Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచపంచాశ దధిక త్రిశతతమో7ధ్యాయః

అథ సమాసః

స్కంద ఉవాచ :

షోడాసమాసం వక్ష్యామి అష్టావింశతిధా పునః | నిత్యా నిత్య విభాగేన లుగులోపేన చద్విధా. 1

కుంభకారశ్చ నిత్యః స్యాద్దేమకారాదికస్తథా | రాజ్ఞ పుమాన్రాజ పుమాన్న నిత్యో7యం సమాసకః. 2

కష్టశ్రితోలుక్సమాసః కంఠేకాలాదికస్త్వలుక్‌ | స్యా దష్టధా తత్పురుషః ప్రథమాద్యసుపాసహ. 3

ప్రథమా తత్పురుషో7యం పూర్వం కాయస్య నిగ్రహే | పూర్వకాయో7పరకాయోహ్యధరోత్తరకాయకః.

అర్దంకణాయార్దకణా భిక్షౌతూర్య మథేదృశమ్‌ | ఆపన్న జీవిక స్తద్వద్ద్వితీయాచాధరాశ్రితః. 5

వర్షం భోగ్యో వర్షభోగ్యో ధాన్యార్థశ్చ తృతీయయా | చతుర్థీస్యాద్విష్ణుబలిర్వృక భీతిశ్చ పంచమీ. 6

రాజ్ఞః పుమాన్రాజపుమాన్షష్ఠీ వృక్షఫలం తథా | స్తప్తమీ చాక్షశౌండో7యమహితోనఞ్‌ సమాసకః. 7

స్కందుడు చెప్పెను. ఆరు విధములగు సమాసము చెప్పెదను. ఇది మరల ఇరువది యెనిమిది విధములు. నిత్యము అనిత్యము అని సమాసము రెండు విధములు. లుక్‌, అలుక్‌లచే మరల రెండు విధములు. కుంభకారః, హేమకారః ఇత్యాదులు నిత్య సమాసములు. రాజ్ఞః పుమాన్‌ రాజ పుమాన్‌ ఇత్యాదులు అనిత్య సమాసములు. కష్టశ్రితః ఇత్యాదులు లుక్‌ సమాసములు. కంఠేకాలః ఇత్యాదులు అలుక్సమాసములు. ప్రథమాది సుప్రత్యయములను బట్టి తత్పురుషము ఎనిమిది విధములు. పూర్వం కాయస్య పూర్వకాయః ఇది ప్రథమాతత్పురుషము. అపరకాయః, అధరకాయః, ఉత్తరకాయః, అర్ధ కణాతుర్య భిక్షా ఇత్యాదులు ప్రథమాతత్పురుషములు. ఆపన్న జీవికః అధరాశ్రితః, వర్షం భోగ్యః వర్షభోగ్యః ఇత్యాదులు ద్వితీయాతత్పురుషములు. ధాన్యార్థః ఇది తృతీయాతత్పురుషము. విష్ణుబలిః ఇది చతుర్థీ తత్పురుషము. వృకభీతిః పంచమీ తత్పురుషము. రాజ్ఞః పుమాన్‌ రాజపుమాన్‌, వృక్ష ఫలము ఇత్యాదులు షష్టీతత్పురుష. అక్షశౌండః ఇది సప్తమీ తత్పురుష. అహితః ఇది నఞ్‌ తత్పురషము.

కర్మధారయః సప్తధా నీలోత్పల ముఖాః స్మృతాః | విశేషణ పూర్వపదో విశేష్యోత్తరత స్తథా. 8

వైయాకరణసూచిః శీతోష్ణం ద్విపదం శుభమ్‌ | ఉపమాన పూర్వపదః శంఖపాండుర ఇత్యపి. 9

ఉపమానోత్తర పదః పురుషవ్యాఘ్ర ఇత్యపి | సంభావనా పూర్వపదో గుణవృద్ధిరితీదృశమ్‌.

10

గుణఇతి వృద్ధిర్వాచ్యాసు హృదేవ సుబంధుకః | అవధారణ పూర్వపదో బహువ్రీహిశ్చసప్తధా. 11

ద్విపదశ్చ బహువ్రీహి రారూఢ భవనోనరః | అర్చితా శేషపూర్వోయం బహ్వంఘ్రిః పరికీర్తితః. 12

ఏతేవిప్రాశ్చోపదేశాః సంఖ్యోత్తర పదస్త్వయమ్‌ | సంఖ్యోభయపదో యద్వద్ధ్విత్రాద్వ్యే కత్రయానరః. 13

సహపూర్వపదో7యం స్యాత్సమూలోద్ధత కస్తరుః | వ్యతిహారలక్షణాథః కేశాకేశి నఖానిఖి. 14

దిగ్లలక్ష్యా స్యాద్దక్షిణపూర్వా ద్విగురాభాషితోద్విధా | ఏకవద్భావి ద్విశృంగం పంచమూలీ త్వనేకధా. 15

ద్వందః సమాసో ద్వివిధో హీతరే తరయోగకః | రుద్రవిష్ణు సమాహరౌ భేరీపటహ మీదృశమ్‌. 16

ద్విధాఖ్యాతో7వ్యయీభావో నామపూర్వ పదోయథా | శాకస్య మాత్రాశాకప్రతి యథా7వ్యయ పూర్వకః.

ఉపకుంభం చోపరథ్యం ప్రాధాన్యేన చతుర్విధః | ఉత్తరపదార్థ ముఖ్యోద్వంద్వశ్చో భయముఖ్యకః.

పూర్వార్థేశో7వ్యయీభావో బహువ్రీహిశ్చ బాహ్యగః. 18

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సమాసనిరూపణంనామ పంచపంచశదధిక త్రిశతతమో7ధ్యాయః.

కర్మధారయము ఏడు విధములు. నీలోత్పలమ్‌ ఇత్యాదులు ఉదాహరణములు. ఇది విశేషణ పూర్వ పదము. వైయాకరణ ఖసూచిః ఇది విశేష్యోత్తర పదము. శీతోష్ణమ్‌. ఇది విశేషణోభయ పదము. శంఖపాండురః ఇది ఉపమాన పూర్వ పదము. పురుష వ్యాఘ్రః ఇది ఉపమానోత్తర పదము. గుణ వృద్ధిః ఇది సంభావనా పూర్వ పదము, గుణ ఇతి వృద్ధిః యని నిగ్రహ వాక్యము సుహృదేవసుబంధుకః నుహృత్సుబంధుకః ఇది అవధారణ పూర్వ పదము. బహు వీహి ఏడు విధములు. ఆరూఢ భవనః ఇది ద్విపద బహు వ్రీహి. ఆర్చితా శేష పూర్వః ఇది బహుపద బహువ్రీహి. ఉపదశాః సంఖ్యోత్తర పదము. ద్విత్రాః ఇద్యాదులందు సంఖ్యో భయ పదము. సమూలోద్ధృతః. ఇది సహ పూర్వ బహువ్రీహి. కేశాకేశి, నఖానఖి ఇత్యాదులు వ్యతిహార లక్షణ బహువ్రీహి. దక్షిణ పూర్వా ఇత్యాదులందు దిగ్లక్షణ బహువ్రీహి. ద్విగు రెండు విధములు. ద్విశృంగమ్‌. ఇది ఏకవద్భావీ ద్విగు. అనేక వద్భావి కూడ వుండును. ద్వంద్వ సమాసము రెండు విధములు. రుద్ర విష్ణూ ఇతరేతర యోగ ద్వంద్వము. భేరీ పటహం. ఇది సమహార ద్వంద్వము. అవ్యయీ భావము రెండు విధములు. శాకస్య మాత్రాశాక ప్రతి. ఇది నామ పూర్వ పదావ్యయీభావము. ఉపకుంభమ్‌. ఉపరథ్యమ్‌. అవ్యయ పూర్వక అవ్యయీ భావములు. సమాసము పాధాన్యమును బట్టి నాలుగు విధములు. ఉత్తర పదార్థ ప్రధాన మగు తత్పురుషము, ఉభయ ప్రధాన మగు ద్వంద్వము, పూర్వార్థ ప్రధానమగు అవ్యయీ భావము, అన్యార్థ ప్రధాన మగు బహు వ్రీహి.

అగ్ని మహా పురాణమున సమాస నిరూపణ మను మూడు వందల యేబది ఐదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page