Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్వాచత్వారింశధిక త్రిశతతమోధ్యాయః

అథాభినయాది నిరూపణమ్‌

అగ్ని రువాచ :

ఆభిముఖ్యం నయన్నర్థాన్విజ్ఞేయో7భి నయోబుధైః | చతుర్ధాసంభవః సత్త్వవాగంగా హరణాశ్రయః. 1

స్తంభాదిః సాత్త్వికో వాగారంభో వాచిక ఆంగికః | శరీరారంభ ఆహార్యోబుద్ధ్యారంభ ప్రవృత్తయః. 2

రసాది వినియోగోథ కథ్యతే హ్యభిమానతః | తమంతరేణ సర్వేషామపార్థైవ స్వతంత్రతా. 3

సంభోగో విప్రలంభశ్చ శృంగారో ద్వివిధఃస్మృతః | ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ తావపిద్వివిధౌపునః. 4

విప్రలంభాభిధానోయః శృంగారః సచతుర్విధః | పూర్వానురాగమానాఖ్యః ప్రవాస కరుణాత్మకః. 5

ఏతేభ్యో7న్యతరం జాయమాన సంభోగ లక్షణమ్‌ | వివర్తతే చతుర్థైవనచ ప్రాగతివర్తతే. 6

స్త్రీ పుంసయోస్త దుదయస్తస్య నిర్వర్తికారతిః | నిఖిలాః సాత్త్వికాస్తత్ర వైవర్ణ్య ప్రల¸°వినా. 7

ధర్మార్థకామమోక్షైశ్చ శృంగార ఉపచీయతే | ఆలంబన విశేషైశ్చ తద్విశేషైర్నిరంతరః. 8

శృంగారం ద్వివిధం విద్యాద్వాజ్‌ నేపథ్యక్రియాత్మకమ్‌ | హాసశ్చతుర్విధో7లక్ష్యదన్తః స్మితఇతీతరితః. 9

కించిల్లక్షిత దంతాగ్రం హసితం పుల్లలోచనమ్‌ | విహసితం సస్వనం స్యాజ్జిహ్మోప హసితంతు తత్‌. 10

సశబ్ధం చాపహసిత మశబ్దమతి హాసితమ్‌ | యశ్చాసౌ కరుణోనామ సరసస్త్రి విధోభ##వేత్‌. 11

ధర్మోప ఘాతజశ్చిత్త విలాస జనితస్తథా | శోకః శోకాద్భవేత్థ్సాయీకః స్థాయీపూర్వజో మతః. 12

అంగనేపథ్య వాక్యైశ్చ రౌద్రో7పి త్రివిధోరసః | తస్య నిర్వర్తకః క్రోధః స్వేదో రోమాంచ వేపథూ. 13

అగ్ని దేవుడు పలికెను. విషయమును అభి ముఖములు చేయునది అభినయము. సాత్త్వికము, వాచికము, ఆంగికము, ఆహార్యము అని ఇది నాలుగు విధములు,. స్తంభాదికము సాత్త్వికము. వాక్ప్ర వృత్తి వాచికము. శరీర చేష్ట ఆంగికము. బుద్ధిని ఉపయోగించి చేయునది ఆహార్యము. అభిమాన స్థితిచే రసాది వినియోగము చెప్పబడుచున్నది. రసము లేకుండగా మిగిలినవి స్వతంత్రములుగా నుండుచ వ్యర్థము. సంభోగము విప్రలంబము యని శృంగారము రెండు విధములు. ప్రచ్ఛన్నము ప్రకాశము యని యవి రెండేసి విధములు. పూర్వానురాగము మానము ప్రవాసము కరుణ యని విప్రలంబము నాలుగు విధములు. వీనిలో ఒక దాని వలన సంభోగ శృంగారము ఉత్పన్న మగును. ఇది కూడ నాలుగు విధములు. స్త్రీ, పురుషులను ఆశ్రయించి వుండును. శృంగారజనకము రతి. వైవర్ణ్య ప్రళయములు తప్ప అన్ని సాత్త్విక భావములు దీని యందుండును. ధర్మార్థ కామ మోక్షముల చేతను అలంబన విశేషముల చేతను వాటి ఆవాంతర విశేషము చేతను శృంగారము నిరంతరము పుష్టిపొందును. శృంగారము వాక్‌ క్రియ నేపథ్య క్రియ అనిరెండు విధములు. హాసము నాలుగు విధములు. దంతములు కనబడినిది స్మితము. కొంచెము దంతాగ్రములు కనబడి నేత్రములు వికసించినచో అది హసితము. ధ్వనితో కూడినది విహసితము. కుటిలత్వముతో కూడినది ఉపహసితము. సశబ్దముగ వున్నది అవహసితము. ఎక్కవ శబ్దము కలది అతిహసితము. కరుణ రసము ధర్మోప ఘాతజము, చిత్తవిలాస జనితము, శోక జనితము యని మూడు విధములు. దీనికి శోకము స్థాయి భావము. రౌద్ర రసము కూడ అంగనేపథ్య వాక్యములచే మూడు విధములు. దీని స్థాయీ భావము క్రోధము. స్వేద రోమాంచ వేపథువులు వుండును.

దానవీరో ధర్మవీరో యుద్దవీర ఇతిత్రయమ్‌ | వీరస్తస్యచ నిష్పత్తి హేతురుత్సాహ ఇష్యతే. 14

ఆరంభేషు భ##వేద్యత్ర వీరమేవాను వర్తతే | భయానకో నామ రసస్తస్య నిర్వర్తకం భయమ్‌. 15

ఉద్వేజనః క్షోభణశ్చ బీభత్సో ద్వివిధః స్మృతః | ఉద్వేజనః స్యాత్ల్పుత్యాద్యైః క్షోభణోరుధిరాదిభిః. 16

జగుప్సారంభికాతస్య సాత్త్వికాంశో నివర్తతే |

దాన వీరము, ధర్మ వీరము, యుద్ధ వీరము అని వీరము మూడు విధములు. ఉత్సాహము స్థాయీ భావము. ప్రారంభమున వీరముండి చివరమునకు భయమును కలిగించునది భయానకము. దాని స్ధాయి భావము భయము. ఉద్వేజనము క్షోభణము యని బీభత్సము రెండు విధములు పూతి వస్తువులచే కలిగినది ఉద్వేజనము. రుదిరాదులచే కలిగినది క్షోభణము. దీని స్తాయీ భావము జుగుప్ప. దీని యందు సాత్త్విక భావములుండవు.

కావ్యశోభాకరాన్ధర్మా నలంకారాన్ర్పచక్షతే. 17

అలంకరిష్టవస్తేచ శబ్దమర్థ ముభౌత్రిధా | యేవ్యుత్వత్త్యాదినా శబ్దమలంకర్తుమిహక్షమాః. 18

శబ్దాలంకార మాహుస్తాన్కావ్యమీమాం సకావిదః | ఛాయాముద్రాతథోక్తిశ్చ యుక్తిర్గుంఫనయాసహ. 19

వాకోవాక్య మనుప్రాసశ్చిత్తం దుష్కరమేవచ | జ్ఞేయానవాలంకృతయః శబ్దానామిత్య సంకరాత్‌. 20

తత్రాన్యోక్తేరనుకృతి చ్ఛాయాసాపి చతుర్విధా | లోకచ్ఛే కార్భ కోక్తీనామేకోక్తేరను కారతః. 21

ఆభాణకోక్తిర్లోకోక్తిః సర్వ సామాన్య ఏవతాః | యానుధావతి లోకోక్తిశ్ఛాయామిచ్చన్తి తాంబుధాః. 22

ఛేకావిదగ్ధా వైదగ్ధ్యం కలాసుకుశలామతిః | తాముల్లిఖన్తీ ఛేకోక్తి చ్ఛాయా కవిభిరిషఅయతే. 23

అవ్యుత్పన్నోక్తి రఖిలైరర్భకోక్త్యోపలక్ష్యతే తేనార్భకోక్తిశ్ఛాయాతన్మాత్రోక్తిమనుకుర్వతీ. 24

విప్లుతాక్షర మశ్లీలం వచో మత్తస్య తాదృశీ | యాసాభవతి మత్తోక్తిశ్ఛాయోక్తాప్యనుశోభ##తే. 25

అభిప్రాయ విశేషేణ కవిశ క్తిం వివృణ్యతీ | ముత్ర్పదాయినీతి సాముద్రా సైవశయ్యాపినోమతే. 26

ఉక్తిః సా కథ్యతే యస్యామర్థకో7ప్యుపపత్తిమాన్‌ | లోకయాత్రార్థ విధినాధినోతి హృదయం సతామ్‌. 27

ఉభౌవిధినిషేధౌచ నియమానియమావపి | వికల్ప పరిసంఖ్యేచ తదీయాః షడథోక్తయః. 28

అయుక్తయోరివ మిథో వాచ్యవాచకయోర్ద్వయోః | యోజనాయై కల్ప్యమానాయుక్తి రుక్తా మనీషిభిః 29

వదంచైవ పదార్థంచ వాక్యం వాక్యార్థమేవచ | విషయో7స్యాః ప్రకరణం ప్రపంచశ్చేతి షడ్విధః. 30

గుంఫనారచనాచర్యా శబ్దార్థక్రమగోచరా | శబ్దానుకారాదర్థాను పూర్వార్థేయం క్రమాత్త్రిధా. 31

ఉక్తిప్రత్యుక్తిమద్వాక్యం వాకోవాక్యం ద్వధైవతత్‌ | ఋజువక్రోక్తిభేదేన తత్రాద్యం సహజం వచః. 32

సాపూర్వప్రశ్నికా ప్రశ్న పూర్వి కేతి ద్విధాభ##వేత్‌ | వక్రోక్తిస్తు భ##వేద్భంగ్యాకాకుస్తేన కృతాద్విధా. 33

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే7భినయాది నిరూపణం నామ ద్వాచత్వారింశ దధిక త్రిశతతమో7ధ్యాయః.

కావ్య శోభాకరములగు ధర్మములను అలంకారములందురు. ఇవి శబ్దమును, అర్థమును, ఉభయమును అలంకరించును. వ్యుత్పత్త్యాదులచే శబ్దమును అలంకరించునవి శబ్దాలంకారములు. ఛాయ, ముద్ర, ఉక్తి, యుక్తి, గుంఫన, వాకో వాక్యము అనుప్రాసము, చిత్తము, దుష్కరము, ఇవి తొమ్మిది శబ్దాలంకారములు. ఇతరుల ఉక్తిని అనుకరించుటకు ఛాయ అని పేరు. లోక ఛేక, అర్భక మత్తుల ఉక్తుల అనుకరణములను బట్టి ఇది నాలుగు విధములు. ఆభాణము లోకోక్తి. యిది సర్వ సామాన్యము. లోకోక్తిని యనుసరించు రచనమును లోకోక్తి ఛాయ యని యందురు. చతురులకు ఛేకులు యని పేరు. కలా కౌశల్యమే చాతుర్యము. దానిని ప్రదర్శించునది ఛేకోక్తి ఛాయ. అర్బకోక్తి అవ్యుత్పన్నుల ఉక్తి. దానిని అనుకరించునది అర్బకోక్తి యని పేరు. మత్తుల వాక్యము అశ్లీలము గాను లుప్తాక్షరము గాను వుండును. దాని ఛాయ కలది మత్తోక్తి ఛాయ. ఇది సమయానుసారముగా ఉపయోగించినచో శోభాకరముగా నుండును. అభిప్రాయ విశేషముచే కవిశక్తిని స్పష్టీకరించుచు ఆనందమును కలిగించునది ముద్ర. యదియే మామతమున శయ్య యుక్తి యుక్త మగు అర్థమును భోధించునది లోక యాత్రానుసారముగా నుండి సహృదయుల హృదయమును అనందింప చేయునది ఉక్తి. విధి నిషేధము అని నియమము అనియమము అని వికల్పము, పరిసంఖ్య అని ఉక్తులు ఆరు విధములు. వేర్వేరుగా నున్న వాచ్య వాచకములను కలుపుటకు సమర్థమైన దానిని యుక్తి యందురు. పదము పదార్థము, వాక్యము వాకార్థము, ప్రకరణము ప్రపంచము అని యుక్తి ఆరు విధములు. రచనా చర్యకు గుంఫన యని పేరు. శబ్దార్థ క్రమగోచర, శబ్దానుకార, అర్థాను పూర్వార్థా అని అది మూడు విధములు. ఉక్తి ప్రత్యుక్తులు గల వాక్యము వాకో వాక్యము, ఋజు వుక్తివక్రోక్తి అని అది రెండు విధములు. మొదటిది స్వాభావిక వచన రూపము. అది పూర్వ ప్రశ్నిక, అప్రశ్న పూర్వికా అని రెండు విధములు. భంగవ క్రోక్తి కాకు వక్రోక్తియని వక్రోక్తి కూడ రెండు విధములు.

అగ్ని మహా పురాణమున అభినయాది నిరూపణ మను మూడు వందల నలుబది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page