Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రినవత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ మంత్ర పరిభాషా

అగ్ని రువాచ :

మంత్ర విద్యా మహం వక్ష్యే భుక్తిముక్తి ప్రదం శృణు |

వింశత్యర్ణాధికా మంత్రా మాలా మంత్రాః స్మృతా ద్విజ. 1

దళాక్షారాధికా మంత్రాస్త దర్వాగ్బీజ సంజ్ఞితాః | వార్ధక్యే సిద్ధిదా హ్యేతే మాలా మంత్రాస్తు ¸°వనే. 2

పంచాక్షరాధికా మంత్రాః సిద్దిదాః సర్వదాపరే | స్త్రీ పుంన పుంసకత్వేన త్రిధాస్యుర్మం త్రజా తయః. 3

స్త్రీ మంత్రా వహ్ని జాయాన్తా నమోన్తాశ్చ నపుం సకాః | శేషాః పుమాం శస్తావస్తే శశ్యోచ్చాటనకేషు చ.

క్షుద్రక్రియా మయధ్వంసే స్త్రియోన్యత్ర నపుంసకాః |

మంత్రావాగ్నేయ సౌమ్యాఖ్యాతారాద్య న్తార్ధ యోర్జపేత్‌. 5

తారాన్త్యాగ్ని వియత్ర్పాయో మంత్ర ఆగ్నేయ ఇష్యతే |

శిష్టః సౌమ్యః ప్రశస్తౌతే కర్మణోః క్రూరసౌమ్య యోః. 6

ఆగ్నేయ మంత్రః సౌమ్యః స్యాత్ప్రాయశోన్తే నమో7న్వితః |

సౌమ్య మంత్ర స్తథాగ్నేయః ఫట్కారేణాన్త తోయుతః. 7

సుప్తః ప్రబుద్ధమాత్రోవా మంత్రః సిద్దిం న యచ్ఛతి | స్వాపకాలో మహా బాహో జాగరో దక్షిణా వహః. 8

ఆగ్నేయస్య మనోః సౌమ్యమంత్ర సై#్యత ద్విపర్యయాత్‌ |

ప్రబోధ కాలం జానీయాదుభయో రుభయోరహః 9

దుష్టరక్షరాశి విద్వేషి వర్ణాదీన్వర్జయేన్మ నూన్‌ | రాజ్యలాభోపకారాయ ప్రారభ్యారిః స్వరః కురూన్‌. 10

గోపాలక కుటీం ప్రాయాత్పూర్ణమిత్యుదితా లిపిః | నక్షత్రేషు క్రమాద్యోజ్యౌ స్వరాన్త్యే రేవతీర్యుజౌ. 11

వేలా గురుః స్వరాః శోణః కర్మణౖవేతి భేదితాః | లిప్యర్ణా వశిషుజ్ఞేయా షష్ఠేశా దీంశ్చ యోజయేత్‌. 12

లిపౌ చతుష్పథ స్థాయామాఖ్యా వర్ణపదాం తరాః | సిద్ధాః సాధ్యా ద్వితీయస్థాః సుసిద్ధా వైరిణఃపరే. 13

సిద్దాదీన్కల్పయే దేవం సిద్ధోత్యన్త గుణౖరపి | సిద్ధే సిద్ధో జపాత్సాధ్యో జపపూజా హుతాదినా. 14

సుసిద్ధో ధ్యానమాత్రేణ సాధకం నాశ##యేదరిః | దుష్టార్ణ ప్రచురోయః స్యాన్మంత్రః సర్వవినిన్దితః. 15

అగ్నిదేవుడు పలికెను. వశిష్ఠా ! ఇపుడు భుక్తిముక్తి ప్రదమగు మంత్ర విద్యను చెప్పెదను వినుము. ఇరువది కంటె అక్షరములు అధికముగల మంత్రములు మాలామంత్ర ము. పది అక్షరములు మించియున్నవి మంత్రములు, పదికి తక్కువ అక్షరములున్నవి బీజమంత్రములు. ఇవి వార్ధక్యమున సిద్ధినిచ్చును. మాలామంత్రములు ¸°వనమున సిద్ధినిచ్చును. ఐదుకుమించిన అక్షరము గల మంత్రములు అన్ని ఫలముల నిచ్చును. మంత్రజాతులు స్త్రీ పురుషనంపుంసక భేదములచే మూడు విధములు. స్వాహాయనునది అంతమందు గలవి స్త్రీ మంత్రములు. నమః అనునది చివరగలవి నపుంసక మంత్రములు, మిగిలినవి పురుషమంత్రములు. అవివశీకరణము నందును ఉచ్చాటనము నందును ప్రశస్తమైనవి. క్షుద్ర క్రియయందును. రోగశాంతి యందును. స్త్రీమంత్రములు మంచివి. నపుంసక మంత్రములు ఇతర కార్యములందు మంచివి. ఆగ్నేయములు సౌమ్యములు యని మంత్రముల రెండు విధములు. అది యందు ఓంకారము చేర్చినవి ఆగ్నేయములు, ఓంకారము చివర యున్నవి సౌమ్య మంత్రములు. వీటిని అగ్ని చంద్ర నాడి సమయమున జపించ వలయును. ఓం, క్ష, ర, హ, అనునవి అధికముగా గల మంత్రములు ఆగ్నేయములు మిగిలినవి సౌమ్యములు. ఈ రెండును వరుసగా క్రూర సౌమ్యకర్మల యందు ప్రశస్తములు. ఆగ్నేయ మంత్రములు, ప్రాయశః చివర నమః చేర్చుటచే సౌమ్యము లగును. సౌమ్య మంత్రము కూడ చివర ఫట్‌ చేర్చినచో ఆగ్నేయ మగును. మంత్రము నిద్రించినను అపుడే లేచినను సిద్ధి ప్రదము కాదు. వామ నాడి చలించునపుడు ఆగ్నేయ మంత్రమునకు, నిద్రా సమయము. దక్షిణ నాడి చలించునపుడు జాగరణ సమయము. సౌమ్య మంత్రము యొక్క నిద్ర జాగరణ సమయములు ఇందుకు విపరీతముగ నుండును. రెండు నాడులు చలించునపుడు రెండు మంత్రములకు జాగరణ సమయము. దుష్ట నక్షత్ర దుష్ట రాశి, శత్రు రూపాది అక్షరములు గల మంత్రములను తప్పక విడిచి వేయవలయును. ''రాజ్య లాభోప కారాయ'' మొదలు ''లిపిః'' వరకు ఉన్న శ్లోకములో మొదటి నుండి ''పుల్లౌ'' యను వరకును. లిపి చెప్పబడినది. ఈ వర్ణమాలను నక్షత్రములతో కూడ, అశ్విన్యాది క్రమమున చేర్చవలయును. ''అం. ఆః'' యను రెండును. సర్వదా రేవతీ నక్షత్రముతో చేరి యుండును వా, లా, గౌ, రం, ఖు, రం, శో, నగ, భా, య సంఖ్యలలో విభక్తములగు అకారాద్య క్షరములు క్రమముగ మేషాది రాళులలో వున్నట్లు గ్రహించ వలయును. శ, ష, స, హ, అను అక్షరములను ఐదవ దగుకన్యా రాశి యందు చేర్చవలెను. క్ష కారమును మీన రాశి యందు చేర్చవలెను. చతుష్కోణము నందున్న ప్రథమ కోష్టము నందలి నాలుగు పంక్తులు సిద్ధములు. రెండవ కోష్టము నందున్న నాలుగుపంక్తులు సాధ్యములు. మూడవ కోష్టము నందున్న నాలుగుపంక్తులు సుసిద్ధములు. నాలుగవ కోష్టమునందలి పంక్తులు అరి. సాధుకుని నామాద్యక్షరము ఏచతుష్కము నందుపడునో అది వానికి సిద్ధచతుష్కము. రెండవది సాధ్యము ఇట్లే గ్రహించవలెను. సిద్ధమంత్రము అత్యంత గుణయుక్తము. దాని జపమాత్రముతనే సిద్ధికలుగును. సాధ్యమంత్రము జప పూజాదులచే సిద్ధించును. సుసిద్ధమంత్రము ధ్యాన మాత్రముచే సిద్ధించును అరిమంత్రము సాధుకుని నశింపజేయును. అధికముగ దుష్టవర్ణములు గల మంత్రము అందరిచేతను

నిందింపబడినది.

ప్రవిశ్య విధివద్దీక్షామభిషేకా వసానికామ్‌ | శ్రుత్వాతంత్రం గురోర్లబ్ధం సాధయే దీప్సితం మనుమ్‌. 16

ధీరో దక్షః శుచిర్బక్తో జపధ్యా నాదితత్పరః | సిద్ధస్తపస్వీ కుశలస్తంత్రజ్ఞః సత్యభాషణః. 17

నిగ్రహానుగ్రహేశక్తో గురురిత్యధీభియతే | శాంతో దాంతః పటుశ్చీర్ణ బ్రహ్యచర్యో హవిష్యభుక్‌. 18

కుర్వన్నాచార్య శుశ్రూషాం సిద్ధోత్సాహీ సశిష్యకః | సతూపదేశ్యః పుత్రశ్చ వినయీవసుదస్తథా. 19

మంత్రం దద్యాత్సు సిద్ధౌతు సహస్రం దేశికం జపేత్‌ | యదృచ్ఛయా శ్రుతం మంత్రం ఛలేనాథ బలేనవా.

పత్రే స్థితంచ గాథాంచ జనయేద్యద్య నర్థకమ్‌ | మంత్రంయః సాధయేదేకం జపహో మార్చనాదిభిః. 21

క్రియాభిర్భూరి భస్తస్య సిధ్యన్తి స్వల్ప సాధనాత్‌ | సమ్యక్సిద్దైక మంత్రస్య నాసాధ్య మిహకించన. 22

బహుమంత్రవతః పుంసః కాకథా శివఏవసః | దశలక్ష జపాదేకవర్ణో మంత్రః ప్రసిధ్యతి. 23

వర్ణవృద్ధ్యా జపహ్రాస స్తేనాన్యేషాం సమూహయేత్‌ | బీజాద్ధ్విత్రి గుణాన్మంత్రాన్మాలామంత్రే జపక్రియా. 24

సంఖ్యానుక్తౌ శతం సాష్ట సహస్రం వాజపాదిషు | జపాద్దశాంశం సర్వత్ర సాభిషేకం హుతం విదుః. 25

శిష్యుడు అభిషేకాంత దీక్షయథావిధిగా గ్రహించి గురువుద్వారా తంత్రోక్త విధానము తెలుసుకొని గురువు ఇచ్చిన అభీష్టమంత్రమును సాధించ వలెను. ధీరుడు, సమర్థడు, పవిత్రుడు, భక్తి సంపన్నుడు, జప, ధ్యానాదిత్పరుడు సిద్థుడు, తపశ్శాలి, కుశలుడు, తంత్రజ్ఞుడు, సత్యవాది, నిగ్రహానుగ్రహ సమర్థుడైన వాడే గురువు. శాంతుడు జితేంద్రియుడు సమర్థుడు, బ్రహ్మచారి హవిష్యమును తినువాడు, గురుసేవాతత్పరుడు మంత్ర సిద్ధికై ఉత్సాహముకలవాడుయైన వ్యక్తియే యోగ్యుడైన శిష్యుడు. అట్టి శిష్యునకును, తనపుత్రునకును, మంత్రోపదేశము చేయవలయును. శిష్యుడు వినయవంతుడై గురువునకు ధనమును ఇవ్వవలెను. గురువు అట్టి శిష్యునకు మంత్రోపదేశము చేసి తన్మంత్ర సిద్ధికై తాను సహస్ర జపము చేయవలయును. అకస్మాత్తుగా విన్నది వంచనచే కాని, బలముచేగాని పొందబడినది పుస్తకములలో వ్రాయుబడినది గాథలలో వున్నది యగు మంత్రము జపించకూడదు. అట్టు జపించినచో అనర్థము కలుగును. హోమ అర్చనాది వివిధ క్రియలతో మంత్ర సాధన చేయువానికి స్వల్పకాలమునందే మంత్ర సిద్ధికలుగును. ఒక్క మంత్రమునైనను, విధి పూర్వకముగ సిద్ధి చేసికొనిన వానికి అసాధ్యమైనది యేదియు వుండదు. అనేక మంత్రముల సిద్ధి సంపాదించిన వాని, మాహాత్మ్యము వర్ణనాతీతము. అతడు సాక్షాత్తు శివుడే. ఏకాక్షరమంత్రమును పదిలక్షలు జపించినచో సిద్ధించును. మంత్రము నందలి వర్ణములు పెరిగిన కొలది జపసంఖ్య తగ్గును. ఈ విధముగ జపసంఖ్యను ఊహించుకొనవలయును. మాలా మంత్రములను బీజమంత్రము కంటె రెండు మూడు రెట్లు అధికము జపించవలెను. జపసంఖ్య చెప్పని మంత్రములను నూటయెనిమిది పర్యాయములు కాని, ఒక వెయ్యి యెనిమిది పర్యాయములుకాని జపించవలయును. జపముతో దశాంశము హోమము తర్పణము చేయవలయును.

ద్రవ్యానుక్తౌ ఘృతం హోమే జపేశక్తస్య సర్వతః|

మూలమంత్రాద్దశాం శః స్యాదంగాదీనాం జపాదికమ్‌. 26

జపాత్స శక్తి మంత్రస్య కామదా మంత్రదేవతాః | సాధకస్య భ##వేత్తృప్తా ధ్యాన హోమార్చనాదినా. 27

ఉచ్చైర్జపాద్వి శిష్టఃస్యా దుపాం శుర్దశభి ర్గుణౖః | జిహ్వాజ పే శతగుణః సహస్రో మానసః స్మృతః. 28

ప్రాఙ్ముఖోవాఙ్ముఖో వాపి మంత్రకర్మ సమారభేత్‌, ప్రణవాద్యాః సర్వమంత్రా వాగ్యతో విహితాసనః. 29

ఆసీనస్తు జపేన్మంత్రా న్దేవతా చార్యతుల్య దృక్‌ | కుటీ వివిక్తాదేశాః స్యుర్దేవాలయనదీ హ్రదాః. 30

సిద్ధౌయ వాగూ పూపైర్వాపయో భక్ష్యం హవిష్యకమ్‌ | మంత్రస్య దేవతా తావత్తిథి వారేషు వై జపేత్‌. 31

కృష్ణాష్టమీ చతుర్దశ్యోర్గ్ర హణాదౌ చ సాధకః | దస్రౌయమోనలో ధాతా శశీ రుద్రోగురుర్దితిః. 32

సర్పాః పితరోథ భగోర్యమా శీతేతరద్యుతిః | త్వష్టామరుత ఇంద్రాగ్నీ మిత్రేంద్రౌ నిరృతిర్జలమ్‌. 33

విశ్వేదేవా హృషీకేశో హయవః సలిలాధిపః | అజైకపాద హిర్బుధ్న్యః పూషా శ్విన్యాది దేవతాః. 34

అగ్నిర్దస్రావుమానిఫ°్న నాగశ్చంద్రో దివాకరః | మాతృదుర్గా దిశామీశః కృష్ణో వైవస్వతః శివః. 35

పంచదశ్యాః శశాంకస్తు పిత రస్తిథి దేవతాః | హరో దుర్గా గురుర్విష్ణు ర్బ్రహ్మా లక్ష్మీర్దనేశ్వరః. 36

ఏతే సూర్యాది వారేశా లిపిన్యాసోథకథ్యతే |

విశేష ద్రవ్యమును దేనిని చెప్పనప్పుడు హోమమునందు ఘృతమును ఉపయోగించవలయును. హోమా సమార్థుడు హోమమునకు బదులు జపసంఖ్యలో దశాంశ జపము చేయవలయును. అంగాది మంత్రములకు కూడ జపము చెప్పబడినది. సశక్తికమగు మంత్రమును జపించుటచే (దేవతలు) మంత్ర దేవతలు అభీష్టఫలములను ఇత్తురు. సాధకుడు చేసిన ధ్యానహోమ అర్చనాదులచే తృప్తి చెందుదురు. ఉచ్చస్వరముతో జపము చేయుటకంటే ఉపాంశు జపము పదిరెట్లు శ్రేష్ఠము. జిహ్వ మాత్రమే కదుపుచు చేసిన జపము నూరురెట్లు శ్రేష్ఠము, మానసిక జపము వెయిరెట్లు శ్రేష్ఠము. మంత్ర జపమును పూర్వాభి ముఖుడై గాని, దక్షిణాభిముఖుడైగాని ప్రారంభించవలయును. మౌనము అవలంభించి విహితమైన ఆహారమును స్వీకరించుచు, ప్రజవాది మంత్రములన్నింటిని జపించవలయును. ఆసనముపై కూర్చుండి దేవతను ఆచార్యుని ఒక్కరుగా భావించుచు జపించవలయును. పర్ణశాల ఏకాంతమైన పవిత్ర ప్రదేశము, దేవాలయము నదీ తటాకాదుల తీరములు జపమునకు ఉత్తమ ప్రదేశములు. మంత్ర సిద్ధికోరువాడు గంజి, అపూపములు, పాలు, హవిష్యము ఆహారముగ తీసుకొనవలయును. సాధుకుడు మంత్ర దేవతలకు సంబంధించిన తిథివారములందును కృష్ణపక్ష అష్టమి చతుర్ద శులయందును గ్రహణాది పర్వములయందును మంత్రదేవతలను పూజించవలయును. అశ్విన్యాది నక్షత్రములకు క్రమముగ అశ్వినీకుమారులు, యముడు, అగ్ని, ధాత, చంద్రుడు, రుద్రుడు, అదితి, బృహస్పతి, సర్పము, పితృదేవతలు, భగుడు, అర్యమసూర్యుడు, త్వష్టవాయువు ఇంద్రాగ్నులు, మిత్రుడు, ఇంద్రుడు జలము నిఋరుతి, విశ్వేదేవులు, విష్ణువు వసుగణము, వరుణుడు, అజైకపాత్‌, అహిర్బధ్న్యుడు, పూషయను వారు దేవతలు. ప్రతిపత్తు మొదలు చతుర్దశి వరకును తిథులకు, క్రమముగ, అగ్ని బ్రహ్మపార్వతి, గణశుడు, నాగము, స్కందుడు, సూర్యుడు, మహేశ్వరుడు, దుర్గ, యముడు, విశ్వేదేవతలు విష్ణువు, కామదేవుడు, ఈశ్వరుడు దేవతలు, వూర్ణమికి చంద్రుడును అమావాస్యకు పితృదేవతలును దేవతలు, శివుడు దుర్గ బృహస్పతి, విష్ణవు, బ్రహ్మ. లక్ష్మి కుబేరుడు వీరువరుసగ రవ్యాది వారములకు దేవతలు, ఇపుడు లిపిన్యాసమును చెప్పెదను.

కేశాన్తేషుచ వృత్తేషు చక్షుషోః శ్రవణద్వయే. 37

నాసాగండౌష్ఠదన్తేషుద్వేద్వే మూర్దాస్యయోః క్రమాత్‌ | వర్ణాన్పంచను వర్గాణాం బాహుచరణ సంధిషు. 38

పార్శ్వయోః పృష్ఠతోనాభౌ హృదయే చక్రమాన్న్యసేత్‌ |

యాదీంశ్చ హృదయేన్యస్యేదేషాం స్యుఃసప్తధాతవః 39

త్వగనృఙ్మాంస మేదోస్థి మజ్ఞాశుక్రాణి ధాతవః | రసాద్యైశ్చ పయోన్తైశ్చ లిఖ్యన్తేచ లిపీశ్వరైః. 40

శ్రీకంఠోనన్త సూక్ష్మౌచ త్రిమూర్తిరమరేశ్వరః | అగ్నీశోభావ భూతిశ్చ అధీశఃస్థాణుకోహరః.

41

దండీశో భౌతికఃసద్యో జాతశ్చాను గ్రహేశ్వరః | అక్రూరశ్చమహాసేనిః శరణ్యా దేవతా ఆమూః. 42

తతఃక్రోధీశ చండౌఛ పంచాన్తక శివోత్తమౌ | తథైవ రుద్రకూర్మౌచ త్రినేత్రశ్చతురాననః. 43

అజేశఃశర్మసోమేశౌతథా లాంగలి దారుకౌ | అర్దనారీశ్వరశ్చోమా కాంతశ్చాషాఢి దండినౌ. 44

అత్రిర్మీనశ్చమేషశ్చ లోహితశ్చ శిఖీతథా | ఛగలండ ద్విరండౌద్వౌ నమహాకాలబాలినౌ. 45

భుజంగశ్చ పినాకీచ ఖడ్గీశశ్చ బకః పునః | శ్వేతో భృగుర్గుడీశాక్షాః క్షయః సంవర్తకః స్మృతః. 46

రుద్రాన్సశక్తకల్లిఖ్యా దీన్నమోన్తాన్విన్య సేత్ర్కమాత్‌|

అంగాని విన్యసేత్సర్వే మంత్రాః సాంగాస్తుసిద్ధిదాః.

హృల్లేఖావ్యోమసంపూర్వాణ్య తాన్యంగాని విన్యసేత్‌ | హృదాదీన్యంగ మంత్రాన్తైర్యోజయేద్ధృదయేనమః.

స్వాహాశిరస్యథ వషట్‌ శిఖాయాం కవచేచహుమ్‌|

వౌషణ్నత్రేస్త్రాయఫట్‌ స్యాత్పం చాంగం నేత్రవర్జితమ్‌. 49

నిరంగస్యాత్మనా చాంగంన్యసై#్యతం నియుతం జపేత్‌ | క్రమేణ దేవీం వాగీశాం యథోక్తాంస్తు తిలాన్హునేత్‌.

లిపిదేవీ సాక్షసూత్ర కుంభ పున్తక పద్మధృక్‌ | కవిత్వాది ప్రయచ్ఛేత కర్మాదౌ సిద్ధయేన్యసేత్‌. 51

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మంత్రపరిభాషానామ త్రినవత్యధిక ద్విశతతమోధ్యాయః.

అకారాది వర్ణములను సాధకుడు వరుసగ, కేశాంతము, ముఖము, నేత్రద్వయము, శ్రవణద్వయము, నాసాపుట ద్వయము, కపోలద్వయము, ఓష్టద్వయము, హృదయము, ఉర్ధ్వదంతపంక్తి, అధోదంత పంక్తి, వీటిపై ''ఓం, అంనమః'' కేశాంతేషు'' ఇత్యాది విధమున చెప్పుచు, న్యాసము చేయవలయును. శిరస్సుయందు, ముఖ వృత్తమునందు, దక్షిణ బాహుమూలమునందు, దక్షిణ కూర్పరము నందు, దక్షిణ మణిబంధము నందు దక్షిణ హస్తాంగుళి మూలము నందు, ఓం, అం, నమః, యని ప్రారంభించి, ఓం, వం, నమః అను వరకు చెప్పుచు న్యాసము చేయవలయును. ఐదు వర్దముల ఐదేసి వర్గములను, బాహుచరణ సంధుల యందును, పార్శ్వము లందును పృష్ఠ, నాభి, హృదయము లందును క్రమముగ వుంచవలయును. యకారాది వర్ణములను త్వక్‌, అసృక్‌ మాంస, మేధస్సు, అస్థి, మజ్జా, శుక్రములను ఏడు ధాతువు లందును న్యాసము చేయవలయును. ప్రారంభమున ప్రణవమును, అంతమున నమఃను చేర్చి లిపీశ్వర, మాతృకేశ్వర న్యాసము చేయవలయును. ప్రారంభమున ప్రణవమును, అంతముననమఃను చేర్చి లిపీశ్వర, మాతృకేశ్వర న్యాసము చేయవలయును. శ్రీకంఠ - అనంత - సూక్ష్మ - త్రిమూర్తి -

అమరేశ్వర - అర్దీశ - భావ భూతి - తితీశ స్థాణుక - హర - దండీశ - భౌతిక - సద్యోజాత - అనుగ్రహేశ్వర - అక్రూర - మహాసేనులు స్వరమూర్తి దేవతలు. క్రోధీశ - చండీశ - పంచాంతక - శివోత్తమ - రుద్ర - కూర్మ త్రినేత్ర - చతురానన, అజేశ - శర్మ - సౌమేశ - లాంగలి - దారుక - అర్ధనారీశ్వర - ఉమాకాంత - అషాడిన్‌ - దండిన్‌ - అద్రిమీన - మేష - లోహిత - శిఖి - చగలాండ - ద్విరండ - మహాకాల - కపాలి - భుజంగేశ - పినాకి - ఖడ్గీశ - బక - శ్వేత, భృగు - నకులీ - శివ - సంవర్తకులు ప్యంజన మూర్తి దేవతలు. శ్రీ కంఠాది రుద్రులను, వారి శక్తులతో క్రమముగ న్యాసము చేయవలయును. అంగముల న్యాసము కూడ చేయవలయును. అన్ని మంత్రములను సాంగము లైననే సిద్ధి ప్రదములగును. ఉల్లేఖకు వ్యోమ బీజము కలిపి ఈ అంగ న్యాసము చేయవలయును. హృదయాది అంగమంత్రములను అంతము నందు చేర్చి పలుక వలయును. హృదయమునందు ''నమః'' శిరస్సు నందు ''స్వాహా'', శిఖ యందు ''వషట్‌'', కవచము నందు ''హూం'' నేత్రము నందు వౌషట్‌, హస్త్రము నందు ''ఫట్‌'' చెప్పవలయును. నేత్ర న్యాసము లేనిచో పంచాంగ న్యాస మగును, మంత్రము నిరంగమైనచో స్వరూపము చేతనే అంగ న్యాసము చేసి, వాగీశ్వరీ దేవీ మంత్రమును ఒక లక్ష జపించి దశాంశము తిల హోమము చేయవలయును. లిపి దేవియైన వాగీశ్వరి తన హస్తములలో అక్షమాల, కలశం, పుస్తకము, కమలం ధరించి యుండును. కవిత్వాదులను ఇచ్చును. అందుచే జప కర్మాది సిద్ధి కొరకై వాగీశ్వరి న్యాసము చేయవలయును. ఇట్లు చేయుటచే కవి కాని వాడు కూడ కవి యగును. మాతృకా న్మాసముచే అన్ని మంత్రములును సిద్ధించును.

అగ్ని మహాపురాణమున మంత్ర పరిభాష యను రెండు వందల తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page