Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రిసప్తత్యధిక త్రిశతతమోధ్యాయః

అథాసన ప్రాణాయామ ప్రత్యాహారాః.

అగ్నిరువాచ :

ఆసనం కమలాద్యుక్తం తద్భద్ద్వా చింతయేత్పరమ్‌ | శుచౌ దేశేప్రతిష్ఠాప్య స్థిరమానన మాత్మనః. 1

నాత్యు చ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరమ్‌ | తత్త్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేన్ద్రియక్రియః.

ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మ విశుద్ధయే | సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలఃస్థిరః. 3

సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవ లోకయన్‌ | పార్షిణభ్యాం వృషణౌ రక్షంస్తథా ప్రజననం పున.ః 4

ఊరుభ్యాముపరిస్థాప్య బాహూతిర్యక్ర్పయత్నతః | దక్షిణం కరపృష్ఠంచ న్యసే ద్వామతలోపరి. 5

ఉన్నమ్యశనకైర్వక్రం ముఖం విష్టభ్య చాగ్రతః | ప్రాణః స్వదేహజోవాయుస్తస్యాయామోనిరోధనమ్‌. 6

నాసికాపుట మంగుళ్యా పీడ్యైవచ పరేణచ | ఔదరం రేచయేద్వాయుం రేచనాద్రేచకః స్మృతః. 7

బాహ్యేన వాయునా దేహం దృతి వత్పూర యేద్యథా |

తథాపూర్ణశ్చ సంతిష్ఠే త్పూరణా త్పూరకః స్మృతః. 8

నముంచతి నగృహ్ణాతి వాయుమన్తర్బహిః స్థితమ్‌ | సంపూర్ణ కుంభవత్తిష్ఠేదచలః సతుకుంభకః. 9

కన్యకః సకృదుద్ఘాతః సవైద్వాదశ మాత్రికః | మధ్యమం చ ద్విరుద్ఘాతశ్చ తుర్వింశ తిమాత్రికః. 10

ఉత్తమశ్చ త్రిరుద్ఘాతః షట్త్రింశత్తాల మాత్రికః | స్వేదకంపాభి ఘాతానాం జననశ్చోత్తమోత్తమః. 11

అజితాన్నారు హేద్భూమిం హిక్కా శ్వాసాదయస్తథా | జితేప్రాణ స్వల్పదోష విణ్మూత్రాది ప్రజాయతే. 12

ఆరోగ్యం శీఘ్రగామిత్వ ముత్సాహః స్వరసౌష్ఠవమ్‌ | బలవర్ణ ప్రసాదశ్చ సర్వదోషక్షయః ఫలమ్‌. 13

జపోధ్యానం వినాగర్భం సగర్భ స్తత్సమన్వితః | ఇంద్రియాణాం జయార్థాయ సగర్భం ధారయేత్పరమ్‌. 14

జ్ఞానవైరాగ్య యుక్తాభ్యాం ప్రాణాయామ వశేనచ | ఇంద్రియాంశ్చ వినిర్జిత్య సర్వమేవజితం భ##వేత్‌. 15

ఇంద్రియాణ్యవ తత్సర్వం యత్స్వర్గ నరకావుభౌ | నిగృహీత విసృష్టాని స్వర్గాయ నరకాయచ. 16

శరీరం రథమిత్యాహురింద్రియాణ్యస్య వాజినః | మనశ్చ సారథిః ప్రోక్తః ప్రాణాయామః కశాన్మృతాః.

జ్ఞాన వైరాగ్య రశ్మిభ్యాం మాయయా విధృతం మనః | శ##నైర్నిశ్చల తామేతి ప్రాణాయామైక సంహితమ్‌.

జల బిందుం కుశాగ్రేణ మాసేమాసే పిబేత్తుయః | సంవత్సర శతం సాగ్రం ప్రాణాయామశ్చ తత్సమః. 19

ఇంద్రియాణి ప్రసక్తాని ప్రవిశ్య విషయోదధౌ | ఆహృత్య యో నిగృహ్ణాతి ప్రత్యాహారః స ఉచ్యతే. 20

ఉద్ధరేదాత్మనాత్మానం మజ్జమానంయథామ్భసి | భోగనద్యతివేగేన జ్ఞాన వృక్షం సమాశ్రయేత్‌. 21

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఆసన ప్రాణాయామ ప్రత్యాహార నిరూపణం నామ త్రిసప్తత్యధిక త్రిశతతమోధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను. పద్మాసనము మొదలగు ఆసనము బంధించి పరమాత్మధ్యానము చేయవలెను. పవిత్రమైన ప్రదేశమున చాల ఎత్తుకానిదియు చాల పల్లము కానిదియు వస్త్రము అజినము, కుశలు పరచిన స్థిరమైన ఆసనమును ఏర్పరచుకొని దానిపై కూర్చుండి చిత్త ఇంద్రియ పనులను అరికట్టి మనస్సు ఏకాగ్రముచేసి ఆత్మ విశుద్ధికై యోగాభ్యాసము చేయవలెను. శరీరమును శిరస్సును కంఠమును సమముగా ఉన్నట్లు స్థిరముగ నిలపి తన నాసికాగ్రమును చూచుచు దిక్కులను చూడక మణవలచే వృషణములను జన నేంద్రియమును రక్షించుచు తొడపై బాహువులను అడ్డముగా వుంచి ఎడమ అరచేతిలో దక్షిణ హస్త పృష్ఠభాగమును ఉంచి ముఖమును కొంచెము ఎత్తి ముందుకు చొచ్చుకొనునట్లు చేసి ధ్యానము చేయవలెను. తన దేహములోనున్న వాయువు ప్రాణము. దానిని నిరోధించుట ప్రాణాయామము ఒకనాసికా పుటమును వ్రేలితో నొక్కి పట్టి రెండవనాసికా పుటము నుండి ఉదరములోనున్న వాయువును పైకి పంపవలెను. ఇట్లు రేచనము చేయుటచే దీనికి రేచక ప్రాణాయామ మనిపేరు. బాహ్యవాయువుతో దేహమును తిత్తిని నింపినట్లు నింపి అట్లే వుండవలెను. పూరించుటచే దీనికి పూరక మనిపేరు. లోపల వాయువును విడువక బయటనున్న వాయువును లోపలకు తీసుకొనక సంపూర్ణ కుంభము వలె స్థిరుడై వుండవలెను. దానికి కుంభకమని పేరు. పండ్రెండు మాత్రల కాలము ఉద్ఘాతము అంతకాలము ప్రాణాయమము చేయుట కనిష్ఠము. రెండు ఉద్ఘాతముల కాలము అనగా ఇరువదినాలుగు మాత్రల కాలము మధ్యమము. మూడు ఉద్ఘాతముల కాలము అనగా ముప్పది ఆరు మాత్రల కాలము ఉత్తమము. స్వేదమును కంపమును అభిఘాతమును కల్గించుప్రాణాయామము ఉత్తమోత్తమము. తనకు అధికారము లేని ప్రాణాయామ భూమికలను అధిష్ఠించకూడదు. ప్రాణాయామము చేయు వానికి హిక్కాశ్వాసాదులు తొలగును. ప్రాణము జయించిన వానికి మల మూత్రాది దోషములు కూడ అత్యల్పముగ వుండును. ఆరోగ్యము శీఘ్రముగా నడచుట ఉత్సాహము స్వరమాధుర్యము బలము శరీర వర్ణము స్వచ్ఛమగుట సకల దోషముల క్షయము - ఇది ప్రాణాయామముల వలన కలుగు లాభములు. జప, ధ్యానము లేని ప్రాణాయామము అగర్భము. అవిఉన్నది సగర్భము. ఇంద్రియ జయము కోరు వాడు సగర్భ ప్రాణాయామము చేయవలయును. జ్ఞాన వైరాగ్యముల చేతను, ప్రాణాయామము చేతను, ఇంద్రియములను జయించిన వాడు సర్వమును జయించినట్లే. స్వర్గము నరకము అనునవి కూడ ఇంద్రియములే. వశము చేసికొనబడిన ఇంద్రియములు నరకమును ఇచ్చును. ఈ శరీరము రథము. ఇంద్రియములు అశ్వములు. మనస్సు సారథి. ప్రాణాయావము కొరడా. మాయ జ్ఞానము వైరాగ్యము అను కళ్ళెములతో మనస్సును స్వాధీనములో ఉంచుకొనును ఈ విధముగా ప్రాణాయామముచే నిరోధింపబడిన మనస్సు మెల్లగా నిశ్చలత్వమును పొందును. మాసమునకు ఒకసారి కుశాగ్రముతో జల బిందువును త్రాగుచు నూరు సంవత్సరములు ఎంత తపస్సు చేసిన ఎంత ఫలమో అంత ఫలమును ప్రాణాయామమిచ్చును విషయ సముద్రములో ప్రవర్తించిన ఇంద్రియములను వెనుకకు లాగి నిగ్రహించుట ప్రత్యాహారము. నీటిలో మునిగి పోవుచున్నట్లు విషయములలో మునిగి పోవుచున్న తనను తానే ఉద్ధరించుకొనవలెను. భోగములనెడు నది యొక్క వేగముచే కొట్టుకొని పోవువాడు జ్ఞాన మనెడి వృక్షమును ఆశ్రయించవలెను.

అగ్ని మహా పురాణమున ఆసన ప్రాణాయామ ప్రత్యాహార నిరూపణ మను మూడు వందల డెబ్బది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page