Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకోనాశీత్యధిక త్రిశతతమోధ్యాయః

పునః బ్రహ్మవిజ్ఞానమ్‌

అగ్ని రువాచ :

యజ్ఞైశ్చ దేవానాప్నోతి వైరాజం తపసాపదమ్‌ | బ్రహ్మణః కర్మ సంన్యాసా ద్వైరాగ్యాత్ర్పకృతౌ లయమ్‌.

జ్ఞానాత్ప్రాప్నోతి కైవల్యం పంచైతాగతయః స్మృతాః | ప్రీతితాప విషాదాదేర్వినివృత్తిర్వరక్తతా. 2

సంన్యాసః కర్మణాంత్యాగః కృతానామకృతైః సహ | అవ్యక్తాదౌ విశేషాన్తే వికారోస్మిన్నివర్తతే. 3

చేతనా చేతనాన్యత్వజ్ఞానేన జ్ఞానముచ్యతే | పరమాత్మాచ సర్వేషామాధారః పరమేశ్వరః. 4

విష్ణునామ్నాచ దేవేషు వేదాన్తేషు చ గీయతే | యజ్ఞేశ్వరో యజ్ఞపుమాన్ర్పవృత్తైరిజ్యతే హ్యసౌ. 5

నివృత్తైర్జాఞన యోగేన జ్ఞానమూర్తిః స చేక్ష్యతే | హ్రస్వదీర్ఘప్లుతాద్యన్తు వచస్తత్పురుషోత్తమః. 6

అగ్నిదేవుడు పలికెను. యజ్ఞములచే దేవలోకమును తపస్సుచే విరాట్పదమును, కర్మ సన్యాసముచే బ్రహ్మ పదమును, వైరాగ్యముచే ప్రకృతిలయమును, జ్ఞానముచే మోక్షమును పొందును. ఈ విధముగా ఐదుగతులు చెప్పబడినవి. ప్రసన్నత్వము తాప విషాదాదులు లేకుండుట వైరాగ్యమని చెప్పబడును. చేసిన కర్మల యొక్కయు ఇంతవరకు చేయని కర్మల యొక్కయు ఫలమును త్యజించుట సంన్యాసము. ఇట్లు చేయుటచే అవ్యక్తము మొదలు విశేషము వరకును వున్న వికారములు తొలగును. చేతనా చేతనముల వివేకజ్ఞానమునకు జ్ఞానమని పేరు. ఈ జ్ఞానమువలనే పరమాత్మ జ్ఞానము కలుగును. పరమాత్మ సర్వాధారము. పరమేశ్వరుడు వేదవేదాంతములలో విష్ణు నామముతో కీర్తింపబడుచున్నాడు. అతడే యజ్ఞేశ్వరుడు ప్రవృత్తి మార్గములో వున్నవారు యజ్ఞ పురుషునే సేవింతురు. నివృత్తి మార్గములో వున్నవారు జ్ఞానయోగముచే జ్ఞాన స్వరూపుడగు ఆ పరమాత్మను సాక్షాత్కరించుకొందురు. హ్రస్వదీర్ఘప్లుతాది వాక్కు పురుషోత్తమ స్వరూపమే.

తత్ర్పాప్తి హేతుర్జాఞనంచ కర్మచోక్తం మహామునే |

ఆగమోక్తం వివేకశ్చ ద్విధాజ్ఞానం తథోచ్యతే. 7

శబ్దబ్రహ్మాగమమయం పరబ్రహ్మ వివేకదమ్‌ | ద్వేబ్రహ్మణీ వేదితవ్యే శబ్దబ్రహ్మ పరంచయత్‌. 8

వేదాదివిద్యాహ్యపరమక్షరం బ్రహ్మసత్పరమ్‌ | తదేతద్భగవద్వాచ్య ముపచారేర్చనేన్యతః. 9

సంభ##ర్తేతి తథా భర్తాభకారోర్థ ద్వయాన్వితః | నేతాగమయితాస్రష్టా గకారోయం మహామునే. 10

ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్యయశసః శ్రియః | జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాంభగ ఇతీరణా.

11

వసంతి విష్ణోర్భూతాని సచధాతుస్త్రి ధాత్మకః | ఏవం హరౌహి భగవాంఛబ్దోన్యత్రోపచారతః. 12

ఉత్పత్తిం ప్రలయంచైవ భూతానామాగతింగతిమ్‌ | వేత్తివిద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి. 13

జ్ఞానశక్తిబలైశ్వర్య వీర్యతేజాంస్య శేషతః | భగవచ్ఛబ్దం వాచ్యాని వినాహేయై ర్గుణాదిభిః. 14

మహామునీ! ఆ పరమాత్మ ప్రాప్తికి జ్ఞానము కర్మ అనునవి రెండు సాధనములు. వివేకజన్యము ఆగమ జన్యము అని జ్ఞానము రెండు విధములు శబ్ద బ్రహ్మజ్ఞానము ఆగమమయము. పరబ్రహ్మ జ్ఞానము వివేకదము. బ్రహ్మశబ్ద బ్రహ్మ అనియు పరబ్రహ్మ అనియు రెండు విధములు. వేదాది విద్య అపరబ్రహ్మ - అక్షరతత్త్వము పరబ్రహ్మ భగవచ్ఛబ్దముచే ముఖ్యముగా చెప్పబడునది ఈ పరబ్రహ్మయే. పూజాద్యర్థములందు ఈ శబ్దముల యొక్క ప్రయోగము ఔపచారికము. భగవచ్ఛబ్దములోని భకారమునకు పోషించువాడు సర్వాధారభూతుడు అని రెండు అర్థములు. గకారమునకు నేత గమయితా. సృష్టా అని అర్థములు. సమగ్రముగా ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, లక్ష్మి, జ్ఞానము వైరాగ్యము ఈ ఆరింటికి భగమని పేరు. సర్వ భూతములును విష్ణువు యందు నివసించును. ఆతడు సర్వ ధారకుడు త్రిమూర్తి అందుచే భగవచ్ఛబ్దమునకు హరియందే ముఖ్య ప్రయోగమును. ఇతరార్థముల యందు దాని ప్రయోగము గౌణము. సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయ గమనములను, విద్యా విద్యలను ఎరింగిన వానినే ''భగవాద్‌'' అని చెప్పవలెను. హేయగుణములు లేక జ్ఞాన శక్తిబల ఐశ్వర్య వీర్య తేజస్సులు పరిపూర్ణముగా ఎవని యందుండునో ఆతనినే భగవాన్‌ అనవలెను.

ఖాండిక్య (క్యో) జనకాయాహ యోగం కేశిధ్వజఃపురా | అనాత్మన్యాత్మ బుద్ధిర్యా ఆత్మస్వమితి యామతిః.

అవిద్యా భవసంభూతిర్బీ జమేద్ద్విధా స్థితమ్‌ | పంచభూతాత్మకే దేహేదీహీ మోహతమః శ్రితః. 16

అహమేత దితీత్యుచ్చైః కురుతే కుమతిర్మతిమ్‌ | ఇత్థంచ పుత్రపౌత్రేషు తద్దేహోత్పాది తేషుచ. 17

కరోతి పండితః సామ్యమనాత్మని కేలవరే | స్వస్వదేహోప కారాయ కురుతే కర్మ మానవః.

18

దేహశ్చాన్యోయదా పుంసస్తదా బంధాయతత్పరమ్‌ | నిర్వాణమయఏవాయ మాత్మాజ్ఞాన మయోమలః. 19

దుఃఖజ్ఞానమయోధర్మః ప్రకృతేః సతునాత్మనః | జలస్య నాగ్నినా సంగః స్థాలీసంగాత్తథాపిహి. 20

శబ్దాస్తే కాదికా ధర్మాస్తత్కృతావై మహామునే | తథాత్మా ప్రకృతౌ సంగాదహం మానాది భూషితః. 21

భజతే ప్రాకృతాన్ధర్మానన్యస్తేభ్యోహి సోవ్యయః | బంధాయ విషయాసంగం మనోనిర్విషయంధియే. 22

విషయాత్తత్సమాకృష్య బ్రహ్మభూత హరిం స్మరేత్‌ | ఆత్మభావం నయత్యేనం తద్ర్బహ్మధ్యాయినం మునే. 23

విచార్యస్వాత్మనః శక్త్యాలోహమా కర్షకోయథా | ఆత్మప్రయత్న సాపేక్షా విశిష్టాయా మనోగతిః. 24

తస్యా బ్రహ్మణి సంయోగోయోగ ఇత్యభిధీయతే | వినిష్పందః సమాధిస్థః వరం బ్రహ్మాధి గచ్చతి. 25

యమైః సనియమైః స్థిత్యాప్రత్యాహృత్యా మరుజ్జయైః | ప్రాణయామేన పవనైః ప్రత్యాహారేణచేంద్రియైః. 26

వశీకృతైస్తతః కుర్యాత్థ్సితం చేతః శుభాశ్రయే | అశ్రయశ్చేతసో బ్రహ్మమూర్తంచా మూర్తకం ద్విధా. 27

సనందనాతయో బహ్మ భావ భావనయాయుతాః | కర్మభావనయా చేన్యేదేవాద్యాః స్థావరాంతకాః. 28

హిరణ్య గర్భాదిషుచజ్ఞాన కర్మాత్మికాద్విధా | త్రివిధా భావనాప్రోక్తా విశ్వంబ్రహ్మ ఉపాస్యతే.

29

ప్రత్యస్తమితభేదం యత్సత్తామాత్ర మగోచరమ్‌ | వచసామాత్మ సంవేద్యంత జ్ఞానం బ్రహ్మ సంజ్ఞికమ్‌. 30

తచ్చవిష్ణోః వరం రూపమారూపస్యాజ మక్షరమ్‌| అశక్యం ప్రథమం ధ్యాతు మతోమూర్తాది చింతయేత్‌. 31

మద్భావ భావమావన్నస్తతోసౌ వశమాత్మనా | భవత్యభేదోభేదశ్చ తస్యాజ్ఞాన కృతోభ##వేత్‌. 32

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే బ్రహ్మజ్ఞాన వర్ణనం నామైకోనాశీత్యధిక త్రిశతతమోధ్యాయః.

పూర్వము కేశిధ్వజరాజు ఖాండిక్య జనకునకు ఈ విధముగ ఉపదేశించెను. అనాత్మయందు, ఆత్మి బుద్ధి అవిద్యాజనితమై సంసార బంధమునకు కారణము. ఈ ఆజ్ఞానము ఆహంకార మమకార రూపముల రెండు విధములుగా వున్నది. దేహాభిమానియగు జీవుడు మోహాంధకారముచే కప్పబడి ఈ పాంచ భౌతిక శరీరమే నేను అను కుబుద్ధి కలిగియుండును. ఇట్లే పుత్రపౌత్రాదులందు మమకారము కలిగయుండును విద్వాంసుడు అనాత్మయగు ఈ దేహమున సమభావము కలిగయుండును. మానవుడు సర్వదే హోపకారమునకే కర్మచేయును. దేహము పురుషునకంటే భిన్నమైనది. కావున ఆకర్మ యంతయు బంధ హేతువగును. వాస్తవమున ఆత్మ నిర్వాణమయము, జ్ఞానమయము, అమలము ధుఃఖ జ్ఞానమనునది ప్రకృతి ధర్మము కాని, ఆత్మ ధర్మము కాదు. జలమునకు అగ్నితో సాక్షాత్సంబంధములేకున్నను పాత్రము ద్వార అగ్ని సంపర్కము కలుగుట ఎట్లో ఇదియు అట్లే. మహామునీ ! ఆత్మ ప్రకృతి సంగముచే అహంకారమమకారాది ప్రకృతి ధర్మములను పొందుచున్నది. వాస్తవమున అది వాటికంటె భిన్నమైనది. అవినాశి. విషయాసక్తమగు మనస్సు బంధహేతువు. విషయ దూరమైనది జ్ఞాన హేతువు. దానిని విషయముల నుండి లాగి హరిని స్మరించవలెను. తనను ధ్యానించు వానికి హరి బ్రహ్మ భావము నిచ్చును. సూదంటురాయి లోహమును ఆకర్షించినట్లు తనను ధ్యానించు వానిని బ్రహ్మ తన వైపు లాగికొనును. ఆత్మ ప్రయత్నముచే మనస్సు బ్రహ్మతో విశిష్ఠ సంయోగమును పొందుటయే యోగము. నిశ్చలుడై సమాధియందున్నవాడు పరబ్రహ్మను పొందును. యమ నియమ, స్థితి, ప్రాణాయాయ, ప్రత్యాహర, ప్రాణజయ, ఇంద్రియనిగ్రహములచే చిత్తము శుభమగు ఆశ్రయమునందు నిలచునట్లు చేసుకొనవలెను. ఈ శుభాశ్రయగు బ్రహ్మ మూర్తము అని రెండు విధము. సనందనాదులు బ్రహ్మ భావనా యుక్తులు. దేవతలు మొదలు స్థావరముల వరకువున్న ప్రాణులు కర్మభావనా యుక్తులు హిరణ్యగర్భాదులకు కర్మ బ్రహ్మ బ్రహ్మ భావనలు రెండును వుండును. ఈవిధముగా భావవ మూడు విధములు. ఈ విశ్వమంతయు బ్రహ్మయే. అని ఉపాసించుట బ్రహ్మ భావనా. సమస్త భేదములు తొలగినదియు, సత్తామాత్ర విషయకము, వాక్కులకు గోచరించనిది, ఆత్మమాత్ర సంవేద్యము అగు తత్త్వము యొక్క జ్ఞానము బ్రహ్మజ్ఞానము. ఆదియేరూప హీనుడగు విష్ణువు యొక్క జన్మరహితము, అక్షరము అగు ఉత్కృష్ట స్వరూపము అమూర్త ధ్యానము కష్టముగాన ముందు మూర్త ధ్యానము చేయవలెను. ఇట్లు చేయువాడు భగవద్భావముమ పొంది పరమాత్మతో ఐక్యము పొందును. భేదజ్ఞానము ఆజ్ఞాన కృతము.

అగ్ని మహాపురాణమున బ్రహ్మజ్ఞాన వర్ణనమను మూడు వందల డెబ్బది తొమ్మిదవ అధ్యయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page