Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ అష్టచత్వారింశదధిక త్రిశతతమో7ధ్యాయః

అథై కాక్షరకోశః

అగ్నిరువాచ :

ఏకాక్షరాభిదానంచ మాతృకాన్తం వదామితే | అవిష్ణుః ప్రతిషేదః స్యాదాపితామహవాక్యయోః. 1

సీమాయామవ్యయమ ఆభ##వేత్సం క్రోధపీడయోః | ఇః కామేరతిలక్ష్మ్యోరీ ఉః శివే రక్షకాద్య ఊః. 2

ఋశ##బ్దే చాదితీ ఋస్యాత్‌ తేవైదితౌ గుహే | ఏదేవీ ఐయోగినీ స్యాదో బ్రహ్మాజౌ మహేశ్వరః.

3

అం కామః అః ప్రశస్తః స్యాత్కో బ్రహ్మాదౌకు కుత్సితే |

ఖం శూన్యేంద్రియం ఖం గోగంధర్వేచ వినాయకే. 4

గంగీతే గోగాయనేస్యాద్ఘో ఘంటాకింకిణీయఖే | తోడనే జశ్చవిషయేస్పృహాయాంచైవ భైరవే. 5

చోదుర్జనే నిర్మలే ఛశ్ఛేదే జిర్జయనే తథా | జం గీతేఝః ప్రశ##స్తే స్యాద్బలేఞోగాయనే చ టః. 6

ఠశ్చంద్రమండలే శూన్యే శివేచోద్భంధనేమతః | డశ్చరుద్రే ధ్వనౌత్రాసే ఢక్కాయాంఢోధ్వనౌమతః. 7

ణోనిష్కర్షే నిశ్చయే చ తశ్చౌరే క్రోడపుచ్ఛకే | భక్షణ థశ్ఛేదనే దో ధారణ శోభ##నేమతః.

8

ధోధాతరిచ ధూస్తూరే నో వృన్ద సుగతే తథా | ప ఉపవనే విఖ్యాతః ఫశ్చ ఝంఝానిలే మతః. 9

పుః పూత్కారే నిష్పలేచ బిః పక్షీభంచతారకే | మా శ్రీర్మానం చ మాతాస్యాద్యా గేయోయాతృవీరణ. 10

రోవహ్నౌ బలశ##క్రేచ లోవిధాతరి ఈరితః | విశ్లేషణవో వరుణ శయనే శశ్చశం సుఖే. 11

షః శ్రేష్ఠేసఃపరోక్షేచసాలక్ష్మీః సంకచేమతః | ధారణ వాస్తథారుద్రే క్షః క్షత్రే చాక్షరేమతః.

12

క్షోనృసింహే హరౌతద్వతేక్షత్ర పాలక యోరపి | మంత్రఏకాక్షరో దేవో భుక్తిముక్తిప్రదాయకః. 13

క్షౌం హయశిరసేనమః సర్వవిద్యాప్రదోమనుః |అకారాద్యాస్తథా మంత్రా మాతృకామంత్ర ఉత్తమః. 14

ఏకవద్మే7ర్చయేదేతాన్నవ దుర్గాశ్చపూజయేత్‌ | భగవతీ కాత్యాయనీ కౌశికీ చాథ చండికా.

15

ప్రచండా సురనాయికా ఉగ్రా పార్వతీ దుర్గయా

ఓం చండికాయై విద్మహే భగవత్యై ధీమహి,

తన్నో దుర్గాప్రచోదయాత్‌.

క్రమాది తుషడంగంస్యాద్గణో గురుర్గురుః క్రమాత్‌. 16

అజితా పరాజితాచాథ జయాచ విజయా తతః | కాత్యాయనీ భద్రకాలీ మంగలాసిద్ధిరేవతీ.

17

సిద్దాది బటుకాః పూజ్యాహేతుకశ్చకపాలికః | ఏకపాదో భీమరూపో దిక్పాలాన్మధ్యతోనవ.

18

హ్రీం దుర్గే దుర్గే రక్షణి స్వాహా మంత్రార్థ సిద్ధయే |

గౌరీ పూజ్యచ ధర్మాద్యాః స్కందాద్యాః శక్కయాయజేత్‌. 19

ప్రజ్ఞాజ్ఞానా క్రియావాచా వాగీశీ జ్వాలినీ తథా | కామినీకామ మాలాచ ఇంద్రాద్యాః శక్తిపూజనమ్‌. 20

ఓం గం స్వాహా మూలమంత్రోయం గంవా గణపతయేనమః|

షడంగో రక్తశుక్లశ్చ దంతాక్షర పరశూత్కటః. 21

సమోదకో7థ గంధాదిగంధోల్కాయేతి చక్రమాత్‌ | గజో మహాగణ పతిర్మహోల్కః పూజ్యఏవచ. 22

కూష్మాండాయ ఏకదంత త్రిపురాన్తకాయ శ్యామదంత

వికట హర హాసాయ లంబనాసాననాయ పద్మ దంష్ట్రాయ

మేఘోల్కాయ ధూమోల్కాయ వక్రతుండాయ విఘ్నేశ్వరాయ

వికటోత్కటాయ గజేంద్ర గమనాయ భుజగేంద్ర హారాయ

శశాంక ధరాయ గణాధిపతయే స్వాహా.

ఏతైర్మనుభిః స్వాహాన్తైః పూజ్యః తిలహోమాది నార్థభాక్‌ |

కాద్యైర్వా (రా) బీజసంయుక్తైసై#్తరాద్యైశ్చనమో7న్తకైః. 23

మంత్రాః పృథక్పృథగ్వాసుద్విరేఫద్విర్ముఖాక్షిణః | కాత్యాయనం స్కన్ద ఆహయత్తద్వ్యాకరణంవదే. 24

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఏకాక్షర కోశ నిరూపణం నామాష్టచత్వారింశ దధిక త్రిశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను. ఏకాక్షర కోశమును, మాతృకా నామములు, మంత్రములు చెప్పెదను. ఆ = విష్ణువు, నిషేధము. ఆ = బ్రహ్మ, సీమా అర్థమున ఇది అవ్యయము. వాక్యము నందు కూడ ఉపయోగించబడును. క్రోధము పీడ అని కూడ అర్థము. ఇ = మన్మథుడు. ఈ = రతి, లక్ష్మి. ఉ = శివుడు. ఊ = రక్షకాదులు. ఋ = శబ్దము, బుూ = అదితి. = దితి, కుమారస్వామి, ఏ = దేవి. ఐ = యోగినీ. ఓ = బ్రహ్మ. ఔ = మహేశ్వరుడు. అం = మన్మథుడు. అః = ప్రశస్తము. క = బ్రహ్మాదులు, కు = కుత్సితము, ఖ = శూన్యము, ఇంద్రియము, గ = గంధర్వుడు, వినాయకుడు (న. పు. గీతము) ఘ = ఘంట, కింకిణీ మొదలగునవి, తాడనము కూడ దీని అర్థము; ఙ = విషయము, స్పృహ, భైరవుడు, చ = దుర్జనుడు, నిర్మలము; ఛ = ఛేదనము;జి = వివేకము; జ = గీతము; ఝ = ప్రశస్తము;ఞ = బలము; ట = గానము; ఠ = చంద్రమండలము, శూన్యము, శివుడు, ఉరిపోసుకొనుట; డ = డుద్రుడు, ధ్వని, త్రాసము, ఢ = ఢక్కా, ఢక్కాధ్వని, ణ = నిష్కర్షము, నిశ్చయము త = తస్కరుడు, వరాహ పుచ్ఛము. థ = భక్షణము. ద = ఖేదనము, ధారణము, శోభనము ధ = బ్రహ్మ, తుత్తూరము. న = సమూహము బుద్ధుడు. ప = ఉపవనము ఫ = ఝంఝావాతము. పు = పూత్కారము. నిష్ఫలము. బి = పక్షి భ = నక్షత్రము మా = లక్ష్మి, మానము, మాత. య = యాగము, యాత, ఈరిణ వృక్షము ర = అగ్ని, బలము, ఇందుడు. ల = విధాతా. వ = విశ్లేషణము, వరుణుడు. శ = శయనము, సుఖము. ష = శ్రేష్ఠము. స = పరోక్షము. సా = లక్ష్మి. స = (నపు) కేశము. హ = ధారణము, రుద్రుడు, క్ష = క్షేత్రము, అక్షరము, నృసింహుడు, హరి, క్షత్రజాతి, పాలకుడు. ఏకాక్షర మంత్రము దేవతా రూపము, భుక్తి ముక్తి ప్రదము. ''క్షౌం హయ శిరసే నమః''. ఇది అన్ని విద్యలను ఇచ్చు మంత్రము; ఆకారాది అక్షర నవకము మంత్రములే. వీటికి ఉత్తమ మాతృకా మంత్రములని పేరు. వీటిని ఒక కమల దశమున స్థాపించి పూజించవలెను. ఓం చండికాయై విద్మహే, భగవత్యై ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్‌. ఇది దుర్గా మంత్రము. షడంగాది క్రమమున పూజించవలెను. అజిత, అపరాజిత, జయ, విజయ, కాత్యాయనీ, భద్రకాళి. మంగళ సిద్ధి, రేవతి, సిద్ధాదివటుక. ఏకపాద, భీమరూప, హేతుక, కపాలికలను పూజించవలెను. మధ్యభాగమున తొమ్మండుగురు దిక్పాలకులను పూజించవలెను. మంతసిద్ధి కొరకై హ్రీందుర్గే దుర్గే రక్షణిస్వాహా అనుమంత్రము జపించవలెను. గౌరీ పూజ చేసి ధర్మాదులను స్కందాదులను, శక్తులను పూజించవలెను. ప్రజ్ఞా, జానా, క్రియ, వాచా, వాగీశి జ్వాలినీ. వామ, జ్యేష్ఠా, రౌద్ర, గౌరి, హ్రిం, దేవతలను పూజించి పురస్సరా దేవిని ''హ్రీం సహ మహాగౌరి రుద్ర దై తేస్వాహా'' అనుమంత్రముతో పూజించి మహాగౌరి జ్ఞాన శక్తి, క్రియా శక్తి. సుభగా, లలిత, కామినీ, కామమాలా ఇంద్రాది శక్తుల పూజ కూడ ఏకాక్షర మంత్రముతో చేయవలెను. ఓం, గం, స్వాహా. ఇది గణపతి మూల మంత్రము లేదా గంగణ పతయే నమః అనుమంత్రముతో కూడ పూజ చేయవచ్చును. రక్త శుక్ల దంత, నేత, పరుశు ఉత్కట. మోద ఇవి షడంగములు. ''గంధోల్కాయ'' ఇత్యాది క్రమమున గ్రంధాదులు సమర్పించవలెను. గజ మహా గణపతి మహోల్క పూజ కూడ చేయవలెను. ''కూష్మాండాయ'' మొదలు గణాధి పతయే స్వాహా వరకు నున్న మూలోక్త మంత్రములకు కకారాది ఏకాక్షర బీజములు ముందు చేర్చి అంతమున ''నమః స్వాహా' శబ్దములు ప్రయోగించి వినియోగించవలెను. తిల హోమము చేసి దేవతా పూజ చేయవలెను. ద్విరేఫ ద్విర్ముఖ, ద్వక్షాది మంత్రములు వేర్వేరుగా వుండ వచ్చును. ఇపుడు స్కందుడు కాత్యాయనునకు చెప్పిన వ్యాకరణము చెప్పెదను.

అగ్ని మహా పురాణమున ఏకాక్ష కోశ నిరూపణమున మూడు వందల నలుబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page