Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతుశ్చత్వారింశదధిక త్రిశతతమోధ్యాయః

అథు అర్థాలంకారాః

అగ్ని రువాచ :

అలంకరణ మర్థానామర్థాలంకార ఇష్యతే | తంవినాశబ్ద సౌందర్యమపి నాస్తి మనోహరమ్‌. 1

అర్థాలంకార రహితవిధమేవ సరస్వతీ | స్వరూపమథ సాదృశ్య ముత్ర్పేక్షాతి శయావపి. 2

విభావనా విరోధశ్చ హేతుశ్చ సమమష్టదా | స్వభావ ఏవభావానో స్వరూప మభిధీయతే. 3

నిజమాగన్తు కంచేతి ద్వివిధం తదుదాహృతమ్‌ | సాంసిద్ధికం నిజం నైమిత్తిక మాగన్తుకం తథా. 4

సాదృశ్యం ధర్మసామాన్య ముపమారూపకం తథా | సహోక్త్యర్థాంతరన్యాసావితిస్యాత్యు చతుర్విధః. 5

ఉపమానామ సాయస్యాముపమానోప మేయయోః | సత్తాచాంతర సామాన్యయోగిత్వే7పి వివక్షితమ్‌. 6

కించిదాదాయ సారూప్యం లోకయాత్రా ప్రవర్తతే | సమాసేనా సమాసేన సాద్విధా ప్రతియోగినః. 7

విగ్రహాదభి ధానస్య ససమాసా7న్య థోత్తరా | ఉపమాద్యోతక పదేనోపమేయపదేనచ. 8

తాభ్యాంచ విగ్రహా త్త్రేధా ససమాసాన్తి మాత్త్రిధా | విశిష్యమాణా ఉపమాభవన్త్యష్టాదశస్ఫుటాః. 9

యత్రసాధారణో ధర్మః కథ్యతే గమ్యతే7పివా | తేధర్మవస్తు ప్రధాన్యాద్ధర్మ వస్తూపమే ఉభే. 10

తుల్యమేవోపమీయేతే యత్రాన్యోన్యేన ధర్మిణౌ | పరస్పరో పమాసాస్యాత్ర్ప సిద్ధేరన్యథాద్వయోః. 11

వివరీతోపమా సా స్యాద్వ్యావృత్తేర్నియ మోహమా | అన్యత్రాప్యును వృత్తేస్తు భ##వేదనియమోహమా. 12

అగ్ని దేవుడు పలికెను. అర్థములను అలంకరించుట అర్థాలంకారము. అది లేనిచే శబ్ద సౌందర్యము కూడ మనో హారముగా నుండదు. అర్థాలంకార హీన మగు వాక్కు నాథుడు లేని స్త్రీ వంటిది. స్వరూపము సాదృశ్యము ఉత్ర్పేక్ష, అతిశయము, విభావనా, విరోధము, హేతువు, సమము అని అర్థాలంకారములు ఎనిమిది విధములు. పదార్థముల స్వభావమునకు స్వరూప మని పేరు. నిజము ఆ గంతుక మని అది రెండు విధములు. పుట్టుకతో వచ్చినది నిజము. నిమిత్తమును బట్టి వచ్చనది ఆగంతుకము. ధర్మ సామ్యమునకు సాదృశ్యమని పేరు. అది ఉపమా, రూపకము, సహోక్తి అర్థాంతర న్యాసము అని నాలుగు విధములు. భేదము, ఉపమానోపమేయములకు సామాన్య ధర్మ బంధము వున్నచో అది ఉపమా. ఏదియో కొంత సాదృశ్యమును ఆధారముగా తీసుకొని లోక యాత్ర నడుచు చున్నది. ససమాస, అసమాస యని ఉపమా రెండు విధములు. ఉపమానము సమస్తమైనచో ససమాస. అట్లు కానిచో అసమాస. ఉపమాద్యోతక పదములు గాని, ఉపమేయ వాచకములు గాని రెండును గాని లోపించగా ససమాస మూడు విధములగును. అసమాస కూడ మూడు విధములు. విశేషణములతో యుక్తమైనపుడు ఉపమా పదునెనిమిది విధములగును. సాధారణ ధర్మమును చెప్పు ఉపములో ఆధర్మమునకు వున్న పాధాన్యాన్ని బట్టి ధర్మోవమా, వస్తు పాధాన్యమును బట్టి వసూపమా. ఉపనోపమేయముల ప్రసిద్దిని బట్టి పరస్పరము సామ్యము చెప్పినచో అది పరస్పరోపమా, ప్రసిద్ధిని బట్టి పరస్పరము సామ్యము చెప్పినచో అని పరస్పరోపమా, ప్రసిద్దికి విరుద్ధముగా ఉపమానోపమేయములలో వైషమ్యమున్నచో విపరీతోపమా. ఒక వస్తువుతో మాత్రమే సామ్యము చెప్పి ఇతరోపమానములను నిషేధించినచో నియమోపమా. ఉపమేయము యొక్క గుణాదులు ఉపమానాంతరము నందు గూడ అనువృత్తములైనచో అనియమోపమా.

సముచ్చయోపమాతో7న్యధర్మ బాహుల్య కీర్తనాత్‌ | బహుధర్మస్య సామ్యే7పి వైలక్షణ్యం వివక్షితమ్‌.

యదుచ్యతే7తి రిక్తత్వం వ్యతిరేకోపమాతుసా | యత్రోపమాస్యాద్బహుభిః సదృశైః సాబహూపమా. 14

ధర్మా, ప్రత్యుపమానం చేదన్యా మాలోపమైవసా | ఉపమాన వికారేణ తులనా విక్రియోపమా. 15

త్త్రెలోక్యాసంభవి కిమప్యారోప్య ప్రతియోగిని | కవినోపమీయతేయా ప్రథతే సాద్భుతోపమా. 16

ప్రతియోగిన మారోప్య తదఖేదేన కీర్తనమ్‌ | ఉపమేయస్యసా మహోపమా7సౌ భ్రాన్తిమద్వచః. 17

ఉభయోర్ధర్మిణో స్తథ్యా నిశ్చయాత్సంశయోపమా | ఉపమేయస్య సంశయ్య నిశ్చయాన్నిశ్చయోపమా. 18

వాకార్థేనైవ వాకార్తోపమా స్యాదుపమానతః | ఆత్మోపమానాదుపమా సాధారణ్యతిశాయినీ. 19

ఉపమేయం యదన్యస్య తదన్య సోవమామతా | యద్యుత్తరోత్తరం యాతితదా7సౌగగనోపమా. 20

వశంసాచైవ నిన్దాచ కల్పితా సదృశీతథా | కించిచ్చ సదృశీ జ్ఞైయా ఉపమాపంచధా పునః. 21

ఉపమానేన యత్తత్త్వముపమేయస్య రూప్యతే | గుణానాం సమతాం దృష్ట్వా రూపకం నామ తద్విదుః 22

ఉపమైవతరోభూత భేదారూపకమేవవా | సహోక్తిః సహభావేన కథనం తుల్యధర్మిణామ్‌. 23

ఒకటికి మించిన ధర్మములను చెప్పినచో సముచ్చయోపమా, అనేక ధర్మములలో సామ్యమున్నను ఉపమానము కంటే ఉపమేయము నందు వైలక్షణ్యమున్నట్లు చెప్పినచో అది వ్యతిరేకోపమా. అనేక ఉపమానములు చెప్పినచో బహూపమా. ఆ ఉపమానములలో వేర్వేరు సాధారణ ధర్మములున్నచో మాలోపమా. ఉపమేయమును ఉపమాన వికారాముగా చెప్పి పోల్చినచో విక్రియోపమా. ఉపమానమునందు లోకత్రయము నందును అసంభావ్యమగు ఒకవై శిష్ట్యమును ఆరోపించికవి వర్ణించినచో అది అద్భుతోపమా. ఉపమానము నారోపించి ఉపమేయము తదభిన్నమని చెప్పి తద్వారా భ్రమ కల్గినట్లు వర్ణించుట మోహోపమా. రెండు వస్తువుల మధ్య వాటి స్వరూపమును గుర్తించుటకు శక్యము గానిచో సంశయోపమా. మొదట సంశయము కలిగి పిదప నిశ్చయము కలిగినచో నిశ్చయోపమా. ఒక వాకార్థమును మరొక వాక్యార్థమునకు ఉపమగా వర్ణించినచో వాక్యార్థోపమా. ఉపమానమును బట్టి సాధారణీ, అతిశాయినీ అని ఉపమా రెండు విధములు. ఉపమేయమే ఉపమానమైనచో అది అన్యోన్యోపమా. ఈ విధముగా ఉత్తరోత్తరము నడచి చో గమనోపమా. ప్రశస్తము, నింద, కల్పితము, సదృశి, కించిత్సదృశి అనిమరల ఉపమలో ఐదుభేదము లుండును. గుణసామ్యముచే ఉపమేయ స్వరూపమునకు, ఉపమాన స్వరూపమునకు అభేదమును ప్రతిపాదించినచో రూపకాలంకారము లేదా భేదముతోరోహితమైనపుడు ఉపమయేరూపకము. తుల్య ధర్మములగు రెండు పదార్థములు కలిసి యున్నట్లు వర్ణించి సహోక్తి.

భ##వేదర్థాంతరన్యాసః సాదృశ్యేనోత్తరేణసః | అన్యథోపస్థితా వృత్తిశ్చేతనస్య తరస్యచ. 24

ఆన్యథా మన్యతేయత్ర తాముత్ర్పేక్షాం ప్రచక్షతే | లోకసీమాని వృత్తస్య వస్తు ధర్మస్య కీర్తనమ్‌. 25

భ##వేదతిశయోనామ సంభవా సంభవా ద్ద్విధా | గుణజాతి క్రియాదీనాం యత్రవైకల్య దర్శనమ్‌. 26

విశేష దర్శనాయైవ సావిశేషోక్తిరుచ్యతే | ప్రసిద్ధిహేతువ్యావృత్త్యా యత్కించిత్కారణాంతరమ్‌. 27

యత్ర స్వాభావికత్వంవా విభావ్యం సా విభావనా | సంగతీ కరణం యుక్త్యాయదసంగచ్ఛమానయోః. 28

(అ) 2/45

విరోధపూర్వకత్వేన తద్విరోధ ఇతి స్మృతమ్‌ | సిసాధయిషితార్థస్య హేతుర్భవతి సాధకాః. 29

కారకో జ్ఞాపక ఇతి ద్విధాసో7ప్యుపజాయతే | ప్రవర్తతే కారకాఖ్యః ప్రాకృశ్చాత్కార్యజన్మనః. 30

పూర్వశేష ఇతి ఖ్యాతస్తయోరేవ విశేషయోః | కార్యకారణ భావాద్వాస్వభావాద్వానియామకాత్‌. 31

జ్ఞాపకాఖ్యస్య భేదో7స్తి నదీపూరాది దర్శనాత్‌ | అవినాభావనియమో హ్యవినాభావ దర్శనాత్‌. 32

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ఆర్థాలంకార నిరూపణంనామ చతుశ్చత్వారింశదధిక త్రిశతతమో7ధ్యాయః.

పూర్వ వర్ణితమగు వస్తువును సమర్థించుటకై సాధర్మమును కాని వైధర్మ్యమును గాని పురస్కరించుకొని మరి యొక అర్థమును సన్యసించుట అర్థంతరన్యాసము. సచేతన మగు పదార్థము లేదా అచేతన పదార్థము ఒక విధముగా నుండుటను, మరొక విధముగా ఊహించినచో ఉత్ర్పేక్షాలంకారమ. లోకాతీతముగా వర్ణించుట, అతిశయాలంకారము సంభవము అసంభవము అని రెండు విధములు. గుణ, జాతి, క్రియాదుల లోపమును చెప్పుట ద్వారా ఒక వస్తువు యందలి విశేషమును వర్ణించినచో విశేషోక్తి. ప్రసిద్ధమైన కారణమును నిరాకరించి మరియొక కారణమును కాని, స్వాభావిక రూపమున కార్యోత్పత్తిని కాని ఊహించినచో విభావనాలంకారము. పరస్పర విరుద్ధములగు పదార్థములను కలిసి యున్నట్లు యుక్త పూర్వకముగా వర్ణించుట విరోధాలంకారము. అభిలషితార్థ సాధక నిమిత్త వర్ణనము హేత్వలంకారము. కారకము జ్ఞాపకము యని ఇవి రెండు విధములు. కారక హేతువు కార్య జన్మమునకు పూర్వమునందును తరువాతను వుండును. దీనికి పూర్వశేషమను పేరు, ఈ భేదము లందే కార్య కారణ భావముచే గాని, నియామక మగు స్వభావముచే గాని, అవినాభావ దర్శనముచే గాని, అవినాభావనియమము వున్నచో అది జ్ఞాపక హేతువు. నదీ పూరాది దర్శనము జ్ఞాపకమునకు ఉదాహరము.

అగ్ని మహా పురాణమున అర్థాలంకార వర్ణన మను మూడు వందల నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page