Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్య్వశీత్యధిక ద్విశతతమోధ్యాయః

అథ వృక్షాయుర్వేదః

ధన్వంతరిరువాచ :

వృక్షాయుర్వేద మాఖ్యాస్యే ప్లక్షశ్చోత్తరతః శుభః | ప్రాగ్వటోయామ్యతస్త్వామ్ర ఆప్యేశ్వత్థఃక్రమేణతు. 1

దక్షిణాం దిశ ముత్పన్నాః సమీపే కంటకద్రుమాః |

ఉద్యానం గృహవాసే స్యాత్తిలాన్వాప్యథ పుష్పితాన్‌. 2

గృహ్ణీయాద్రోపయేద్వృక్షాన్ద్విజం చంద్రం ప్రపూజ్యచ | ధ్రువాణి పంచవాయువ్యం హస్తప్రాజేశ వైష్ణవమ్‌.

నక్షత్రాణి తథామూలం శస్యన్తే ద్రుమరోపణ | ప్రవేశ##యేన్నదీవాహాన్పుష్కరిణ్యాంతు కారయేత్‌. 4

హస్తోమఘాతథా మైత్రమాద్యం పుష్పం నివాసవమ్‌ | జలాశయ సమారంభే వారుణం చోత్తరాత్రయమ్‌. 5

సంపూజ్యవరుణం విష్ణుం పర్జన్యం తత్సమాచరేత్‌ | అరిష్టాశోకపున్నాగ శిరీషాః సప్రియంగవః. 6

అశోకః కదలీజంబూస్తథా బకుల దాడిమాః | సాయం ప్రాతస్తు ఘర్మర్తౌ శీతకాలే దినాంతరే. 7

వర్షారాత్రౌ భువః శోపే సేక్తవ్యా రోపితా ద్రుమాః | ఉత్తమా వింశతిర్హస్తామధ్యమాః షోడశాంతరాః. 8

స్థానాత్థ్సానాంతరం కార్యం వృక్షాణాం ద్వాదశావరమ్‌ | విఫలాః స్యుర్ఘనా వృక్షాః శ##స్త్రేణాదౌ హిశోధనమ్‌.

విండగఘృత పంకాక్తాన్సేచయే చ్ఛీతవారిణా | ఫలనాశే కు త్థైశ్చ మాషైర్ముద్గైర్య వైస్తిలైః. 10

ఘృతశీతపయః సేకః ఫలపుష్పాయ సర్వదా | ఆవికాజశ కృచ్చూర్ణం యవ చూర్ణం తిలానిచ. 11

గోమాంస ముదకం చైవ సప్తరాత్రం నిధాపయేత్‌ | ఉత్సేకః సర్వవృక్షాణాం ఫలపుష్పాది వృద్ధిదః. 12

మత్స్యాంభసాతు సేకేన వృద్ధిర్భవతి శాఖినః | విడంగా తండులోపేతం మాత్స్యంమాం సంహిదోహదమ్‌.

సర్వేషామవి శేషేణ వృక్షాణాం రోగమర్దనమ్‌. 13

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వృక్షాయుర్వేద కథనం నామ ద్వ్యశీత్యధిక ద్విశతతమోధ్యాయః.

ధన్వంతరి పలికెను : ఇపుడు వృక్షాయుర్వేదమును చెప్పెదను. ఇంటికి ఉత్తరమున ప్లక్షము, తూర్పున వటము, దక్షిణమున ఆమ్రము, పశ్చిమమున అశ్వత్థ వృక్షము మంగళకరములు. ఇంటికి దక్షిణమున మొలచిన ముండ్ల చెట్లుకూడ మంచివి. ఇంటికి దగ్గరగ ఉద్యానవనమును నిర్మించుకొనవలెను. లేదా అన్నివైపుల అందమైన పుష్పిత తిల వృక్షములు పెంచవలెను. బ్రాహ్మణుని చంద్రుని పూజించి వృక్షములు నాటవలెను. చెట్లునాటుటకు ఉత్తరాన క్షత్రములు మూడును స్వాతిహస్త, రోహిణి, శ్రవణ, మూల ప్రశస్తనక్షత్రములు ఉద్యానములో పుష్కరిణి నిర్మించి దాని లోనికి నదీప్రవాహము వచ్చునట్లు ఏర్పరచవలెను. జలాశయారంభమునకు హస్త, మఖ అను రాధా పుష్య జ్యేష్ఠా నక్షత్రములు మూడు ఉత్తరా నక్షత్రములు మంచివి. వరుణుని, విష్ణువును, పర్జన్యుని పూజించి ఈ పని ప్రారంభించవలెను. అరిష్ట అశోక, పున్నాగ, శిరీష, ప్రియంగు, కదళీ, జంబు, వకుల, దాడిమ వృక్షములను నాటి గ్రీష్మఋతువునందు దినమునకు ఒకపర్యాయము వర్ష ఋతువు నందు రాత్రియందును భూమి ఎండి పోయినచో నీళ్లు పోయవలెను. చెట్టుకును చెట్టుకును నడుమ ఇరువది హస్తముల అంతరము ఉత్తమము. పరునారు హస్తముల అంతరము మధ్యమము. పండ్రెండు హస్తముల అంతరము అధమము. పండ్రెండు హస్తముల అంతరముగల చెట్లను తీసి వేరొకచోట పాతవలెను. దగ్గర దగ్గరగా వున్న చెట్లు ఫలముల నివ్వవు. ముందుగ వాటిని తగు విధముగా ఖండించి శోధనము చేయవలయును. విడంగ, ఘృత, పంకములు కలిపిన శీతలజలము వాటికి పోయవలెను. వృక్షముల పండ్లు నశించునపుడు కుళుత్థ, మాష, ముద్గయవ. తిలలు కలిపిన ఘృత మిశ్రమములో శీతజలమును పోసినచో అని సర్వదా ఫలపుష్పముల నిచ్చును. మేకల గొఱ్ఱల ఎరువు యవ చూర్ణము తిలలు వీటిని తడిపి ఏడుదినములు ఒకచోటవుంచి పిదప దీనిని వృక్షములకు వేసినచో ఫలపుష్ప వృద్ధి కలుగును. మత్స్యములున్న నీరుపోసినచో వృక్షములు వృద్ధిచెందును. విడంగ తండులములతో మత్స్యమాంసమును కలిపి వేసినచో అది అన్ని వృక్షములకును దోహదమగును, వాటి రోగములను తొలగించును.

అగ్ని మహాపురాణమున వృక్షాయుర్వేద కథనమను రెండువందలయెనుబదిరెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page