Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్విసప్తత్యధికద్విశతతమో7ధ్యాయః

అథ దానాదిమాహాత్మ్యమ్‌

పుష్కర ఉవాచ:

బ్రహ్మణాభిహితం పూర్వం యావన్మాత్రం మరీచయే|

లక్షార్ధార్ధంతు తద్బ్రాహ్మం లిఖిత్వాసంప్రదాపయేత్‌.

వైశాఖ్యాం పౌర్ణమాస్యాంచ స్వర్గార్థీ జలధేనుమత్‌ |

పాద్మం ద్వాదశ సాహస్రం జ్యేష్ఠే దద్యాచ్చధేనుమత్‌. 2

వరాహకల్ప వృత్తాన్త మధికృత్య పరాశరః | త్రయోవింశతి సాహస్రం వైష్ణవం ప్రాహచార్పయేత్‌. 3

జలధేను మథాషాఢ్యాం విష్ణోఃపదమవాప్నుయాత్‌ | చతుర్దశ సహస్రాణి వాయవీయం హరిప్రియమ్‌. 4

శ్వేతకల్పప్రసంగేన ధర్మాన్వాయు రిహాబ్రవీత్‌ | దద్యాల్లిఖిత్వా తద్విప్రేశ్రావణ్యాం గుఢధేనుమత్‌. 5

యత్రాధికృత్య గాయత్రీం కీర్త్యతే ధర్మవిస్తరః | వృత్తాసురవోధోపేతం తద్భాగవత ముచ్యతే. 6

సారస్వతస్య కల్పస్య ప్రోష్ఠపద్యాంతు తద్దదేత్‌ | అష్ణాదశ సహస్రాణి హేమసింహ సమన్వితమ్‌. 7

యాత్రా7హనారదో ధర్మాన్బృహత్కల్పా శ్రితానిహ | పంచవింశ సహస్రాణి నారదీయం తదుచ్యతే. 8

నధేనుం చాశ్వినే దద్యాత్సిద్ధిమాత్యన్తికీం లభేత్‌ | యత్రాధికృత్య శత్రూణాం ధర్మాధర్మవిచారణా. 9

కార్తిక్యాం సవసాహస్రం మార్కండేయ మథార్పయేత్‌ | అగ్నినాయద్వసిష్ఠాయప్రోక్తం చాగ్నేయమేవతత్‌.

లిఖిత్వాపుస్తకం దద్యాన్మార్గశీర్ష్యాం ససర్వదః | ద్వాదశైవ సహస్రాణి సర్వవిద్యావబోధనమ్‌. 11

చతుర్దశ సహస్రాణి భవిష్యం సూర్యసంభవమ్‌ | భవస్తుమనవేప్రాహ దద్యాత్పౌష్యాం గుడాదిమత్‌. 12

పుష్కరుడు పలికెను. పూర్వము మరీచికి చెప్పిన ఏబదివేల శ్లోకములుగల బ్రహ్మపురాణమును వ్రాసి, బ్రాహ్మణునకు దానము చేయవలెను. స్వర్గకాముడు వైశాఖ పూర్ణిమనాడు జలధేనువుతో కూడ బ్రహ్మపురాణ దానముచేయవలెను. పన్నెండువేల శ్లోకములుగల పద్మపురాణమును ధేనువుతో జ్యేష్ఠ మాసమున దానము చేయవలయును. పరాశరుడు, వరాహకల్పవృత్తాంతమును, ఇరువదిమూడువేల శ్లోకములుగల విష్ణుపురాణముగ రచించెను. దీనిని ఆషాఢమాసమున జలధేనువుతో దానముచేసినవాడు విష్ణుపదమునుపొందును. పదునాలుగువేల శ్లోకములుగల వాయుపురాణము హరికి ప్రియమైనది. దీనిలో వాయుదేవుడు శ్వేత కల్పప్రసంగముచే ధర్మమును చెప్పెను. ఈ పురాణమును వ్రాయించి శ్రావణమాసమున గుడధేనువుతో బ్రాహ్మణునకు దానము చేయవలయును. గాయత్రిని ఆధారము తీసుకుని విస్తృతముగా భాగవత ధర్మములు బోధించిన సారస్వత కల్ప సంబద్ధమగునదియు, వృత్రా సురవధ కలదియగు భాగవతమున పదునెనిమిదివేల శ్లోకములు వున్నవి. దీనిని బంగారు సింహాసనముతో భాద్రపద మాసమున దానము చేయవలయును. బృహత్కల్పమునకు సంబంధించిన ధర్మములను దేనియందు బోధించెనో ఇరువది ఐదువేల శ్లొకములుగల ఆపురాణము నారదపురాణము. దీనిని ధేనుసహితముగ ఆశ్వీయుజ మాసమున దానముచేసిన వాడు పరిపూర్ణసిద్ధిని పొందును, ఏపురాణమున పక్షులు ధర్మాధర్మ విచారణచేసినవో నవసహస్ర శ్లోకములుగల ఆ మార్కండేయ పురాణమును కార్తీక మాసమున దానము చేయవలయును. అగ్ని విషిష్ఠునకు చెప్పినపురాణము ఆగ్నేయము. దీనిని వ్రాసి మార్గశీర్షమున బ్రాహ్మణునకు దానము చేసినచో సర్వఫలములు లభించును. దీనిలో పన్నెండువేల శ్లోకములున్నవి. అన్నివిద్యలును బోధించును. భవిష్యపురాణము సూర్యసంభవము. పదునాలుగువేల శ్లోకములుగలది. శివుడు మనువునకు చెప్పెను. పుష్యమాసమున గుడాదులతో దీనిని దానము చేయవలయును.

సావర్ణినా నారదాయ బ్రహ్మవైవర్తమీరితమ్‌ | రథన్తరస్య వృత్తాంత మష్టాదశసహస్రకమ్‌. 13

మాఘ్యాం దద్యాద్వరాహస్య చరితం బ్రహ్మలోకభాక్‌ |

యత్రాగ్నిలింగమధ్యస్థో ధర్మాన్ప్రాహ మహేశ్వరః. 14

అగ్నేయకల్పే తల్లింగమేకాదశ సహస్రకమ్‌ | తద్దత్వాశివమాప్నోతి ఫాల్గుణ్యాం తిలధేనుమత్‌. 15

చతుర్దశ సహస్రాణి వారాహం విష్ణునేరితమ్‌ | భూమౌ పరాహచరితం మానవస్య ప్రవృత్తితః. 16

సహేమగరుడం చైత్ర్యాం పదమాప్నోతి వైష్ణవమ్‌ |

చతురశీతి సాహస్రం స్కాందం స్కందేరితం మహత్‌. 17

ఆధికృత్యసధర్మాంశ్చ కల్పేతత్పురుషే7ర్పయేత్‌ | వామనం దశసాహస్రం ధౌమకల్పే హరేఃకథామ్‌. 18

దద్యాచ్ఛరది విషువే ధర్మార్థాదినిబోధనమ్‌ | కూర్మం చాష్టసహస్రంచ కూర్మోక్తంచ రసాతలే. 19

ఇంద్రద్యుమ్నప్రసంగేన దద్యాత్తద్దేమ కూర్మవత్‌ | త్రయోదశ సహస్రాణి మాత్స్యంకల్పాదితో7బ్రవీత్‌. 20

మత్స్యోహిమనవే దద్యాద్విషువే హేమమత్స్యవత్‌ | గారుడం చాష్టసాహస్రం విష్ణూక్తం తార్ష్యకల్పకే. 21

విశ్వాండాద్గరుడోత్పత్తిం తద్దద్యాద్ధేమ హంసవత్‌ | బ్రహ్మాబ్రహ్మాండ మాహాత్మ్యమధికృత్యా బ్రవీత్తుయత్‌.

తచ్చద్వాదళ సాహస్రం బ్రహ్మాండం తద్ద్విజే7ర్పయేత్‌ |

సావర్ణి బ్రహ్మవైవర్తపురాణమును నారదునకు చెప్పెను దీనిలో రథంతర కల్ప వృత్తాంతము వున్నది. పదునెనిమిదివేల శ్లోకములుగల దీనిని మాఘమాసమున దానముచేయవలయును. వరాహచరితము చెప్పు వరాహ పురాణమును కూడి మాఘమాసమున దానముచేసినవాడు బ్రహ్మలోకము పొందును. అగ్ని మయమగు లింగము నందున్న మహేశ్వరుడు ఆగ్నేయకల్పము నందలి వృత్తాంతములతో కూడిన ధర్మమును బోధించిన పన్నెండు వేల శ్లోకములుగల లింగపురాణమును తిలధేనుసహితముగ ఫాల్గుణమాసమున దానముచేసినవాడు శివలోకమును పొందును. విష్ణువు భూదేవికి మానవ ప్రవృత్తిమొదలు వరాహచరితమును, చెప్పిన వరాహపురాణమున ఇరువది నాలుగువేల శ్లోకములు వున్నవి. చైత్రమున సువర్ణముతో గరుడపురాణమును దానముచేసినవాడు విష్ణువదమును పొందును. స్కందపురాణమున ఎనుబడి నాలుగువేల శ్లోకములున్నవి. కుమారస్వామి తత్పురుష కల్పకథను శైవమతమును ఆధారముగ గొని ఈ పురాణమును చెప్పెను. దీనిని కూడ చైత్రమున దానముచేయవలయును. పదివేల శ్లోకములున్న వామన పురాణమున ధౌమకల్పము నందలి విష్ణు చరిత్రమును బోధించబడినది. దానిని పూర్ణిమనాడు విషువసంక్రాంతి సమయమున దానము చేయవలయును, ఇది ధర్మార్థాదిబోధకము. కూర్మపురాణమున ఎనిమిదివేల శ్లోకములున్నవి. కూర్మమూర్తియగు విష్ణువు ఇంద్రద్యుమ్నకథా ప్రసంగమున దీనిని పాతాలమునందు చెప్పెను. సువర్ణఖచ్ఛముతో దీనిని దానముచేయవలెను. మత్స్యరూపియగు విష్ణువుకల్పాదియందు పదమూడువేల శ్లోకములుగల మత్స్యపురాణమును మనువుకు చెప్పెను. బంగారముతో నిర్మించిన మత్స్యముతో కలిపి దీనిని దానముచేయవలెను. శ్రీ మహావిష్ణువు తార్య కల్పమునందు ఎనిమిదివేల శ్లోకములుగల గరుడపురాణమును బోధించెను. విశ్వాండమునుండి గరుత్మంతుని పుట్టుకకు సంబంధించిన కథదీనిలో చెప్పబడినంది. దీనిని స్వర్ణహంసతో కూడ దానము చేయవలెను. బ్రహ్మదేవుడు బ్రహ్మాండ మాహాత్మ్యమును గూర్చిచెప్పిన పండ్రెండువేల శ్లోకములుగల బ్రహ్మాండ పురాణమును గూడ బ్రాహ్మణునకు దానము చేయవలయును.

భారతే పర్వసమాప్తౌ వస్త్రగంధస్రగాదిభిః. 23

వాచకం పూజయేదాదౌ భోజయేత్పాయసైర్ద్విజాన్‌ | గోభూగ్రామసువర్ణాది దద్యాత్పర్వణి పర్వణి. 24

సమాప్తే భారతే విప్రం సంహితాపుస్తకం యజేత్‌ | శుభేదేశేనివేశ్యాథ క్షౌమవస్త్రాదినావృతాన్‌. 25

నరనారాయణౌ పూజ్యౌపుస్తకం కుసుమాదిభిః | గోన్నభూహేమ దత్త్వాథ భోజయిత్వాక్షమాపయేత్‌. 26

మహాదానాని దేయాని రత్నానివివిధానిచ | మాషకౌద్వౌత్రయశ్చైవ మాసేమాసే ప్రదాపయేత్‌ 27

అయనాదౌశ్రావకస్య దానమాదౌ విధీయతే | శ్రోతృభిః సకలైః కార్యం శ్రావకే పూజనంద్విజ. 28

ఇతిహానపురాణానాం పుస్తకాని ప్రయచ్ఛతి | పూజయిత్వాయురారోగ్యం స్వర్గమోక్ష మవాప్నుయాత్‌. 29

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే దానాదిమాహాత్మ్యం నామద్విసప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

మహాభారత శ్రవణ సమయమున ప్రతి పర్వ సమాప్తి యందును వస్త్రగంధ మాల్యాదులతో ముందుగా పౌరాణి కుని పూజించవలయును. పిదప బ్రాహ్మణులకు పాయసముతో భోజనము పెట్టవలెను. ఒక్కొక్క పర్వము పూర్తియైనపుడుగో, భూమి, గ్రామ సువర్ణాదులను దానము చేయవలయును. మహాభారతము పూర్తియైన పిమ్మట బ్రాహ్మణునకును మహాభారత సంహితకును పూజచేయవలయును. గ్రంథమును పవిత్ర స్థానందుంచి దానికి పట్టు వస్త్రముచుట్టి పూజించవలెను. పిదప నరనారయణులను పుష్పాదులతో పూజించవలయును. గో, అన్న, భూమి, సువర్ణాదులు, దానముచేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి క్షమాప్రార్థన చేయవలయును. పౌరాణికులకు మహాదానములు వివిధ రత్నములు ఇవ్వవలెను ప్రతి మాసమునందును అతనికి రెండు లేక మూడు మాషముల సువర్ణమును ఇచ్చి, అయన ప్రారంభమున కూడ ముందుగా ఆతనికి సువర్ణ దానము చేయవలయును. ఓద్విజ శ్రేష్ఠా! శ్రోతలందరును కూడ పౌరాణికుని పూజించవలయును. ఇతి హాసములను పురాణములను పూజించి దానము చేయువాడు ఆయురారోగ్య స్వర్గ మోక్షములను పొందును.

అగ్నిమహాపురాణమున పురాణదానాది మాహాత్మ్య కథనమను రెండువందల డెబ్బదిరెండవ ఆధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page