Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

షట్‌ ప్రయోగతన్నివారణమంత్రః

అథ షడధిక త్రిశతతమోధ్యాయః

అథ షట్‌ ప్రయోగతన్నివారణమంత్రాః

అగ్ని రువాచ :

స్తంభో విద్వేషనోచ్ఛాట ముత్సాదో భ్రమమారణ| వ్యాధిశ్చేతి స్మృతం క్షుద్రం తన్మోక్షోవక్ష్యతే శృణు. 1

ఓం నమోభగవతే ఉన్మత్తరుద్రాయ భ్రమభ్రమ

భ్రామయ భ్రామయ అముకం విత్రాసయ విత్రాసయ, ఉద్ర్భామయ

ఉద్ర్భామయ రౌద్రేణ హ్రూం ఫట్‌ ఠఠ.

స్మశానే నిశిజప్తేన త్రిలక్షం మధునాహునేత్‌ | చితాగ్నౌ ధూర్తసమిద్బిర్ర్భామ్యతే సతతంరిపుః. 2

హేమగైరికయా కృష్ణాప్రతిమా హేమసూచిభిః | జప్త్వా విధ్యేచ్చ తత్కంఠే హృదివామ్రియతేరిపుః. 3

ఖరవాలం చితాభస్మ బ్రహ్మదండీచ మర్కటీ | గ్రృహేవా మూర్ధ్నిత చ్చూర్ణం జప్తముత్సాదకృత్షిపేత్‌. 4

భృగ్వాకాశౌ సదీప్తాగ్నిర్భృగు వహ్నిశ్చ వర్మఫట్‌ | ఏవం సహస్రారే |

హూంఫట్‌ ఆ చక్రాయస్వాహా హృదయం విచక్రాయశిరః |

శికాచక్రాయాథ కవచం విచక్రాయాథ నేత్రకమ్‌. 5

సుచాక్రయాస్త్ర ముద్దిష్టం జ్వాలాచక్రాయ పూర్వవత్‌ | శార్జంసుదర్శనం క్షుద్రగ్రహ హృత్సర్వసాధనమ్‌. 6

మూర్దాక్షి ముఖహృద్గుహ్యపాదే హ్యస్యాక్షరాన్న్యసేత్‌ |

చక్రాజ్ఞాసన మగ్న్యాభం దంష్ట్రిణంచ చతుర్బుజమ్‌. 7

శంకచక్రగదాపద్మ శలాకాంకుశ పాణినమ్‌ | చాపినం పింగ కేశాక్ష మరవ్యాప్తత్రివిష్టపమ్‌. 8

నాభిస్తేనాగ్నినా విద్దానశ్యన్తే వ్యాధయోగ్రహాః | పీతం చక్రధరం రక్తాస్త్వరాః శ్యామమరాంతరమ్‌. 9

నేమిః శ్వేతాబహిః కృష్ణవర్ణరేఖాచ పార్థివీ | మధ్యేన్తరే తారవర్ణానేవం చక్రద్వయం లిఖేత్‌. 10

అగ్ని దేవుడు చెప్పెను. స్థంభనము విద్వేషణము ఉచ్చాటనము ఉత్సాదనము భ్రామణము మారణము వ్యాధి అనునవి క్షుద్ర ఆభిచారిక కర్మలు. వాటిని తొలగించు ఉపాయములు చెప్పెదను. వినుము. "ఓం నమో భగవతే" మొదలు "ఠఠ" వరకును వున్న మూలోక్త మంత్రమును శ్మశానమున రాత్రి యందు మూడు లక్షలు జపించి చితాగ్ని యందు ధూర్త సమిధలతో హోమము చేసిన శత్రువు సర్వదా తిరిగి పోవును. (బ్రాంతుడగును) హేమ బేదికతో శత్రు ప్రతిమ చేసి మంత్రమాతో అభిమంత్రించిన బంగారు సూదితో కంఠమునందు గాని హృదయమునందు కాని ఆ ప్రతిమను గుచ్చినచో శత్రువు మరణించును. లేదా గాడిద వెంట్రుకలు చితాభస్మ బ్రహ్మదండి మర్కటి వీటిని భస్మము చేసి దానిని పైమంత్రముతో అభిమంత్రించి ఉత్సాదన ప్రయోగము చేయువాడు శత్రువు ఇంటిపై గాని శిరస్సుపై గాని చల్లవలెను. భృగు (స) ఆకాశ (హ) దీప్త (దీర్ఘాకార యుక్త రేఫ సహిత భృగు (స) అనగా సహస్రా మరల రవర్మ (హం) ఫట్‌ వీటిని కలిపి మంత్రము "సహస్రార హుంఫట్‌" యని అగును. దీని అంగన్యాసములు ఈ విధముగా చేయవలయును. ఆ చక్రాయస్వాహా అని హృదయము విచక్రాయ శిరస్సు, శిఖా చక్రాయ యని పూర్వము వలెను న్యాసము చేయవలెను. అంగన్యాస పూర్వకముగ జపించిన సుదర్శనము క్షుద్ర అభిచారములను గ్రహములను తొలగించి అన్ని మనోరథములను సఫలము చేయును, ఆ సుదర్శన మంత్రము యొక్క ఆరు అక్షరములను క్రమముగా శిరో నేత్ర ముఖ హృదయ గుహ్య చరణములందు న్యాసము చేయవలెను. చక్ర స్వరూపుడగు విష్ణువును ఈ విధముగా ధ్యానించవలెను. చక్రాకారమున నున్న కమలము నందు కూర్చున్న వాడు అగ్ని సమానమగు కాంతి కలవాడు కోరలు గలవాడు చతుర్భజుడు శంఖ చక్ర గదా పద్మశలాకాంకుశ చాపములు ధరించిన వాడు పింగవర్ణ కేశములు నేత్రములు కలవాడు అరములచే వ్యాపింపబడిన మూడు లోకములు కలవాడు. చక్రనాభి ఆ అగ్నిచే వ్యాప్తమైయున్నది. వ్యాధులు గ్రహములు నశించును. చక్రము పీతవర్ణమైనది. అరములు రక్త వర్ణములు. అరమధ్య భాగము శ్యామ వర్ణము. చక్రనేమి శ్వేత వర్ణము. దాని యందు బయట నుండి పార్థివమగు కృష్ణ వర్ణ రేఖ యుండును. అరయుక్త మధ్య భాగము నందు అకారాది వర్జములుండును. ఈ విధముగా రెండు చక్ర చిహ్నములను వ్రాయవలెను.

ఆదావానీయ కుంభోదం గోచరేసన్నధాయచ | ఇష్ట్వా సుదర్శనం తత్రయామ్యే చక్రే హునేత్ర్కమాత్‌. 11

ఆజ్యాపామార్గ నమిధో హ్యక్షతం తిలసర్షపౌ | పాయసం గవ్యమాజ్యంచ సహస్రాష్టక సంఖ్యయా. 12

హుతశేషంక్షి పేత్కుంభే ప్రతిద్రవ్యం విధానవిత్‌ | ప్రస్థానేన కృతంపిండ కుంభేతస్మిన్నివేశ##యేత్‌. 13

విష్ణ్వాది సర్వంతత్తైవ విశేత్తత్రైవ దక్షిణ |

నమోవిష్ణు జనేభ్యః సర్వశాంతి కరేభ్యః ప్రతిగ్రహంతు శాంతయేనమః|

దద్యాదనేన మంత్రేణ హుతశేషామ్భ సాబలిమ్‌. 14

ఫలకే కల్పితే పాత్రే పలాశక్షీర శాఖినః | గవ్యపూర్ణే నివేశ్యైవ దిక్ష్వేవం హోమయేద్ద్విజైః. 15

స దక్షిణ మిదంహోమద్వయం భూతాదినాశనమ్‌ | గవ్యాక్త పత్రలిఖితైర్నిష్పర్ణైః క్షుద్రముద్థృతమ్‌. 16

దూర్వాభిరాయుషే పద్మైఃశ్రియే పుత్రా ఉదుంబరైః | గోసిద్ద్యై నర్పిషా గోష్ఠే మేధాయై సర్వశాఖినా. 17

ఓం క్షౌం నమో భగవతే నారసింహాయ జ్వాలామాలినే

దీప్తదంష్ట్రాయాగ్ని నేత్రాయ సర్వరక్షోఘ్నాయ సర్వ

భూత వినాశాయ సర్వ జ్వర వినాశాయ దహ దహ పచ పచ రక్ష రక్ష హ్రూం ఫట్‌.

మంత్రో7యం నారసింహస్య సకలాఘు నివారణః | జప్యాదినా హరేత్షుద్ర గ్రహమారీ విషామయాన్‌.

చూర్ణ మండూక వసయా జలాగ్ని స్తంభ కృద్భవేత్‌. 18

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నారసింహాది మంత్ర కథనం నామ షడధిక త్రిశతతమో7ధ్యాయః.

ఆది చక్రముపై కలళజలమును తీసుకొని వెళ్ళి తమ సమీపముననే ఉంచి దక్షిణమున నున్న రెండవ చక్రముపై సుదర్శనమును పూజించి అగ్ని యందు వరుసగా ఆజ్య, అపామార్గ, సమిధ, అక్షత, తిల, సర్షప, పాయస, గోఘృత, మూల హోమము చేయవలయును. ఒక్కొక్క ద్రవ్యముతో వెయ్యి హోమముల చొప్పున చేయవలెను. విద్వాంసుడు ప్రత్యేక ద్రవ్యము యొక్క హోమము చేయగా మిగిలిన భాగమును కలశము నందు ఉంచి ఒక ప్రస్థము అన్నముతో చేసిన పిండమును ఆ కలశలో వేసి విష్ణ్వాది దేవతలకై ఇవ్వవలసిన వస్తువులను అచటనే దక్షిణము నందుంచవలెను. పిదప సర్వ శాంతి కొరకు విష్ణు జనులకు నమస్కారము. వారు శాంతి కొరకై ఈ ఉపహారమును గ్రహింతురు గాక. వారికి నమస్కారమును అను మంత్రమును చదివి హుత శిష్ట జలముతో బలి సమర్పించవలెను. ఏదైనా కాష్ఠ ఫలకముపై గాని కలశము నందు గాని, పాల చెట్టు కర్రతో చేసిన దధి పూర్ణ పాత్రము నందుగాని పలు వస్తువులను ఉంచి అన్ని దిక్కు లందును సమర్పించవలెను. పిదప ద్విజులచే దిక్కుల యందు హోమములు చేయించవలెను. దక్షిణా సహితముగా ఇట్లు హోమద్వయము చేసినచో సకల భూతాదులు నశించును. పెరుగు పూసిన ఆకులపై వ్రాసిన మంత్రాక్షరములతో హోమము చేసినచో క్షుద్ర రోగములు నశించును. దూర్వలతో హోమము ఆయుర్దాయమను, పద్మములతో హోమము ఐశ్వర్యమును ఉదుంబరుల హోమము పుత్రులను గోష్ఠము నందు ఘృతముతో హోషము గోవృద్ధిని సకల వృక్ష సమిధలచేత చేసిన హోమము బుద్ధి వృద్ధిని యిచ్చును "ఓం క్షౌం" మొదలు "హూంఫట్‌" వరకును వున్న మూలోక్త నారసింహ మంత్రము సకల పాపములను నివారించును. జపాదులు చేసినచోక్షుద్రాభిచారములు గ్రహములు మారి విషము, ఆమయము తొలగును. చూర్ణము చేసిన మండూకవసతో హోమము చేసినచో జల స్థంభ అగ్ని స్థంబనలు చేయును.

అగ్ని మహా పురాణమున నారసింహాది మంత్ర కథన మను మూడు వందల ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page