Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షోడశాధిక త్రిశతతమో7ధ్యాయః

అథ నానామంత్రాః

అగ్ని రువాచ :

ఆదౌహూంకార సంయుక్తా ఖేచఛేపదభూషితా | వర్గాతీత విసర్గేణ స్త్రీం హూం క్షేపఫడంతికా. 1

సర్వమర్దకరీ విద్యావిషసర్పాది మర్దనీ | ఓం ఖే చ ఛేతి ప్రయోగశ్చ కాలదష్టస్య జీవనే. 2

ఓం హూం, కేక్షః ప్రయోగో7యం విషశత్రుప్రమర్దనః |

స్త్రీం హూంఫడితి యోగో7యం పాపరోగాదికం జయేత. 3

ఖేఛేతి చ ప్రయోగో7యం విఘ్నదుష్టాది వారయేత్‌ | హ్రూం ఓ మితియోగో7యం యోషిదాది వశీకరః. 4

ఖే స్త్రీం ఖేఛ ప్రయోగో7యం వశాయ విజయాయచ |

ఐంహ్రీం శ్రీం స్పేం కైం క్షౌం భగవతి అంబికే కుబ్జికే |

స్ఫేం, ఓం, భం, తం, వశనమో అఘోరాయ ముఖేవ్రాం

వ్రీం కిలి కిలి విచ్చా స్ఫౌం హేం స్ర్ఫం శ్రౌం, హ్రీం ఐం

శ్రీ మితికుబ్జికా విద్యా సర్వకరాస్మృతా | భూయః స్కందాయ యానాహ మంత్రానీశశ్చతాన్వధే. 5

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నానామంత్రనిరూపణం నామ షోడశాధిక త్రిశతతమోధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను. ముందు ''హుం'' వుంచి పిదప ఖేచ, ఛే'' చేర్చి పిదప క్షః స్త్రీం హూంక్షే వ్రాసి, వర ఫట్‌ చేర్చవలెను. ఇది విష సర్పాదులను తొలగించును. అన్ని కార్యములను సిద్ధింపచేయును. ఖేచ, ఛే, యను నది కాలదష్టునకు, జీవనము యిచ్చు మంత్రము. ఓం, హూం ఖేక్షః, ఈ మంత్రము విషమును శత్రువులను నశింప చేయును. స్త్రీంహూం ఫట్‌ ఈ మంత్రము ప్రయోగము పాపరోగాదులను తొలగించును. ''ఖేఛ'' యను ప్రయోగము విఘ్నములను దుష్టులను శమింపచేయును. ''హూం స్త్రీం ఓం'' యను మంత్రము స్త్రీ మొదలగు వారిని వశము చేయును ఖేస్త్రీం, ఖే, యనునది వశమును విజయము కలిగించును. ''ఐం హ్రీం మొదలు హ్రీం ఐంశ్రాం'' యను కుబ్జికా విద్య సర్వార్థ సాధకము. ఇపుడు శివుడు స్కందునకు ఉపదేశించిన మంత్రములను వర్ణించెదను.

అగ్ని మహాపురాణమున నానామంత్ర నిరూపణమను మూడువందలపదునారవ

అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page