Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షడ్వింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథ గౌర్యాదిపూజా

ఈశ్వర ఉవాచ :

సౌభాగ్యాదేరుమాపూజాం వక్ష్యే7హం భుక్తిముక్తిదమ్‌|

మంత్రధ్యానం మండలంచ ముద్రాం హోమాది సాధనమ్‌. 1

చిత్రభానుం శివం కాలం మహాశక్తి సమన్వితమ్‌ | ఇడాద్యం పరతోద్ధృత్య సదేవః సవికారణమ్‌. 2

ద్వితీయం ద్వారకాక్రాంతం గౌరీప్రీతి పదాన్వితమ్‌ | చతుర్థ్యన్తం ప్రకర్తవ్యం గౌర్యావై మూలవాచకమ్‌. 3

ఓం హ్రీం సః శౌం గౌర్యై నమః | తత్రార్ణత్రితయే నైవ జాతియుక్త షడంగులమ్‌ |

ఆసనం ప్రణవేనైవ మూర్తింవై హృదయేనతు 4

ఉదకంచ తథాకాలం శివబీజం సముద్ధరేత్‌ | ప్రాణం దీర్ఘస్వరాక్రాంతం షడంగం జాతిసంయుతమ్‌. 5

ఆసనం ప్రణమే నాత్రమూర్తిన్యాసం హృదాచరేత్‌ | యామలం కథితం వత్స ఏకవీరం వదామ్యథ. 6

వ్యాపకం సృష్టిసంయుక్తం వహ్నిమాయా కృశానుభిః | శివశక్తిమయం బీజం హృదయాది వివర్ణితమ్‌. 7

గౌరీం యజేద్ధేమ రూప్యాంకాష్ఠజాం శైలజాదికామ్‌ | పంచపిండాం తథా7వ్యక్తాం కోణ మధ్యేతు పంచమమ్‌.

లలితా నుభగాగౌరీ క్షోభణీ చాగ్నితః క్రమాత్‌ | వామజ్యేష్ఠా క్రియాజ్ఞానా వృత్తేపూర్వాదితో యజేత్‌. 9

సపీఠే వామభాగేతు శివస్యావ్యక్త రూపకమ్‌ | వ్యక్తాద్వినేత్రా త్య్రక్షరా శుద్ధావాశంకరాన్వితా. 10

పీఠపద్మద్వయం తారాద్విభుజావా చతుర్భుజా | సింహస్థావా వృకస్థావా అష్టాష్టాదశసత్కరా. 11

స్రగక్షసూత్ర కలికా గలకోత్పల పిండికా | శరంధనుర్వా సవ్యేన పాణినాన్యతమం వహత్‌. 12

వామేన పుస్తతాంబూల దండా భయకమండలమ్‌ | గణశ దర్పణష్వాసాందద్యా దేకైకశః క్రమాత్‌. 13

పరమేశ్వరుడు చెప్పెను. భుక్తిముక్తి ప్రదమును సౌభాగ్యాది దాయకమును అగు ఉమా పూజను చెప్పెదను. మంతధ్యాన మండల ముద్రా హోమాది సాధనములను కూడ చెప్పెదను. ''గౌరీమూర్తయే నమః''యిది గౌరీ దేవి వాచక మూల మంత్రము. ''ఓం హ్రీం సః గౌర్యై నమః'' వీనిలో మూడక్షరముతో ''నమః'' ఆదులు చేర్చి షడంగన్యాసము చేయవలెను. ప్రణముచేత ఆసనమును, హృదయ మంత్రముచే మూర్తిని కల్పించవలెను. కాల బీజ శివ బీజముల ఉద్ధారము చేయవలెను. దీర్ఘ స్వరాక్రాంత ప్రాణముతో (యాం యీం మొదలు) జాతి యుక్త షడన్యాసము చేయవలెను. ప్రణవముతో ఆసనన్యాసము హృదయ మంత్రముతో మూర్తి న్యాసము చేయవలెను. ఇంతవరకు యామల మంత్రము చెప్పితిని. ఇపుడు ఏక వీరమును చెప్పెదను. అగ్ని మాయాకుశానువులతో సృష్టిన్యాస యుక్త మగు వ్యాపక న్యాసము చేయవలెను. శివ శక్తి మయ బీజములు హృదయాదులందు వర్జితములు. బంగారము, వెడి, శిల మొదలైన వాటితో గౌరీ ప్రతిమ చేసి పూజించవెలను. లేదా పంచ పిండ ప్రతిమ చేయవలెను. నలు వైపుల అవ్యక్త ప్రతిమయు, మధ్యమున వ్యక్త ప్రతిమయు వుంచవలెను. ఆవరణ దేవతా రూపమున క్రమముగా లలితాది శక్తులను పూజించవలెను. మొదట వృత్తాకార మగు అష్ట దళ కమలము ఏర్పరచి ఆగ్నేయాది దళము లందు క్రమముగ, లలితా, సుభగా, గౌరి క్షోభణీలను. పూర్వాది దళము లందు వామాజ్యేష్ఠా, క్రియా, జ్ఞానాలను, పీఠ యుక్త వామ భాగము నందు శివుని అవ్యక్త రూపమును పూజించవలెను. దేవి వ్యక్త రూపమున రెండు లేదా మూడు నేత్రము లుండును. ఆమెను శుద్ధ రూపుడగు శివునితో కలిపి పూజించవలెను. ఆ దేవి రెండు పీఠము లందు లేదా రెండు పద్మములందు కూర్చుండును. ఆమెకు రెండు నాలుగు ఎనిమిది లేదా పదునెనుమిది భుజము లుండును. సింహముపై గాని, తోడేలుపై కాని కూర్చుండును. కుడి ప్రక్కన వున్న తొమ్మిది హస్తములలో స్రక్‌. అక్షసూత్రకలికా, ముండ, ఉత్పల, పిండికా, బాణ, చాపములు వుండును. వామహస్తములందు పుస్తక తాంబూల దండ అభయ కమండలు గణశ దర్పణ బాణ చాపము లుండును.

వ్యక్తావ్యక్తా7థ వాకార్యా పద్మముద్రాస్మృతాసనే | లింగముద్రాశిస్యోక్తా ముద్రాచావాహనీ ద్వయోః. 14

శక్తిముద్రాతు యోన్యాఖ్యా చతురస్రంతు మండలమ్‌ | చతురస్రం త్రిపత్రాబ్జం మధ్యకోష్ట చతుష్టయే. 15

త్యశ్రోర్ధ్వే చార్దచంద్రస్తు ద్విపదం ద్విగుణం క్రమాత్‌ | ద్విగుణం ద్వారకంఠంతు ద్విగుణాదుపకంఠతః. 16

ద్వారత్రయం త్రయందిక్షు ఆథవాభద్రకే యజేత్‌ | స్థండిలే వాథ సంస్థాప్య పంచ గవ్యామృతాదినా. 17

రక్తపుష్పాణి దేయాని పూజయిత్వా హ్యుదఙ్‌ ముఖః |

శతం హుత్వాఘృతాజ్యంచ పూర్ణదః సర్వసిద్ధిబాక్‌. 18

బలిందత్త్వా కుమారీశ్చ తిస్రోవాచాష్ట భోజయేత్‌ | నైవేద్యంశివ భ##క్తేషు దద్యాన్న స్వ

యమాచరేత్‌. 19

కన్యార్థీ లభ##తే కన్యామపుత్రః పుత్రమాప్నుయాత్‌ | దుర్బగాచైవ సౌభాగ్యం రాజారాజ్యం జయంరణ. 20

అష్టలక్షైశ్చ వాక్సిద్దిర్దేవాద్ద్యా వశమాప్నుయుః | న నివేద్యన చాశ్నీ యాద్వామహస్తేన చార్చయేత్‌. 21

ఆమెకు వ్యక్త ముద్రలుగాని, అవ్యక్తముద్రలుగాని చూపవలెను. ఆసన సమర్పణమున పద్మముద్ర చూప వలెను. శివుని పూజించునపుడు లింగముద్ర చూపవలెను. దీనికే శివ ముద్రయని పేరు ఇరువురిని ఆవాహనీముద్ర చూప వలెను. శక్తి ముద్రకు యోనియని పేరు. ఇది చతురస్ర మండలాకారము మధ్యనవున్న నాలుగు కోష్టములలో త్రిదళ కమల

ములను వ్రాయవలెను. మూడు కోణముల ఊర్ధ్వ భాగమునందు రెండేసి పదములలో అర్ధచంద్రుని వ్రాయవలెను. మొదటి దాని కంటె రెండవది రెట్టింపుండ వలెను. రెండేసి పదముల ద్వారకంఠ భాగము, దానికి రెట్టింపు ఉపకంఠము వుండవలెను. ఒక్కొక్క దిక్కు యందు మూడేసి ద్వారములు వుంచి లేదా సర్వతో భద్రమండలము ఏర్పరచి పూజించవలెను. లేదా వేదికపై దేవతను స్థాపించి పంచగవ్య పంచా మృతాదుతో పూజించవలెను. ఉత్తరాభి ముఖుడై పూజించి రక్త పుష్పములను సమర్పించవలెను. ఆజ్యముతో నూరు హోమములు చేసి పూర్ణాహుతి నిచ్చువాడు సర్వసిద్ధులను పొందును. బలి సమర్పించు ముగ్గురు లేదా ఎనమండుగురు కన్యకలకు భోజనము పెట్టవలెను. పూజా నైవేద్యమున శివభక్తులకు ఇవ్వవలెను. కాని, తాను స్వీకరించరారు. ఇట్లు చేయుటచే కన్య కోరువానిక కన్య లభించును. పుత్రులు లేనివానికి పుత్రులు లభించును. దౌర్భాగ్యవంతురాలు సౌభాగ్యశాలినిగును. రాజు రణము నందు జయమును రాజ్యమును పొందును. ఎనిమిది లక్షలు జపించుటచే వాక్సిద్ధి కలుగును. దేవతలు వశమగుదురు. ఇష్టదేవతకు నివేదించ కుండగ భోజనము చేయకూడదు. ఎడమ చేతిలో కూడ పూజించవచ్చును. విశేషించి అష్టమీ చతుర్దశీ తృతీయ లందు అట్లు చేయవలెను.

అష్టమ్యాంచ చతుర్దశ్యాం తృతీయాయాం విశేషతః |

మృత్యుంజయార్చనం వక్ష్యే పూజయేత్కలశో దరే. 22

హూయమానంచ ప్రణవో మూర్తిరోజస ఈ దృశమ్‌ | మూలంచ వైషడన్తేన కుంభముద్రాం ప్రదర్శయేత్‌.

హోమయేతీక్షరదూర్వాజ్య మమృతాంచ పునర్నవామ్‌ | పాయసంచ పురోడాశ మయుతంతు జపన్మనుమ్‌. 24

చతుర్ముఖం చతుర్బాహుం ద్వాభ్యాంచ కలశం దధత్‌ |

వరదాభయకం ద్వాభ్యాం స్నాయాద్వై కుంభముద్రయా.

ఆరోగ్యైశ్వర్య దీర్ఘాయురౌషధం మంత్రితం శుభమ్‌ | అపమృత్యుహరోధ్యాతః పూజితో7ద్భుతఏవసః. 25

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే గౌర్యాదిపూజావిధాన నిరూపణంనామ షడ్వింశత్యధికత్రిశతతమో7ధ్యాయః.

ఇపుడు మృత్యుంజయ పూజను చెప్పెదను. కలశముపై పూజ చేయవలెను. హోమమునందు ప్రణవము మృత్యుం జయుని మూర్తి మూల మంత్రము చెప్పుచు కుంభముద్ర చూపవలెను. క్షీరదూర్వా, ఆజ్య, అమృత, పునర్నవా, పాయస పురోడాశములతో హోమము చేయవలెను. హోమమునకు పూర్వము పదివేలు మంత్ర జపము చేయవలెను. మృత్యుం జయునకు నాలుగు ముఖములు నాలుగు భుజములు వుండును. రెండు హస్తములలో కలశమును రెండు హస్తములలో వరదా భయములను ధరించి యుండును. కుంభముద్రచే మృత్యుంజయునకు స్నానము చేయించవలెను. ఆరోగ్యైశ్వర్య దీర్ఘాయువులు లభించును. ఈ మంత్రముతో అభిమంత్రించిన ఔషధము మృత్యుంజయుని ధ్యానించినను పూజించినను అవమృత్యువు తొలగును.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page