Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకసవత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ గజశాంతిః

శాలిహోత్ర ఉవాచ :

గజశాంతిం ప్రవక్ష్యామి గజరోగ విమర్దినీమ్‌ | విష్ణుశ్రియంచ పంచమ్యాం నాగమైరావతం యజేత్‌. 1

బ్రహ్మాణం శంకరం విష్ణం శక్రం వైశ్రవణం యమమ్‌ |

చంద్రార్కౌ వరుణం వాయుమగ్నిం పృథ్వీం తథాచఖమ్‌. 2

శేషం శైలాన్కుంజరాంశ్చ యేతేష్టౌ దేవయోనయః | విరూపాక్షం మహాపద్మం భద్రం సుమనసం తథా.

కుముదైరావణః పద్మః పుష్పదన్తోథ వామనః | సుప్రతీకోజనో నాగా అష్టౌహోమోథ దక్షిణామ్‌. 4

గజాః శాంత్యుదకైః సిక్తావృద్ధౌ నైమిత్తికం శృణు | గజానాం మకరాదౌచ ఐశాన్యాం నగరాద్భహిః. 5

స్థండిలే కమలే మధ్యే విష్ణుం లక్ష్మీంచ కేసరౌ |

బ్రహ్మాణం భాస్కరం పృథ్వీం యజైత్స్కంధం హ్యనన్తకమ్‌. 6

ఖం శివం సోమ మింద్రా దీంస్తదస్త్రాణి దలేక్రమాత్‌ |

వజ్రం శక్తించ దండంచ తోమరం పాశకం గదామ్‌. 7

శూలం పద్మం బహిర్వృన్తే చక్రే సూర్యం తథాశ్వినౌ | వసూనష్టౌ తథా సాధ్యాన్యామ్యేథ నైరృతేదలే.

దేవా నాంగిరసశ్చాన్యాన్భృగూంశ్చ మరుతోనిలే | విశ్వాన్దే వాంస్తథా దక్షే రుద్రా న్రౌద్రేథ మండలే. 9

వృత్తయా రేఖయాతత్ర దేవాన్వై బాహ్యతోయజేత్‌ | సూత్రకారానృషీన్వాణీం పూర్వాదౌ సరితోగిరీన్‌. 10

మహాభూతాని కోణషు ఐశాన్యా దిఘ సంయజేత్‌ | పద్మం చక్రం గదాం శంఖం చతురస్రంతు మండలమ్‌.

చతుర్ధ్వారం తతః కుంభానగ్న్యా దౌచ పతాకికాః | చత్వా రస్తోరణాన్ద్వారి నాగానైరావతాదికాన్‌. 12

పూర్వాదౌ చౌషధీ భిశ్చ దేవానాం భోజనం పృథక్‌ | పృథక్ఛతాహుతీశ్చాజైర్గ జానర్చ్య ప్రదక్షిణమ్‌. 13

నాగం వహ్నిం దేవతా దీన్బాహ్యైర్జగ్ముః స్వకం గృహమ్‌ |

ద్విజోభ్యో దక్షిణాం దద్యాద్ధస్తి వైద్యాదికాం స్తథా. 14

కరిణీంతు సమారుహ్య వదేత్కర్ణేతు కాలవిత్‌ |

నాగరాజే మృతే శాంతింకృత్వా (న్యాస్మి) ముష్మిం జపేన్మనుమ్‌. 15

శ్రీగజస్త్వం కృతోరాజ్ఞా భవనస్య గజాగ్రణీః | గంధమాల్యాగ్ర భ##క్తైస్త్వాం పూజయిష్యతి పార్థివః. 16

లోకస్తదాజ్ఞయా పూజాం కరిష్యతి తదాతవ | పాలనీయస్త్వయా రాజాయుద్ధేధ్వని తథాగృహే. 17

తిర్యగ్భావం సముత్సృజ్య దివ్యం భావమనుస్మర | చేవాసురే పురాయుద్ధే శ్రీగజస్త్రిదశైః కృతః. 18

బరావతః సుతః శ్రీమానరిష్టోనామ వారణః | శ్రీగజానాంతు తత్తేజః సర్వమేవోపతిష్ఠతే. 19

తత్తేజస్తవ నాగేంద్ర దివ్యభావ సమన్వితమ్‌ | ఉపతిష్ఠతు భద్రంతే రక్షరాజానమాహవే. 20

ఇత్యేవమభిషిక్తం తమారోహేత శుభేనృపః | తస్యానుగమనం కుర్యుః సశస్త్రా నరపుంగవాః. 21

శాలాస్వసౌస్థండిలేబ్జే దిక్పాలాదీన్యజేర్బహిః | కెసరేఘ బలం నాగం భువం చైవ సరస్వతీమ్‌. 22

మధ్యేతు డిండిమం ప్రార్చ్య గంధమాల్యాను లేపనైః | హుత్వా దేయస్తు కలోశో రసపూర్ణో ద్విజాయచ. 23

గజాధ్యక్షం హస్తిపంచ గణితజ్ఞంచ పూజయేత్‌ | గజాధ్యక్షాయతం దద్యాత్‌ డిండిమం సోపి వాదయేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే గజశాంతి కథనం నామైక నవత్యధిక ద్విశతతమోధ్యాయః.

శాలిహోత్రుడు చెప్పెను : గజరోగములను తొలగించు గజశాంతిని చెప్పెదను. పంచమి తిథియందు విష్ణు లక్ష్మీ, ఐరావతములను బ్రహ్మ శంకర ఇంద్ర, కుబేర, యములను, చంద్రసూర్యులను, వరుణుని, వాయు, అగ్ని, పృథివీ ఆకాశములను, ఆదిశేషుని, శైలములను దేవయోనులగు విరూపాక్ష మహాపద్మ భద్ర సుమనస్‌ కుముద, ఐరావత పద్మపుష్పదంత, వామన, అంజనములను గజములను అష్టదిగ్గజములను పూజించి హోమములుచేసి దక్షిణలు ఇవ్వవలెను. శాంతికలశ జలముతో గజాభిషేకము చేయించినచో అభివృద్ధి పొందును. ఇపుడు నైమిత్తిక శాంతిని వినుము, మకరాది సంక్రాంతులయందు నగర బహిర్భాగమున ఈశాన్యమున ఏనుగులను పూజించవలెను. స్థండిలమున పద్మమధ్యమున విష్ణువును లక్ష్మిని, పిదప అష్టదళములందు క్రమముగా బ్రహ్మ సూర్య, పృథివీ, స్కంద, ఆనంత, ఆకాశ, శివ, చంద్రులను పూజించవలెను. పూద్వాదిక్రమమున ఇంద్రాది దిక్పాలకులను పూజించవలెను. వారి ఆయుధములగు వజ్రశక్తి, దండతోమర, పాశ, గదా, శూల, పద్మాదులను పూజించవలయును, దళముల బాహ్యభాగమున చక్రమునందు సూర్యుని, అశ్వినీ దేవతలను పూజించవలయును. దక్షిణమున అష్టవస్తువులను సాధ్యదేవతలను నైఋతమున భార్గవాంగిరస దేవతలును వాయువ్యమున మరుద్గణములను, దక్షిణమున విశ్వదేవతలను, ఈశాన్యమున రుద్రులను పూజించవలయును. వృత్తరేఖానిర్మితమగు అష్టదళ కమలమునకు బహిర్భాగమున సూత్రకారులగు ఋషులను, సరస్వతిని, పూర్వభాగమున నదీపర్వతములను ఈశాన్యాదులయందు పంచమహా భూతములను పూజించవలయును. పిమ్మట పద్మచక్రగదా శంఖములతో ప్రకాశించు చతుష్కోణము చతుర్డ్వారమగు మండలము నిర్మించి, ఆగ్నేయాదులందు కలశస్థాపనకూడ చేసి నాలుగు ప్రక్కలందును పతాకా తోరణములను ఏర్పరచవలయును. అన్యద్వారములందు ఐరావతాది నాగరాజులను పూజించవలెను. పూర్వాదిదిక్కులందు దేవతలకు వేరువేరుగా ఓషధీ యుక్తములగు పాత్రనుంచవలెను. గజములను పూజించి ప్రదక్షిణము చేయవలయును. దేవతలందరికిని, నూరుచొప్పున హోమములు చేయవలయును. పిమ్మట గజరాజ. అగ్ని దేవతలతో బయలుదేరి వాద్యములను మ్రోగించుచు ఇంటికి తిరిగి వెళ్ళవలయును. బ్రాహ్మణులకును గజచికిత్సకాదులకును దక్షిణలివ్వవలెను. పిదప కాలజ్ఞుడగు పురుషుడు గజరాజు నధిరోహించి దాని చెవిలో ''ఓ గజరాజమా! మహారాజు నిన్ను శ్రీగజ పదమునందు నియమించినాడు. నీవు గజశ్రేష్ఠుడవు ఈ రాజులు నేటినుండి గంధమాల్య ఉత్తమా క్షతాదులతో నిన్ను పూజింతురు. అతని ఆజ్ఞచే ప్రజలుకూడ సర్వదా నిన్ను పూజింతురు. నీవు యుద్ధభూమి యందును, మార్గము నందును గృహము నందును సర్వదా మహారాజును రక్షించవలయును. ఓ నాగారాజ! తిర్యగ్భావమును విడిచి నీ దివ్యత్వమును స్మరించుము పూర్వము దేవాసుర సంగ్రామమునందు ఐరావత పుత్రుడగు అరిష్ట నాగమునకు శ్రీగజము అను పదమును దేవతలు ఇచ్చిరి. ఆ శ్రీ గజము తేజస్సంతయు నీ శరీరమున ప్రతిష్ఠితమైయున్నది. ఓ గజేంద్రమా! నీకు కళ్యాణమగుగాక! నీలోపల నున్న దివ్యభావ సంపన్నమగు తేజస్సు ఉద్బుద్ధమగుగాక! నీవు రణాంగణమున రాజును రక్షించుచుండుము. ఆ గజరాజము మరల మరణించినచో శాంతి చేసి మరొక గజ కర్ణములో పైమంత్రమును జపించ వలయుకు. అభిషిక్త మగు గజరాజుపై శుభముహూర్తమున రాజు అధిరోహించ వలయును శస్త్ర ధారులగు వీర శ్రేష్ఠులు ఆతని ననుసరించ వలెను. రాజు హస్తిశాల యందు నేలపై చిత్రించిన కమలము బయట దిక్పాలకులను పూజించి వలయును. కేసరముల స్థానమున మహా బలియగు నాగరాజమును భూదేవి సరస్వతులను, మధ్య భాగమున గంధ పుష్ప చందనములతో డిండిమమును పూజించి, హోమము చేసి రస పూర్ణ మగు కలశను బ్రాహ్మణునకు దానము చేయవలయును. గజాధ్యక్షుని, గజ రక్షకుని, జ్యోతిష్కుని కూడ సత్కరించి ఆ డిండిమమును గజాధ్యక్షునికి ఇవ్వవలెను. ఆతడు దానిని మ్రోగించవలెను. అతడు దాని జఘనముపై కూర్చుండి. శుభ గంభీర స్వరమున డిండిమ వాదనము చేయవలయును.

అగ్ని మహా పూరణమున గజ శాంతి కథన మను రెండు వందల తొంబది ఒకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page