Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ అష్టషష్ట్యధిక త్రిశతతమోధ్యాయః

అథ నిత్య నైమి త్తికప్రాకృతప్రలయాః

అగ్ని రువాచ :

చతుర్విధస్తు ప్రలయోనిత్యోయః ప్రాణినాంలయతః | సదావినాశో జాతానాం బ్రాహ్మోనిమిత్తికోలయః. 1

చతుర్యుగ సహస్రాన్తే ప్రాకృతః ప్రాకృతోలయః | లయ ఆత్యన్తికోజ్ఞానా దాత్మనః పరమాత్మని. 2

నైమిత్తికస్య కల్పాన్తేవక్ష్మేరూపం లయస్యతే | చతుర్యుగసహస్రాంతే క్షీణప్రాయే మహీతలే. 3

అనావృష్టిరతీ వోగ్రాజాయతే శతవార్షికీ | తతః తత్త్వక్షయః స్యాచ్చతతో విష్ణుర్జగత్పతిః. 4

స్థితో జలాని పిబతిభానోః సప్తసురశ్మిషు | భూపాతాల సముద్రాదితోయం నయతిసంక్షయమ్‌. 5

తతస్తస్యానుభావేన తోయాహారోప బృంహితాః | తపవరశ్మయః సప్తజాయన్తే సప్తభాస్కరాః. 6

దహన్త్యశేషం త్రైలోక్యం సపాతాల తలంద్విజ | కూర్మవృష్ఠ సమాభూః స్యాత్తతః కాలాగ్నిరుద్రకః. 7

శేషాహిశ్వాస సంపాతాత్పాతాలాని దహత్యధః | పాతాలేభ్యో భువం విష్ణుర్భువః స్వర్గం దహత్యతః. 8

ఆంబరీష మివాభాతి త్రైలోక్య మఖిలం తథా | తతస్తాప పరీతాస్తు లోకద్వయ నివాసినః. 9

గచ్ఛన్తితే మహర్లోకం మహర్లో కాజ్జనం తతః | రుద్రరూపీ జగద్దగ్ధ్వాముఖనిః శ్వాసతోహరేః. 10

ఉత్తిష్ఠంతి తతోమేఘానానా రూపాః సవిద్యుతః | శతంవర్షాణి వర్షన్తః శమయంత్యగ్ని ముత్థితమ్‌. 11

సప్తర్షస్థానమాక్రమ్య స్థితేమ్భసి శతం మరుత్‌ | ముఖనిః శ్వాసతో విష్ణోర్నాశం నయతితాన్ఘనాన్‌. 12

వాయుం పీత్వా హరిః శేషేశేతే చైకార్ణవే ప్రభుః | బ్రహ్మరూపధరః సిద్ధైర్జలగైర్మునిభిః స్తుతః. 13

ఆత్మమాయామయీం దివ్యాం యోగనిద్రాం సమాస్థితః | ఆత్మానం వాసుదేవాఖ్యం చింతయన్మధుసూదనః.

కల్పం శేతే ప్రబుద్ధోథ బ్రహ్మరూపీ సృజత్యసౌ |

ద్విపరార్ధం తతోవ్యక్తం ప్రకృతౌ లీయతేద్విజ. 15

అగ్ని పలికెను ప్రళయము నాలుగు విధములు. నిత్యము జరుగుచున్న ప్రాణుల మృత్యువు నిత్య ప్రళయము. ప్రాణులందరును పూర్తిగా నశించుట బ్రాహ్మలయము లేదా నైమిత్తికలయము. చెయ్యి చతుర్యుగములు గడచిన పిమ్మట పంచభూతములు ప్రకృతిలో లీనమైనపుడు అది ప్రాకృతలయము. జ్ఞానము వలన జీవాత్మ పరమాత్మలో లీనుడగుట ఆత్యంతికలయము. కల్పాంతమున జరుగు నైమిత్తికలయమును గూర్చి చెప్పెదను చతుర్యుగ సహస్రాంతమున భూమి చాలా వరకు క్షీణమై పోవును. నూరు సంవత్సరములు భయంకరములైన అనావృష్టి ఏర్పడును. ప్రాణులందరును నశింతురు. అపుడు జగత్పతియైన విష్ణువు సూర్యుని ఏడు కిరణముల ద్వారా భూపాతాళ - సముద్రాదులలో వున్న జలమును నశింపచేయును. పిదప ఆయన ప్రభావముచే ఆ జలమును పీల్చుటచె పుష్టి చెందిన ఆ ఏడు రశ్ములు ఏడుగురు భాస్కరులుగా ఏర్పడి పాతాళ తల శీతమగు త్రైలోక్యము నంతను భస్మము చేయును. అపుడు భూమి తాబేలు పైభాగము వలె కనబడును. ఆదిశేషుని శ్వాసనుండి కాలాగ్ని రుద్రుడు ఆవిర్భవించి క్రిందనున్న పాతాళములను భస్మము చేయును. పిదప విష్ణువు భూమిని స్వర్గమును కాల్చివేయును. ఆ సమయమున త్రైలోక్యము ప్రజ్వలించుచున్న మంగలము వలె కనబడును. అపుడు తాపముతో బాధపడుచున్న భువర్ణోక స్వర్గలోక వాసులు మహర్లోకమునకు వెళ్ళి అచట నుండి జనలోకమునకు వెళ్ళుదురు. ఇట్లు రుద్రరూపి జగత్తును కాల్చి వేయగ హరి యొక్క శ్వాసము నుండి మెరుపులతో గూడిన వివిధ రూపములు గల మేఘములావిర్భవించును. నూరు సంవత్సరములు వర్షింఛి ఆ అగ్నిని శమింప చేయును. ఆ జలము సప్తర్షి స్థానము వరకు చేరిన పిమ్మట, విష్ణు ముఖము నుండి బయలుదేరిన నిశ్వాసము వాయురూపమున వంద సంవత్సరములు వీచి ఆమేఘములను చెదర గొట్టును. పిదప ఆహరి వాయువును త్రాగివేసి ఏకార్ణవమునందు అదిశేషునిపై శయనించును. ఆ సమయమున సిద్ధులు, మహర్షులు, బ్రహ్మరూప ధారియగు ఆతనిని స్తుతింతురు. మధుసూదనుడు ఆత్మ మాయా రూపమగు దివ్య యోగ నిద్రను అవలంభించి తన వాసు దేవ స్వరూపమును చింతించుచు ఒక కల్పము కాలము శయనించును. పిదవలేచి బ్రహ్మరూపయై మరల సృజించును. ఈ విధముగ బ్రహ్మ యొక్క రెండు పరార్ధముల ఆయుర్దాయము గడచిన పిమ్మట ఈస్థూల ప్రపంచము ప్రకృతి యందు లీనమగును.

స్థానాత్థ్సానం దశగుణమేకస్మాద్గుణ్యతే స్థలే | తతోష్టాదశ##కే భాగే పరార్ధమభిధీయతే. 16

పరార్ధం ద్విగుణం యత్తు ప్రాకృతః ప్రలయః స్మృతః |

అనావృష్ట్యాగ్ని సంపర్కాత్కృతే సంజ్వలచేద్విజ. 17

మహదాదేర్వికారస్య విశేషాన్తస్య సంక్షయే | కృష్ణేచ్ఛాకారితే తస్మిన్సంప్రాప్తే ప్ర తిసంచరే.

19

అపోగ్రసన్తివై పూర్వం భూమేర్గంధాదికం గుణమ్‌ | ఆత్మగంధాత్తతో భూమిః ప్రలయత్వాయ కల్పతే.

రసాత్మికాశ్చ తిష్ఠన్తి హ్యపస్తాసాం రసో గుణః | పీయతే జ్యోతిషా తాను నష్టాస్వగ్నిశ్చ దీప్యతే. 20

జ్యోతిషోపి గుణం రూపం వాయుర్గ్రసతి భాస్కరమ్‌ | నష్టేజ్యోతిషి వాయుశ్చ బలీదోధూయతే మహాన్‌.

వాయోరపి గుణం స్పర్శమాకాశం గ్రసతేతతః | వా¸°నష్టేతు చాకాశం నీరం తిష్ఠతిద్విజ.

22

ఆకాశస్యాథవై శబ్దం భూతాదిర్గ్రసతే చ ఖమ్‌ | అభిమానాత్మకం ఖంచ భూతాదిర్గ్రసతేమహాన్‌. 23

భూమిర్యాతి లయంచాప్సు ఆపో జ్యోతిషితద్వ్రజేత్‌ |

వా¸° వాయుశ్చ ఖే, ఖంచ, అహంకారే లయం న చ. 24

మహత్తత్త్వే మహాస్తంచ ప్రకృతిర్గ్రసతేద్విజ | వ్యక్తావ్యక్తాచ ప్రకృతి ర్వ్యక్తస్యావ్యక్తకేలయః. 25

పుమానేకాక్షరః శుద్ధః సోప్యంశః పరమాత్మనః | ప్రకృతిః పురుషశ్చైతౌ లీయేతే పరమాత్మని. 26

నసంతి యత్రసర్వేశే నామజాత్యాది కల్పనాః | సత్తామాత్రాత్మ కేజ్ఞేయే జ్ఞానాత్మన్యాత్మనఃపరే. 27

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే నిత్యనైమిత్తిక ప్రాకృత ప్రలయవర్ణనం నామాష్ట

షష్ట్యధిక త్రిశతతమోధ్యాయః.

ఒకటి నించి పదిచొప్పున గుణించుచు పోగ పదునెనిమిదవ స్థానము చేరునప్పటికి ఎంత సంఖ్య వచ్చునో అది పరార్ధము. దానికి రెట్టింపు కాలము గడచిన పిమ్మట ప్రాకృత ప్రళయము ఏర్పడును. వర్షములు లేకపోవుటచే అగ్ని ప్రజ్వలించి అంతయు భస్మమైపోవును. మహత్తత్వము మొదలు విశేషము వరకు ఉన్న కార్యములన్నియు నశించును. భగవంతుని ఇచ్ఛను అనుసరించి ఆప్రళయము రాగా జలము భూమిలో వున్న గలధాది గుణములను తనలో లీనము చేసుకొనును. అపుడు గంధహీనమగు పృథివి నీటిలో లీనమైపోవును పిదప రసమయమగు జలము మిగులును. రసము జలమున గుణము. అగ్ని ఆరసమును త్రాగి వేయగా జలము లీనమైనపోవును. అగ్ని తత్త్వము ప్రజ్జ్వలించును. పిమ్మట తేజస్సు యొక్క ప్రకాశ గుణమును వాయువు మింగి వేయును. ఈ విధముగా అగ్ని తత్త్వము లీనమై పోగా గొప్ప వాయువు వీచును. వాయువు యొక్క గుణమగు స్పర్శను ఆకాశము మ్రింగివేయగా, వాయువు నశించి ఆకాశముమాత్రము నిశ్శబ్దముగా మిగులును. భూతములకు కారణమగు అహంకారము ఆకాశ గుణ మగు శబ్దమును మ్రింగి వేయగ తేజసాహంకారము ఇంద్రియములను తనలో లయము చేసుకొనును దానిని మహత్తత్త్వము తనలోన లీనము చేసుకొనును. ఈ విధముగా భూమి జలము నందు, జలము అగ్ని యందు, అగ్ని వాయువు నందు, వాయువు ఆకాశము నందు, ఆకాశము అహంకారము నందు, అహంకారము మహత్తత్వమునందు లీన మగును. దానిని ప్రకృతి తనలో లీనము చేసుకొనును. ''వ్యక్త''. ''అవ్యక్త'' అని ప్రకృతి రెండు విధములు. ''వ్యక్త'' అవ్యక్తములో లీన మగును. అవినాశియు, శుద్ధ స్వరూపుడు అగు ఏకైక పురుషుడు ఎవడున్నాడో అతడు కూడ పరమాత్మ అంశ##మె. చివరకు ప్రకృతియు పురుషుడును పరమాత్మ యందే లీన మగును. ఆ పరమాత్మ సత్స్వరూపము జ్ఞేయము, జ్ఞాన మయము. బుద్ధ్యాదుల కంటే పరము. ఆ పరమాత్మ యందు నామ, జాత్యాది కల్పనలు వుండవు.

అగ్ని మహా పురాణమున నిత్య నైమిత్తిక ప్రాకృత - ప్రళయ వర్ణన మను

మూడు వందల అరువది ఎనిమిది అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page