Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతుస్త్రింశదధిక త్రిశతతమో7ధ్యాయః.

అథ సమవృత్త నిరూపణమ్‌

అగ్ని రువాచ :

యతిర్విచ్ఛేద ఇత్యుక్తస్తత్తన్మధ్యాన్త¸° గణౌ | ¸°నః కుమార లలితా తౌగౌ చిత్రపదాస్మతా. 1

విద్యున్మాలా మమ మాగణౖర్భూత గణౖర్భవేత్‌ | మాణవకా క్రీడితకం వనో హలముఖీవనః.

2

స్యాద్భుజంగ శిశుసూతా నౌమేహనం మరుతంననౌ | భ##వేచ్ఛుద్ధ విరాడ్‌ వృత్తప్రతిపాదం సమౌజగౌ. 3

పణవోమలయోమః స్యాజ్జౌగౌవయూర సారిణీ | సత్తామభసగా వృత్తం భజతాద్యుపరిస్థితా. 4

రుక్మవతీ భససగా విన్ద్రవజ్రాత జౌజగౌ | జతౌజగౌ భూపపూర్వా వాద్యన్తా ద్యూపజాతయః. 5

దోధకం భగభాగౌ స్యాచ్ఛాలినీ మతభాగగౌ | యతిః సముద్రా ఋషయః వాతోర్మీ మభతాగగౌ. 6

చతుస్వరా స్యాద్ర్భమరో విలాసితా మభౌనలౌ | సముద్రా అథ ఋషభో వనౌలౌగౌరథోద్ధతా. 7

సామతాధన బాగోగోవృత్తాసన సమాశ్చసః | శ్యేనీ వజవనగాః స్యాద్రమ్యాన పరగాగగః. 8

అగ్ని దేవుడు పలికెను. విచ్ఛేదమునకు యతి యని పేరు. ఒక్కొక్క పాదమున త, గ, ణ, యగణము లున్నది. తను మధ్య జ, స, గు లున్నది కుమార లలిత. భ, భ, గు వున్నది చిత్రపద. మ, గు, గు, లు వున్నది విద్యున్మాలా. భ, త, లగులున్నది మాణవకా క్రిడితకా. రన, స, లు వున్నది హల ముఖీ. న, న, మ లు వున్నది భుజంగ శిశు భృత మ, న, గు, గులు హంసరుత. య, స, జ, గులు, శుద్ధ విరాట్‌. య, న, గులు పణవము. ర, జ, ర, గులు మయూర సారిణి.మ, భ, స, గులు మత్త త, జ, జ, గులు, ఉపస్థిత, భ, మ, స, గులు రుక్మవతి. త, త, జ, గుగులు, ఇంద్ర వజ్రా, జతజ, గుగులు ఉపేంద్ర వజ్రా. ఇంద్ర వజ్ర ఉపేంద్ర వజ్రా లక్షణములు రెండును ఒకే ఛందస్సుతో వున్నవి ఉపజాత భ, భ, గుగులు, డోదకము, భ, త, త, గుగులు శాలినీ. దీనిలో చతుర్థ సప్తమాక్షరములపై యతి. మ, భ, త, గు, గు లు వాతోర్మి. చతుర్థ సప్తమాక్షరయతి. మ, భ, త, న, ల, గులు భ్రమరీ విలసిత. చతుర్థ సప్తమాక్షర యతి, ర, న, ర, ల, గులు రథోత్థతా చతుర్థ సప్తమాక్షర యతి. ర, స, భ, గు, గు లు స్వాగత, న, స, గు, గు లు వృత్త. ర, జ, ర ల, గులు శ్యేని. జ, ర, జ, గుగులు విలాసిని లేదా రమ్యా.

జగలీ వంశస్థావృత్తం జతౌజావథతౌ జవౌ | ఇంద్రవంశా తోటకం సైశ్చతుర్భిః ప్రతిపాదితః. 9

భ##వేద్రుత విలంబితానభౌ భవావథౌనలౌ | స్యౌ శ్రీపుటో వసువేదాజలో గతిజలౌజమౌ. 10

జసౌవసర్వ వశ్చాథతతం నన మరాః స్మృతమ్‌ | కుసుమవిచిత్రాన్యౌద్యౌనౌ నౌరౌస్యాచ్చలాంబికా. 11

భుజంగ ప్రయాతంయైః స్యాచ్చతుర్భిః సృగ్వనీభ##వైః | ప్రమితాక్షరాగ జౌసౌకాంతో త్వీడామతౌసమౌ. 12

వైశ్వదేవౌ మమయాయాః పంచాంగానవమాలినీ | నజౌభ¸° ప్రతిపాదం గణాయది జగత్యపి. 13

ప్రహర్షణీ మవజవా గోపతిర్వహ్ని దిక్షుచ | రుచిరా జభసజగా ఛిన్నావేదైర్గ్రహైఃస్మృతా. 14

మత్తమయూరం మతయాసగౌ వేదగ్రహేయతిః | గౌరీనలససాగః స్యాదసంబాధానతౌ నగౌ.

15

గోగ ఇంద్రియ నవకౌననౌ వసనాగాః స్వరాః | స్వరాశ్చాప రాజితాస్యాన్న నభాననగాః స్వరాః. 16

ద్విః ప్రహరణ కలితా వసన్త తిలకానభౌ | జౌగౌ సింహోన్నతా సాస్యాన్మునేరుర్థర్షణౌచసా. 17

చంద్రావర్తాననౌ సోమావర్తర్తునకవః స్మృతః | మణి గుణానికరా సౌమాలినీ నౌమయోయయః. 18

(అ)2/42

యతిర్వసుస్వరాభౌ వౌనతల మిత్రసగ్రహాః | ఋషభగ్రజ విలాసితం జ్ఞేయా శిఖరిణీజగౌ. 19

రసభాలభృగురుద్రాః పృథ్వీజ సజసాజనౌ | గావ సుగ్రహా విచ్ఛినా పింగలేనేరితాపురా. 20

వంశపత్రపతితం స్యాద్భావనాభౌన గౌసదిక్‌ | హరిణీ నసమారః సౌనగౌర సచతుఃస్వరాః. 21

మందా క్రాంతా నభనతం తగౌగచ్ఛిర స్వరాః | కుసుమితలతా వేల్లితా మతనా యయమాఃస్వరాః. 22

రథాః స్వరాః ప్రతిరథససజాః సతతాశ్చగః | శార్దూల విక్రీడితం స్యాద్యాదిత్య మునయోయతిః. 23

కృతిః సువదనా మోరోభనయా భనగాః సురాః | యతిర్ముని రసాశ్చాథ ఇతివృత్తం క్రమాత్స్మృతమ్‌. 24

స్రగ్ధరా మరతానోమో య¸°తిః సప్తకాయతిః | సముద్రకం భరజానావేనగా దశభాస్కరాః. 25

అశ్వలలితం నజభా జభజా భనమీశతః | మత్తాక్రీడా మమననానౌనగ్నౌ గోష్టమాతిథిః. 26

తన్వీభసత సాభోభోలయో బాణసురార్కకాః | క్రౌంచపదా భమతతా నౌనౌబాణశరాష్టతః. 27

భుజంగ విజృంభితం సమతనాననవాసనౌ | గష్టేశ మునిభిశ్ఛేదోహ్యుప హారాఖ్యమీదృశమ్‌. 28

మనసానవతానః సోగగౌగ్రహ రసోరసాత్‌ | నౌ సప్తరోదండదః స్యాచ్చండ వృష్టి ప్రఘాతకమ్‌. 29

రేఫవృద్ధ్యాననవా స్యుర్వ్యాల జీమూత ముఖ్యకాః | శేషేవై ప్రచితాజ్ఞేయా గాథాప్రస్తార ఉచ్యతే. 30

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సమవృత్తవర్ణనంనామ చతుస్త్రింశదధిక త్రిశతతమో7ధ్యాయః.

ఇకపై జగతీ ఛందస్సు ఆరంభమగును. జ, త, జ, ర, లు వంశస్థ వృత్తము త, త, జ, ర, లు ఇందవంశి. నాలుగేసి సగణములు కలది తోటక వృత్తము. న, భ, భ, ర లు దృత విలంబితము. న, న, మ, య, లు శ్రీ పుట వృత్తము, అష్టమ చతుర్థక్షరము లందు విరామము, జ, స, జ, స, లు జలోద్ధతగతి. షష్టాక్షరము లందు యతి, న, న, మ, ర, లు. తతము న, య, న, య లు కుసుమ విచిత్ర న, న, ర, ర లు చంచలాక్షికా, నాలుగు యగణములున్నచో భుజంగ ప్రయాతా నాలుగు రగణములు స్రగ్విణి, సజ, స, స, లు ప్రమితాక్షర, భ, మ, స, మ, లు కాంతో త్పీడ, మ, మ, య, య, లు వైశ్వదేవి పంచమ సప్తమాక్షరము లందు యతి, న, జ, భ, య, లు నవమాలిని. మ, న, జ, ర, గులు ప్రహర్షిణి. తృతీయ దశమాక్షరములపై యతి. జ, భ, స, జ, గు, లు రుచిర. చతుర్థ నవమాక్షరములపై యతి. న, న, న, సగులు, గౌరి. య, త, న, స, గు, గు లు అసంబాద. పంచమ నవ మాక్షరములపై యతి. న, ర, స, ల, గు లు అపరాజిత. సప్తమ సప్తమాక్షరములపై యతి. నన, భ, న, ల, గు, లు ప్రహరణ కలిత. సప్తమ సప్తమాక్షరములపై యతి, త, భ, జ, జ, గు, గు లు వసంత తిలకా. దీనికి సింహోన్నతా, ఉద్ధర్షిణీ యని నామాంతరములు. నాలుగు నగణములు ఒక నగణము చంద్రావతి. షష్ట నవమాక్షరములపై యతి వున్నచో దీనికి మాలా యని పేరు. అష్టమ సప్తమాక్షరములపై యతి వున్నచో మణ గణ నికర యని పేరు.న, న, మ, య యలు మాలినీ. అష్టమ సప్తమాక్షరములపై యతి, భ, ర, న, న, గులు ఋషభ గజ విలసితము. సప్తమ నవమాక్షరములపై యతి, య, మ, న, స, భ లగులు, శిఖరిణి. షష్ట ఏకాదశాక్షరములపై యతి. జ, స, జ, స, య, ల, గులు పృథ్వి. అష్టమ నవమాక్షరములపై యతి. మ, ర, న, భ, న, ల, గు లు వంశ పత్ర పతితము. దశమ సప్తమాక్షరములపై యతి. న, స, మ, ర, స, ల, గులు షష్ట చతుర్థ సప్తమాక్షరములపై యతి వున్నది హరిణి, మ, భ, న, త, త, గు, గులు మందా క్రాంతా, చతుర్థ షష్ట సప్తమాక్షరములపై యతి. మ,త,న,య, య, యలు కుసుమిత లతా వేల్లిత. పంచమ, షష్ట, సప్తమాక్షరములపైయతి. మ, స, జ, భ, త, గులు శార్దూల విక్రీడితము. ద్వాదశ సప్తమాక్షరములపై యతి. మ, ర, భ, న, య, భ, ల గులు సువదన. ఇది కృతి ఛందస్సులో అంతర్గతము. సప్తము, షష్టాక్షరములపై యతి. కృతి ఛందస్సు యొక్క ప్రతిపాదము నందు వరుసగా గురు లఘువు లున్నచో దానికి వృత్తమని పేరు మ, ర, భ, న, య, య లు స్రగ్ధరా. సప్తమాక్షరములపై యతి భ, ర, న, ర, న, గులు. సుభద్రక, దశ##మైకా దశాక్షరములపై యతి. న, జ, భ, జ, భ, జ, భ లగులు, అశ్వలలిత ఏక దశ ద్వాదశములపై యతి, మ, త, న, న, న, న, లగులు మత్త క్రీడ. అష్టమ పంచ దశాక్షరములపై యతి. భ, త, న, స, భ, భ, న, యలు తన్వి. పంచమ, సప్తమ, ద్వాదశాక్షరములపై యతి. భ, మ, స, భ, న, న, న, గులు క్రౌంచపద. పంచమ, పంచమ, అష్టమ, సప్తమాక్షరములపై యతి. మ, మ, త, న, న, న, ర, స ల గులు భుజంగ విజృంభితము. అష్టమ, ఏకాదశ సప్తమాక్షరములపై యతి. మ, న, న, న, న, న, న, స, గుగులు అపహావ వృత్తము. నవమ, షష్ట షష్ట పంచమాక్షరములపై యతి. ఒక్కొ పాదములో రెండు నగణములు, ఏడు రగణములు వున్నచో దండకము. దీనికే చండ వృష్టి ప్రపాత మని పేరు. దీనిలో రెండు నగణములు కాక, రగణము నందు వృద్ధి యైనచో వ్యాల జీమూతాది నామములగు దండకములు ఏర్పడును. చండప్రపాతము యొక్క ఇతర భేదము లన్నియు, దండ ప్రస్తార ప్రచిత ములని చెప్పబడును. ఇపుడు గాథా ప్రస్తారమును చెప్పిదను.

అగ్ని మహాపురాణమున సమవృత్త నిరూపణమను మూడువందల ముప్పది నాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page