Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచాధిక త్రిశతతమో7ధ్యాయః

అథ పంచ పంచాశద్విష్ణునామాని

అగ్నిరువాచ :

జపన్వై పంచపంచాశద్విష్ణు నామాని యోనరః | మంత్రజప్యాది ఫలభాక్‌ తీర్థేష్వర్చాది చాక్షయమ్‌. 1

పుష్కరే పుండరీకాక్షం గయాయాం చ గదాధరమ్‌ | రాఘవం చిత్రకూటే తుప్రభాసే దైత్య సూదనమ్‌. 2

జయం జయన్త్యాం తద్వచ్చ జయన్తం హస్తినాపురే | వారాహం వర్ధమానేచ కాశ్మీరే చక్రపాణినమ్‌. 3

జనార్దనం చ కుబ్జామ్రే మధురాయాంచ కేశవమ్‌ | కుబ్జామ్రకే హృషీకేశం గంగాద్వారే జటాధరమ్‌. 4

శాలగ్రామే మహాయోగం హరిం గోవర్ధనాచలే | పిండారకే చతుర్బాహుం శంఖోద్ధారేచ శంఖినమ్‌. 5

వామనం చ కురుక్షేత్రే యమునాయాం త్రివిక్రమమ్‌ | విశ్వేశ్వరం తథా శోణ కపిలం పూర్వసాగరే. 6

విష్ణుం మహోదధౌ విద్యాద్గంగా సాగర సంగమే | కిష్కింధాయాం వనమాలం దేవం రైవతకం విదుః. 7

కాశీతటే మహయోగం విరజాయాం రిపుంజయమ్‌ | విశాఖయూపే హ్యజితం నేపాలే లోకభావనమ్‌. 8

ద్వారకాయాం విద్ధి కృష్ణం మందరే మధుసూదనమ్‌ | లోకాకులే రిపుహరం శాలగ్రామే హరింస్మరేత్‌. 9

పురుషం పురుష వటే విమలేచ జగత్ర్పభుమ్‌ | అనన్తం సైంధవారణ్య దండకే శార్జధారిణమ్‌. 10

ఉత్పలా వర్తకే శౌరిం నర్మదాయాం శ్రియఃపతిమ్‌ | దామోదరం రైవతకే నందాయాం జలాశాయినమ్‌. 11

గోపీశ్వరం చ సిన్ధ్వబ్ధౌ మహేన్ద్రే చాచ్యుతం విధుః | సహ్యాద్రౌ దేవదేవేశం వైకుంఠం మాగధే వనే. 12

సర్వపాపహరం వింధ్యఔఢ్రౌతు పురుషోత్తమమ్‌ | ఆత్మానం హృదయే విద్ధిజపతాం భుక్తిముక్తిదమ్‌. 13

వటవటే వైశ్రవణం చత్వరే చత్వరే శివమ్‌ | పర్వతే పర్వతే రామం సర్వత్ర మధుసూదనమ్‌. 14

నరం భూమౌతథా వ్యోమ్నివసిష్ఠే గరుడధ్వజమ్‌ | వాసుదేవం చ సర్వత్ర సంస్మరన్భుక్తిముక్తిభాక్‌. 15

నామాన్యేతాని విష్ణోశ్చ జప్త్వాసర్వమవాప్నుయాత్‌ | క్షేత్రేష్వేతేషు యఃశ్రాద్ధందానం జప్యంచతర్పణమ్‌. 16

తత్సర్వం కోటిగుణితంమృతో బ్రహ్మమయోభ##వేత్‌ |

యః పఠేచ్ఛృణుయాద్వాపినిర్మలః స్వర్గమాప్నుయాత్‌

ఇత్యాది మహాపురాణ అగ్నేయే పంచపంచాశద్విష్ణునామకథనంనామ పంచాధిక త్రిశతతమో7ధ్యాయః

అగ్నిదేవుడు పలికెను. శ్రీ మహావిష్ణువు యొక్క యేబదిఐదు నామములు ఎవడు జపించుదో ఆతడు మంత్రజపాది ఫలమును తీర్థ పూజనాదుల అక్షయ పుణ్యమును పొందును. పుష్కరమున పుండరీకాక్షుని గయయందు గాదాధరుని, చిత్రకూటమునందు రాఘవుని, ప్రభాసమునందు డైత్య సూదనుని, జయంతియందు జముని, హస్తి నాపురమున జయంతుని, వర్ధమానమున వారాహుని, కాశ్మీరమున చక్రపాణిని కుబ్జామ్రమున జనార్దమని మధుర యందు కేశవుని కుబ్జామ్రకమున హృషీకేశుని గంగాద్వారమున జటాధరుని, శాలగ్రామమున మహాయోగుని గోవర్దనాచలమున హరిని పిండారకమున చతుర్బాహువును శంఖోద్ధారము నందు శంఖిని, కురుక్షేత్రమున వామనుని, యుమున యందు త్రివిక్రముని, శోణమున విశ్వేశ్వరుని పూర్వసాగరమున కపిలుని మహోదధి యందు విష్ణువును గంగా సాగర సంగమమున వనమాలుని, కిష్కింధయందు రైవతకుని, కాశీ తటమున మహాయోగుని విరజయందు రిపుంజయుని, విశాఖయూపమున అజితుని నేపాలమున లోక భావనుని, ద్వారకలో కృష్ణుని మందరమున మధుసూదనుని, లోకాకులమున రిపుహరుని, శాలగ్రామమున హరిని స్మరించవలెను. పురుషవటమున పురుషుని విమలమున జగత్ర్పభువును సైంధవారణ్యమున అనంతుని, దండక యందు శార్జధారిని ఉత్పలా వర్తకమున శౌరిని నర్మద యందు శ్రీపతిని రైవతకమున దామోదరుని నంద యుందు జలశాయిని, సింధు సముద్రమున గోపీశ్వరుని మహేంద్ర తీర్థమున అచ్యుతుని, సహ్యాద్రిపై దేవ దేవేశుని మాగధ వనమున వై కుంఠుని వింధ్యముపై సర్వపాప హరిని ఓఢ్ర దేశమున పురుషోత్తముని హృదయమున ఆత్మను స్మరించవలెను. ఈ ఆత్మ జపించు వారికి భుక్తి ముక్తులను ఇచ్చును. ప్రతివటము నందు వైశ్రవణుని, ప్రతి చత్వరము నందు శివుని, ప్రతి పర్వతము నందు రాముని సర్వత్ర మధుసూదనుని భూమ్యాకాశము లందు నరుని వశిష్ఠ తీర్థమున గరుడ ధ్వజుని సర్వత్ర వాసుదేవుని స్మరించువాడు భుక్తి ముక్తులను పొందును ఈ విష్ణు నామములను జపించువాడు సర్వమును పొందును. ఈ క్షేత్రములలో చేసిన శ్రాద్ధము, దానము, జపము. తర్పణము అంతయు కోటి గుణిత మచును. అట్లు చేసినవాడు మరణానంతరము బ్రహ్మ మయుడగును. ఇది చదివిన వాడును, విన్న వాడును పాపరహితుడై స్వర్గము పొందును.

అగ్ని మహా పురాణమున పంచ శద్విష్ణు నామ కథన మను మూడు వందల ఐదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page