Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతురశీత్యధిక ద్విశతతమోధ్యాయః

అథమంత్ర రూపౌషధ కథనమ్‌

ధన్వన్తరి రువాచ :

ఆయురారోగ్య కర్తార ఓంకారాద్యాశ్చ నాకదాః | ఓంకారః వరమోమంత్రస్తం జప్త్వా చామరోభ##వేత్‌. 1

గాయత్రీ పరమోమంత్రస్తం జప్త్వా భుక్తి ముక్తిభాక్‌ | ఓం నమోనారాయణాయ మంత్రః నర్వార్థసాధకః.

ఓం నమోభగవతే వాసుదేవాయ సర్వదః | ఓంహ్రూం నమోవిష్ణవే మంత్రోయం చౌషధం పరమ్‌. 3

అనేన దేవా హ్యసురాః సశ్రియో నీరుజోభవన్‌ | భూతానా ముపకారశ్చ తథాధర్మో మహౌషధమ్‌. 4

ధర్మ సద్దర్శకృద్దర్మీ ఏతైర్థర్శశ్చ నిర్మలః | శ్రీదః శీశః శ్రీనివాసః శ్రీధరః శ్రీనికేతనః. 5

శ్రియపతిః శ్రీపరమ ఏతైః శ్రియమవాప్నుయాత్‌ | కామీ కామప్రదః కామః కామపాలస్తథాహరిః. 6

ఆనందో మాధవశ్చైవ నామ కామాయ వై హరేః | రామః పరశురామశ్చ నృసింహో విష్ణురేవచ. 7

త్రివిక్రమశ్చ నామాని జప్తవ్యాని జిగీషుభిః | విద్యామ భ్యస్యతాం నిత్యం జప్తవ్యః పురుషోత్తమః. 8

దామోదరో బంధహరః పుష్కరాక్ష్కోక్షి రోగనుత్‌ | హృషీ కేశోభయహరో జపేదౌషధ కర్మణి. 9

అచ్యుతం చామృతం మంత్రం సంగ్రామే చాపరాజితః | జలతారే నరసింహం పూర్వాదౌ క్షేమ కామవాన్‌.

చక్రిణం గదినం చైవ శార్జిణం ఖడ్గినం స్మరేత్‌ | నారాయణ సర్వకాలే నృసింహోఖిల భీతినుత్‌. 11

గరుడ ధ్వజశ్చ విషహృద్వాసుదేవం నదాజ పేత్‌ | ధాన్యాది స్థాపనం స్వప్నే దాహాదౌ జలశాయినామ్‌. 12

నారాయణం చ దుఃస్వప్నే దాహాదౌ జలశాయినామ్‌ | హయగ్రీవం చవిద్వార్థీ జగత్సూతిం సుతాప్తయే |

బలభద్రం శౌర్యకార్యే ఏకం నామార్థ సాధకమ్‌. 13

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మంత్ర రూపౌషధకథనం నామ చతురశీత్యధిక ద్విశతతమోధ్యాయః

ధన్యంతరి పలికెను. ఓంకారాది మంత్రములు, ఆయురారోగ్య ప్రదములు, స్వర్గము ఇచ్చునవి కూడ, ఓం కారము అత్యుత్తమమైన మంత్రము, దానిని జపించిన వాడు, అమృత్యుడగును. గాయత్రి పరమ మంత్రము దానిని జపించినవాడు భుక్తి ముక్తులను పొందును. "ఓం నమోనారాయణాయ" అను మంత్రము సర్వార్థ సాధకము "ఓంనమోభగవతే వాసుదేవాయ" యను మంత్రము సర్వ ఫలప్రదము. "ఓం హ్రూం నమోవిష్ణవే" యను మంత్రము పరమౌషధము దినిచే దేవతలు అసురులును, లక్ష్మీవంతులై రోగముక్తులైరి. దీనివలన లోకోపకారము ధర్మము కలుగును. ఇది మహౌషధము "ధర్మః సద్ధర్మ కృద్ధర్మీ" యను ధర్మసంబంధి నామములను జపించువాడు నిర్మలు డగును శ్రీదః శ్రీశః, శ్రీనివాసః శ్రీధరః శ్రీనికేతనః, శ్రియః, పతిః శ్రీపరమః" అను పదములను జపించువాడు ఐశ్వర్యమును పొందును. కామీకామ ప్రదః కామః కామపాల స్తథాహరిః; ఆనందోమాధవశ్చైవ" యను హరినామములు కామ ప్రదములు "రామః పరశురామశ్చ నృసింహో విష్ణురేవచ, త్రివిక్రమః" యను నామములు జయేచ్ఛకలవారు జపించ వలెను. విద్యాభ్యాసము చేయువారు నిత్యము పురుషోత్తమ నామము జపించవలెను. "దామోదరః" యను నామము బంధ హరము పుష్కరాక్షః యను నామము నేత్రరోగములను తొలగించును. "హృషీకేశః యను నామము భయహరము. ఔషధకర్మ యందు అచ్యుతయను అమృత మంత్రమును జపించవలెను. "అపరాజితః" యను నామమును యుద్ధము నందును, జలము దాటునపుడు శ్రీనృసింహ నామమును స్మరించవలెను. పూర్వాదిదిక్కులందు క్షేమము కోరువాడు చక్రీ, గదీ, శార్జి, ఖడ్గీ, యను నామములు స్మరించవలెను, నారాయణ స్మరణము సదాచేయవలయును. నృసింహ స్మరణము సకల భీతినివారకము గరుడధ్వజస్మరణము విషహరము, వాసుదేవనామము సర్వదా జపించవలెను. ధాన్యాదులను ఇంటిలో వుంచునపుడును శయన సమయము నందును, అనంతాచ్యుత నామములు స్మరించవలెను. దుఃస్వప్నమున నారాయణుని, అగ్నిదాహాదులందు జలశాయిని స్మరించవలెను. విద్యార్థి హయగ్రీవుని పుత్రప్రాప్తి కాముడు జగత్యూతిని శౌర్యకాముడు బలభద్రుని స్మరించవలెను. వీటిలో ఒక్కొక్క నామముయనేకఫలములనిచ్చును.

అగ్నిమహాపురాణమున మంత్ర రూపౌషధ కథనమను రెండువందల యెనుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page