Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతుః షష్ట్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథ మనుష్య వర్గః

అగ్ని రువాచ :

నృబ్రహ్మ క్షత్రవిట్శూద్ర వర్గాన్వక్ష్యే7థ నామతః | నరః పంచజనా మర్త్యాయోషిద్యోషా7లావధూః. 1

కాంతార్జినీతుయాయాతి సంకేతం సా7భిసారికా | కులటా పుంశ్చల్య సతీనగ్నికా స్త్రీచ కోటవీ. 2

కాత్యాయన్యర్ధ వృద్ధాయా సైరంధ్రీ పరవేశ్మగా | అసిక్నీ స్యాదవృద్ధాయా మాలినీతు రజస్వలా. 3

వారస్త్రీగణికావేశ్యా భ్రాతృజాయాస్తు యాతరః | ననన్ధాతు స్వసాపత్యుః నపిండాస్తుననాభయః. 4

సమానోదర్య సోదర్య సగర్భ్య సహజాః సమాః | నగోత్ర బాంధవ జ్ఞాతి బంధుస్వస్వజనాః సమాః. 5

దంపతీ జంపతీ భార్యాపతీ జాయాపతీ చతౌ | గర్భాశయో జరాయుః స్యాదుల్బంచ కలలో7స్త్రియామ్‌. 6

గర్భోభ్రూణ ఇమౌతుల్యౌ క్లీబంషండో నపుంసకమ్‌ | స్యాదుత్తానశయోడింభో బాణోమాణవకఃస్మృతః. 7

పిచండిలో బృహత్కుక్షిరభ్రటో నతనాసికే | వికలాంగస్తు పౌగండ ఆరోగ్యం స్యాదనామయమ్‌. 8

రయాదేడే బధిరః కుబ్జేగడులః కుకరే కుణిః | క్షయః శోషశ్చ యక్ష్మాచ ప్రతిశ్యాయస్తుపీనసః. 9

స్త్రీక్షుత్‌క్షుతం క్షవః పుంసికాసస్తుక్షవథుః పుమాన్‌ | శోథస్తు శ్వయథుః శోఫః పాదస్పోటో విపాదికా. 10

కిలాససిధ్మేకచ్ఛ్వాన్తు పామపామా విచర్చికా | కోఠోమండలక కుష్ఠం శ్విత్రే దుర్నామ కార్శసీ. 11

ఆనాహస్తు నిబంధః స్యాద్గహణీ రుక్ర్పవాహికా | బీజవీర్యేంద్రియం శుక్రం పలలం క్రవ్యమామిషమ్‌. 12

వృక్కా7గ్రమాంసం హృదయం హృన్మేదస్తు వపావపా | పశ్చాద్గ్రీవా సిరామన్యా నాడీతు ధమనిఃశిరా. 13

తిలకంక్లోమ మస్తిష్కం దూషికా నేత్రయోర్మలమ్‌ | అంత్రం పురీతద్గుల్మస్తుప్లీహా వుంస్య7థ వస్త్రసా. 14

స్నాయుః స్త్రియాం కాలఖండ యకృతీతు సమేఇమే | స్యాత్కర్ఫూరః కపాలో7స్త్రీకీకసంకుల్యమస్థిచ. 15

స్యాచ్ఛరీరాస్థ్ని కడ్కాలః పృష్టాస్నితు కశేరుకమ్‌ | శిరో7స్థని కరోటిః స్త్రీపార్శ్వాన్థని తుపర్శుకా. 16

అంగం ప్రతీకో7వయవః శరీరం వర్ష్మ విగ్రహః | కటౌనాశ్రోణి ఫలకం కటిః శ్రోణిః కకుద్మతీ. 17

పశ్చాన్నితంబః స్త్రీకట్యాక్లీబేతుజఘనం పురః | కూపకౌతు నితంబస్థౌద్వయహీనే కుకున్ధరే. 18

స్త్రియాం స్ఫిచౌ కటిప్రోథావుపస్థో వక్ష్యమాణయోః | భగం యోనిన్ద్వయోః శిశ్నో మేహో మేహనశేఫసీ. 19

పిచిప్డకుక్షీ జఠరోదరం తుందకుచౌ స్తనౌ | చూచుకంతు కుచాగ్రం స్యాన్న నాక్రోడం భుజాంతరమ్‌. 20

స్కంధోభుజ శిరోసోస్త్రీ సంధీతసై#్యవ జత్రుణీ | పునర్భవః కరరుహో నఖోస్త్రీనకరో స్త్రియామ్‌. 21

ప్రాదేశతా లగోకర్ణా స్తర్జన్యాది యుతేతతే | అంగుష్ఠే సకనిష్ఠే రయాద్విత స్తిర్ద్వాదశాంగులః. 22

పాణౌచ పేట ప్రతల ప్రహస్తా విన్తృతాంగులౌ | బద్ధముష్టికరో7రత్ని రరత్నిః సకనిష్ఠవాన్‌. 23

కంబుగ్రీవా త్రిరేఖా సా7వటుర్ఘాటా కృకాటికా | అధః రయాచ్చిబుకంచోష్ఠా దథగండౌ గలోహనుః. 24

ఆపాంగా నేత్రయోరన్తౌ కటాక్షో7పాంగ దర్శనే | చికురః కుంతలోవాలః ప్రతికర్మ ప్రసాధనమ్‌. 25

ఆకల్పవేషో నైపథ్యం ప్రత్యక్ష ఖేలయోగజమ్‌ | చూడామణిః శిరోరత్నం తరలోహార మధ్యగః. 26

కర్ణికాతాలపత్రం స్లాల్లంబనం స్యాల్లలన్తికా | మంజికో నూపురం పాదే కింకిణీ క్షుద్రఘంటికా. 27

దైర్ఘ్య మాయామ ఆరోహః పరిణాహో విశాలతా | పటచ్చరం జీర్ణవస్త్రం సంవ్యానం చోత్తరీయకమ్‌. 28

రచనాస్యాత్పరిస్పన్ద ఆభోగః పరిపూర్ణతా | సముద్గకః సంపుటకః ప్రతిగ్రాహః పతద్గ్రహః. 29

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మనుష్య వర్గ వర్ణనం నామ చతుషష్ట్యధిక త్రిశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను. మనుష్య, బ్రహ్మ, క్షత్ర, వైష్య, శూద్ర వర్గములను క్రమముగ చెప్పెదను. నృ- నర - పంచ జన - మర్త్య = నరులు. యోషిత్‌ - యోషా - అబలా - వధూః = స్త్రీ. ప్రియుని కోరుచు సంకేత స్థానమునకు వెళ్ళునది అభిసారికా. కులటా - పుంశ్చలీ అసతీ = కులట నగ్నికా - కోటరీ - నగ్న స్త్రీ; కాత్యాయనీ - సగము ముసలిది; సైరంధ్రీ = పర గృహమున సేవ చేయునది. అసిక్నీ ఇంకను ముసలితనము రానిది. మలినీ - రజస్వలా = పర్యా. వారస్త్రీ - గణికా - వేశ్యా = పర్యా. యాతా - తోటి కోడలు. ననందా = భర్త సోదరీ; సపిండాః - సనాభయః = సపిండులు. సమానోదర్య - సోదర్య - సగర్భ్య-సహజ = పర్యా. సగోత్ర-బాంధవ - జ్ఞాతి - బంధు - స్వజన = పర్యా. దంపతీ - జంపతీ - భార్యాపతీ - జాయాపతీ = పర్యా. గర్భాశయ - జరాయు - ఉల్బ - కలల = పర్యా. గర్త - భ్రూణ = పర్యా. క్లీబః - షండః - నపుంసకః= పర్యా. డింభః - నవజాత శిశువు. బాలకః - మాణవకః = పర్యా. పిచండిలః = పెద్దపొట్ట కలవాడు. అభ్రటః = వంగిన ముక్కు కలవాడు. పౌగంఢః = వికలాంగుడు; ఆరోగ్యమ్‌ - అనామయమ్‌ - పర్యా. ఏడః - బధిరః = చెవిటివాడు. కుబ్జః - గడులః = గూనివాడు. ఖుణిః = వంకర చేతులవాడు. క్షయః - శోషః - యక్ష్మా = క్షయరోగము. ప్రతిశ్యాయః - పీనసః = జలులు. క్షుత్‌ - క్షుతం - క్షువః = తుమ్ము; కాసః - క్షవథుః = దగ్గు; శోధః -స్వయధుః - శోభః వాపు. పాద స్ఫోటః - విపాదికా - కాళ్ళపగులు. కిలాసః సిద్మః = పర్యా. పామ - కచ్ఛూః- పామా విచర్చికా = గజ్ఞి, కోఠ - మండలకమ్‌ - కుష్ఠమ్‌ - పర్యాః దుర్నామకః = అర్షస్‌ = మూలశంక; ఆవాహః - నిబంధః = మలమూత్ర నిరోధము. గ్రహణీ - రుక్ర్పవాహికా = గ్రహణి రోగము. బీజ - వీర్య -ఇంద్రియ - శుక్ర = వీర్యము. పలల - క్రవ్య -ఆమిష = మాంసము. వృక్కా - అగ్రమాంసమ్‌ - హృదయ మాంసము హృదయమ్‌-హృత్‌ = పర్యా. మేదస్‌-వపా - వసా = కొవ్వు. మన్యా = మెడవెనుకవున్న నాడి; ధమని - శిరా = పర్యా. తిలకమ్‌ - క్లోమ = పర్యా. మస్తిష్కమ్‌= మెదడు. దూషికా = కంటికుసి. అంత్రమ్‌ - పురీతత్‌ - ప్రేగు. గుల్మః - ప్లీహా = పర్యా. వస్నసా - స్నాయుః = పర్యా. కాలఖండః - యకృత్‌ = పర్యా. కర్పరః - కపాలః = పర్యా. కేకసమ్‌ - కుల్యం అస్థి= పర్యా. కంకాలః = అస్థిపంజరము. కశేరుకమ్‌ = వెన్నుముక. కరోటిః= పుర్రె. పరుశుకా = ప్రక్క ఎముకలు. అంగ - ప్రతీక - అవయవ - శరీర - వర్ష్మ - విగ్రహ = పర్యా. కట - శ్రోణీ ఫలక = పర్యా. కటి - శ్రోణిః - కకుద్మతీ = పర్యా. నితంబః = స్త్రీ కటి యొక్క పశ్చాద్భాగము - జఘనమ్‌= పురోభాగము, కూపకౌ=నితంబము నందున్న గుంటలు. కకుందరే=కూపకములు; కటి - ప్రోథ - స్ఫిచ=వర్యా, ఉపస్థః చెప్పునున్న పురుష స్తీ లింగమునకు పేరు. భగమ్‌ - యోనిః=వర్యా. శిశ్నః - మేఢ్రం - మోహనః - శేఫః=పర్యా. పిచిండః - కుక్షిః - జఠరమ్‌ - ఉదరమ్‌ - తుందః=పర్యా. కుచ - స్తన=పర్యా. చూచుకం=కూచాగ్రము; క్రోడం - భుజముల మధ్య భాగము. స్కంధః - భుజ శిరః - హంసః=భుజము జతృ=భుజముల సంధి. పునర్భవ - కరరుహ - నఖ - నఖర=పర్యా. చెయ్యి చాపగ అంగుష్ఠ మొదలు తర్జని చివర వరకు వున్న భాగము ప్రాదేశముని పేరు. అంగుష్ఠము నుండి కనిష్ఠిక చివరి వరకు వున్న ది వితస్తి (జాన). ఇది రెండ్రెండు అంగుళము లుండును. అన్ని వ్రేళ్ళను చాపిన చెయ్యికి చపేట-పత్రల ప్రహస్త అని పేరు. పిడికిలి బిగించినచో దానికి "రత్ని" యని పేరు. రత్నినుండి కనిష్టి వరకు వున్న భాగమునకు "అరత్ని" అని పేరు. శంఖాకారము గల కంఠమునకు కంబుగ్రీవా - త్రిరేఖా యని పేతు. అవటుః - గాటా - కృకాటికా=కంఠ రంధ్రమునకు పేతు. పెదవుల క్రింధి భాగమునకు చిబుకము అని పేతు. గండః - గలః - హనుః=గండ స్థలము పేరు. అపాంగః నేత్రాంతము. కటాక్షః=నేత్రాంతముతో చూచుట; చికురః - కుంతలః - బాలః-కేశము (జుట్టు) ప్రతికర్మ - పసాధనమ్‌=అలంకరించుకొనుట. ఆకల్పః - వేషః - నేపథ్యమ్‌ - నాటకాదులలో వేషము ధరించుట. చూడామణిః - శిరోరత్నము; తలః=హారమధ్య మందలి మాణిక్యము. కర్ణికా - తాళ పత్రమ్‌=కర్మ భూషణము. లంబనమ్‌ - లలంతికా=క్రిందికి వ్రేలాడు హారము. మంజీరః - నూపురమ్‌=అందెలు. కింకిణీ=చిన్న ఘంట. దైర్ఘ్యమ్‌ - ఆయామః - అనాహః=వస్తాదుల పొడవు. పరిణాహః - విశాలతా=వైశాల్యము; పటచ్చరమ్‌=జీర్ణ వస్త్రము; సంవ్యానమ్‌- ఉత్తరీయమ్‌=పర్యా. రచనా - పరిస్పందః=పుష్పాది రచన ఆభోగః=ఉపచారాదుల పరి పూర్ణత్ము. సముద్గకః - సంపుటకః=చిన్న పెట్టె. ప్రతి గ్రహః పతద్గ్రహః=ఉమ్మి వేయు పాత్ర.

అగ్ని మహా పురాణముద మనుష్య వర్గ వర్ణనమను మూడు వందల అరువది నాల్గవ అధ్యయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page