Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షట్సప్తత్యధిక ద్విశతతమోధ్యాయః

అథ ద్వాదశ సంగ్రామాః

అగ్నిరువాచ :

కశ్యపో వసుదేవో7భూద్దేవకీ చాదితిర్వరా | దేవక్యాం వసుదేవాత్తు కృష్ణో7భూత్తపసాన్వితః. 1

ధర్మసంరక్షణార్థాయ హ్యధర్మహరణాయచ | సురాదేః పాలనార్థంచ దైత్యాదేర్మథనాయచ.

2

రుక్మిణీసత్యభామాచ సత్యానాగ్నజితీ ప్రియా | సత్యభామా హరేః సేవ్యాగాంధారీ లక్ష్మణా తథా. 3

మిత్రవిన్దాచ కాలిన్దీదేవీ జాంబవతీ తథా | సుశీలాచ తథామాద్రీ కౌసల్యావిజయాజయా. 4

ఏవమాదీని దేవీనాం సహస్రాణితు షోడశ | ప్రద్యుమ్నాద్యాశ్చ రుక్మిణ్యాం భీమాద్యాః సత్యభామయా. 5

జాంబవత్యాంచ సాంబాద్యాః కృష్ణస్యాసం స్తథాపరే | శతంశతసహస్రాణాం పుత్రాణాం తస్యధీమతః. 6

అశీతిశ్చ సహస్రాణి యాదవాః కృష్ణరక్షితాః | ప్రద్యుమ్నస్యతు వైదర్భ్యా మనిరుద్ధోరణప్రియః. 7

అనిరుద్ధస్య వజ్రాద్యాయాదవాః సుమహాబలాః | తిస్రః కోట్యోయాదవానాం షష్టిర్లక్షాని దానవాః. 8

మనుష్యేబాధకాయేతు తన్నాశాయ బభూవసః | కర్తుంకర్మవ్యవస్థానం మనుష్యేజాయతే హరిః. 9

అగ్నిదేవుడు పలికెను : కశ్యపమహర్షి వసుదేవుడుగను స్త్రీలలో శ్రేష్ఠురాలగు అదితి, దేవకిగను అవతరించిరి వారికి శ్రీకృష్ణుడు కుమారుడుగ అవతరించెను. మహాతపశ్శాలియగు శ్రీకృష్ణుడు ధర్మమును రక్షించుటకు అధర్మమును అంతముచేయుటకు దేవతాదులను పాలించుటకు దైత్యాదులను మర్దించుటకు అవతరించెను. రుక్మిణి సత్యభామ, నాగ్నచిత్‌ కుమార్తెయగు సత్య వీరుకృష్ణునకు ప్రియమైన భార్యలు. సత్యభామ ఆయనకు ఆరాధ్యదేవి. గాంధారి - లక్ష్మణ - మిత్రవింద - కాళింది - జాంబవతి - సుశీల - మాద్రి - కౌసల్య - విజయ - జయ మొదలగు పరహారువేలమంది స్త్రీలు శ్రీకృష్ణుభార్యలు, రుక్మిణియందు ప్రద్యుమ్నుడు మొదలగు వారును, జాంబవతియందు సాంబుడు మొదలగు వారును, జన్మించిరి. మొత్తము ఆ శ్రీకృష్ణునకు ఒకకోటి ఎనభైవేల పుత్రులుండిరి. సకల యాదవులును శ్రీకృష్ణునిచే రక్షింపబడిరి. ప్రద్యుమ్నునకు విదర్భ రాజకుమారియందు యుద్ధప్రియుడగు అనిరుద్ధుడు పుట్టెను. అనిరుద్ధునకు వజ్రాదులు కుమారులుగ పుట్టిరి. యాదవులందరును మహాబలవంతులు మొత్తము వారిసంఖ్య మూడుకోట్లు. ఆసమయమున అరువది లక్షల దానవులు మనుష్యులుగా పుట్టి లోకులను హింసించుచుండిరి. వారిని నశింపచేయుటకే శ్రీ కృష్ణుడు అవతరించెను. కర్మమర్యాద రక్షకులకై కూడ అవతరించెను.

దేవాసురాణాం సంగ్రామా దాయార్థం ద్వాదశాభవన్‌ | ప్రథమోనారసింహస్తు ద్వితీయో వామనోరణః. 10

సంగ్రామస్త్వథ వారాహశ్చతుర్థో7మృతమంథనః | తారకామయ సంగ్రామః షష్ఠోహ్యాజీవకోరణః. 11

త్రైపురశ్చాంధకవధో నవమో వృతఘాతకః | జితోహాలా హలశ్చాథ ఘోరః కోలాహలో రణః. 12

హిరణ్యకశిపోశ్చోరో విదార్యచనఖైః పురా | నారసింహోదేశపాలః ప్రహ్లాదం కృతవాన్నృపమ్‌. 13

దేవాసురే వామనశ్చ చ్ఛలిత్వా బలిమూర్జితమ్‌ | మహేంద్రాయ దదౌరాజ్యం కాశ్యపో7దితిసంభవః. 14

వరాహస్తు హిరణ్యాక్షం హత్వాదేవాన పాలయత్‌ | ఉజ్జహార భువంమగ్నాం దేవదేవైరభిష్టుతః. 15

మంథానం మందరం కృత్వానేత్రం కృత్వాతువాసుకిమ్‌ | సురాసురైశ్చ మథితం దేవేభ్యశ్చామృతందదౌ. 16

తారకామయసంగ్రామే తదా దేవాశ్చపాలితాః | నివార్యేంద్రం గురూన్దేవాన్దా నవాన్సోమవంశకృత్‌. 17

విశ్వామిత్ర వసిష్ఠాత్రి కవయశ్చరణ సురాన్‌ | ఆపాలయన్తే నిర్మార్య రాగద్వేషాది దానవాన్‌. 18

పృథ్వీరథే బ్రహ్మయన్తురీశస్య శరణోహరిః | దదాహత్రిపురం దేవపాలకో దైత్యమర్దనః. 19

గౌరీం జిహీర్షుణా రుద్రమంధకే నార్దితం హరిః | అనురక్తశ్చ రేవత్యాం చక్రేచాంఢాసురార్దనమ్‌. 20

అపాంఫేన మయోభూత్వా దేవాసురరణ హరన్‌ | వృత్రం దేవహరంవిష్ణుర్దేవ ధర్మానపాలయత్‌. 21

శాల్వాదీన్దానవాఞ్జిత్వా హరిః పరశురామకః | అపాలయత్సురాదీంశ్చ దుష్టక్షత్రం నిహత్యచ. 22

హాలహలం విషందైత్యం నిరాకృత్య మహేశ్వరాత్‌ | భయంనిర్ణాశ యామాస దేవానాం మధుసూదనః. 23

దేవాసురేరణ యశ్చదైత్యః కోలాహలోజితః పాలితాశ్చసురాః సర్వేవిష్ణునా ధర్మపాలనాత్‌.

24

రాజానోరాజపుత్రాశ్చ మునయోదేవతాహరిః | యదుక్తం యశ్చనైవోక్త మవతారాహరేరిమే.

25

ఇత్యాది మహాపురాణ అగ్నేయే ద్వాదశసంగ్రామానామ షట్సప్తత్యధిక ద్విశతతమోధ్యాయః.

దేవాసురుల మధ్యదాయ భాగముకొరకై పండ్రెండు యుద్ధములు జరిగెను. నారసింహము వామనము, వారాహసంగ్రామము, అమృతమంథనము, తారకామయ సంగ్రామము, ఆజీవకము, జిత్‌హాలహలము, ఘోరకోలాహలము అను పేర్లతో ప్రసిద్ధమైనవి. పూర్వము నరసింహుడు హిరణ్యకశిపు వక్షమున చీల్చి ప్రహ్లాదుని రాజుగాచేసెను. మరల దేవాసురుల యుద్ధసమయమున వామనుడుగా అవతరించి కాశ్యప అదితి పుత్రుడై, బలిని వంచించి ఇంద్రునకు రాజ్యము ఇచ్చెను. వరాహముర్తియై హిరణ్యాక్షునిచంపి దేవతలను రక్షించి మునిగిపోయిన భూమిని ఉద్ధరించి దేవాధిదేవులచే స్తుతింపబడెను. దేవాసురులు కలసి మంథరాచలమును కవ్వముగను, వాసుకిని, త్రాడుగనుచేసి సముద్రము మథించి అమృతమును తీసిరి. అపుడు శ్రీమహావిష్ణువు అమృతమును దేవతలకు ఇచ్చివేసెను. తారకామయ సంగ్రామమునందు బ్రహ్మదేవుడు ఇంద్రబృహస్పతులు దేవతాదానవులను యుద్ధమునుండి నివారించి దేవతలను రక్షించి సోమవంశమును స్థాపించెను. ఆజీవక యుద్ధమున విశ్వామిత్ర వశిష్ఠ ఇత్యాది ఋషులు, రాగద్వేషాది దానవులను నివారించి దేవతలను పాలించిరి. శివుడు పృథ్విరథముగా రథమునకు వేదరూపములగు అశ్వములను కట్టి దానిని అధిష్ఠించెను. అపుడు శ్రీమహావిష్ణువు బ్రహ్మను సారథిగ తీసుకొనిన ఈశ్వరునకు శరణమొసగి తాను బాణమై త్రిపురదాహమును చేసెను. అంధకాసురుడు గౌరిని అపహరించుటకై రుద్రునకు కష్టమును కలిగించగ, రేవత్యనురక్తుడగు శ్రీహరి ఆ అసురుని సంహరించెను. దేవాసురయుద్ధమునందు విష్ణుపువృత్ర సంహారమునకై నీటి నురుగుగా ఏర్పడి ఇంద్రుని వజ్రమున లగ్నమయ్యెను. ఈవిధముగ ఇంద్రుని దేవధర్మమును పాలించి దేవతలను కష్టములనుండి విడిపించెను. విష్ణువు పరశురామావతారమును ధరించి శాల్వాదిదానవులను జయించి క్షత్రియులను నశింపచేసి దేవతాదులను రక్షించెను. మధూసూదనుడు హాలహల విషరూపమున ఆవిర్భవించిన దైత్యుని శంకరునిచే నశింపచేసి దేవతాభయమును శమింపచేసెను. దేవాసుర సంగ్రామమున కోలాహలుడను దైత్యుని జయించి మహావిష్ణువు ధర్మమునుపాలించి సకలదేవతలను రక్షించెను. రాజులు రాజకుమారులు మునులు దేవతలు ఎల్లరును మహావిష్ణుస్వరూపులే. నేను ఇక్కడ పేర్లు చెప్పినవారును చెప్పనివారును కూడ మహావిష్ణు అవతారములే.

అగ్ని మహాపురాణమున ద్వాదశ సంగ్రామములను రెండువందలడెబ్బదియారవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page