యుడగు (శివుని) దేవుని తెలుసుకొనుట నీవల్లకాదు.(14)

తస్యా: వచనమాకర్ణ్య దక్ష: క్రుద్దో బ్రవీద్వచ :|కిం త్వయా బహునోక్తేన కార్యం నాస్తీనా సాంప్రతమ్‌|| 15

గచ్ఛ వా తిష్ఠ వాభ్రదే కస్మాత్త్వం హి సమాగతా | అమంగళో హి భర్తా తే అశివో సౌ సుమధ్యమే -||16

అకులీనో వేదబాహ్యా భూతప్రేతపిశాచరాట్‌ తస్మాన్నాకారితో భ##ద్రే యజ్ఞార్థం చారుభాషిణి||17

మయా దత్తాసి సుశ్రోణి పాపినా మందబుద్దినా | రుద్రామావిదితార్థాయ ఉద్దతాయ దురాత్మనే || 18

తస్మాత్కాయం పరిత్యజ్య స్వస్థా భవ శుచిస్మితే | దక్షేణోక్తా తదా పుత్రీ లోకపూజితా|| 19

సతీదేవి మాటలను విని దక్షుడు కోపించి ఇట్లు పలికెను. నీవు పెక్కు మాటలాడినను ఇక్కడ ఇపుడు జరగవలసిన దేదీ లేదు (15) కల్యాణీ! వెళ్ళినా సరే !నీ వెందుకిక్కడకు వచ్చితివి? నీ భర్త అమంగళుడు అశుభుడు (16) మంచి వంశమున జన్మించినివాడు .వేదములకు దూరముగా నుండువాడు. భూత ప్రేత పిశాచాల రాజు. అందుకే సుభాషిణి !ఈయజ్ఞము కొరకు అతనిని ఆహ్వనించలేదు(17)పాపి మందబుద్దియై నేను ప్రయోజనశూన్యుడు గర్వితుడు, దురాత్ముడగు రుద్రునికి నిన్ను ఒసంగితిని (18) కనుక నీ దేహాన్ని వదలి స్వస్థురాలవు గమ్ము అని లోకపూజితయగు పుత్రికనుద్దేశించి దక్షుడు పలికెను. (19)

నిందాయుక్తం స్వపితరం విలోక్య రూపితా భృశమ్‌ చింతయన్తీ తదా దేవీ యాస్యామి మందిరే|| 20

శంకరం ద్రష్టుకామాహం కిం వక్ష్యే తేన పృచ్చితా| యో నిందతి మహాదేవం నింద్యమానం శృణోతి య: తావుభౌ నరకే యాతో యావచ్చంద్రదివాకరౌ|| 21

తస్మాత్త్యక్ష్యామ్యహం దేహం ప్రవేక్ష్యామి హుతాశనమ్‌|| 22

ఏవం మీమాంసమానా సా శివరుద్రేతిభాషిణీ అపమానాభిభూతా సా ప్రవివేశ హుతాశనమ్‌||23

అపుడు నిందతో కూడిన తన తండ్రిని చూచి సతీదేవి మిగుల రోషముతో శంకరుని చూడగోరి మందిరమును కెట్లు వెళ్ళగలను?(20) అతను ప్రశ్నించినపుడు ఏమి చెప్పగలను? మహాదేవుని (శివుని) నిందించువాడు, నిందించువాడు,నిందించుచుండగా వినువాడువీరిద్దరూ సూర్య చంద్రలున్నంతవరకు నరకమును పొందెదరు(21) కనుక నేను అగ్నియందు ప్రవేశించి దేహమును వదిలెదను (22) అని పరిపరివిధముల చింతించుచూ శివ రుద్ర అని పలుకుచూ అవమానముచే దు:ఖితమైన సతీదేవి అగ్నియందు ప్రవేశించెను (23)

హాహాకారేణ మహతా వ్యాప్తమాసీద్దిగంతరమ్‌ | సర్వే తే మంచమారుఢా :శ##సై#్ర: ర్వ్యాప్తా: నిరంతరా:|| 24

శ##సై#్ర: సై#్వ: జఘ్నరాత్మానం స్వాని దేహాని చిచ్చిదు: కేచిత్కరతలే గృహ్య శిరాంసి స్వాని చోత్సుకా:|| 25

నీరాజయం తస్త్వరితా భస్మీభూతాశ్చ జజ్ఞిరే| ఏవమూచుస్తదా సర్వే జగర్జురతిభీషణమ్‌ || 26

అపుడు గొప్ప హాహాకారముతో దిగంతరాలు నిండెను అసనమునధిరోహించిన,శస్త్రమును ధరించిన పెక్కుమంది(24) తమ శస్త్రములతో తమనే దెబ్బతీసుకొనినారు. తమ దేహములను ఛేదించినారు మరికొందరు ఉత్సుకులై తమ తలలను చేతులయందు వుంచుకొని (25) త్వరగా నీరాజనము చేయుచూ భస్మమై పోయినారు. అలాగే అందరూ పలికినారు అతి

భయంకరంగా గర్జించినారు. (26)

శస్త్రప్రహారై: స్వాంగాని చిచ్చిదుశ్చాతిభీషణా :| తే తథా విలయం ప్రాప్తా దాక్షాయణ్యా సమం తదా|| 27

గణాస్తత్రాయుతే ద్వేచ తదద్భుతమివాభవత్‌ | తే సర్వ ఋషయో దేవా: ఇంద్రాద్యా: సమరుద్గణా:| 28

విశ్వే శ్వినౌ లోకపాలాస్తూష్ణీంభూతాస్తదా భవన్‌| విష్ణుం వరేణ్యం కేచిచ్చ ప్రార్థయంత: సమంతత:|| 29

ఏవంభూతస్తదా యజ్ఞో జాతస్తస్య దురాత్మన:| దక్షస్య బ్రహ్మబంధోశ్చ ఋషయో భయమాగతా:|| 30

మిగుల భయంకరులైనవారు ఆయుధ ప్రహారములచే తమ శరీర అవయవాలను ఛేదించుకొని సతీదేవితో పాటు అపుడు విలయమును పొందిరి.(27)ఇరువది వేల గణాలపట్లు (విలయము నొందుట)అద్భుతము వలెనుండెను. ఆఋషులు దేవతలు, ఇంద్రుడు మొదలుకొని మరుద్గణములు (28) విశ్వేదేవతలు అశ్వినీదేవతలు లోకపాలురు అపుడు మిన్నకుండిరి మరికొందరు శ్రేష్ఠుడైన విష్ణువును ప్రార్థించసాగిరి (29)ఇట్లు అంతటా దురాత్ముడైన బ్రాహ్మణబంధువగు దక్షుని యజ్ఞము ఏర్పడగా ఋషులు భయమునొందిరి.(30)

ఏతస్మిన్నంతరే విప్రా నారదేన మహత్మనా | కథితం సర్వమేవైతద్ధక్షస్య చ విచేష్టితమ్‌|| 31

తదాకర్ణ్యే శ్వరో వాక్యం నారదస్య ముఖోద్గతమ్‌ | చుకోప పరమం క్రుద్ద అసనాదుత్పతన్నివ|| 32

ఉద్థృత్య చ జటాం రుద్రో లోకసంహారకారక: అస్ఫోటయామాస రుషా పర్వతస్య శిరోపరి|| 33

ఓవిప్రులారా! ఇంతలోనే మహాత్ముడైన నారదునిచే దక్షుని ఈ క్రూరకర్మ పూర్తిగా (శివుని) చెప్పబడినది. (31)నారదుని ముఖమునుండి బయల్వెడలిన ఆ వాక్యమును విని ఈశ్వరుడు మిగుల కోపించి అసనమునుండి ఒక్కమారుగా లేచి (32) లోకసంహారమునకు కారకుడైన రుద్రుడుజటను పెఱికి పర్వతముయొక్క అగ్రముపైన కోపముతో కొట్టెను. (33)

తాడనాచ్చ సముద్భూతో వీరభద్రో మహాయశా: తథా కాళీ సముత్పన్నా భూతకోటిభిరావృతా||(34)

కోపాన్ని:శ్వసితేనైవ రుద్రస్య చ మహాత్మను: | జాతం జ్వరాణాం చ శతం సన్నిపాతాస్త్రయోదశ||35

విజ్ఞప్తో వీరభ##ద్రేణ రుద్రో రౌద్రపరాక్రమ :| కిం కార్యం భవత: కార్యం శ్రీఘ్రమేవ వద ప్రభో || 36

ఇత్త్యుక్తో భగవాన్రుద్ర: ప్రేషయామాస సత్వరమ్‌ గచ్ఛ వీర మహాబాహో దక్షయజ్ఞం వినాశయ ||

అట్లు కొట్టుటచే గొప్ప కీర్తిగల వీరభద్రుడు భూతకోటిచే కూడిన కాళీ జనించిరి (34) మహాత్ముడైన రుద్రుడు కోపముచే నిశ్వసించుటనుండి వందజ్వరముల పదమూడు సన్నిపాతములు పుట్టనవి. (35) రౌద్ర పరాక్రముడైన రుద్రుని వీరభద్రుడు ప్రభూ! మీకై నేను చేయగల పనిని శ్రీఘ్రముగా తెలుపుడని విజ్ఞాపించెను (36)అపుడు భగవంతుడైన రుద్రుడు గొప్పబాహువులగల ఓ వీరా! వెళ్ళి దక్షయజ్ఞమును నాశనము చేయుము అని త్వరగా పంపించెను. (37)

శాసనం శిరసా ధృత్వా దేవదేవస్య శూలిన : కాళికాసహితో వీర: సర్వభూతైస్సమావృత:

వీరభద్రో మహాతేజా య¸° దక్షమఖం ప్రతి|| 38

తదానీమేవ సహసా దుర్నిమిత్తాని చాభవన్‌: |రూక్షో వవౌ తదా వాయు: శర్కరాభి: సమావృత:||39

తసృగ్వర్షతి దేవశ్చ తిమిరేణావృతా దిశ:| ఉల్కా పాతాశ్చ బహవ: పేతురుర్వ్యాం సహస్రశ:||40

ఏవంవిధాన్య రిష్టాని దదృశుర్విబుధాదయ: దక్షో పి భయమాపన్నో విష్ణుం శరణమాయ¸°|| 41

శూలము ధరించు దేవదేవుని శాసనమును శిరసావహించి గొప్పతేజస్సుకల వీరభద్రుడు కాళికాదేవితో అన్ని భూతములతో కూడి దక్షయజ్ఞమునకు వెళ్ళను. (38)అపుడు ఒక్కసారి గా చెడుశకునములు కలిగెను ఇసుకతో కూడినగాలి గట్టిగా వీచెను. (39) మేఘము రక్తమును కురిపించెను. దిక్కులన్నీచీకటితో కప్పబడెను. అనేక వేలకొద్ది ఉల్కలు భూమిపై పడెను. (40)ఇలాంటి అరిష్టములను దేవతలు మొదలైనవారు చూచిరి దక్షుడు కూడా భీతినొంది విష్ణువును శరణుజొచ్చును. (41)

రక్ష రక్ష మహావిష్ణో త్వం హి న: పరమో గురు: | యజ్ఞో సి త్వం సురశ్రేష్ఠ భయాన్మాం పరిమోచయ|| (42)

దక్షేణ ప్రార్థ్యమానో హి జగాద మధుసూదన :|మయా రక్షావిధాతవ్యా భవతో నాత్ర సంశయ: (43)

అవజ్ఞా హి కృతా దక్ష త్వయా ధర్మమజానతా| ఈశ్వరావజ్ఞయా సర్వం విఫలం చ భవిష్యతి || 44

అపూజ్యా యత్ర పూజన్తే పూజనీయో న పూజ్యతే | త్రీణి తత్ర ప్రవర్తన్తే దుర్భిక్షం మరణం భయమ్‌ ||45

తస్మాత్సర్వప్రయత్నేన మాననీయో వృషధ్వజ: అమానితాన్మ హేశాత్త్వాం మహద్భయముపస్థితమ్‌ || 46

అధువైవ వయం సర్వే ప్రభవో న భవామహే | భవతో దుర్నయేనైన నాత్ర కార్యా విచారణా|| 47

ఓమహావిష్ణూ! రక్షించుము రక్షించుము !నీవే మా పరమగురువు,ఓ సురశ్రేష్ఠ! నీవే యజ్ఞము. ఈ భయమునుండి నన్ను విడిపించుము (42) అని దక్షుడు ప్రార్థించిన మధుసూదనుడగు విష్ణువు నీకు నేను రక్షణ కల్పించవలెననుట యందు సంశయము లేదు.(43) దక్షా! ధర్మము తెలియని నీవు అవమానమును కలిగించితివి. ఈశ్వరుని అవమానించుట చేత అంతా విఫలమగును (44)ఎక్కడ పూజింపదగని వారు పూజింపబడుదురో, పూజ్యులు పూజింపబడరో అక్కడ దుర్భిక్షము మరణము, భయము అను మూడు కలుగును (45) కనుక పూర్తి ప్రయత్నముచేత వృషధ్వజుడగు శివుని పూజింపవలెను. అవమానింపబడిన మహేశ్వరుని నుండి నీకు గొప్ప భయము వచ్చి చేరినది(46)ఇక ఇప్పుడు మేమంతా నీచెడునడతవలన ప్రభువులము కాకుండా పోయాము. ఇందు విచారణ చేయదగదు. (47)

విష్ణోస్తద్వచనం శ్రుత్వా దక్షశ్ఛింతాపరో భవత్‌| వివర్ణవదనో భూత్వా తూష్ణీమాసీద్భుని స్థిత:|| 48

వీరభద్రో మహాబాహూ రుద్రేణౖవ ప్రచోదిత :| కాళీ కాత్యాయనీశానా చాముండాముండమర్ధినీ || 49

భద్రకాళీ తథా భద్రా త్వరితా వైష్ణవీ తథా | నవదుర్గాదిసహితో భూతానాం చ గణో మహాన్‌ || 50

శాకినీ డాకినీ చైవ భూతప్రమథగుహ్యకా: తథైవ యోగినీచక్రం చతు:షష్ట్యా సమన్వితమ్‌|| 51

నిర్జగ్ము సహసా తత్ర యజ్ఞవాటం మహాప్రభం | వీరభద్రసమేతా యే గుణా: శతసహస్రశ:||52

విష్ణువు యొక్క ఆ మాటలను విని దక్షుడు చింతాక్రాంతుడాయోను పాలిపోయిన మొఖముతో నేల పై మిన్నక నిల్చుండెను. (48)రుద్రుని చేత ప్రేరితుడైన మహాబాహువైన వీరభద్రుడు మరియు కాళి,కాత్యాయని, ఈశానా, చాముండా,ముండమర్దినీ(49) భద్రాకాళీ, భద్ర త్వరిత, వైష్ణవియను నవదుర్గలు, భూతములగొప్ప గణము (50)శాకిని డాకిని మరియు భూతములు, ప్రమథులు,గుహ్యకులు అలాగే అరువది నాలుగుతో కూడిన యోగినీ చక్రము (అరువదినాలుగు యోగినుల సమూహము) (51)ఒక్కమారుగా గొప్పకాంతి కలిగిన యజ్ఞవాటిక వైపు బయల్వెడలినవి వందలు వేలకొద్ది గణాలు వీరభద్రుని వెంటవచ్చినవి.(52)

పార్షదా: శంకరసై#్యతే సర్వే స్వరూపిణ:| పంచవక్త్రా నీలకంఠా: సర్వే తే శస్త్రపాణయ:|| 53

ఛత్రాచామరసంవీతా: సర్వే హరపరాక్రమా: దశాబాహవస్త్రినేత్రా: జటిలా రుద్రభూషణాః|| 54

అర్థచంద్రధరా: సర్వే సర్వే చైవ మహౌజస: సర్వే తే వృషభారూఢా:సర్వే తే వేషభూషణా:||55

సహస్రబాహుర్భుజగాధిపై: వృతస్త్రీలోచనో భీమబలో భయావహ: ఏభిస్సమేతశ్చ తదా మహత్మా స వీరభద్రో భిజగామ యజ్ఞమ్‌|| 56

శంకరుని అనుచరులైన వీరంతా రుద్రస్వరూపులు.ఐదు తలలుగలవారు నీలకంఠులు, వీరంతా ఆయుధమును చేతబట్టినవారు (53) ఛత్ర, చామరములచే పరివృతులు మరియు శివుని పరాక్రమము వంటి పరాక్రమము గలవారు పది తలలు మూడు కన్నులు జటలు, రుద్రుని భూషణములు వంటి భూషణములు గలవారు(54) అర్థచంద్రుని ధరించువారు, వీరంతా అమితశక్తిశాలులు. వృషభమును అధిష్ఠించువారు, వేషభూషణములు గలవారు. (55) సర్పరాజులచే పరివృతుడు సహస్ర బాహువు, త్రినేత్రుడు అమిత బలసంపన్నుడు ,భయము గూర్చువాడు అగు వీరభద్రుడు వీరందరితో కలిసి యజ్ఞమునకు వెళ్ళెను.(56)

యుగానాం చ సహస్రేణ ద్విప్రమాణన స్యందనమ్‌| సంహానాం ప్రయుతేనైవ వాహ్యమానం చ తస్య తత్‌||57

తథైవ దంశితా :సింహా : బహన: పార్శ్వరక్షకా:| శార్దూలా మకరా మత్స్యా గజాశ్చైవ సహస్రశ:||

ఛత్రాణి వివిధాన్యేవ చామరాణి తథైవ చ || 58

మూర్థని ధ్రియమాణాని సర్వతోగ్రాణి సర్వశ :| తతో భేరీమహానాదా: శంఖాశ్చ వివిధ స్వనా:|

పటహా గోముఖాశ్చైవ శృంగాణి వివిధాని చ || 59

తతో వాంద్యత తాన్యేవ ఘనాని సుషిరాణి చ|కలగానపరా: సర్వే సర్వే మృదంగవాదిన:|| 60

అనేక లాస్యసంయుక్తా వీరభద్రా గ్రతో భవన్‌|

రెండింతలు ప్రమాణము గలది ,వేయి మేలుజాతి గుర్రములు మరియు పదిలక్షల సింహాలచేత లాగబడినది అగు రథము అతనిది. (57)అలాగే కవచము గలవారు. సింహములు అనేకములతని పార్శ్వరక్షకులు, పులులు, మొసళ్ళు, చేపలు, ఏనుగులు వేలకొద్ది పార్శ్వరక్షకులు (వెన్నంటి కాపాడువారు) (58) ఛత్రములను , చామరములను తలపై నుంచుకొని అన్ని వైపుల నడచిరి అటు పై గొప్పనాదమునిచ్చు భేరీ వివిధ ద్వనులనిచ్చుశంఖములు తప్పెటలు, మృదంగవాద్యాలు , వివిధ బూరవాద్యాలు (59) దట్టమైనవి రంధ్రములుగలవి కూడా తమంతట తామే మ్రోగినవి మధురమైన గానమును చేయువారు, మృదంగమును మోగించగలవారు అంతా (60) పెక్కు లాస్యములతో కూడి వీరభద్రుని ముందు (నడచిరి) వుండిరి.

రణవాదిత్రనిర్ఘోషైర్జగర్జురమితౌజస:||61

తేన నాదేవ మహతా నాదితం భువనత్రయమ్‌| ఏవం సర్వే సమాయాతా గణా రుద్రప్రణోదితా:|| 62

యజ్ఞవాటం చ దక్షస్య వినాశార్థం ప్రహారిణ: రజసాచా వృతం వ్యోమ తమసాచా వృతా దిశ: ||63

సప్తద్వీపవతీ పృథ్వీ చచాల సాద్రికాననా | తే దృష్ఠ్యా మహదాశ్చర్యం లోకక్షయకరం తదా||64

ఉత్తస్థర్యుగత్‌ సర్వే దేవదైత్యనిశాచరా: తేవై దదృశురాయాంతీం రుద్రసేనాం భయావహామ్‌ || 65

వారంతా మహాశక్తిసంపన్నులైన రణవాద్యమును మ్రోగించి గర్జించిరి (61) ఆ గొప్ప నాదముచేత మూడులోకములూ ధ్వనించినవి. రుద్రని చేత ప్రేరితులైన ఆగణములిట్లు వచ్చిరి .(62) ఆయుధముల గ్రహించి వినాశమొనర్చుటకై దక్షుని యజ్ఞవాటికను చేరిరి అపుడు ఆకాశము ధూళితో కప్పబడినది దిక్కులుచీకటితో కప్పబడినవి. (63) పర్వతములు అరణ్యములతో సహా సప్తద్వీపమపులు గల భూమి కంపించినది, దేవతలు దైత్యులు నిశాచరులంతా లోకమునకు క్షయమును కలిగించు గొప్ప ఆశ్చర్యాన్ని చూచి ఒక్కమారుగా తేచినిల్చిరి. భయమును కలిగించుచూ వచ్చుచున్న రుద్రసేనను గాంచిరి (65)

పృథ్వీం కేచిత్‌ సమాయాతా గగనే కేచిదాగతా:| దిశశ్చ ప్రదిశ##శ్చైవ సమావృత్య తథాపరే|| 66

అనంతా హ్యక్షయా: సర్వే శూరా రుద్రసమా యధి | ఏవం భూతం చతత్‌ సైన్యం రుద్రైశ్చ పరివారితమ్‌ | దృష్ట్యోచుర్విస్మితా: సర్వే యామో ద్యశస్త్రపాణయ :|| 67

కొందరు భూమిని చేరగా కొందరు ఆకాశమునుచేరిరి మరికొందరు దిక్కులను, దిగంతరాలను చుట్టుముట్టునట్లు (నిలిచిరి) (66) అంతము లేని వారు క్షయము లేనివారు, క్షయము లేనివారు అగు రుద్రునితో సమానులగు శూరులు యుద్దమున (వుండిరి) రుద్రులచే చుట్టూ క్రమ్మబడిన ఆ సైన్యమును చూచి విస్మయముతో అందరూ శస్త్రములను ధరించి నేడు వెళ్ళెదము అనిరి (67)

ఇంద్రో హి గుజమారూఢో మృగారూఢ స్సదాగతి :| యమో మహిషమారుఢో యమదండసమన్విత:|| 68

కుబేర:పుష్పకారూఢ: పాశీ మకర ఏవ చ | అగ్నిర్బస్తసమారూఢో నిర్‌ఋతి: ప్రేతయేవ చ|| 69

తథాన్యే సురసంఘాశ్చ యక్షచారణగుహ్యకా: ఆరుహ్య వాహన్యేవ స్వాని స్వాని ప్రతాసిన:|| 70

ఇంద్రుడు గజమును, వాయువు మృగమును (జింకను) దండధారి యముడు మహిషమును, కుభేరుడు పుష్పకమును , వరుణుడు మొసలిని, అగ్ని మేకను నిర్‌ఋతి శవమును అధిరోహించిరి, (68,69) ఇదేవిధంగా ఇతర దేవతాగణాలు, యక్షులు, చారణులు, గుహ్యకులు అమిత ప్రతాపవంతులై తమ తమ వాహనాల నధిరోహించిరి.(70)

స్వేషాముద్యోగమాలోక్య దక్షశ్చాశ్రుముఖస్తత:| దండవత్పతితో భూమౌ సర్వానేవాభ్యభాషత|| 71

యుష్మద్బలేనైన మయా యజ్ఞ ప్రారంభితో మహాన్‌ | సత్కర్మసిద్దయే యూయం ప్రమాణం సుమహాప్రభా:|| 72

విష్ణో త్వం కర్మణ :సాక్షాద్యజ్ఞానాం పరిపాలక: ధర్మస్య వేదగర్భస్య బ్రహ్మణ్యస్త్వం చ మాధవ|| 73

తస్మాద్రక్షా విధాతవ్యా యజ్ఞస్యాస్య మహాప్రభో| దక్షస్య వచనం శ్రుత్వా ఉవాచ మధుసూచన:|| 74

తనవారి ప్రయత్నాన్ని చూచి దక్షుడు కన్నీటితో, దండము వలె భూమిపై పడి అందరినీ ఉద్దేశించి పలికెను(71) మీ అందరి బలము చేతనే నేనీ గొప్ప యజ్ఞమును మొదలిడితిని, గొప్పకాంతి గల మీరు సత్కర్మ సిద్దించుటలో ప్రమాణము,(72)

ఓ విష్ణూ| నీవు కర్మకు యజ్ఞములకు సాక్షాత్తుగా పరిపాలకుడవు. ఓ మాధవా! వేద గర్భితమైన ధర్మమునకు నీవు బ్రహ్మణ్యుడవు.(73) కనుక ఈ యజ్ఞమునకు రక్షణను ఏర్పరచవలసినది అనిన దక్షుని పలుకులను విని విష్ణువు పలికెను.(74)

మయా రక్షా విధాతవ్యా ధర్మస్య పరిపాలనే| తత్సత్యం తు త్వయోక్తం హి కింతు తస్య వ్యతిక్రమ:|| 75

యాతస్త్వద్త్వెన యజ్ఞస్య యత్త్వయోక్తం సదాశివమ్‌ | నైమిషే నిమిషక్షేత్రే తదా కిం న స్మృతం త్వయా|| 76

యో యం రుద్రో మహాతేజా యజ్ఞరూపస్సదాశివ: యజ్ఞబాహ్య:కృతో మూఢ తచ్చ దుర్మంత్రితం తవ ||77

రుద్రకోపాచ్చ కో వ్యాత్ర సమర్థో రక్షణ తవ| న పశ్యామి చ తం విప్ర త్వాం వై రక్షతి దుర్మతిమ్‌ || 78

నేను ధర్మపరిపాలన యందు రక్షణ కల్పించవలెనని నీనన్నది సత్యమే కానీ ఈనాడు యజ్ఞమునకు దర్మ వ్యతిక్రమమే కలిగినది. నైమిపక్షేత్రంలో సదాశివుని గూర్చి నీవన్నది గుర్తురావడం లేదా? (75,76) ఈ రుద్రుడు గొప్ప తేజస్వి , యజ్ఞమే రూపముగా గలవాడు ఎల్లప్పుడూ శుభము చేకూర్చువాడు మూర్ఖుడా! అట్టి రుద్రుడు నీ చెడు ఆలోచన వల్లనేడు యజ్ఞమునకు దూరముగా నుంచబడినాడు (77) రుద్రుని కోపమునుండి నిన్ను రక్షింపగల సమర్థుడెవడిక్కడ? దుర్మతియగు నిన్ను రక్షించువాడిని నేను చూడలేకున్నాను. (78)

కింకర్మ కిమకర్మేతి తన్న పశ్యసి దుర్మతే| సమర్థం కేవలం కర్మ న భవిష్యతి సర్వదా|| 79

సేశ్వరం కర్మ విద్ద్యేతత్‌ సమర్థత్వేన జాయతే | సహ్యన్య:కర్మణో దాతా ఈశ్వరేణ వినా భ##వేత్‌|| 80

ఈశ్వరస్య చ యే భక్తా: శాంతాస్తద్గతమానసా: కర్మణో హి ఫలం తేషాం ప్రయచ్ఛతి సదాశివ:||81

కేవలం కర్మ చాశ్రిత్య నిరీశ్వరపరా జనా: నిరయం తే చ గచ్చన్తి కోటియజ్ఞశ##తైరపి|| 82

పున: కర్మమయై :పాశైరాద్దా జన్మని జన్మని |నిరయేషు ప్రవచ్యంతే కేవలం కర్మరూపిణః||

ఇతి శ్రీ స్కాందేమహాపురాణ ఏకాశీతిసాహస్య్రాం సంహితాయాం

ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే

వీరభద్ర ప్రాదుర్భావవర్ణనం నామ తృతీయోధ్యాయ:

ఓ దుర్మతీ! ఏది కర్మ, ఏది ఆకర్మఅని తెలుసుకొనలేకున్నావు. ఎప్పుడైనా కేవలం కర్మ సమర్థము కాజాలదు(79) ఈశ్వరునితో కలిసిన (భావనతో) కర్మ మాత్రమే సమర్థమగునని తెలిసికొనుము. ఈశ్వరుడు దప్ప వేఱొకడు కర్మల (ఫల)దాత నిశ్చయముగా లేడు (80) ఎవరైతే ఈ శుని భక్తులో , శాంతులో, శివుని గూర్చి ధ్యానించువారో వారి కర్మ యొక్క ఫలాన్ని సదాశివుడు వారికొసంగును.(81) ఈశ్వరుడు లేడని భావించుచు , కేవల కర్మను ఆశ్రయించువారు శతకోటియజ్ఞములచే గూడ నరకములందు బాగుగా పచనము చేయబడుదురు(83)

శ్రీ స్కాంపురాణమందలి మొదటి మాహేశ్వరఖండములో

కేదారఖండమునందు వీరభద్రుని ప్రాదుర్భావ వర్ణనమను మూడవ అధ్యాయము

చతుర్థోధ్యాయ:

విష్ణునోక్తం వచ: శ్రుత్వా దక్షో వచనమబ్రవీత్‌| వేదానామప్రమాణం చ కృతం తే మధుసూదన || 1

వైదికం కర్మ చోత్సృజ్య కథం సేశ్వరతాం వ్రజేత్‌ | తదుచ్యతాం మహావిష్ణా యేన ధర్మ : ప్రతిష్ఠిత:|| 2

దక్షేణోక్తో మహావిష్ణురువాచ పరిసాన్త్వయన్‌ | త్రైగుణ్యవిషయా వేదా సంభవన్తి న చాన్యథా|| 3

వేదోదితాని కర్మాణి ఈశ్వరేణ వినా కథమ్‌| సఫలాని భవిష్యంతి విఫలాన్యేవ తాని చ || 4

తస్మాత్సర్వప్రయత్నేన ఈశ్వరం శరణం వ్రజ| ఏవం బ్రువతి గొవింద ఆగత: సైన్యసాగర:|| 5

నాలుగవ అధ్యాయము

విష్ణువు చెప్పినది విని దక్షుడిట్లు పలికెను ఓ మధుసూదనా! వేదములు అప్రమాణములుగా చేయబడినవి. (1) వైదిక కర్మనొదిలి ఈశ్వరభావనను పొందటెట్లు? కాన ఓ మహావిష్ణూ! దేని చేత ధర్మము ప్రతిష్ఠింపబడినదో అద్దానిని గూర్చి తెలియజేయుము (2) దక్షుడట్లు పలకగా మహావిష్ణువు అతని నూరడిల్లజేయుచు, వేదములు త్రిగుణములతో కూడిన విషయములు గలవేయగును .వేరే విధముగా కావు.(3) వేదములో చెప్పబడిన కర్మలు ఈశ్వరుడు లేక విఫలములే యగును సఫలము లెట్లగును?(4) కనుక పూర్తి ప్రయత్నము చేత ఈశ్వరునే శరణము జొచ్చుము అని గోవిందుడు పలుకుచుండగనే (వీరభద్రుని ) సముద్రమువంటి సైన్యము ఏతెంచెను.

వీరభ##ద్రేణ సదృశో దదృశుస్తం తదా సురా:|| 5

ఇంద్రో పి ప్రహసన్‌ విష్ణుమాత్మవాదరతం తదా| వజ్రపాణి: సురై: సార్థం యోద్దుకామో భవత్తదా|| 6

భృగుణాచరిత: శ్రీఘ్రముచ్చాటనవరేణ హి | తదా గుణా: సురై: సార్థం యుయుధుస్తే గణాన్వితా:|| 7

శరతోమరునారాచైర్జఘ్నస్తే చ పరస్పరమ్‌| నేదు: శంఖాశ్చ బహుశస్తస్మిన్రణమహోత్సవే || 8

తదా దుందుభయో నేదు: పటహా డిండిమాదయ: తేన శ##బ్దేన మహతా శ్లాఘ్యమానాస్తదా సురా:||

లోకపాలైశ్చ సహితా జఘ్నస్తాన్‌ శివకింకరాన్‌|| 9

వీరభద్రుని సమానమగు ఆ సేనను దేవతలప్పుడు చూచిరి. (5) ఆత్మవాదనను చేయు విష్ణువును చూచి ఇంద్రుడు నవ్వుచూ వజ్రాయుధమును గ్రహించి ఇతర దేవతలతో కలిసి యుద్దము చేయగోరెను. (6) ఉచ్చాటనపరుడైన శుక్ర మహర్షిచేత (ఇంద్రుడు) ప్రేరేపింపబడెను. అపుడు గణములన్నీ దేవతలతో యుద్దము చేసినవి (7) ఆ రణమహోత్సవములో వారు పరస్పరము బాణములో లోహపు గదలతో లోహపు బాణములతో ప్రహారముచేసికొనిరి అనేక విధాల శంఖములను పూరించిరి (8) అపుడు దుందుభివాద్యములు తప్పెటలు, డిండిమములు మ్రోగినవి ఆ గొప్ప నాదము చేత శ్లాఘింపబడిన దేవతలు (9) లోకపాలకులతో కలిసి ఆ శివకింకరులను హింసించిరి.(9)

ఖడ్గైశ్చాపి హతా: కేచిద్గదాభిశ్చ విపోధితా :దేవై: పరాజితా: సర్వే గణా: శతసహస్రశ: || 10

ఇంద్రాద్యై : లోకపాలైశ్చ గణాస్తే చ పరాజ్మఖా: కృతాశ్చ తత్‌క్షణాదేవ భృగోర్మంత్రబలేన హి || 11

ఉచ్చాటనం కృతం తేషాం భృగుణా యజ్వినా తదా| యజనార్థం చ దేవానాం తుష్ట్యర్థం దీక్షితస్య చ|| 12

తేనైవ దేవా జయినో జాతాస్తత్ష్కణమేవ హి | స్వానాం పరాజయం దృష్ట్యా వీరభద్రో రుషాన్వితః|| 13

భూతాన్‌ ప్రేతాన్‌ పిశాచాంశ్చ కృత్యా తానేవ పృష్ఠత:| వృషభస్థాన్పురస్కృత్య స్వయం చైవ మహాబల:|| తీక్ణం త్రిశూలమాదాయ పాతయమాస తాన్రణ || 14

వందలవేలకొలది గణములన్నీ ఖడ్గప్రహారమువలన ప్రాణములు వదిలినవి, కొన్న గణముల గదా ప్రహారమువలన దెబ్బతినినవి. ఇట్లు దేవతల చేత పరాజయమునొందినవి.(10) ఇంద్రాది దేవతల చేత,లోకపాలురచేత ఆ గణములు భృగుమహర్షి మంత్రబలము వలన వెనుదిరుగునట్లు అదే క్షణమున చేయబడినవి (11) దేవతలను పూజించుటకు దీక్షితుడైన దక్షుడు తృప్తినొందుటకు భృగుమహర్షి ఆగణముల ఉచ్చాటనమును చేసెను(12) దానిచేత దేవతలు తక్షణమే జయమును పొందిరి. తనవారి పరాజయమును గాంచి వీరభద్రుడు కోపించి (13)భూత, ప్రేత .పిశాచములను సృజించి, సృజించి, వృషభములనధిరోహించిన వానిని తన ముందు వెనకల నిడుకొని తానూ స్వయముగా తీక్ణమైన త్రిశూలమును గ్రహించి మహాబలుడై వారిని (దేవతలను) రణమునందు పడగొట్టెను.(14)

దేవాన్‌ యక్షాన్‌ పిశాచాంశ్చ గుహ్యకాన్రాక్షసాంస్తథా| శూలఘాతైశ్చ తే సర్వే గణా దేవాన్‌ ప్రజఘ్నిరే|| 15

కేచిద్ద్విధా కృతా: ఖడ్గైర్ముద్గరైశ్చాపి పోధితా: | పరశ్వధై: ఖండశశ్చ కృతా :కేచిద్రణాజిరే|| 16

శూలైర్భిన్నాశ్చ శతశ: కేచిచ్చ శకలీ కృతా: ఏవం పరాజితా: సర్వే పలాయనపరాయణా:|| 17

పరస్పరం పరిష్వజ్య గతాస్తేపి త్రివిష్టవమ్‌| కేవలం లోకపాలాశ్చ ఇంద్రాద్యాస్తస్థురుత్సుకా:|| బృహస్పతిం పృచ్చమానా: కుతో స్మాకం జయో భ##వేత్‌|| 18

బృహస్పతిరువాచేదం సురేంద్రం త్వరితస్తదా ||

శూలప్రహారములచేత ఆ గణముల దేవతలను, యక్షులను పిశాచములను, గుహ్యకులను మిక్కిలి హింసించిరి.(15)రణభూమిలో కొందరు ఖడ్గములచేత రెండుగా ఖండింపబడిరి, కొందరు గదల చేత పొడవబడిరి, గొడ్డళ్ళచేత ముక్కలుగా చేయబడిరి(16) కొందరు శూలములచేత వందలకొలది పొడవబడి ముక్కలుగా చేయబడిరి, ఇట్లు పరాజయముపిందిన వారందరూ పలాయనముచిత్తగించిరి (17) ఒకరినొకరు కౌగిలించుకొని స్వర్గమునకు వెళ్ళిరి ఉత్సుకులైన ఇంద్రుడు మొదలగు దేవతలు లోకపాలకురు మాత్రము నిలిచిరి. వారు మాకు జయమెట్లు కలుగును? అని బృహస్పతి ప్రశ్నించిరి (18) అపుడు త్వరగా బృహస్పతిని ఇంద్రునితో ఇట్లు పలికెను.

బృహస్పతిరువాచ:

యదుక్తం విష్ణునా పూర్వం తత్సత్వం జాతమద్య వై|| 19

ఆస్తి చేదీశ్వర: కశ్చిత్ఫలరూప్యస్య కర్మణ:| కర్తారం భజతే సో పి నహ్యకర్తు: ప్రభుర్హి స:|| 20

న మంత్రాషదయ: సర్వే నాభిచారా న లౌకికా: న కర్మాణి న వేదాశ్చ న మీమాంసాద్వయం తథా|| 21

జ్ఞాతుమీశా: సంభవన్తి భక్త్యా జ్ఞేయస్త్వనన్యయా | శాంత్యా చ పరయా తుష్ట్యా జ్ఞాతవ్యో హి సదాశి:||22

తేన సర్వం సంభవతి సుఖదు:ఖాత్మకం జగత్‌ | పరస్తు సంవదిష్యామి కార్యా కార్యావివక్షయా|| 23

బృహస్పతి పలికెను: మునుపు విష్ణువు చెప్పినది ఈనాడు నిజమైనది (19) ఈ కర్మకు ఫలరూపముగా ఏ ఈశ్వరుడైనా వుండినట్లయితే అతను కర్తను మాత్రము చేరును కర్తకాని వానికి అతను ప్రభువుకాడు (20) మంత్రాలు ,ఔషధములు, లౌకిక అభిచారమంత్రాలు, కర్మలు, వేదాలు, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస రెండూ (21) తెలుసుకొనశక్తి లేనివి అనన్యభక్తిచే మాత్రమే (ఈశ్వరుడు) తెలియదగును పరమశాంతి పరమతృప్తి వీనిచే మాత్రమే సదాశివుని తెలియదగును (22) అతని చేతనే సుఖదు:ఖ స్వరూపంగల ప్రపంచమంతా ఏర్పడును, అయిననూ, కార్యము , ఆకార్యము,రెండింటినీ తెలియచేయుకోరికచే (మీకు) చెప్పెదను(23)

త్వమింద్ర బాలిశో భూత్వా లోకపాలై: సహాద్య వై| ఆగతో బాలిశో భూత్వా ఇదానీం కిం కరిష్యసి|| 24

ఏతే రుద్రసహాయాశ్చ గణాశ్చ పరమశోభనా:| కుపితాశ్చ మహాభాగా న తు శేషం ప్రకుర్వతే || 25

ఏవం బృహస్పతేర్వాక్యం శ్రుత్వా తే పి దివౌకస:| చింతామాపేదిరే సర్వే లోకపాలా మహేశ్వరా: || 26

ఇంద్రా! నీవు మూఢుడవై లోకపాలురతో కలిసి ఈనాడు (ఇక్కడకు) ఏతెంచితివి ఇప్పుడేమి చేయగలవు? (24) రుద్రునికి సహాయముగా వచ్చిన ఈగణముల అత్యంత సుందరములైనవి. కోపించినవి దేనినే మిగల్చవు.(25) బృహస్పతి ఇట్లు పలుకగా విని ఆ స్వర్గలోకవాసులు లోకపాలురు, గొప్ప ప్రభువులు చింతనొందిరి. (26)

తతో బ్రవీద్వీరభద్రోగణౖ: పరివృతో భృశమ్‌| సర్వే యూయం బాలిశత్వాదవదానార్థమాగతా:|| 27

అవదానాని దాస్వామి తృప్త్యర్థం భవతాం త్వరన్‌| ఏవముక్త్వా శితైర్బాణౖర్జఘానాథ రుషాన్విత:|| 28

తైర్బాణౖర్నిహతా: సర్వే జగ్గ్ముస్తే చ దిశో దశ||29

గతేషు లోకపాలేషు విద్రుతేషు సురేషు చ | యజ్ఞవాటే సమాయాతో వీరభద్రో గణాన్విత:|| 30

గణములచేత పరివృత్తుడైన వీరభద్రుడపుడు ఇట్లు పలికెను. మీరంతా మూర్ఖత్వము వలన అవదానము (కర్మవృత్తము -ప్రశస్తకర్మ)కొఱకేతెంచితిరి (27) ఇపుడు త్వరగా మీతృప్తికై అవదానాలను ఇచ్చెదను, అని పలికి వాడి బాణములచేత (వారిని) అతికోపముతో కొట్టెను.(28) ఆ బాణములచేత కొట్టబడిన వారంతా దశదిశలకు వెళ్లారు (29) లోకపాలురంతా వెళ్ళిపోగా దేవతలంతా పారిపోగా, వీరభద్రుడు తన గణములతో కలిసి యజ్ఞవాటకమునకు ఏతెంచెను. (30)

తదా త ఋషయ :సర్వే మేవేశ్వరేశ్వరమ్‌ | విజ్ఞప్తుకామా: సహసా ఊచురేవం జనార్దనమ్‌|| 31

రక్ష యజ్ఞం హి దక్షస్య యజ్ఞో సి త్వం నంశయ:| ఏతచ్ఛృత్వా తు వచనమృషీణాం వై జనార్ధన :|| 32

యోద్దుకామ: స్థితో యుద్దే విష్ణురధ్యాత్మదీపక: వీరభద్రో మహాబాహు : కేశవం వాక్యమబ్రవీత్‌ || 33

అత్ర త్వయాగతం కస్మాద్విష్ణో వేత్రా మహాబలమ్‌ | దక్షస్య పక్షమాశ్రిత్య కథం జేష్యసి తద్వద|| 34

దాక్షాయణ్యా కృతం యచ్చ న దృష్టం కిం త్వయానఘ| త్వం చాపి యజ్ఞే దక్షస్య అవదానార్థమాగత:| అవదానం ప్రయచ్చామి తవ చాపి మహాభుజ|| 35

అపుడు ఋషులంతా ఈశ్వరులకే ఈశ్వరుడగు జనార్దనునుద్దేశించి విజ్ఞాపనము చేయుకోరిక గలిగి ఇట్లు పలికిరి(31) 'నిస్సంశయముగా నీవే యజ్ఞము దక్షుని యజ్ఞమును రక్షించుము ఋషుల ఈ మాటను విని విష్ణువు(32) అధ్యాత్మమును ప్రకాశింపజేయువాడు యుద్దము జేయదలిచి యుద్ద (రంగము) న నిలిచెను. గొప్పబాహువులు గల వీరభద్రుడు విష్ణువుతో ఇట్లు పలికెను. (33) ఓ విష్ణూ ! జ్ఞానివగు నీవిక్కడికెట్లు వచ్చితివి? దక్షుని పక్షమున జేరి ఎట్లు జయించెదవు? తెలుపుము. (34) ఓ అఘరహితా!(పాపములేనివాడా ) దాక్షాయణి (సతీదేవి) చేసినదానిని నీవు చూడలేదా?నీవుకూడా దక్షుని యజ్ఞమున అవదానము కొఱకు వచ్చితిని. ఓ మహాభుజా!నీకు కూడా అవదానమునిచ్చెదను(35)

ఏవముక్తా ప్రణమ్యాదౌ విష్ణుం సదృశరూపిణమ్‌ | వీరభద్రో గ్రతో భూత్వా విష్ణుం వాక్యమథాబ్రవీత్‌|| 36

యథా శంభుస్తథా త్వం హి మమ నాస్త్యత్ర సంశయ: తథాపి త్వం మహాబాహో యోద్దుకామో గ్రత: స్థిత:|| 37

ఏవముక్తా ప్రణమ్యాదౌ విష్ణుం సదృశరూపిణమ్‌| వీరభద్రో గ్రతో భూత్వా విష్ణుం వాక్యమథాబ్రవీత్‌|| 36

యథా శంభుస్తథా త్వం హి మమ నాస్త్యత్ర సంశయ: తథాపి త్వం మహాబాహో యోద్దుకామో గ్రత: స్థిత:|| 37

తస్య తద్వచనం శ్రుత్వా వీరభద్రస్య ధీమత: ఉవాచ ప్రవాసన్‌ దేవో విష్ణు: సర్వేశ్వరేశ్వర:||38

అని పలికి తగినరూపుదాల్చిన విష్ణువుకు మొదట నమస్కరించి వీరభద్రుడు ఎదుటనిలిచి ఇట్లు పలికెను.(36)నాకు శంకరుడెట్లో నీవునూ అట్లే ఇందు సంశయము లేదు. అయిననూ ఓ మహాబాహు! యుద్దము చేయు కోరికతో ఎదుట నిల్చితివి, నీవు నిలుచుండినట్లయితే తిరిగి వచ్చుట అనునది లేని స్థితి (అపునరావృత్తి) కి తీసుకొని వెళ్ళెదను (37) బుద్ది మంతుడైన వీరభద్రుని మాటలను విని గోప్ప ప్రభువైన విష్ణువు నవ్వుచూ ఇట్లు పలికెను (38)

రుద్రతేజ: ప్రసూతో సి పవిత్రో సి మహామతే | అనేన ప్రార్థిత:పూర్వం యజ్ఞార్థం చ పున: పున: || 39

అహం భక్తపరాధీనస్తథా సో పి మహేశ్వర :| తేనైవ కారణనాత్ర దక్షస్య యజనం ప్రతి ||40

ఆగతో హం వీరభద్ర రుద్రకోపసముద్భవ | అహం నివారయామి త్వాం త్వాం వామాం వినివారయ||41

ఇత్యుక్తవతి గోవిందే ప్రవాస్య చ మహాభుజ:| ప్రశ్రయావనతో భూత్వా ఇదమాహ జనార్ధనమ్‌|| 42

ఓ గొప్పబుద్దిగలవాడా! నీవు రుద్రుని తేజస్సు నుండి జన్మించినవాడవు. పవిత్రుడవు ఇతను (దక్షుడు) ఇంతకుముందు నన్ను యజ్ఞము కొఱకై పెక్కు పర్యాయములు ప్రార్ధించెను.(39) నేను భక్తులకు వశుడు మహేశ్వరుడూ అట్లేకదా! ఆ కారణము చేతనే ఇక్కడ దక్షుని యజ్ఞమునకేతెంచితిని (40) రుద్రుని కోపమునుండి వీరభద్రా ! నేను నిన్ను అడ్డగించెదను లేదా నీవే నన్ను అడ్డగించుము (41) అని గోవిందుడు పలుకగా నవ్వి మహాభుజుడు ,వినయము చేత వంగి విష్ణువుతో ఇట్లనెను. (42)

యథా శివస్తథా త్వం హి యథా త్వం చ తథా శివ: సేవకాశ్చ వయం సర్వే తవ వా శంకరస్య చ || 43

తచ్ఛృత్వా వచనం తస్య సో చ్చుత: సంప్రహస్య చ |ఇదం విష్ణుర్మహావాక్యం జగాద పరమేశ్వర: 44

యోధయస్య మహాబాహో| మయా సార్థమశంకిత: తవాసై#్ర: పూర్యమాణో హం గఛ్చామి భవనం స్వకమ్‌ ||45

తథేత్యుక్త్యా తు వీరో సౌ వీరభద్రో మహాబల : గృహీత్వా పరమాస్త్రాణి సింహనాదైర్జగర్జ చ || 46

విష్ణుశ్చాపి మహాఘోషంశంఖనాదం చకార స: | తచ్ఛృత్వా యే గతా దేవా రణం హిత్వా యయ:పున:|| 47

వ్యూహం చక్రుస్తదా సర్వే లోకపాలా: సహసవా:| తదేంద్రేణ హతో నందీ వజ్రేణ శతపర్వణా || 48

శివుడెట్లో నీవట్లు నీవెట్లో శివుడునూ అట్లే ! మే మంతా నీకు లేదా శంకరునికి సేవకులము (43) అతని ఆ మాటను విని విష్ణువు నవ్వి ఇట్లుపలికెను (44) ఓ మహాబాహూ! శంక లేకుండా నాతో యుద్దము చేయుము. నీ అస్త్రముల చేత నింపబడిన నేను నా భవనానికి వెళ్ళెదను (45) అలాగే అని పలికి గొప్ప బలముకలవాడు. వీరుడు అయిన వీరభద్రుడు గొప్ప అస్త్రజాలమును గ్రహించి సింహనాదములచే గర్జించెను. (46)విష్ణువు కూడా గొప్ప ధ్వని గల శంఖమును పూరించెను. రణమునువదలి పారిపోయిన దేవతలందరూ అది విని మరలివచ్చిరి (47) ఇంద్రుడితో సహా లోకపాలకులంతా వ్యూహమును రచించిరి అపుడు నూరుకణుపులుగల వజ్రముచేత ఇంద్రుడు నందిని కొట్టెను (48)

నందినా చ హత: శక్రస్త్రిశూలేన స్తనాంతరే| వాయునా చ హతో భృంగీ భృంగిణా వాయురాహత:|| 49

శూలేన సితధారేణ సంనద్దో దండధారిణా | యమేన సహ సంగ్రామం మహాకాలో బలాన్విత:|| 50

కుబేరేణ చ సంగమ్య కూష్మాండానాం పతి: స్వయమ్‌ వరుణన సమం యుద్దం ముండెశ్చైవ మహాబల:|| 51

యుయుధే పరయా శక్త్యా త్రైలోక్యం విస్మయన్నివ| నైర్‌ఋతేన సమాగమ్య చండశ్చ బలవత్తర:|| 52

యుయుధే పరమాస్త్రేణ నైర్‌ఋత్యం చ విడంబయన్‌ |

అపుడు నంది త్రిశూలముతో ఇంద్రుని వక్షస్థలము పై కొట్టెను. ఇట్లే వాయువు, భృంగి పరస్పరము దెబ్బతీసుకొనిరి(49) బలవంతుడైన మహాకాలుడు పదునైన శూలముతో దండమును ధరించిన యమునితో సహా యుద్దము చేసెను(50) కూష్మాండపతి స్వయముగా కుబేరునెదుర్కొనెను. మహాబలుడైన ముండుడు వరుణునితో యుద్దము చేసెను. (51) అమిత బలముగలచండుడు నిర్‌ఋతితో మూడు లోకాలు విస్మయమొందునట్లు అమితశక్తితో యుద్దము చేసెను.(52) నిర్‌ఋతిని అవహాస్యము చేయునట్లు పరమ అస్త్రముతో యుద్దమ చేసెను.

యోగినీచక్రసంయుక్తో భైరవో నాయకో మహాన్‌ || 53

విదార్య దేవానఖిలాన్పసౌ శోణితమధ్భుతమ్‌ | క్షేత్ర పాలాస్తథా చాన్యే భూతప్రమథగుహ్యకా:|| 54

శాకినీ డాకినీ రౌద్రా నవదుర్గాస్తథైవ చ| యోగిన్యో యాతుధానాశ్చ తథా కూష్మాండకాదయ: నేదు:పపు:శోణితం చ బుభజా: పిశితం బహు ||55

భక్ష్యమాణం తదా సైన్యం విలోక్య సురరాట్‌ స్వయమ్‌ విహాయ నందినం పశ్చాద్వీరభద్రం సమాక్షిపత్‌|| 56

వీరభద్రో విహాయైన విష్ణుం దేవేంద్రమాస్థిత:| తయోర్యుద్దమభూద్‌ ఘోరం బుధాంగారకయోరివ ||57

అపుడు యోగినీ గణముతో కూడిన గొప్ప నాయకుడగు భైరవుడు (53) దేవతలనందరినీ చీల్చి అద్భుతముగా రక్తమును ద్రావెను. క్షేత్రపాలురు మరియు ఇతర భూత ప్రమథ గుహ్యకులు ,శాకినీ, డాకినీ, రౌద్రులు నవదుర్గలు , యోగినులు, కూష్మాండక మొదలయిన పిశాచులు నినదించిరి రక్తము ద్రావిరి మరియు బాగా మాంసమును భుజించిరి (54,55) అపుడు సైన్యము భక్షింపబడుటను గాంచి ఇంద్రుడు నందిని విడచి స్వయముగా వీరభద్రునెదుర్కొనెను (56) వీరభద్రుడు విష్ణువును విడచి దేవేంద్రునెదుర్కొనెను. వారిద్దరి మధ్య బుధుడు మరియు అంగారకుని మధ్య జరిగిన యుద్దమువలె ఘోరమైన యుద్దము జరిగెను. (57)

వీరభద్రం యదా శక్రో హంతుకామస్త్వరాన్విత:| తావచ్చక్రం గజస్థం హి పూరయామాస మార్గణౖ:| 58

వీరభద్రో రుషావిష్ణో దుర్నివార్యో మహాబల :| తదేంద్రేణాహత: శ్రీఘ్రం వజ్రేణ శతపర్వణా || 59

సగజం చ సవజ్రం చ వాసవం గ్రస్తుముద్యత: హాహాకారో మహానాసీద్భూతానాం తత్ర పశ్యతామ్‌|| 60

వీరభద్రం తథాభూతం హంతుకామం పురందరమ్‌ | త్వరమాణస్తదా విష్ణుర్వీరభద్రమగ్రత: స్థిత:|| 61

శక్రం చ పృష్ఠత: కృత్వా యోధయామాస వై తథా| వీరభద్రస్య విష్ణోశ్చ యుద్దం పరమభూత్తదా || 62

త్వరగా ఎప్పుడైతే వీరభద్రుని ఇంద్రుడు దెబ్బతీయదలిచాడో అంతలోనే గజము పై నున్న ఇంద్రుని బాణములతో (వీరభద్రుడు) నింపివేసెను. (58) కోపముతో నున్న వీరభద్రుడు అడ్డగింపవీలులేనివాడుగా, మహాబలుడిగా వుండెను. అపుడు ఇంద్రుడతనిని తన నూరు కణుపులుగల వజ్రాయుధముతో గొట్టెను (59) (వీరభద్రుడు) ఇంద్రుని ఏనుగుతో , వజ్రాయుధముతో సహా మింగివేయడానికి ఉద్యుక్తుడవగా ఆ అద్భుతమను చూచువారు గొప్ప హాహాకారమునొనర్చిరి. (60) ఆ విధముగా ఇంద్రుని దెబ్బతీయదలపెట్టిన వీరభద్రుని (నిలువరించుటకు) విష్ణువు త్వరగా వచ్చి నిలిచెను. (61) ఇంద్రుని వెనకనుంచుకొని యుద్దము చేయమొదలిడగా వీరభద్రునికి, విష్ణువునకు మధ్య జరిగిన యుద్దము గొప్పదిగా నుండెను, (

62)

శ్రస్తాసై#్రర్వివిధాకారైర్యోధయామాసతుస్తదా| పున్నర్నందినమాలోక్య శక్రో యుద్దవిశారద:|| 63

ద్వంద్వయుద్దం సుతుములం దేవానాం ప్రమథైస్సహ| ప్రమథా మథితా దేవై: సర్వే తే ప్రాద్రవన్‌ రణాత్‌|| 64

గణాన్‌ పరాజ్ముఖాన్‌ దృష్టా సర్వే వ్యాధయో భృశమ్‌ | రుద్రకోపాత్‌ సముద్బూతా దేవాశ్చాపి ప్రదుద్రువు:||65

జ్వరైస్తు పీడితాన్‌ దేవాన్‌ దృష్టా విష్ణుర్హసన్నివ| జీవగ్రాహ జగ్రాహ దేవాన్‌ తాన్‌ చ పృథక్‌ || 66

దేవాశ్వినౌ తదాహుయ వ్యాథీన్‌ హంతుం తదా భృతిమ్‌| దదౌ తాభ్యాం ప్రయత్నేన గణయిత్వా సుబుద్దిమాన్‌|| 67

వారిద్దరు వివిధాకారములుగల శస్త్రములతో యుద్దము చేసిరి యుద్దవిశారదుడైన ఇంద్రుడు మరల నందిని చూచి (ద్వంద్వయుద్దము చేసేను) (63) దేవతలకు ప్రమథులతో భీకరమైన ద్వంద్వ యుద్దము జరిగెను. దేవతలచే వ్యాధులన్నీ దేవతలను కూడా తరిమినవి. (65) జ్వరములచేత పీడితులైన దేవతలను చూచి విష్ణువు నవ్వి. దేవతలను వ్యాధులను విడివిడిగా జీవించి యుండగానే పట్టుకొనెను. (66) అపుడు దేవతావైద్యులను అశ్వినులను పిలిచి పోగొట్టుటకు బుద్దిమంతుడైన (విష్ణువు) వారికి లెక్కించి భృతి నిచ్చెను.(67)

జ్వరాంశ్చ సన్నిపాతాంశ్చ అన్యే భూతద్రుహస్తదా | తాన్‌ సర్వాన్‌ నిగృహీత్వాథ అశ్వినౌ తా ముదాన్వితౌ|| విజ్ఞారానథ దేవాంశ్చ కృత్వా మముదతుశ్చిరమ్‌|| 68

తైర్జితం యోగినీచక్రం భైరవం వ్యాకుళీకృతమ్‌ | తీక్షాగ్రై: పాతయామాసు : శ##రైర్భూతగణానపి|| 69

సురైర్విద్రావితం సైన్యం విలోక్య పతితం భువి | వీరభద్రో దుషావిష్టో విష్ణుం వచనమబ్రవీత్‌ || 70

అపుడు సంతోషముగా అశ్వినులు జ్వరములను సన్నిపాతములను ప్రాణికోటికి శత్రువులగు వానిని నిగ్రహించి దేవతలను ఈజ్వరరహితులుగా చేసి మోదము నొందిరి(68) వారిచే(దేవతలచే) యోగినీ చక్రము జయింపబడినది. బైరవసంఘము కల్లోలపరచబడినది. వారు పదునైన అంచుగల బాణములచే భూతగుణములను పడగొట్టరి (69) దేవతలచేత (తన) సైన్యం తరిమి గొట్టబడుటను నేలబడగొట్టబడుటను చూచి కోపించిన వీరభద్రుడు విష్ణువుతో ఇట్లనెను.(70)

త్వం శూరో సి మహాబహో దేవానాం పాలకో హ్యసి | యుధ్యస్వ మాం ప్రయత్నేన యది తే మతిరీదృశీ|| 71

ఇత్యుక్వై తం సమాసాద్య విష్ణుం సర్వేశ్వరేశ్వరమ్‌| వవర్ష నిశితైర్బాణౖర్వీరభద్రో మహాబల: ||72

తదా చక్రేణ భగవాన్‌ వీరభద్రం జఘాన స: ఆయాంతం చక్రమాలోక్య గ్రసితం తత్‌క్షణాచ్చ తత్‌|| 73

గ్రసితం చక్రమాలోక్య విష్ణు: పరపురంజయ| ముఖం తస్య పరామృజ్య విష్ణునోద్గిలితం పున:| 74

స్వచక్రమాదాయ మహానుభావో దివం గతో థో భువనైక భర్తా | జ్ఞాత్వా చ తత్సర్వమిదం చ విష్ణు: కృతీ కృతం దుష్ర్పసహం పరేషామ్‌ || 75

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతిసాహస్ర్యాం సంహితాయాం ప్రథమే మాహేశ్వరఖండే

కేదారఖండే వీరభద్రాదీనాం విష్ణ్వాదిభిస్సహ యుద్దవర్ణనం నామ చతుర్థోధ్యాయ:

ఓ గొప్ప బాహువు గలవాడా! నీవుశూరుడవు. దేవతల పాలకుడవు ఒకవేల నీకిలాంటి అభిప్రాయమున్న యెడల నాతో యుద్దము చేయుయు. (71) అని పలికి ప్రభువులకే ప్రభువగు విష్ణువుని ఎదుర్కొని మహాబలముగల వీరభద్రుడు పదునైన బాణముల వర్షించెను.(72) అపుడు విష్ణువు వీరభద్రునిపై చక్రమును ప్రయోగించెను. వచ్చుచున్న చక్రమును వీరభద్రుడు తత్‌క్షణమే మింగివేసెను. (73) శత్రువుల నగరములను జయించు విష్ణువు (తన) చక్రమును వీరభద్రుడు మింగగాచూచి అతని (వీరభద్రుని) ముఖమును నిమిరి మరల అది బయల్వెడలునట్లు చేసెను. (74) అన్నిలోకములను ఒక్కడుగా భరించు మహానుభావుడైన విష్ణువు తన చక్రమును తీసుకొని, తన శత్రువులాచరించినది సహింపవీలులేనిదిగా తెలుసుకొని స్వర్గమునకు వెళ్లెను. (75)

శ్రీ స్కాంద పురాణమందలి మాహేశ్వరఖండము యొక్క కేదారఖండములోని వీరభద్రాదులకు విష్ణువు మొదలైన వారితో యుద్దము అను నాలుగవ అధ్యాయము సమాప్తము

పంచమోధ్యాయ:

లోమశ ఉవాచ:

విష్ణోగతే తదా సర్వే దేవాశ్చ ఋషిభిస్సహ| వినిర్జితా గణౖ: సర్వే యే చ యజ్ఞోపజీవిన: 1

భృగుం చ పాతయామాస శ్మత్రూణాం లుంచనం కృతమ్‌| ద్విజాంశ్చోత్పాటయామాస పూష్ణో వికృతవిక్రియాన్‌|| 2

విడంబితా స్వధా తత్ర ఋషయశ్చ విడంబితా : వవృషుస్తే పురీషేణ వితానాగ్నౌరుషాన్వితా:||3

అనిర్వాచ్యం తదా చక్రుర్గణా : క్రోధసమన్వితా:| అంతర్వేద్యంతరగతో దక్షో వై మహతో భయాత్‌|| 4

తం నిలీనం సమాజ్ఞాయ ఆనినాయ రుషాన్విత:| కపోలేషు గృహీత్వా తం ఖడ్గేనోపహతం శిర:|| 5

ఐదవ అధ్యాయము

లోమశుడు చెప్పెను: విష్ణువు వెళ్ళిపోగానే ఋషులతో సహా దేవతలందరు, యజ్ఞము పై జీవించువారంతా కూడా(శివ) గణములచే జయింపబడిరి.(1) భృగువును పడదోసిరి. మీసముల గొరిగిరి. వికృతమైన చేష్టలనొనరించు బ్రాహ్మణుల ఎత్తిపడవేసెను.(2) అచట పితృదేవతలకొనగుబలి (స్వధా) హేళనపాలాయెను. ఋషులు ఎగతాళి పాలయిరి వారు (శివగణములు) యజ్ఞాగ్ని యందు కొపముతో పురీషమును వర్షించిరి. (3) కోపముతో నున్న ఆగణములు అపుడు చెప్పరానిదంతా చేసిరి .దక్షుడు మిక్కిలి భయముచేత అంతర్వేది మధ్య చేరియుండెను(4) అట్లు దాగిన అతనిని ఆజ్ఞాపించి కోపముతో బయుటకు తెచచ్చెను. అతని చెక్కిళ్ళనను పట్టి ఖడ్గముతో తలను ఖండించెను,(5)

ఆభేద్యం తచ్ఛిరో మత్వా వీరభద్ర: ప్రతాపవాన్‌| స్కంధం పద్భ్యాం సమాక్రమ్య కంధరేపీడయత్తదా ||6

కంధరత్పాట్యమానాచ్చ శిరశ్చిన్నం దురాత్మన:| దక్షస్య చ తదా తేన వీరభ##ద్రేణ ధీమతా||7

యేచాన్య ఋషయో దేవా : పితరో యక్షరాక్షసా: గణౖరుపద్రుతా: సర్వే పలాయనపరా యయు:8

చంద్రాదిత్యగణాస్సర్వే గృహనక్షత్రతారకా: సర్వే విచలితా హ్యాసన్‌ గణౖస్తేపి హ్యుపద్రుతా:|| 9

ప్రతాపముగల వీరభద్రుడు ఆ శిరస్సు భేదింపవీలు లేనిదని తలచి కాళ్ళతో భుజములను అణచిపట్టి గొంతు పై దెబ్బతీసెను.

(6) అపుడు దురాత్ముడైన దక్షుని శిరస్సు ఛేదింపబడెను. అపుడు బుద్దిమంతుడైన వీరభద్రుడు ఆ శిరస్సును జ్వలించుచున్న కుండమునందు హవనము చేసెను. (7) ఇక ఇతర బుషులు, పితరులు, యక్షులు రాక్షసుల గణములచేత తరిమికొట్టబడి అంతా పలాయనము చిత్తగించిరి(8) చంద్రుడు ,సూర్యుడు, ఇతర గణములు , గ్రహములు, నక్షత్రములు, తారకలు అందరూ చెదిరిపోయిన వారైరి వారుకూడా గణములచేత తరిమికొట్టబడిరి.(9)

సత్యలోకం గతో బ్రహ్మ పుత్రశోకేన పీడిత:| చింతయామాస చావ్యగ్ర :కిం కార్యం కార్యమద్య వై|| 10

మనసా దూయమానేన శం న లేభే పితామహా:| జ్ఞాత్వా సర్వం ప్రయత్నేన దుష్కృతం తస్య పాపిన:|| 11

గమనాయ మతిం చక్రే కైలాసం పర్వతం ప్రతి | హంసారూఢో మహాతేజా: సర్వదేవై: సమన్విత:|| 12

ప్రవిష్ట: పర్వతశ్రేష్ఠం స దదర్శ సదాశివమ్‌ |ఏకాంతవాసినం రుద్రం శైలాదేన సమన్విత:|| 13

కపర్దినం శ్రియా యుక్తం వేదాంగానం చ దుర్గమమ్‌| తథా విధం సమాలోక్య బ్రహ్మా క్షోభావరోzభవత్‌ || 14

దండవత్పతితో భూమౌ క్షమాపయితుముద్యత:| సంస్పృశంస్తత్పదాబ్జం చ చతుర్మకుటకోభి:||

స్తుతిం కర్తుం సమారేభే శివస్య పరమాత్మన:||15

సత్యలోకమునకు వెళ్ళిన బ్రహ్మ పుత్రశోకముచేత పీడింపబడి ఇపుడు చేయవలసినదేమని మిగుల చింతించెను.(10)

మనసు బాధపడుతున్నందుచే శాంతిని పిందలేని పితామహుడు (బ్రహ్మ) ఆ పాపియొక్క దుష్కృతమును తెలుసుకొని (11) కైలాస పర్వతమునకు వెళ్ళుటకు ఆలోచించెను. హంసనధిరోహించిన, మహాతేజస్సుగల బ్రహ్మ దేవతలందరితో కలిసి (12) పర్వతములలో గొప్పదైన (కైలాస) పర్వతమును ప్రవేశించి ఏకాంతముగా నివసించుచున్న రుద్రుని నందితో కూడియున్న వానిని చూచెను. (13) జటాజూటములు గలిగి గొప్ప ప్రభ##వే కూడిన వేదాంగములచే కూడా చేరబడని శివుని అట్లు చూచి దక్షుడు క్షోభనొందెను.(14) దండమువలె నేల పై బడి క్షమను కోరుటకుద్యుక్తుడాయెను. శివుని పాదకమును తన నాలుగు మకుటముల అంచులతో తాకుచూ బ్రహ్మ పరమాత్ముడైన శివుని స్తుతించుటకు మొదలిడెను.

బ్రహ్మావాచ:

నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణ పరమాత్మనే| త్వం హి విశ్వసృజాం స్రష్టా ధాతా త్వం ప్రపితామహ:|| 16

నమో రుద్రాయ మహతే నీలకంఠాయ వేధసే| విశ్వాయ విశ్వబీజాయ జగదానందహేతవే||17

ఓంకారస్త్యం వషట్కార: సర్వారంభప్రవర్తక: యజ్ఞోzసి యజ్ఞకర్మాసి యజ్ఞానాం చ ప్రవర్తక:|

సర్వేషాం యజ్ఞాకర్తృణాం త్వమేవ ప్రతిపాలక:|| 18

శరణ్యోసి మహాదేవ సర్వేషాం ప్రాణినాం ప్రభో || రక్ష రక్ష మహాదేవ పుత్రశోకేన పీడితమ్‌|| 19

బ్రహ్మ పలికెను: రుద్రునకు ,శాంతునకు పరబ్రహ్మ , పరమాత్మునకు నమస్సులు, (ఓరుద్రా!) నీవే విశ్వమును

సృజించువానిని సృజించెదవు. ప్రపితామహుడగు ధాతువు నీవే (16) గొప్ప నైన రుద్రునకు , నీలకంఠునకు , బ్రహ్మకు, విశ్వరూపమున నున్నవానికి, విశ్వము యొక్క బీజమునకు జగత్తు కానందమును, కలిగించువానికి నమస్కారము(17) నీవే ఓంకారము ,వషట్‌కారము అన్ని ప్రారంభములను మొదలు పెట్టువాడవు. నీవే యజ్ఞము., యజ్ఞకర్మ, యజ్ఞములను ప్రవర్తింపజేయువాడవు. (18) యజ్ఞములు చేయువారందరి పాలకుడవు నీవు. మహాదేవా! అన్ని ప్రాణుల చేత శరణు వేడబడుదువు. ప్రభూ! మహాదేవా! పుత్రశోకము చేత బాధపడుచున్నవానిని రక్షింపుము, రక్షింపుము (19)

మహాదేవ ఉవాచ:

శృణుష్వావహితో భూత్వా మమ వాక్యం పితామహ! దక్షస్య యజ్ఞభంగోయం న కృతశ్చ మయా క్వచిత్‌|| 20

స్వీయేన కర్మణా హతో బ్రహ్మన్న సంశయ:|| 21

పరేషాం క్లేశదం కర్మ న కార్యం తత్కదాచన: పరమేష్ఠిన్పరేషాం యదాత్మనస్తద్భవిష్యతి ||22

మహాదేవుడనెను: పితామహా! శ్రద్ధగా నామాటనాలకింపుము ,ఎప్పుడైనా దక్షుని యజ్ఞమును నేను భంగపరచలేదు. (20)

బ్రహ్మన్‌! నిస్సంశయముగా దక్షుడు తన కర్మ చేతనే హతుడయినాడు. (21) ఇతరులకు బాధను కలిగించు పనినెప్పుడైననూ చేయరాదు, ఓ పరమేష్ఠీ| ఇతరులకు ఏది (చేయబడునో) తనకు అదేకలుగును (22)

ఏవముక్త్యా తదా రుద్రో బ్రహ్మణా సహిత: సురై: య¸° కనఖలం తీర్థం ప్రజాపతే:|| 23

రుద్రస్తదా దదర్మాథ వీరభ##ద్రేణ యత్కృతమ్‌| స్వాహా స్వధా తథా పూషా భృగుర్మతిమతాం వర:|| 24

తదాన్యఋషయస్సర్వే పితరశ్చ తథావిధా:| యేన్యే చ బహవస్తత్ర యక్షగంధర్వకిన్నరా:|| 25

త్రోటితా లుంచితా మృతా: కేచిద్రణాజిరే || 26

శంభుం సమాగతం దృష్టా వీరభద్రో గణౖఐ సహ దండప్రణామసంయుక్తస్థావగ్రే సదాశివమ్‌||27

దృష్ట్వా పుర: స్థితం రుద్రో వీరభద్రం మహాబలమ్‌| ఉవాచ ప్రవాసన్‌ వాక్యం కిం కృతం వీర నన్విదమ్‌|| 28

అని పలికి రుద్రుడు అపుడు బ్రహ్మతో మరియు దేవతలతో కలిసి ప్రజాపతి యజ్ఞవాటిక వుండిన కనఖలమును తీర్థమునకు వెళ్ళను. (23) రుద్రుడపుడు వీరభ్రదుడు చేసిన దానిని చూచెను. స్వాహా , స్వధా మరియు పూషన్‌, భృగువు (24) ఋషులు,పితరులు అనేకమంది యక్ష,గంధర్వ, కిన్నరులతో సహా అందరూ రణ భూమిలో ముక్కలుగా చేయబడిరి కొందరు మరణించిరి

(26)శివుని రాకను గాంచి వీరభద్రుడు గణములతో సహా దండప్రణామమాచరించి శివుని ఎదుట నిలిచెను. (27) రుద్రుడు తన ఎదుటనిలిచిన మహాబలవంతుడు వీరభద్రుని చూచి నవ్వి ఓ వీరా! ఇదేమిచేసితివి? అనెను. (28)

దక్షమానయా శీఘ్రం భో యేనేదం కృత మీదృశమ్‌| యజ్ఞే విలక్షఱం తాత యస్వేదం ఫలమీదృశమ్‌|| 29

ఏవముక్త: శంకరేణ వీరభద్రస్త్వరాన్విత: |కబంధమానయిత్వాథ శంభోరగ్రే తదాక్షిపత్‌ || 30

తదోక్త: శంకరేణౖవ వీరభద్రో మహామనా: శిర: కేనాపనీతం చ దక్షస్యాస్య దురాత్మన: 31

దాస్వామి జీవనం వీర కుటిలస్యాపి చాథునా| ఏవముక్త : శంకరేణ వీరభద్రోబ్రవీత్పున:||32

నాయనా! ఈవిధముగా చేసిన దక్షుని గొనిరమ్మ! అతని యజ్ఞమున ఈ విధమైన విలక్షణ ఫలితముకలిగినది అని శంకరుడు పలుకగా వీరభద్రుడు పలుకగా వీరభద్రుడు త్వరాగా దక్షుని మొండెమును తెచ్చి ఎదుట పడవేసెను. (30) అపుడు శివుడు వీరభద్రునితో ఈ దురాత్ముడైన దక్షుని శిరస్సునెవరు తొలగించారు అనెను (31)కుటిలుడైననూ ఇప్పుడు నేనితనికి జీవితాన్ని ఇచ్చెదను అని ఈశ్వరుడు పలుకగా వీరభద్రుడు ఇట్లనెను (32) మయా శిరో చాగ్నౌ తదానీమేవ శంకర | అవశిష్టం శిర: శంభో పశోశ్చ వికృతాననమ్‌|| 33

ఇతి జ్ఞాత్వా రుద్ర: కబంధోపరి చాక్షిపత్‌ | శిర:పశ్చో వికృతం కూర్చయుక్తం భయావహమ్‌|| 34

సదక్షో జీవితం లేభే ప్రసాదాత్‌ శంకరస్య చ |సదృష్ట్యాగ్రే తదా రుద్రం దక్షో లజ్ఞాసమన్విత:|| తుష్టావ ప్రణతో భూత్వా శంకరం లోకశంకరమ్‌|| 35

'శంకరా! అపుడే నేను శిరస్సును అగ్నియందు ఆహుతి చేసాను. మిగిలినది వికృతమైన ముఖము గల ఈ పశువు యొక్క శిరస్సు (33) అది తెలిసి శివుడు వికృతమైనది భయమును కలిగించునది. కనుబొమల మధ్య వెంట్రుకలు గలది అయిన పశుశిరస్సును మొండెము పై పడవేసెను. (34) శివుని ప్రసాదము వలన దక్షుడు జీవితమును పొందెను. అపుడు తన ఎదుట శివుని చూచి సగ్గిలిన దక్షుడు ప్రణతుడుగా లోకశంకరుడైన శంకరుని స్తుతించెను. (35)

దక్ష ఉవాచ:

నమామి దేవం వరదం వరేణ్యం నమామి దేవేశ్వరం సనాతనమ్‌| నమామి దేవాధిపమీశ్వరం హరం నమామి శంభుం జగదేకబంధుమ్‌|| 36

నమామి విశ్వేశ్వరవిశ్వరూపం సనాతనం బ్రహ్మ నిజాత్మరూపమ్‌|| నమామి సర్వం నిజభావంవరం వరేణ్యం వరదం నతోzస్మి || 37

లోమశ ఉవాచ:

దక్షేణ సంస్తుతో రుద్రో బభాషే ప్రహసన్‌ రహ:||

దక్షుడు పలికెను: దేవతలో శ్రేష్ఠుని, వరములిచ్చుదేవుని, శ్రేష్ఠుని ,సనాతనుని నమస్కరించుచున్నాను. దేవతల ప్రభువుని, ఈశ్వరుని, హరుని కల్యాణ కరుని జగత్తుకు పూర్తి బంధువును పూర్తి బంధువును నమస్కరించుచున్నాను. (36) విశ్వమునకు ప్రభువుని విశ్వముగా రూపుదాల్చిన వానిని .సనాతనుని, సర్వవ్యాపిని,నిజాత్మ రూపుదాల్చినవానిని సమస్కరించుచున్నాను. సర్వుని,నిజభావమును భావింపజేయువానిని, వరములనిచ్చు శ్రేష్ఠుని నమస్కరించు చున్నాను. (37) లోమశుడు పలికెను. దక్షుని చేత ఇట్లు స్తుతింపబడిన రుద్రుడు నవ్వుచూ రహస్యమునిట్లు పలికెను(38)

హర ఉవాచ:

చతుర్విధా భజన్తే మాం జనా: సుకృతిన: సదా! ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ ద్విజసత్తమ|| 39

తస్మాన్మే జ్ఞానిన: సర్వే ప్రియా :స్యుర్నాత్ర సంశయ: |వినా జ్ఞానేన మాం ప్రాప్తుం యతంతే తే హి బాలిశా:|| 40

కేవలం కర్మణా త్వం హి సంసారాత్తర్తుమిచ్చసి||

నవేదైశ్చ న దానైశ్చ న యజ్ఞైస్తపసా క్వచిత్‌| న శక్నువన్తి మాం ప్రాప్తుం మూఢా: కర్మవశా నరా|| 42

తస్మాత్‌ జ్ఞానపరో భూత్వా కురు సమాహిత:| సుఖదు:ఖసమో భూత్వా సుఖీ భవ నిరంతరమ్‌|| 43

హరుడు పలికెను: ఓ బ్రామ్మణశ్రేష్ఠా !పుణ్యాత్ములైన నాలుగు విధాల నన్ను సేవించెదరు. వారు ఆర్తుడు జిజ్ఞాసువు (తెలుసుకొనగోరువాడు) ప్రయోజనము గోరువాడు జ్ఞాని (39) వారిలో నాకు జ్ఞానులందరూ ప్రియమైనవారు ఇందులో సందేహము లేదు. ఎవరు నన్ను జ్ఞానము లేకనే పొందయత్నించెదరో వారునిజముగా మూర్ఖులు (40) కేవలం కర్మచేతనే నీవు సంసారమును దాటగోరుచున్నావు (41) కర్మ పై ఆధారపడు మూర్ఖులగు జనులునన్ను వేదములచేత గానీ దానముల చేతగాని , యజ్ఞములచేత, తపస్సు చేతగాని పొందలేరు. (42) కనుక జ్ఞానమునాశ్రయించి సమాహిత చిత్తుడవై కర్మను ఆచరింపుము సుఖదు:ఖములను సమానముగా గ్రహించుచు ఎల్లప్పుడూ సుఖముగా నుండుము (43)

లోమశ ఉవాచ:

ఉపదిష్టస్తదా తేన శంభునా పరవేష్ఠినా! దక్షం తత్రైవ సంస్థాప్య య¸° రుద్ర: స్వపర్వతమ్‌|| 44

బ్రహ్మణాపి తథా సర్వే భృగ్వాద్యాశ్చ మహర్షయ:| ఆశ్వాసితా బోధితాశ్చ జ్ఞానినశ్చాభవన్‌ క్షణాత్‌|| 45

గత: పితామహో బ్రహ్మా తతశ్చ సదనం స్వకమ్‌|| 46

దక్షోపి చ స్వయం వాక్యాత్పరం బోధముపాగత: శివధ్యానపరో భూత్వా తపస్తేపే మహామనా:||47

తస్మాత్సర్వప్రయత్నేన సంసేవ్యో శివ:|| 48

లోమశుడు చెప్పెను: పరమేష్ఠియగు శివుడు అపుడు దక్షునికి ఉపదేశమునిచ్చి అతనిని అక్కడే నిలిపి తన పర్వతమునకేగెను. (44) భృగువు మొదలైన మహర్షులంతా కూడా బ్రహ్మ చేత ఊరడింపబడి, మరియు మేల్కొలుపబడి,ఆక్షణముననే జ్ఞానులైరి (45) పితామహుడగు బ్రహ్మ అటుపిమ్మట తన సదనమున కేగెను (46) దక్షుడు కూడాస్వయముగా ఆవాక్యమునుండి పరమజ్ఞానము నొందెను, శివుని ధ్యానమే పరముగా తలంచుచు ఆ మహాబుద్దిమంతుడు తపస్సు నాచరించెను (47)కనుక భగవంతుడైన శివుడు ఏవిధముగానైననూ బాగుగా సేవింపబడవలెను.(48)

సంమార్జనం చ కుర్వన్తి నరాయే చ శివాంగణ | తే వై శివపురం ప్రాప్య జగద్వంద్యా భవన్తి చ || 49

యే శివస్య ప్రయచ్చన్తి దర్పణం సుమహాప్రభమ్‌ | భవిష్యంతి శివస్యాగ్రే పార్షదత్వేన తే నరా:||50

చామరాణి ప్రయచ్ఛన్తి దేవదేవస్య శూలిన:| చామరైర్వీజ్యమానాస్తే భవిష్యంతి జగత్త్రయే|| 51

దీపదానం ప్రయచ్ఛన్తి మహాదేవాలయే నరా: తేజస్వినో భవిష్యంతి తే త్రైలోక్యప్రదీపకా:|| 52

ధూపం యే వై ప్రయచ్ఛన్తి శివాయ పరమాత్మనే | యశస్వినో భవిష్యన్తి ఉద్దరన్తి కులద్వయమ్‌ || 53

నైవేద్యం యే ప్రయచ్చన్తి భక్త్యా హరిపరాగ్రత:| సిక్థే సిక్థే క్రతుఫలం ప్రాప్నువన్తి హి తే నరా:|| 54

శివప్రాంగణమున సంమార్జనము చేయు నరులు శివుని నగరమును చేరి జగత్తుకంతా పూజ్యులగుదురు(49) ఎవరు శివునికి గొప్ప కాంతి గల దర్పణమును (చూపెదరో) ఇచ్చెదరో వారు శివుని ఎదుట శివుని సభలో వుండగలరు. (50) దేవదేవుడగు శివునికి చామరములనిచ్చు వారు మూడులోకములయందు చామరములచేత వీచబడుదురు(51) శివాలయమున దీపదానము చేయు నరులు మూడులోకములకు కాంతి నిచ్చుచూ తేజోవంతులు కాగలరు (52) పరమాత్ముడైన శివునకు ధూపము నిచ్చువారు కీర్తి మంతులై రెండు కులములనూ తరింప జేయుదురు.(53) శివుని ఎదుట నైవేద్యమునిచ్చు వారు ప్రతి అన్నపుముద్దయుందునూ ఒక క్రతువు యొక్క ఫలమును పొందెదరు (54)

భగ్నం శివాలయం యే చ ప్రకుర్వన్తి సరోత్తమా:| ప్రాప్నువన్ని ఫలం తే వై ద్విగుణం నాత్ర సంశయ:| 55

నూతనం యే ప్రకుర్వన్తి ఇష్టకైరశ్మనాపి వా | స్వర్గే హితే ప్రమోదంతే యావత్తిష్ఠతి నిర్మలమ్‌ || యశో భూమౌ ద్విజశ్రేష్ఠ నాత్ర కార్యా విచారణా|| 56

కారయంతి చ యే విప్రా: ప్రాసాదం బహుభూమికమ్‌| శివస్యాథ మహాప్రాజ్ఞా :ప్రాప్నువన్తి పరాం గతిమ్‌|| 57

శుద్థం ధవళితం యే చ కుర్వన్తి హరమందిరమ్‌| స్వీయం పరకృతం చాపి తేపి యాంతి పరాం గతిమ్‌|| 58

యే నరోత్తములైతే భగ్నమైన శివాలయమును బాగుచేయుదురో వారు నిస్సంశయముగా రెండింతల ఫలితమును పొందెదరు (55) దానిని ఇటుకలతో గానీ , మట్టితో గానీ కొత్తగా చేయువారు భూమియందు (వారి) నిర్మలమైన కీర్తి నిలుచునంతవరకు స్వర్గమున ఆనందించెదరు. ఇందు విచారించవలసినది లేదు. (56) బుద్దిమంతులైన విప్రులారా! యే విప్రులైతే శివుని ప్రాసాదమును అనేక అంతస్థులతో చేయించెదరో వారుపరమగతిని (మోక్షమును) పొందుదురు. (57) తన లేదా ఇతరుల శివమందిరమును శుద్దమైనదిగా తెల్లగా చేయువారు మోఞమును పొందుదురు. (58)

వితానం యే ప్రయచ్చన్తి నరా: సుకృతినోపిన మీహి| తారయంతి కులం కృత్స్నం శివలోకం గతా: పున:|| 59

యేచ నాదమయీం ఘంటాం నిబధ్నంతి శివాలయే| తేజస్విన: కీర్తిమంతో భవిష్యంతి జగత్త్రయే|| 60

ఏకకాలం ద్వికాలం వా త్రికాలం చానుపశ్యతి | ఆఢ్యో వాపి దరిద్రొ వా సుఖం దు:ఖాత్ర్పముచ్చతే|| 61

శ్రద్థావాన్‌ భజతే యో వా శివాయ పరమాత్మనే| కులకోటిం

సముధృత్య శివేన సహ మోదతే|| 62

అత్రైవోదాహారంతీమమితిహాసం పురాతనమ్‌| ఇంద్రసేనస్య సంవాదం యమస్య చ మహాత్మన:|| 63

పుణ్యాత్ములైన నరులెవరైతే (శివునకు) మేల్కొట్లు నొసగుదురో వారు కులాన్నంతయూ తరింపజేసి శివలోకమును చేరుదురు (59) నాదముతో కూడిన ఘంటను శివాలయమున కట్టువారు మూడు లోకములందును తేజస్సును పొందినవారు. కర్తీ గలవారు అవుదురు(60) ఒక పర్యాయముగానీ రెండు పర్యాయములుగానీ మూడు పర్యాయములుగానీ గాంచువారు ధనికుడైనా దరిద్రుడైనా సుఖముగా దు:ఖమునుండి విముక్తుడగును (61) పరమాత్ముడైన శివుని శ్రద్దతో సేవించువాడు కులమునంతా ఉద్దరించి శివునితో కలిసి ఆనందించును (62) ఇందు ఇంద్రసేనునికి యమునికి మధ్య జరిగిన పురాతన ఇతిహాస సంవాదమును ఉదాహరిస్తారు (63)

పురా కృతయుగే హ్యాసీదింద్రసేనో నరాధిన :| ప్రతిష్ఠానాధిపో వీరో మృగయా రసికస్సదా|| 64

బ్రహ్మణ్యస్సదా క్రూర: కేవలా సుతృప్తస్సదా| పరప్రాణౖర్నిజప్రాణాన్‌ పుష్ణాతి స ఖల: సదా|| 65

పరస్త్రీలంపటోత్యంతం పరద్రవ్యేషు లోలుప: బ్రాహ్మణా ఘాతితాస్తేన సురాపశ్చ నిరంతరమ్‌ || 66

గురుతల్పగతోz త్యర్థం సదా సౌవర్ణతస్కర: | తథా భూతానుగా : సర్వే రాజ్ఞస్తస్య దురాత్మన:|| 67

ఏవం బహువిధం రాజ్యం చకార సదురాత్మవాన్‌| తత: కాలేన పంచత్వం ప్రాపదుర్మతి:|| 68

పూర్వము కృతయుగము ప్రతిష్ఠానపురమును పాలించు ఇంద్రసేనుడను రాజుండెడివాడు. అతను వేటాడుట యందే ఎల్లప్పుడు ఆనందమును పొందెడివాడు (64) ఆచారహీనుడు, క్రూరుడు, కేవలము (తన) ప్రాణములచేత తృప్తి నొందువాడు,ఇతరుల ప్రాణముల చేత తన ప్రాణములను పోషించువాడు మూఢుడు (65) ఇతరుల స్త్రీలయందు మిక్కిలి కామము గలవాడు,ఇతరుల ద్రవ్యములయందు కాంక్ష గలవాడు, బ్రాహ్మణుల హింసించువాడు , ఎడతెగక మద్యము ద్రావువాడు (66) గురువు యొక్క తల్పమును చేరినవాడు, బంగారమును దొంగిలించువాడు, దురాత్ముడైన ఆరాజుననుసరించి ప్రజలు ప్రవర్దించెడివారు (67) ఇట్లుపెక్కు విధములుగా ఆ దురాత్ముడైన రాజు రాజ్యము చేసెను. అపుడు చాలాకాలము తరువాత (గొప్పదైవ కాలముచేత) ఆ దుర్మతి పంచభూతములలో కలిసెను.(మరణించెను) (68)

తదా యామ్యైశ్చ నీతోసావిం ద్రసేనో దురాత్మవాన్‌| యమాన్తికమును ప్రాప్తస్తదా రాజా సకల్మష: 69

యమేన దృష్టస్తత్రాసావింద్రసేనో గ్రత: స్థిత: అభ్యుత్థానపరో భూత్వా ననామ శిరసా శివమ్‌|| 70

దూతాన్‌ సంభర్త్స యామాస యమో ధర్మభృతాం వర:| పాశైర్భదం చంద్రసేనం ముక్త్యా ప్రోవాచ ధర్మరాట్‌ || 71

గచ్ఛ పుణ్యతమాంల్లోకాన్‌ భుంక్ష్వ రాజన్యసత్తమ| యావదింద్రశ్చ నాకేస్తి యావత్సూర్యో నభస్తలే || 72

పంచభూతాని యావచ్చ తావత్త్వం చ సుఖీ భవ| సుకృతీ, త్వం మహారాజు శివభక్తోసి నిత్యదా || 73

అపుడు దురాత్ముడైన ఇంద్రసేనుడు, కల్మషముతో గూడినవాడు, యమభటులచేత యముని వద్దకు గొనిరాబడెను. (69)

ఎదుట నిలిచిన ఇంద్రసేనుని చూచి యముడు లేచినిలబడి, తలవంచి శివునకు నమస్కరించెను. (70) ధర్మమును పోషించువారిలో శ్రేష్ఠుడగు యముడు దూతలను బెదిరించెను. తాళ్ళతో కట్టబడిన చంద్రసేనుని విడిచి, ధర్మరాజిట్లు పలికెను.(71) ఓ రాజశ్రేష్ఠా! ఎక్కువ పుణ్యముగల లోకములను జేరి అనుభవింపుము స్వర్గములో ఇంద్రుడున్నంతవరకు , ఆకాశమున సూర్యుడున్నందవరకు ,(72)పంచభూతములున్నంతవరకు పుణ్యకర్మలనాచరించిన శివభక్తుడగు నీవు నిత్యము సుఖముగా నుండుము (73)

యమస్య వచనం శ్రుత్వా ఇంద్రసేనో భ్యభాషత| అహం శివం న జానామి మృగయా రసికో హ్యహమ్‌|| 74

తచ్ఛృత్వా వచనం తస్య యమో భాష్యమభాషత| ఆహర ప్రహరస్వేతి ఉక్తం చేదం సదా త్వయా || 75

తేన కర్మవిపాకేన సదా పూతోసి మానద| తస్మాత్త్వం గచ్ఛ కైలాసం పర్వతం శంకరం ప్రతి|| 76

యముని మాటను విని ఇంద్రసేనుడు బదులు పలికెను వేటాడుట యందు మక్కువ గల నేను శివునెరుగను(74)ఆ మాట విని యముడు చెప్పవలసిన దానినిచెప్పను. ఓ మానద (గౌరవప్రదుడా!) ఆహర (గొనిరమ్ము) ప్రహరస్వ (కొట్టుము) అని ఎల్లప్పుడూ పలికితివి(75) ఆకర్మ ఫలము చేత నీవు ఎల్లప్పటికీ పవిత్రుడవు కనుక శంకరుని గూర్చి కైలాసమునకు వెళ్ళుము,(76)

ఏవం సంభాషమాణస్య యమస్య చ మహాత్మన: ఆగతా: శివదూతాస్తే వృషారూఢా మహాప్రభా:|| 77

నీలకణ్ఠా దశభుజా: పంచవక్త్రాస్త్రీలోచనా:| కపర్థిన: కుణ్ణలిన: శశాంకాంకితమౌళయ:|| 78

తాన్‌దృష్ట్వా సహసోత్థాయ యమో ధర్మభృతాంవర: | పూజయామాస తాన్‌ సర్వాన్‌ మహేంద్రప్రతిమాంసద్తా|| 79

త్వరితేనైవ తే సర్వే ఊచుర్వైవస్వతం యమమ్‌ |అత్రాగతో మహాబాగ ఇంద్రసేనో మితద్యుతి :|| నామ్న: ప్రవర్తకో నిత్యం రుద్రస్య చ మహాత్మన:|| 80

ఇట్లు మహాత్ముడైన యముడు మాటలాడుచుండగనే వృషభమును అధిరోహించిన వారు గొప్ప కాంతిగలవారగు శివదూతలేతెంచిరి (77) (వారు) నీలకణ్ఠులు, పదిభుజములు గలవారు, ఐదు తలలు గలవారు,మూడుకళ్ళుగలవారు, జటాజూటమును, కుణ్డలములను ధరించినవారు, శిరస్సుపై చంద్రుని ధరించినవారు (78) వారిని చూచి ధర్మప్రభువగు యముడు ఒక్కమారుగా లేచి మహేంద్రసమానులైన వారినందరినీ పూజించెను. (79)

వారంతా త్వరగా యమునుద్దేశించి పలికిరి, ఓ మహానుభావా! ఇంద్రసేనుడను గొప్ప కాంతిగలరాజు నిత్యమూ శివనామము జపించువాడిచ్చటికి వచ్చెను. (80)

శ్రుత్వాచ వచనం తేషాం యమేన చ పురస్కృత: ఇంద్రసేనో విమానస్థ: ప్రేషితో హి శివాలయమ్‌|| 81

ఆనీతోయం తదా తైశ్చ పార్షదప్రవరోత్తమై :| శంభునా హితదా దృష్ఠ ఇంద్రసేనో మితద్యుతి:|| 82

అభ్యుత్థాయాగతో రుద్ర: పరిష్వజ్య తదా నృపమ్‌ | అర్థాసనగతం కృత్వా ఇంద్రసేనం తతోబ్రవీత్‌ || 83

కిం దాతవ్యం సృపశ్రేష్ఠ ప్రయచ్చామి తవేప్సితమ్‌| ఇతి శ్రుత్వా వచస్తస్య మహేశస్య తదా నృప: || ఆనందాశ్రుకణాన్ముంచన్‌ ప్రేవ్ణూ నోవాచ కించన ||84

వారి మాటలనువిని యముడు ఇంద్రుసేనుని సత్కరించి విమానమందు కూర్బోబెట్టి శివుని నివాసమునకు పంపెను. (81) తన పరివారములోని ఉత్తములచే తీసుకొనిరాబడిన ఇంద్రసేనుని శంభువుడు చూసెను.(82) రుద్రుడు లేచి ఆరాజును కౌగిలించుకొనెను సగం సింహసనము పై కూర్చుండబెట్టి ఇంద్రసేనుని ఉద్ధేశించి ఇట్లు పలికెను (83) ఓ గొప్పరాజా: ఏమి ఇవ్వవలెను, వీవు కోరినది ఇచ్చెదను అని మహేశుడు పలుకగా విని రాజు ఆనందముచే కన్నీరు విడుచును ప్రేమ భావమువల్ల ఏదీ పలుకక మిన్నకుండెను (84)

తదా కృతో మహేశేన పార్షదో హి మహాత్మనా | చండో నామ్నా చ విఖ్యాతో ముండస్య చ సఖా ప్రియ:|| 85

నామోచ్చారణమాత్రేణ రుద్రస్య పరమాత్మన: సిద్దిం ప్రాప్తో హి పాపిష్ఠ ఇంద్రసేనో నరాధిప: 86

హరే హరేతినామ్నా శంభోశ్చక్రధరస్య చ | రక్షితా బహవో మర్త్యా: శివేన పరమాత్మనా|| 87

అపుడు శివుని చేత ముండుడికి ప్రియమిత్రుడగు చండుడను సభ్యుడిగా (ఇంద్రసేనుడు) చేయబడెను. (85) గొప్పపాపియైన ఇంద్రసేనుడు రాజుపరమాత్ముడగు రుద్రుని నామమును ఉచ్చరించుట మాత్రముచేత సిద్దిని పొందెను (86) హరే హర అని శివుని యొక్క , విష్ణువు యొక్క నామము చేత పరమాత్మడైన శివుని ద్వారాఅనేకమంది మానవులు రక్షింపబడిరి (87)

మహేశాన్నాపరో దేవో దృశ్యతే భువనత్రయే | తస్మాత్సర్వప్రయత్నేన పూజనీయస్సదాశివ:|| 88

పత్రై: పుషై#్ప: ఫలైర్వాపి జలైర్వా విమలైస్సదా| కరవీరై: పూజ్యమాన: శంకరో వరదో భ##వేత్‌|| 89

కరవీరాద్దశగుణమర్కపుష్పం విశిష్యతే | విభూత్యాదికృతం సర్వం జగదేతచ్చరాచరమ్‌|| 90

శివస్యాంగణలగ్నాయా తస్మాత్తాం ధారయేత్సదా| తతస్త్రిపుణ్డ్ర యత్పుణ్యం తచ్చృణుధ్వం ద్విజోత్తమా :|| 91

సర్వపాపహరం పుణ్యం తచ్చృణుధ్వం ద్విజోత్తమా:| స్తేన: కోపి మహాపాపో ఘతితో రాజదూతకై:|| 92

తం ఖాదితుం సమాయాత: శ్వా శిరస్యుపరి స్తిత:| నఖాంతరాళసంలగ్నా రక్షా తసై#్యవ పాపిన:|| 93

లలాటే పతితా తస్య త్రిపుణ్డ్రాంకితముద్రయా| చైతన్యేన వినా తస్య దేహమాత్రైకలగ్నయా || 94

మూడులోకములయందునూ పరమశివుని కంటే వేరొక దైవము కనుపింపడు కనుక అన్ని ప్రయత్నములచేత సదాశివునిపూజింపవలెను (88) పత్రములచేత పుష్పములచేత,స్వచ్చమైన జలముచేత , కరవీరములచేత పూజింపబడు శంకరుడు వరములిచ్చును(89) కరవీరముల కంటే అర్కపుఫ్పము (జిల్లేడు) పదింతలు రెట్టింపు గుణములకలది, చరాచరమైన జగత్తు విభూతి మొదలైన వాని నుండి సృజింపబడినది (90) శివుని శరీరమునంటియున్న ఆ విభూతిని ఎల్లప్పుడూ ధరించవలయును, ఓ ఉత్తమ విప్రులారా! తరువాత, అన్ని పాపములను హరించు పుణ్యమైన త్రిపుణ్డ్రమును గూర్చి వినుడు రాజదూతల చేత ఒకానొక దొంగ మహాపాపి (అయినందుచే) చంపబడినాడు (92) అతని నారగించుటకు వచ్చిన ఒ కుక్క తల పై నిలుచున్నది. ఆపాపియొక్క రక్ష గోరుమధ్య భాగంలో చిక్కుకున్నది (93) త్రిపుణ్డ్రాంకిత ముద్రచేత అతని ఫాలభాగము పై పడి చైతన్యము లేని అతని దేహమును మాత్రము తగులుకొని యున్నది. (94)

కైలాసం తస్కరో నీతో రుద్రదూతైస్తతస్తదా | విభూతేర్మహిమానం తు కో విశేషితుమర్హతి|| 95

విభూత్యా మణ్డితాంగానాం నృణాం పుణ్యకర్మణామ్‌| ముఖే పంచాక్షరో యేషాం రుద్రాస్తే నాత్ర సంశయ:|| 96

జటాకలాపినో యే చ యే రుద్రా క్షావిభూషణా:| తే వై మనుష్యరూపేణ రుద్రా నాస్త్యత్ర సంశయ:| 97

తస్మాత్సదాశివ: పుంభి: పూజనీయో హి నిత్యశ:| ప్రాతర్మధ్యాహ్నకాలే చ సాయం సంధ్యా విశిష్యతే || 98

ప్రాతస్తు దర్శనాచ్చంభోర్నైశ##మేనో వ్యపోహతి| మధ్యాహ్నే దర్శనాచ్చంభో : సప్తజన్మార్జితం నృణామ్‌|| పాపం ప్రణాశమాయాతి నిశాయాం నైవ గణ్యతే|| 99

శివేతి ద్వ్యక్షరం నామ మహాపాపప్రణాశనమ్‌| యేషాం ముఖోద్గతం నౄణాం తైరిదం ధార్యతే జగత్‌ || 100

అపుడా దొంగ శివదూతలచేత కైలాసమునకు తీసుకొని పోబడెను. విభూతి యొక్క మహిమను ఎవరు విశేషముగా చెప్పగలరు? (95) ఏ జనులైతే విభూతి చేత అలంకరింప బడిన దేహమును కలిగివుంటారో ముఖమున పంచాక్షరమును కలిగివుంటారో అట్టి పుణ్యాత్యులగు జనులు రుద్రులే ఇందు సంశయములేదు.(96) ఎవరు జటలను ముడివేసి కొంటారో, రుద్రాక్షవిభూషణమును కలిగివుంటారో వారు మనుష్య రూపమున నున్న రుద్రులే ఇందు సంశయము లేదు(97) కనుక సదాశివుడైన రుద్రుడు నిత్యము మానవులచే పూజింపబడవలెను. ప్రాత కాలము, మధ్యాహ్నకాలము, సాయంసంధ్యా విశేషమైనవి (98) ప్రొద్దున శివుని దర్శనముచేత రాత్రి (చేసిన) పాపముతొలగిపోవును, మధ్యాహ్నమున దర్శనముచేత మానవులకు ఏడు జన్మలనుండి పొందిన పాపము నాశనమునొందును. రాత్రి యందైతే లెక్కింపబడదు (99) శివ అను రెండక్షరాల పేరు గొప్ప పాపములను నశింపచేయునది. అది ఎవరి ముఖమునుండి బయల్వెడలునో వారి చేతనే ఈజగత్తు దరింపబడుతున్నది. (100)

మూలము:

శివాంగణ తు యా భేరీ స్థాపితా పుణ్యకర్మభి:| తస్యా నాదేన పూతా వై యేచ పాపరతా జనాః ||

పాషిండినోzప్యసద్వాదాస్తేzపి యాన్తి పరాం గతిమ్‌||101

పశోర్యస చసంబద్దా చర్మణా చ శివాలయే| నృభిర్యా స్థాపితా భేరీ మృదంగమురజాది చ||

స పశు: శివసాన్నిధ్యమాప్నోత్యత్ర న సంశయ:|| 102

పుణ్యకర్ములైన జనులచేత శివాంగణము నందుంచబడిన భేరీనాదముచేత పాపరతులైన జనులు, పాషండులు, చెడువాదములుచేయువారు (నాస్తికులు) కూడా ఉత్తమ గతిని పొందెదరు (101) శివాలయమునందు ఏ పశువునకు చెందిన చర్మముచేత భేరీ,మృదంగము ,మరజము (మద్దెల) మొదలైనవి ఉంచబడుతాయో ఆ పశువు శివసన్నిదిని చేరుట తథ్యము(102)

తస్మత్తతం చవితతం ఘనం సుషిరమేవ చ| చామరాణి మహార్షాణి మంచకా: శయనాని చ|| 103

గాథాశ్చ ఇతిహాసాశ్చ గాయనం చ యథావిధి| బహురూపాదికం శంభో: ప్రియాన్యేతాని కల్పయేత్‌|| 104

కల్పయిత్వా చ గచ్చన్తి శివలోకం హి పాపిన:| సుధర్మాణో మహాత్మాన: శివపూజావిశారదా:|| 105

గురోర్ముఖాచ్చ సంప్రాప్తశివపూజారతాశ్చ యే |శివరూపేణ తే విశ్వం పశ్యన్తి కృతనిశ్చయా:|| 106

సమ్యగ్బుద్ధ్యా సమాచారా వర్ణాశ్రమయుతా నరా: బ్రాహ్మణా : క్షత్రియా వైశ్యా: శూద్రాశ్చాన్యే తథా నరా:|| 107

శ్వపచోపి వరిష్ఠ: స శంభో ప్రియతరో భ##వేత్‌| శంభునాదిష్ఠితం సర్వం జగదేతచ్చరాచరమ్‌ || 108

కనుక వీణాది తంత్రీ వాద్యాలను (తతం) వితతమును, పిల్లన గ్రోవిమొదలైన ముఖవాద్యాలను (సుషిరం) తాళము మొదలైన కంచు వాద్యాలను (ఘనం)

గొప్ప చామరములను, మంచకములను, పరుపులను (103) గాథలను, ఇతిహసమును (ఇతిహసముల గాథలను) గానమును యథావిథిగా, శివునకు ప్రియుములైన వానిని వివిధ రూపములో చేయవలెను. (104) అట్లు చేసి పాపులైన వారునూ శివలోకమునకు వెళ్ళెదరు. మంచి ధర్మము గలవారు, మహాత్ములు, శివపూజను తెలిసినవారు (105) మరియు గురువు ముఖమునుండి పొందిన శివపూజ యందు ఆనందించువారు నిశ్చయమునొంది ఈ విశ్వమును శివుని రూపంలో చూచెదరు.(106) మంచి బుద్దిచేత మంచి ఆచారమునుగలవారు వర్ఱాశ్రమము గల నరులు, బ్రాహ్మణులు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు ఇతరజనులు (జగత్తునంతా శివుని చూచెదరు) (107) గొప్పవాడైన చండాలుడు కూడా శివునకు అత్యంత ప్రియుడే యగును చరాచర జగత్తంతా శివుని చేతనే అధిష్ఠితమై యున్నది.(108)

తస్మాత్సర్వం శివమయం జ్ఞాతవ్యం సువిశేషత: వేదై : పురాణౖ: శాస్త్రెశ్చ తథౌపనిషదైరపి|| 109

ఆగమైర్వివిధై: శంభు జ్ఞాతవ్యో నాత్ర సంశయ: నిష్కామైశ్చ సకామైశ్చ పూజనీయస్సదాశివ:|| 110

కనుక అంతా శివమయమని విశేషముగా తెలియవలెను వేదములచేత, పురాణముల చేత, శాస్త్రములచేత మరియు ఉపనిషద్గ్రంథముల చేత వివిధ అగమములచేత శివుని తెలియవలయును, ఇందు సంశయము లేదు(109) కోరికలు లేనివారు కోరికలు గలవారు కూడా సదాశివుని పూజింపవలెను.(110)

లోమశ ఉవాచ:

కథయామి పురావృత్తమితిహాసం పురాతనమ్‌| నందీ నామ పురా వైశ్యో హ్యవంతీపురమావసత్‌|| 111

శివధ్యానపరరో భూత్వా శివపూజం చకార స: నిత్యం తపోవనస్థం హి లింగమేకం సమర్చయత్‌|| 112

ఉషస్యుషసి చోత్థాయ ప్రత్యహం శివవల్లభ:| నందీ లింగార్చనరతో బభూవాతిశ##యేన హి|| 113

లింగం పంచామృతేనైవ యథోక్తే నాభ్యషేచయత్‌| విపై#్ర : సమావృతో నిత్యం వేదవేదాంగపారగై: 114

యథాశాస్త్రేణ విధినా లింగార్చనపరోభవత్‌| స్నాపయిత్వా తత: పుషై#్పర్నానాశ్చర్యసమన్వితై: 115

ముక్తా ఫలైరింద్రనీలైర్గోమేదైశ్చ నిరంతరమ్‌ | వైడూర్యైశ్చైవ నీలైశ్చ మాణిక్యైశ్చ తథార్చయత్‌ || 116

లోమశుడుచెప్పెను! మునుపు జరిగిన పురాతన ఇతిహాసమును తెలిపెదను. పూర్వము అవంతీపురమున నంది అను వైశుడు నివసించెను.(111) అతను శివుని ధ్యానమునే చేయుచూ శివపూజను చేసెను. నిత్యమూ తపోవనమునందున్న ఒక లింగమును అర్చించువాడు (112) ప్రతిదినము ఉప:కాలముననే లెచి శివుని యందు ప్రీతిచే నంది మిక్కిటముగా శివలింగముయొక్క అర్చనయందే వుండెడివాడు. (113) యథోక్తముగా శివలింగమును పంచామృతముచేతనే అభిషేకించువాడు ప్రతిదినము వేదవేదాంగముల యందు పండితులైన బ్రాహ్మాణులతో కూడి (114) శాస్త్రమునందు చెప్పిన విధముగా లింగార్చన చేయువాడు. స్నానము చేయించి పిమ్మట నానావిధములైన పుష్పములచేత (115) మరియు ముత్యములు ఇద్రనీలములు, నీలములు, గోమేదికము, వైడూర్యములు, మాణిక్యములచేత పూజించెడివాడు.

ఏవం నందీ మహాభాగో బహూన్యబ్దానిచార్చయత్‌| విజనస్థం తదా లింగం నానాభోగసమన్వితమ్‌|| 117

ఏకదా మృగయాసక్త: కిరాతో భూతహింసక:| అవివేకపరో భూత్వా మృగయారసిక :సదా|| 118

పాపీ పాపసమాచారో విచరన్గిరికందరే || అనేకశ్వాపదాకీర్ణే హన్యమాన ఇతస్తత:|| 119

ఏవం విచరమాణో సౌ కిరాతో భూతహింసక : యదృచ్చయాగతస్తత్ర యత్ర లింగం సుపూజితమ్‌|| 120

ఇట్లు మహానుభావుడైన నంది జనరహిత ప్రదేశంలో నున్న శివలింగమును రకరకాల భోగములతో కూడునట్లు పెక్కు సంవత్సరములు పూజించెను. (117) ఒక మారు ప్రాణులను

హింసించు కిరాతుడొకడు వేటయందాసక్తి చేత అవివేకముతో (118) పాపముతో,పలుమృగముల గల గిరికందరమున (పర్వత గుహయందు) ఇటునటు తిరుగుచూ (119) ఎక్కడైతే శివలింగము బాగుగా పూజింపబడినదో అచటికి అనుకోకుండా వచ్చెను. (120)

ఉదకం వీక్షమాణోz సౌ తృషయా పీడితో భృశమ్‌| తతో వనే సర: శీఘ్రం దృష్ట్యా తోయే సమావిశత్‌|| 121

తీరే సంస్థాప్య దుష్టాత్మా తత్సర్వం మృగయాదికమ్‌| గండూషోత్సర్జనం కృత్వా పీత్వా తోయం చ నిర్గత: ||122

శివాలయం దదర్శాగ్రే అనేకాశ్చమణ్డితమ్‌ | దృష్టం సుపూజితం లింగం నానారత్నై : పృథక్‌ పృథక్‌|| 123

తథా లింగం సమాలక్ష్య యదా పూజాం సమాహరత్‌ | రత్నాని సర్వభూతాని విధూనాని ఇతస్తత :||124

స్నపనం తస్య లింగస్య కృతం గండూషవారిణా | కరేణౖకేన పూజార్థం బిల్వపత్రాణి సోర్పయత్‌|| 125

ద్వితేయేన కరేణౖవ మృగమాంసం సమర్పయత్‌| దణ్డప్రణామసంయుక్త: సంకల్పం మనసాకరోత్‌ || 126

అద్యప్రభృతి పూజాం వై కరిష్యామి ప్రయత్నత:| త్వం మే స్వామీ చ భక్తోహమద్యప్రభృతి శంకర || 127

మిగుల దప్పక గొన్న ఆ కిరాతుడు నీటికోసము వెదకుచూ ఆ వనములో సరస్సును చూచి వెంటనే నీటియందు ప్రవేశించెను.(121) ఒడ్డున వేట సామాగ్రినంతా వుంచి (నీటిలోప్రవేశించి) నీటిని పుక్కిలించి కొంతనీటిని తాగి బయటకొచ్చెను.(122)ఎదురుగా అనేక ఆశ్చర్యములతో కూడిన శివాలయమును వివిధ రత్నములతో విడివిడిగా పూజింపబడిన లింగమును చూచి ఎప్పుడైతే పూజను గ్రహించెనో (అపుడు) అన్నివిధాల రత్నములను త్రోసివేసి (124) పుక్కిటినుండి నీరుతో ఆ లింగమునకు స్నానము చేయించెను. ఒక చేతితో మాత్రమే అతను పూజకై బిల్వపత్రములనర్పించెను (125) రెండవచేతితో మృగముయొక్క మాంసమునర్పించెను. దండము వలె ప్రణామము చేసి మనసులో సంకల్పించెను.(126) ఈ నాటినుండి ప్రయత్నపూర్వకముగా పూజచేసెదను. నేటినుండి శంకరా! నీవు నా స్వామివి, నేను నీ భక్తుడను(127)

ఏవం నైయమికో భూత్వా కిరాతో గృహమాగత:| నందీ దదర్శ తత్సర్వం కిరాతేన ఇతస్తత:|| 128

చింతాయుక్తోభవన్నందీ జాతం కిం ఛిద్రమద్య మే | కథితాని చ విఘ్నాని శివపూజారతస్య చ ||129

ఉపస్థితాని తాన్యేవ మమ భాగ్యవిపర్యయాత్‌|| ఏవం విమృశ్య సుచిరం ప్రక్షాళ్య శివమందిరమ్‌| యథాగతేన మార్గేణ నందీ స్వగృహమాగత:|| 130

తతో నందినమాగత్య పురోథా గతమానసమ్‌| అబ్రవీద్వచనం తం తు కస్మాత్త్వం గతమాపస:|| 131

పురోహితం ప్రతి తదా నందీ వచనమబ్రవీత్‌|| 132

ఇట్లు నియమమును గ్రహించి ఆ కిరాతుడింటికి వచ్చెను. కిరాతుడిట్లు చేయుటను నంది గాంచెను, (128) నంది అపుడు చింత్రాక్రాంతుడాయెను ఈ రోజు ఏ లోపము నాకు జరిగినది. శివుని పూజయందు చెప్పబడిన విఘ్నములే నా దురదృష్టము వలన వచ్చినవి. (129) చాలాసేపు ఇట్లు పలువిధముల ఆలోచించి, శివమందిరమును కడిగి, వెళ్ళిన మార్గముననే నంది ఇంటికి వచ్చెను. (130) అట్లు వికలమనస్కుడై వచ్చిన నందిని గాంచి పురోహితుడు అడిగెను. ఎందువలన నీవు వికలమైన మనస్సుతో నున్నావు? (131) అపుడు పురోహితుని ఉద్దేశించి నంది ఇట్లు పలికెను (132)

అద్య దృష్టం మయా విప్ర! అమేధ్యం శివసన్నిధౌ | కేనేదం కారితం తత్ర న జానామి కథంచన|| 133

తత: పురోధా వచనం నందినం చాబ్రవీత్తదా | యేన విస్ఖలితం తత్ర రత్నాదీనాం ప్రపూజనమ్‌|| సోపి మూఢో న సందేహ: కార్యాకార్యేషు మందధీ:|| 134

తస్మాచ్చింతా న కర్తవ్యా త్వయా అణురపి ప్రభో | ప్రభాతే చ మయా సార్థం గమ్యతాం తచ్చివాలయమ్‌|| 135

నిరీక్షణార్థం దృష్టస్య తత్కార్యం విదధామ్యహమ్‌| ఏతచ్ఛృత్వా తు వచనం నందీ తస్య పురోధస:|| 136

ఆస్థిత: స్వగృహే నక్తం దూయమానేన చేతసా| తస్యాం రాత్య్రాం వ్యతీతాయామాహుయ చ పురోధసమ్‌|| 137

గత: శివాలయం నందీ సమం తేన మహాత్మనా | తతో దృష్టం పూర్వదినే కృతం తేన దురాత్మనా|| 138

ఓ బ్రాహ్మణుడా ! ఈనాడు నేను శివుని సన్నిధిలో అమేధ్యమును చూచితిని. ఎవరు దానినట్లు చేసారో పూర్తిగా నాకు తెలియదు(133)అంతట నందితో పురోహితుడిట్లు పలికెను. రత్నములు మొదలైన వానిచేత (చేయబడిన) గొప్పపూజ ఎవరిచేత అట్లు తీసివేయబడినది? (134) వాడెవరైననూ కార్యము ఆకార్యము వీనియందు మందగించిన బుద్దిగల మూర్ఖుడు కనుక ఓ ప్రభూ! నీవు అణువంతైననూ చింతించవలదు. ప్రొద్దున నాతో సహ శివాలయమునకు వెళ్ళుడు.(135) ఆ దుష్టునికై నిరీక్షించుటకు, అటుపిమ్మట చేయవలసిన దానిని నేను ఆచరించెదను పురోహితుని వాక్యము విని నంది (136) తన ఇంటియందే మనసున బాదపడుచూ రాత్రిని గడిపి ప్రొద్దున పురోహితుని పిలిచెను (137) పిలిచి నంది ఆ మహాత్మునితో శివాలయమునకు వెళ్ళి ముందురోజు దురాత్ముడైన కిరాతునిచేత చేయబడినదానిని చూచెను. (138)

సమ్యక్ర్పపూజనం కృత్వా నానారత్నపరిచ్ఛదమ్‌| పంచోపచారసంయుక్తం చైకాదశ్యన్వితం తథా|| 139

అనేకస్తుతిభి: స్తుత్వా గిరిశం బ్రాహ్మణౖ: సహ తదా యామద్వయం జాతం స్తూయమానస్య నందిన:|| 140

ఆయాతో హి మహాకాలస్తథారూపో మహాబల:| కాలరూపో మహారౌద్రో ధనుష్పాణి: ప్రతాపవాన్‌|| 141

తం దృష్ట్యా భయవిత్రస్తో నందీ స విలలాప హ | పురోధాశ్చైవ సహసా భయభీతస్తదాభవత్‌ || 142

అనేక రత్నములతో కూడుకున్నవానిని, పంచ ఉపచారములచేత కూడుకున్న శివుని , ఏకాదశ రుద్రము పూర్తికాగా చక్కగా పూజచేసి (139) పెక్కు స్తోత్రములచేత నంది బ్రాహ్మణులతో కలిసి శివుని స్తుతించి రెండు యామములు (జాములు) గడిపెను (140) అపుడు మహాకాలుని వలె నున్న మహాబలుడు, చేతితో దనుస్సుతో రౌద్రమూర్తియై వచ్చెను. (141) అతనిని చూచి నంది భయపడినవాడై విలపించెను. పురోహితుడు కూడా ఒక్కమారుగా భయమునొందెను, (142)

కిరాతేన కృతం తత్ర యథాపూర్వమవిస్థలమ్‌| తాం పూజాం ప్రపదాహత్య బిల్వపత్రం సమర్చయత్‌ || 143

స్నపనం తస్య కృత్వా చ తతో గండూషవారిణా | నైవేద్యం చైవ కిరాత: శివమర్పయత్‌|| 144

దణ్డవత్పతితో భూమావుత్థాయ స్వగృహం గత: తద్దృష్ట్యా మహదాశ్చర్యం చింతయామాస వై చిరమ్‌ || 145

పురోధసా సహ తదా నందీ వ్యాకులచేతసా| తేన చాకారితా విప్రా బహవో వేదవాదిన:||146

నివేద్య తేషు తత్సర్వం కిరాతేన చ యత్కృతమ్‌ | కిం కార్యమథ భో విప్రా: కథ్యతాం చ యథాతథమ్‌ || 147

సంప్రధార్య తతస్సర్వే మిళిత్వా ధర్మశాస్త్రత:| ఉచుస్సర్వే తదా విప్రా నందినం చాతిశంకినమ్‌ ||148

ఇంతుకుముందువలెనే కిరాతుడు అక్కడ పూజను పాడుచేస్తూ అంతా తీసివేసెను . బిల్వ పత్రమును సమర్పించెను. (143) శివునికి పుక్కిటి జలముచేత స్నానము గావించి కిరాతుడు నైవేద్యముగా పండునర్చించెను (144) దండ ప్రణామముచేసి లేచి తన ఇంటికి వెళ్ళెను. వ్యాకుల పడిన మనస్సుతో ఈ ఆశ్చర్యమునంతా చూచిన నంది పురోహితునితో కలిసి చాలా సేపు ఆలోచించెను (145) వేదవాదులైన బ్రాహ్మణుల పెక్కుమందిని నంది పిలిపించి(146) కిరాతుడు చేసిన దంతా నివేదించెను. 'ఓ విప్రులారా! ఇప్పుడేమి చేయవలెనో ఉన్నదున్నట్లుగా తెలుపుడు (147) మిక్కిలి శంకించుచున్నది నందిని అవిప్రులు ధర్మశాస్త్రము ప్రకారమాలోచించి అందరూ కలిసి ఇట్లు పలికిరి.

ఇదం విఘ్నం సముత్పన్నం దుర్నివార్యం సురైరపి | తస్మాదానయ లింగం త్వం స్వగృహం వైశ్యసత్తమ|| 149

తథేతి మత్త్వాసౌ నందీ శివస్యోత్పాటనం తదా! కృత్వా స్వగృహమానీయ ప్రతిష్ఠాప్య యథావిధి|| 150

సువర్ణపీఠికాం కృత్వా నవరత్న సుశోభితామ్‌ | ఉపచారైరనేకైశ్చ పూజయామాస వై తదా|| 151

దేవతలు కూడా తప్పింపలేని విఘ్నము కలిగినది కనుక ఓ వైశ్యశ్రేష్ఠా! శివలింగమును నీవు గృహమునకు కొని రమ్ము(149) అలాగే తలిచిన నంది శివుని (శివలింగమును) పెకిలించి తన ఇంట విధిపూర్వకముగా ప్రతిష్ఠింపజేసి(150) నవరత్నములతో అలరారు బంగారు పీఠము పై నిలిపి ఉపచారములచేత అపుడు పూజించెను.(151)

అథాపరేద్యురాయాతా: కిరాత: శివమందిరమ్‌ | యావద్విలోకయామాస లింగమైశం న దృష్టవాన్‌|| 152

మౌనం విహయ సహసా హ్యోక్రోశన్నిదమబ్రవీత్‌| హే శంభో క్వగతో సి త్వం దర్శయాత్మానమద్య వై || 153

న దృష్టో సి మయా త్వం హి త్యజామ్యద్యకళేవరమ్‌ | హే శంభో హే జగన్నాథ త్రిపురాంతకర ప్రభో|| 154

హే రుద్ర హే మహదేవ దర్శయాత్మానమాత్మనా |155

ఏవం సాక్షేపమధురైర్వాక్యై: క్షిప్తస్సదాశివ: | కిరాతేన తతో రంగైర్వీరోసౌ జఠరం స్వకమ్‌||156

బిభేదాశు తతో బాహునా స్ఫోట్యైవ రుషాబ్రవీత్‌ | హే శంభో దర్శయాత్మానం కుతో మాం త్యజ్య యాస్యసి|| 157

ఇతి క్షిత్వై తతోంతాణ్రి మాంసము త్కృత్త్య సర్వత:| తస్మిన్‌ గర్తే కరేణౖవ కిరాత: సహసాక్షిపత్‌|| 158

మరునాడు శివమందిరమునకు వచ్చిన కిరాతుడు లింగమునకై చూడగా అది లేకుండెను.(152) మౌనమును విడచి ఒక్కమారుగా నిట్లాక్రోశించెను. హేశంభూ!ఎక్కడికి వెళ్ళితివి? ఈ నాడే నిన్ను నీవు చూపింపుము(153)నాకు నీవు కానరాకున్నావు. నేడే నేను శరీరమును వదిలెదను హేశంభూ జగన్నాథ! త్రిపురాంతక ప్రభూ (154)ఓ రుద్రా మహాదేవా ! కనిపింపుము (155) ఇట్లు ఆక్షేపముతో కూడిననూ మధురములగు మాటలచే కిరాతుడు సదాశివుని ఆక్షేపించెను. అపుడు ఆ వీరుడు గోళ్ళతో తన ఉదరమును చీల్చెను.(156)చేతితో కొడుతూ రోషముతో నిట్లు పలికెను. హేశంభూ! కనిపింపుము! నన్నెందుకు వదలి వెళ్ళెదవు (157) అని పేగులను మాంసమును పెకిలించి తెంపి ఆ గోతిలో ఒక్కమారుగా పడవేసేను. (158)

స్వస్థం చ హృదయం కృత్వా సస్నౌ తత్సరసి ధృవమ్‌ | తథైవ జలమానీయ బిల్వపత్రం త్వరాన్విత:|| 159

పూజాయిత్వా యథాన్యాయం దణ్డవత్పతితో భువి||160

ధ్యానస్థితస్తతస్తత్ర కిరాత: శివసన్నిధౌ| ప్రాదుర్భూతస్తదా రుద్ర :ప్రమథై: పరివారిత:||161

కర్పూరగౌరో ద్యుతిమాన్‌ కపర్దీ చంద్రశేఖర: | తం గృహీత్వా కరే రుద్ర ఉవాచ పరిసాన్త్యయన్‌||162

మనసు కుదుట బరుచుకొని ఆ సరస్సు నందు స్నానమాడి అట్లే త్వరగా నీటిని ,బిల్వ పత్రమును తెచ్చి (159) విధి ప్రకారమర్పించి దండమువలె భూమి పై పడెను. (160) అపుడక్కడ కిరాతుడు శివుని సన్నిధిలో ధ్యానమునందుండ ప్రమథులతో గూడిన శివుడపుడు ఎదుట నిలిచెను (161) కర్పూరమువలె తెల్లని వాడు, కాంతిమంతుడు ,జటలను ధరించినవాడు ,చంద్రుని తలపై గలవాడునూ అగు రుద్రుడు కిరాతుని చేతిని పట్టుకొని ఊరడింపజేయుచూ పలికెను (162)

భో భో వీర! మహాప్రాజ్ఞ మద్భక్తోసి మహామతే | వరం వృణీష్వాత్మహితం యత్తేభిలషితం మహత్‌|| 163

ఏవముక్త: స రుద్రేణ మహాకాలో ముదాన్విత: | పపాత దండవద్భూమౌ భక్త్యా పరమయా యుత: 164

తతో రుద్రం బభాషే స వరం సంప్రార్థయామ్యహమ్‌ | అహం దాసోస్మి తే రుద్ర త్వం మే స్వామీ న సంశయ:|| 165

ఏతద్భుద్ద్వాత్మనో భక్తిం దేహి జన్మని త్వం మాతా చ పితా చ త్వం బంధుశ్చ సఖా హిమే || 166

త్వం గురుస్త్వం మహామంత్రో మంత్రవేద్యోసి సర్వదా| తస్మాత్త్వదపరం నాన్యత్త్రిషు లోకేషు కించన|| 167

ఓ వీరుడా! గొప్ప బుద్దిగలవాడా! నీవు నాభక్తుడవు నీవిచ్చగించిన వరమును ఆత్మహితమగుదానిని కోరుము (163)ఇట్లు రుద్రుడు పలుకగా మహాకాలుడుసంతోషముతో, పరమభక్తితో దండమువలె భూమి పై పడెను (164) తరువాత రుద్రునితో ననెను. వరమును కోరెదను. రుద్రా! నేను నీదాసుడను నీవు నాస్వామివి. ఇందుసంశయము లేదు (165) ఓ జ్ఞానీ! జన్మ జన్మలకు నీ పట్ల భక్తిని (వరముగా) నివ్వుము నీవు తల్లివి, తండ్రివి, బంధువు, మిత్రుడవు కూడా (166) నీవు గురువువు. గొప్ప మంత్రమూ నీవే. మంత్రముచే తెలియదగినవాడవు కనుక ఎప్పుడూ మూడులోకములలో నీవుదక్క వేరు లేదు (167) నిష్కామం వాక్యమాకర్ఱ్య కిరాతస్య తదా భవ: దదౌ పార్షదముఖ్యత్వం ద్వారపాలత్వమేవ చ || 169

తదా డమరునాదేన నాదితం భువనత్రయమ్‌| భేరిభాంకరశ##బ్ధేన శంఖానాం నినదేన చ|| 170

తదా దుందుభయో నేదు: పటహాశ్చ సహస్రశ :| నందీ తం నాదమాకర్ణ్య విస్మయాత్త్వరితో య¸°|| 170

తసోవనం యత్ర శివ: స్థిత: ప్రమథసంవృత: | కిరాతో హి తథా దృష్ఠోనందినా చ తదా భృశమ్‌|| 171

ఉవాచ ప్రశ్రితో వాక్యం స నందీ విస్మయాన్విత: | కిరాతం స్తోత్తుకామోసౌ పరమేణ సమాధినా|| 172

ఏ కోరికయూ లేని కిరాతుని ఆ వాక్యమును విని అపడు శివుడు తన పరిచరులలో ముఖ్యునిగా ద్వారపాలకునిగా చేసెను. (169)అపుడు డమరునాదముచేత భేరియొక్క శబ్దము చేత శంఖముల ధ్వని చేత మూడు లోకములు నినదించెను (170) అపుడు వేల కొలదిగా దుందుభులు , తప్పెటలు మ్రోగెను. ఆనాదమును విని నంది ఆశ్చర్యముతో త్వరగా (170) ప్రమథులతో గూడి శివుడుండిన తపోవనమున కొచ్చెను. అపుడు నందికి కిరాతుడగుపించెను (171) విస్మయముతోనంది పరమాసమాధి చేత కిరాతుని స్తుతింపగోరి వినయముగా నిట్లు పలికెను (172)

ఇహానీతస్త్వయా శంభుస్త్వం భక్తోసి పరంతప| త్వం భక్తోహమిహ ప్రాప్తో మాం నివేదయ శంకరే|| 173

తచ్చృత్వా వచనం తస్య కిరాతస్త్వరయాన్విత: నందినం చ కరే గృహ శంకరం సముపాగత:|| 174

ప్రహస్య భగవాస్రుద్ర: కిరాతం వాక్యము బ్రవీత్‌| కోయం త్వయా సమానీతో గణానామిహ సన్నిధౌ || 175

ఓ పరంతపా| నీవు భక్తుడు నీచే ఇక్కడకి తీసుకురాబడినాడు భక్తుడివగు నీవు నేను వచ్చితినని శివునికి నివేదింపుము (173) ఆ మాట విని కిరాతుడు త్వరగా నంది చేయి బట్టి శివుని చేరవచ్చెను. (174) భగవంతుడగు రుద్రుడు నవ్వి కిరాతునితో గణముల సన్నిధికి నీచే గొనిరాబడిన ఈతనెవరు? అనెను (175)

కిరాత ఉవాచ:

విజ్ఞప్తోసౌ కిరాతేన శంకరో లోకశంకర :| తవ భక్తస్సదా దేవ తవ పూజారతో హ్యసౌ|| 176

ప్రత్యహం రత్నమాణిక్యై పుషై#్పశ్చోచ్చా వచైరపి| జీవితేన ధనేనాz పి పూజితోసి న సంశయ:|| 177

తుస్మాజ్జానీహి మన్మిత్రం నందినం భక్తవత్సల || 178

కిరాతుడనెను :కిరాతునిచే లోకమునకు శుభము చేకూర్చు శివుడు ప్రార్థింపబడెను ఓ దేవా ! ఇతను నీ భక్తడు ఎల్లప్పుడూ నీ పూజయందు అనందించువాడు (176) నీవు నిస్సంశయముగా ప్రతిదినము రత్న మాణిక్యముల చేత, వివిధ పుష్పముల చేత జీవితముచే మరియు ధనముచే పూజింపబడితివి. (177) భక్తులపట్ల వాత్సల్యమును గలవాడా! నందిని నా మిత్రునిగా తెలుసుకొనుము (178)

మహాదేవ ఉవాచ:

న జానామి మహాభాగ నందినం వైశ్యచర్చితమ్‌ | త్వం మే భక్త: సఖా చేతి మహాకాల మహామతే|| 179

ఉపాధిరహితా యే చ యేపి చైవ మనస్విన : | తేzతీవ మే ప్రియా భక్తాస్తే విశిష్టా నరోత్తమా:|| 180

తవ భక్తో హ్యహం తాత స చ మే ప్రియకృత్తర: | తావుబౌ స్వీకృతౌ తేన పార్షదత్వేన శంభునా|| 181

తతో విమానాని బహుని తత్ర సమాగతాన్యేన మహాప్రభాణి | కీరాతవర్యేణ స వైశ్యవర్య ఉద్దారితస్తేన మహాప్రభేణ || 182

కైలాసం పర్వతం ప్రాప్తౌ విమానైర్వేగవత్తరై:| సారూప్యమేవ సంప్రాప్తావీశ్వరేణ మహాత్మనా || 183

నీరాజితౌ గిరిజయా శివేన సహితా తదా| ఉవాచేదం తదా దేవీ ప్రహస్య గజగామినీ || 184

మహదేవుడనెను: మహానుభావా! వైశ్య (శ్రేష్ఠుడైన) నందిని నేనెరుగను. మహాకాల! గొప్ప బుద్దిగల నీవే నా భక్తుడవు, మిత్రుడివి. (179) ఏ రకమైన ఉపాధీ లేనివారు అభిమానవంతులు మానవులలో ఉత్తములు విశిష్టులు నాకు మిక్కిలి ఇష్టమైనవారు.(180) తండ్రీ! నేను నీ భక్తుడిని అతను నాకు మిక్కలి ఇష్టమైనవాడు అనగా శివుడు వారినిద్దరినీ పరిచరులుగా స్వీకరించెను. (181) అపుడు గొప్ప ప్రకాశముగల విమానములు పెక్కు అక్కడికి వచ్చెను. గొప్పతేజస్వియగు కిరాతుని చేత వైశ్యశ్రేష్ఠుడు ఉద్దరింపబడెను (182) మిక్కుటమైన వేగముగల విమానములచేత (వారిద్దరూ) కైలాసపర్వతమును చేరిరి, ఈశ్వరునిచేత సారూప్యమును పొందిరి, (183) శివునితో కలిసి అపుడు వారుపార్వతి చేత నీరాజనములివ్వబడిరి అపుడు గజగామిని యగుపార్వతి నవ్వి ఇట్లనెను (184)

యథా త్వం హి మహాదేవ తథా చైతౌ న సంశయ| స్వరూపేణ చ గత్యాచ హాస్యభావై: సుపూజితౌ|| 185

మయా త్వమేక ఏవాసీ: సేవితో వై న సంశయ : దేవ్యాస్తద్వచనం శ్రుత్వా కిరాతో వైశ్య ఏవ చ|| 186

సద్య: సరాజ్మిఖో భూత్వా శంకరస్య చ పశ్యత: భవావస్త్యనుకంప్యౌ చ భవతా హి త్రిలోచన || 187

తవ ద్వారి స్థితౌ నిత్యం భవావస్తే నమో నమ: |188 తయోర్భావం స భగవాన్విదిత్వా ప్రహసన్భవ:| ఉవాచ పరయా భక్యా భవతోరస్తు వాంఛితమ్‌|| 189

తదా ప్రభృతి తావేతా ద్వారపాలౌ బభూవతు :| శివద్వారి స్థితౌ విప్రా మధ్యాహ్నే శివదర్శినౌ|| 190

మహాదేవ! నిస్సంశయముగా నీవెట్లో వీరిద్దరూ అట్లే స్వరూపము, గతి, హాస్య భావములచేత బాగా పూజింపబడిరి (185) నాచేత నీవొకడివే సేవింపబడితివి ఇందు సందేహము లేదు దేవి అట్లనగా విని కిరాతుడు, వైశ్యుడు (186) వెంటనే (వెనుదిరిగి)శంకరునికి పరాజ్మిఖులై (అనిరి) ఓ ముక్కంటీ ! నీచే మేము దయచేత చూడబడవలెను (187) నీ ద్వారమువద్ద నిత్యమూ నిలిచెదము (నీకు) నమస్కారము.(188)వారిద్దరి భావమును తెలుసుకొని, శివుడు నవ్వుచూ ఇట్లనెను పరమ భక్తి చేత మీరు కోరినది అగుగాక! (189) విప్రులారా అప్పటినుండి వారిద్దరు శివుని ద్వారము వద్ద నిలిచి ద్వారపాలురై మధ్యాహ్నమున శివుని గాంచుచూ నుండిరి(190)

ఏకో నందీ మహాకాలో ద్వావేతా శివవల్లబౌ | ఊచతుస్తౌ ముదాయుక్తావేక ఏవ సదాశివ: 191

ఏకాంగుళిం సముద్థృత్య మహాదేవో భ్యభాషత | తథా నందీ ఉవాచేదముద్దృత్య స్వాంగుళిద్వయమ్‌:|| 192

ఏవం సంజ్ఞాన్వితౌ ద్వారి తిష్ఠతస్తౌ మహాత్మన: శంకరస్య మహాభాగా: శృణ్యంతు ఋషయో హ్యమీ || 193

శైలాదేన పురా ప్రోక్తం శివధర్మమనన్తకమ్‌| ప్రాణినాం కృపయా విప్రా: సర్వేషాం దుష్కృతాత్మనామ్‌ || 194

మహాకాలుడు నంది వీరిద్దరు శివునికిష్టులు , వారిద్దరు సంతోషముగా ననిరి సదాశివుడొకడే (అని) (191) మహాదేవుడు చేతివ్రేలినొకదానిని ఎత్తి పలికెను తన చేతివ్రేళ్లను రెంటినెత్తి నంది అట్లే అనెను (192) ఇట్లు గుర్తుకలిగిన వారిద్దరూ గొప్పడాడైన (శివుని) ద్వారము వద్ద నిలుచుండిరి ఓ ఋషులారా !దుష్కర్మలజేయు ప్రాణులయందు కృపచేత శాలాదుడైన నందిచేత చెప్పబడిన అనంతమైన శివధర్మమును వినుడు?(193,194)

యే పాపినోప్యధరి%్‌మష్టా అంధా మూకాశ్చ పంగవ: కులహీనా దురాత్మాన: శ్వపచా అపి మానవా: 195

యాదృశాస్తాదృశాశ్చాన్యే శివభక్తిపురస్కృతా : తేపి గచ్చని సాన్నిధ్యం దేవదేవస్య శూలిన:|| 196

లింగం సికతామయం యే పూజయన్తి విపశ్చిత:| తే రుద్రలోకం గచ్చని నాత్ర కార్యా విచారణా|| 197

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

కేదారఖండే శివశాస్త్రే శివభక్తిమాహాత్మ్యవర్ణనం నామ పంచమోధ్యాయ:

పాపము చేయువారు, అధర్మము నాచరించు వారు, గుడ్డివారు, మూగవారు, కుంటివారు, కులములేనివారు, చెడుభావనగలవారు,చండాలురైన మానవులు కూడా (195) మిగతా వారెలాంటి శివభక్తిని గలిగినచో దేవదేవుడైన శివుని సాన్నిధ్యమును పొందెదరు (196) బుద్దిమంతులెవరు ఇసుకతో గూడిన శివలింగమును పూజింతురో వారు రుద్రలోకమును చేరుదురు. ఇందు విచారించవలిసినదిలేదు. (ఇది నిశ్చయమని భావము)

శ్రీ స్కాందమహాపురాణమందలి మాహేశ్వరఖండమునందలి

కేదారఖండములోని శివశాస్త్రమున శివభక్తి మహాత్మ్యవర్ణనము అను అయిదవ అధ్యాయము సమాప్తము

షష్ఠ్యోధ్యాయ:

ఋషయ ఊచు:

లింగే ప్రతిష్ఠా చ కథం శివం హిత్వా ప్రవర్తితా| తత్కథ్యతాం మహాభాగ పరం శుశ్రూషతాం హి న:|| 1

లోహశ ఉవాచ:

యదా దారువనే శంభుర్భిక్షార్థం ప్రాచరత్ర్పభు:|2

దిగంబరో ముక్తజటాకలాపో వేదాంతవేద్యో భువనైకభర్తా| స ఈశ్వరో బ్రహ్మకపాలధారో యోగీశ్వరాణాం పరమ: పరశ్చ: 3

అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌ | మహానుభావో భువనాధిపో మహాన్‌ స

ఈశ్వరో భిక్షురూపీ మహీత్మా | బిక్షాటనం దారువనే చకార|| 4

మధ్యాహ్న ఋషుయో విప్రాస్తీరం జగ్ము: స్వకాశ్రమాత్‌| తదానీమేవ సర్వాస్తా ఋషిభార్యాస్సమాగతా:|| 5

అరవ అధ్యాయము

ఋషులు పలికిరి :శివుని వదలి శివలింగమునందు ప్రతిష్ఠయెట్లు? ఓ మహానుభావా! వినగోరుమాకు అదెట్లు ప్రవర్తించెనో తెలియజేయుము (1) లోమశుడు చెప్పెను: ఎప్పుడైతే ప్రభువైన శివుడు దారువనమున భిక్షకొఱకు చరించెనో (అపుడీ సంఘటన జరిగెను) (2)దిగంబరుడు, విడివడిన జటలు గలవాడు వేదాంతము చేత తెలియదగినవాడు, భువనములకు ఒకే ప్రభువు అగు ఈశ్వరుడు బ్రహ్మ కపాలమును ధరించువాడు, యోగీశ్వరులలో శ్రేష్ఠుడు,పరమైనవాడు (3) అణువు కంటే అణువైనవాడు, మహత్తుకంటెనూ గొప్పనైనవాడు, భువనములకు ప్రభువగు మహానుభావుడు భిక్షుకుని రూపములో దారువనములో భిక్షాటనముచేసెను.(4)మధ్యాహ్నమున ఋషులు తమ అశ్రమమునుండి తీర్థమునకు వెళ్ళిరి, అపుడే ఋషిభార్యలంతా ఏతెంచిరి.(5)

విలోకయంత్య: శంభుం తమాచఖ్యుశ్చ పరస్సరమ్‌ |కోసౌ భిక్షుకరూపోయమాగతో పూర్వదర్శన :||6

అసై#్మ భిక్షాం ప్రయచ్చామో వయం చ సఖిభిస్సహ | తథేతి గత్వా సర్వాస్తా గృహేభ్య ఆనయన్ముదా|| 7

బిక్షాన్నం వివిధం శ్లక్షణం సోపచారం చ శక్తిత: | ప్రదత్తం భిక్షితం తేన దేవదేవేన శూలినా|| 8

కాచిత్ప్రియతమం శంభుం బభాషే విస్మయాన్వితా |కోసి త్వం భిక్షుకో భూత్వాగతోత్ర మహామతే|| 9

ఋషీణామాశ్రమం శుద్దం నో నిషీదసి| తయోక్తోపి తదా శంభుర్భభాషే ప్రహసన్నివ|| 10

అ శివుని చూచుచూ వారు ఒకరితో ఒకరిట్లు అనిరి అపూర్వమైన దర్శనము గల భిక్షుకుని రూపులో వచ్చిన ఇతనెవరు?(6) సుఖలతో గూడి ఈతనికి భిక్షను ఇచ్చెదము అని ఆ ప్రకారము వారంతా తమ గృహములనుండి సంతోషముగా భిక్షను తీసుకొని వచ్చిరి. (7) దేవదేవుడైన శివుడుకోరినట్లు మృదువైన వివిధ భిక్షాన్నమును ఉపచారముతో గూడి యథాశక్తి తెచ్చి ఇచ్చిరి(8) ఒకానొక స్త్రీ విస్మయమునొంది ఇష్టుడైన శివునిట్లు అడిగినది. ఓ భిక్షుకా ! భిక్షుకుడవై ఇటు విచ్చేసిన నీవెవరు?(9) ఋషుల ఆశ్రమమిది శుద్దమైనది, నీవెందుకు కూర్చోవడం లేదు? ఆ స్త్రీ అట్లు అడగగా నవ్వి శివుడిట్లు పలికెను.(10)

ఈశ్వరోహం సుకేశాంతే పావనం ప్రాప్తవానిమమ్‌ | ఈశ్వరస్య వచ: శ్రుత్వా ఋషిభార్యా ఉవాచ తమ్‌|| 11

ఈశ్వరోసి మహాభాగ కైలాసపతిరేవ చ | ఏకాకిన : కథం దేవ భిక్షార్థమటనం తవ|| 12

ఏవముక్తస్తయా శంభు: పునస్తామబ్రవీద్వచ :| దాక్షాచణ్యా విరహితో విచరామి దిగంబర:|| 13

భిక్షాటనార్థం సుశ్రోణి సంకల్పరహితస్సదా| తయా సత్యా వినా కించిత్‌ స్త్రీమాత్రం మమ భామిని|న రోచతే విశాలాక్షి సత్యం ప్రతివదామి తే || 14

తస్యోక్తం వచనం శ్రుత్వా ఉవాచ కమలేక్షణా | స్త్రీయో హి సుఖసంస్పర్శా: పురుషస్య న సంశయ:||15

తాస్త్రియో వర్జితా: శంభో త్వాదృశేన విపశ్చితా|| 16

చక్కని కేశాంతము గలదానా! నేనీశ్వరుడను, ఈ పావనస్థలమున కేతెంచితిని ఈశ్వరుని మాట విని ఋషి భార్య ఇట్లు పలికినది. (11) ఓ మహానుభావా! నీకు ఈశ్వరుడవు.కైలాసపతివే, ఏకాకివై(ఒక్కడివై) భిక్షకొఱకు నీవెట్లు తిరుగుచుంటివి?(12) ఇట్లు ఆ స్త్రీ అనిన శివుడు తిరిగి ఇట్లు పలికెను. దాక్షాయణి' లేనందున నేను దిగంబరుడనై ఇట్లు తిరుగుచుంటిని (13) సంకల్పములేకుండా భిక్షకై (తిరుగుచుంటిని) ఆ సతి తప్ప ఏ స్త్రీ మాత్రమైనా నాకు ఇష్టముకాదు, ఓ భామినీ! నీకుసత్యమును చెప్పుచుంటిని (14) కమలములవంటి కన్నులు గల ఆ స్త్రీ శివుని మాటలు విని పలికినది నిస్పందేహముగా పురుషుడికి స్త్రీలు సుఖమగు స్పర్శగలవారు (15) అట్టి స్త్రీలు నీవంటి బుద్దిమంతునిచే వదలి వేయబడిరి.(16)

ఇతి చ ప్రమదా: సర్వా మిళితా యత్ర శంకర:|| భిక్షాపాత్రం చ తచ్ఛంభో : పూరితం చ మహాగుణౖ:|| 17

అన్నైశ్చతుర్విదై: షడ్భీ రసైశ్చ పరిపూరితమ్‌| యదా శంభుర్గంతుకామ: కైలాసం పర్వతం ప్రతి||

తదా సర్వా విప్రపత్న్యో హ్యన్వగచ్చన్ముదాన్వితా:|| 18

గృహకార్యం పరిత్యజ్య చేరుస్తద్గతమానసా: గతాసు సర్వాసు పత్నీషు ఋషీసత్తమా:|| 19

యాపదాశ్రమమభ్యేత్య తావచ్చూన్యం వ్యలోకయన్‌ |పరస్పరమథోచూస్తే పత్న్య: సర్వా : కుతో గతా:|| 20

న విదామోథ వై సర్వా కేన నష్టేన చాహృతా: | ఏవం విమృశ్యమానాస్త స్తతస్తత:||21

సమపశ్యంస్తతస్సర్వే శివస్యానుగతాశ్చ తా: శివం దృష్ట్యా తు సంప్రాప్తా ఋషయస్తే రుషాన్వితా:|| 22

అని ఆ స్త్రీలంతా కలిసి శివుడున్న స్థలానికి (వచ్చిరి) శివుని భిక్షాపాత్ర కూడా గొప్ప గుణాలుగల నాలుగు రకాల అన్నాలతో, ఆరురసాలతో నిండినది. ఎప్పుడైతే శివుడు కైలాసపర్వతానికి వెళ్ళగోరెనో అపుడు విప్ర స్త్రీలంతా ఆనందము నొందుచూ అతనిని అనుసరించిరి (18) ఇంటిపని విడిచి శివునియందే మనసునిలిపి చరించిరి. భార్యలందరూ అలా వెళ్ళగా ఋషిశ్రేష్ఠులు(19) ఎప్పుడైతే ఇంటికి అపుడు శూన్యమునుచూచిరి భార్యలంతా ఎక్కడకు వెళ్ళారని వారొకరితో నొకరనుకున్నారు.(20)

ఏ ఆధమునిచే అపహరింపబడినారో మనకు తెలియదు అని అలోచించుచూ అక్కడక్కడ వెతుకుచూ (21) శివుని అనుసరించుచున్న వారిని విప్రులంతా చూచిరి. శివుని చూచి కోపించిన అతనిని చేరిరి. (22)

శివస్యాథాగ్రతో భూత్వా ఊచు: సర్వే త్వరాన్వితా: కిం కృతం హి త్వయా శంభో విరక్తేన మహాత్మనా || పరదారాపహర్తాసి త్వమృషీణాం న సంశయ:|| 23

ఏవం క్షిప్త: శివో మౌనీ గచ్ఛమానోపి పర్వతమ్‌ |తదా స ఋషిభి: ప్రాప్తో మహాదేవొ వ్యయస్తథా || యస్మాత్కళత్రహర్తా త్వం తస్మాత్‌ షంఢో భవ త్వరమ్‌ || 24

త్వరగా వారంతా శివుని ఎదుట నిలిచి ఇట్లనిరి. మహాత్ముడవు. విరక్తుడవు అయిన నీ వేమి చేసితివి? '(23) నిస్సందేహముగా నీవు పరులైన ఋషుల భార్యలనపహరించుచున్నావు(23)అని అధిక్షేపింపబడిననూ శివుడు మౌనియై పర్వతము వైపు వెళ్ళుచుండగా ఋషులు మహాదేవుడు, వ్యయములేనివాడగు శివుని భార్యలను దొంగిలించినందువలన నీవు వెంటనే నపుంసకుడవు గమ్ము (24)

ఏవం శప్త: స మునిభిర్లింగం తస్యాపతద్భువి| భూమిప్రాప్తం చ తల్లింగం వవృథే తరసా మహత్‌|| 25

ఆవృత్య సప్తపాతాళాన్‌ క్షణాల్లింగమథొర్థృత:| వ్యాప్య పృధ్వీం సమగ్రాం చ అంతరిక్షం చ సమావృణోత్‌|| 26

స్వర్గాస్సమావృతాస్సర్వే స్వర్గాతీతమథాభవత్‌ | న మహీ న చదిక్‌ చక్రం న తోయం న చ పావక:|| 27

న చ వాయుర్న వాకాశం నాహంకారో న వా మహత్‌ | న చావ్యక్తం న కాలశ్చ న మహాప్రకృతిస్తథా|| 28

నాసీద్వైతవిభాగం చ సర్వం లీనం చ తత్కణాత్‌ | యస్మాల్లీనం జగత్సర్వం తస్మింల్లింగే మహాత్మన:|| 29

లయనాల్లింగమిత్యేవం ప్రవదన్తి మనీషిణి :| తథా భూతం వర్థమానం దృష్ట్యా తేపి సురర్షయ: || 30

ఇట్లు శివుడు మునులచే శపింపబడెను అతని లింగము భూమి పై పడి, చేరగానే అతి వేగముతో అది వర్థిల్లెను ('25) అది ఏడు పాతాళాలను క్షణములోనే ఊర్థ్వలోకములను,పూర్తి భూమిని అంతరిక్షమునూ కమ్మెను. (26) స్వర్గములన్నీ దానిచే కప్పబడెను. అది స్వర్గమును దాటినదీ ఈయెను. భూమిలేదు దిక్కులచక్రములేదు. నీరులేదు. అగ్నిలేదు. (27) వాయువు, ఆకాశం, అహంకారము, బుద్ది, అవ్యక్తము, కాలము మహాప్రకృతి ఇవేవీ లేవు (28) రెండవది అన్న విభాగమే లేదు ఆక్షణములోనే అంతా లీనమైపోయినది, ఆ గొప్ప లింగమున జగత్తు పూర్తిగా లయించుటచేత (29) బుద్దిమతులు దానిని లింగము అందురు ఆవిధంగా పెరుగుతున్న లింగమునుచూచి దేవర్షులు ఇట్లనిరి. (30)

బ్రహ్మేంద్రవిష్ణువాయ్వగ్నిలోకపాలా: సపన్నగా | విస్మయావిష్టమనస: పరస్పరమథాబ్రువన్‌|| 31

కిమాయాం చ విస్తారం క్వ చాంత: క్వ చ పీఠికా | ఇతి చింతాన్వితా విష్ణుమూచు సర్వే సురాస్తదా|| 32

బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు, వాయువు, అగ్ని, లోకపాలురు, నాగదేవతలు ఆశ్చర్యముగా ఒకరితో నొకరిట్లనిరి. (31)

కిమాయాం చ విస్తారం క్వ చాంత: క్వ చ పీఠికా | ఇతి చింతాన్వితా విష్ణుమూచు: సర్వే సురాస్తదా|| 32

బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు, వాయువు, అగ్ని, లోకపాలురు, నాగదేవతలు ఆశ్చర్యముగా ఒకరితో నొకరిట్లనిరి (31) దీని పొడుగు, విస్తారమేమి? దీని అంతమెక్కడ? పీఠిక ఎక్కడ? అని చింతతో గూడి దేవతలంతా విష్ణువుతో ననిరి (32)

దేవా ఊచు:

అస్య మూలం త్వయా విష్ణో పద్మోద్భవ చ మస్తకమ్‌| యువాభ్యాం చ విలోక్యం స్యాత్‌ స్థానే స్యాత్పరిపాలకౌ || 33

శ్రుత్వా తు తౌ మహాభాగౌ వైకుణ్ఠకమలోద్భవౌ | విష్ణుర్గతో హి పాతాళం బ్రహ్మా స్వర్గం జగామ హ|| 34

దేవతలనిరి ఓ విష్ణూ ! నీవు దీని మూలమును, బ్రహ్మ దీని శిరస్సును చూడవలెను.మీరపుడే గదా లోకపాలకులు.

(33)అది విని ఆ మహానుభావులిద్దరూ విష్ణువు పాతాళమునకు, బ్రహ్మ స్వర్గమునకు వెళ్ళిరి. (34)

స్వర్గం గతస్తదా బ్రహ్మా అవలోకనతత్పర: నాపశ్యత్త్రత లింగస్య మస్తకం చ విచక్షణ:|| 35

తథా గతేన మార్గేణ ప్రత్యావృత్వాబ్జసంభవ: మేరుపృష్ఠమను ప్రాప్త: సురభ్యా లక్షితస్తత:||36

స్థితా యా కేతకీచ్ఛయామువాచ మధురం వచ:| తస్యా వచనమాకర్ణ్య సర్వలోకపితామహ:|| ఉవాచ ప్రహసన్వాక్యం ఛలోక్త్యా సురభిం ప్రతి|| 37

లింగం మహాద్భుతం దృష్టం యేన వ్యాప్తం జగత్రయమ్‌ | దర్శనార్థం చ తస్యాం తం దేవై: సంప్రేషితోస్మ్యహమ్‌|| 38

న దృష్టం మస్తకం తస్య వ్యాపకస్య మహాత్మన: కిం వక్ష్యేహం చ దేవాగ్రే చింతా మే చాతివర్తతే|| 39

లింగస్య మస్తకం దృష్టం దేవానాం చ మృషా వదే:| తే సర్వే యది వక్ష్యంతి ఇంద్రాద్యా దేవతాగణా:|| 40

తే సంతి సాక్షిణో దేవా అస్మిన్నర్థే వద త్వరమ్‌| అర్థేస్మిన్భవ సాక్షీ త్వం కేతక్యా సహ సువ్రతే ||41

చూడవలెనని స్వర్గమునకు వెళ్ళిన జ్ఞాని బ్రహ్మ శివలింగము యొక్క మస్తకమును చూడకపోయెను. వెళ్ళిన మార్గముననే వెనుదిరిగిన బ్రహ్మ మేరు పర్వతమును చేరి సురభి చేత చూడబడెను.(36) కేతకీ వృక్షాఛాయ యందునిలిచి సురభి మధురముగా నడిగెను. అదివిని సర్వలోకములకు పితామహుడగు బ్రహ్మ నవ్వుచూ ఛలోక్తి సురభితో నిట్లనెను. (37) మూడులోకములను వ్యాపించిన గొప్ప అద్బుతమైన లింగము కనబడినది దాని అంతమును చూచుటకు దేవతలు నన్ను పంపిరి, (38)గొప్పదై అంతటా వ్యాపించిన దాని యొక్క శిరస్సు కనబడలేదు. దేవతలముందేమి చెప్పదనని మిక్కుటముగా చింతనాకున్నది (39)లింగము యొక్కశిరస్సు కనబడినదని దేవతలకు ఆసత్యము చెప్పుము. ఇంద్రాది దేవతాగణములు అందరూ పలికెదరు (40) (పలికినచో) వారు ఈ విషయమున సాక్షులయ్యెదరు ఓ సువ్రతా! నీవు కేతకితో సహా ఈ అర్థములో సాక్షివి గమ్ము త్వరగా చెప్పుము. (41)తద్వచ: శిరసా గృహ్య బ్రహ్మణ :పరమేష్ఠిన: | కేతకీసహితా తత్ర సురభీ తదమానయత్‌|| 42

ఏవం సమాగతో బ్రహ్మా దేవాగ్రే సమువాచ హ|| 43

కేతకితో కలిసి సురభి పరమేష్ఠియైన బ్రహ్మవాక్కును గౌరవిస్తూ శిరసావహించెను (42) ఇట్లు వచ్చిన బ్రహ్మ దేవతల ఎదుట నిట్లు పలికెను(43)

బ్రహ్మోవాచ:

లింగస్య మస్తకం దేవా దృష్టవానహమధ్బుతమ్‌| సమీచీనం చర్చితం చ కేతకీదళసంయుతమ్‌|| 44

విశాలం విమలం శ్లక్షం ప్రసన్నతరమద్భుతమ్‌| రమ్యం చ రమణీయం చ దర్శనీయం మహాప్రభమ్‌|| 45

ఏతాదృశం మయా దృష్టం న దృష్టం తద్వినా క్వచిత్‌| బ్రహ్మణో హివచ : శ్రుత్వా సురా విస్మయమాయయు:|| 46

ఏవం విస్మయపూర్ణాస్తే ఇంద్రాద్యా దేవతాగణా| తిప్ఠన్తి తావత్సర్వేశో విష్ణురధ్యాత్మదీపక:|| 47

పాతాళాదాగత: సద్య: సర్వేషామవదత్త్వరమ్‌| తస్యాప్యంతో న దృష్టో మే హ్యవలోకనతత్పర:|| 48

విస్మయో మే మహాన్‌ జాత: పాతాళాత్‌ పరతశ్చరన్‌ | అతలం చాపి నితలం చ రసాతలం|| 49

తథా గతస్తలం చైవ పాతాళం చ తథా తలమ్‌| తలాతలాని తాన్యేవం శూన్యవద్ది విభావ్యతే|| 50

బ్రహ్మ పలికెను. దేవతాలారా! నేను అద్బుతమైన శివలింగము యొక్క శిరస్సును చూచితిని కేతకీ దళముతో బాగుగా అర్చింతిని. కూడా (44) (ఆ లింగము) విశాలమైనది స్వచ్చమైనది, సన్ననై, అతి ప్రసన్నమైనది, గొప్పకాంతితో అతి సుందరమగా నుండినది. (45)ఈ విధమైన లింగమును చూచితిని అది తప్ప వేరేదియూ కనబడలేదు, బ్రహ్మయొక్క పలుకులు విని దేవతలు విస్మయమునొందిరి(46) ఇట్లు ఇంద్రుడు మొదలైన దేవతలంతా ఆశ్చర్యముతో వుండ గా, ఆధ్యాత్మమును ప్రకాశింపజేయు విష్ణువు సర్వేశుడు పాతాళామునుండి వచ్చెను. (47) వెంటనే అందరినీ ఉద్దేశించి త్వరగా పలికెను. (లింగము) దాని యొక్క అంతమును చూడదలచి తత్పరుడనై (వెళ్ళన) నేను అంతమును చూడలేకపోతిని (48) పాతాళమును దాటి చరించుచున్న నాకు గొప్ప ఆశ్చర్యము కలిగినది అతలము, సుతలము, నితలము, రసాతలము, (49) అలాగే తలము , పాతాళము, అతలమునకు వెళ్ళితిని. తలాతలములు శూన్యము వలె వుండెను. (50)

శూన్యాదపి చ శూన్యం చ తత్సర్వం సునిరీక్షితమ్‌| న మూలం చ న మధ్యం చ న చాంతో హ్యస్య విద్యతే || 51

లింగరూపీ మహాదేవో యేనేదం ధార్యతే జగత్‌ | యస్య ప్రసాదాదుత్పన్నా యూయం చ ఋషయస్తథా|| 52

శ్రుత్వా సురాశ్చ ఋషయస్తస్య వాక్యమపూజయన్‌ | తదా విష్ణురువాచేదం బ్రహ్మాణం ప్రహసన్నివ || 53

దృష్టం హి చేత్త్వయా బ్రహ్మన్మస్తకం పరమార్థత: | సాక్షిణ: కే త్వయా అస్మిన్నర్థే ప్రవల్పితా:|| 54

ఆకర్ణ్య వచనం విష్ణోర్బ్రహ్మా లోకపితామహ: ఉవాచ త్వరితేనైవ కేతకీ సురభీతి చ|| 55

శూన్యము కలంటెనూ శూన్యమైనదంతా బాగుగా చూడబడెను, కాని లింగముయొక్క మూలము గాని, మధ్యమము గాని,అంతముగానీ లేదు(51) ఎవరిచే ఈ జగత్తంతా ధిరింపబడుచున్నదో ఎవరి ప్రసాదమువలన మీరు ఋషులంతా జన్మించారో ఆ మహాదేవుడు లింగమే రూపముగా గలవాడు. (52)అది విని దేవతలు, ఋషులు, అతని వాక్యమును మన్నించిరి. అపుడు విష్ణువు బ్రహ్మ ను పరిహసించునట్లు నవ్వి ఇట్లనెను. (53) ఓ బ్రాహ్మా ! నీవు నిజముగా (లింగము యొక్క) శిరస్సును చూచినట్లయితే ఈ విషయములో సాక్షులెవ్వరు? (54) విష్ణువు యొక్క ఆ మాటను విని లోకపితామహుడైన బ్రహ్మ వెంటనే కేతకి సురభి' అని త్వరగా పలికెను. (55)

తే దేవా మమ సాక్షిత్వే జానీహి పరమార్థత:| బ్రహ్మణో హి వచ: శ్రుత్వా సర్వే దేవాస్త్వరాన్వితా:|| (56)

ఆహ్వానం చక్రిరే తస్యా: సురభ్యాశ్చ తయా సహ| ఆగతే తత్ష్కణాద్దేవకార్యార్థం బ్రహ్మణస్తదా|| 57

ఇంద్రాద్యైశ్చ తదా దేవైరుక్తా చ సురభీ తత: ఉవాచ కేతకీ సార్థం దృష్ట్యో వై బ్రహ్మణా సురా:|| 58

లింగస్య మస్తకో దేవా: కేతకీదళపూజిత:| తదా నభోగతా వాణి సర్వేషాం శృణ్వతామభూత్‌|| 59

సురభ్యా చైవ యత్ప్రోక్తం కేతక్యా చ తథా సురా:| తన్మృషోక్తం చ జానీధ్వం న దృష్టో హ్యస్య మస్తక:|| 60

ఆ దేవతలు (కూడా) నా సాక్షులు అని నిజముగా తెలుసుకొనుము బ్రహ్మ మాటలను విని దేవతలంతా త్వరగా (50) కేతకిని ,సురభితో సహ అహ్వానించిరి అపుడు బ్రహ్మ యొక్క పనిపై సురభి, తత్ష్కణమే వచ్చిరి(51) అపుడు , ఇంద్రాది దేవతలడుగగా సురభీ కేతకితో కలిసి ఇట్లనెను. ఓ దేవతలారా! బ్రహ్మ కేతకీ దళము చేత పూజింపబడిన శివలింగము యొక్క శిరస్సును చూచెను. అపుడు అకాశమునుండి వాణి అందరూ వినుచుండగా ఉద్భవించెను. (58,59) దేవతలారా! ఈ సురభి, కేతకిలు చెప్పినది అబద్దమని తెలుసుకొనుడు లింగముయొక్క శిరస్సు చూడబడలేదు(60)

తదా సర్వేథ విబుధా: సేంద్రా వై విష్ణునా సహ| శేపుశ్చ సురభీం రోషాన్మృషావాదనతత్పరామ్‌|| 61

ముఖేనోక్తం త్వయాద్యైవమనృతం చ తథా శుభే| అపవిత్రం ముఖం తేస్తు సర్వధర్మబహిష్కృతం|| 62

సుగంధకేతకీ చాపి అయెగ్యా త్వం శివార్చనే | భవిష్యసి న సందేహో అనృతా చైవ భామిని|| 63

తదా నభోగతో వాణీ బ్రహ్మాణం చ శశాప వై| మృషోక్తం చ త్వయా మంద కిమర్థం బాలిశేన హి || 64

భృగుణా ఋషిభిస్సాకం తథైవ చ పురోధసా| తస్మాద్యూయం న పూజ్యాశ్చ భ##వేయు: క్లేశబాగిన: || 65

ఋషయోపి చ ధర్మిష్ఠాస్తత్వవాక్యబహిష్కృతా :| వివాదనిరతా :మూఢా అతత్త్వజ్ఞా : సమత్సరా:|| 66

యాచకాశ్చావదాన్యాశ్చ నిత్యం స్వజ్ఞానఘాతకా: | ఆత్మసంభావితా: స్తబ్థా:పరస్పరవినిందకా:|| 67

ఏవం శప్తాశ్చ మునయో బ్రహ్మాద్యా దేవతాస్తథా | శివేన శప్తాస్తే సర్వే లింగం శరణమాయయు:|| 68

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే

శ్రీశివలింగమాహాత్మ్యే బ్రహ్మాదిశాపవృత్తాన్తవర్ణనం

నామ షష్ఠోధ్యాయ:

ఆసత్యమునుపలికిన సురభిని అపుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలందరు కోపముతో శపించిరి(61) శుభమగుదానా! ఈనాడు నీవు ముఖము చేత అసత్యమును పలికితివి (కనుక) అన్ని ధర్మములనుండి బహిష్కృతమై నీ ముఖము అపవిత్రమగుకాక! (62) అసత్యమును పలికినందుచే నిస్సందేహముగా శివార్చనయందు అయోగ్యమవగలవు(63) అపుడు ఆకాశవాణి బ్రహ్మను శపించెను మూడుడవై నీవు అసత్యము నేల పలికితివి? (64) భృగువు, ఋషులు బ్రహ్మతో కలిసి(పలికినందున) క్లేశమును వహిస్తూ మీరంతా పూజను కోల్పోయెదరు (65) ధర్మనిరతులగు ఋషులు కూడా తత్త్వవాక్యము నుండి బహిష్కృతులైరి, వివాదమున ఆసక్తిని గలిగి, మూర్ఖులు, తత్త్వమును తెలియనివారు మాత్సర్యము గలవారు (66) యాచకులు, ఆ కీర్తిగలవారు, తమ జ్ఞానమును నశింపజేయువారు తమను తాము గౌరవించుకొనువారు. స్తబ్థులుపరస్పరమునిందించుకొనువారు కాగలరని శివునిచేత శపింపబడిన బ్రహ్మాది దేవతలు ,మునులు లింగమును శరణుజొచ్చిరి.

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమునందలి కేదార ఖండమున శివలింగమాహాత్మ్యమున

బ్రహ్మాదుల శాపవృతాత్తన్తవర్ణనమని ఆరవ అధ్యాయము

సప్తమోధ్యాయ:

లోమశ ఉవాచ:

తదా చ తే సురా: సర్వే ఋషుయోపి భయాన్వితా: ఈడిరే లింగమైశం చ బ్రహ్మా ద్యా జ్ఞానవిహ్వలా:||1

బ్రహ్మవాచ:

త్వం లింగరూపీ తు మహాప్రభావో వేదాంతవేద్యోసి మహాత్మరూపీ| యేనైవ సర్వే జగదాత్మమూలం కృతం సదానందరూపేణ నిత్యమ్‌ ||2

త్వం సాక్షీ సర్వలోకానాం హర్తా త్వం చ విచక్షణ:| రక్షణోసి మహాదేవ భైరవోసి జగత్పతే ||3

త్వయా లింగస్వరూపేణ వ్యాప్తమేతజ్జగత్త్రయమ్‌ | క్షుద్రాశ్చైవ వయం నాథ మాయామోహితచేతస:||4

అహం సురాసురా : సర్వే యక్షగంధర్వరాక్షసా: | పన్నగాశ్చ పిశాచాశ్చ తథా విద్యాధరా హ్యమీ|| 5

త్వం హి విశ్వసృజాం స్రష్టా త్వం హి దేవో జగత్పతి:| కర్తా త్వం భువనస్యాస్య త్వం హర్తా పురుష: పర: ||6

త్రాహ్యస్మాకం మహాదేవ దేవదేవ నమోస్తు తే| ఏవం స్తుతో హివై ధాత్రా లింగరూపీ మహేశ్వర:|| 7

ఋషయ: స్తోతుకామాస్తే మహేశ్వరమకల్మషమ్‌ | అస్తువన్‌ గీర్భిరగ్య్రాభి: శ్రుతిగీతాభిరాదృతా:|| 8

ఏడవ అధ్యాయము

లోమశుడనెను: అపుడా దేవతలు, ఋషులంతా భయముతో జ్ఞానవిహ్వలురై బ్రహ్మమొదలగువారు కూడా ఈశ్వరుని లింగమును స్తుతించిరి.(1) బ్రహ్మపలికెను గొప్ప కాంతిగల నీవులింగరూపముగలవాడవు వేదాంతముచేత తెలియదగినవాడవు. సదా ఆనందరూపుడైన (సత్‌, ఆనందరూపుడైన) నీ చేతనే ఈ జగత్తు ఆత్మమూలముగా నిత్యము చేయబడినది. (2) నీవే అన్ని లోకములకు సాక్షివి. మేధావియైన నీవే హరించువాడవు మహదేవా, జగత్పతీ నీవే రక్షకుడవు, బైరవుడవు (3) లింగస్వరూపియైన నీచేత ఈ మూడులోకములు వ్యాపించినవి మేము అల్పులము, మాయచే మోహించుబుద్దిగలవారము.(4) నేను, సురులు, అసురులు, యక్ష, గంధర్వ, రాక్షసులు, సర్పములు, పిశాచాలు, విద్యాధరులందరూ (ఇట్టివారమే) (5) నీవు విశ్వమును సృజించువారినే సృజించెదవు నీవే హరించు పరమపురుషుడవు(6) ఓ మహాదేవా దేవ దేవా! మమ్ముల రక్షింపుము దేవా నీకు నమస్కారము,ఇట్లు బ్రహ్మచేత లింగరూపియగు శివుడు స్తుతింపబడెను (7) ఋషులుకూడా స్తుతింపగోరి స్వచ్చుడైన మహేశ్వరుని శ్రుతి గీతలచేత, గొప్పవాక్కుచేత స్తుతించిరి,(8)

ఋషయ ఊచు:

అజ్ఞానినో వయం కామాన్న విందామోస్య సంస్థితిమ్‌ | త్వం హ్యాత్మా పరమాత్మా చ ప్రకృతిస్త్వం విభావినీ || 9

త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ| త్వమీశ్వరో వేదవిదేకరూపో మహానుభావై: పరిచింత్యమాన:|| 10

త్వమాత్మా సర్వభూతానామేకోజ్యోతిరివైధసామ్‌| సర్వం భవతి యస్మాత్వత్తస్తస్మాత్సర్వోసి నిత్యదా|| 11

యస్మాచ్చ సంభవత్యేతత్తస్మాచ్ఛంభురితి ప్రభు:|| 12

త్వత్పాదపంకజం ప్రాప్తా వయం సర్వే సురాదయ: ఋషయో దేవగంధర్వా విద్యాధరమహోరగా: || 13

తస్మాచ్చ కృపయా శంభో పాహ్యస్మాన్జగత: పతే || 14

ఋషులు పలికిరి: అజ్ఞానులమైన మేము లింగముయొక్క నిజమైన స్థితిని కోరికచేత తెలుసుకొనలేకున్నాము(9)నీవే తల్లివి, తండ్రివి, నీవే బంధువు.సఖుడవు నీవే. నీవీశ్వరుడవు, వేదము తెలిసినవాడవు, ఒకే రూపము గలవాడు మహానుభావులచే ధ్యానింపబడువాడవు.(10) వేరు వేరు కట్టెలలో నొక్కటిగా నుండు జ్యోతి వలె ఒక్కడివి నీవు అన్ని భూతముల ఆత్మవు నీ నుండే అంతా కలుగుచున్నందున నీవు నిత్యము సర్వుడని (పిలబడబడుచున్నావు) (11) ఇదంతా (నీనుండే) ఏర్పడుచున్నందున శంభుడవు నీవే. (12) దేవతలు మొదలుగా మేమంతా నీ పాదకములమును చేరితిమి, ఋషులు, దేవతలు, గంధర్వులు, విద్యాదరులు,గొప్ప సర్పములు (మేమంతా నిన్ను చేరితిమి) (13) జగత్తుయొక్క పాలకుడా! కనుక మమ్ములనుకరుణచే రక్షింపుము. (14)

మహాదేవ ఉవాచ:

శృణుధ్వం తు వచో మేద్య క్రియతాం చ త్వరాన్వితై: విష్ణుం సర్వే ప్రార్థయంతు త్వరితేన తపోధనా:|| 15

తస్య తద్వచనం శ్రుత్వా శంకరస్య మహాత్మన: | విష్ణుం సర్వే నమస్కృత్య ఈడిరే చ తదా సురా:|| 16

మహాదేవుడనెను: తపోధననులారా! ఈనాడు నామాటవినుడు త్వరగాఇట్లు చేయుడు, అందరూ విష్ణువును ప్రార్థించండి.(15)

మహాత్ముడైన శంకరుని మాటను విని దేవతలంతా అపుడు విష్ణువును నమస్కరించి స్తుతించిరి(16)

దేవా ఊచు:

విద్యాధరా: సురగణా:ఋషయశ్చ సర్వే త్రాతాస్త్వయాద్య సకలా జగదేకబంధో | తద్వత్‌ కృపాకర జనాన్పరిపాలయాద్య త్రైలోక్యనాథ జగదీశ జగన్నివాస|| 17

ప్రవాస్య భగవాన్‌ విష్ణురువాచేదం వచస్తదా| దైత్యై:ప్రపీడితా యూయం రక్షితాశ్చ పురా మయా|| 18

అద్యైవ భయముత్పన్నం లింగాదస్మాచ్చిరంతనమ్‌ | న శక్యతే మయా త్రాతుమస్మాల్లింగభయాత్సురా:|| 19

ఆచ్యుతేనైవముక్తాస్తే దేవాశ్చింతాన్వితాభవన్‌ | తదా నభోగతా వాణీ ఉవాచాశ్వాస్య వై సురాన్‌|| 20

దేవతలు పలికిరి: లోకములకు బంధువగువాడా! విద్యాధరులు ,దేవతాగణములు, ఋషులు వీరంతా నీచేత ఈనాడు రక్షింపబడిరి. ఆదేవిధముగా ఓ కృపాసముద్ర! ముల్లోకములకు ప్రభువా! జగదీశా! జగన్నివాసా! జనులను పాలించుము (17)అపుడు భగవంతుడగు విష్ణువు నవ్వి ఇట్లనెను. పూర్వము రాక్షసులచేత పీడింపమబడిన మిమ్ము నేను రక్షించితిని (18) ఈ నాడీ లింగమువలన చిరంతనమైన భయముకలిగినది, ఓ దేవతలారా! ఈ లింగము నుండి రక్షించుట నావల్ల కాదు. (19) విష్ణువిట్లు పలికినపుడు దేవతల చింతలో మునిగిరి. అపుడు ఆకాశవాణి దేవతలను ఊరడించి ఇట్లు పలికెను (20)

ఏతల్లింగం సంవృణుష్వ పూజనాయ జనార్ధన| పిండీభూత్వా మహాబాహో రక్షస్వ సచరాచరమ్‌ || తథేతి మత్వా భగవాన్‌ వీరభద్రో భ్యపూజయత్‌ || 21

బ్రహ్మాదిభిస్సు రగణౖస్సహితైస్తదానీం: సంపూజిత: శివవిధానరతో మహాత్మా| సవీరభద్ర : శశిశేఖరోసౌ శివప్రియో రుద్రసమస్త్రిలోక్యామ్‌ || 22

లింగస్యార్చనయుక్తోసౌ వీరభద్రోభవత్తదా | తద్రూపసై#్యవ లింగస్య యేన సర్వమిదం జగత్‌|| 23

ఉద్భాతి స్థితిమాప్నోతి తథా విలయమేతి చ| తల్లింగం లింగమిత్యాహుర్లయనాత్తత్త్వవిత్తమా:|| 24

బ్రహ్మోణ్ఢగోళ##కైర్‌వ్యాప్తం తథా రుద్రాక్షభూపితమ్‌ | తథా లింగం మహజ్ఞాతం సర్వేషాం దురతిక్రమమ్‌|| 25

ఓ జనార్దనా! పూజకై ఈ లింగమును ఎన్నుకొనుము. ఓమహాబాహూ! చరాచరమునంతా రక్షింపుము (21) భగవంతుడు వీరభద్రుడు అలాగేనని తలిచి శివ లింగమును పూజించెను (21) బ్రహ్మా మొదలైన దేవతాగణములతో కలిసి మహాత్ముడైన శివపూజా విధానమందాసక్తి కలిగిన వీదభద్రుడు పూజింపబడెను. మూడులోకములందునూ శివప్రియుడూ, చంద్రశేఖరుడూ అగు వీరభద్రుడు రుద్రునితో సమానము (22) అపుడు వీరభద్రుడు (శివ) లింగార్చన వరుడాయెను. దేనిచే ఈ జగత్తంతా (23)సృజింపబడుచున్నదో, స్థితిని పొందుచున్నదో, విలయమును పొందుచున్నదో దానినే తత్త్వవేత్తలు, లయించుటచే లింగము'అనియనెదురు.(24)బ్రహ్మాణ్డ గోళములచే వ్యాపించినది అట్లే రుద్రాక్షములచే అలంకరింపబడినది, అందరికీ దాటశక్యము కాని అట్టి గొప్పలింగమేర్పడినది. (25)

తదా సర్వేథ విబుధా ఋషయో వై మహాప్రభా: | తుష్టువుశ్చ మహాలింగంవేదవాదై: పృథక్పృథక్‌|| 26

అణోరణీయాంస్త్వం దేవ తథా త్వం మహతో మహన్‌| తస్మాత్త్వయా విధాతవ్యం సర్వేషాం లింగపూజనమ్‌ || 27

తదానీమేవ సర్వేణ లింగం చ బహుశ: కృతమ్‌ | సత్యే బ్రహ్మేశ్వరం లింగం వైకుణ్ఠ చ సదాశివ:||28

అమరావత్యాం సుప్రతిష్ఠమమ రేశ్వరసంజ్ఞకమ్‌| వరుణశ్వరం చ వారుణ్యాం యామ్యాం కాళేశ్వరం ప్రభుమ్‌|| 29

నైఋతేశ్వరం చ నైర్‌ఋత్యాం వాయవ్యాం పావనేశ్వరమ్‌|| కేదారం మృత్యులోకే చ తథైవ అమరేశ్వరమ్‌|| 30

అపుడు దేవతలంతా (అదేవిధంగా) గొప్పకాంతి గల ఋషులు వేరువేరుగా వేదవాదములచే (ఆ) మహాలింగమును స్తుతించిరి.(26) ఓ దేవా! నీవు అణువుకంటే అణువు (సూక్ష్మముకంటే సూక్ష్మము) అదే విధంగా నీవు మహత్తుకంటే మహాత్తువు. కనుక ఓ సర్వా! లింగపూజనం వీరిందరిచే (సుకరమెట్లగునో అట్లు) నీవు చేయవలెను. (27) అపుడే సర్వునిచే లింగం బహువిధాలుగా చేయబడెను సత్యమందు బ్రహ్మేశ్వరమనునది, వైకుణ్ఠమందు సదాశివుడనునది, (28) అమరావతిలో అమరేశ్వరుడనునది ప్రతిష్ఠింపబడినది, పడమర దిక్కున వరుణశ్వరమని, దక్షిణమున కాళేశ్వరమనునది (29) నైరుతిలో నైర్‌ఋతేశ్వరుడనునది, వాయువ్యమున పావనేశ్వరుడనునది, మృత్యులోకమున కేదారము మరియు అమరేశ్వరమనునది ప్రతిష్ఠింపబడినవి(30)

ఓంకారం నర్మదాయాం చ మహాకాలం తథైవ చ| కాశ్యాం విశ్వేశ్వరం దేవం ప్రయాగే లలితేశ్వరమ్‌|| 31

త్రియంబకం బ్రహ్మగిరౌకలౌ భ##ద్రేశ్వరం తథా| ద్రాక్షారామేశ్వరం లింగం గంగాసాగరసంగమే || 32

సౌరాష్ట్రేచ తథా లింగం సోమేశ్వరమితి స్మృతమ్‌ | తథా సర్వేశ్వరం వింధ్యే శ్రీశైలే శిఖరేశ్వరమ్‌ || కాన్త్యామల్లాలనాధం చ సింహనాథం చ సింలే || 33

విరూపాక్షం తథా లింగం కోటిశంకరమేవ చ| త్రిపురాంతకం భీమేశమమరేశ్వరమేవ చ|| 34

భోగేశ్వరం చ పాతాళే హాటకేశ్వరమేవ చ | ఏవమాదీన్యనేకాని లింగాని భువనత్రయే || స్థాపితాని తదా దేవైర్విశ్వోపకృతిహేతవే || 35

నర్మదయందు ఓంకారమగు (లింగమును) (అదేవిధంగా) మహాకాలమను దానిని, కాశి యందు విశ్వేశ్వరుడను దేవుని, ప్రయాగలో లలితేశ్వరుని (31) బ్రహ్మగిరియందు త్రియంబకుని, కలియందు భ##ద్రేశ్వరుని, గంగాసాగర సంగమమువద్ద ద్రాక్షారామేశ్వర లింగము(32) సౌరాష్ట్రమున సోమేశ్వరుని, శ్రీశైలమున శిఖరేశ్వరుని వింధ్యయందు సర్శేశ్వరుని, కాంతి(చి) యందు అల్లాలనాథుని సింగలము (సింహళము?) నందు సింహనాథుని, నిరూపాక్షుని అట్లే కోటిశంకరలింగమును. త్రిపురాంతకుని, భీమేశుని, అమరేశ్వరుని (34) పాతాళమున భోగేశ్వరుని, హాటకేశ్వరుని, ఇట్టి అనేక లింగములు మూడు లోకములందు విశ్వము యొక్క ఉపకారమునకై దేవతల చేత స్థాపించబడినవి.(35)

లింగైశ్చ తథా సర్వై:పూర్ణమాసీజ్జగత్త్రయమ్‌ | తథా చ వీరభద్రాంశా: పూజార్థమమరై: కృతా:|| 36

తత్ర వింశతిసంస్కారాస్తేషామష్ఠాదికాభవన్‌ | కథితా : శంకరేణౖవ లింగస్యార్చనసూచకా:|| 37

నంతి రుద్రేణ కథితా : శివధర్మా సనాతనా:| వీరభద్రో యథా రుద్రస్తథాన్యే గురవ: స్మృతా:|| 38

గురోర్జాతాశ్చ గురవో విఖ్యాతా భువనత్రయే | లింగస్య మహిమానం తు నందీ జానాతితత్త్వత:|| 39

తథా స్కాందో హిభగవాన్‌ యే తే నామధారకా: యథోక్తాశ్శివధర్మా హి నందినా పరికీర్తితా :|| 40

శైలాదేన మహాభాగం విచిత్రా లింగధారకా: | శవస్యోపరి లింగం చ ధ్రియతే చ పురాతనై:|| 41

అట్లు యూడు లోకములు అన్ని లింగములచే నిండిపోయేను అట్లే పూజకొఱకు దేవతలచే వీరభద్రునంశలు చేయబడిరి,(36) ఇరవై ఎనిమిది లింగము యొక్క అర్చన సూచకము లైన సంస్కారాలు శంకరుని చేత చెప్పబడినవి.(37) శివుని చేత చెప్పబడిన సనాతన శివధర్మములున్నవి. వీరభద్రుడే విధముగా రుద్రుడో అట్లే మిగతా గురువులు, గురువునుండి కలిగిన గురువులు ముల్లోకము లందు ప్రసిద్దులు (38) లింగముయొక్క మహిమను నంది వాస్తవముగా నెరుగును. (39) అట్లు భగవంతుడగు స్కాందుడు(వాస్తవముగా నెరుగును) నా మనసును ధరించువారంతా (కూడా ఎరుగుదురు) చెప్పబడిన శివధర్మములు నందిచేత కీర్తింపబడినవి(40) విచిత్రములైన లింగధారకములైన (శివధర్మములు) శిలాదపుత్రుడగు నందిచే కీర్తింపబడినవి. పురాతనులచే శవము పై కూడా లింగము ధరింపబడును. (41)

లింగేన సహ పంచత్వం లింగేన సహ జీవితమ్‌ | ఏతే ధర్మా: సుప్రతిష్ఠా :శైలాదేన ప్రతిష్ఠితా:|| 42

ధర్మ: పాశుపత: శ్రేష్ఠ: స్కందేన పరిపాలిత:|| 43

శుద్దా పంచాక్షరీ విద్యా ప్రాపాదీ తదనంతరమ్‌ | షడక్షరీ తథా విద్యా ప్రసాదస్య చ దీపికా || 44

స్కందాత్తత్సమను ప్రాప్తం అగస్త్యేన మహాత్మనా | పశ్చాదాచార్యభేదేన హ్యాగమా బహవోభవన్‌ || 45

కిం ను వై మహు నోక్తేన శివ ఇత్యక్షరద్వయమ్‌ | ఉచ్చారయన్తి యే నిత్యం తే రుద్రా నాత్ర సంశయ:|| 46

సతాం మార్గం పురస్కృత్య యే సర్వే తే పురాంతకా: | వీరా మాహేశ్వరా జ్ఞేయా: పాపక్షయకరా నృణమ్‌|| 47

ప్రసంగేనానుషంగేణ శ్రద్దయా చ యదృచ్చయా| శివభక్తిం ప్రకుర్వన్తి ప్రకుర్వన్తి యే వై తే యాన్తి సద్గతిమ్‌ || 48

శివలింగముతో సహ మరణము శివలింగముతో సహా జీవనము. ఈ గొప్ప ప్రతిష్ఠగల ధర్మములు నందిచే ప్రతిష్ఠించబడినవి.

(42) స్కందునిచే ఆచరింపబడిన పాశుపతధర్మము శ్రేష్ఠము (43) పంచాక్షరీ విద్య శుద్దమైనది అటు పిమ్మట ప్రాసాదీ విద్య(మన శాస్త్రములో ప్రణవమునకే ప్రాసాదమని సంజ్ఞ) అట్లే షడక్షరీ విద్య ప్రాసాదమును ప్రకాశింపజేయునది (44) ఇదంతా స్కందునిచే ప్రాప్తించినది మహాత్ముడైన అగస్త్యునకు తరువాత ఆచార్యభేదముచేత ఆగమములు కూడా అనేకములైనవి. (45)ఇక ఎక్కువ చెప్పిన నేమి? ఎవరు 'శివ' అనురెండుక్షరాలను ప్రతిదినము ఉచ్చారింతురో వారు నిస్సంశయంగా రుద్రులే (46)ఎవరు సత్పురుషుల మార్గము ముందుంచుకుందురో వారు పురాంతకులు, వీరులు, మహేశ్వరులు, జనులపాపమును నాశనము జేయువారు(47) ప్రసంగముచేత, యథాలాపంగా, శ్రద్దచేత, కోరికచేత గానీ ఎవరు శివభక్తిని ప్రదర్శింతురో వారు సద్గతినిపొందెదరు. (48)

శృణుధ్వం కథయామీహ ఇతిహాసం పురాతనమ్‌ | కృతం శివాలయే యచ్చ పతంగ్యామార్జనం పురా|| 49

ఆగతా భక్షణార్థం హి నైవేధ్యం కేన చార్పితమ్‌| మార్జనం రజస్తస్యా : పక్షాభ్యామభవత్పురా || 50

తేన కర్మవిపాకేన ఉత్తమం స్వర్గమాగతా | భుక్త్వా స్వర్గసుఖం చోగ్రం పున: సంసారమాగతా || 51

కాశీరాజసుతా జాతా సుందరీ నామ విశ్రుతా | పూర్వాభ్యాపాచ్చ కల్యాణీ బభూవ పరమా సతీ || 52

ఉపస్యుషసి తన్వంగీ శివద్వారరతా సదా | సంమార్జనం చ కురుతే భక్త్యా పరమయా యుతా|| 53

స్వయమేవ తదా దేవీ సుందరీ రాజకన్యకా | తథాభూతాం చ తాం దృష్ట్యా ఋషిరుద్దాలకో బ్రవీత్‌|| 54

పూర్వము ఒక ఆడుపక్షి శివాలయమున మార్జనముచేసిన పురాతనేతిహాసమును ఇప్పుడు చెప్పెదను వినుడు. (49)ఎవరో సమర్పించిన నైవేద్యమును తినుటకు వచ్చిన ఆ పక్షియొక్క రెక్కల చేత పూర్వము ధూళి తొలగించబడెను. (50) ఆ కర్మ ఫలితంగాఆ పక్షి స్వర్గమునకు వచ్చి, మిక్కుటమైన స్వర్గసుఖము ననుభవించి మరల సంసారమునకు వచ్చెను (51) అటు పై సుందరి అను పేరుతో కాశిరాజునకు కూతురుగా పుట్టి పేరుకెక్కను ఆ సుందరి పూర్వజన్మ అభాస్యము చేత గొప్ప భక్తిగల స్త్రీ సతి అయినది,(52) ప్రతిదినము ఉప:కాలమున ఆ సుందరి శివద్వారము వద్ద శ్రద్దతో గొప్ప భక్తితో ఎల్లప్పుడూ శుద్దిచేసేది (53) అట్లు సుందరి అను రాజకన్య స్వయముగా చేయుటను చూచి ఉద్దాలకుడను ఋషి ఇట్లు పలికెను.(54)

సుకుమారీ సతీ బాలే స్వయమేవ కథం శుభే | సంమార్జనం చ కురుషే కన్యకే త్వం శుచిస్మితే|| 55

దాసీదాస్యశ్చ బహవ: సంతి దేవి తవాగ్రత: | తవాజ్ఞయా కరిష్యంతి సర్వం సంమార్జనాదికమ్‌ ||56

ఋషేస్తద్వచనం శ్రుత్వా ప్రహస్యేదమువాచ హ || 57

శివసేవాం ప్రకుర్వాణా: శివభక్తిపురస్కృతా : యే నరాశ్చైవ నార్యశ్చ శివలోకం వ్రజన్తి వై|| 58

సంమార్జనం చ పాణిభ్యాం పద్భ్యాం యానం శివాలయే | తస్మాన్మయా చ క్రియతే సమ్మార్జనమతంద్రితమ్‌|| 59

అన్యత్కించిన్న జానామి ఏకం సంమార్జనం వినా | ఋషిస్తద్వచనం శ్రుత్వా మనసా చ విమృశ్య హి || 60

అనయా కిం కృతం పూర్వం కేయం కస్య ప్రసాదత:| తదా జ్ఞాతం చ ఋషిణా తత్సర్వం జ్ఞానచక్షుషా|| విస్మయేన సమావిష్టస్తూష్ణీంభూతోభవత్తదా ||61

సవిస్మయోభూదథ తద్విదిత్వా ఉద్దాలకో జ్ఞానవతాం వరిష్ఠ:| శివప్రభావం మనసా విచింత్య జ్ఞానాత్పరం బోధమవాప శాంత:|| 62

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

కేదారఖండే సప్తమోధ్యాయ:|

ఓ బాలా! నీవు సుకుమారి వయ్యూ సమ్మార్జనము నెట్లు చేయుచుంటివి? (55) ఓ అందమైన నవ్వుగల కన్యా! నీ ఎదురుగా ఎంతో మంది దాస, దాసులు గలరు| నీ ఆజ్ఞచేత సమ్మార్జనము మొదలైన దానినంతా చేయగలరు (56) ఋషియొక్క ఆ మాటలను విని నవ్వి (సుందరి) ఇట్లనెను. (57) శివసేవను బాగుగా చేయువారు శివభక్తినే ముందుంచుకొని ప్రవర్తించువారు అగు పురుషులు,స్త్రీలు శివలోకమునకు వెళ్ళుదురు (58) అందుకే నాచేత శివాలయమునకు నడిచి రావడం చేతులచే సంమార్జనము చేయడము, ఆలస్యములేక సంమార్జనము చేయడం (ఇవన్నీ) చేయబడుచున్నవి (59) సమ్మార్జనము దప్ప ఇతరము నెరుగను. ఆ మాటవిని ఋషి మనస్సులో విమర్శించుకొనెను. (60) ఈ స్త్రీ పూర్వమేమి చేసెను? ఈమె ఎవరు? ఎవరి అనుగ్రహముచేత (ఇట్లు జన్మించినది)? అపుడు జ్ఞానచక్షువుద్వారా ఋషికి అదంతా తెలిసినది.(61) అపుడతను విస్మయముతో మిన్నకుండెను.(61)జ్ఞానులలో గొప్పవాడైన ఉద్దాలకుడు, అది తెలుసుకొని విస్మయము పొందిన వాడాయెను. మనస్సులో శివుని ప్రభావమును ఆలోచించి శాంతుడై జ్ఞానము ద్వారా పరమ జ్ఞానమును పొందెను (62)

శ్రీ స్కాంద మహాపురాణంలోని మొదటి మాహేశ్వర ఖండములో కేదార ఖండమునందు ఏడవ అధ్యాయము

అష్టమోధ్యాయ:

లోమశ ఉవాచ:

తస్కరోపి పురా బ్రహ్మన్‌ సర్వధర్మబహిష్కృత:| బ్రహ్మఘ్నోసౌ సురాపశ్చ సువర్ణస్య చ తస్కర: || 1

లంపటో హి మహాపాపీ ఉత్తమస్త్రీషు సర్వదా| ద్యూతకారీ సదా మంద: కితవై: సహ సంగత:|| 2

ఏకదా క్రీడతా తేన హారితం ద్యూతమద్బుతమ్‌ | కితవైర్మర్ధ్యమానో హి తదా నోవాచ కించన || 3

పీడితోప్యభవత్తూష్ణీం తైరుక్త: పాపకృత్తమ:| ద్యూతే త్వయా చ తద్ద్రవ్యం హారితం కిం ప్రయచ్చసి|| 4

నో వా తత్కథ్యతాం శీఘ్రం యాథాతథ్యేన దుర్మతే | యద్దారితం ప్రయచ్చామి రాత్రావిత్యబ్రవీచ్చ స:|| 5

ఎనిమిదవ అధ్యాయము

లోమశుడు పలికెను: ఓ బ్రాహ్మణా! పూర్వము అన్ని ధర్మముల చేత బహిష్కృతుడైన ఒక తస్కరుడు(ండెను) అతనను బ్రాహ్మణ హత్య చేసినవాడు సురసు. త్రాగువాడు, బంగారమును దొంగలించువాడు(1) ఉత్తమ స్త్రీలయందెల్లప్పుడూ లంపటుడైన మహాపాపి, జూదము (ద్యూతము) నాడువాడు, మూర్ఖుడై మూర్ఖులతో కలిసివుండువాడు (2) ఒకనాడు అద్భుతమైన ద్యూతమును ఆడుచూ ఓడినాడు అపుడు ద్యూతకారులచేత కొట్టబడినవాడై ఏమి పలకలేదు (3) కొట్టినప్పటికీ మౌనముగా వున్నందుచే పాపము చేయువారిలో మొదటివాడైన వానిని అడిగిరి. ద్యూతములో ఓడిపోయిన ధనమును ఇచ్చెదవా? లేదా ?అని (4) తొందరగా నిజాన్ని చెప్పుమనిన ఆ తస్కరుడు జూదములో ఓడిన ధనాన్ని రాత్రి ఇచ్చెదను అనెను (5)

తైర్ముక్తాస్తేన వాక్యేన గతాస్తే కితవాదయ: | తదా నిశీథసమయే గతోసౌ శివమందిరమ్‌|| 6

శిరోధిరుహ్య శంభోశ్చ ఘణ్టామాదాతుముద్యత:| తావత్త్కెలాసశిఖరే శంభు: ప్రోవాచ కింకరాన్‌ || 7

అనేన యత్కృతం చాద్య సర్వేషామధికం భువి| సర్వేషామేవ భక్తానాం వరిష్ఠోయం చమత్ప్రియ:||8

ఇతి ప్రోక్త్వానయామాస వీరభద్రాదిభిర్గణౖ: | తే సర్వే త్వరితా జగ్ము: కైలాసాచ్చివవల్లభాత్‌|| 9

సర్వైర్డమరునాదేన నాదితం భువనత్రయమ్‌| తాన్‌ దృష్ట్యా సహసోత్తీర్య తస్కరోసౌ దురాత్మవాన్‌|| లింగస్య మస్తకాత్‌ సద్య: పలాయనపరోభవత్‌|| 10

ఆ వాక్యముచేత వారు వానిని వదలి వెళ్ళిపోయిరి అపుడురాత్రి సమయాన దొంగ శివాలయమునకు వెళ్ళెను. (6) శివుని తల పై ఎక్కి ఘంటను తీసుకొనబోవుచుండగా కైలాస శిఖరము పై నున్న శివుడు తన కింకరులతో ననెను (7) ఈ నాడితను చేసినది భూలోకములో అందరికంటే అధికము, ఇతను భక్తులందరిలో శ్రేష్ఠుడు, నాకత్యంత ఇష్ఠుడు (8) అని పలికి వీరభద్రాది గణములను (తస్కరుని) తీసుకొని రావడానికి పంపెను. వారంతా శివుడికిష్టమైన కైలాసము నుండి త్వరగా బయల్దేరిరి(9)వారందరి డమరు నాదము చేత ముల్లోకములూ నినదించినవి. వారిని చూచి దురాత్ముడైన ఆ తస్కరుడు ఒక్కమారు లేచి లింగముయొక్క శిరస్సునుండి దిగి పలాయనమును చిత్తగించెను. (10) పలాయమానం తం దృష్ట్యా వీరభద్ర : సమాహ్వయత్‌|| 11

కస్మాద్బిభేషి రే మంద దేవదేవో మహేశ్వర:| ప్రసన్నస్తవ జాతోద్య ఉదారచరితో హ్యసౌ || 12

ఇత్యుక్త్వా తం విమానే చ కృత్వా కైలాసమాయ¸° | పార్షదో హి కృతస్తేన తస్కరో హి మహాత్మనా || 13

తస్మాద్భావ్యా శివే భక్తి: సర్వేషామపి దేహినామ్‌| పశవోపి హి పూజ్యా: స్యు: కిం పునర్మానవా భువి|| 14

యే తార్కికాస్తర్కరాస్తథా మీ మాంసకాశ్చయే | అన్యోన్యవాది నశ్చాన్యే చాన్యే వాత్మవితర్కకా :|| 15

ఏకవాక్యం న కుర్వంతి శివార్చనబహిష్కృతా:| తర్కో హి క్రియతే యైశ్చ తే సర్వే కిం శివం వినా || 16

పారిపోవుచున్న అతనిని చూచి వీరభద్రుడు పిలిచెను. ఓ మూర్ఖుడా! భయపడెదవేమి? ఉదారచరితుడైన దేవదేవుడు, మహేశ్వరుడు నేడు నీకు ప్రసన్నుడయినాడు (12) అని పలికి అతనిని విమానమందుంచి కైలాసమునకు వచ్చెను, ఆ మహాత్ముని చేత దొంగ శివుని పరిచరుడాయెను. (13) కనుక, జీవులందరికీ శివభక్తి వుండవలసినది. పశువులే పూజ్యులు కాగా భూమి పై మానవులవిషయమున చెప్పనేమి? (14) ఎవరైతే తర్కమును గోరు తార్కికులు,మీమాంసకులు మరియు అన్యోన్యవాదులు ఆత్మవిషయంలో వితర్కము చేయువారో (15) వారు శివార్చన నుండి దూరమై ఒక్కమాటను నిలుపరు ఎవరిచే తర్కము చేయబడునో వారందరూ శివుడులేనిదే ఏవరు? (ఏమి పొందెదరు) (16)

తథా కిం బహునోక్తేన సర్వేపి స్థిరజంగమా: | ప్రాణినోపి హి జయంతే కేవలం లింగధారిణ:||17

పిండీయుక్తం యథా లింగం స్థాపితం చ యథాభవత్‌ | తథా సదా లింగయుక్తా : పిండీభూతాస్తథా స్త్రీయ:|| 18

శివశక్తియుతం సర్వం జగదేతచ్చరాచరమ్‌ | తం శివం మౌఢ్యతస్త్యక్త్వా మూఢాశ్చాన్యం భజన్తి యే||19

ధర్మమాత్యన్తికం తుచ్ఛం నశ్వరం క్షణభంగురమ్‌ | యో విష్ణు: స శివో జ్ఞేయో య: శివో విష్ణురేవ స:|| 20

పీఠికా విష్ణురూపం స్యాల్లింగరూపీ మహేశ్వర: తస్మాల్లింగార్చనం శ్రేష్ఠ సర్వేషామపి వై ద్విజా:|| 21

మిగులపలికి ప్రయోజనమేమి? స్థావరజంగమములన్నీ (స్థిర-చర) ప్రాణులుకూడా కేవలం లింగధారులుగా జన్మింతురు (17) లింగము పిండయుక్తముగా (లోహముతో) ఎట్లు స్థాపించబడుచున్నదో అట్లే నరులు లింగయుక్తులుగా ,స్త్రీలు లోహయుక్తులుగా (అగుచున్నారు) చరాచరమైన జగత్తంతా శివుడు మరియు శక్తి వీనిచే కూడినది మూఢులు అట్టి శివుని వదిలి మూర్ఖత్వము చేత వేరొకరిని సేవింతురు. (19) శివుని వదిలి మూఢత్వము చేత ఆత్యన్తికము తుచ్ఛము, నశించునది, క్షణభంగురమైన ధర్మమును సేవించువారు మూర్ఖులు, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు (20) పీఠము విష్ణువు యొక్క రూపము లింగము మహేశ్వరుని రూపము, కనుక ఓ ద్విజులారా! అందరికీ లింగము యొక్క అర్చనమే శ్రేష్ఠము (21)

బ్రహ్మా మణిమయం లింగం పూజయత్యనిశం శుభమ్‌ | ఇంద్రో రత్నమయం లింగం చంద్రో ముక్తామయం తథా|| 22

భానుస్తామ్రమయం లింగం పూజయత్యనిశం శుభమ్‌ | రౌక్మం లింగం కుబేరశ్చ పాశీ చారక్తమేవ చ || 23

యమో నీలమయం లింగం రాజతం నైర్‌ఋతస్తథా| కాశ్మీరం పవనో లింగమర్చయత్యనిశం విభో:|| 24

ఏవం తే లింగితా: సర్వే లోకపాలా: సవాసవా: తథా సర్వేపి పాతాళే గంధర్వా : కిన్నరై: సహ|| 25

దైత్యానాం వైష్ణవా: కేచిత్ప్రహ్లాదప్రముఖా ద్విజా: తథా హి రాక్షసానాం చ విభీషణపురోగమా:|| 26

బ్రహ్మ ఎల్లప్పుడూ మణిమయమైనది, శుభ##మైనది అగు లింగమును పూజించును. ఇంద్రుడు రత్నమయలింగమును, చంద్రుడు ముత్యాలతో గూడిన దానిని పూజింతురు, (22) సూర్యుడు రాగితో కూడిన దానిని ప్రతిదినము పూజించును. కుబేరుడు బంగారముతో చేసిన లింగమును, వరుణుడు ఎరుపులింగమును, (23) యముడు నీలముతో కూడినదానిని నిర్‌ఋతి వెండితో చేసినదానిని, వాయువు కాశ్మీర లింగమును ప్రతిదినమూ అర్చింతురు ('24) ఇట్లు ఇంద్రుడు మొదలైన లోకపాలురందరూ, లింగపూజపరులే అట్లే పాతాళమున గంధర్వులు, కిన్నరులతో సహ (25) మరియు ప్రహ్లాదుడు మొదలైన విష్ణుభక్తులగు దైత్యులు, అట్లే విభీషణుడు మొదలైన రాక్షసులు (లింగము నర్చింతురు) (26)

బలిశ్చ నముచిశ్చైవ హిరణ్యకశిపుస్తథా| వృషపర్వా వృషశ్చైవ సంహ్రాదో బాణ ఏవ చ|| 27

ఏతే చాన్యే చ బహవ: శిష్యా :శుక్రస్య ధీమత:| ఏవం శివార్చనరతా: సర్వే తే దైత్యదానవా:|| 28

రాక్షసాఏవ తే సర్వే శివపూజాన్వితా: సదా | హేతి : ప్రహేతి: సంయాతిర్విఘస: ప్రఘసస్తథా || 29

విద్యుజ్జిహ్వస్తీక్ణదం ష్ట్రోధూమ్రాక్షో భీమవిక్రమ:| మాలీ చైవ సుమాలీ చ మాల్యవానతిభీషణ :|| 30

విద్యుత్కేశస్తడిజ్జిహ్వా రావణశ్చ మహాబల : కుంభకర్ణో దురాధర్షో వేగదర్శీ ప్రతాపవాన్‌ || 31

ఏతే హి రాక్షసా: శ్రేష్ఠా : శివార్చనరతాస్సదా | లింగమభ్యర్చ్య చ సదా సిద్దిం ప్రాప్తా: పురా తు తే || 32

బలి ,నముచి హిరణ్య కశిపు, వృషపర్వుడు, వృషుడు, సంహ్రాదుడు, బాణుడు,(27) మరియు బుద్దిమంతుడై న శుక్రుని ఇతర శిష్యులనేక మంది దైత్యదానవులు శివార్చన యందాసక్తి గలవారు రాక్షసులందరూ ఎల్లప్పుడూ శివునే పూజించువారు హేతి,ప్రహేతి, సంయాతి, విఘసుడు, ప్రఘసుడు, విద్యుజ్జిహ్వుడు, తీక్ణదంష్ట్రుడు, తీక్ణదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు (భీకర పరాక్రమముగలవాడు) మాలి, సుమాలి, అతిభయంకరమైన మాల్యవంతుడు(30) విద్యుత్కేశుడు, తడిజ్జిహ్వుడు, మహాబలుడైన రావణుడు, ఎదిరింపశక్యముగాని కుంభకర్ణుడు, వేగ దర్శుడు (ప్రతాపముగలవాడైన) (31) ఈ రాక్షసశ్రేష్ఠులంతా ఎల్లప్పుడూ శివార్చనయందుండి లింగమును పూజించి పూర్వము సిద్దిని పొందిరి.(32)

రావణన తపస్తప్తం సర్వేషామపి దు:సహమ్‌| తపోధిపో మహాదేవస్తుతోష చ తదా భృశమ్‌|| 33

వరాన్ప్రాయచ్చత తదా సర్వేషామపి దుర్లభాన్‌ | జ్ఞానం విజ్ఞానసహితం లబ్థం తేన సదాశివాత్‌ || 34

అజేయత్వం చ సంగ్రామే ద్వైగుణ్యం శిరసామపి | పంచవక్త్రో మహాదేవో దశవక్త్రోథ రావణ:|| 35

దేవానృషీన్పితృంశ్చైవ నిర్జిత్య తపసా విభు: | మహేశస్య ప్రసాదాచ్చ సర్వేషామదికోభవత్‌ || 36

రాజా త్రికూటాధిపతిర్మహేశేన కృతో మహాన్‌| సర్వేషాం రాక్షసానాం చ పరమాసనమాస్థితి:|| 37

అందరికీ సహింపనలవిగాని ఘోరమైన తపస్సును రావణుడు చేసెను. తపస్సునకధిపతియైన మహాదేవుడపుడు మిగుల సంతోషించి (33) ఇతరులందరికీ పొందనలవిగాని వరములనిచ్చెను అతను సదాశివుని నుండి విజ్జాన సహితముగా జ్ఞానమును పొందెను (34) యుద్దములో జయింపబడకుండుట (శివుని) తలలకు రెట్టింపు తలలు పొందెను శివుడు ఐదుతలలు గలవాడు. రావణుడు పదితలలు గలవాడాయెను. (36) అపుడు శివునిచేత త్రికూటమునకు ప్రభువుగా చేయబడెను. అందరు రాక్షసులకంటే గొప్పవాడైనందున వారి ప్రభువయి గొప్ప అసనము నధిష్ఠించెను. (37)

తపస్వినాం పరీక్షాయై యదృషీణాం విహింసనమ్‌: కృతం తేన తదా విప్రా రావణవ తపస్వినా|| 38

అజేయో హి మహాన్జాతో రావణో లోకరావణ: సృష్ట్యన్తరం కృతం యేన ప్రసాదాచ్ఛంకరస్య చ|| 39

లోకపాలా జితాస్తేన ప్రతాపేన తపస్వినా| బ్రహ్మాపి విజితో యేన తపసా పరమేణ హి|| 40

అమృతాంశుకరో భూత్వా జితో యేన శశీ ద్విజా: దాహకత్వాజ్జితో వహ్నిరీశ: కైలాసతోలనాత్‌|| 41

ఐశ్వర్యేణ జితశ్చేన్ద్రో విష్ణు: సర్వగతస్తథా| లింగార్చనప్రసాదేనత్రైలోక్యం చ వశీకృతమ్‌|| 42

తదా సర్వే సురగణా బ్రహ్మవిష్ణుపురోగమా:| మేరుపృష్ఠం సమాసాద్య సుమస్త్రం చక్రిరే తదా|| 43

ఓ విప్రులారా! తపస్విజనుల పరీక్షకై ఋషులను హింసించుట తపస్వి రావణుడు చేసెను. (38) లోకములకు భీకరుడు రావణుడు జయింపశక్యముగాని గొప్పవాడాయెను. శంకరుని ప్రసాదముచే అతను వేరోకసృష్టిని కూడాచేసేను(39) తపస్వియగు అతని ప్రతాపముచేత లోకపాలురు జయింపబడిరి, గొప్పతపస్సుచేత బ్రహ్మకూడా జయింపబడెను(40) ఓ విప్రులారా| అమృతమగు కిరణములు గలవాడగుటచే (అట్టి) చంద్రుని జయించెను కైలాసమును తూచుటచే ఈశ్వరుడు, దహింపజేయుటచే అగ్ని (41) ఐశ్వర్యము చేత చన్ద్రుడు, సర్వత్ర వుండుటచేత విష్ణువు జయింపబడిరి లింగార్చన ప్రభావముచేత ముల్లోకలములూ వశములొకి వచ్చినవి (420 అపుడు, దేవతాగణములన్నీ బ్రహ్మ విష్ణు మొదలుగా మేరు పర్వతము పై కలిసి బాగుగా ఆలోచనను జేసిరి, (43)

పీడితా: స్మో రావణన తపసా దుష్కరేణ వై| గోకర్ణాఖ్యే గిరౌ దేవా: శ్రూయతాం పరమాద్భుతమ్‌ || 44

సాక్షాల్లింగార్చనం యేన కృతమస్తి మహాత్మనా | జ్ఞానజ్ఞేయం జ్ఞానగమ్యం యద్యత్పరమమద్భుతమ్‌ || తత్కృతం రావణనైవ సర్వేషాం దురతిక్రమమ్‌ || 45

వైరాగ్యం పరమాస్థాయ ఔదార్యం చ తతోధికమ్‌ | తేనైన మమతా త్యక్తా రావణన మహాత్మనా || 46

సంవత్సరసహస్రాచ్చ స్వశిరో హి మహాభుజ: కృత్త్వా కరేణ లింగస్య పూజనార్థం సమర్పయత్‌ || 47

రావణస్య కబంధం చ తదగ్రే చ సమీపత :| యోగధారణయా యుక్తం పరమేణ సమాధినా|| రావణునిచేత దుష్కరమైన తపస్సు చేత పీడింపబడితిమి. ఓ దేవతలారా! గోకర్ణమను పర్వతము పైని పరమాద్భుతమును వినుడు (44) మహాత్ముడైన (రావణునిచేత) సాక్షాత్‌ లింగముయొక్క అర్చనము చేయబడినది. జ్ఞానమాత్రముచే తెలియదగునది, పొందబడునది అగు పరమాద్బుతము (45) ఇతరులు దాటలేనిది రావణుని చేత చేయబడినది (45) మహాత్ముడైన రావణునిచేత గొప్పవైరాగ్యము పొంది అంతకంటే మిక్కిలి ఔదార్యము చేత మమకారము వదలివేయబడినది (46) వేయిసంవత్సరములు ఆమహాభుజుడు తన శిరస్సును ఖండించి తన చేతితో లింగము యొక్క పూజకై సమర్పించెను (47) దానికెదురుగా రావణుని మొండెము సమీపముననే యోగధారణతో గొప్ప సమాధిలో నుండెను (48)

లింగే లయం సమాధాయ కయాపి కళయా స్థితమ్‌| అన్యచ్ఛిరో వివృశ్చైవం తేనాపి శివపూజనమ్‌ || 49

ఏవం శిరాంస్యేవ బహూనితేన సమర్పితాన్యేవ శివార్చనార్థే | భూత్వా కబంధో హి పున:పునశ్చ తదా శివోసౌ వరదో బభూవ || 50

వరాన్వరయ పౌలస్త్య యథేష్టం తాన్దదామ్యవామ్‌ || 51

రావణన తదా చోక్త: శివ: పరమమంగళ : యది ప్రసన్నో భగవాన్‌ దేయో మే వర ఉత్తమ:|| 52

శివలింగమునందు లయమును నిలిపి ఒకానొక కళతో నుండెను. వేరొక శిరస్సును దుంచి దానిచే గూడా శివపూజనము చేసెను. ఇది వేరొక మునిచేతగాని, ఇతరులెవరిచేత గానీ చేయబడినది(49) ఇట్లు రావణుడు శివుని పూజకై పెక్కుతలలను సమర్పించెను. మరల మరల మొండెముగా మిగిలెను. అపుడు శివుడు (ప్రసన్నుడై ) వరములనిచ్చు వాడాయెను(50) ఓ రావణా! నీకిష్టమైనది కోరుము, ఆ వరములనేనిచ్చెదను(51) అపుడు పరమ మంగళుడైన రుద్రుని జూచి రావణుడనెను భగవంతుడా! నీవు ప్రసన్నుడవైనచో నాకు ఉత్తమమైన వరమునిమ్ము అనెను (52)

న కామయేన్యంచ పరమాశ్రయే త్వత్పదాంబుజమ్‌ | యథా తథా ప్రదాతవ్యం యద్యస్తి చకృపా మయి|| 53

తదా సదాశివేనోక్తో రావణో లోకరావణ:| మత్ర్పసాదాచ్చ సర్వం త్వం ప్రాప్స్యసే మనసేప్సితమ్‌ || 54

ఏవం ప్రాప్తం శివాత్‌ సర్వం రావణన సురేశ్వరా:| తస్మాత్సర్యైర్భవద్భిశ్చ తపసా పరమేణ హి || 55

విజేతవ్యో రావణోయమితి మే మనసి స్థితమ్‌| అచ్చుతస్య వచ: శ్రుత్వా బ్రహ్మాద్యా దేవతా గణా:|| 56

చింతామాసేదిరే సర్వే చిరం తే విషయాన్వితా: | బ్రహ్మాపి చేంద్రియగ్రస్త: సుతాం రమితుముద్యత :|| 57

ఇంద్రో హి జారభావాచ్చ చంద్రో హి గురుతల్పగ:| యమ: కదర్యభావాచ్చ చంచలత్వాత్‌ సదాగతి:|| 58

పావక: సర్వభక్షిత్వాత్‌ తథాన్యే దేవతీ గణా| అశక్తా రావణం జేతుం తపసా చ విజృంభితమ్‌ || 59

నేను వేరే వరమునను కోరను నీ పాదకమలాలనే ఆశ్రయింతును. నీకు నాయందుకృప యున్న వరమునున్నదున్నట్లుగా ఇవ్వవలెను (53) అపుడు లోకభీకరుడైన రావణునితో సదాశివుడిట్లనెను. నా ప్రసాదముచేత నీవు కోరుకున్నది పొందగలు (54) ఓ దేవతలారా! ఇట్లు శివుడినుండి రావణుడంతా పొందెను, కనుక మీరంతా గొప్ప తపస్సుచేత (55) రావణుని జయింపవలెనని నామనస్సున గలదు. విష్ణువు యొక్క మాటలను విని బ్రహ్మ మొదలైన దేవతాగణములు (56) అందరూ చింతనొందిరి వారు విషయములతో కూడియున్నవారు బ్రహ్మ కూడా ఇంద్రియముల వశములోపడి కూతురుతో రమించుటకు నిద్దపడినాడు (57) ఇంద్రుడు జారుడగుటవల్ల చంద్రుడు గురువు యొక్క తల్పము చేరుట చేత యముడు కృపణత్వముచే , వాయువు చంచలత్వము చేత (58)అగ్ని సర్వము భక్షించువాడగుటచేత అట్లే ఇతర దేవగుణములుకూడా తపస్సు చేత విజృంభించిన రావణుని జయించుటకు సమర్థులుకాకపోయిరి, (59)

శైలాదో హి మహాతేజా గణశ్రేష్ఠ : పురాతన: బుద్దిమాన్నీతినిపుణో మహాబలపరాక్రమీ|| 60

శివప్రియో రుద్రరూపీ మహాత్మా హ్యువాచ సర్వానథ చేంద్రముఖ్యాన్‌ |

కస్మాద్యూయం సంభ్రమాదాగతాశ్చ | ఏతత్సర్వం కథ్యతాం విస్తరేణ|| 61

నందినా చ తదా సర్వే పృష్టా : ప్రోచుస్త్వరాన్వితా:|| 62

దేవా ఊచు:

రావణన వయం సర్వే నిర్జితా మునిభిస్సహ | ప్రసాదయితుమాయాతా: శివం లోకేశ్వరేశ్వరమ్‌|| 63

గణములలో శ్రేష్ఠుడు, పురాతనుడు, బుద్దిమంతుడు, నీతిని తెలిసినవాడు, గొప్ప బలపరాక్రమములు గలవాడు, గొప్ప తేజస్సు గల నంది (60) శివప్రియుడు రుద్రుని రూపము దాల్చినవాడు మహాత్ముడు. అట్టి నంది ఇంద్రుడు మొదలుగా గల దేవతలందరితో ననెను ఏకారణము చేత మీరు తొందరగా వచ్చితిరి. అదంతా విస్తరముగా చెప్పుడు అనెను (61) అపుడు నంది చేత ప్రశ్నింపబడిన దేవతలంతా త్వరగా చెప్పిరి (62) దేవతలు పలికిరి, మునులతో సహ మేమంతా రావణుని చేత జయింపబడితిమి లోకములకన్నింటికీ ప్రభువైన శివుని ప్రసన్నము చేసికోనుటకు ఇటకేతెంచితిమి(63)

ప్రహస్య భగవాన్నందీ బ్రహ్మాణం వై హ్యువాచ హ| క్వ యూయం క్వ శివ: శంభుస్తపసా పరమేణ హి || ద్రష్టవ్యో హృది మధ్యస్థ: సోద్య ద్రష్టుం న పార్యతే|| 64

యావద్భావా హ్యనేకాశ్చ ఇంద్రియార్థాస్తథైవ చ| యావచ్చ మమతాభావస్తావదీశో హి దుర్లభ:|| 65

జితేంద్రియాణాం శాంతానాం తన్నిష్ఠానాం మహాత్మనామ్‌ | సులభో లింగరూపీ స్యాద్భవతాం హి సుదుర్లభ:||66

తదా బ్రహ్మాదయో దేవా ఋషయశ్చ విపశ్చిత:| ప్రణమ్య నందినం ప్రాహు: కస్మాత్త్వం వానరానన:| తత్సర్యం కథయాన్యం చ రావణస్య తపోబలమ్‌|| 67

భగవంతుడగు నంది నవ్వి బ్రహ్మతో ఇట్లుపలికెను మీరెక్కడ? శివుడెక్కడ? గొప్ప తపస్సుచేత శివుడు హృదయము మధ్యనున్నట్లు గాంచవలె. ఈనాడు అతని చూడశక్యముగా గాదు (64) ఎంతవరకు అనేక భావము లుంటాయో (మనసులో)అట్లే ఇంద్రియ విషయములుంటాయో ఎంతవరకు నాది అనుభావముంటుందో అంతవరకు ఈశ్వరుడు లభించుట కష్టము(65) ఇంద్రియముల జయించిన వారికి, శమముగలవారికి, శివనిష్ఠగల మహాత్ములకు లింగరూపియైన శివుడు సులభుడు మీకు మాత్రము దుర్లభుడే (66) అనగా అపుడు బ్రహ్మ మొదలగు దేవతలు, బుద్దిమంతులగు నందికి నమస్కరించి అనిరి నీవెందుకు వానరముఖమునొందితివి? దీనిని గూర్చి అట్లే రావణుని తపస్సు యొక్క బలాన్ని గూర్చి చెప్పుము(67)

కుబేరోధికృతస్తేన శంకరేణ మహాత్మనా| ధనానామాధిపత్యే చ తం ద్రష్ఠుం రావణోత్ర వై|| 68

ఆగచ్చ త్త్వరయాయుక్త: సమారుహ్య స్వవాహనమ్‌| మాం దృష్ట్యా చాబ్రవీత్‌ కృద్ద: కుబేరో హ్యత్ర ఆగత:|| 69

త్వయా దృష్టోథవాత్రాసౌ కథ్యతామవిలంబితమ్‌ | కిం కార్యం ధనధేనాద్య ఇతి పృష్టో మయా హి స:|| 70

తదోవాచ మహాతేజా రావణో లోకరావణ:| మయ్యశ్రద్దాన్వితో భూత్వా విషయాత్మా సుదుర్మద:|| 71

శిక్షాపయుతుమారభ్ధో మైవం కార్యమితి ప్రభో| యథాహం చ శ్రియా యక్త ఆఢ్యోహం బలవానహమ్‌ | తథా త్వం భవ రే మూఢ మా మూఢత్వముసార్జయ|| 72

మహాత్ముడైన శంకరునిచే కుబేరుడు ధనాధిపతిగా అధికారమును పొందగా, అతని చూడదలిచి రావణుడు ఇక్కడకు (68) త్వరగా తన వాహనము నెక్కి వచ్చెను. నన్ను చూచి కోపముతో కుబేరుడిక్కడకు వచ్చెనా అని అడిగెను(69) తొందరగా నీవతన్నిక్కడ చూచితివా చెప్పుము (అనెను) అపుడు నేను కుబేరునితో నీకేమిపని అడిగితిని (70) అపుడు గోప్ప తేజస్సు గలవాడు లోకభీకరుడైన రావణుడు నన్ను లెక్కించక విషయముల పై మనసుగలిగి మదముతో (71) నాకు శిక్షగరుపుటకు మొదలిడెను. ఇలా చేయకూడదు. నేనెట్లు ధనము ,బలము గలిగి గొప్పవాడినో నీవునూ అట్లే కమ్ము! మూర్ఖడా! మూర్ఖత్వమును పొందకుము.(72)

అహం మూఢ: కృతస్తేన కుబేరేణ మహాత్మనా | మయా నిరాకృతో రోషాత్తపస్తేపే స గుహ్యక:|| 73

కుబేరస్స హి నందిన్‌ కిమాగతస్తవ మందిరమ్‌ | దీయతాం చ కుబేరోద్య నాత్ర కార్యా విచారణా || 74

రావణస్య వచ: శ్రుత్వా హ్యువాచ త్వరితోప్యహమ్‌ | లింగకోసి మహాభాగ త్వమహాంచతథావిధ:|| 75

ఉభయోస్సమతాం జ్ఞాత్వా వృథా జల్పసి దుర్మతే | యథోక్తస్స త్వవాదీన్మాం వధనార్థే బలోద్దత:|| 76

యథా భవద్భి: పృష్టోహం వదనార్థే మహాత్మభి: పురా వృత్తం మయా ప్రోక్తం శివార్చనవిదే: ఫలమ్‌ | శివేన దత్తం సారూప్యం న గృహీతం మయా తథా|| 77

యాచితం చ మయా శంభోర్వదనం వానరస్య చ| శివేన కృపయా దత్తం మమ కారుణ్యశాలినా|| 78

మహాత్ముడైన కుబేరుడు నన్ను మూర్ఖునిగా జేసెను. నేను నిరాకరించగా అతను రోషముతో తపస్సు చేసెను. (73) ఓ నందీ! అట్టి కుబేరుడు నీ మందిరమునకొచ్చెనా? ఇక పై ఆలోచించక కుబేరుని నాకిమ్ము (74) రావణుని మాటలను విని నేను కూడా త్వరగా అంటిని. ఓ మహానుభావా! నీవు లింగపూజను చేయువాడవు. నేనునూ అట్లే(75) మనిద్దరి మధ్య సమానత్వముందని తెలిసీ వ్యర్థముగా దుర్మతియై ప్రేలుచుంటివి. ఇట్లనగా అతను బలముచే గర్వితుడై నాముఖమును గూర్చి అనెను. (76) మీరునన్నెట్లు ప్రశ్నించితిరో (అతనూ అట్లే ప్రశ్నించెను ఇది గతంలో జరిగినది. శివార్చన విధియొక్క ఫలము చెప్పితిని శివుడు సారుప్యమునిచ్చిననూ నేను అపుడు గ్రహించలేదు. (77) నేనే వానరముయొక్క వదనము కొఱకు శివుని యాచించితిని శివుడు కృపచే కరుణచే నాకు దానినొసగెను. (78)

నిరభిమానినో యే చ నిర్దంభా నిష్పరిగ్రహా: | శంభో : ప్రియాస్తే విజ్ఞేయా హ్యన్యే శివబహిష్కృతా:| 79

తథావదన్మయా సార్థం రావణస్తపసో బలాత్‌| మయా చ యాచితాన్యేవ దశవక్త్రాణి ధీమతా|| 80

ఉపహాసకరం వాక్యం పౌలస్త్యస్య తదా సురా:| మయా తదా హి శప్తో సౌరావణో లోకరావణ:|| 81

ఈదృశాన్యేవ వక్త్రాణి యేషాం వై సంభవన్తి హి| తై: సమేతో యదా కోపి నరవర్యో మహాతపా:|| మాం పురస్కృత్య సహసా హనిష్యతి న సంశయ:|| 82

ఏవం శప్తో మయా బ్రహ్మన్రావణో లోకరావణ:| అర్చితం కేవలం లింగం వినా తేన మహాత్మనా || 83

పీఠికారూపసంస్థేన వినా తేన సురోత్తమా:| విష్ణునా హి మహాభాగాస్తస్మాత్సర్యం విధాస్యతి || 84

దేవదేవో మహాదేవో విష్ణురూపీ మహేశ్వర:| సర్వే యూయం ప్రార్థయంతు విష్ణుం సర్వగుహాశయమ్‌| 85

అహం హి సర్వదేవానాం పురోవర్తీ భవామ్యత:| తే సర్వే నందినో వాక్యం శ్రుత్వా ముదితమానసా:|| వైకుణ్ఠమాగతా గీర్బిర్విష్ణుం స్తోతుం ప్రచక్రిరే|| 86

ఎవరైతే అభిమానము (అహంకారము) దంభము,కానిది గ్రహించుట అనునవి లేనివారో వారు శివునికి ఇష్ఠులని తెలియవలయు, ఇతరులు శివునిచే బహిష్కృతులు (79) అపుడు రావణుడు తపోబలము చేత నాతో ఇట్లనెను నేను కూడా తెలివిగా పదితలలనూ యాచించితిని (80) ఓ దేవతలారా! అట్లు రావణుడు ఎగతాళి చేయుచున్నట్లు పలుకగా నేను లోకభీకరుడైన రావణుడిని అపుడు శపించితిని(81) ఎవరికైతే ఇట్లాంటి తలలుండునో , ఎవడైతే నరశ్రేష్ఠుడు ,గొప్ప తపస్సంపన్నుడు వారితో కలియునో నన్ను ముందుంచుకొని వారు చంపెదరు, ఇందు సందేహము లేదు (82) ఇట్లు నేను లోకభీకరుడైన రావణుని శపించితిని. ఆ మహాత్ముడు కేవలం లింగము నర్చించెను(83) పీఠికారూపంలోని విష్ణువు లేకుండా లింగరూపి శివుని పూజించినందుచేత నశించెను. (84) ఆ దేవదేవుడగు మహాదేవుడు విష్ణురూపమున అంతా చేకూర్చగలడు మీరంతా అందరి హృదయాలయందు నిద్రించు ఆవిష్ణువును ప్రార్థించుడు (85) నేను దేవతలందరికీ ముందుండెదను. వారంతా నంది వాక్యమునువిని ఆనందించి, వైకుణ్ఠమునకు వచ్చి విష్ణువును వాక్కులచే స్తుతించుట కారంభించిరి.(86)

దేవా ఊచు:

నమో భగవతే తుభ్యం దేవదేవ జగత్పతే | త్వదాథారమిదం సర్వం జగదేతచ్చరాచరమ్‌|| 87

ఏతల్లింగం త్వయా విష్ణో ధృతం వై పిండిరూపిణా | మహావిష్ణుస్వరూపేణ ఘాతితౌ మధుకైటభౌ|| 88

తథాకమఠరూపేణ థృతో వై మందరాచల:| వరాహరూపమాస్థాయ హిరణ్యాక్షో హతస్త్వయా || 89

హిరణ్యకశిపుర్దైత్యో హతో నృహరిరూపిణా| త్వయా చైవ బలిర్భద్ధో దైత్యో వ్యామనరూపిణా|| 90

భృగూణామన్వయే భూత్వా కృతవీర్యాత్మజో హత:| ఇతోప్యస్మాన్మహావిష్ణో తథైవ పరిపాలయ|| 91

రావణస్య భయాదస్మాత్త్రాతుం భూయోర్హసిత్వరమ్‌ ||92

ఏవం సంప్రార్థితో దేవైర్బగవాన్భూతభావన: | ఉవాచ చ సురాన్‌ సర్వాన్వాసుదేవో జగన్మయ:||93

దేవతలనిరి: ఓ నరదేవా! జగత్పతీ! నీకు నమస్కారము. చరాచరమైన జగత్తంతయూ నీవు ఆధారముగా నున్నదే.(87) ఓవిష్ణూ ! నీవే లింగమును పిండి (లోహం) రూపమన ధరించుచుంటివి.మహా విష్ణుస్వరూపమున మధుకైటభుల జింపితివి(88) అట్లే కూర్మ రూపమున మందర పర్వతమును నిలిపితివి. వరాహ రూపమును దరించి హిరణ్యాక్షుని నీవే సంహరించితివి.(89) నరసింహ రూపములో హిరణ్యకశిపుడను దైత్యుని చంపితివి. అట్లే నీవు బలియను దైత్యుడిని వామనరూపమున బంధించితివి.(90) భృగువంశమున జన్మించి కార్త వీర్యుని జంపితివి. ఇకముందుకూడా నీవు మమ్మట్లే పరిపాలించుము. (91) రావణుని ఈభయమునుండి మమ్ముత్వరగా రక్షించవలెను.(92) ఇట్లు దేవతలందరూ ప్రార్థింపగా సర్వ భూతముల సృజించు విష్ణువు జగన్మయుడపుడు దేవతలందరినీ ఉద్దేశించి పలికెను (93)

హేదేవా: శ్రూయతాం వాక్యం ప్రస్తావసదృశం మహత్‌ | శైలాదిం చ పురస్కృత్య సర్వే యూయం త్వరాన్వితా :|| అవతారాన్ర్పకుర్వస్తు వానరీం తనుమాశ్రితా:|| 94

అహం హి మానుషో భూత్వా హ్యజ్ఞానేన సమావృత:| సంభవిష్యామ్యయోధ్యాయాం గృహే దశరథస్య చ||

బ్రహ్మవిద్యాసహాయోస్మి భవతాం కార్యసిద్దయే||95

జనకస్య గృహే సాక్షాద్ర్భహ్మవిద్యా జనిష్యతి | భక్తో హి రావణ: సాక్షాచ్ఛివధ్యానపరాయణ:|| 96

తపసా మహతో యుక్తో బ్రహ్మవిద్యాం యదేచ్చతి | తదా సుసాధ్యో భవతి పురుషో ధర్మనిర్జిత:|| 97 ఏవం సంభావ్య భగవాన్విష్ణు: పరమమంగళ:|

దేవతలారా! గొప్ప ప్రస్తావము వంటి వాక్యమును వినుడు శైలాదుడగు నందిని ముందిడి మీరంతా త్వరగా వానరదేహమున అవతారములనేర్పరుచుడు (94) నేను అజ్ఞానముతో కూడిన వాడనై మనుష్యదేహమున అయోధ్యలోదశరథునింట సంభవించెను. మీ పని సిద్దించుటలో బ్రహ్మ విద్య నాతో కూడి రాగలదు. (95) జనకునింట సాక్షాత్తు బ్రహ్మ విద్య జనించగలదు. రావణుడు శివధ్యాన పరుడు భక్తుడు బ్రహ్మ విద్య నెపుడు కోరునో అపుడుధర్మ నిర్జితుడైన అతడు (వదింప) సాధ్యుడగును (96,97) ఇట్లు పలికి భగవంతుడగు విష్ణువు పరమ మంగళుడై యుండెను.

వాలీ చేంద్రాంశసంభూత: సుగ్రీవోంశుమత: సుత: || 98

తథా బ్రహ్మాంశసంభూతో జాంబవానృక్షకుంజర: | శిలాదత నయో నందీ శివస్యానుచర: ప్రియ:|| 99

యో వై చైకాదశో రుద్రో హనుమాన్స మహాకపి: | అవతీర్ణ సహాయార్థం విష్ణోరమితతేజస:||100

మైందాదయోథ కపయస్తే సర్వే సురసత్తమా:| ఏవం సర్వే సురగణా అవతేరుర్యథాతథమ్‌ || 101

తథైవ విష్ణురుత్పన్న : కౌశల్యానందవర్ధన:| విశ్వస్య రమణాచ్పైవ రామ ఇత్యుచ్చతే బుదై:|| 102

శేషోపి భక్త్యా విష్ణోశ్చ తపసావతరద్భువి|| 103

దోర్దణాడవపి విష్ణోశ్చ అవతీర్ణౌ ప్రతాపినౌ | శతృఘ్నభరతాఖ్యౌ చ విఖ్యాతౌ భువనత్రయే|| 104

ఇంద్రుని అంశాన వాలి, సూర్యుడి అంశాన సుగ్రీవుడు (98) అట్లే బ్రహ్మయొక్క అంశ##చేత భల్లూకశ్రేష్ఠుడగు జాంబవంతుడు, శివుని అనుచరుడగు నంది, (99) ఏకాదశ రుద్రుల అంశాన (పదకొండవ రుద్రుడు) గొప్ప తేజస్సుగల విష్ణువుకు సహాయము కొఱకు గొప్ప వానరమైన హనుమంతుడు (100) అట్లే మైందుడు మొదలైన కపులు, దేవతాగణములన్నీ యథాతథంగా అవతరించిరి(101) అట్లే విష్ణువు కౌశల్యకు ఆనందము కలిగించువాడుగాజనించెను. విశ్వమును ఆనందపరచుటచే రామ అని విజ్ఞులచే పిలవబడెను.(102) విష్ణువు పట్ల భక్తిచేత ఆదిశేషుడు తపస్సు చేత భూమి పై లక్ష్మణునిగా అవతరించెను.(103) విష్ణువు యొక్క ప్రతాపముగల భుజదండాలు కూడా అవతరించినవి ముల్లోకములందు శతృఘ్న భరత అని పేరొందినవి (104)

మిథిలాధిపతే: కన్యా యా ఉక్తా బ్రహ్మవాదిభి:| సా బ్రహ్మవిద్యావతరత్సురాణాం కార్యసిద్దయే|| సీతా జాతా లాంగలస్య ఇయం భూమివికర్షణాత్‌ || 105

తస్మాత్సీతేతి విఖ్యాతా విద్యా సాన్వీక్షికీ తదా| మిథిలాయాం సముత్పన్నా మైథిలీత్యభిధీయతే|| 106

జనకస్య కులే జాతా విశ్రుతా జనకాత్మజా | ఖ్యాతా వేదవతీ పూర్వం బ్రహ్మవిద్యాఘనాశినీ || 107

సాదత్తా జనకేనైవ విష్ణవే పరమాత్మనే || 108

తయాథ విద్యయా సార్ధం దేవదేవో జగత్పతి :| ఉగ్రే తపసి లీనోzసౌ విష్ణు పరమమంగళ:|| 109

దేవతల కార్యము సిద్దించుటకై , బ్రహ్మ వేత్తలచేత బ్రహ్మవిద్య అనబడు మిథిలానగర రాజు కూతురు అవతరించినదినాగలిచే భూమిని దున్నునపుడు జనించినది గాన సీత(105) అని ఈ ఆన్వీక్షికీ విద్య పేరుగాంచినది అట్లే మిథిలయందు జనించుటచేత మైథిలి అనబడినది(106) జనకుని కులమున జనించుటచేత జనకాత్మజ (జానకి) అని పేరొందినది.పూర్వము పాపముల నశింనజేయు బ్రహ్మవిద్యయే వేదవతి యని పేరుగాంచినది (107) అ సీత పరమాత్ముడైన విష్ణువునకు జనకుని చేత ఇవ్వబడినది. (108) ఆ విద్యతో కూడి దేవదేవుడు .జగత్పతి, పరమమంగళుడైన విష్ణువు ఉగ్రమునగు తపస్సున మునిగెను.(109)

రావణం జేతుకామో వై రామో రాజీవలోచన: | అరణ్యవాసమకరోద్దేవానాం కార్యసిద్దయే || 110

శేషావతారోపి మహాంస్తప: పరమదుష్కరమ్‌| తతాప పరయా శక్త్యా దేవానాం కార్యసిద్దయే|| 111

శతృఘ్నె భరతశై తేపతు: పరమం తప: || 112

తతోసౌ తపసా యుక్త: సార్థం తైర్దేవతాగణౖ: | సగణం రావణం రామ: షడ్భిర్మాసైరజీహనత్‌|| విష్ణునా ఘాతిత: శ##సై#్త్ర: శివసారూప్యమాప్తవాన్‌ || 113

సగణ: స పునస్పద్యో బంధుభిస్సహ సువృతా:||

శివప్రసాదాత్సకలం ద్వైతాద్వైతవివేకార్థమృషయోప్యత్ర మోహితా:|| తత్సర్వం ప్రాప్నువన్తీహ శివార్చనరతా నరా:|| 115

యే ర్చయన్తి శివం నిత్యం లింగరూపిణమేవచ| స్త్రియో వాప్యథవా శూద్రా : శ్వపచా హ్యంతవాసిన:|| తం శివం ప్రాప్నువంత్యేవ సర్వదు:ఖోపనాశనమ్‌ ||116

రావణుని జయించు కోరికగల రాముడు దేవతల కార్యము సిద్దించుటకై అరణ్య వాసము చేసెను. (110) శేషుని యొక్క అవతారము కూడా పరమ శక్తితో దేవతల కార్యసిద్దికై కష్టముతో చేయనగు తపస్సునాచరించెను. (111) భరతశతృఘ్నులుకూడా పరమమైన తపస్సును చేసిరి (112) అటు పిమ్మట ఈ రాముడు ఆయా దేవతా గణములతో కూడి ఆరు నెలలలో తన గణములతో సహా రావణుని జంపెను. విష్ణువు చేత తన శస్త్రములచే చంపబడిన రావణుడు తన గణముతో కూడి శివునిసారూప్యమునొందెను (113)అతను మరల వెంటనే బంధువులతో సహా(114) శివుని అనుగ్రహముచే ద్వైతాద్వైతమునొందెను. ద్వైతాద్వైతము యొక్క జ్ఞానము కొరకు ఋషులు కూడా మోహితులై. శివార్చన యందాసక్తి గలవారు దానినిక్కడ పొందెదరు.(115) లింగరూపమునన్నున శివుని నిత్యమూ అర్చించు స్త్రీలు శూద్రులు , చండాలురు, అంత్యకులజులు కూడా సర్వదు:ఖములమపశమింపజేయు శివుని పొందెదరు ఇది నిశ్చయము (116)

పశవోపి పరం యాతా: కిం పునర్మానుషాదయ:|| 117

యే ద్విజా బ్రహ్మచర్యేణ తప: పరమమాస్థితా:| వర్షైరనేకైర్యజ్ఞానాం తేzపి స్వర్గపరాzభవన్‌ || 118

జ్యోతిష్టోమో వాజపేయో హ్యతిరాత్రాదయో హ్యమీ| యజ్ఞా:సర్వా: ప్రయచ్ఛన్తి సత్త్రిణా నాత్రసంశయ:|| 120

పతితానాం చ సంసారే దైవాద్బుద్ది: ప్రజాయతే | గుణత్రయమయీ విప్రాస్తాసు తాస్విహ యోనిషు|| 121

యథా సత్త్వం సంభవతి సత్త్వయుక్తభవం నరా: రాజసాశ్చ తథా జ్ఞేయాస్తామసాశ్ఫైవ తే ద్విజా: 122

ఏవం సంసారచక్రేస్మిన్భ్రమితా బహవో జనా: | యదృచ్చయా దైవగత్యా శివం సంసేవతే నర:||123

శివధ్యానపరాణాం చ నరాణాం యతచేతసామ్‌ | మాయానిరసనం సద్యో భవిష్యతి న చాన్యథా|| 124

పశువులు కూడా పరమును పొందెదరనిన ఇక మానవాదుల గూర్చి చెప్పేదేమి? (117) ఏ బ్రాహ్మణులైతే బ్రహ్మచర్యముతో గొప్ప తపస్సు నాచరించారో అనేక సంవత్సరాలు యజ్ఞముల నాచరించారో వారంతా స్వర్గమును పొందిరి (118) జ్యోతిష్టోమము, వాజపేయము, అతిరాత్రము మొదలైన యజ్ఞములన్నీ యజ్ఞముచేయువారలకు స్వర్గమునిచ్చుననుటలో సంశయములేదు. (119) స్వర్గమున స్వర్గ సుఖమును అనుభవించి పుణ్యము తరిగిపోగా యజ్ఞము చేయువారందరూ మరల మర్త్యలోకమున పడుదురు(120)

సంసారమున పడినవారికి దైవము వలన బుద్ది ఏర్పడును. ఆయా యోసులయందు గుణత్రయముతో గూడినదీ బుద్ది.(121) సత్త్వముతో కూడినపుడు నరులు సత్త్వముతో కూడిన సంసారమును అట్లే రాజసమును , తామసమును పొందుదురని తెలియవలయు, (122) ఈ విధంగా సంసారచక్రమున ఎందరో జనులు భ్రమించారు యదృచ్చచేత, దైవగతి చేత నరుడుశివుని బాగుగా సేవించును. (123) మాయ తొలగుట అనునది మనస్సును అదుపులో వుంచుకొని శివధ్యానమే పరాయణముగా నమ్మువారలకు తక్షణమే కలుగును, వేరోక విధముగా కాదు (124)

మాయానిరసనాత్సద్యో నశ్యత్యేవ గుణత్రయమ్‌ | యదా గుణత్రయాతీతో భవతీతి స ముక్తిభాక్‌ || 125

తస్మాల్లింగార్చనం భావ్యం సర్వేషామపి దేహినామ్‌ | లింగరూపీ శివో భూత్వా త్రాయతే సచారచరమ్‌|| 126

పురా భవద్భి: పృష్టోహం లింగరూపీ కథం శివ:| తత్సర్వం కథితం విస్రా: యాథాతథ్యేన సంప్రతి || 127

కథం గరం భక్షితవాంచివో లోకమహేశ్వర : తత్సర్వం శ్రూయతాం విప్రా యథావత్కథయామి వ: || 128

ఇతి శ్రీ స్కాందమహాపురాణ మాహేశ్వరఖండే

కేదారఖండే శివలింగార్చన మాహాత్మ్యకథనే శ్రీ రామావతారవర్ఱనం నామ అష్టమోధ్యాయ:

మాయతొలగగా వెంటనే మూడుగుణములు నశించును అవి నశించగా ఎవడు గుణములు కతీతుడో అతడు ముక్తిని పొందును. (125) కనుక జీవులందరికీ లింగార్చనము తప్పనిసరి శివుడు లింగరూపియై చరాచరమునంతా రక్షంచును (126) ముందు మీరు నన్ను శివుడు లింగ రూపమునెట్లు పొందెనని అడిగితిరి. ఓ బ్రాహ్మణులారా అదంతా వున్నదున్నట్లుగా ఇపుడు చెప్పబడినది.(127) లోకములకు గొప్ప ప్రభువైన శివుడు విషమునెట్లు భక్షించెనో యథాతథంగా మీకు చెప్పెదను వినుడు (128)

శ్రీ స్కాందపురాణములోని మాహేశ్వరఖండమునందలి కేదారఖండమున

శివలింగార్చనమాహాత్మ్యమున రామావతారవర్ణన అను ఎనిమిదవ అధ్యాయము

నవమోధ్యాయ:

లోమశ ఉవాచ:

ఏకదా తు సభామధ్యే ఆస్థితో దేవరాట్‌ స్వయమ్‌| లోకపాలై: పరివృతో దేవైశ్చ ఋషిభిస్తథా|| 1

అప్సరోగణసంవీతో గంధర్వైశ్చ పురస్కృత:| ఉపగీయమానవిజయ : సిద్దవిద్యాధరైరపి|| 2

తదా శిషై#్వ: పరివృతో దేవరాజగురు :సుధీ: | ఆగతో సౌ మహాభాగో బృహస్పతిరుదారధీ:||3

తం దృష్ట్యా సహసా దేవా: ప్రణము: సముపస్థితా :| ఇంద్రోపి దదృశే తత్ర ప్రాప్తం వాచస్పతిం తదా || 4

నోవాచ కించిద్దుర్మేధా వచో మానపుర:సరమ్‌ | నాహ్వానం నాసనం తస్య న విసర్జనమేవ చ|| 5

శక్రం ప్రమత్తం జ్ఞాత్వాథ మదాద్రాజ్యస్య దుర్మతిమ్‌| తిరోధానమునుప్రాప్తో బృహస్పతీ రుషాన్విత:|| 6

తొమ్మిదవ అధ్యాయము

లోమశుడు చెప్పెను:

ఒకమారు దేవరాజైన ఇంద్రుడు లోకపాలురతో , దేవతలతో , ఋషులతో, అప్సరసల గణములతో , గంధర్వులతో కూడి సభామధ్యమున ఉండెను,(1) గంధర్వులు ముందిండి ఆప్సరసలు వీచుచుండ సిద్దులు, విద్యాధరులు విజయమును గానము చేయుచుండగా (ఉండెను) (2) అపుడు దేవతల రాజుకి గురువు విజ్ఞుడు ఉదారమగు బుద్దిగల మహానుభావుడైన బృహస్పతి శిష్యులతో అక్కడికి వచ్చెను(3) అతనిని చూచి దేవతలంతా ఒక్కమారుగా అతనిని చేరి ప్రణామము చేసిరి అపుడు ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చిన బృహస్పతిని చూచెను. (4) కాని చెడుబుద్దిగలగి,గౌరవపూర్వకంగా ఏమీ పలుకలేదు. ఆహ్వనము లేదు విసర్జనమూ లేదు(5) రాజ్యము యొక్క మదముతో ఇంద్రుడు చెడుబుద్దిగలగి ప్రమాదము నాచరించుచున్నట్లుగా తెలిసి బృహస్పతి కోపముతో వెనుదిరిగెను (అంతర్హితుడాయెను) (6)

గతే దేవగురౌ తస్మిన్విమనస్కాభవన్‌ సురా:| యక్షా నాగా: సగంధర్వా ఋషయోపి తథా ద్విజా:|| (7)

గాంధర్వస్యావసానే తు లబ్దసంజ్ఞో హరిస్సురాన్‌ | పప్రచ్ఛ త్వరితేనైవ క్వ గతో హి మహాతపా:|| 8

తదైవ నారదేనోక్త : శక్రో దేవాధిపస్తదా| త్వయా కృతా హ్యవజ్ఞా చ గురోర్నాస్త్యత్ర సంశయ:|| 9

గురోరవజ్ఞయా రాజ్యం గతం తే బలసూదన | తస్మాత్‌ క్షమాపనీయోసౌ సర్వభావేన హిత్వయా|| 10

ఏతచ్చృత్వా వచస్తస్య నారదస్య మహాత్మన :| అసనాత్సహసోత్థాయ తై: సర్వై: పరివారిత:|| ఆగచ్ఛత్త్వరయా శక్రో గురోర్గేహమతంద్రిత:|| 11

ఆ దేవగురువట్లు వెళ్ళిపోగా దేవతలు, యక్షులు, నాగులు, గంధర్వులు, ఋషులు కూడా కలతపడిన మనసుగలవారైరి.(7) గంధర్వుల ఆ ప్రదర్శనము ముగియగానే ఇంద్రుడు స్పృహలోకి వచ్చి త్వరగా నడిగెను ఆ గొప్ప తపస్సుగల (దేవగురువు) ఎక్కడకు వెళ్ళెను? (8) అపుడు నారదుడు ఇంద్రునితో అనెను. నిస్సందశయముగా నీవుగురువునవమానించితివి. (9) గురువుయొక్క అవమానముచేత నీరాజ్యముపోయినది బల అను రాక్షసుని చంపిన ఇంద్రా! కనుక నీవే అన్నివిధాలుగా (బృహస్పతిని) మన్నించునట్లు జేయవలె (10) మహాత్ముడైన నారదుని మాటలనువిని ఇంద్రుడు ఒక్కమారుగా అసనమునుండి లేచి వారందరితో కలిసి ఆలస్యములేకుండా త్వరగా గురువు యొక్క ఇంటికేతెంచెను. (11)

పృష్ట్వా తారం ప్రణమ్యాదౌ క్వ గతో హి మహాతపా: న జానామీత్యువాచేదం తారా శక్రం నిరీక్షతీ|| 12

తదా చింతాన్వితో భూత్వా శక్ర: స్వగృహమావ్రజత్‌ | ఏతస్మిన్నంతరే స్వర్గే హ్యరిష్టాన్యద్బుతాని చ || 13

అభవన్‌ సర్వదు:ఖార్ధే శక్రస్య చ మహాత్మన: పాతాళ##స్థేన బలినా జ్ఞాతం శక్రస్య చేష్టితమ్‌ || 14

య¸° దైత్యై: పరివృత: పాతాళాదమరావతీమ్‌| తదా యుద్దమతీవాసీద్దేవానాం దానవై: సహ|| 15

ముందు నమస్కరించి తారను ప్రశ్నించెను ఆ గొప్ప తపస్సుగల (దేవగురువు) ఎక్కడ? అనగా ఇంద్రుని చూచి తార నాకు తెలియదని చెప్పెను(12) అపుడు ఇంద్రుడు చింతతో తన ఇంటికి వచ్చెను ఈ మధ్యలో స్వర్గములో అరిష్టములు, అద్భుతములు జరిగినవి (13) ఇంద్రుడికి అందరికీ దు:ఖమును కలిగించుచూ జరిగినవి. పాతాళమున నున్న బలి ఇంద్రుడు చేసిన దానినెఱిగెను. (14) దైత్యులతో గూడి పాతాళమునుండి అమరావతికి వెళ్ళగా , దేవతలకు, దానవులతో గొప్ప యుద్దమపుడు జరిగెను.(15)

దేవా: పరాజితా: దైత్యై రాజ్యం శక్రస్య తత్‌క్షణాత్‌ | సంప్రాప్తం సకలం తస్య మూఢస్య చ దురాత్మన:|| 16

నీతం సర్వప్రయత్నేన పాతాళం త్త్వరితం గతా:| శుక్రప్రసాదాత్తే సర్వే తథా విజయినో భవన్‌|| 17

శక్రోపి ని:శ్రికో జాతో దేవైస్యక్తస్తతో భృశమ్‌|| దేవీ తిరోధానగతా బభూవ కమలేక్షణా|| 18

ఐరావతో మహానాగస్తథైవోచ్చైశ్రవో హయ:| ఏవమాదీని రత్నాని అనేకాన్యపి బహుని|| 19

నీతాని సహసా దైత్యైర్లోభాదసాధువృత్తిభి:||

పుణ్యభాంజి చ తాన్యేవ పతితాని చ సాగరే| తదా స విస్మయావిష్టో బలిరాహ గురుం ప్రతి|| 20

దేవతలు ఓడింపబడిరి మూఢుడైన ఇంద్రుని రాజ్యమును తక్షణమే దైత్యులు పొందిరి (16) సర్వ ప్రయత్నముచే పాతాళనమునకు తీసుకొని వెళ్ళిరి. శుక్రుని అనుగ్రహముచేత వారందరూ విజయము నొందిరి (170) ఇంద్రుడు కూడా వైభవమును కోల్పోయి దేవతల చేత విడవబడిన వాడాయెను దేవి (శచీదేవి) అంతర్హితురాలయెను (18) గొప్ప ఏనుగైన ఐరావతము, ఉచ్త్చెశ్రవమను అశ్వము ఇలాంటి పెక్కు ఇతర రత్నములను దైత్యులు చెడుప్రవృత్తి గలిగిలోభమవలన ఒక్కమారుగా తీసుకొనివెళ్ళిరి,(19)పుణ్యములైన అవన్నీ సముద్రములో పడిపోగా, విస్మయమునొంది బలి గురువుతో ననెను (20)

దేవాన్నిర్జిత్య చాస్మాభిరానీతాని బహుని చ | రత్నాని తు సముద్రేథ పతితాని తదద్భుతమ్‌|| 21

బలేస్తద్వచనం శ్రుత్వా ఉశనా ప్రత్యువాచ తమ్‌| అశ్వమేధశ##తేనైవ సురరాజ్యం భవిష్యతి|| దీక్షితస్య న సందేహస్తస్మాద్భోక్తా స ఏవ చ|| 22

అశ్వమేధం వినా కించిత్స్వర్గం భోక్తుం న పార్యతే || 23

గురోర్వచనమాజ్ఞాయ తూష్ణీంభూతో బలిస్తత:| బభూవ దేవై : సార్థం చ యథోచితమకారయత్‌ || 24

ఇంద్రోపి శోచ్యతాం ప్రాప్తో జగామ పరమేష్ఠినమ్‌| విజ్ఞాపయామాస తథా సర్వం రాజ్యభయాదికమ్‌ || 25

శక్రస్య వచనం శ్రుత్వా పరమేష్టీ ఉవాచ హ|| 26

దేవతలను జయించి మేము తెచ్చిన పెక్క రత్నములు సముద్రములో పడిపోయినవి ఇదిఅద్బుతము (21) బలియొక్క మాటలను విని శుక్రాచార్యుడు బదులు పలికెను. దీక్షితుడికి అశ్వమేధములు నూటిచే (నూరుఅశ్వమేధములచే) దేవతల రాజ్యమేర్పడును. కాన అతనే భోక్త (అనుభవించువాడు) (22) అశ్వమేధము దక్క స్వర్గమును పొందుటకు ఏదీ సమర్థము కాజాలదు (23) గురువుయొక్క మాటను తెలిసి బలి మౌనము వహించెను. దేవతలతో కలిసి ఉచితమైనది చేసెను. (24) ఇంద్రుడు కూడా దీనుడై బ్రహ్మ ను చేరెను. రాజ్యము యొక్క భయము మొదలైనవానినంతా తెలియజేసెను. (25) ఇంద్రుని మాటను విని బ్రహ్మ ఇట్లు పలికెను. (26)

సంమిళిత్వా సురాన్‌ సర్వాంస్త్వయా సాకం త్వరాన్వితా :| ఆరాధనార్థం గచ్చామో విష్ణుం విష్ణుం సర్వేశ్వరేశ్వరమ్‌ || 27

తథేతి గత్వా తే సర్వే శక్రాద్యా లోకపాలకా:| బ్రహ్మాణం చ పురస్కృత్య తటం క్షీరార్ణవస్య చ ||

ప్రాప్యోపవిశ్వ తే సర్వే హరిం స్తోతుం ప్రచక్రము:|| 28

మనమంతా (నీతో సహా) దేవతలందరితో కలిసి సర్వేశ్వరులకీశ్వరుడైన విష్ణువుయొక్క ఆరాధన కొఱకు వెళ్ళెదము.(27) అట్లే అని ఇంద్రుడు మొదలైన లోకపాలకులంతా బ్రాహ్మను ముందుంచుకొని పాలకడలి తీరమును చేరి, కూర్చుని విష్ణువును స్తుతించుటకు మొదలిడిరి (28)

బ్రహ్మోవాచ:

దేవ దేవ జగన్నాథ సురాసురనమస్కృత | పుణ్యశ్లోకావ్యయానంత పరమాత్మన్నమోస్తు తే|| 29

యజ్ఞోసి యజ్ఞరూపోసి యజ్ఞాంగోసి రమాపతే| తత్యోద్య కృపయా విష్ణో దేవానాం వరదో భవ|| 30

గురోరవజ్ఞయా చాద్య భ్రష్టరాజ్య: శతక్రతు: | జాత: సురర్షిభి:సాకం తస్మాదేనం సముద్దర || 31

బ్రాహ్మ పలికెను: దేవదేవా! జగన్నాథా! సురలచే, అసురలచే నమస్కరింపబడినవాడా! పుణ్యచరిత్రగలవాడా! వ్యయము లేనివాడా! అంతము లేనివాడా! పరమాత్మానీకు నమస్కారము(29) నీవు యజ్ఞము, యజ్ఞరూపము, యజ్ఞాంగముకూడా, ఓ లక్ష్మీనాథా! కనుక కృపచేత దేవతలకు వరమునిచ్చువాడవు కమ్ము (30)గురువు నవమానించినందున ఇంద్రుడీనాడు రాజ్యమును కోల్పోయినాడు కనుక దేవర్షులతో సహ ఇతనిని నీవు ఉద్దరింపుము.(31)

శ్రీ భగవానువాచ:

గురోరవజ్ఞయా సర్వం నశ్యతీతి కిమద్భుతమ్‌ | యే పాపినో హ్యధర్మిష్ఠా: కేవలం విషయాత్మకా:|

పితరౌ నిందితౌ యైశ్చ నిర్దైవాస్తే న సంశయ:|| 32

అనేన యత్కృతం బ్రహ్మన్‌ సద్యస్తత్ఫలమాగతమ్‌ | కర్మణా చాస్య శక్రస్య సర్వేషాం సంకటాగము: ||33

విపరీతో యదా కాల: పురుషస్య భ##వేత్తదా| భూవేత్తదా | భూతమైత్రీం ప్రకుర్వన్తి సర్వకార్యార్థసిద్ధయే || 34

తేన వై కారణనేంద్ర మదీయం వచనం కురు | కార్యహేతోస్త్వయా కార్యో దైత్త్యే:సహ సమాగమ:|| 35

ఏవం భగవతాదిష్ట| శక్ర :పరమబుద్దిమాన్‌ | అమరావతీం య¸° హిత్వా సుతలం దేవతై: సహ||36

శ్రీ భగవానుడనెను: గురువునవమానించుటచే అంతా నశించుననుటలో అద్బుతమేమున్నది? ఎవరు పాపులో అధర్మమాచరించువారో, కేవలం విషయముల గ్రహించువారో, తల్లిదండ్రుల నిందించువారో, వారు నిస్సందేహముగా దైవమునకు దూరమగుదురు.(32) ఓ బ్రహ్మ ! ఇతను చేసిన పనికి తక్షణ ఫలితము లభించినది. ఇంద్రుని పని వలన అందరికీ కష్టమొచ్చినది (33)పురుషుడికి విపరీతమైన కాలము వచ్చినపుడు అన్ని పనులు సిద్దించడానికి భూతమైత్రిని అవలంబించును.(34) ఓ ఇంద్రా! ఆకారణముచేత నేను చెప్పినట్లు ఆచరించుము. దైత్యులతో సహ కలియుటయే ఇప్పుడు చేయదగిన పని. (35) ఇట్లు భగవంతుడాదేశింపగా పరమ బుద్దిమంతుడైన ఇంద్రుడు సుతలమును వదలి దేవతలతో సహ అమరావతికి వెళ్ళను (36)

ఇంద్రం సమాగతం శ్రుత్వా ఇంద్రసేనో రుషాన్విత:| బభూవ సహ సైన్యేన హంతుకామ: పురందరమ్‌ || 37

నారదేన తదా దైత్యా బలిశ్చ బలినాం వర: | నివారితస్తద్వధాచ్చ వాక్యైరుచ్చావచైస్తథా|| 38

ఋషేస్తసై#్యవ వచనాత్త్యక్తమన్యుర్బలిస్తదా| బభూవ సహ సైన్యేన ఆగతో హి శతక్రతు: ||39

ఇంద్రసేనేన దృష్టోసౌ లోకపాలై: సమావృత: సమావృత: ఉవాచ త్వరయా యుక్త: ప్రవాసన్నివ దైత్యరాట్‌|| 40

కస్మాదిహాగత: శక్ర సుతలం ప్రతి కథ్యతామ్‌ | తసై#్యతద్వచనం శ్రుత్వా స్మయమాన ఉవాచ తమ్‌|| 41

ఇంద్రుడు వచ్చినట్లు విన్న ఇంద్రసేనుడు (బలి) కోపగించి సైన్యముతో సహా ఇంద్రుని వధించుటకు సిద్దమాయెను. (37) అపుడు నారదుడు రకరకాల మాటలతో బలిని, దైత్యులను ఇంద్రుని వధనుండి మరలింపజేసెను. (38) నారదుని మాటలవలన బలికోపమును వదలి వుండగా, ఇంద్రుడు సైన్యముతో వచ్చెను.(39) లోకపాలురతోకూడివున్న ఇంద్రుని చూచి త్వరగా బలి నవ్వుతూ ఇట్లనెను. (40) ఓ ఇంద్రా! సుతలమునుండి ఇక్కడికి రావడమెలాజరిగినది. చెప్పుమనిన విని విస్మయమునొంది అతనితో నిట్లనెను. (41)

వయం కశ్యపదాయాదా యూయం సర్వే తథైవ చ| యథా వయం తథా యూయం విగ్రహో హి నిరర్థక || 42

మమ రాజ్యం క్షణనైవ నీతం దైవవశాత్త్యయా | తథా హ్యేతాని రత్నాని సుబహున్యపి|| గతాని తక్ష్కణాదేవ యత్నానీతాని వై త్వయా|| 43

తస్మాద్విమర్శ: కర్తవ్య: పురుషేణ విపశ్చితా| విమర్శాజ్ఞాయతే జ్ఞానం జ్ఞానాన్మోక్షో భవిష్యతి ||44

కింతు మే బత ఉక్తేన జ్ఞానేన చ తవాగ్రత: | శరణార్థీ హ్యహం ప్రాప్త: సురైస్సహ తవాన్తికమ్‌ || 45

మేము కశ్యపుని సపిండులము (దాయాదులము) మీరంతా కూడా ఇట్లే మేమెట్లో మీరునూ అట్లే యుద్దము అర్థములేనిది (42) దైవ వశంచేత క్షణంలో నా రాజ్యం నీదైనది. అలాగే అనేకంగా వున్న ఈ రత్నాలు కూడా ప్రయత్నముచేత నీవైనవి.(43) కనుక బుద్దిమంతుడైన పురుషుడు విమర్శించవలెను. దానిచే జ్ఞానము, జ్ఞానముచే మోక్షము కలుగును (44)కానీ నేను ఆ చెప్పిన జ్ఞానముచేతనే శరణము కలసి నీవద్దకు వచ్చితిని.(45)

ఏతచ్ర్ఛత్వా తు శక్రస్య వాక్యం వాక్యవిదాం వర:|| ప్రహస్యోవాచ మతిమాంఛక్రం ప్రతి విదాం వర:|| 46

త్వమాగతోసి దేవేంద్ర కిమర్థం తన్న వేద్మ్యమమ్‌ || 47

శక్రస్తద్వచనం శ్రుత్వా హ్యశ్రుపూర్ణాకులేక్షణ :| కించిన్నోవాచ తత్రైనం నారదో వాక్యముబ్రవీత్‌|| 48

బలే త్వం కిం న జానాసి కార్యకార్యవిచారణామ్‌| ధర్మో హి మహతామేష శరణాగతపాలనమ్‌ || 49

శరణాగతం చ విప్రం చ రోగిణం వృద్దమేవ చ | య ఏతాన్న చ రక్షంతి తే వై బ్రహ్మహణో నరా:|| 50

శరణాగతశ##బ్దేన ఆగతస్తవ సన్నిధౌ| సంరక్షణాయ యోగ్యశ్చ త్వయా నాస్త్యత్ర సంశయ:|| ఏవముక్తో నారదేన తదా దైత్యాధిపతి: స్వయమ్‌|| 51

వాక్యజ్ఞానము గల వారిలో శ్రేష్ఠుడగు (బలి) ఇంద్రుని విని నవ్వి జ్ఞానవంతుడై ఇట్లనెను(46) దేవేంద్రా! నీవేకారణముచేత ఏతెంచినదీ నేనెఱుగను? (47) ఇంద్రుడా మాటనువిని ,కళ్ళనిండా నీరు నిండగా ఏమియూ పలుకకుండెను. అపుడు నారదుడిట్లు పలికెను.(48) ఓ బలీ! చేయదగినది చేయదగనిది నీవెఱుగవా? శరణుజొచ్చిన వారిని రక్షించుటయన్నది గొప్పవారి ధర్మము (49) శరణుజొచ్చిన బ్రాహ్మణుని, రోగిని, వృద్దుని ఎవరు రక్షించరో వారు బ్రహ్మహత్య చేసినట్లే(50) ఇంద్రుడు శరణుజొచ్చితిననుచూ నీ దగ్గరకు వచ్చెను. నిస్సంశయముగా నీచే రక్షింపబడవలెను. ఇట్లు నారదుడు పలుకగా దైత్యులరాజు స్వయముగా (విమర్శించు కొనెను) (51)

విమృశ్య పరయా బుద్ద్యా కార్యాకార్యవిచారణామ్‌ | శక్రం ప్రపూజయామాస బహుమానపుర:సరమ్‌ || లోకపాలై: సమేతం చ తథా సురగణౖ: సహ|| 52

ప్రత్యయార్థం చ సత్త్యాని హ్యనేకాని వ్రతాని వై| బలిప్రత్యయభూతని స చకార పురందర:|| 53

ఏవం స సమయం కృత్వా శక్ర: స్వార్థపరాయణ: | బలినా సహ చావాత్సీదర్థశాస్త్రపరో మహాన్‌ || 54

ఏవం నివసతస్తస్య సుతలేపి శతక్రతో :| వత్సరా బహనో హ్యోసన్‌ తదా బుద్దిమకల్పయత్‌ || 55

సంస్కృత్య వచనం విష్ణోర్విమృశ్య చ పున : పున: | ఏకదా తు సభామధ్య ఆసీనో దేవరాట్‌ స్వయమ్‌ | ఉవాచ ప్రవాసన్‌ వాక్యం బలిముద్దిశ్య నీతిమాన్‌ || 56

చేయదగినది, చేయదగనిది బాగుగా విమర్శించి బహుమానపూర్వకముగా లోకపాలురతో, దేవగణాలతో కూడిన ఇంద్రుని పూజించెను.(52) విశ్వాసముకై ఇంద్రుడు అనేక సత్త్వగుణప్రధానమగు వ్రతములను బలికి విశ్వాసము కలిగించు (విశ్వాసభూతములైన) వాని నాచరించెను. (53) స్వార్థమే పరమని తలిచే ఇంద్రుడు ఇట్లాచరించి, అర్థశాస్త్రపరుడుగాన బలితో కలిసి వసించెను.(54) ఇట్లు నివసిస్తున్న ఇంద్రుడు పెక్కు సంవత్సరాలు గడిపెను. విష్ణువు యొక్క మాటను గుర్తు తెచ్చుకొని మరల మరల విచారించి ఇట్లు వర్తించెను (55) ఒకనాడు సభా మధ్యలో ఆసీసుడై వున్న దేవ రాజైన ఇంద్రుడు బలినుద్దేశించి నవ్వుతూ ఇట్లనెను(56)

ప్రాప్తవ్యాని త్వయా వీర అస్మాకం చ త్వయా బలే | గజాదీని బహూన్యేవ రత్నాని వివిధాని చ|| 57

గతాని తత్‌క్షణాదేవ సాగరే పతితాని వై| ప్రయత్నో హి ప్రకర్తవ్యో హ్యస్మాభిస్త్వరాన్వితై:|| 58

తేషాం చోద్దరణ దైత్య రత్నానామిహ సాగరాత్‌| తర్హి నిర్మధనం కార్యం భవతా కార్యసిద్దయే|| 59

బలి: ప్రవర్తితస్తేన శ##క్రేణ సురసూదన: ఉవాచ శక్రం త్వరిత: కేనేదం మథనం భ##వేత్‌|| 60

తదా నభోగతా వాణీ మేఘ గంభీరని:స్వనా| ఉవాచ దేవా దైత్యాంశ్చ మంథధ్వం క్షీరసాగరమ్‌ || 61

భవతాం బలవృద్దిశ్ఛ భవిష్యతి న సంశయ: || 62

''ఓ బలీ! సముద్రములో పడిన మా ఏనుగులు మొదలైన పెక్కు రత్నాలు నీవు పొందవలెను (57) సముద్రములో పడిన ఆరత్నాలు పైకి తీయడంలో మనమంతా త్వరగా ప్రయత్నించెవలెను. వానిని తీయవలెనను కార్యము సిద్దించుటకు త్వరగా సముద్రమథనము చేయవలెను (58,59) ఇట్లు దేవతల బాధించు బలి ఇంద్రునిచే ప్రేరితుడై ఎవరీ మథనముజేతురని అడిగెను.(60) అపుడు ఆకాశమనుండి మేఘగంభీరమైన ధ్వని గల వాక్కు దేవతలను, దైత్యులను ఉద్దేశించి మీరు క్షీర సముద్రమును మధించుడు' అనినది(61) నిస్సంశయముగా మీ బలము కూడా పెరుగును. (62)

మందరం చైవ మంథానం రజ్జం కురత వాసుకిమ్‌| పశ్చాద్దేవాశ్చ దైత్యాశ్చ మేళయిత్వా విమథ్యతామ్‌ || 63

సభోగతాం చ తాం వాణీం నిశమ్యాథ తదా సురా:| దైత్యై: సార్థం తత: సర్వం ఉద్యమం చక్రురుద్యతా :|| 64

పాతాళాన్నిర్గతా: సర్వే తదా తేథ సురాసురా:| ఆజగ్మురతులం సర్వే మందరం పర్వతోత్తమమ్‌ ||65

దైత్యాశ్చ కోటిసంఖ్యాస్తథా దేవా న సంశయ:| ఉద్యుక్తా: సహసా ప్రాయుర్మందరం కనకప్రభమ్‌ || 66

నరత్నం వర్తులాకారం స్థూలం చైవ మహాప్రభమ్‌| అనేకరత్నసంవీతం నానాద్రుమనిషేవితమ్‌ || 67

చందనై: పారిజాతైశ్చ నాగపున్నాగచంపకై :| నానామృగగణాకీర్ణం సింహశార్దూలసేవితమ్‌|| 68

ఏవంవిధం మహాశైలం దృష్ట్యా తే సురసత్తమా: ఊచు : ప్రాంజలయస్సర్వే తదా తే సురసత్తమా:|| 69

'మందరపర్వతమును కవ్వముగా , వాసుకిసర్పమును త్రాడుగా చేసుకొనుడు. తరువాత దేవతలు దైత్యులు కలసి చిలుకుడు '(63) ఆకాశమునుండి వచ్చిన ఆ వాక్కునివిని దేవతలపుడు దైత్యులతో కలిసి సన్నద్దులై ప్రయత్నము మొదలిడిరి.(64)సురాసురులపుడు పాతాళమునుండి బయల్వెడలి ఉత్తమము, అసమానమూ ఐనదగు మందరపర్వతమునుచేరిరి.(65) కోటి సంఖ్యలో దైత్యులు అదే సంఖ్యలో దేవతలు ఉద్యుక్తులై ఒక్కమారుగా బంగారు వన్నెలీను మందరమును చేరిరి. (66) (ఆమందరము) రత్నములు గలది. వర్తులాకారము గలది, స్థూలమై గొప్ప కాంతిగలది. అనేక రత్నముల గలది, పెక్కు వృక్షములచేత సేవింపబడినది(67)చందనములు, పారిజాతములు, నాగవున్నాగ చంపకాది వృక్షములు గలది, అనేక మృగముల చేత కూడినది,సింహములు, శార్దూలములచే సేవింపబడినది (అయివుండెను) (68) ఇట్టి ఆ పర్వతమును చూచి దేవతాశ్రేష్ఠులు, అసురశ్రేష్ఠులు చేతులు జోడించి ఇట్లనిరి.(69)

దేవా ఊచు:

అద్రే సురా వయం సర్వే విజ్ఞప్తుమిహ చాగతా: | తచ్ఛృణుష్వ మహాశైల పరేషాముపకారక:|| 70

ఏవముక్తస్తదా శైలో దేవైర్దైత్యై: స మందర :| ఉవాచ ని:సృతో భూత్వా పరం విగ్రహవాన్‌ చల:|| 71

తేన రూపేణ రూపీ స పర్వతో మందరాచల:| కిమర్ధమాగతాస్సర్వే మత్సమీపం తదుచ్యతామ్‌||72

తదా బలిరువాచేదం ప్రస్తావసదృశం వచ: | ఇంద్రోపి త్వరయా యుక్తో బభాషే సూనృతం వచ:|| 73

అస్మాభిస్సహకార్యార్దే భవ త్వం మందరాచల | అమృతోత్పాదనార్ధే త్వం మంథానం భవ సువ్రత || 74

తథేతి మత్వా తద్వాక్యం దేవానాం కార్యసిద్దయే | ఊచే దేవాసురాంశ్చేదమింద్రం ప్రతి విశేషత:||75

దేవతలు పలికిరి ఓ పర్వతమా! దేవతలము మేమంతా విజ్ఞాపన చేయుటకు ఇక్కడకు వచ్చితిమి. ఇతరులకుపకారము చేయు ఓ గొప్పశైలమా! అది వినుము (70) దేవతలు, దైత్యులట్లు చెప్పగా మందరము విగ్రహరూపములో బయటకు వచ్చి ఇట్లుపలికెను.(71) మీరంతా నా వద్దకేల వచ్చితిరి చెప్పండి(అనిన) (72)బలి అపుడు ప్రస్తావనగా చెప్పెను. ఇంద్రుడు కూడా త్వరగా సత్యమును చెప్పెను.(73) ఓ మందర పర్వతమా! మాతో సహా ఒక పని లో నీవూ వుండుము, అమృతమును పొందుటలో నీవు కవ్వము గమ్ము , ఓ మంచి చరితము గలవాడా!(74) అనిన అలాగేనని దేవతల పనిలో (మందరపర్వతము) దేవతలను, దైత్యులను ముఖ్యంగా ఇంద్రుడిని ఉద్దేశించి ఇట్లనెను.(75)

ఛేదితా చ త్వయా పక్షా వజ్రేణ శతవర్వణా | గస్తుం కథం సమర్దోహం భవతా కార్యసిద్దయే || 76

తదా దేవా సురాస్సర్వే స్తూయమానా మహాచలమ్‌| ఉత్పాటయేయురతులం మందరం చ తతోద్భుతమ్‌|| 77

క్షీరార్ణవం నేతుకామా హ్యశకాస్తే తతోభవన్‌ | పర్వత: పతిత: సద్యో దేవదైత్యోపరి ధృవమ్‌|| 78

కేచిద్భగ్నా: మృతా: కేచిత్కేచిన్మూర్ఛాపరాభవన్‌ | పరీవాదరతా: కేచిత్కేచిత్ల్కేశత్వమాగతా:|| 79

ఏవం భగ్నోద్యమా జాతా అసురా: సురదానవా: | చేతనాం పరమాంప్రాస్తుష్ఠువుర్జగదీశ్వరమ్‌ ||80

నూరు కణుపులు గల వజ్రముచేత నీవు రెక్కలను కత్తిరించితివి. నేనెట్లు మీ పని సిద్దించుటకై వెళ్ళగలను? (76) అపుడు దేవతలు, దైత్యులు అందరూ ఆ గొప్ప పర్వతమును స్తుతిస్తూఅసమానము, అద్భుతమూ అయిన పర్వతమును పెకిలించబోయిరి,(77) అపుడు ఆ పర్వతమును క్షీరసాగరము వద్దకు తెచ్చుటకు వారు అశక్తులైరి ఆపర్వతమొక్క మారుగా దేవదానవుల పై పడెను.(78)(దానిచే) కొందరు (అవయవములు)విరిగినవారు కొందరు ప్రాణములుకోల్పోయినవారు, కొందరు మూర్చనొందినవారు అయిరి. కొందరు ఆక్రోశమును పొందగా, కొందరు క్లేశమునొందిరి (79) ఇట్లు సురులు అసురులు తమ ప్రయత్నము విఫలము కాగా,గొప్ప చైతన్యాన్ని పొంది జగదీశ్వరుని స్తుతించిరి. (80)

రక్ష రక్ష మహావిష్ణో శరణాగతవత్సల | త్వయా తతమిదం సర్వం జంగమాజంగమం చ యత్‌|| 81

దేవానాం కార్యసిద్ద్యర్ధం ప్రాదుర్భూతో హరిస్తదా| తాన్‌ దృష్ఠ్యా సహపా విష్ణుర్గరుడోపరి సంస్థిత:|| 82

లీలయా పర్వతశ్రేష్ఠముత్తరోపయత్‌ క్షణాత్‌| గరుత్మతి తదా దేవ: సర్వేషామభయం దదౌ||83

తత ఉత్థాయ తాన్దేవాన్‌ క్షీరోదస్యోత్తరం తరుమ్‌| నీత్వా తం పర్వతం వృద్దం నిక్షిప్యాప్సు తతో య¸°|| 84

తదా సర్వే సురగణా: స్వాగత్య అసురై: సహ| వాసుకిం చ సమాదయ చక్రిరే సమయం చతమ్‌ ||85

'శరణుజొచ్చిన వారిని కాపాడు మహావిష్ణూ! రక్షించుము , చరాచర రూపములోని ఈ జగత్తు నీచేత విస్తరింపబడివున్నది'.(81) అపుడు దేవతల పనిమీద విష్ణువు ప్రాదుర్భవించెను. గరుడుని పై కూర్చున్న విష్ణువు వారందరినీ చూచి (82) ఒక్కమారుగా లీలగా ఆ ఉత్తమపర్వతరాజును తక్షణమే పైకి లేపినిలిపెను. అపుడు గరుత్మంతుని పై నుండి విష్ణువు అందరికీ అభయము నిచ్చెను.(83) తరువాత దేవతలు లేపి క్షీరసాగరము యొక్క ఉత్తరతటము (అవతల ఒడ్డుకు) తీసుకెళ్ళి ఆ పర్వతమును నీటిలో పడవైచి వెళ్ళిపోయెను.(84) అపుడు దేవతాగణములంతా అసురులతో కలిసి వాసుకినీ కూడా తీసుకోని (పూర్వము చేసినదే) ఆచరించిరి.(85)

మంథానం మంధరం చైవ వాసుకిం రజ్జుమేవ చ| కృత్వా సురాసురై: సర్వే మమంథు : క్షీరసాగరమ్‌|| 86

క్షీరాబ్దేర్మథ్మమానస్య పర్వతో హి రసాతలమ్‌ | గత : స తక్ష్కణాదేవ కూర్మో రమాపతి||

ఉద్దృతస్తత్ష్కణాదేవ తదద్భుతమివాభవత్‌|| 87

భ్రామ్యమాణస్తత: శైలో నోదిత : సురదానవై: భ్రమమాణో నిరాధారో బోధశ్చైవ గురుం వినా || 88

పరమాత్మా తదా విష్ణురాధారో మందరస్య చ | దోర్భిశ్చతుర్భిస్సంగృహ్య మమంథాబ్దిం సుఖావహమ్‌|| 89

తదా సురాసురా: సర్వే మమంథు :క్షీరసాగరమ్‌| ఏకీభూత్వా బలెనైవమతిమాత్రం బలోత్కటా:|| 90

మందరను కవ్వముగా, వాసుకిని త్రాడుగా చేసి దేవదానవులు అందరూ క్షీరసాగరాన్ని మథించిరి. అలా మథించుచుండగా పర్వతము రసాతలము చేరెను. తక్ష్కణమే విష్ణువు తాబేలుగా పర్వతమును అద్భుతముగా పైకిలేపేను. (87) ఆ పర్వతము దేవదానువులు తిప్పగా గురువులేని జ్ఞానమువలె నిరాధారముగా తిరుగుచుండెను.(88) అపుడు పరమాత్మ యగు విష్ణువే మందరపర్వతానికాధారమై తన నాలుగు భుజములతో దానిని పట్టుకొని క్షీరసాగరము సుఖముగా మథింపబడెను. (89) అపుడు దేవదానవులంతా కలిసి మిక్కిలి బలముతో క్షీరసాగరమును మథించిరి(90)

పృష్టకంఠోరుజాన్వంత: కమఠస్య మహాత్మన: తథాసౌ పర్వతశ్రేష్ఠో వజ్రసారమయో దృఢ:|| ఉభయోర్ఘర్షణాదేవ పడవాగ్నిస్సముత్థిత:|| 91

హలాహలం చ సంజాతం తద్థృష్ట్యా నారదేన హి| తతో దేవానువాచేదం దేవర్షిరమితద్యుతి :|| 92

న కార్యం మంథనం చాబ్దేర్భవద్భిరధునాఖిలై: ప్రార్థయధ్వం శివం దేవా: సర్వే దక్షస్య యాజనమ్‌| తద్విస్మృతిం చ వో యాతం వీరభ##ద్రేణ యత్కృతమ్‌ || 93

తస్మాచ్ఛివ: స్మర్యతాం చాశు దేవా: పర: పరాణామపి వా పరశ్చ | పరాత్పర: పరమానందరూపో యోగిధ్యేయో నిష్ర్పపంచో హ్యరుప:|| 94

మహాత్ముడైన కూర్మము యొక్క వీపు కంఠము, మోకాలు మధ్య ,అట్లే వజ్రసారమయము,దృడము అగు పర్వతము యొక్క అవయవముల రాపిడిచేత బడబాగ్ని జనించినది (ఎగిసినది)91 హలాహలము కూడా కలుగగా చూచిన దేవర్షినారదుడు మిక్కిలి కాంతి గలవాడై దేవతలతో ఇట్లనెను. (92) ఇప్పుడు మీరంతా సముద్రమును మథించరాదు. దేవతలారా మీరంతా శివుని ప్రార్థించుడు (దక్షుని యజ్ఞము, వీరభద్రుడొనరించినది మీరు మరిచితిరి (93) కనుక, శివుని వెంటనే స్మరించండి అతను అందరికంటే ఆవలనున్నవాడు, పరమానందరూపుడు, యోగులచేత ధ్యానింపబడయోగ్యుడు,వ్యక్తముకానివాడు,రూపములేనివాడు(94)

తే మథ్యమానాస్త్వరితా : దేవా: స్వాత్మార్థసాధనా:| అభిలాషపరాస్సర్వే న శృణ్వంతి యతో జడా:|| 95

ఉపదేశైశ్చ బహుభిర్నోపదేశ్యా: కదాచన| తే రాగద్వేషసంఘాతా: సర్వే శివపరాంజ్ముఖా:||96

కేవలోద్యమసంవీతా మమంథు: క్షీరసాగరమ్‌ | అతినిర్మథనాజ్ఞాతం క్షీరాబ్దేశ్చ హలాహలమ్‌|| 97

త్రైలోక్యదహనే ప్రౌఢం ప్రాప్తం హంతుం దివౌకస: అత ఊర్థ్వం దిశస్సర్వా వ్యాప్తం కృత్స్నం నభస్తలమ్‌ || గ్రసితుం సర్వభూతానాం కాలకూటం సమభ్యయాత్‌ || 98

దృష్ట్యా బృహంతం స్వకరస్థమోజసా తం సర్పరాజం సహ పర్వతేన || తత్రైవ హిత్వాపయయుస్తదానీం పలాయమానా హ్యసురైస్సమేతా:|| 99

తథైవ సర్వే ఋషయో భృగ్వాద్యాశ్శతశస్తత:| దక్షస్య యజనం తేన యథా జాతం తథాభవత్‌|| 100

తమ ప్రయోజనము సాధించుకనువారగు దేవతలు త్వరగా మధించుట మొదలిడిరి (95) కోరిక గలవారు,జడలు అయినందున వినరు వారికి పెక్కు ఉపదేశములనిచ్చి మార్గముచూపరాదు.(96) రాగ ద్వేషముల నెలవు, శివునికి పరాంగ్ముఖులగు వారంతా కేవల ప్రయత్నము గలిగి క్షీరసాగరమును మథించిరి.అతిగా మథించుటచేత క్షీరసాగరమునుండి హలాహలము పుట్టినది.(97) అది ముల్లోకములను దహింప సమర్ధమైనది దేవతల హింసింప ప్రాప్తించినది, అటు పై అన్నిదిక్కులను, ఆకాశలతలమును ,అన్ని భూతములను మింగివేయుటకు కాలకూటము బయల్వెడలినది. (98) శక్తిచే చాలా పెద్దనైనది తమ చేతిలో నుండుట జూచి, దేవతలు అసురులతో సహ వాసుకిని, మందరమును అక్కడే వదలి అపుడు పారిపోసాగిరి (99) అట్లే భృగువు మొదలైన వందలకొద్ది ఋషులు (పారిపోయిరి) దక్షుని యజ్ఞము ఎట్లా జరిగెనో అట్లే జరిగెను (100)

సత్యలోకం గతా స్సర్వే భృగుణా నోదితా భృశమ్‌| వేదవాక్యైశ్చ వివిధై: కాలకూటం ప్రశామ్యతి|| దేవా నాస్త్యత్ర సందేహ: సత్యం సత్యం వదామి వ:101

భృగుణోక్తం వచ: శ్రుత్వా కాలకూటవిషార్దితా:| సత్యలోకం సమాసాద్య బ్రహ్మాణం శరణం యయు:|| 102

తదా జాజ్జ్వల్యమానం వై కాలకూటం ప్రభోజ్జ్వలమ్‌ దృష్ట్యా బ్రహ్మాథ తాన్‌ దృష్ట్యా హ్యకర్మజ్ఞాన్‌ సురాసురాన్‌ | తేషాం శపితుమారేభే నారదేన నివారిత:|| 103

బ్రహ్మోవాచ:

అకార్యం కిం కృతం దేవా: కస్మాత్‌ క్షోభోయయుద్యత: ఈశ్వరస్య చ జాతోద్య నాన్యథా మమ భాషితమ్‌|| 104

తతో దేవై: పరివృతో వేదోపనిషదైస్తథా | నానాగమై: పరివృత: కాలకూటభయాద్య¸° ||105

తతశ్చింతాన్వితా దేవా: ఇదమూచు: పరస్పరమ్‌| అవిద్యాకామసంవీతా: కుర్యామ: శంకరం చ కమ్‌ || 106

భృగుమహర్షి చేత ప్రేరితులైన వారంతా సత్యలోకమును చేరిరి వివిధ వేదవాక్యములచేత కాలకూటము ప్రశమించును. దేవతలారా! ఇందు సందేహము లేదు నిజముగా సత్యమును పలుకుచున్నాను. (101) అని భృగువుపలుకగా విని కాలకూట విషముచేత బాధింపబడి సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను శరణుజొచ్చిరి (102) అపుడు మిక్కుటముగా జ్వలించు చున్నది,పైకెగయ జ్వాలలు గల కాలకూటమును చూచిన బ్రహ్మ దేవతలను జూచి కర్మతెలియనివారగు సురాసురులను శపింపబోగా నారదుడతనిని ఆపెను. (103) బ్రహ్మ పలికెను దేవతలారా! చేయగూడని పని ఏమి జరిగింది? దేనివలన ఈక్షోభ తలెత్తినది? ఈశ్వరునికిదెట్లు కలిగినది? నా పలుకులు వేరుగా కావు అనెను (104) అపుడు దేవతలతో వేదములు ఉపనిషత్తులతో,ఆగమములతో కలిసి బ్రహ్మ కాలకూటభయముచే వెళ్ళిపోయెను.(105) తరువాత చింతలో దేవతలు పరస్పరమిట్లనిరి. అవిద్య (ఆజ్ఞానము) కోరికలతో కూడుకున్న మనము ఎవరిని శంకరుని జేయవలెను? (106)

బ్రహ్మాణం చ పురస్కృత్య తదా దేవాస్త్వరాన్వితా : వైకుణ్ఠమవ్రజన్‌ సర్వే కాలకూటభయార్దితా:|| 107

బ్రహ్మాదయశ్చర్షిగణాశ్చ తదా పరేశం విష్ణుం పురాణ పురుషం ప్రభవిష్ణుమీశమ్‌ | వైకుణ్ఠమాశ్రితమధ్యోక్షజమాధవం తే సర్వేసురాసురగణా: శరణం ప్రయాతా:|| 108

తావత్ర్పబుద్దం సుమహత్కాలకూటం సమభ్యయాత్‌ | దగ్ద్వాదో బ్రహ్మణో లోకం వైకుణ్డం చ దదాహ వై|| 109

కాలకూటాగ్నినా దగ్థో విష్ణు: సర్వగుహాశయ: సార్షదై: సహిత: సద్యస్తమాలసదృశచ్ఛవి:|| 110

వైకుణ్ఠం చ సునీలం చ సర్వలోకై: సమావృతమ్‌| జలకల్మషసంవీతా: సర్వే లోకాస్తదాభవన్‌|| 111

అష్టావరణసంవీతం బ్రహ్మండం బ్రహ్మణా సహ| భస్మీభూతం చకారాశు జలకల్మషమద్బుతమ్‌ || 112

నో భూమిర్నజలం చాగ్నిర్న వాయుర్నభస్తదా| నాహంకారో న చ మహాన్మూలావిద్యా తథైవ చ|| శివస్య కోపాత్సంజాతం తదా భస్మాకులం జగత్‌|| 113

ఇతి శ్రీ స్కాందమహాపురాణ మాహేశ్వరఖండే

కేదారఖండే నవమోధ్యాయ:

అపుడు దేవతలు బ్రహ్మను ముందుచుకొని త్వరగా కాలకూటభయముచేత పీడింపబడి వైకుణ్ఠమును జేరిరి, (107) అపుడు బ్రహ్మమొదలగు దేవతలు, ఋషిగణములు, సురాసురగణములన్ని విష్ణువుని , పురాణపురుషుని, ప్రభవించువానిని , ఈశ్వరుని, వైకుణ్ఠమునననుండగా అధోక్షజుని, లక్ష్మీవల్లభుని శరణుజొచ్చిరి. (108) అంతలో ,గొప్పకాలకూటము పెల్లుబికి బ్రహ్మయొక్క లోకమును దహించి వైకుణ్ఠమును కూడా దహించివేసేను.(109) అందరి హృదయములయందుండు విష్ణువు అపుడు పార్షదులతో కూడినవాడై కాలకూటముచే దహింపబడి తమాలమువంటి ఛాయను పొందెను.(110) అన్ని లోకములతో కూడిన వైకుణ్ఠము మిక్కిలినీలముగానాయెను. జలకల్మషమైన కాలకూటముచే అన్ని లోకములు కప్పబడినవాయెను (111) ఆ కల్మషము, కాలకూటము ఎనిమిది ఆవరణలతో కూడిన బ్రహ్మండమును బ్రహ్మతో సహా దహించి బూడిద చేసెను, (112) అపుడు , భూమి, నీరు, నిప్పు, వాయువు,, ఆకాశము, అహంకారము, బుద్ది, మూలఅవిద్య ఏమియూ లేకుండెను శివుని కోపమువలన జగత్తంతా అపుడు భస్మమాయెను (113)

శ్రీ స్కాందపురాణమున మాహేశ్వర ఖండములోని

కేదార ఖండమందు తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

దశమోధ్యాయ:

మునయ ఊచు:

యత్త్వయా కథితం బ్రహ్మన్‌ బ్రహ్మండం సచరాచరమ్‌ | భస్మీ భూతం రుద్రకోపాత్కాలకూటాగ్ని నాఖిలమ్‌ ||1

బ్రహ్మాండాంతరత: కిం తు రుద్రం మన్యామహే వయమ్‌| తదా చరాచరం నష్టం బ్రహ్మవిష్ణుపురోగమమ్‌||2

భస్మీభూతం రుద్రకోపాత్కథం సృష్టి: ప్రవర్తితా | కుతో బ్రహ్మా చ విష్ణుశ్చ కుతశ్చేన్ద్రపురోగమా: 3

అన్యే సురాసురా: కుత్ర భస్మీభూతా లయం గతా :| అత ఊర్ద్వం కిమభవత్తత్సర్యం వక్తుమర్హసి|| 4

వ్యాసప్రసాదాత్సకలం వేత్థ త్వం నాపరోహి తత్‌| తస్మాజ్ఞానమయం శాస్త్రం తజ్ఞానాసి న చాపర:||5

పదవ అధ్యాయము

మునులనిరి ఓ బ్రహ్మదేవా! (లోమశా) రుద్రుని కోపమునుండి జనించిన కాలకూటము యొక్క అగ్నిచేత చరాచరమైన బ్రహ్మాండమంతా భస్మముగా మారినదనీ నీవు చెబితివి (1) కాని మనము రుద్రుని బ్రహ్మాండము మధ్యనుండే భావించుచుంటిమి. అపుడు బ్రహ్మ, విష్ణు మొదలగా చరాచరమంతా నష్టమైనది(2) భస్మముగా రుద్రుని కోపమువల్ల మారినది,మరల సృష్టి ఎట్లేర్పడెను? బ్రహ్మ, విష్ణు, చంద్రుడు మొదలైన వారెక్కడినుండి ఏర్పడిరి? (3) మిగతా దేవదానవులు భస్మమై దేనియందు లయించిరి? అటు పై ఏమైనదో పూర్తిగా మాకు చెప్పటకు నీవే తగినవాడివి (4) వ్యాసుని అనుగ్రహం చేత నీవు దానినంతా ఎఱుగుదవు. వేరొకరుకాదు, కనుక నీవే జ్ఞానమయమగు శాస్త్రమును తెలిసినవాడవు వేరొకరుకారు (5)

ఇతి పృష్టస్తదా సర్వైర్మునిభిర్భావితాత్మభి:| సూతో వ్యాసం నమస్కృత్య వాక్యం చేదమబ్రవీత్‌|| 6

లోమశ ఉవాచ:

యదా బ్రహ్మండమధ్యస్థా వ్యాప్తా దేవా విషాగ్నినా| హరిబ్రహ్మదయో హ్యేతే లోకపాలా: సహసవా:|| తదా విజ్ఞాపితశ్శంభుర్హేరంబేన మహాత్మనా ||7

హేరంబ ఉవాచ:

హేరుద్ర హే మహాదేవ హే స్థాణో హే జగత్పతే | మయా విఘ్నం వినోదేన కృతం తేషాం సుదుర్జయమ్‌|| 8

భ##యేన మతిమోహాత్త్వాం నార్చయన్తి చ మామపి| ఉద్యోగం యే ప్రకుర్వన్తి తేషాం క్లేశోధికో భ##వేత్‌|| 9

ఏవమభ్యర్తితస్తేన పినాకీ వృషభధ్వజ:| విఘ్నాంధకారసూర్యేణ గణాధిపతినా తదా|| 10

పూజ్యాలగు మునులచేత ఆ విధముగా ప్రశ్నించబడిన సూతుడు వ్యాసునికి నమస్కరించి ఇట్లుపలికెను (6) లోమశుడు చెప్పెను| విషాగ్ని బ్రహ్మాండము మధ్యనున్న దేవతలను, ఇంద్రుడు మొదలగు లోకపాలకులును వారి, బ్రహ్మదులనంతా వ్యాపించినపుడు వినాయకుడు శివునికి ఇట్లు విజ్ఞాపనము చేసెను(7) హేరంబుడనెను 'ఓ రుద్రా! ఓ మహాదేవా! ఓ స్థాణూ'జగత్పతీ ! వినోదము కొఱకు నేనే జయింపవీలులేని విఘ్నమును కలిగించితిని,(8) భయముచేత , బుద్దిమోహము నొందుటచేత ఎవరు నిన్ను నన్నుగూడ పూజింపక ప్రయత్నము చేస్తారో వారికి అధిక్లేశము కలుగును.(9) ఇట్లు విఘ్నమనే చీకటికి సూర్యునివంటివాడగు గణాధిపతిచేత శివుడు అభ్యర్థించబడెను.(10)

లింగరూపోబ్రవీచ్ఛంభుర్నిరాకారో నిరామయ: | నిరంజనో వ్యోమకేశ: కపర్దీ నీలలోహిత:||11

మహేశ్వర ఉవాచ:

హేరంబ! శృణు మే వాక్యం శ్రద్దయా పరయా యుత: అహంకారాత్మకం చైవ జగదేతచ్చరాచరమ్‌|| 12

స్థితిం కరోత్యహంకార: ప్రళయోత్పత్తి మేవ చ | జగదాదౌ గణపతే తదా విజ్ఞప్తిమాత్రత:|| 13

మాయావిరహితం శాంతం ద్వైతాద్వైతపరంసదా | జ్ఞప్తిమాత్రస్వరూపం తత్సదానందైకలక్షణమ్‌ || 14

గణపతిరువాచ:

యది త్వం కేవలో హ్యాత్మా పరమానందలక్షణ :| తస్మాత్త్వదపరం కించిన్నాన్యదస్తి పరంతప|| 15

నానారూపం కథం జాతం సురాసురిలక్షణమ్‌ | విచిత్రం మోహజననం త్రిభిర్దేవైశ్చ లక్షితమ్‌|| 16

ఆకారములేనివాడు, దోషములు లేనివాడు, నిర్లిప్తుడు,ఆకాశ##మే కేశముగా గలవాడు, జటలుగలవాడు,నీలలోహితుడూనగు శివుడు లింగరూపుడై ఇట్లనెను.(11) వినాయకా! అమిత శ్రద్దతో నా మాటను మినుము, చరాచరజగత్తంతా అహంకార స్వరూపముగలది (12) అహంకారము సృష్టి , స్థితి, లయలకు , ఓ గణపతీ! జగదాదిన అది విజ్ఞప్తిమాత్రమున సృష్ట్యాదుల జేయును(13)మాయలేనిది, శాంతము, ధ్వైతము అద్వైతముల కంటే పరము, కేవల జ్ఞప్తియే నిజ్వరూపముగా గలది, అది సత్‌ ,అనందములే లక్షణముగా గలది(14) గణపతియనెను పరమానందమే లక్షణముగా గల నీవుకేవలుడవు ఆత్మవూ,కనుక నీకంటే వేరేదేదీలేనిచో ఓ రుద్రా! (15) సురాసుర విలక్షణమైనది విచిత్రమైనదిచ మోహమును కలిగించునది, ముగ్గురుదేవతలచే లక్షింపబడినదిదంతా ఎట్లు? (16)

భూతగ్రామైశ్చతుర్భిశ్చ నానాభేదైస్సమన్వితై: జాతం సంసారచక్రం చ నిత్యానిత్యవిలక్షణమ్‌ || 17

పరస్పరవిరోధేన జ్ఞానవాదేన మోహితా: | కర్మవాదరతా: కేచిత్కేచిత్స్యగుణమాశ్రితా:||18

జ్ఞాననిష్ఠాశ్చ యే కేచిత్పరస్పరవిరోధిన:| ఏవం సంశయమాపన్నం త్రాహి మాం వృషభధ్వజ|| 19

అహం గణశ్చ కుత్రత్యా: క్య చాయం వృషభ: ప్రభో| ఏతే చాన్యే చ బహవ: కుతో జాతాశ్చ కుత్ర వై|| 20

కృతా స్సర్వే మహాభాగా : సాత్త్వికా రాజసాశ్చ వై| ప్రహస్య భగవాన్‌ శంభుర్గణశం వక్తుముద్యత:|| 21

నానా భేదములతో కూడిన భూతముల నాలుగు సమూహములు గల ఈ నిత్య, అనిత్య రెంటికంటే విలక్షణమైన సంసార చక్రమెట్లు ఏర్పడినది?(17) పరస్పర విరోధముచే జ్ఞానవాదముచే మోహమునొందినవారు, కర్మవాదమునందాసక్తిగలవారు కొందరు, కొందరు తమగుణమునాశ్రయించినవారు (18) కొందరు జ్ఞాన నిష్ఠులై పరస్పర విరోధమునొందినవారు ఇట్లు సంశయమొందిన నన్ను కాపాడుము శివా! (19) నేను, ఈ గణము, వృషభము, ఇతరమైనదంతా ఎక్కడివారము? (20) సాత్త్వికులు, రాజసులుగా చేయబడినాము (అనగావిని) శివుడు నవ్వి గణశునితో నిట్లనెను(21)

మహేశ్వర ఉవాచ:

కాలశక్తా చ జాతాని రజ:సత్త్వతమాంసి చ | తైరావృతం జగత్సర్వం సదేవాసురమానుషమ్‌|| 22

పరిదృశ్యమానమేతచ్చానశ్వరం పరమార్థత:| విద్ధ్యేతత్సర్వసిద్థ్యేవ కృతకత్వాచ్చ నశ్వరమ్‌|| 23

లోమశ ఉవాచ:

యావద్గణశసంయుక్తో భాషమాణస్సదాశివ:| లింగరూపీ విశ్వరూప: ప్రాదుర్భూతా సదాశివాత్‌|| 24

శివరూపా జగద్యోని : కార్యకారణరూపిణీ| లింగరూపీ స భగవాన్నిమగ్నస్తత్ష్కణాదభూత్‌ ||25

ఏకా స్థితా పరా శక్తిర్భ్రహ్మవిద్యాత్మలక్షణా | గణశో విస్మయావిష్టో హ్యవలోకనతత్పర:|| 26

మహేశ్వరుడనెను రజస్సు, సత్త్వము,తమస్సు కాలమును శక్తిచే జనించినవి , దేవతలు, అసురులు, మానవులుగల జగత్తంతా వానిచే ఆవరింపబడినది,(22) నిజానికి కనబడుచున్నదంతా నశించునది. పూర్తిగా కృతకము (కృత్రిమము) అగుటచే ఇది నశించునది అని తెలుసుకొనుము. (23) లోమశుడు పలికెను లింగరూపియగు సదాశివుడు గణశునితో మాట్లాడుచుండగా, సదాశివుని నుండి జగత్తుకు కారణమైన, కార్యకారణరూపముగల, లింగరూపియగు పరాశక్తి ఉద్భవించెను.(25) లింగరూపియగు శివుడు తక్షణమే నిమగ్నమవగా, బ్రహ్మవిద్య మాత్రమే తన లక్షణమగు ఆ పరాశక్తి ఒకతే నిలిచెను, గణశుడు విస్మయముతో చూచుటయందే మునిగెను అని చెప్పెను. (26)

ఋషయ ఊచు:

ప్రకృత్యన్తర్గతం సర్వం .జగదేతచ్చరాచరమ్‌ | గణశస్య పృథక్త్వం చ కథం జాతం తదుచ్చతామ్‌|| 27

లోమశ ఉవాచ:

సాక్షాత్ర్పకృత్యా: సంభూతో గణశో భగవానభూత్‌ | యథారూప: శివ: సాక్షాత్తద్రూపో హి గణశ్వర:|| 28

శివేన సహ సంగ్రామో హ్యభూత్తస్య మహాత్మన: | అజ్ఞానాత్ర్పాకృతో భూత్వా బహుకాలం నిరన్తరమ్‌ || 29

తస్య దృష్ట్యా హ్యజేయత్వం గజారూఢస్య తత్తదా| త్రిశూలేనాహనచ్చంభు: సగజం తమపాతయత్‌|| 30

తదా స్తుతో మహాదేవ: పరశక్త్యా పరంతప:| పరశక్తిమువాచేదం వరం వరయ శోభ##నే|| 31

అపుడు ఋషులు ప్రకృతిలో అంతర్గతమైనదీ చరాచరజగత్తంతా అని అడిగిరి, మరి గణశుడు విడిగా వుండుటెట్లు జరిగినదో తెలుపుము అని అడిగిరి (27) లోమశుడనెను గణశుడు సాక్షాత్తు ప్రకృతి నుంచి సంభవించిన భగవంతుడు, శివుడే రూపముగలవాడో గణశుడు అదే రూపము గలవాడు (28) అజ్ఞానముచేత ప్రకృతికిలోబడిన గణశునికి శివునితో చాలాకాలము ఎడతెగకుండా యుద్దము జరినది. (29) గజము పై కూర్చున్న గణశుడపుడు జయింపబడలేకుండుటను జూచి శివుడు త్రిశూలముతో కొట్టి గజముతో సహా గణశుని పడవేసెను.(30) అపుడు పరాశక్తి అతని స్తుతింపగా, మహాదేవుడు, ఓ సుందరీ! పరమును కోరుము' అనెను (31)

తదా వృతో మహాదేవో వరేణ పరమేణ హి| యోయం త్వయా హతో దేవ మమ పుత్రో న సంశయ:|| 32

త్వాం న జానాత్యయం మూఢ: ప్రకృత్యంశసముద్భవ:| తస్మాత్పుత్రం జీవయేయం మమ తుష్ట్యర్థమేవ చ || 33

ప్రవాస్య భగవాన్రుద్రో మాయాపుత్రమజీవయత్‌ | సింధురవదనే నైవ ముఖే స సమయోజయత్‌|| 34

తదా గజాననో జాత: ప్రసాదాచ్చంకరస్య చ| మాయాపుత్రో పి నిర్మాయో జ్ఞానవాన్సంబభూవ హ|| 35

అపుడు (ఆ శక్తి) మహాదేవుని గొప్పవరము కోరినది నీచేత చంపబడిన ఇతనూ నా పుత్రుడే (32) ప్రకృతియొక్క అంశనుండి జనించిన మూఢుడు నిన్నెరుగడు, కనుక నా సంతోషమునకై పుత్రుని బ్రతికించుము (33) శివుడపుడు నవ్వి మాయయొక్క పుత్రుని బ్రతికించెను - ఏనుగుముఖమును అతను కలిపెను (34) అపుడు శివుని ప్రసాదముచేత గజాననుడు జన్మించెను. అతను మాయకు పుత్రుడై కూడా మాయలేనివాడు, జ్ఞానముకలిగిన వాడై వుండును(35)

అత్మజ్ఞానామృతేనైవ నిత్యతృప్తో నిరామయ: | సమాధిసంస్థితో రౌద్ర: కాలకాలాంతకోభూత్‌|'|36

యోగదండార్థముత్పాట్య స్వకీయం దశనం మహత్‌ | కరే గృహ్య గణాధ్యక్ష: శబ్దబ్రహ్మాతివర్తతే|| బుద్దిసిద్దిద్వయేనైవ ఏకత్వేన విరాజతే || 37

యే తే గణాశ్చ విఘ్నాశ్చ యే చాన్యేప్యధికా భువి | తేషామపి పతిర్జాత: కృతోసౌ శంభునా తదా|| 38

తస్మాద్విలోకయామాస ప్రకృతిం విశ్వరూపిణీమ్‌ | పృథక్‌ స్థిత్వాగ్రతో జానన్లింగం ప్రకృతిమేవ చ || దదర్శ విమలం లింగం ప్రకృతిస్థం స్వభావత:|| 39

ఆత్మానం చ గణౖ: సార్థం తథైవ చ జగత్త్రయమ్‌ | లీనం లింగే సమస్తం తద్థేరంబోజ్ఞానవానపి || 40

ఆత్మజ్ఞానమను అమృతముచేత ఎల్లప్పుడూ తృప్తినొందినవాడు, దోషరహితుడు. సమాధి యందుండువాడు, రౌద్రుడు, కాలకాలాంతకుడూ ఆయెను (36) యోగదండము కొఱకు తన దంతమును పెకిలించి (పెరికి) చేతిలో నుంచుకొనిన గణాధ్యక్షుడు, శబ్ద బ్రహ్మ నతిశయించును, బుద్ది, సిద్ది రెంటిచే ఒకటిగా ప్రకాశించును (37) భూమి పై నున్న గణాలు, విఘ్నాలు మొదలగువానికి శివునిచేత ఇతను ప్రభువుగా జేయబడెను(38) కనుక, అతను విశ్వరూపముననున్న ప్రకృతిని చూచెను. విడిగా నిలిచి, ఎదురుగా ప్రకృతిని, లింగమును తెలుసుకొనుచూ నిర్మలమైన లింగము ప్రకృతియందు స్వభావముచే నుండుట గాంచెను.(39) గణములతో సహ తాను, ముల్లోకములూ కూడా లింగమునందు అంతా లయించెను. జ్ఞానియగు హేరంబుడుకూడా (మోహమునొందెను) (40)

ముమోహ చ పునస్సంజ్ఞాం ప్రతిలభ్య ప్రయత్నత: | ననామ శిరసా తాభ్యామీశాభ్యాం స గణశ్వర :|| 41

తదా దదర్శ తత్రైవ లోకసంహారకారకమ్‌ | బ్రహ్మాణం చైవ రుద్రం చ విష్ణుం చైవ సదాశివమ్‌ || 42

దదర్శ ప్రేతతుల్యాని లింగశక్త్యాత్మకాని చ: బ్రహ్మాణ్డగోళకాన్యేవ కోటిశ: పరమాణువత్‌|| 43

లీయంతే చ విలీయన్తే మహేశే లింగరూపిణి | ప్రకృత్యన్తర్గతం లింగం లింగస్యాన్తర్గతా చ సా ||44

శక్త్యా లింగం చ సంఛన్నం తదా సర్వమదృశ్యత | లింగేన శక్తిస్సంఛన్నా పరస్పరమవర్తత|| 45

శివాభ్యాం సంశ్రితం లోకం జగదేతచ్చరాచరమ్‌ | గణశో వాపి తజ్ఞానం న పరోపి తథావిదన్‌ ||46

తదోవాచ మహాతేజా గణాధ్యక్షో గణౖస్సహ| సశక్తికం స్తయమాన: శక్త్యా చ పరయా తదా || 47

మోహము నొంది మరల ప్రయత్నముతో స్పృహను పొంది ఆ గణశ్వరుడు శివునికి శక్తికి శిరస్సు వంచి నమస్కరించెను (41) అపుడుఅక్కడే లోకముల సంహారమునకు కారణమును, బ్రహ్మను, రుద్రుని, విష్ణువును, సదాశివుని చూచెను. (42) ప్రేతములవంటి వానిని లింగము మరియు శక్తి స్వరూపముగా గలవానిని, పరమాణువు వంటి బ్రహ్మాణ్డ గోళములను కోట్లకోద్దీ చూచెను. (43) అవి లింగరూపముననున్న మహేశుని యందుకలిసిపోవుచూ మరల విడిపోవుచున్నవి. లింగము ప్రకృతి యందున్నది ప్రకృతి లింగముయుందున్నది అపుడు లింగముయుందున్నది (44) అపుడు లింగమంతా శక్తి చేతనే కప్పబడినట్లు కనబడినట్లు కనబడినది లింగముచేత శక్తి కప్పబడినది. ఇట్లు పరస్పరము వుండినవి. (45) చరా చరముగా కనబడు జగత్తంతా శివుడు మరియు శక్తి వీనిచే సంశ్రయింపబడివున్నది. ఆ జ్ఞానమును గణశుడు కాని ఇతరులుకాని తెలియలేదు. (46) అపుడు గొప్పశక్తి చే శక్తితో కూడివున్న శివుని తన గణములతో కలిసి స్తుతించుచూ వినాయకుడిట్లనెను.

(47)

గణశ ఉవాచ:

నమామి దేవం శక్త్యాన్వితం జ్ఞానరూపమ్‌ ప్రసన్నమ్‌ జ్ఞానాత్పరం పరమం జ్యోతిరూపమ్‌ |

రూపాత్పరం పరమం తత్త్వరూపం తత్త్వాత్పరం పరమం మంగళం చ ఆనందాఖ్యం నిష్కళం నిర్విషాదమ్‌ || 48

ధూమాత్పరమయో వహ్నిర్థూమవత్ర్పతిభాసతే | ప్రకృత్యవ్తర్గతస్త్వం హి లక్ష్యసే జ్ఞానసంభవ:|| ప్రకృత్యన్తర్గతస్త్వం హి మాయావ్యక్తిరితీర్యసే || 49

ఏవం విధస్త్వం భగవాన్‌ స్వమాయయా| సృజస్యథో లుంపసి పాసివిశ్వమ్‌ | అస్మాద్గరాత్యర్వమిదం ప్రసష్టం సబ్రహ్మవిప్రేంద్రయుతం చరాచరమ్‌ || 50

యథా పురాసీర్భగవాన్‌ మహేశ సై#్రలోక్యనాథోసి చరాచరాత్మా | కురుష్వ శీఘ్రం సహాజీవ కోశం చరాచరం తత్సకలం ప్రదగ్థమ్‌ || 51

గణశుడనెను శక్తితో కూడిన దేవుని, జ్ఞానమేరూపముగా గలవానిని, ప్రసన్నుని, జ్ఞానముకంటే పరముగా జ్యోతి రూపము దాల్చిన వానిని, ఆ రూపముకంటే పరముగా సత్‌ రూపమును, సత్‌రూపముకంటే పరముగా మంగళమును , ఆనందమను పేరు గలవానిని ,కళలను దాటిన వానినిచ దు:ఖభీజము లేని వానిని నమస్కరించుచున్నాను. (48) ధూమము చేత కప్పబడిన అగ్ని ధూమము వలెనే గోచరించును. జ్ఞానమునకు కారణమైన ప్రకృతిలో అంతర్గతునివలె కనబడుచున్నావు. ప్రకృతియందున్నందున్నందువలన నీవు మాయాపూర్వక వ్యక్తత గలవాడివిగా చెప్పబడుచున్నావు (49)ఇట్లుండిన నీవు ఓ భగవాన్‌ ! ఈ విశ్వమును సృజించుచున్నావు, పోషించుచున్నావు మరల నశింపజేయుచున్నావు. బ్రహ్మా, బ్రహ్మణ శ్రేష్ఠులు వీరందరితో సహా ఈ చరాచరవిశ్వమంతా ఈవిషముచేత నశించినది (50) ఓ మహేశా! నీవింతకు మునుపు ముల్లోకములకు నాథుడుగా ,చరాచరమే స్వరూపముగా గలవాడుగా, వుంటివి దహింపబడిన చరాచరమునంతా వెంటనే జీవకోశముతో సహ మరల చేయుము (సృజించుము) 51

లోమశ ఉవాచ:

ఏవం స్తుతో గణశేన భగవాన్భూతభావన :| యదుత్థితం కాలకూటం లోకసంహారకారకమ్‌ || 52

లింగరూపేణ తద్‌గ్రస్తం విమలం చాకరోత్తదా| సదేవాసురమర్త్యాశ్చ సర్వాణి త్రిజగన్తి చ|| తత్‌క్షణాద్రక్షితాన్యేవ కృపయా పరమాయుత :|| 53

బ్రహ్మా విష్ణుస్సురేంద్రశ్చ లోకపాలాస్సహర్షయ:| యక్షావిద్యాధరా: సిద్దాగంధర్వాప్సరసాంగణా:| ఉత్థితాశ్చైవ తే సర్వే నిద్రాపరిగతా ఇవ || 54

విస్మయేన సమావిష్టా బభూవుర్జాతసాధ్వసా :| సర్వే దేవాసురాశ్చైవ ఊచురాశ్చర్యవత్తత:|| 55

క్వ కాలకూటం సుమహద్యేన విద్రావితా వయమ్‌ | మృతుప్రాయా: కృతస్సద్యస్పలోకపాలకా హ్యామీ || 56

లోమశుడు చెప్పెను అన్ని ప్రాణుల ఉనికికి కారకుడగు శివుడట్లు గణశునిచే స్తుతింపబడెను.లోకముల సంహారమునకు కారణమైన కాలకూటము బయల్వెడలగా(52) లింగరూపమున దానిని మింగి మరల నిర్మలముగా చేయగా దేవతలు, అసురులు, మానవులు, మూడులోకములు శివుని గొప్ప కృపచేత ఆక్షణమే రక్షింపబడిన వాయెను(53) బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, లోకపాలురు, ఋషులు, యక్షులు, గంధర్వులు, సిద్దులు. అప్సరసల గణములునిద్రనుండి బయటపడినట్లు లేచిరి(54) భయమును (పొందిన వారై) వారంతా విస్మయము నొందిరి. ఆశ్చర్యముగా వారంతా ఇట్లనిరి.(55) మనలనందరినీ తరిమిన ఆ గొప్పకాలకూటమెక్కడ? (దేనిచే) మనమంతా లోకపాలకులమై మృతులవలె చేయబడితిమో( ఆకాలకూటమెక్కడ?) (56)

ఇత్యబ్రువంస్తదా దైత్యాస్తూష్ణీంభూతాస్తదా స్థితా: | శక్రిదయోలోకపాలా విష్ణుం సర్వేశ్వరేశ్వరమ్‌ || బ్రహ్మాణం చ పురస్కృత్య ఇదమూచుస్సమేధితా:|| 57

కేనేదం కారితం విష్ణో న విదామోల్పమేధస:| తదా ప్రవాస్య భగవాన్‌ బ్రహ్మణా సహతై: సురై:|| 58

సమాధిమగమన్‌ సర్వేప్యేకాగ్రమనసస్తదా | తత్త్వజ్ఞానేన నిర్హృత్య కామక్రోధాదికాన్‌ ద్విజా:||59

తదాత్మనిస్థితం లింగమపశ్యన్విబుధాదయై | విష్ణుం పురస్కృత్య తదా తుష్టువు: పరమార్థత:|| 60

దేవతలట్లు పలికిరి, దైత్యులు మాత్రము అపుడు మౌనముగా నుండిరి. ఇంద్రుడు మొదలైన దేవతలు లోకపాలకుడు సర్వేశ్వరేశ్వరుడైన విష్ణువును, బ్రహ్మను ముందుంచుకొని కలిసి ఇట్లనిరి (57) ఓ విష్ణుదేవా! అల్పబుద్దిగల వారమయినందున ఎవరిట్లు చేసిరో తెలియజాలకున్నాము అపుడు భగవంతుడు నవ్వి బ్రహ్మతో సహ దేవతలను సమాధిస్థితినంపెను (58) అపుడందరూ ఏకాగ్రతనొందిన మనస్సుగలవారైరి బ్రాహ్మణులు తత్త్వజ్ఞానము చేత కామము, క్రోధము మొదలగు వానిని తొలగించి(59) ఆత్మయందున్న లింగమునుగాంచిరి అపుడు దేవతలు మొదలగువారు తత్త్వముగా విష్ణువును స్తుతించిరి(60)

ఆత్మానా పరమాత్మానం యోగిన: పర్యుపాసతే || 61

లింగమేవ పరం జ్ఞానం లింగమేవ పరం తప: లింగమేవ పరో ధర్మో లింగమేవ పరా గతి:|| తస్మాల్లింగాత్పరం యచ్చ కించిన్న విద్యతే || 62

ఏవం బ్రువంతో హి తదా సురాసురా: సలోకపాలా ఋషిభిశ్చ సాకమ్‌ | విష్ణుం పురస్కృత్య తమాలవర్ణం శంభుం శరణ్యం శరణం ప్రవన్నా: || 63

త్రాహి త్రాహి మహాదేవ కృపాలో పరమేశ్వర పురా త్రాతా యథా సర్వే తథా త్వం త్రాతుమర్హసి|| 64

తద్దేవ దేవ భవతశ్చరణారవిందం సేవానుబంధమహిమానన్తరూపమ్‌ | త్వదాశ్రితం యత్పరమానుకంపయా | నమోస్తు తే దేవవర ప్రసీద || 65

యెగులు ఆత్మచేత పరమాత్మను ఉపాసింతురు (61) లింగమే పరమజ్ఞానము ,లింగమే శ్రేష్ఠమైన తపస్సు , లింగమే శ్రేష్ఠమగు ధర్మము , లింగమే శ్రేష్ఠమగు గతి, కనుక, లింగమున కంటే వేరొకటి లేదు (62) ఇట్లు పలుకుచూ లోకపాలురు, ఋషులతో సహదేవతలంతా తమాలవృక్షఛాయ గల విష్ణువును ముందుంచుకొని ,శరణుగోరయోగ్యుని శివుని శరణుజొచ్చిరి (63)కృషగల మహాదేవా, పరమేశ్వరా!రక్షింపుము ! పూర్వము అందరినీ ఎట్లు రక్షించితివో అట్లు రక్షించుటకు నీవే తగినవాడవు (64)

లింగస్వరూపమధ్యస్ధో భగవాన్భూతభావన:| సర్వైస్సురగణౖస్సాకం బభాషేదం రమాపతి :|| 66

త్వం లింగరూపీ భగవాన్జగతామభయప్రద:| విష్ణునా సంస్తుతో దేవో లింగరూపీ మహేశ్వర :|| 67

మృతాస్త్రాతా గరాత్సర్వే తస్మాన్మృత్యుంజయ ప్రభో | రక్ష రక్ష మహాకాల త్రిపురాంత నమోస్తుతే || 68

విష్ణునా సంస్తుతో దేవో లింగరూపీ మహేశ్వర:| ప్రాదుర్భభూవ సాంబోథ బోధయన్నివ తాన్సురాన్‌ || 69

హే విష్ణో హే సురా: సర్వ ఋషయ: శ్రూయతామిదమ్‌ | మన్యతేపి హి సంసారే అనిత్యే నిత్యతాకులమ్‌ || 70

లింగస్వరూపమధ్యనున్న అన్ని భూతముల వునికికి కారణమగు విష్ణువు అపుడు దేవతాగణములన్నింటితో కలిసి భాషించెను (66) ఓ భగవంతుడా! నీవు లింగరూపమును దాల్చినవాడవు లోకములకభయమొసగువాడు.విష్ణువు చేత లింగరూపముననున్న మహేశ్వరుడు స్తుతింపబడెను (67) విషమునుండి మృతులందరూ రక్షింపబడిరి కనుక ఓ ప్రభూ! మృత్యుంజయుడవు ఓ మహాకాలా! త్రిపురాంతకా ! రక్షింపుము నీకు నమస్కారము(68) అట్లు విష్ణువు స్తుతించగా లింగరూపియైన శివుడు అంబతో కలిసి ఆ దేవతలనూ మేల్కొలుపుటకా యున్నట్లవతరించెను (సాక్షాత్కరించెను) (69) ఓ విష్ణువూ! దేవతలారా! ఋషులారా! ఇది వినుడు అనిత్యమగు సంసారమున నిత్యత పూర్ణమని భావింపబడుచున్నది.(70)

అవిలోకయాతాత్మానమాత్మనా విబుధాదయ:| కిం యజ్ఞై: కిం తపోభిశ్చ కిముద్యోగేన కర్మణామ్‌ || 71

ఏకత్వేన పృథక్యైన కించిన్నైవ ప్రయోజనమ్‌ | యస్మాద్భవద్భిర్మిళితై: కృతం యత్కర్మ దుష్కరమ్‌ || 72

క్షీరాబ్దేర్మథనం తత్తు అమృతార్థం కథం కృతమ్‌ | మృత్యుంజయం నిరాకృత్య అవజ్ఞాయ చ మాం సదా|| 73

తస్మాత్సర్వే మృత్యుముఖం పతితా వై న సంశయ: | అస్మాభిర్నిర్మితో దేవో గణశ: కార్యసిద్దయే || 74

న నమన్తి గణశం చ దుర్గాం చైవ తథావిథామ్‌ | క్లేశభాజో భవిష్యన్తి నాత్ర కార్యా విచారణా|| 75

యూయం సర్వే త్వధర్మిష్ఠా: స్తబ్దా: పండితమానిన :| కార్యాకార్యమవిజ్ఞాయ కేవలం మానమోహితా:||76

తస్మాత్కాలముఖే సర్వే పతితా నాత్ర సంశయ: సర్వే శ్రుతాపరా యూయమింద్రాద్యా దేవతాగణా:|| 77

ప్రరోచనపరా: సర్వే క్షుద్రాశ్చేంద్రాదయో వృథా | నాత్మానం చ ప్రపంచేన వేత్సి త్వం హి శచీపతే|| 78

దేవతలారా! మిమ్ము మీరు గమనించండి యజ్ఞములచేతనేమి? తపస్సుల చేతనేమి? కర్మలనారంభించుటచేనేమి? (71) కలిసిగానీ, విడిగాగానీ కొద్ది ప్రయోజనము కూడా లేదు మీరంతా కలిసి చేసిన దుష్కర్మ ఎందుకు చేయబడినది? (72) అమృతము కొఱుకు క్షీరసముద్రమును మధించుటను మృత్యుంజయుడైన నన్ను నిరాకరించి అవమానించి ఎట్లు చేసితిరి? (73) కనుకనే అందరూ మృత్యుముఖమున పడితిరి ఇందు సంశయము లేదు కార్యము సిద్దించుటకు మాచేత గణశుడను దేవుడునిర్మింపబడినాడు. (74) గణశుని, దుర్గను నమస్కరించిని వారు నిర్వివాదంగా క్లేశముల ననుభవింతురు (75) మీరంతా అ ధర్మపరులు , స్తుబ్థులు పండితులమని అనుకునేవారు,చేయదగినది, చేయదగనిది తెలియక కేవలము అభిమానము చేత మోహమునొందినారు (76) కనుకనే అందరూ కాలముఖమున పడినారు,ఇంద్రుడు మొదలైన దేవతాగణములు వీరంతా శ్రుతియే పరమమనువారు అల్పులైన ఇంద్రుడు మొదలైన వారంతా వృథాగా ప్రేరేపించువారు. ఓ ఇంద్రా! నీవు సమగ్రముగా తెలియకున్నావు. (78)

కృత: ప్రయత్నో హి మహానమృతార్థం త్వయా శఠ| అశ్వమేధశ##తేనైన యద్రాజ్యం ప్రాప్తవానసి || అపి తచ్చ పరాధీనం తన్న జానాసి దుర్మతే || 79

యైర్వేదవాక్యైస్త్వం మూఢ సంస్తుతోసి తపస్విభి: తే మూఢాస్తోషయన్తి త్వాం తత్తద్రాగపరాయణా: 80

విష్ణో త్వం హి పక్షపాతాన్న జానాసి హితాహితమ్‌ | కేచిద్దతాస్త్యయా విష్ణో రక్షితాశ్చైవ కేచన|| 81

ఇచ్చాయుక్తస్త్వమత్రైవ సదా బాలకచేష్టిత : యేన్యే చ లోకపా: సర్వే తేషాం వార్తా కుతస్త్విహ || 82

అన్యథా హి కృతే హ్యర్థే అన్యథాత్వం భవిష్యతి | కార్యసిద్దిర్భవేద్యేన భవద్భిర్విస్మృతం చ తత్‌ || 83

మూఢుడా! నీవు అమృతముకొఱకు గొప్పప్రయత్నము చేసతివి, నూరుఅశ్వమేధయాగాలను చేయడం వల్ల ఏరాజ్యాన్ని పొందావొ అది ఇప్పుడు ఇతరుల వున్నది, దుర్మతివై అది తెలియకున్నావు (79) ఏ తపస్వి జనులచేత నీవు వేదవాక్యములచేత స్తుతింపబడినావో, వారు ఆయా కోరికచేత నిన్నట్లు సంతోషపెట్టెదరు. (80) ఓవిష్ణూ! నీవు పక్షపాతము వల్ల హితాన్ని, అహితాన్ని తెలియజాలకున్నావు.నీచేత కొందరు చంపబడినారు. కొందరు రక్షింపబడినారు.(81) ఇచ్చతో కూడుకున్న నీవు ఎప్పుడూ బాలునివలెనే ప్రవర్తించుచున్నావు ఇక ఇతర లోకపాలకుల సంగతి ఎక్కడ?(82) వేరొక విధము చేసిన దానిలో వేరొక విధముగా వుండుటయే వుండును దేనిచేత కార్యముసిద్దించునో దానిని మీరు మరిచితిరి (83)

యేనాద్య రక్షితా :సర్వే కాలకూటమహాభయాత్‌ | యేన నీలికృతో విష్ణుర్యేన సర్వే పరాజితా|| 84

లోకా భస్మీకృతా యేన తస్మాద్యేవాపి రక్షితా:| తస్యార్చనవిధి : కార్యో గణశస్య మహాత్మన:|| 85

కర్మారంభే తు విఘ్నేశం యే నార్చంతి గణాధిపమ్‌ | కార్యసిద్దిర్న తేషాం వై భ##వేత్తు భవతాం యథా || 86

ఏతన్మహేశస్య వచో నిశమ్య సురాసురా: కిన్నరచారణాశ్చ పూజావిధానం పరమార్థతోపి పప్రచ్ఛురేనం చ తదా గిరీశమ్‌ || 87

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ మాహేశ్వర కేదారఖండే

సముద్రమంధనాఖ్యానే శివకృతవిషభక్షణ వృత్తాన్తం నామ

దశమోధ్యాయ:

ఎవరిచే ఈనాడు అందరూ కాలకూటముయొక్కగొప్ప భయమునుండి రక్షింపబడినారో ఎవరిచే విష్ణువు నీలముగా చేయబడినాడో, ఎవరిచేత అందరూ ఓడింపబడినారో (84) ఎవరిచేత లోకమలు భస్మముగా చేయబడినవో దానినుండి మరల రక్షింపబడినవో, అట్టి మహాత్ముడైన గణశుని పూజా విధిని చేయవలెను.(85) పనిని మొదలు బెట్టునపుడు ఎవరు గణశుని అర్చింపరో వారికి మీ వలెనే ఆపని సిద్దింపదు (86) మహేశుని మాటనువిని సురాసురులు కిన్నరులు, చారణులు తత్త్వత: పూజా విధానమును చెప్పుమని శివుని అడిగిరి (87)

శ్రీ స్కాంద పురాణమున మాహేశ్వరఖండమున కేదారఖండమున

సముద్రమధన శివుడు విషమును భక్షించువృత్తాస్తమను

పదవ అధ్యాయము సమాప్తము.

ఏకాదశోz ధ్యాయ:

మహేశ్వర ఉవాచ:

ప్రతిపక్షే చతుర్థ్యాం తు పూజనీయో గణాధిప: స్నాత్వా శుక్లతిలై: శుద్దై: శుక్లపక్షే సదా నృభి:|| 1

కృత్వా చావశ్యకం సర్వం గణశస్యార్చనక్రియామ్‌ | ప్రయత్నేనైత కుర్వీత గంధమాల్యాక్షతాదిభి:||2

ధ్యానమాదౌ ప్రకర్తవ్యం గణశస్య యథావిధి | ఆగమా బహవో జాతా గణశస్య యథా మమ|| 3

బహుధోపాసకా యస్మాత్తమ: సత్త్వరజోన్నితా :| గణభేదేన తాన్యేవ నామాని బహుధాభవన్‌ || 4

పంచవక్త్రో గణాధ్యక్షో దశబాహుస్త్రీలోచన:| కాంతస్ఫటికసంకాశో నీలకణ్ఠో గజానన:|| 5

పదకొండవ అధ్యాయము

మహేశ్వరుడుపలికెను ప్రతి పక్షముయొక్క చతుర్ధి (చవితి)నాడు గణశుని పూజింపవలెను. శుక్లపక్షమున నరులెల్లప్పటికీ స్వచ్చమైన తెల్లనువ్వులతో స్నానం చేసి (1) అవసరమైనదంతా చేసి గణశుని అర్చన క్రియను ప్రయత్నముచే గంధము , మాల్యము, అక్షతలు మొదలైన వానిచే చేయవలెను(2) మొదట యథావిధిగా గణశుని ధ్యానమును చేయవలెను, నాకున్నట్లు గణశునికీ పెక్కు ఆగమములు గలవు. (3) తమస్సు ,రజస్సు, సత్త్వములతో కూడుకొన్న ఉపాసకులుఅనేకరకాలుగా వున్నారు, గణము యొక్క భేదముచే ఆ పేరే పలురకాలుగా ఏర్పడినవి (4) ఐదు తలలు గలవాడు ,గణములు అధ్యక్షుడు , పదిచేతులు గలవాడు , మూడు కళ్ళుగలవాడు అందమైన స్ఫటికమువంటి కాంతి గలవాడు, నీల వర్ణమున కంఠముగలవాడు, నీలవర్ణము కంఠముగలవాడు, గజాననుడు (5) అని అతని పేరు

ముఖాని తస్య పంచైవ కథయామి యథాతథమ్‌|| 6

మధ్యమం తు ముఖం గౌరం చతుర్దస్తం త్రిలోచనమ్‌| శుండాదండమనోజ్ఞం చ పుష్కరే మోదకాన్వితమ్‌ || 7

తథాన్యత్పీతవర్ణం చ నీలం చ శుభలక్షణమ్‌ | పింగళం చ తథా శుభ్రం గణశస్య శుభాననమ్‌ || 8

తథా దశభుజేష్వేవ హ్యాయుధాని బ్రవీమి వ: | పాశం పరశుపద్మే చ అంకుశం దంతమేవ చ || 9

అక్షమాలాం లాంగలం చ ముసలం వరదంతథా | పూర్ణం చ మోదకై: పాత్రం పాణినా చ విచింతయేత్‌ || 10

లంబోదరం విరూపాక్షం నివీతం మేఖలాన్వితమ్‌| యోగాసనే చోపావిష్టం చంద్రలేఖాంకశేకరమ్‌ || 11

అతని ఐదు తలలను గూర్చి కూడా వున్నదున్నట్లుగా చెప్పెదను (6) మధ్యనున్న ముఖము ఎరుపు వర్ణములో నాలుగు దంతములు, మూడుకన్నులుగలది తొండముతో అందముగా నున్నది. మరియు లడ్డులు గలది(7) వేరొక ముఖము పసుపు రంగులొను వేరొకటి మంచి లక్షణాలు గలిగి నీలం రంగులో నూ, వేరొకటి ధూమ్రవర్ణములోనూ, వేరొకటి శుభ్రమైన వర్ణములోనూ వుండునది. అట్టిది గణశుని శుభప్రదమైన ముఖము (8) అదేవిధంగా, పదిభుజాలయందలి ఆయుధాలు మీకు చెప్పెదను పాశము, పరశువు, పద్మముచ అంకుశంచ దంతముచ(9) అక్షమాల, నాగలి, రోకలి, వరము నిచ్చుహస్తము, లడ్డులతో నిండిన పాత్రనుచేతిలో దరించిన గణశుని బాగుగా భావించవలెను (10) లంబోదరుని, విరుపాక్షుని, యజ్ఞోపవితమును (మెడలోవేసుకొనిననివీతం) వడ్డాణమును దరించినవానినిచ యోగాసనమున కూర్చుండిన వానిని, చంద్రుని రేఖకు తల పై ధరించినవానిని (11)(ధ్యానింపవలెను)

ధ్యానం చ సాత్త్వికం జ్ఞేయం రాజసం హి నృణామివ| శుద్దచామీకరాభాసం గజాననమలౌకికమ్‌ || 12

చతుర్భుజం త్రినయనమేకదంతం మహోదరమ్‌| పాశాంకుశధరం దేవం దంత మోదకపాత్రకమ్‌|| 13

నీలం చ తామసం ధ్యానయేవం త్రివిధముకచ్యతే| తత: పూజా ప్రకర్తవ్యా భవద్భి :శ్రీ ఘ్రమేవ చ|| 14

ఏకవింశతి దూర్వాభిర్ధ్వాభ్యాం నామ్నా పృథక్‌ప్పథక్‌ ! సర్వనామభిరేకైవ దీయతే గణనాయకే || 15

తథైవ నామభిర్దేయా ఏకవింశతిమోదకా: | దశనామాన్యహం వక్ష్యే పూజనార్థం పృథక్‌|| 16

మానవులకు రాజస ధ్యానమువలెచ సాత్త్విక ధ్యానము తెలియవలెను. శుద్దబంగారు వన్నెనున్న అలౌకిక గజాననుని (12)నాలుగు భుజములు, మూడు కన్నులు, ఒక దంతము, పెద్దపొట్ట, పాశము , అంకుశము గలిగిన వానిగా, దంతముచే చేసినమోదక పాత్రను గలవానిగా (ధ్యానించవలెను) నీలముగా ముఖమును ధ్యానించుట తామసమనబడును. ఇట్లు ధ్యానము మూడు విధాలు తరువాత మీరు తొందరగా పూజను చేయవలెను. (14) పదకొండు దూర్వా లచే (గరిక) రెంటిని పేరుతో విడివిడిగా చేస్తూ (పూజించవలె) అన్ని పేర్లచేత గణనాయకునకు ఒకటే ఇవ్వబడును.(15) అట్లే పేర్లతో ఏకవింశతి (ఇరవైఒక్క) లడ్డూలను ఇవ్వవలెను పూజకై మీకు విడివిడిగా పదిపేర్లను చెప్పెదను(16)

గనాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన| వినాయకేశపుత్రేతి సర్వసిద్దిప్రదాయక|| 17

ఏకదంతేభవక్త్రీతి తథా మూషకవాహన | కుమారగురవే తుభ్యం పూజనీయ: ప్రయత్నత|| 18

ఏవముక్తా సురాన్‌ సద్య : పరిష్వజ్య చ సాదరమ్‌ | విష్ణుం గుహాశయం సద్యో బ్రహ్మాణం చ సదాశివ:|| 19

తిరోధానగత: సద్య: శంభు: పరమశోభన: ప్రణమ్యశంభుం తే సర్వే గణాధ్యక్షార్చనే రతా:||20

తత: సంపూజ్య విధివద్గణాధ్యక్షార్చనే రతా: ఉపచారైరనేకైశ్చ దూర్వాభిశ్చ పృథక్‌ || 21

సంతుష్టో హి గుణాధ్యక్షో దేవానాం వరదోభవత్‌ | ప్రదక్షిణం నమస్కృత్య తైస్సర్వైరభితోషిత:|| 22

తమో గుణాన్వితాస్సర్వే హ్యసురానాభ్యపూజయన్‌ | ఉపహాసపరాస్తేవై దేవాస్ర్పత్యసురోత్తమా:|| 23

పూజాయిత్వా శాంకరిం తే పున: క్షీరార్ణవం యయు: బ్రహ్మా విష్ణుశ్చ ఋషయో దేవదైత్యాస్సురోత్తమా:|| 24

గణములకు అధిపతి, పార్వతిపుత్రుడు , పాపములనశింపజేయువాడు, వినాయకుడు, ఈశ్వర పుత్రుడు, అన్ని సిద్దుల నిచ్చువాడు (17) ఒక దంతము గలవాడు,ఏనుగు ముఖము గలవాడు, మూషకమును వాహనముగా గలవాడు, కుమారస్వామికి గురువు అట్టి నీకు నమస్కారము అని ప్రయత్నముచే పూజింపవలెను (18) ఇట్లు దేవతలను పలికి వారిని విష్ణువును, బ్రహ్మను సాదరముగా కౌగిలించుకొని సదాశివుడు (19) వెంటనే అంతర్థానమాయెను వారంతా శివునికి నమస్కరించి గణాధ్యక్షుని పూజయందు ఆసక్తి గలవారైరి (20) తరువాత పూజావిధి ప్రకారము గణశునికి అనేక ఉపచారములచేత , విడివిడిగా దూర్వా (గరిక) చేత పూజించిరి(21) సంతోషించిన గణశుడపుడు దేవతలకు వరములిచ్చవాడాయెను వారంతా గణశునికి ప్రదక్షిణముచేసి నమస్కరించి ఆనందపరచిరి.(22) కాని తమో గుణముతో కూడుకొన్న అసురులు పూజింప లేదు. అసుర శ్రేష్ఠలంతా దేవతలను ఎగతాళి చేయసాగిరి(23) శక్తిని పూజించి బ్రహ్మ, విష్ణువు, ఇతర దేవతలు,దైత్యులు చ దేవతాశ్రేష్ఠులంతా క్షీరసాగరాన్ని మరలచేరిరి(24)

మంథానం మందరం కృత్వా రజ్జుం కృత్వాథ వాసుకిమ్‌ | మమంథుశ్చ తదా దేవా విష్ణుం కృత్వాథ సన్నిధౌ|| 25

మథ్యమానే తదాబ్దౌ చ నిర్గతశ్చస్ద అగ్రత:| పీయూషపూర్ఱ: సర్వేషాం దేవానాం కార్యసిద్దయే || 26

మందరపర్వతమును కవ్వముగా , వాసుకి అనుసర్పమును త్రాడుగా చేసి విష్ణువును దగ్గర నిలుపుకొని దేవతలపుడు మథనము (క్షీరసాగరాన్ని చిలుకుట)చే యసాగిరి (25) సముద్రము అట్లు చిలకబడగా అపుడు ఎదురుగా చంద్రుడు బయల్వెడలెను. దేవతల కార్యసిద్దికొరకతను అమృతమయుడుగా నుండెను. (26)

శౌనక ఉవాచ:

అర్ణవే కిం పురా చంద్రో నిక్షిప్త: కేన సువ్రత: గజాదికాని రత్నాని కథితాని త్వయా పురా|| 27

ఏతత్సర్వం సమాసేన ఆదౌ కథయ మే ప్రభో | జ్ఞాత్వా సర్వే వయం సూత పశ్చాదావర్ణయామహే|| 28

తేషాం తద్వచనం శుత్వా సూతో వాక్యముపాదదే || 29

చంద్ర ఆపోమయో విప్రా అత్రిపుత్రో గుణాన్విత: ఉత్పన్నో హ్యనసూయాయాం బ్రహ్మణోంశాత్సముద్భవ:|| 30

క్షీరాబ్దిం మథ్యమానం తు దృష్ట్వా చంద్రో ముదాన్విత: క్షీరాబ్ధిరపి చంద్రం చ దృష్ఠ్యా సోప్యుత్సుకో భవత్‌ || 31

ప్రవిష్టశ్చోభయప్రీత్యా శృణ్వతాం భో ద్విజోత్తమా: | చంద్రో హ్యమృతపూర్ణోభూదగ్రతో దేవసన్నిధౌ|| 32

శౌనకుడనెను ఓ మంచిచరితము గలవాడా! పూర్వమెవరిచేత చంద్రుడు సముద్రమున ఉంచబడినాడు? నీవు పూర్వము గజము మొదలగు రత్నములు గూర్చి చెప్పితివి (27) మొదట దీనినంతా క్లుప్తముగా తెలియజేయుము. ఓ ప్రభూ! సూతా! ముందు దీనిని తెలుసుకొని మేము తరువాత పరిశీలించెదము(28) వారి ఆ మాటను విని సూతుడు మాట్లాడ సాగెను. (29) ఓ విప్రులారా! చంద్రుడు నీటితో కూడినవాడు. బ్రహ్మయొక్క అంశంనుండి అనసూయయందు జన్మించినాడు, అత్రిమహర్షి పుత్రుడు. గుణములు గలవాడు, అనసూయకు రుద్రుని అంశనుండి దుర్వాసుడు, విష్ణువు అంశనుండి దత్తకుడు జన్మించిరి. (30) క్షీరసాగరము మథించబడుచుండగా చూచి చంద్రుడు ఆనందము నొందెను. క్షీరసాగరము కూడా చంద్రుని చూచి ఉత్సుకతనొందెను(31) ఇద్దరి ప్రీతికై ప్రవేశించిన చంద్రుడు అమృత పూర్ణుడై దేవతల సన్నిధిలో నిలిచెను. ఓ విప్రశ్రేష్ఠులారా! ఇది వినుడు! (32)దృష్ఠ్యా చ కాంతిం త్వరితోథ చంద్రో నీరాజితో దేవగుణౖస్తదానీమ్‌ | వాదిత్రఘోషైస్తుములైరనేకై ర్మృదంగశంఖై: పటహైరనేకై: 33

నమశ్చక్రుశ్చ తే సర్వే ససురాసురదానవా: తదా గర్గం పృచ్ఛమానా బలం చంద్రస్య తత్త్వత:|| 34

గర్గేణోక్తాస్తదా దేవా: సర్వేషాం బలమద్య వై| కేంద్రస్థానగతాస్సర్వే భవతాముత్తమా గ్రహా:||35

చంద్రం గురుస్సమాయాతో బుధశ్చైవ సమాగత:| ఆదిత్యశ్చ తథా శుక్ర: శనిరంగారకో మహాన్‌ || 36

తస్మాచ్చంద్రబలం శ్రేష్ఠం భవతాం కార్యసిద్దయే | గోమంతసజ్ఞకో నామ ముహుర్తోయం జయప్రద:||

ఆ కాంతిని చూచి న దేవతాగణములపుడు చంద్రునికి త్వరగా నీరాజనములు పట్టినవి. మృదంగ, భేరీ తప్పెట వంటి అనేక చర్మవాద్యాల ధ్వనితో నీరాజనమిచ్చినది(33) సురాసురదానవులంతా నమస్కరించిరి . అపుడుచంద్రుని బలాన్ని గూర్చి వాస్తవముగా తెలుపుమని వారడిగిన(34) గర్గుడు మీకందరికీ నేడ బలమున్నది మీ ఉత్తమ గ్రహాలన్నీ కేంద్రస్థానమున నున్నవి అని చెప్పెను (35) గురువు (బృహస్పతి) బుధుడు, సూర్యుడు, శని,అంగారకుడు చంద్రుని చేరివున్నందున(36) మీ పని సిద్దించుటకు చంద్రబలం శ్రేష్ఠముగా నున్నది ఈ ముహూర్తము గోమంత మను సంజ్ఞకలది. జయమును కలిగించునది (37) ఏవమాశ్వాసితా దేవా గర్గేణౖవ మహాత్మనా | మమంథురబ్థిం త్వరితా గర్జమానా మహాబలా:|| 38

ద్విగుణం బలమాపన్నా మహాత్మానో దృఢవ్రతా :| మహేశం స్మరమాణాస్తే చ పున:పున: || 39

నిర్మథ్యమానాదుదధేర్గర్జమానాచ్చ సర్వశ :| నిర్గతా సురభి: సాక్షాద్దేవానాం కార్యసిద్దయే || 40

తుష్టా కపిలవర్ణా సా ఊధోభారేణ భూయసా | తరంగోపరి గచ్ఛన్తీ శనకై: శనకైస్తత:||41

కామధేనుం సమాయాంతీం దృష్ట్యా సర్వే సురాసురా:| పుష్పవర్షేణ మహతా వవర్షురమితప్రభామ్‌|| 42

తదా తూర్యాణ్యనేకాని నేదుర్వాద్యాన్యనేకశ: అనీతా జలమధ్యాచ్చ సంవృతా గోశ##తైరపి || 43

ఈ విధంగా మహాత్మడైన గర్గునిచేత ఓదార్చబడిన దేవతలు గొప్పబలవంతులై గర్జించుచూ త్వరగా సముద్రమును మథించిరి(38) దృఢమైన నిశ్చయముగల వారంతా శివుని ,గణశుని మరల మరల స్మరించుచు రెట్టింపు బలము పొందిరి (39)మథింపబడుతూ గర్జించుచున్న ఆ సముద్రము నుండి దేవతల కార్యసిద్ది కై సాక్షాత్తు సురభి బయల్వెడలినది (40) సంతోషముతో నున్నదీ కపిలవర్ణముగలది, పొదుగు బరువుచేత నెమ్మది, నెమ్మదిగా అలల పై నడుస్తూ (41) వచ్చుచున్న కామధేనువును చూచిన సురాసరులంతా గొప్పకాంతి గల ఆ ఆవుపై పుష్పముల గురిపించిరి. (42) అపుడు అనేక విధముల వాద్యాలు , తూర్యములు మ్రోగింపబడినవి వంద గోవులచేత కూడివున్న ఆ ధేనువును నీటిమధ్య నుండి తీసుకొనివచ్చిరి,(43)

తాసు నీలాశ్చ కృష్ణాశ్చ కపింజలా:| బభ్రవ: శ్యామకా రక్తా జంబూవర్ణాశ్చ పింగళా:|| ఆభిర్యుక్తా తదా గోభి: సురభి : ప్రత్యదృశ్యత || 44

అసురాసురసం వీతాం కామధేనుం యయాచిరే | ఋషయో హర్షసంయుక్తా దేవాన్దైత్యాంశ్చ తత్ష్కణాత్‌|| 45

సర్వేభ్యశ్చైవ విప్రేభ్యో నానాగోత్రేభ్య ఏవ చ | సురభీసహితా గావో దాతవ్యా నాత్రసంశయ:|| 46

తైర్యాచితాస్తేత్ర సురాసురాశ్చ తా గా:శివతోషణాయ| తై: స్వీకృతాస్తా ఋషిభి : సుమంగళై: మహాత్మభి: పుణ్యతమై: సురభ్య:|| 47

పుణ్యాహం మునిభిస్సర్వై : కారితాస్తే తదా సురా:| కార్యసిద్ద్యర్థమసురాణాం క్షయాయ చ|| 48

ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపురంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రువర్ణములోనూ శ్యామవర్ణములోనూ, ఎరుపు రంగులోనూ నేరేడురంగు, పింగళ(చిత్ర) వర్ణములోనూ వుండినవి అపుడు ఈ గోవులతో నుండిన సురభి కనబడినది?(44) దేవదానవుల మధ్య నున్న సురభిని కామధేనువును, దేవతలను, దానవులను కూడా ఆనందముతో వున్న ఋషులిట్లడిగిరి.(45) అనేక గోత్రములకుచెందిన బ్రాహ్మణులందరికీ కామధేనువుతో సహ గోవులన్నీ దానమివ్వబడవలెను. ఇందు సంశయము లేదు(46) వారట్లు యాచింపగా సురాసురులు శివుని ప్రీతికై ఆ గోవులను దానమిచ్చిరి అపుడు శుభము, పుణ్యము కలిగిన ఆ గొప్పఋషులచేత సురభి మొదలగు గొవులు స్వీకరింపబడినవి(47)అపుడు మునులంతా దేవతల కార్యసిద్దికై, అసురుల నాశనానికై దేవతలకు పుణ్యాహవాచనం చేయించిరి.(48)

పున:సర్వే సుసంరబ్దా మమంథు :క్షీరసాగరమ్‌ | మధ్యమానాత్తదా తస్మాదుదధేశ్చ తథాభవత్‌ ||49

కల్పవృక్ష: పారిజాతశ్చూత: సంతానకస్తథా| తాన్ద్రుమానేకత: కృత్వా గంధర్వనగరోపమాన్‌ || మమంథురుగ్రం త్వరితా:పున: క్షీరార్ణవం బుధా:|| 50

నిర్మథ్యమానాదుదధేరభవత్సూర్యవర్చసమ్‌| రత్నానాముత్తమం రత్నం కౌస్తుభాఖ్యం మహాప్రభుమ్‌|| 51

స్వకీయేన ప్రకాశేన భాసయన్తం జగత్రయమ్‌| చింతామణిం పురస్కృత్య కౌస్తుభం దదృశుర్హి తే || 52

సర్వే సురా దదుస్తం వై కౌస్తుభం విష్ణవే తదా| చింతామణిం తత: కృత్వా మధ్యే చైవ సురాసురా:|| 53

మద్యమానాత్తతస్తస్మాదుచ్చైఃశ్రవాః సమద్భుతమ్‌ | బభూవ అశ్వో రత్నానాం పునశ్చైరావతో గజ:|| 54

మరల అందరూ ఉత్సాహముతో క్షీరసాగరమును మథించిరి. అపుడా సాగరమునుండి (49) కల్పవృక్షము, పారిజాతము, చూత వృక్షము (మామిడి) సంతానకవృక్షము జనించినవి గంధర్వనగరములో సరితూగు ఆ వృక్షముల నొక్కచోట వుంచి (50) విజ్ఞులైన వారంతా మరల ఆ ఉగ్రమైన క్షీర సాగరమును మథించిరి. (50) అపుడు దానినుండి సూర్యుని వలె ప్రకాశించునది, గొప్పకాంతిగలదియగు కౌస్తుభమను, ఉత్తమరత్నము(51) ముల్లోకములను తన కాంతిచేత ప్రకాశింపజేయుచూ చింతమణితో బయల్వెడలుటను వారు చూచిరి.(52) దేవతలంతా అపుడు ఆ కౌస్తుభాన్ని విష్ణువున కిచ్చిరి. సురాసురులు చింతామణిని మధ్యనుంచుకొని మిక్కిలి బలవంతులై గర్జించుచూ మరల సముద్రమును మథించిరి.(53) అపుడా సాగరమునుండి అద్భుతమైనది, ఆశ్వములందు రత్నమైన ఉచ్చైశ్రవమను అశ్వము, ఐరావతమను గజము జన్మించినవి.(54)

తథైవ గజరత్నం చ చుతు:షష్ట్యా సమన్వితమ్‌ | గజానాం పాండురానాం చ చతుర్దన్తం మదాన్వితమ్‌ || 55

తాన్‌ సర్వాన్‌ మధ్యత: కృత్వా పునశ్చైవ మమంథిరే | నిర్మథ్యమానాదుదధేర్నిర్గతాని బహూన్యథ|| 56

మదిరా విజయా భృంగీ తథా లశునగృంజనా: | అతీవ ఉన్మాదకరో ధత్తూర : పుష్కరస్తథా|| 57

స్థాపితా నైకపద్యేన తీరే నదనదీపతే: | పునశ్చ తే తత్ర మహాసురేంద్రా మమంథురబ్దిం సురసత్తమైస్సహ|| 58

నిర్మథ్యమానాదుదధేస్తదా సీత్‌ సా దివ్వలక్ష్మీర్భువనైకనాథా| ఆన్వీక్షికీం బ్రహ్మవిదో వదంతి తథా చాన్యే మూలవిద్యాం గృణంతి || 59

బ్రహ్మవిద్యాం కేచిదాహుస్సమర్ధా: కేచిత్సిద్దిమృద్థిమాజ్ఞామధాశామ్‌: | యాం వైష్ణవీం యోగిన : కేచిదాహు స్తథా చ మాయాం మాయినో నిత్యయుక్తా :|| 60

అదే విధముగా నాలుగు దంతములు గల తెల్లని మదపుటేనుగులు అరువది నాలుగు జనించినవి.(55) వాటినన్నిటినీ మధ్యలోవుంచి మరల సముద్రమును మథించిరి. అపుడు సముద్రమునుండి అనేకము జన్మించినవి (56) విజయ అను మద్యము, భంగు, వెల్లుల్లి, ఒక రకమైన ఉల్లి, మిక్కిలి ఉన్మాదమును కలిగించు ధత్తూరము, పుష్కరము ఔషధములు జన్మించినవి.(57) వానిని సముద్ర తీరమున దగ్గరగా వుంచి సురశ్రేష్ఠులంతా కలిసి క్షీరసాగరాన్ని మరల మథించిరి (58) అపుడు దాని నుండి భువనమునకు ఒకే ప్రభువగు దివ్వమయిన అక్ష్మీ జనించినది. అమెను బ్రహ్మవేత్తలు ఆన్విక్షికీ, అని ఇతరులు మూలవిద్యా అని స్తుతింతురు (59) కొందరు జ్ఞానులు ఆమెను బ్రహ్మవిద్యయందురు, కొందరు సమృద్దియందురు, కొందరు ఆజ్ఞయని, కొందరు ఆశ అని అందురు, ఆమెనే యోగులు నిత్యయోగస్థితిచేత విష్ణువుయొక్క మాయ అని యందురు.(60)

వదన్తి సర్వే కేనసిద్దాంతయుక్తాం యాం యోగమాయాం జ్ఞానశక్త్యన్వితా యే|| 61

దదృశుస్తాం మహాలక్ష్మీమాయాన్తీం శనకైస్సదా | గౌరాం చ యువతీం స్నిగ్థాం పద్మకింజల్కభూషణామ్‌ || 62

సుస్మితాం సుద్విజాం శ్యామాం నవ¸°వనభూషణామ్‌|| విచిత్రవస్త్రాభరణరత్నానేకోద్యతప్రభామ్‌ ||63

బింబోష్ఠీం సునసాం తన్వీం సుగ్రీవాం చారులోచనామ్‌| సుమధ్యాం చారుజఘనాం బృహత్కటితటాం తథా|| 64

నానారత్నప్రదీపైశ్చ నీరాజితముఖంబుజామ్‌ | చారుప్రసన్నవదనాం హారనూపురశోభితామ్‌|| 65

మూర్దని ధ్రియమాణన ఛత్రేణాపి విరాజితామ్‌ | చామరైర్వీజ్యమానాం తాం గంగాకల్లోలలోహితై: 66

ఆమెనే అందరూ కేనోపనిషత్తున ప్రతిపాదించబడిన ఉమా శబ్దము చేత చెప్పబడు బ్రహ్మవిద్యయనీ జ్ఞానశక్తిగల వారై యోగమాయ యనీ అందురు.(61) వారు నెమ్మదిగా వచ్చుచున్న మహాలక్ష్మీని చూచిరి. ఆమె ఎరుపు వన్నె గల యువతి,సుకుమారమైనది పద్మ కింజల్కములనలంకరించుకొనినది. (62) చిరునగవుతో మంచిదంతములుగలది, ¸°వన మధ్యమున నున్నది, ¸°వనమే భూషణముగా గలది, విచిత్రమగు వస్త్రములు ఆభరణములు, రత్నములు మొదలగు వానిచేత ప్రకాశించుచున్నది(63) బింబఫలము వంటి పెదవులుగలది, చక్కని ముక్కు, దేహము, చక్కని కంఠము, కళ్ళు , నడుము, జఘనము, విశాలమైన కటిస్థలము గలది (64) వివిధరత్నకాంతులచే మిగులు ప్రకాశించిన ముఖపద్మము గలది, సుందరముగా ప్రసన్నముగా నుండు ముఖముగలది, హారముచే నూపురములచే శోభిల్లునది(65) తలపైనున్న ఛత్రము(గొడుగు) చేత ప్రకాశించుచున్నది గంగా తరంగముల కల్లోలముచేత ఎరుపెక్కిన చామరములచేత వీవబడుచున్నది .(66)

పాండురం గజమారూఢాం స్తూయమానాం మహర్షభి:| సురద్రుమపుష్పమాలాం బిభ్రతీం మల్లికాయుతామ్‌ || 67

కరాగ్రే ధ్రియమాణాం తాం దృష్ట్యా దేవాస్సమత్సుకా :| ఆలోకనపరా యావత్తావత్తాన్‌ దదృశే హ్యసౌ|| 68

దేవాంశ్చ దానవాంశ్చెవ సిద్దచారణపన్నగాన్‌ | యథా మాతా స్వపుత్రాంశ్చ మహాలక్ష్మీస్తథా సతీ ||69

ఆలోకితాస్తథా దేవాస్తయా లక్ష్మ్యాత శ్రియాన్వితా:| సంజాతాస్తత్‌క్షణాదేవ రాజ్యలక్షణలక్షితా:|| దైత్యాస్తే ని:శ్రికా జాతా యే శ్రియానవలోకితా:||70

నిరీక్ష్యమాణా చ తదా ముకుస్దం తమాలనీలం సుకపోలనాసమ్‌ | బిభ్రాజమానం వపుషా పరేణ శ్రీ వత్సలక్ష్మ సదయావలోకమ్‌ || 71

దృష్ట్యా తదూన సహసా వనమాలయాన్వితా లక్ష్మీర్గజాదవతతార సువిస్మయన్తీ| కంఠే ససర్జ పురుషస్య విష్ణోర్‌ మాలాం శ్రియా విరచితాం భ్రమరైరుపేతామ్‌||72

తెల్లని ఏనుగునధిరోహించిన లక్ష్మిని, మహర్షులచేత స్తుతింపబడుచున్నదానిని, దేవవృక్షముయొక్క పూలచే చేసిన మాలను ధరించి , మల్లికలతో కూడిన (67) (మాలను) చేతియందు ధరించిన దానిని చూచి దేవతలు ఉత్సుకతతో చూచుచుండగా ఆమె వారిని చూచెను. (68) తల్లి ఏవిధంగా తన బిడ్డలను చూచునో అదేవిధంగా లక్ష్మీదేవి దేవదానవులను. సిద్దులను, చారణులను,నాగులను చూచినది(69) లక్ష్మీ దేవిచే చూడబడిన దేవతలు అదే క్షణములోనే ఐశ్వర్యమునొంది రాజ్యలక్షణములను పొందిరి. ఆమెచే చూడబడని దైత్యులు తమ వైభవమును కోల్పోయినవారైరి.(70) అపుడు లక్ష్మీదేవి తమాలవృక్షమువలె నీలముగా నున్న, చక్కని కపోలము, నాసిక గలిగిన, దయతోనున్న చూపులు గలిగిన విష్ణువును చూచెను. (71) వెంటనే వనమాలతో సహా గజమునుండి క్రిందికిదిగి అందరినీ విస్మయపరుస్తూ పరమపురుషుడైన విష్ణుమూర్తి మెడలో గొప్ప శోభను కలిగి తుమ్మెదలతో నున్న వనమాలను వేసినది.(72)

వామాంగమాశ్రిత్య తదా మహాత్మన: సోపావిశత్త్రత సమీక్ష్యతా ఉభౌ|| సురాస్సదైత్యా ముదమాపురద్భుతాం సిద్ధాప్సర:కిన్నరచారణాశ్చ|| 73

సర్వేషామేవ లోకానామైనపద్యేన సర్వశ:| హర్షో మహానభూత్తత్ర లక్ష్మీనారాయణాగమే|| 74

లక్ష్మ్యావృతో మహావిష్ణుర్లక్ష్మీస్తేనైవ సంవృతా | ఏవం పరస్పరం ప్రీత్యా హ్యవలోకనతత్పరౌ|| 75

శంఖాశ్చ పటహాశ్చై మృదంగానకగోముఖా:| భేర్యశ్చ ఝర్ఘరీణాం చ స శబ్దస్తుములోభవత్‌ ||76

బభూవ గాయకానాం చ గాయనం సుమహత్తదా| తతాని వితతాన్యేవ గనాని సుషిరాణి చ|| 77

ఏవం వాద్యప్రభేదైశ్చ విష్ణుం సర్వాత్మనా హరిమ్‌| అతోషయన్సుగీతజ్ఞా గంధర్వాప్సరసాం గణా:||78

తదా జగుర్నారదతుంబురాదయో గంధర్వయక్షా: సురసిద్దసంఘా : పరమాత్మరూపం నారాయణం దేవమగాధబోధమ్‌|| 79

ఇతి శ్రీస్కాందమహాపురాణ మహాశ్వరఖండే

కేదారఖండే సముద్ర మన్థనాఖ్యానే అక్ష్మీ ప్రాదుర్భావ వర్ణనం నామ ఏకాదశోధ్యాయ:

అపుడు లక్ష్మీదేవి మహాత్ముడైన విష్ణుమూర్తి ఎడమవైపున చేరి కూర్చోనెను. వారిద్దరినీ జూచి సురులు, దైత్యులు, సిద్దులు, అప్సరసలు, కిన్నరులు, చారణులు, సంతోషమునొందిరి (73) లక్ష్మీనారాయణుల సమాగమము చేత లోకములన్నింటికీ ఒక్కమారుగా గొప్ప ఆనందముకలిగినది (74) మహావిష్ణువును లక్ష్మీదేవి, ఆమెను మహావిష్ణువు వరించిన గాన ఒకరినొకరు ప్రేమతో చూచుకొనిరి. (75) శంఖములచ తప్పెటల, మృదంగముల,అనకముల (పెద్దభేరి) వేణువులాంటి వాద్యముల, బేరి,ఝర్ఘరీ మొదలైన వాద్యముల ధ్వని పెద్దదిగా వినబడెను. (76) గాయకుల గానము గొప్పదిగా నుండెను. తతముచ(తంత్రీవాద్యము) వితతము, ఘనము, సుషిరము(77) మరియు ఇతర వాద్యముల చేత గంధర్వుల, అప్సరసల గణముల గానపద్దతి తెలిసినవారై విష్ణువును అన్ని విధములుగా సంతోషపెట్టిరి(78) అపుడు, నారదుడు తుంబురుడు మొదలగువారు,గంధర్వులు, యక్షులు, సురులు,సిద్దులు, పరమాత్మరూపుడైన మహావిష్ణువును, అపరిమితజ్ఞానరూపుడిని గూర్చి గానముచేసిరి(79)

శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండములోని కేదారఖండమున

క్షీరసముద్రమథనాఖ్యానమున లక్ష్మీ ప్రాదుర్భవించుటను వర్ణించు పదకొండు అధ్యాయము సమాప్తము

ద్వాదశోధ్యాయ:

లోమశ ఉవాచ:

ప్రణమ్య పరమాత్మానం రమాయుక్తం జనార్థనమ్‌| అమృతార్థం మమంథుస్తే సురాసురగణా: పున:|| 1

ఉదధేర్మథ్యమానాచ్చ నిర్గతస్సుమహాయశా: ధన్వంతరీతి విఖ్యాతో యువా మృత్యుంజయ: పర:|| 2

పాణిభ్యాం పూర్ణకలశం సుధాయా: పరిగృహ్య వై | యావత్సర్వే సురాస్సర్వే నిరీక్షంతే మనోహరమ్‌ ||3

తదా దైత్యా: సమం గత్వా హర్తుకామా బలాదివ| సుధయా పూర్ఱకలశం, ధన్వరంతరికరే స్థితమ్‌ ||4

యావత్తరంగమాలాభిరావృతోభూద్భిషక్తమ:| శ##నైశ్శనై: సమాయాతో దృష్ఠోసౌ వృషవర్వణా|| 5

పన్నెండవ అధ్యాయము

లోమశుడు చెప్పెను:

లక్ష్మీ సహిత విష్ణుమూర్తి నమస్కరించి సురాసురగణములు అమృతముకొరకు సముద్రమును మరల మథించిరి. (1)మథింపబడిన సముద్రమునుండి గొప్పకీర్తిగల యువకుడు, మృత్యుంజయుడు, ధన్వంతరి' యను పేరుగలవాడు బయటకు వచ్చెను. (2) సురాసురులందరూ చూస్తుండగా సుందరమైన కలశములో అమృతము నింపి చేతులతో పట్టుకొని వచ్చెను. (3) అపుడు దైత్యులు ఒక్కమారుగా వెళ్ళి ధన్వంతరి చేతిలో నున్న అమృతముతోనిండిన కలశమును బలంగా అపహరించబోయారు(4) అలల మాలలచేత కప్పబడి ధన్వంతరి యుండగా , మెల్లగా వచ్చుచున్న అతనిని వృషపరుడుచూచెను.(5)

కరస్థ: కలశస్తస్య హృతస్తేన బలాదిన| అసురాశ్చ తతస్సర్వే జగర్జురతిభీషణమ్‌ ||6

కలశం సుధయా పూర్ణం గృహీత్వా తే సముత్సుకౌ :| దైత్యా: పాతాళమాజగ్ముస్తదా దేవా భ్రూమాన్వితా :|| 7

అనుజగ్ముస్సుసంనద్దా యోద్దుకామాశ్చ తైస్సహ| తదా దేవాన్‌ సమాలోక్య బలిరేవమభాషత|| 8

బలిరువాచ:

వయం తు కేవలం దేవా: సుధయా పరితోషితా:| శీఘ్రమేవ ప్రగన్తవ్యం భవద్భిశ్చ సురోత్తమై:||9

త్రివిష్టవం ముదా యు క్తై:కిమస్మాభి: ప్రయోజనమ్‌| పురాస్మాభి: కృతం మైత్రం భవద్భి: స్వార్థతత్పరై:|| అధునా విదితం తత్తు నాత్ర కార్యవిచారణా || 10

ధన్వంతరి చేతిలోని కలశమును అతడు బలముగా అపహరించెను. వెంటనే అసురులంతా భీషణంగా గర్జించిరి(6)

దైత్యులు పాతాళమునకు వచ్చిరి. అపుడు భ్రమపడిన దేవతలు(7) సన్నద్దులూ, దైత్యులతో యుద్దము చేయగొరి వారి ననుసరించిరి. అపుడు దేవతలను జూచి బలి ఇట్లనెను (8) దేవతలారా! మేము కేవలము అమృతముతో తృప్తిచెందిన వారము (మీరు కేవలము అమృతముతో మమ్ము సంతోషపరిచితిరి) సురశ్రేష్టులైన మీరంతా వెంటనే మరలిపొండి (9) త్వరగా స్వర్గానికి వెళ్ళండి.మాతోనేమి ప్రయోజనం ? పూర్వము మీరు స్వార్థ పూరితులై మాతో మైత్రిని చేసితిరి. ఇప్పుడది తెలిసినది. ఇక ఇందులో ఆలోచించవలసినది లేదు (10)

ఏవం నిర్భర్త్సితోస్తేన బలినా సురసత్తమా:| యథాగతేన మార్గేణ జగ్ముర్నారాయణం ప్రభుమ్‌|| 11

తం దృష్ట్యావిష్ణునా సర్వేసురా భగ్నమనోరథా: |ఆశ్వాసితా వచోభిశ్చ నానానునయకోవిదై:|| 12

మా త్రాసం కురుతాత్రార్దే అనయిష్యామి తాం సుధామ్‌ | ఏవమాభాష్య భగవాన్‌ ముకుందో నాథసంశ్రయ:|| 13

స్థాపయిత్వా సురాన్‌ సర్వాన్‌ తత్రైవ మధుసూదన:| మోహనీరూపమాస్థాయ దైత్యానామగ్రతోz భవత్‌|| 14

తావద్దైత్యా: సుసంరబ్దా: పరస్పరమథాబ్రువన్‌| వివాదస్సర్వదైత్యానామమృతార్థే తదాz భవత్‌ || 15

ఈవింధగా దేవతలు బలిచేత బెదిరింపబడినవారై వచ్చినబాటనే మహావిష్ణువు వద్దకు వెళ్ళిరి,(11) భంగపడిన మనోరథముతో తనను చేరిన దేవతలను విష్ణువు అనునయముతో కూడిన మాటలతో ఓదార్చెను.(12) ఈ విషయములో మీరు భయపడకండి. నేను అమృతాన్ని తీసుకొనివచ్చెదను అని పలికి లనాథలకు ఆశ్రయమిచ్చు విష్ణువు(13) అక్కడే దేవతలనందరినీ వుంచి మోహము కలిగించు రూపము దాల్చి దైత్యుల ఎదుట నిలిచెను (14) అప్పటికే దైత్యులు సంరంభాన్ని చేయుచూ పరస్పరము అనుకొనుటచే అమృతం విషయంలో దైత్యులకందరికీ వివాదమేర్పడెను. (15)

ఏవం ప్రవర్తమానే తు మోహినీ రూపమాశ్రితామ్‌| దృష్ట్యా యోషాం తదా దైవాత్సర్వభూతమనోరమామ్‌ || 16

విస్మయేన సమావిష్టా బభూవుస్తుషితేక్షణా:| తాం సంమాన్య తదా దైత్యరాజో బలిరువాచ హ|| 17

బలిరువాచ:

సుధా త్వయా విభక్తవ్యా సర్వేషాం గతిహేతవే | శీఘ్రత్వేన మహాభాగే కురుష్వ వచనం మమ:|| 18

ఏవముక్తా హ్యువాచేదం స్మయమానాబలిం ప్రతి | స్త్రీణాం నైవ చ విశ్వాస: కర్తవ్యో హి విపశ్చితా || 19

అనృతం సాహసం మాయా మూర్ఖత్వమతిలోభతా| అశౌచం నిర్‌ఘృణత్వం చ స్త్రీణాం దోషా: స్వభావజా:|| 20

ని:స్నేహత్త్వం చ విజ్ఞేయం ధూర్తత్వం చైవ తత్త్వత:| స్వస్త్రీణాం చైవ విజ్ఞేయా దోషా నాస్త్యత్ర సంశయ:|| 21

యథైవ శ్వాపదానాం చ వృకా హింసాపరాయణా: కాకా యథాణ్డజానాం చ శ్వాపదానాం చ జంబుకా:|| ధూర్తా తథా మనుష్యాణాం స్త్రీ జ్ఞేయా సతతం బుధై: || 22

ఇట్లు జరుగగా, దైవము వలనవచ్చిన మోహింపజేయురూపము గలిగిన అన్ని ప్రాణుల మనస్సు నూ ఆనందింపజేయు ఒక స్త్రీని జూచి(16) దైత్యులందరూ సంతోషమునొందిన నేత్రములు గలవారై విస్మయము నొందిరి, దైత్యులరాజుగు బలి అపుడామెను గౌరవించి ఇట్లుపలికెను (17) 'ఓ మహాభాగా! అందరి గతి కొఱుకు త్వరగా నీవు అమృతమును విభజింపుము. నామాటను ఆచరింపుము. (18) ఇట్లు దైత్యరాజనగా విస్మయము నొందిన ఆ స్త్రీ ఇట్లనెను ఆస్త్రీ ఇట్లనెను. బుద్దిమంతుడు స్త్రీలయందు విశ్వాసమునుంచడు.(19) అబద్దము , సాహసము (ఆలోచించక ఒక్కమారుగా పనిచేయుట) మాయ (కపటము) మూర్ఖత్వము, అతిలోభము, శుచిలేకపోవుట దయలేకపోవుట ఇవన్నీ స్త్రీలకుస్వభావముతో వచ్చిన దోషములు (20) అదే విధముగా స్నేహము లేకుండుట, ధూర్తత అనునవి కూడా వాస్తవానికి తన స్త్రీలలో కూడా వుండు దోషాలుగా తెలియవలెను. ఇందు సంశయము లేదు. ఏవిధముగానైతే క్రూరమృగాలలో తోడేళ్ళు హింసించు స్వభావము గలవో , పక్షులలో కాకి, జంతువులలో నక్క ఎలా ధూర్తులో మనుష్యులో స్త్రీ ధూర్తురాలని విజ్ఞులు తెలుసుకొనవలెను.(22)

మయా సహ భవద్భిశ్చ కథం సఖ్యం ప్రవర్తతే | సర్వధాత్ర న విజ్ఞేయా: కే యూయం చైవ కా హ్యహమ్‌ || 23

తస్మాద్భవద్భి : సంచిన్త్య కార్యావిచక్షణౖ :| కర్తవ్యం పరయా బుద్ద్యా ప్రయాతా సురసత్తమా:|| 24

మోహినీవృత్తాన్తమ్‌ నాతో మీకు స్నేహమెట్లు పొసగును? ఏవిధంగా నైనా మీరెవరో నాకు తెలియనవసరం లేదు. అలాగే నేనెవరో మీకు తెలియనవసరం లేదు. (23) కనుక , అసురశ్రేష్ఠులారా| చేయదగనిది, శ్రేష్ఠమైన బుద్దితో ఆలోచించి మీరు పనిచేయండి(24)

యాస్త్వయా కథితా నార్యో గ్రామ్యజనప్రియా: తాసాం త్వం కథ్యమానానాం మధ్యగా నాసి శోభ##నే|| 25

కిం త్వయా బహునోక్తేన కురుష్వ వచనం హిన :| సా మోహినీదం ప్రోవాచ బలేర్వాక్యాదనన్తరమ్‌ || 26

కరిష్యామి చ తే వాక్యం సూక్తామితి ప్రభో||27

బలిరు వాచ:

అద్యామృతం చ సర్వేషాం విభజస్వ యథాతథమ్‌ | త్వయా దత్తం చ గృహ్ఘీమ: సత్యాసత్యం వదామి తే|| 28

ఏవముక్తా తదా దేవీ మోహినీ సర్వమంగళా| ఉవాచాథాసురాన్‌ సర్వాన్‌ రోచయన్‌ లౌకికీం స్థితిమ్‌|| 29

బలి పలికెను: నీవుచెప్పిన స్త్రీలు గ్రామానికి చెందిన వారు గ్రామీణ జనులకు ఇష్టులు ఓ సుందరీ!నీవు వారి మధ్యలో వుండే స్త్రీవి కాదుకదా! (25) అయినా మిగులు మాటలాడుట ఎందులకు? మేము చెప్పినట్లు చేయుము బలి అట్లు అనిన పిమ్మట మోహిని పలికెను? (26)ప్రభూ! మంచి మాటలలోకెల్ల ఉత్తమమైన నీమాట ప్రకారమే చేసెదను (27) బలిపలికెను ఈనాడు వున్నదున్నట్లుగా అమృతము నందరికీ పంచుము. నందరికీ పంచుము మేముతప్పకుండా నీవుపంచినట్లే తీసుకొనెదమని చెప్పుచున్నాము (28) అట్లనిన అందరికీ శుభములు చేకూర్చు మోహినీదేవి అసురలందరికీ లౌకికస్థితి రుచించునట్లిట్లనెను (29)

భగవానువాచ:

యూయం సర్వే కృతార్థాశ్చజాతా కేనచిత్‌ | అద్యోపవాససంయుక్తా అమృతస్యాధివాసనమ్‌ ||30

క్రియతామసురశ్రేష్టా: శుభేచ్చా కించిదస్తి వ: | శ్వోభూతే పారణం కుర్యాద్ర్వతార్చననరతిశ్చ వ:||31

న్యాయోపార్జితవిత్తేన దశమాంశేన ధీమతా | కర్తవ్యో వినియోగశ్చ ఈశప్రీత్యర్థహేతవే|| 32

తథేతి మత్వా తే సర్వే యథోక్తం దేవమాయయా| చక్రుస్తథైవ దైతేయా మోహితా నాతికోవిదా:|| 33

మమాసురేణ తదా భవవాని కృతాని వై| మనోజ్ఞాని మహారాణి సుప్రభాణి మహాన్తి చ || 34

భగవంతుడనెను : ఒకానొక దైవముచేత మీరంతా కృతార్థులైతిరి, ఈ నాడు ఉపవాసముతో అమృతమును సేవించుడు(30) అసురశ్రేష్ఠులారా! మీకు శుభము పొందుకోరిక వున్నచో, వ్రతము, అర్చనమని ప్రీతియున్న రేపు ఉపవాసమును ముగింపుడు. (31)న్యాయముగా సంపాదించిన ధనములోని పదవవంతు ధనముచేత ఈశ్వరునికి ప్రీతి కలిగించుటకై వినియోగం చేయవలెను.(32)దేవమాయచేత అందరూ అట్లే అని పలికి, అట్లే ఆచరించిరి, దైత్యులందరూ మోహితులు మిక్కిలి ప్రజ్ఞావంతులుకారు (33)అపుడు మయుడు అసురుడు సుందరమైన గొప్పనైన, కాంతివంతము నైన గొప్ప భవనముల నిర్మించెను.(34)తేఘాపవిష్టాస్తే సర్వే సుస్నాతా: సమలంకృతా:| స్థాపయిత్వా సుసంరబ్థా: పూర్ఱం కలశమగ్రత:|| 35

రౌత్రౌ జాగరణం సర్వై: కృతం పరమయా ముదా| అథోషసి ప్రవృత్తే చ ప్రాత: స్నానయుతా భవన్‌|| 36

అసురా బలిముఖ్యాశ్చ పంక్తిభూతా యథాక్రమమ్‌ | సర్వమావశ్యకం కృత్వా తదా పానరతా భవన్‌|| 37

బలిశ్చ వృషపర్వా చ నముచి: శంఖ ఏవ చ | సుదంష్ట్రశ్చైవ సంహ్లాదీ కాలనేమిర్విభీషణ:||38

వాతాపిరిల్వల: కుంభో నికుంభప్రచ్చదస్తదా | తథా సుందోపనుందౌ చ నిశుంభశ్భుంభ ఏవ చ||39

మహిషో మహిషాక్షశ్చ బిడాలాక్ష: ప్రతాపవాన్‌ | చిక్షురాఖ్యో మహాబాహు :జృంభణోథ వృషాసుర|| 40

విబాహుర్బాహుకో ఘోరస్థథా వై ఘోరదర్శన:| ఏతే చాన్యే చ బహవో దైత్యదానవరాక్షసజా:|| యథాక్రమం చోపవిష్టా రాహు: కేతుస్తథైవ చ|| 41

ఆ భవనములందు అందరూ చక్కగా స్నానం చేసి బాగుగా అలంకరించుకొని ఎదుట పూర్ణ కలశమునుంచుకొని కూర్చొనిరి (35) రాత్రి అందరూ మిక్కిలి సంతోషముతో మేల్కొని వుండిరి,ఇక ఉష:కాలముననే ప్రోద్దున స్నానముచేసిరి(36) బలి మొదలుగా అసురులు ముఖ్యమైన పనులన్నీ ముగించి (అమృతమును) తాగు కోరికతో క్రమము ననుసరించి పంక్తిలో కూర్చొనిరి.(37) బలి, వృషపర్వుడు, నముచి, శంఖుడు, సుదంష్ట్రుడు, సంహ్లాది, కాలనేమి, విభీషణుడు (38) వాతాపి, ఇల్వలుడు, కుంభుడు, నికుంభుడు, ప్రచ్ఛదుడు, సుందుడు, ఉపసుందుడు, నిశుంభుడు, శుంభుడు (39) మహిషుడు, మహిషాక్షుడు, బిడాలాక్షుడు, ప్రతాపవంతుడైన చిక్షురుడు, మహాబాహువైన జృంభణుడు, వృషాసురుడు,(40) విబాహువు ,బాహుకుడు, ఘోరమైన దర్శనము గల ఘోరుడనువాడు మరియు ఇతర దైత్య దానవ రాక్షసులు, రాహువు, కేతువు కూడా క్రమము ననుసరించి కూర్చొనిరి.(41)

తేషాం తు కోటిసంఖ్యనాం దైత్యానాం పంక్తిరాస్థితా|| 42

తతస్తయా తదా దేవ్యా అమృతార్థం హి వై ద్విజా: | యజ్ఞాతం తచ్చృణుధ్వం హి తయా దేవ్యా కృతం మహత్‌ || 43

సర్వే విజ్ఞాపితాస్సద్యో గృహీతకలశా తదా | శోభయా పరయా యుక్తా సాక్షాత్సా విష్ణుమోహినీ || 44

కరస్థేన తదా దేవీ కలశేన విరాజితా | శుశుభే పరయా కాంత్యా జగన్మంగళమంగళా|| 45

పరివేషధరాస్సర్వే సురాస్తే హ్యసురాంతికమ్‌| ఆగతాస్తత్‌క్షణాదేవ యత్ర తే హ్యసురోత్తమా|| 46

తాన్‌ దృష్ట్యా మోహినీ సద్య ఉవాచ ప్రమదోత్తమా|| 47

కోటి సంఖ్యలో వున్న దైత్యుల పంక్తి కూర్చబడినది. (42) ఓ ద్విజులారా! అపుడు ఆ దేని అమృతముకొరకై ఏమిచేసినదో ,అక్కడ ఏమిజరిగినదో వినుడు (43) అపుడు విజ్ఞాపనము చేయగానే తమ తమ కలశములను పట్టుకొనిరి. అమిత కాంతి గల ఆ విష్ణుమోహిని (44) జగత్తుయొక్క పరమమంగళ##దేవి చేతిలోనున్న కలశముచేత మిగుల ప్రకాశించినది (45) అపుడు దేవతలు క్షణంలో వడ్డించువారి వేషములు ధరించి అసురులున్న దగ్గరికి వచ్చిరి (46) స్త్రీలలో శ్రేష్టురాలైన ఆ మోహిని వారిని చూచి ఇట్లనెను (47)

మోహిన్యువాచ:

ఏతే హ్యతిథయో జ్ఞేయా ధర్మసర్వస్వసాధనా: ఏభ్యో దేయం యథాశక్త్యా యది సత్యం వచో మమ|| ప్రమాణం భవతాం చాద్య కురుధ్వం మా విలంబథ|| 48

పరేషాముపకారం చ యే కుర్వన్తి స్వశక్తిత:| ధన్యాస్తే చైవ విజ్ఞేయా : పవిత్రా లోకపాలకా:|| 49

కేవలాత్మోదరార్థాయ ఉద్యోగం యే ప్రకుర్వతే | తే క్లేశభాగినో జ్ఞేయా నాత్ర కార్యా విచారణా|| 50

తస్మాద్విభజనం కార్యం మయైతస్య శుభవ్రతా:| దేవేభ్యశ్చ ప్రయచ్ఛధ్వం యద్ది చాత్మ ప్రియాప్రియమ్‌ || 51

మోహిని పలికెను: నామాట నిజమైతే వీరంతా ధర్మ సర్వస్వమును సాదించువారు, మన అతిథులు అని తెలుసుకొనుడు. వీరికి కూడా శక్తి మేరకు ఇవ్వవలిసినదే , ఈనాడు మీరు ప్రమాణమును గ్రహింపుడు ఆలస్యమును చేయకండి (48) ఇతరులకు తమశక్తి మేరకు ఎవరు ఉపకారమును చేస్తారో వారు ధన్యులు పవిత్రులు, లోకముల పాలించువారిని తెలియవలయును (49) కేవలము తన కడుపుకోసమెవరు ప్రయత్నింతురో, వారు నిస్సందేహముగా క్లేశమును పొందెదరు. (50)కనుక ఓ మంచినడవడిగలదైత్యులారా!నేనీ అమృతమును పంచవలెను మీ ఇష్టమైన ఎడల ఎంతో కొంత దేవతలకూ ఇవ్వండి. (51)

ఇత్యుక్తే వచనే దేవ్యా తథా చక్రురతంద్రితా: | ఆహ్వాయామాసురసురా: సర్వాన్దేవాన్సవాసవాన్‌ || 52

ఉపవిష్టాశ్చ తే సర్వే అమృతార్థం చ భో ద్విజా: తేఘాపవిశ్వమానేషు హ్యువాచ పరమం వచ: మోహినీ సర్వధర్మజ్ఞా అసురాణాం స్మయన్నివ|| 53

మోహిన్యువాచ:

ఆదౌ హ్యభ్యాగతా: పూజ్యా ఇతి వై వైదికీ శ్రుతి:| 54

తస్మాద్యూయం వేదపరా: సర్వే దేవపరాయణా: బ్రువంతు త్వరితేనైవ ఆదౌ కేషాం దదామ్యహమ్‌ || అమృతం హి మహాభాగా బలిముఖ్యా వదంతు భో:|| 55

బలినోక్తా తదా దేవీ యత్తే మనసి రోచతే| స్వామినీ త్వం న సందేహో హ్యస్మాకం సుందరాననే|| 56

ఇట్లుమోహిని పలుకగా వెంటనే అసురులు ఆలస్యము లేకుండా అట్లే చేసిరి. ఇంద్రుడు మొదలైన దేవతలనందరినీ ఆహ్వానించిరి (52) ఓ బ్రాహ్మణులారా! అపుడుఅందరూ అమృతము కొఱుకు కూర్చొనిరి, వారంతా కూర్చొనగా, అన్ని ధర్మములను తెలిసిన మోహిని అసురులను విస్మయపరుస్తూ ఇట్లనెను (53) ముందువచ్చినవారు పూజకు అర్హులని కదా వైదిక వాక్యము(54) కనుక వేదపరులు, దేవపరాయణులైన మీరు ముందు ఎవరికివ్వవలెనో త్వరగా చెప్పుడు. బలిమొదలైన మహానుభావులారా! అమృతమును ఎవరికివ్వవలెనో చెప్పుడు (55) అపుడు బలిఅనెను నీ మనస్సు కెట్లు ఇష్టమగునో అట్లు చేయుము. ఓ సుందరమైన ముఖముగల స్త్రీ! నీవు నిస్సందేహముగా మాకు ఆధికారిణివి(56)

ఏవం సంమానితా తేన బలినా భావితాత్మనా| పరివేషణకార్యార్థం కలశం గృహ్య సత్వరా|| 57

తస్మాన్నరేంద్ర కరభోరులసద్దుకూలా| శ్రోణీతటాలసగతిర్మదవిహ్వలాంగీ | సాకూజాతీ కనకనూపురసింజితేన కుంభస్తనీ కలశపాణిరథావివేశ|| 58

తదా తే దేవీ పరివేషయన్తీ సా మోహినీ దేవగణాయ సాక్షాత్‌ పవర్ష దేవేషు సుధారసం పున: పున: సుధాహారరసామృతం యథా || 59

పునశ్చ తే దేవగణస్సుధారసం దత్తం తయా పరయా విశ్వమూర్త్యా | దేవేంద్రముఖ్యాస్సహ లోకపాలా:

గంధర్వ యక్షాప్పరసాం గణాశ్చ || 60

ఇట్లు బలిచేత గౌరవింపబడిన మోహిని వడ్డించుటకై అమృతకలశమును త్వరగా తీసుకొని (57) గజరాజు తొండము వంటి తొడలపై శోభిల్లు వస్త్రముతో, జఘన భాగముయొక్క బరువుచే నెమ్మదిగా నడచుచూ, తన అవయముల మోయుటకశక్తురాలివలె, బంగారు నూపురములచేత ఆవ్యక్త మధుర ధ్వనిని కలుగచేయుచు , కుంభము (కడవల వంటి) స్తనములు గల ఆ మోహిని చేతిలో అమృత కలశముతో ప్రవేశించెను.(58) అపుడు దేవగణము కొరకమృతమును వడ్డించుచు సాక్షాత్తుగా అమృతరసమును దేవతల పై కురిపించెను. మరల మరల అట్లు విశ్వమూర్తి యగు మోహినిచే నివ్వబడిన సుధారసమును దేవేంద్రుడు మొదలుగా లోకపాలురు, గంధర్వులు , యక్షులు, అప్సరసలు (గ్రోలిరి) (60)

సర్వే దైత్యా అసనస్థాస్తదానీం చింతాన్వితా: క్షుధయాపీడితాశ్చ: తూష్ణీంభూతా బలిముఖ్యా ద్విజేంద్రా మనస్వినో ధ్యానపరా బభూవు:|| 61

తతస్తథావిధాన్‌ దృష్ట్యా దైత్యాంస్తాన్‌ మోహమాశ్రితాన్‌ : తదా రాహుశ్చ కేతుశ్చ ద్వావేతౌ దైత్యపుంగవౌ|| 62

దేవానాం రూపమాస్థాయ అమృతార్థం త్వరాన్వితౌ| ఉపవిష్ఠా తదా పంక్త్యాం దేవానామమృతార్థినౌ||63

యదామృతం పాతుకామో రాహు : పరమదుర్జయ: | చంద్రార్కాభ్యాం ప్రకథితో విష్ణోరమితతేజస:|| 64

తదా తస్య శిరశ్చిన్నం రాహోర్దుర్విగ్రహస్య చ | శిరో గగనమాపేదే కబంధం చ మహీతలమ్‌|| భ్రమమాణం తదా హ్యద్రీంశ్చూర్ణయామాస వై తదా|| 65

సాద్రిశ్చ సర్వభూలోకశ్చూర్ణితశ్చ తదాభవత్‌ | తయా తేన చ దేహేన చూర్ణితం సచరాచరమ్‌ || 66

ఓ బ్రాహ్మణులారా! ఆసనములయందున్న దైత్యులందరూ అపుడుచింతతో కూడిన వారై ఆకలిచేత పీడింపబడిరి, బలిమొదలైన దైత్యులు అభిమాము గలవారై ఆలోచనలో మునిగి మౌనముగా నుండిరి (61) అపుడట్టి దైత్యులను , మోహమునిందిన వారిని జూచి , రాహుకేతువులను దైత్య ప్రముఖులు (62) అమృతముకొఱకు త్వరగా దేవతల రూపమును దాల్చి దేవతల పంక్తి లో కూర్చొనిరి. (63) ఎప్పుడైతే వారు అమృతమును త్రాగదలిచారో, అపుడు సూర్యచంద్రులు రాహువును గూర్చి గొప్పతేజస్సుగల విష్ణువుకు చెప్పిరి (64) అపుడు చెడు రూపముగల రాహువు యొక్క తల ఛేదింపబడెను. తల ఆకాశమును, మొండెము భూమిని చెరెను. ఆ మొండెము భ్రమిస్తూ పర్వతములతో సహా అపుడు భూమినంతా పొడిగాచేసెను. మోహిని చేత ఆ విధంగా రాహువు కబంధముతో చరాచరమంతా పొడిగా చేయబడెను (66)

దృష్ట్యా తదా మహాదేవస్తస్యోపరి తు సంస్థిత:| నివాస: సర్వదేవానాం తస్యా: పదతలేభవత్‌ || 67

పీడనం తత్సమీపేథ నివాస ఇతి నామ వై|| 68

మహతామాలయం యస్మాద్యస్యాస్తచ్చరణాంబుజమ్‌ | మహాలయేతి విఖ్యాతా జగత్త్రయవిమోహినీ|| 69

కేతుశ్చ ధూమారూపోసౌ అకాశే విలయం గత: | సుధాం సమర్ప్య చంద్రాయ తిరోధానగతోభవత్‌ || 70

వాసుదేవో జగద్యోనిర్జగతాం కారణం పరమ్‌ | విష్ణో : ప్రసాదాత్తజ్ఞాతం సురాణాం కార్యసిద్దిదమ్‌ || 71

అసురాణాం వినాశాయ జాతం దైవవిపర్యయాత్‌ | వినా దైవేన జానీధ్వం ఉద్యమో హి నిరర్ధక:|| 72

¸°గపద్యేన తైస్సర్వై: క్షీరాబ్దేర్మంథనం కృతమ్‌ | సిద్దిర్జాతా హి దేవానామసిద్దిరసురాన్‌ ప్రతి || 73

తతశ్చ తే దేవవరాన్ర్పకోపితా దైత్యాశ్చ మాయాప్రవిమోహితా : పున :| అనేక శస్త్రాస్త్రయుతాస్తదా భవన్‌ విష్ణౌ గతే గర్జమానాస్తదానీమ్‌ || 74

ఇతిశ్రీ స్కాందే మాహేశ్వర ఖండే కేదారఖండే ద్వాదశోధ్యాయ:

అదిచూచి మహాదేవుడు దాని పై నిలిచెను అపుడు దేవతలందరి నివాసము అతని పాదతలమున నుండెను(67) దాని సమీపమున పీడనమగుటచే అది నివాసమాయెను (68) గొప్పవారి నివాసమగుటచే యాపాదకమలము మహాలయమని ప్రసిద్దిని పొందెను. మరియు ముల్లోకముల మోహింపజేయునదాయెను (69) కేతువు కూడా ధూమ (పొగ) రూపమున ఆకాశమున లయించెను. విష్ణువు చంద్రునికి అమృతము నర్పించి అంతర్హితుడాయెను.(70) లోక కారకుడు అదిహేతువగు విష్ణువు యొక్క ప్రసాదము వలన దేవతల పని సిద్దించెను(71) దైవము యొక్క విపర్యయము అసురులకు వినాశనము వాటిల్లెను దైవము లేనిది ప్రయత్నము నిష్ర్పయోజనమని తెలుసుకొనుడు (72) దేవతలంతా కలిసి క్షీరసాగరాన్ని చిలికినప్పటికి దేవతలకు సిద్ది (విజయము) లభించినది, అసురులకు ఆసిద్ది(ఆపజయము) లభించినది (73) అటు తరువాత మరల మాయచే మోహము నొందిన దైత్యులు దేవతల పట్ల కోపము నొంది అనేక శాస్త్రములను అస్త్రములను తీసుకొని విష్ణువు వెళ్ళిపోగానే గర్జింపసాగిరి (74)

శ్రీ స్కాందపురాణమున మాహేశ్వరఖండమున కేదారఖండమున పన్నెండవ అధ్యాయము సమాప్తము?

త్రయోదశోధ్యాయ:

లోమశ ఉవాచ:

తతస్తే గర్జమానాశ్చ ఆక్షిపంతస్సురాన్రణ | శతక్రతుప్రముఖ్యాంస్తాన్మహాబలపరాక్రమాన్‌ || 1

విమానమారుహ్య తదా మహాత్మా వైరోచని: సర్వబలేన సార్థమ్‌ || దైత్వై: సమేతో వివిధైర్మహాబలై: సురాన్ర్పదుద్రావ మహాభయావహమ్‌ || 2

స్వాని రూపాణి బిభ్రంత: సమాపేతు స్సహస్రశ| : కేచిద్వ్యాఘ్రాన్సమారూఢా మహిషాంశ్చ తథా పరే || 3

అశ్వాన్‌ కేచిత్సమారుఢా ద్విపాన్‌ కేచిత్తథా పరే సింహాంస్తథా పరే రూఢా: శార్దూలాన్‌ శరభాంస్తథా|| 4

మయురాన్‌ రాజహంసాంశ్చ కుక్కుటాంశ్చ తథాపరే| కేచిద్ద్యాసన్సమారుఢా ఉష్ట్రానశ్వతరానపి ||5

గజాన్‌ ఖరాన్‌ పరే చైవ శకటాంశ్చ తథా పరే | పాదాతా బహవో దైత్యా:ఖడ్గశక్త్యు

ష్ఠిపాణయ:||6

పరిఘాయుధిన: పాశశూలముద్గరపాణయ: అసిలోమాన్వితా: కేచిద్‌ భుశుండీపరిఘాయుధా:||7

పదమూడవ అధ్యాయము

లోమశుడు చెప్పెను:

దైత్యులు గర్జించుచున్నవారై రణమునందు ఇంద్రుడు మొదలైన గొప్పబలముగల దేవతలను ఆక్షేపిస్తూ (నిలిచిరి) (1) అపుడు మహాత్ముడైన వైరోచనుడు (బలి) విమానమెక్కిపూర్తి బలముతో, గొప్ప బలముగల దైత్యులతో కలిసి మిక్కిలి భయము కలిగించునటుల దేవతలను తరిమెను(2) దైత్యులు తమ తమరూపములను దాల్చి వేలకొలది వచ్చిపడిరి. కొందరు పులుల నెక్కి, కొందరు దున్నలనెక్కి(3) కొందరు గుర్రములను, కొందరు ఏనుగులను, కొందరుసింహములను, కొందరు శార్థూలములను కొందరు శరభములను (4) నెమళ్ళను, రాజహంసలను , కోళ్ళను, ఒంటెలను, అశ్వములను, (5) ఇట్లు ఏనుగులను, గాడిదలను, బళ్ళను వాహనములుగా చేసుకొని వచ్చిరి. కొందరు పాదచారులైవచ్చిరి. చాలామందిదైత్యులు ఖడ్గములను, శక్తి, ఋష్ఠిమొదలగు ఆయుధములను ధరించిరి (6) కొందరు పరిఘలను, పాశములను, శూలములను, ముద్గరములను, కత్తులను, భుశండీ, పరిఘ మొదలగు ఆయుధములను ధరించిరి(7)

హయనాగరథాశ్చాన్యే సమారుఢా:

ప్రహారిణ:| విమానాని సమారూఢా బలిముఖ్యా: సహస్రశ:|| 8

స్పర్థమానాస్తథాన్యోన్యం గర్జంతశ్చ ముహుర్మహు:| వృషపర్వా హ్యువాచేదం బలినం దైత్యపుంగవమ్‌|| 9

త్వయా కృతం మహాబాహో ఇంద్రేణ సహ సంగమమ్‌| విశ్వాసో నైవ కర్తవ్యో దుర్హృదా న కథంచం|| 10

ఊనేనాపి హి తుచ్చేన వైరిణాపి కథంచన | మైత్రీ బుద్దిమతా కార్యా ఆపద్యపి నివర్తతే|| 11

న విశ్వసేత్పూర్వవిరోధినా క్వచిత్పరాజితా : స్మోథ బలే త్వయా ధునా| పురాణదుష్టా: కథమద్య వై పునర్‌ మంత్రం వికర్తుం న చ తే యతేరన్‌ || 12

ఇత్యూచుస్తే దురాధర్షా యోద్దుకామా వ్యవస్థితా:| ధ్వజైశ్భత్రై: పతావైశ్చ రణభూమిమమండయన్‌ || 13

గుర్రములను, ఏనుగులను, రథములనూ ఎక్కి ఆయుదముల ధరించిరి, బలిమొదలగు ముఖ్యమైనవారు వేలకొలదిగా విమానములనెక్కిరి(8) ఒకరితో నొకరు పొటిపడుచు, మాటిమాటికీ గర్జించుచూ వుండిరి. అపుడు ఇంద్రుడు దైత్యశ్రేష్టుడగు బలినుద్దేశించి ఇట్లనెను (9) గొప్పబాహువుల గలవాడా! నీవు ఇంద్రునితో కలిసితివి.చెడు బుద్దిగలవానియందు విశ్వాసముంచరాదు.(10) అదేవిధంగా తక్కువవాడు తుచ్ఛడగు శత్రువు పై విశ్వాసమొనర్చరాదు. బుద్దిమంతునితో చేసిన స్నేహము ఆపదలలో కూడా ఉపయోగించును (11) పూర్వము శతృత్వమున్నవాని యందు విశ్వాసముంచరాదు. ఓ బలీ! నేడు మేము నీచేత పరాజితులమైతిమి పూర్వమే దోషములుగలవారు మరల ఆలోచనను చేధించుటకు ఏల ప్రయత్నించరు? (12) ఇట్లు పలికి ఎదిరింప శక్యముకాని వారు, యుద్దముచేయనిలిచినవారు, పతాకములచేత, ఛత్రముల చేత ఆ రణభూమినలంకరించిరి(13)

చామరైశ్చ దిశస్సర్యా లోపితం చ రణస్థలమ్‌| తథా సర్వే సురాస్తత్ర దైత్యాన్ర్పతి షముత్సుకా:|| 14

పీత్వామృతం మహాభాగా వాహనాన్యారూహ్య దంశితా: గజారూఢో మహేంద్రోపి వజ్రపాణి: ప్రతాపవాన్‌ || సూర్యశ్చోచ్చై: శ్రవారూఢో మృగారూఢశ్చ చంద్రమా :|| 15

ఛత్రచామరసంవీతా: శోభితా విజయశ్రియా| ప్రణమ్య విష్ణుం తే సర్వ ఇంద్రాద్యా జయకాంక్షిణ:||16

తే విష్ణునా వ్యానుజ్ఞాతా అసురాన్ర్పతి వై రుషా| అసురాశ్చ మహాకాయా భీమా

క్షా భీమవిక్రమా:|| 17

తేషాం ఘోరమభూద్యుద్ధం దేవానాం దానవైస్సహ | తుములం చ మహాఘోరం సర్వభూతభయావహమ్‌|| 18

చామరములచేత అన్ని దిక్కులు,రణభూమి కప్పబడెను. అదేవిధంగా దేవతలంతా దైత్యులపట్ల రణోత్సుకతను ప్రదర్శించిరి.

(14) వారంతా అమృతమునున ద్రావి వాహనముల నెక్కి, జోళ్ళను ధరించినవారు,వజ్రమును ధరించిన ప్రతాపవంతుడగు మహేంద్రుడు గజమునధిరోహించెను. సూర్యుడుచ్చె:శ్రవమను గుర్రమును, చంద్రుడు మృగము (జింక) నధిరోహించిరి.(15)జయమును కొరుచున్న ఇంద్రుడు మొదలగు దేవతల ఛత్రచామరములతో కూడుకుని విజయలక్ష్మి చేత ప్రకాశిస్తూ విష్ణువును నమస్కరించిరి.(16) విష్ణువు నుండి అనుజ్ఞను పొంది దేవతలు మిగులు రోషముతో అసురులనెదుర్కొనిరి. అసురులు కూడా గొప్ప శరీరముగలవారై , భయముగలవారై, భయముగొలువు కన్నులతో పరాక్రమముతో (దేవతలనెదుర్కొనిరి) (17) దేవతలకు దైత్యులతో మిక్కిలి ఘోరమగునది అన్నిప్రాణులకు భయమును గొలుపు యుద్దముజరిగెను.(18)

శరధారాన్వితం సర్వం బభూవ పరమాద్భుతమ్‌! తతశ్చటాశబ్దా బభూవుశ్చ దిశో దశ|| 19

తతో నిమిషమాత్రేణ శరఘాతయుతా భవన్‌ | శరతోమారనారాచైరాహతాశ్చాపతన్‌ భువి || 20

విధ్యమానాస్తథా కేచిద్వివిధుశ్చాపరాన్రణ | భ##ల్లైర్భగ్నాశ్చ పతితా నారచైః శకలీకృతాః || 21

క్షురప్రహరితాః కేచిద్దైత్యా దానవరాక్షసాః | శిలీముఖైర్మారితాశ్చ భగ్నాః కేచిచ్చ దానవాం || 22

ఏవం భగ్నం దానవానాం చ సైన్యం దృష్ట్వా దేవా గర్జమానాస్సమంతాత్‌ | దృష్టాః సర్వే సంమిళిత్వా తదానీం లబ్ధ్వా యుద్ధే తే జయం శ్లాఘయన్తే || 23

శంఖవాదిత్రఘోషేణ పూరితం చ జగత్త్రయమ్‌ | దేవాన్ర్పతి కృతామర్షా దానవాస్తే మహాబలాః || 24

అంతటా బాణముల ప్రవాహముండెను. పరమాద్భుతముగా పది దిక్కులా టచటచా శబ్దములు ఏర్పడెను (19) అంతట, ఒక్క నిమిషములోనే కొందరు బాణము దెబ్బ తగిలినవారాయెను. తోమర, లోహపు అంచుగల బాణములతో కొట్టబడి నేలపై బడిరి. (20) కొందరు బాణములచే కొట్బడుచూ ఇతరులను రణమున బాణములతో బాధించుచుండిరి. (21) ఛురికల చేత కొందరు దైత్యులు, దానవులు, రాక్షసులు దెబ్బతీయబడిరి. కొందరు బాణములచేత కొట్టబడి దెబ్బతిరిని. (22) ఇట్లు దానవుల సైన్యము చెదిరిపోగా చూచి దేవతలు ఒక్కమారుగా గర్జించుచూ, యుద్ధమున జయముపొందితిమని సంతోషించి అందరూ కలిసి ఒకరినొకరు పొగిడిరి. (23) అపుడు ముల్లోకములూ శంఖము, వాదిత్రము అను వాద్యములు ఘోషచేత నిండెను. మహాబలురైన దానవులపుడు దేవతలపట్ల అసహనమును కలిగియుండిరి. (24)

బలిప్రభృతయస్సర్వే సంభ్రమేణాత్థితాః పునః | విమానైస్సూర్యసంకాశైరనేకైశ్చ సమన్వితాః || 25

ద్వంద్వయుద్ధం సుతుములం దేవానాం దానవైస్సహ | సంప్రవృత్తం పునశ్చైవ పరస్పరజిగీషయా || 26

బలినా దానవేంద్రేణ మహేంద్రో యుయుధే తదా | తథా యమో మహాబాహుర్నముచ్యా సహ సంగతం || 27

నైర్‌ఋతః ప్రఘసేనైవ పాశీ కుంభేన సంగతః | నికుంభేనైవ సుమహద్యుద్ధం చక్రే సదారయః || 28

సోమేన సహ రాహుశ్చ యుద్ధం చక్రే సుదారుణమ్‌ | రాహునా చంద్రదేహోత్థమమృతం భక్షితం తదా |

సంపర్కాదమృతసై#్యవ యథారాహుస్తథాzభవత్‌ || 29

తాని సర్వాణి దృష్టాణి శంభునా పరమేష్ఠినా | ఆశ్రయోzహం చ సర్వేషాం భూతానాం నాత్ర సంశయః ||

అసురాణాం సురాణాం చ సర్వేషామపి వల్లభః || 30

బలిమొదలైన వారంతా సంభ్రమముగా లేచి సూర్యకాంతితో సమానమగు కాంతిగల అనేక విమానముల నధిరోహించిరి. (25) దేవతలకు దానవులతో ఘోరమగుయుద్ధము మరల ఒకరినొకరు జయించవలెనను కోరికతో జరిగెను. (26) అపుడు దానవరాజయిన బలితో మహేంద్రుడు యుద్ధము చేసెను. అదేవిధముగా మహాబాహువైన యముడు నముచితో తలపడెను (27) నైర్‌ఋతుడు ప్రఘసునితో, వరుణుడు కుంభునితో, వాయువు నికుంభునితో పోరాడిరి (28) రాహువు చంద్రునితో దారుణమైన యుద్ధమును చేసెను. అపుడు చంద్రుని దేహమునుండి వెడలిన అమృతమును రాహువు భక్షించెను. అమృతము యొక్క సంపర్కము వలన రాహువు అట్లే వుండెను. (29) పరమేష్ఠియగు శివుడిదంతా చూచెను. అన్ని ప్రాణులకూ నిస్సంశయముగా నేనే ఆశ్రయమును. ఆసురులకు సురులకు అందరికీ నేనిష్టుడను. (30)

ఏవముక్తస్తదా రాహుః ప్రణమ్య శిరసా శివమ్‌ | మౌళౌ స్థితస్తదా చంద్రో అమృతం వ్యసృజద్భయాత్‌ || 31

తేన తస్య హి జాతాని శిరాంసి సుబహూన్యపి | ఐకపద్యేన తేషాం చ స్రజం కృత్వా మనోహరామ్‌ ||

బబంధ శంభుశ్శిరసి శిరోభూషణవత్కృతమ్‌ || 32

అశనాత్కాలకూటస్య నీలకంఠోzభవత్తదా | దేవానాం కార్యసిద్ధ్యర్థం ముండమాలా తథా కృతా || 33

దధార శిరసా తాం చ ముణ్డమాలాం మమేశ్వరః || 34

తయా స్రజాzసౌ శుశుభే మహాత్మా దేవాదిదేవస్త్రిపురాంతకో హరః | గజాసురో యేన నిపాతితో మహా నథాంధకో యేన కృతశ్చ చూర్ణః || 35

గంగా ధృతా యేన శిరస్సు మధ్యే చంద్రం చ చూడే కృతవాన్భయాపహః | వేదాః పురాణాని తథాగమాశ్చ తథైవ నానాశ్రుతయోzథ శాస్త్రమ్‌ || 36

అట్లనగా రాహువు తలవంచి శివునకు నమస్కరించెను. అపుడు తలపైనున్న చంద్రుడు భయముతో అమృతమును విడిచెను. (31) దానిచే అతనికి పెక్కుతలలు కలిగెను. శివుడు ఒక్కమారుగా వానిచే మనోహరముగా నుండు మాలను చేసి శిరోభూషణముగా తలపై కట్టెను. (32) కాలకూటమును భక్షించుటచేత శివుడు నీలకంఠుడాయెను. దేవతల పని సిద్ధించుటకై అపుడు 'ముండమాల' చేయబడెను (33) మహేశ్వరుడా ముండమాలనపుడు తలపై ధరించెను. (34) ఎవరు గజాసురుని సంహరించెనో, అంధకాసురుని దునుమాడెనో, త్రిపురములనునశింపజేసెనో అట్టి దేవాదిదేవుడగు శివుడా మాలతో ప్రకాశించెను. (35) ఆ శివుడు తన తలపై గంగను ధరించెను. జటలపై చంద్రుని ధరించెను. అతను భయమును దూరముచేయును. వేదములు, పురాణములు, ఆగమములు, అట్లే నానావేదములు, శాస్త్రములు, శిఉవని గూర్చి చెప్పును. (36)

జల్పంతి నానాగమ భేదభేదై ర్మీమాంసమానాశ్చ భవన్తి మూకాః |

నానాగమాచార్యమతప్రభేదై ర్నిరూప్యమాణో జగదేకబంధుః || 37

శివం హి నిత్యం పరమాత్మదైవం వేదైకవేద్యం పరమాత్మదివ్యమ్‌ | విమాయ తం మూఢజనాః ప్రమత్తాః శివం న జానన్తి పరాత్మరూపమ్‌ || 38

యేనైన స్పష్టం విధృతం చ యేన యేన శ్రితం యేనకృతం సమగ్రమ్‌ | యస్యాంశభూతం హి జగత్కదాచి ద్వేదాంతవేద్యః పరమాత్మా శివశ్చ || 39

ఆఢ్యో వాzపి దరిద్రో వా ఉత్తమో హ్యధమోzపి వా | శివభక్తిరతో నిత్యం శివ ఏవ న సంశయః || 40

యో వా పరకృతాం పూజాం శివస్యోపరి శోభితామ్‌ | దృష్ట్వా సంతోషమాయాతి దాయం ప్రాప్నోతి తత్సమమ్‌ || 41

పెక్కు ఆగమ భేదములచేత మీమాంస చేయువారు మూగవారవుదురు. అనేక ఆగమ, ఆచార్య, మత భేదములచేత తెలియబడు జగదేకబంధువు శివుడు (37) నిత్యుడు, పరమాత్మ, దైవము, వేదములచే మాత్రమే తెలియబడువాడు అగు శివుని విడిచి ప్రమత్తులగు జనులు పరమాత్మరూపునిగా శివుని తెలియలేకున్నారు. (38) ఎవరిచేత జగత్తు సృజింపబడినదో, ధరింపబడినదో మరియు ఆశ్రయింపబడినదో, చేయబడినదో, ఎవరి అంశగా ఈ జగత్తంతా ఏర్పడినదో అట్టి పరమాత్మయగు శివుడు వేదాంతముచే తెలియదగువాడు. (39) దనికుడుగానీ, దరిద్రుడు గానీ, ఉత్తముడుగానీ అధముడు గానీ శివభక్తియందు ఆనందించువాడు నిస్సంశయముగా శివుడే (40) ఎవరు ఇతరులుచేసిన పూజను శివునిపై ప్రకాశించుచుండగా చూచి ఆనందించునో అతను దానికి సమానముగా దాయమును (వాటా) పొందును - (41)

యే దీపమాలాం కుర్వంతి కార్తిక్యాం శ్రద్ధయాన్వితాః | యావత్కాలం ప్రజ్వలన్తి దీపాస్తే లింగమగ్రతః ||

తావద్యుగసహస్రాణి దాతా స్వర్గే మహీయతే || 42

కౌసుంభ##తైలసంయుక్తా దీపా దత్తాః శివాలయే | దాతారస్తేzపి కైలాసే మోదన్తే శివసంనిధౌ || 43

అతసీతైలసంయుక్తా దీపా దత్తాః శివాలయే | దాతారస్తేzపి కైలాసే మోదన్తే శివసంనిధౌ || 44

జ్ఞానినోzపి హి జాయన్తే దీపదానఫలేన హి || 45

తిలతైలేన సంయుక్తా దీపా దత్తాః శివాలయే | తే శివం యాంతి సంయుక్తాః కులానాం చ శ##తేన వై || 46

ఘృతాక్తా యైః కృతా దీపా దీపితాశ్చ శివాలయే | తే యాన్తి పరమం స్థానం కులలక్షసమన్వితాః || 47

కర్పూరాగురుధూపైశ్చ యే యజన్తి సదాశివమ్‌ | ఆరార్తికాం సకర్పూరాం యే కుర్వన్తి దినే దినే || 48

తే ప్రాప్నువన్తి సాయుజ్యం నాత్ర కార్యా విచారణా || 48

కార్తిక మాసమున శ్రద్ధతో దీపమాలతో శివునర్చించువారు, శివలింగము ఎదుట ఎంతకాలము అవి వెలుగునో అన్ని యుగసహస్రముల వరకు స్వర్గమునందు వెలగొందును. (42) కౌసుంభ##తైలముతో దీపములు శివాలయమున నుంచబడిన, అట్లు వుంచినవాడు కైలాసమున శివుని వద్ద ఆనందింతురు. (43) అతసీతైలముతో (నల్లయవిసె నూనెతో) దీపములనుంచినవారు కూడా అట్టిఫలమును పొందుదురు. (44) దీపదానముయొక్క ఫలముగా వారు జ్ఞానులగుదురు (45) నువ్వులనూనెతో దీపముల వెలిగించిన వారు నూరుకులములతో శివుని చేరుదురు (46) నెయ్యితో దీపములనుంచినవారు లక్ష కులములతో పరమస్థానము నొందెదరు (47) కర్పూర, అగురు ధూపములచే సదాశివుని అర్చించువారు, కర్పూరముతో ప్రతిదినము ఆరార్తికమును (హారతి) చేయువారు నిస్సంశయముగా శివసాయుజ్యము నొందెదరు. (48)

ఏకకాలం ద్వికాలం త్రికాలం యే హ్యతంద్రితాః | లింగార్చనం ప్రకుర్వన్తి తే రుద్రా నాత్ర సంశయః || 49

రుద్రాక్షధారణం యే చ కుర్వన్తి శివపూజనే | దానే తపసి తీర్థే చ పర్వకాలే హ్యతంద్రితాః ||

తేషాం యత్సుకృతం సర్వమనన్తం భవతి ద్విజాః || 50

రుద్రాక్షా యే శివేనోక్తాస్తాన్‌ శృణుధ్వం ద్విజోత్తమాః | ఆరభ్యైకముఖం తవద్యావద్వక్త్రాణి షోడశ |

ఏతేషాం ద్వౌ చ విజ్ఞే¸° శ్రేష్ఠా తారయితుం ద్విజాం |7 51

రుద్రాక్షం పంచముఖస్తథా చైకముఖః స్మృతః | యేధారయంత్యేకముఖం రుద్రాక్షమనిం నరాః ||

రుద్రలోకం చ గచ్ఛన్తి మోదంతే రుద్రసంనిధౌ || 52

జపస్తపః క్రియాయోగఃః స్నానం దానార్చనాదికమ్‌ | క్రియతే యచ్చుభం కర్మ హ్యనంతం చాక్షధారణాత్‌ || 53

ఒకసారి లేదా రెండుసార్లు లేదా మూడు సార్లు ఆలస్యముచేయక లింగార్చనము చేయువారు నిస్సంశయముగా రుద్రులే. (49) శివపూజయందు ఆలస్యముచేయక దానమున, తపస్సున, తీర్థమున, పర్వకాలమున రుద్రాక్షలను ధరించువారి పుణ్యమంతా అనన్తమగుఉ (50) ఓ బ్రాహ్మణోత్తములారా! శివుడుచెప్పిన రుద్రాక్షలను గూర్చివినుడు. ఒక ముఖము మొదలు పదహారుముఖముల వరకూ వున్న వానిలో తరింపజేయు శ్రేష్ఠమైన రుద్రాక్షలు రెండు. (51) పంచముఖ రుద్రాక్షలు, ఏకముఖరుద్రాక్షలు. ఏకముఖ రుద్రాక్షలు ధరించువారు శివలోకమున శివుని సన్నిధిన ఆనందింతురు. (52) జపము, తపము, క్రియ, యోగము, స్నానము, దానము, ఆర్చనము మొదలైన పుణ్యకర్మ లంతా రుద్రాక్షధారణచేత ఆనంతమగును. (53)

శునఃకంఠనిబద్ధోzపి రుద్రాక్షో యది వర్తతే | సోzపి సంతారితస్తేన నాత్ర కార్యా విచారణా || 54

తథా రుద్రాక్షసంబంధాత్పాపమపి క్షయం వ్రజేత్‌ | ఏవం జ్ఞాత్వా శుభం కర్మ కార్యం రుద్రాక్షబంధనాత్‌ || 55

త్రిపుణ్డ్రధారణం యేషాం విభూత్యా మన్త్రపూతయా | తే రుద్రలోకే రుద్రాశ్చ భవిష్యన్తి న సంశయః || 56

కపిలాయాశ్చ సంగృహ్య గోమయం చాంతరిక్షగమ్‌ | శుష్కం కృత్వాzథ సందహ్యం విభూత్యర్థం శివప్రియైః || 57

విభూతీతి సమాఖ్యాతా సర్వపాపప్రణాశినీ | లలాటేంగుష్ఠరేఖా చ ఆదౌ భావ్యా ప్రయత్నతం || 58

మధ్యమం వర్జయిత్వా తు అంగుళీయద్వయేన చ | ఏవం త్రిరేఖాసంయుక్తో లలాటే యస్య దృశ్యతే ||

స శైవశ్శివవత్‌ జ్ఞేయో దర్శనాత్‌ పాపనాశనః || 59

కుక్కమెడలో కట్టబడియున్ననూ రుద్రాక్ష దానిని కూడా తరింపజేయును. ఇందు వేరొక ఆలోచన చేయరాదు. (54) అదేవిధంగా, రుద్రాక్ష యొక్క సంబంధముచేత పాపము కూడా నశించును. ఇట్లు తెలుసుకొని రుద్రాక్షసంబంధనముతో పుణ్యకర్మ చేయవలెను. (55) మన్త్రము చేత పవిత్రమైన విభూతితో మూడు రేఖలకు ధరించువారు నిస్సంశయముగా శివ లోకమున శివులే యగుదురు. (56) కపిలవర్ణముగల గోవుయొక్క పేడను క్రిందపడకముందే గ్రహించి, ఎండబెట్టి, విభూతికొరకు శివప్రియులు దానిని దహించవలెను. (57) విభూతి యని పేరుగాంచినది అన్ని పాపములు నశింపజేయును. నుదురుపై బొటనవ్రేలితో రేఖను ముందు ఏర్పరిచి (58) మధ్యమలేవునువిడిచి రెండు వ్రేళ్ళతో ఇట్లు మూడు రేఖలను ఏర్పరచవలెను. ఎవరి నుదురుపై ఇవి కనబడునో ఆ శైవుని శివునివలె తెలియవలయును. ఇట్టివాడు తన దర్శనముచేత పాపమును నశింపజేయును. (59)

జటాధరాశ్చ యే శైవాః సప్త పంచ తథా నవ | జటా యే స్థాపయిష్యన్తి శైవేన విధినా యుతాః || 60

తే శివం ప్రాప్నువంతీహ నాత్ర కార్యా విచారణా | రుద్రాక్షధారణం కార్యం శివభ##క్తైర్విశేషతః || 61

అల్పేన వా మహత్త్వేన పూజితో వా సదాశివః | కులకోటిం సముద్ధృత్య శివేన సహ మోదతే || 62

తస్మాచ్చివాత్పరతరం నాస్తి కించిద్ద్విజోత్తమాః | యదైవముచ్యతే శాస్త్రే తత్సర్వం శివకారణమ్‌ || 63

శివో దాతా హి లోకానాం కర్తా చైవానుమోదితా | శివశక్త్యాత్మకం విశ్వం జానీధ్వం హి ద్విజోత్తమాః || 64

శివేతి ద్వ్యక్షరం నామ త్రాయతే మహతో భయాత్‌ | తస్మాచ్ఛివశ్చింత్యతాం వై స్మర్యతాం చ ద్విజోత్తమాః || 65

ఐదు, ఏడు లేదా తోమ్మిది జటలను ధరించు శైవులు లేదా శైవ విధితో జటలను పెంచువారు (60) నిస్సందేహముగా శివుని జేరుదురు. విశేషముగా శివభక్తులు రుద్రాక్షలను ధరించవలెను. (61) తక్కువ గానీ, ఎక్కువగానీ, సదాశివుని పూజించువాడు తన కులమునంతా ఉద్ధరించి శివునితో కలిసి ఆనందించును. (62) కనుక ఓ బ్రాహ్మణులారా! శివుని కన్న ఎక్కువ ఎవరూ లేదు. శాస్త్రమున చెప్పబడిన దానికంతా శివుడే కారణము. (63) లోకములకు దాత కర్త, అనుమతించువాడు శివుడే. బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఈ విశ్వమంతా 'శివుడు-శక్తి' అని గ్రహించండి. (64) 'శివ' అను రెండక్షరాలు గొప్ప భయము నుండి రక్షించునుగాన బ్రాహ్మణులారా! శివనామమును ధ్యానముచేయండి, స్మరించండి. (65)

ఋషయ ఊచుః

సోమనాథస్య మాహాత్మ్యం జ్ఞాతం తస్య ప్రసాదతః | రాహోశ్శిరోభయాత్సర్వే రక్షితాః పరమేష్ఠినా || 66

సురాశ్చేంద్రాదయాశ్చాన్యే తస్మిన్యుద్ధే సుదారుణ | అత ఊర్థ్వం సురాస్సర్వే కిమకుర్వత ఉచ్యతామ్‌ || 67

శివస్య మహిమా సర్వః శ్రుతస్తవ ముఖోద్గతః || అథ యుద్ధస్య వృత్తాన్తః కథ్యతాం పరమార్థతః || 68

ఋషులనిరి : సోమనాథుని ప్రసాదము వలన సోమనాథుని మాహాత్మ్యము తెలిసినది. గొప్ప యుద్ధమున ఇంద్రాదిదేవతలు రాహువుయొక్క శిరస్సు భయమునుండి శివునిచే రక్షింపబడినారు (66) అటు పిమ్మట దేవతలంతా ఏమి చేసినారో తెలుపుము (67) నీ నోటినుండి శివుని మహిమను వింటిమి. ఇక యుద్ధవృత్తాన్తమును పూర్తిగా తెలుపుము. (68)

లోమశ ఉవాచ :

యదా హి దైత్యైశ్చ పరాజితాస్సురాః శంబుం చ సర్వే శరణం ప్రపన్నాః | శివం ప్రణముస్సహసా సురోత్తమా యుద్ధాయ సర్వే చ మనో దధుస్తదా || 69

తథైవ దైత్యా అపి యుధ్యమానా ఉత్సాహయుక్తాతిబలాశ్చ సర్వే | దేవైస్సమేతాశ్చ పునః పునశ్చ యద్ధం ప్రచక్రుః పరమాస్త్రయుక్తాః || 70

ఏవం చ సర్వే హ్యసురాస్సురాశ్చ శక్త్యృష్టిశూలైః పరిఘైః పరశ్వధైః | జయార్థినోzమర్షయుతాః పరస్పరమ్‌

సింహా యథా హైమవతా దురత్యయాః || నిహన్యమానా హ్యసురాః సురైస్తదా నానాస్త్రయోగైః పరమైర్నిపేతుః || 71

చక్రుస్తే సకలాముర్వీం మాంసశోణితకర్దమామ్‌ | మహీం వృక్షాద్రిసంయుక్తాం ససాగరవనాకరామ్‌ || 72

శిరాంసి చ కబంధాని కవచాని మహాన్తి చ | ధ్వజాః రథాః పతాకాశ్చ గజవాజిశిరాంసి చ || 73

లోమశుడనెను - ఎపుడైతే సురులు దైత్యులచేత పరాజయము నొందారో, అపుడు వారు శివుడిని శరణువేడారు. మరియు వేవతోత్తములంతా ఒక్కమారుగా శివునికి నమస్కరించి యుద్ధమును చేయుటకు తలపెట్టిరి (69) అట్లే, దైత్యులు కూడా యుద్ధముచేయుచూ ఉత్సాహమును, బలమునుకలిగియుండిరి - గొప్ప అస్త్రములు కలిగి వారు దేవతలతో మరల మరల, యుద్ధమును చేసిరి. (70) ఇట్లు, దేవ దానవులంతా శక్తి, ఋష్టి, శూల, పరిఘ, పరశు మొదలగు ఆయుధములు చేతబట్టి జయమును కోరుచున్నవారై ఒండొరులపై అసహనము కలిగి హిమవత్పర్వతముపైని సింహములెట్లు హింసించునో అట్లు హింసించిరి. అపుడు దేవతలచేత దెబ్బతిన్న అసురులు వివిధ అస్త్రప్రయోగముల చేత నేలబడిరి (71) వారు తమ, మాంసము, రక్తముతో చెట్లు గుట్టలతో, సముద్రము, వనములతో కూడిన భూమిని బురదతో కూడినదిగా చేసిరి (72) తలలను, మొండెములను, కవచములను, పతాకములను, రథములను, ధ్వజములను, ఏనుగుల, గుర్రముల తలలను కూడా (నదులు వహించినవి). (73)

వహన్త్యశ్చాపగా హ్యసన్నద్యో భీరుభయావహాం | అగాధాః శోణితోదాశ్చ తరంతో బ్రహ్మరాక్షసాః | తరయన్తి పరాన్భూతప్రేతప్రమథరాక్షసాన్‌ || 74

శాకినీడాకినీసంఘా యక్షిణ్యోzథ సహస్రశః | నానాకేళిషు సంయుక్తాః పరస్పరముదాన్వితాః || 75

ఏవం సంక్రీడమానాస్తే భూతప్రమథరాక్షసాః | రణ తస్మిన్మహారౌద్రే దేవాసురసమాగమే || 76

బలినా సహ దేవేంద్రో యయుధేzద్భుతవిక్రమః | శక్త్యా జఘాన దేవేంద్రం వైరోచనిరమర్షణః || 77

తాం శక్తిం వంచయామాస మహేంద్రో లఘువిక్రమః | జఘాన స బలిం యత్నాద్దైత్యేంద్రం పరమేణ హి || 78

వజ్రేణ శితధారేణ బాహుం చిచ్ఛేద విక్రమీ | గతాసురపతద్భూమౌ విమానాత్సూర్యసంనిభాత్‌ || 79

పతితం చ బలిం దృష్ట్వా వృషపర్వా రుషాన్వితః | వవర్ష శరధారాభిః పయోద ఇవ పర్వతమ్‌ || 80

వానిని వహిస్తున్న నదులు పిరికివారికి భయము గలిగించువానిగా, అగాధముగా నుండినవి. అట్టి లోతైన మరియు రక్తముతో నిండిన నీరుగల నదులను దాటుచున్న బ్రహ్మరాక్షసులు భూత, ప్రేత, ప్రమథ, రాక్షసులనితరిని కూడా దాటించుచుండిరి. (74) శాకినీ, డాకినీ, యక్షిణి మొదలగు వేలకొలది శక్తులు మిక్కిలి ఆనందముతో వివిధ ఆటలలో మునిగినవి. (75) ఇట్లు ఆ భీకరమైన దేవాసురసంగ్రామమున భూతములు, ప్రమధులు, రాక్షసులు బాగుగా ఆడుచూనుండిరి. (76) అపుడు అద్భుత పరాక్రమముగల దేవేంద్రుడు బలిని ఎదిరించెను. అపుడు సహనము లేని బలి శక్తియను ఆయుధముచే దేవేంద్రుని బాదించెను (77) గొప్ప పరాక్రమియైన ఇంద్రుడు దానిని మొక్కబోవు నట్లుచేసి, గొప్పశక్తితో బలిని కొట్టెను. (78) తీక్షణమైన అంచుగల వజ్రాయుధముతో ఇంద్రుడు బలి బాహువును ఖండించెను. అపుడు ప్రాణములు కోల్పోయి సూర్యునివలె ప్రకాశించు విమానమునుండి నేలబడెను. (79) బలి నేలవాలుట జూచి వృషపర్వుడు మిక్కిలి రోషముతో మేఘము పర్వతముపై వర్షించినట్లు బాణ ప్రవాహమును వర్షించెను. (80)

మహేంద్రం సగజం చైవ సహమానం సితాంఛరాన్‌ | తదా యుద్ధమభూత్‌ ఘోరం మహేంద్రవృషపర్వణోః || 81

నిపాత్య వృషపర్వాణమింద్రః పరబలార్దనః || 82

తతో వజ్రేణ మహతా దానవానవధీద్రణ | శిరసి చ్ఛేదితాః కేచిత్కేచిత్కంధరతో హతాం || 83

విహ్వలాశ్చ కృతాః కేచిదింద్రేణ కుపితేన చ | తథా యమేన నిహతా వాయునా వరుణన చ || 84

కుబేరేణ హతాశ్చాన్యే నైర్‌ఋతేన తథా పరే | అగ్నినా నిహతాం కేచిదీశేనైవ విదారితాః || 85

ఏవం తదా తైర్నిహతా బలీయసో మహాసురా విక్రమశాలినశ్చ | సురైస్తు సర్వైస్సహ లోకపాలైః శివప్రసాదాభిహతాస్తదానీమ్‌ || 86

వృషపర్వుడట్లు పదునైన బాణములను సహించు ఇంద్రుని గజముతో సహ బాధించెను. అపుడు వారిద్దరికీ గొప్ప యుద్ధము జరిగెను. (81) శత్రుబలమును నశింపజేయు ఇంద్రుడు వృషపర్వుని పడవేసి (82) గొప్పవజ్రముతో దానవులను రణమున జంపెను. కొందరు తలపై దెబ్బతిని మరణించగా, కొందరు మొండెమున దెబ్బతిని మరణించిరి. (83) కొందరు అవయవముల పట్టులేక అసమర్థులుగా, కొందరు ఇంద్రుని కోపమువలన అశక్తులైరి. అదే విధంగా యముని చేత, వాయువుచేత, వరుణిని చేత (84) కుబేరునిచేత, నైరుఋతిచేత, అగ్నిచేత, ఈశుని చేత అనేకుల ప్రాణములువిడిచిరి. (85) ఇట్లు బలవంతులు, పరాక్రమము గలవారునూ ఐన అసురులపుడు శివప్రసాదము కోల్పోయి లోకపాలురు మొదలగు దేవతల చేతిలో అసువుల బాసిరి. (86)

తతో మహాదైత్యవరో దురాత్మా స కాలనేమిః పరమాస్త్రయుక్తః | య¸° తదానీం సురసత్తమాంస్తాన్‌ హన్తుం సదా క్రూరమతిస్స ఏకః || 87

సింహారూఢో దంశితశ్చ త్రిశూలేన హి సంయుతః | దైత్యానామర్బుదేనైవ సింహరూఢేన సంవృతః || 88

తే సింహాః దంశితాః సర్వే మహాబలపరాక్రమాః | తేషు సింహేషు చారూఢా మహాదైత్యాశ్చ తత్సమాః || 89

ఆయాంతీం దైత్యసేనాం తాం సర్వాం సింహవిభూషితామ్‌ | కాలనేమియుతాం దృష్ట్యా దేవా ఇంద్రపురోగమాః ||

భయమాజగ్మురతులం తదా ధ్యానపరాzభవన్‌ || 90

కిం కుర్మోzద్య వయం సర్వే కథం జేష్యామ చాద్భుతమ్‌ | ఏతాదృశమసంఖ్యాకమనీకం సింహసంవృతమ్‌ || 91

ఏవం విచింత్యమానాస్తే హ్యాగతాస్తత్ర నారదః | నారదేన చ తత్సర్వం పురావృత్తం మహత్తరమ్‌ || 92

కథితం చ మహేంద్రాయ కాలనేమిస్తపోబలమ్‌ | అజేయత్వం చ సంగ్రామే వరదాన బలేన తు || 93

అపుడు దురాత్ముడగు కాలనేమి యనుగొప్పదైత్యుడు పరమాస్త్రముల దాల్చి ఒక్కడే దేవతలను బాధింపవెళ్ళెను. (87) సింహము నెక్కి, త్రిశూలమును దాల్చిన కాలనేమి సింహములనెక్కిన కోటిమంది దైత్యులను వెంటనిడుకొనెను. (88) ఆ సింహములు, జోడుతొడిగిన వారంతా గొప్ప బలపరాక్రమములు గలవారు. సింహములవంటి దైత్యులు సింహములు నెక్కిరి. (89) సింహములతో అలంకరింపబడిన దైత్య సేనను కాలనేమి వెంటరాగా చూచి ఇంద్రాది దేవతలు గొప్ప భయమునొంది ఆలోచనలో మునిగిరి. (90) ఇప్పుడేమి జేతుము? అద్భుతము, అసంఖ్యాకము, సింహములగల ఈ సేను ఎట్లు జయించెదము? (91) అని ఆలోచిస్తుండగా నారదుడక్కడికి వచ్చెను. అపుడు నారదుడు కాలనేమి యొక్క తపోబలమును, వరము యొక్క బలముచే యుద్ధమున జయింపబడలేకుండుటను పూర్వము జరిగినదానిని ఇంద్రునికి చెప్పెను (92, 93)

విష్ణుం వినా వయం దేవా అశక్తా రణమండలే | జేతుం చ సతతో విష్ణుః స్మర్యతాం పరమేశ్వరః ||

తమాలనీలో వరదస్సర్వైర్విజయకాంక్షిభిః || 94

నారదస్య వచః శ్రుత్వా తదా దేవాస్త్వరాన్వితాః | ధ్యానేన చ మహావిష్ణుం తతః పరబలార్దనమ్‌ ||

స్మరంతః పరమాత్మానమిదమూచుశ్చ తం విభుమ్‌ || 95

దేవా ఊచుః

నమస్తుభ్యం భగవతే నమస్తే విశ్వమంగళమ్‌ శ్రీనివాస నమస్తుభ్యం శ్రీపతే తే నమో నమః || 96

అద్యాస్మాన్భయభీతాన్‌ త్వం కాలనేమిబయార్దితాన్‌ | త్రాతుమర్హసి దైత్యాచ్య దేవానామభయప్రద || 97

ఏవం ధ్యాతః సంస్మృతశ్చ ప్రాదుర్భూతో హరిస్తదా | నీలో గరుడమారుహ్య జగతామభయప్రదః || 98

చక్రపాణి స్తదాయాతో దేవానాం విజయాయ చ | గగనస్థం మహావిష్ణుం గరుడోపరి సంస్థితమ్‌ ||

శ్రీనివాసమేనం దుర్థర్షం యోద్ధుకామం దదర్శిరే || 99

తథా దృష్ట్వా కాలనేమిస్తదానీం ప్రహస్యమానోzతిరుషా బలాన్వితః | కస్త్వం మహాభాగ వరేణ్యరూపః

శ్యామో యువా వారణమత్తవిక్రమః || కరే గృహీతం నిశితం మహాప్రభం చక్రం చ కస్మాత్‌ కథయస్వ మే ప్రభో || 100

విష్ణువు లేకుండా రణమండలమున జయించుటకు మేము అశక్తులము. పరమేశ్వరుడు తమాలము వలె నీలముగా నుండువాడు, వరముల నిచ్చువాడగు విష్ణువుని జయమునుగోరు వారందరూ స్మరించండి. (94) నారదుని మాటను విని దేవతలంతా అపుడు త్వరగా శత్రువుల బలమును నశింపజేయు పరమాత్ముడైన విష్ణువును స్మరించి, ధ్యానమున ఇట్లనిరి. (95) 'ఓ భగవంతుడా! విశ్వమునకు శుభమును జేకూర్చువాడా! లక్ష్మికి నివాసమైన వాడా! నీకునమస్కారము (96) దేవతలకభయమునిచ్చు ప్రభూ! కాలనేమి భయముచేత బాధపడుచున్న మమ్ము రక్షింపసమర్థుడవు నీవు.' (97) ఇట్లు వారు స్మరించి, ధ్యానించగా నీల వర్ణముగా నుండి, గరుడునధిరోహించిన విష్ణువు జగత్తునకభయమునిచ్చువాడు సాక్షాత్కారించెను. (98) దేవతల విజయానికై చక్రమును ధరించివచ్చెను. ఆకాశమున గరుడునిపై నున్న విష్ణువును యుద్ధము చేయు గోరుచున్న పరాక్రమవంతుడిగా చూచిరి. (99) కాలనేమి కూడా చూచి మిక్కిలి రోషముతో నవ్వి ఇట్లడిగెను. 'శ్రేష్ఠమగు రూపమును దాల్చి నీలిరంగులోనున్న యువకుడా, మదగజ పరాక్రమము గల నీవెవరు? ఎందుకొరకు పదునైనది, గొప్పకాంతి గలదీయగు చక్రమును చేత ధరించితివి? చెప్పుము. (100)

శ్రీ భగవానువాచ - యుద్ధార్థమిహ చాయాతో దేవానాం కార్యసిద్ధయే |

త్వం స్థిరో భవరే మంద దహామ్యద్య న సంశయః || 101

శ్రుత్వా భగవతో వాక్యం కాలనేమిః ప్రతాపవాన్‌ | ఉవాచ రుషితో భూత్వా భగవంతమధోక్షజమ్‌ || 102

మూలభూతో హి దేవానాం భగవాన్యుద్ధదుర్మదః | యుద్ధం కురు మయా సార్ధం యది శూరోzసి సంప్రతి || 103

ప్రహస్య భగవాన్విష్ణురువాచేదం మహాప్రభః | గగనస్థో భవ త్వం హి మహీస్థోzహం భవామి వై || 104

అప్రశస్తం చ విషయం యుద్దం చైవ యథా భ##వేత్‌ | తథా కురు మహాబాహో గగనే వా మహీతలే || 105

తథేతి మత్వా హి మహానుభావో దైత్యై స్సమేతోzర్బుదసంఖ్యకైశ్చ | సింహోపరిస్థైశ్చ మహానుభావై ర్మహాబలైః క్రూరతరస్తదానీమ్‌ || 106

గగనమథ జగాహే మందమందం మహాత్మా హ్యసురగణసమేతో విశ్వరూపం జిఘాంసుః |

త్రిశిఖమపరముగ్రం గృహ్య సందేశ##చేష్టా దశనవికృతవక్త్రో యోద్ధుకామో హరిం సః || 107

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ మాహేశ్వరఖండే

కేదారఖండే సముద్రమంథనాఖ్యానే దేవాసురసంగ్రామవర్ణనం నామ త్రయోదశోzధ్యాయః

13

శ్రీ భగవంతుడనెను - దేవతల పని సిద్ధించుటకు యుద్ధముకై ఇచటికి వచ్చితిమి. ఓ ముర్ఖుడా! నీవు స్థిరముగా నుండుము. నిస్సంశయముగా నిన్ను నేను దహింతును (101) అనగా విని ప్రతాపవంతుడైన కాలనేమి రోషుముతో అధోక్షజుడగు విష్ణువునుద్ధేశించి ఇట్లనెను (102) 'దేవతల మూలము నీవే, యుద్ధమునకై మదము నొందువాడా! శూరుడవైన, నాతో యుద్ధముచేయుము' (103) అది విని నవ్వి, గొప్పకాంతిగల విష్ణువు - నీవైన ఆకాశమున నిలువుము. నేనైనా భూమిపై నిలుతును (104) సమానము కాని యుద్ధము ప్రశస్తము కాదు. అట్లు కాకుండగా నీవు గగనముకానీ భూతములపై కానీ యుద్ధము చేయుము, (105) అట్లేతలచిన మహానుభావుడగు కాలనేమి, కోటి సంఖ్యలో సింహముల నెక్కిన దైత్యులతో, మహాబలులతో కూడి (106) మెలమెల్లగా ఆకాశమును చెరెను. విశ్వరూపుడైన విష్ణువును హింసింప గోరి, దంతములతో వికృతమైన ముఖము గలిగిన కాలనేమి విష్ణువుతో యుద్ధము చేయుదలిచి భీకరమైన త్రిశిఖను చేత దాల్చి ఆకాశమును ప్రవేశించెను (107)

శ్రీ స్కాదమహాపురాణమున మాహేశ్వరఖండములోని

కేదారఖండమున సముద్రమంథనాఖ్యానములో దేవాసుర సంగ్రామవర్ణనమను పదమూడవ అధ్యాయము సమాప్తము

13

Sri Scanda Mahapuranamu-I    Chapters