Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షట్‌ త్రింశదధిక త్రిశతతమో7ధ్యాయః.

అథ శిక్షా నిరూపణమ్‌

అగ్నిరువాచ :

వక్ష్యే శిక్షాం త్రిషష్టిః స్యుర్వర్ణానా చతురధికాః | స్వరా వింశతిరేకశ్చ స్పర్శానాం పంచవింశతిః. 1

యాదయశ్చస్మృతాహ్యష్టౌ చత్వారశ్చయమాస్మృతాః | అనుస్యారో విసర్గశ్చ ల్గ కల్గ పౌచాపి పరాన్వితౌ. 2

దున్పృష్టశ్చేతి విజ్ఞేయోలకారః ప్లుత ఏవచ | రంగశ్చభే అరంప్రోక్తం హకారః పంచమైర్యుతః. 3

అంతః స్థాభి సమాయుక్త ఔరస్యః కంఠ్య ఏవసః | ఆత్మాబుధ్యా సమేసార్థం మనోయుంక్తే వివక్షయా. 4

మనః కాయాగ్ని మాహ న్తిసప్రేరయతిమారతమ్‌ | మారుతస్తూరసి చరన్మంద్రం జనయతి స్వరమ్‌. 5

ప్రాతః సవనయోగంతు ఛందో గాయత్రమాశ్రితమ్‌ | కంఠే మాధ్యందినయుతం మధ్యమంతేషు భానగమ్‌. 6

తారం తార్తీయ సవనం శీర్షణ్యం జాగతానుగమ్‌ | సోదీర్ణో మూర్ధ్న్యభిహితో వక్రమాపాద్య మారుతః. 7

వర్ణాంజనయతే తేషాం విభాగః పంచధాస్మృతః | స్వరతః కాలతః స్థానాత్ర్పయత్నార్థ ప్రదానతః. 8

అష్టౌస్థానాని వర్ణానామురః కంఠః శిరస్తథా | జిహ్వామూలశ్చ దంతాశ్చ నాసికౌష్టౌచ తాలుచ. 9

స్వభావశ్చ వివృత్తిశ్చ శషసారేఫ ఏవచ | జిహ్వామూల ముపధ్మాచ గతిరష్టవిధోష్మణః. 10

యద్యోభావ ప్రసన్థాన ముకారాది పరమ్పదమ్‌ | స్వరాన్తం తాదృశం విద్యాద్యదన్య ద్వ్యక్తమూష్మణః. 11

కుతీర్థా దాగతం దగ్ధమపవర్ణంచ భక్షితమ్‌ | ఏవముచ్చారణం పాపమేవ ముచ్చారణం శుభమ్‌. 12

సుతీర్థాదాగతం ద్రవ్యం సామ్నాయం సువ్యస్థితమ్‌ | సుస్వరేణ సువక్త్రేణ ప్రయుక్తం బ్రహ్మరాజతే. 13

న కరాలో నలంబోష్ఠో నావ్యక్తో నానునాసికః | గద్గదో బహుజిహ్వశ్చన వర్ణాన్వక్తుమర్హతి. 14

ఏంవర్ణాః ప్రయోక్తవ్యా నావ్యక్తానచ పీడితాః | సమ్యగ్వర్ణ ప్రయోగేణ బ్రహ్మలోకే మహీయతే. 15

ఉదాత్తశ్చాను దాత్తశ్చస్వరితశ్చ న్వరాష్ట్రయః | హ్రస్వోదీర్ఘః ప్లుతఇతి కాలతోనియమావధి. 16

కంఠ్యావహా విచుయశాస్తాలద్యా ఓష్ఠ జావువూ | స్యుర్మూర్ధన్యా ఋటురషాదంత్యాః ?తులసాఃస్మృతాః. 17

జిహ్వామూలేతుకుః ప్రోక్తోదంత్యోష్ఠోవః స్మృతోబుధైః | ఏదైతౌ కంఠతాలవ్యౌ ఓఔకంఠ్యౌష్ఠ జౌస్మృతౌ.

అర్ధమాత్రాతు కంఠ్యాస్యా కారై కార యోర్భవేత్‌ | ఆయోగవాహా విజ్ఞేయా ఆశ్రయస్థాన భాగినః. 19

అచో7స్పృష్టాయణ స్త్వీషన్నోమ స్పృష్టాహలః స్మృతాః |

శేషాః స్పృష్టాహలః ప్రోక్తాని బోధాత్ర ప్రధానతః 20

అమో7నునాసి కానహ్రౌనాదినో హఝషః స్మృతాః | ఈషన్నాదాయణశ్చైవ శ్వాసినశ్చ ఖఫాదయః.

ఈశచ్ఛ్వాసం చరం విద్యాద్దీర్ఘ మేతత్ర్పచక్షతే. 21

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శిక్షావర్ణనం నామ షట్‌ త్రింశ దధిక త్రిశతతమో7ధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను. ఇపుడు శిక్ష చెప్పెదను. మొత్తము వర్ణములు అరువది మూడు, లేదా అరువది నాలుగు వీటిలో ఇరువది ఒక్క స్వరములు. ఇరువది యైదు స్పర్శలు, ఎనిమిది యాదులు, నాలుగు యమములు, చెప్పబడినవి. అనుస్వార విసర్గలు, పరాశ్రితములగు జిహ్వామూలీయ ఉపద్మానీయములు, దుస్పృష్ట లకారము, ఇవి అరువది మూడు వర్ణములు. ప్లుతలు కారము చేర్చినచో అరువది నాలుగు, అనుస్వారోచ్చారణము ఖే. అరా వలె వుండును. హ అనునది జ కారాది పంచమాక్షరములు, య, ర, ల, వ, లు వీటితో కలిసినపుడు ఉరస్యమగును. వీటితో సంయుక్తము కానిచో కంఠ్యము ఆత్మ బుద్ధితో పదార్థములను ఆలోచించి, చెప్పవలెనను ఇచ్ఛచే మనస్సుతో కలియును. ఆ మనస్సు జఠరాగ్నిని కొట్టును జఠరాగ్ని వాయువును ప్రేరేపించును. ప్రాణవాయువు హృదయమునందు చరించుచు ప్రాతస్సవన కర్మకు సాదరమును, గాయత్రి ఛందస్సమాశ్రితమును అగు మంద్రస్వరమును పుట్టించును. పిదప ప్రాణవాయువు కంఠమున తిరుగుచు మాధ్యందినయుతమగు మంతోపయోగియైన మధ్యమస్వరమును పుట్టించును. పిదప ఆ వాయువు శిరోదేశమును చేరి ఉచ్ఛధ్వనియుక్తమగు జగతీచ్ఛంద సమాశ్రితయైన సాయంసవన కర్మ సాధనమైన స్వరమును పుట్టించును. పైకి వెళ్లిన ఆప్రాణవాయువు మూర్ధస్థానమున ఆఘాతము చెంది ముఖము నందలి కంఠాదిన్థానము నందు చేరి వర్ణములను పుట్టించును. స్వరము, కాలము, స్థానము ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము వీటిని బట్టి వర్ణములలో ఐదు విభాగములు వుండును. వక్షము, కంఠము, మూర్ధా, జిహ్వామూలము. దంతములు, నాసిక, ఓష్ఠములు, తాలువు యని ఎనిమిది వర్ణోచ్చారణ స్థానములు. ఊష్మ వర్ణములకు విసర్గాభావము, వివర్తనము, సంధ్య భావము శకారాదేశము, షకారాదేశము, సకారాదేశము, రేఫాదేశము, జిహ్వామూలీయత్వము, ఉపధ్మానీయత్వము, యని ఎనిమిది విధములైన గతులుండును. ఉకారము పరమగు నపుడు ఓకార ప్రసంధానముయైనచో ఆఓకారము స్వరాంతమని తెలియవలెను. దీనికి భిన్నముగా సంతిస్థలమున ఏర్పడు ఓకారము ఊష్మ యొక్క గతి విశేషము. చెడ్డ గురువు నుండి లభించిన వేదాధ్యయనము దగ్ధమై నీరసముగ నుండును. అక్షరములను ఇటులాగి అటులాగి అర్థము చెప్పినచో అదిభక్షితము ఉత్తమ గురువు నుండి అధ్యయనము చేసినచో అదిశుభకరము. సుస్వరముతో మంచి వక్త్రముతో చేయబడిన వేదాధ్యయనము ప్రకాశవంతముగ నుండును. వికృతమైన ఆకారములేని వాడు లంబోష్టుడు కాని వాడు. అవ్యక్తోచ్చారణ చేయనివాడు ముక్కుతో పలకనివాడు, గద్గద కంఠము లేనివాడు జిహ్వా బంధము లేనివాడు అట్టి మనుష్యుడే వర్ణములను సరిగా ఉచ్చరింప గలుగును. వర్ణములను అవ్యక్తముగా గాని పీడితములుగా గాని ఉచ్చరించ కూడదు. వర్ణ ప్రయోగము చక్కగా చేసినచో బ్రహ్మలోకమున పూజించబడును. ఉదాత్తము అనుదాత్తము స్వరితము యని స్వరము మూడు విధములు ఉచ్చారణ కాలమును బట్టి హ్రస్వము దీర్ఘము ప్లుతము యని మూడు విధములు. అ, హ. కారములు కంఠ్యములు, ఇ, చవర్గయ కారశకారములు తాలవ్యములు. ఉకార పవర్గణము, ఓష్ఠ్యములు ఋకార టవర్గ, రేఫ షకారములుమూర్ధన్యములు. ఐ కార తవర్గ లకారసవర్ణములు దంత్యములు కవర్గ జిహ్వా మూలీయము, వకారము దంత్యోష్ఠ్యము ఏఐ కారములు కంఠతాలవ్యములు ఓఔకారములు కంఠ్యోష్ఠ్యజములు, ఏఐ ఓఔలలో , కంఠస్థానీయమగు అకారము యొక్క అర్ధమాత్ర వుండును. అయోగవాలు తమ ఆశ్రయమునకు ఏస్థానమో ఆస్థానము కల్గియుండును. అచ్చులు అస్పృష్టములు యణ్‌లు ఈషత్స్పృష్టములు, ''శల్‌''లు అర్ధ స్పృష్టములు మిగిలిన హల్లుల స్పృష్టములు. ఞమ్‌లు అనునాసికములు. అరేపలు అనునాసికములు కావు. హ, ఝ, షలకు సంవార ఘోషనాద ప్రయత్నములు, యణ్‌ జశ్‌లకు ఈషన్నాద ప్రయత్నము ఖ, ఫ, మొదలగు నవినివారఅ ఘోష శ్వాస ప్రయత్నకములు చర్‌లు ఈశచ్ఛ్వాసములు.

అగ్ని మహాపురాణమున శిక్షావర్ణనయను మూడువందల ముప్పది ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page